ఎయిర్‌పోర్ట్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి స్వాగతం | - | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్ట్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి స్వాగతం

Published Mon, Apr 28 2025 1:05 AM | Last Updated on Mon, Apr 28 2025 1:05 AM

ఎయిర్‌పోర్ట్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి స్వాగతం

ఎయిర్‌పోర్ట్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి స్వాగతం

విమానాశ్రయం(గన్నవరం): కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఆదివారం గన్నవరం విమానాశ్రయంలో బీజేపీ నేతలు స్వాగతం పలికారు. విజయవాడలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న సదస్సులో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్‌ నుంచి ఇక్కడికి విచ్చేశారు. విమానాశ్రయంలో కిషన్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర నాయకులు పాతూరి నాగభూషణం, సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి, వల్లూరి జయప్రకాష్‌ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్లారు.

గణితంపై ఆసక్తి పెంచుకోవాలి

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): అబాకస్‌, వేద గణితం చిన్నారుల్లో గణితంపై ఆసక్తిని, విశ్లేషణాత్మకతను పెంపొందిస్తోందని ఇస్రో రీసెర్చ్‌ సైంటిస్ట్‌ ఏడుకొండలు అన్నారు. డీప్‌ లెర్నింగ్‌, మెషిన్‌ లెర్నింగ్‌, న్యూరల్‌ నెట్‌వర్క్‌ రోబోటిక్స్‌లో వేద గణితం ప్రముఖ పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాజా ఎడ్యుకేషనల్‌ అకాడమీ ఆధ్వర్యాన పొట్టిశ్రీరాములు చలువాది మల్లికార్జునరావు కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ ప్రాంగణంలో జాతీయ స్థాయి అబాకస్‌, వేద గణితం పోటీలను ఆదివారం నిర్వహించారు. 14 రాష్ట్రాలకు చెందిన 1,235 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అబాకస్‌ –16 , వేదగణితం – 4 , రూబిక్స్‌ – 2, విభాగాల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి చిట్టా అమర్‌సుధీర్‌ మాట్లాడుతూ కృత్రిమ మేధాశక్తిలో వేదగణితం ప్రాముఖ్యత ఎంతో ఉందన్నారు. ప్రిన్సిపాల్‌ శరవణ కుమార్‌, రాజా ఎడ్యుకేషనల్‌ అకాడమీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మార్టూరి పద్మలత మాట్లాడుతూ వేదగణితాన్ని మానసిక గణితం అని కూడా అంటారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement