Krishna District News
-
రసాయనాలతో మగ్గించిన పండ్లతో ముప్పు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కాల్షియం కార్బైడ్ తదితర హానికర, నిషేధిత రసాయనాలతో మగ్గబెట్టిన పండ్ల వలన ప్రజారోగ్యానికి పెనుముప్పు ఏర్పడుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. మామిడి, అరటి, బొప్పాయి వంటి తొందరగా పాడయ్యేందుకు అవకాశమున్న పండ్లను మగ్గబెట్టడానికి నిషేధిత రసాయనాలు వాడకుండా తీసుకుంటున్న చర్యలపై సమీక్షించేందుకు గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. వరిగడ్డి వంటి వాటిలో మగ్గబెట్టిన పండ్లతో ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదని, హానికర రసాయనాలు వాడితే ఆర్సినిక్, ఫాస్ఫరస్ అవశేషాలతో చర్మ రోగాలు, గొంతు సమస్యలు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. కార్బైడ్ ఉపయోగించి మగ్గబెట్టిన పండ్లపై నల్లని మచ్చలుంటాయని వివరించారు. బాగా కడిగి తినేలా అవగాహన కల్పించాలన్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు నున్న, కేదారేశ్వరపేట వంటి మార్కెట్లలో ఆహార భద్రత, మునిసిపల్, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల అధికారుల బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించాలని, శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపాలన్నారు. నిషేధిత రసాయనాలు వాడినట్లు తేలితే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా కార్బైడ్, నిషేధిత రసాయనాలు ఉపయోస్తే ఆ విషయాన్ని జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నంబరు 94403 79755కు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా ఆహార భద్రత అధికారి, కమిటీ సభ్య కన్వీనర్ ఎన్.పూర్ణచంద్రరావు, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీకుమార్, జిల్లా అగ్రీ ట్రేడ్ మార్కెటింగ్ అధికారి కె.మంగమ్మ, గజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎన్.రమేష్‌బాబు, ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నిషేధిత రసాయనాలు వాడినట్లు రుజువైతే క్రిమినల్ కేసు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
అంతర్ రాష్ట్ర బైక్ చోరీ ముఠాకు చెక్!
కంకిపాడు: బైక్‌ల చోరీలకు పాల్పడే అంతర్ రాష్ట్ర ముఠాకు చెక్ పడింది. ఇద్దరు కీలక నిందితులను కంకిపాడు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ సాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా చోరీ చేసిన 50 బైక్‌లను ఇప్పటికే పోలీసులు రికవరీ చేసి పోలీసుస్టేషన్‌కు కూడా తరలించారు. వివరాల్లోకి వెళితే... ఇటీవల ద్విచక్ర వాహనాల చోరీలు అధికమయ్యాయి. కంకిపాడు పోలీసుస్టేషన్ పరిధిలోని ఈడుపుగల్లు పరిసరాల్లో సుమారు 5 మోటరు బైక్‌లు చోరీ అయ్యాయి. దీనిపై కంకిపాడు పోలీసులు లోతైన దర్యాప్తు సాగించారు. సీసీ ఫుటేజ్‌లను సేకరించి, వారి కదలికలను, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానమైన ఇద్దరు నిందితులను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. కదిలిన డొంక... బైక్ చోరీలకు పాల్పడే ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ సాగించటంతో డొంక కదిలింది. ఈ ఇద్దరు నిందితులు ఎంతో చాకచక్యంగా బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని అనేక చోట్ల ఈ ముఠా బైక్ చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితులు ఇచ్చిన సమాచారంతో ఎక్కడెక్కడ బైక్‌లను కుదువ పెట్టింది?, విక్రయించిందీ? తెలుసుకుని వాటిని స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్‌కు తరలిస్తున్నారు. ఇప్పటికే 50 బైక్‌లను పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. నిందితులను నేడు లేదా రేపు అరెస్టు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు ఇప్పటికే 50 బైక్‌ల స్వాధీనం -
కదం తొక్కిన కలం
పత్రికా స్వేచ్ఛను పరిహాసం చేస్తూ, ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి ఇంటిపై పోలీసుల దాడిని ఖండిస్తూ ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు కదం తొక్కారు. అక్షరంపై అక్కసు ఎందుకంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుతో పత్రికా స్వేచ్ఛకు పెను ప్రమాదం ఎదురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును ముక్తకంఠంతో ఖండించారు. ‘సాక్షి’ ఎడిటర్ ఇంటిపై దాడి.. పత్రికా స్వేచ్ఛపై దాడి, ప్రజాస్వామ్యానికి సంకెళ్లు, ప్రజాస్వామ్యమా? పోలీసు రాజ్యమా?, పత్రికా స్వేచ్ఛపై దాడి సిగ్గు సిగ్గు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి.. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కోనేరుసెంటర్(మచిలీపట్నం): విజయవాడ వెట ర్నరీ కాలనీలో ఉన్న ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డి నివాసంపై గురువారం ఉదయం పోలీసులు దాడి చేశారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, కనీసం సెర్చ్ వారెంట్ లేకుండానే పోలీసులు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించారు. ధనంజయరెడ్డితో దురుసుగా ప్రవర్తించారు. ఎందుకు దాడి చేస్తున్నారని ప్రశ్నించినా సమాధానమివ్వకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. ఈ సమాచారం తెలుసుకున్న జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ఆందో ళన బాటపట్టారు. పోలీసుల తీరును మచిలీపట్నం పాత్రికేయులు తీవ్రంగా ఖండించారు. పోలీసుల అత్యుత్సాహం కూటమి ప్రభుత్వ కుట్రే తప్ప మరొకటి కాదని మండిపడ్డారు. అక్రమ కేసులు, దాడు లతో పత్రికరంగానికి సంకెళ్లు వేయలేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ‘సాక్షి’ మీడియాను లక్ష్యంగా చేస్తున్న ఈ దాడులను పాత్రికేయుల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మచిలీపట్నంలో నిరసన ప్రదర్శన విజయవాడలోని ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లోకి పోలీసులు చొరబడి అలజడి సృష్టించడం, ఇంట్లో మహిళలు, పిల్లలు భయభ్రాంతులకు గురయ్యేలా ప్రవర్తించటాన్ని తీవ్రంగా ఖండిస్తూ మచిలీపట్నంలో జర్నలిస్టులు నల్లబ్యాడ్జిలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్పీ ఆర్.గంగా ధరరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ.. పత్రికా రంగంలోనే గౌరవప్రదమైన హోదాలో ఉన్న ఆర్.ధనంజయరెడ్డిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి నిరాధార ఆరోపణలతో కేసులు పెట్టి భయపెట్టాలని చూడటం సిగ్గుచేటన్నారు. అక్రమ కేసులు, దాడులతో పత్రికా స్వేచ్ఛను హరించాలనుకోవటం పోలీసుల అవివేకమన్నారు. కేసులు పెట్టి, దాడులు చేసి జర్నలిస్టుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనుకోవటం, మీడియా స్వేచ్చను అణగదొక్కాలనుకోవటం జర గని పని అని తేల్చిచెప్పారు. గతంలో ధనంజయరెడ్డిపై పెట్టిన అక్రమ కేసు, నేడు సోదాల పేరుతో పోలీసులు చేసిన హడావిడి ముమ్మాటికి కూటమి ప్రభుత్వ కుట్రేనని మండిపడ్డారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ధనంజయరెడ్డి ఇంట్లోకి చొరబడి సోదాలు అంటూ ఆయన కుటుంబాన్ని ఇబ్బందిపెట్టిన విజయవాడ సీపీ, ఇతర పోలీసు అధికారులు, సిబ్బందిపై పోలీసు ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా స్వేచ్ఛను హరించేలా కూటమి ప్రభుత్వం పాల్పడు తున్న చర్యలకు స్వస్తి పలకాలన్నారు. లేదంటే ఉద్యమబాట పట్టక తప్పదని హెచ్చరించారు. అనంతరం ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసుల సోదాలను ఖండిస్తూ ఎస్పీ ఆర్.గంగాధరరావుకు మచిలీపట్నం పాత్రికేయుల ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, పాత్రికేయులపై అక్రమ కేసులు పెట్టటాన్ని ఖండించాలని, దాడులు అరికట్టాలని ఎస్పీని కోరారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పాత్రికే యులు పాల్గొన్నారు. విజయవాడలో జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు బందరు రోడ్డులో శాంతియుతంగా నిరసన తెలిపారు. అక్కడ నుంచి కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్‌కు చేరుకున్నారు. పోలీసుల దాడి ఘటనపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశకు వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా పలు చోట్ల జర్నలిస్టులు కదం తొక్కారు. పోలీసుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం ఆయా చోట్ల ప్రభుత్వ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిపై పోలీసుల దాడికి నిరసన పత్రికా స్వేచ్ఛపై ప్రభుత్వ తీరును ఎండగట్టిన జర్నలిస్టులు అధికారులు, ఎస్పీ గంగాధరరావుకు వినతి పత్రాలు అందజేత -
అవార్డు అందుకున్న కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నుంచి ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ గురువారం అవార్డు అందుకున్నారు. విజయవాడలోని రాజ్ భవన్ దర్బార్ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్‌కు బంగారు పతకం, సేవా పురస్కారం అందజేసి అభినందించారు. గత సంవత్సరం బుడమేరు, కృష్ణానది వరదల్లో ప్రజలకు ఎన్నో విశిష్టమైన సేవలు అందించినందుకు గుర్తింపుగా రెడ్‌క్రాస్ ఈ అవార్డు ప్రకటించింది. జిల్లాలో రెడ్‌క్రాస్ సేవలు విస్తృతంగా అందించేందుకు నిరంతరం రెడ్‌క్రాస్ జిల్లా కమిటీకి దిశానిర్దేశాలు చేస్తూ ముందుకు నడపటం వల్ల ఈ అవార్డు ఆయనకు వచ్చింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ఎం.హరిజవహర్‌లాల్, జాయింట్ సెక్రటరీ పి.ఎస్.సూర్యప్రకాష్, ఐఆర్సీఎస్ చైర్మన్ వై.డి.రామారావు, సీఈఓ ఎ.కె.ఫరీదా తదితరులు పాల్గొన్నారు. తీర గ్రామాల్లో మైరెన్ పోలీసుల పహారానాగాయలంక: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దివిసీమలోని పాలకాయతిప్ప మైరెన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కోస్టల్ సెక్యూరిటీ సిబ్బంది గురువారం సముద్ర తీరగ్రామాల్లో పహారా చేపట్టారు. సముద్ర మార్గం నుంచి ఉగ్రవా దులు జిల్లాలోకి ప్రవేశించే వీలు లేకుండా మండలంలోని ఎదురుమొండి, ఈలచెట్లదిబ్బ, నాచుగుంట గ్రామాల పరిధిలో రెండు డ్రోన్ కెమెరాల సహాయంతో మైరెన్ పోలీసులు గస్తీ నిర్వహించారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ కొత్త వ్యక్తుల సంచార సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని తీరగ్రామాల ప్రజలకు సిబ్బంది అవగాహన కలిగించారు. బీచ్ ఫెస్టివల్‌కు పకడ్బందీ ఏర్పాట్లుచిలకలపూడి(మచిలీపట్నం): త్వరలో జరిగే బీచ్ ఫెస్టివల్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయా లని సంబంధిత అధికారులకు కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. గురువారం సాయంత్రం తన చాంబర్లో ఎస్పీ ఆర్.గంగా ధరరావుతో కలిసి బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసేలా బీచ్ ఫెస్టివల్‌కు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ ఉత్సవాలకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమాలన్నీ సాయంత్రం నుంచే మొదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో బీచ్ ప్రాంతంతో పాటు రోడ్ల వెంబడి విద్యుత్ దీపాలు ఎక్కువగా ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు, పోలీస్ అవుట్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. సముద్రతీరం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, డీఆర్వో చంద్రశేఖరరావు, బందరు ఆర్డీఓ కె.స్వాతి, డీఎస్పీ సీహెచ్ రాజా, మెప్మా పీడీ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. సత్యదేవుడికి దుర్గమ్మ పట్టువస్త్రాలుఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం తరఫున గురువారం పట్టువస్త్రాలను అందజేశారు. సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా దుర్గగుడి ప్రధాన అర్చకుడు లింగంభోట్ల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు పట్టువస్త్రాలను అన్నవరం ఆలయానికి తీసుకెళ్లారు. స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించిన దుర్గగుడి అర్చక బృందానికి అన్నవరం దేవస్థాన అర్చకులు, అధికారులు ప్రసాదాలను అందజేశారు. -
తమ్ముళ్లకే సబ్సిడీల్
పెడన: ఆధునిక వ్యవసాయంలో యంత్ర పరికరాల వినియోగం అనివార్యమైంది. కౌలు రైతులు, పేద, మధ్యతరగతి రైతులకు యంత్ర పరికరాలను సమకూర్చుకునే ఆర్థిక స్తోమతు ఉండదు. ఈ నేపథ్యంలో పొలాలను దుక్కి దున్నడం నుంచి పంట నూర్పిడి వరకు అవసరమైన యంత్ర పరికరాలను గతం నుంచి ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తూ ఆదుకుంటోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హత ఆధారంగా సబ్సిడీ యంత్రపరికరాలు అందడంలేదు. 40 నుంచి 50 శాతం రాయితీతో గ్రామ సచివాలయాల ద్వారా మంజూరు చేసే యంత్రపరికరాలను తమకు అనుకూలమైన రైతులకు మాత్రమే ఇవ్వాలని టీడీపీ నాయకులు ఆదేశాలు జారీ చేశారు. తమ ఆదేశాల మేరకు తెలుగు తమ్ముళ్లకే యంత్రపరికరాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. అదేమని ప్రశ్నిస్తే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించిన అనంతరమే యంత్రపరికరాలను మంజూరు చేస్తున్నామని అధికారులు చెప్పుకొస్తున్నారు. అర్హత ఉన్నా యంత్రపరికరాలు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యంత్రపరికరాలు అనివార్యం గతంలో కూలీలు, పశువుల సహకారంతో రైతులు వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు కూలీల సంఖ్య తగ్గిపోవడం, కూలి ధరలు అధికం కావడంతో దూర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొచ్చి పనులు చేయించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటిని అధిగమించడానికి అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకుంటు వ్యయభారాలను తగ్గించుకుంటున్నారు. ఈ క్రమంలో కూడా ఆయా ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాలను అందజేస్తూ వస్తున్నాయి. పరికరం సామర్థ్యాన్ని బట్టి 40 నుంచి 50 శాతం వరకు రాయితీపై అందిస్తారు. ట్రాక్టరు అనుబంధ పరికరాలను ట్రాక్టరున్న రైతులకు మాత్రమే అందించేలా చర్యలు చేపట్టారు. ఆయిల్ ఇంజిన్లు, కల్టివేటర్లు, పవర్ స్ప్రేయర్లు వంటి యంత్రాలు అందరికీ అవసరమే. వీటిని అర్హత మేరకు రైతులకు మంజూరు చేయాలి. కూటమి అధికారంలో వచ్చిన పిమ్మట కేవలం తమ పార్టీకి అనుకూలమైన వారికే మాత్రమే సబ్సిడీపై యంత్రపరికరాలను మంజూరు చేసేలా కూటమి నాయకులు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు అందించే యంత్రపరికరాలు ఇవీ.. రైతులకు సబ్సిడీపై అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మండల వ్యవసాయశాఖకు పలు యంత్రపరికరాలు చేరాయి. బ్యాటరీ, పవర్ స్ప్రేయర్లు, దుక్కు పరికరాలు, రోటావీటర్లు, పవర్ వీడర్లు, పవర్ టిల్లర్లు వంటి యంత్రపరికరాలు వచ్చాయి. మరి కొన్ని యంత్ర పరికరాలు రావాల్సి ఉంది. వచ్చిన వాటిని వచ్చినట్లుగా కూటమి నాయకులు చెప్పిన రైతులకు అధికారులు అందజేస్తున్నారు. తెలుగు తమ్ముళ్లకే సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు తాము సూచించిన వారికే ఇవ్వాలని కూటమి నాయకుల హుకుం యంత్రపరికరాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసినవారికే పంపిణీ చేశామంటున్న అధికారులు ఆన్లైన్ దరఖాస్తుల ప్రకారమే.. రైతులకు అనేక రకాల యంత్ర పరికరాలను ప్రభుత్వం రాయితీపై ఇస్తోంది. దీన్ని అందరూ వినియోగించుకోవాలి. ఎక్కువ మంది ఆయిల్ ఇంజిన్లు కావాలంటున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న రైతులకు మాత్రమే యంత్రపరికరాలను అందజేశాం. ఇంకా కొన్ని రావాల్సి ఉంది. వాటిని కూడా రాగానే దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే అందజేస్తాం. ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకావశం లేదు. ప్రభుత్వం సూచించిన సమయంలోనే అర్హులైన రైతులు తమకు కావల్సిన యంత్రపరికరాల కోసం దరఖాస్తు చేసుకోవాలి. అలా దరఖాస్తు చేసుకున్న వారికే సబ్సిడీపై యంత్రాలను అందజేస్తాం. – నూరున్నీసా, ఇన్చార్జి ఏఓ, పెడన మండలం -
అనుమానాస్పద రీతిలో వివాహిత మృతి
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఘటనపై మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహంతిపురం జాడ పాపయ్య వీధిలో కట్టా హేమంత్‌కుమార్, స్రవంతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిది ప్రేమ వివాహం కాగా ఒక బాబు సంతానం. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో అదే వీధిలో ఉండే స్రవంతి తండ్రి పోతురాజు సర్ది చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 7వ తేదీన భార్యభర్తలిద్దరికీ గొడవ జరగ్గా పోతురాజు కుమార్తె ఇంటికి వెళ్లి సర్ది చెప్పి తిరిగి తన ఇంటికి వచ్చేశాడు. గురువారం తెల్లవారుజామున స్రవంతి నాలుగేళ్ల కుమారుడు తాతయ్య వద్దకు వచ్చి అమ్మ కదలడం లేదని చెప్పాడు. దీంతో పరుగు పరుగున కుమార్తె ఇంటికి వెళ్లే సరికి లోపల ఫ్యాన్ హుక్కు చున్నీతో ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు మృతురాలి ఇంటికి చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. తండ్రి పోతురాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
జిల్లాలో వేగంగా జల్‌జీవన్ మిషన్ పనులు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో జలజీవన్ మిషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ కేంద్ర అధికారులకు వివరించారు. జలజీవన్ మిషన్ పథకం అమలు ప్రక్రియ, పథకం అమల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై గురువారం న్యూఢిల్లీ నుంచి ప్రాజెక్టు అమలు జరుగుతున్న రాష్ట్రాలలోని జిల్లాల కలెక్టర్లతో కేంద్ర జల జీవన్ మిషన్ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌కు నగరంలోని కలెక్టరేట్ నుంచి హాజరైన కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించే జలజీవన్ మిషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. రూ.6,100 కోట్ల నిధులతో జిల్లాలోని 16 మండలాలు, కృష్ణాజిల్లాలోని 24 మండలాలు, ఏలూరు జిల్లాలోని పది మండలాలు మొత్తం 50 మండలాలను కలిపి వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి తాగునీరు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో రూ.2వేల కోట్ల నిధులతో 337 పనులు జరుగుతున్నాయని, ఇవి వచ్చే ఆగస్టు నాటికి పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పులిచింతల నుంచి నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని గ్రామాలకు, ఇబ్రహీంపట్నం వద్ద వీటీపీఎస్ కూలింగ్ కెనాల్ నుంచి మైలవరం, జి.కొండూరు, తిరువూరు, ఎ.కొండూరు మండలాలలోని వివిధ గ్రామాలలకు, గొల్లపూడి వద్ద నుంచి ఏలూరు జిల్లాలోని 10 మండలాలు, కృష్ణాజిల్లాలోని 24 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు, విస్సన్నపేట, జి.కొండూరు మండలాల్లోని వివిధ గ్రామాలకు జలజీవన్ మిషన్ ద్వారా తాగునీరు అందించే కార్య క్రమానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా ఎస్ఈ ఎస్.విద్యాసాగర్ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర మున్సిపల్ విభాగ కమిటీల నియామకం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కృష్ణాజిల్లాకు చెందిన పలువురిని పార్టీ రాష్ట్ర మున్సిపల్ విభాగ కమిటీలలో నియమించారు. వైఎస్సార్సీపీ మున్సిపల్ విభాగ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా కాగిత జవహర్లాల్ నెహ్రూ(మచిలీపట్నం), జాయింట్ సెక్రటరీలుగా జంపాన కొండలరావు(పెనమలూరు), అత్తలూరి రెహమాన్( పెడన)లను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. -
డీఎస్సీ అభ్యర్థులెవరూ సంతృప్తిగా లేరు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డీఎస్సీ అభ్యర్థులు ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరని, మానసిక అశాంతితో ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు అన్నారు. విజయవాడ ధర్నా చౌక్‌లో డీఎస్సీ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాని కోరుతూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం ధర్నా జరిగింది. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పి.కృష్ణ అధ్యక్షతన జరిగిన ధర్నాలో లక్ష్మణరావు మాట్లాడుతూ.. పరీక్షకు సన్నద్ధమవడా నికి 45 రోజులు సమయం చాలదని, 90 రోజులు ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ తరహాలో జిల్లాకో పేపర్ విధానం అమలు చేయాలని కోరారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు జి. రామన్న మాట్లాడుతూ.. డీఎస్సీ నోటిఫికేషన్లో ఉన్న సమస్యలను పరిష్కరించి అభ్యర్థులందరికి న్యాయం చేయని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆన్లైన్ పరీక్షను రద్దుచేసి ఆఫ్‌లైన్‌లో పెట్టాలని, పీఈటీ పోస్టులు సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు -
ఒంటరి మహిళపై దౌర్జన్యం
టీడీపీ నాయకుల ఒత్తిడితో కేసు నమోదు చేయని పోలీసులు రామవరప్పాడు: ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటున్న ఒంటరి మహిళపై ఓ వ్యక్తి మద్యం మత్తులో దౌర్జన్యానికి పాల్పడిన ఘటన గురువారం ప్రసాదంపాడులో చోటు చేసుకుంది. ‘‘ నీ అంతు తేలుస్తా, నాపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా, నాకు టీడీపీ నాయకుల అండ ఉంది నిన్ను చంపితే దిక్కెవరు’’ అంటూ ఆ వ్యక్తి రెచ్చిపోయాడు. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు టయోటా షోరూమ్ పక్క వీధిలో కాల్వగట్టు ప్రాంతంలో బి.జయశ్రీ తన ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటుంది. ఓ ఫొటో స్టూడియోలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన కుమారులను చదివిస్తోంది. ఇదే ప్రాంతంలో రోషిబాబు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. జయశ్రీ ఒంటరి మహిళ కావడంతో తరుచూ అసభ్య ప్రవర్తనతో వేధిస్తున్నాడు. నిత్యం మద్యం తాగి వచ్చి రాత్రుళ్లు బూతులు తిడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఫూటుగా మద్యం తాగి జయశ్రీ ఇంటిపైకి వచ్చి దుర్భాషలాడుతూ గొడవకు దిగాడు. అతనితో పాటు రోషిబాబు కుటుంబ సభ్యులు కూడా గొడవకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కేసు నమోదు చేయడం లేదు రోషిబాబు గత కొన్ని నెలలుగా నిత్యం మద్యం తాగి తన ఇంట్లోకి చొరబడి గొడవ పడుతూ చంపుతానని బెదిరిస్తున్నాడంటూ పటమట సీఐ, ఎస్ఐలను కలిసి పలుమార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకూ కేసు నమోదు చేయలేదని జయశ్రీ వాపోయింది. గతంలో కులం పేరుతో దూషిస్తూ బాణసంచా కాల్చి ఇంట్లో పడేసి బీభత్సం సృష్టించాడని తెలిపింది. స్థానిక టీడీపీ నాయకుల ఒత్తిడితో పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆరోపించింది. రోషిబాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని, తనకు న్యాయం జరగకపోతే పోలీసు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తానని తెలిపింది. -
ప్రభుత్వానికి వ్యవసాయ భూములు ఇవ్వలేం
ఇబ్రహీంపట్నం: ఏడాదికి మూడు పంటలు పండే వ్యవసాయ భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రభుత్వానికి ఇవ్వబోమని రైతులు స్పష్టంచేశారు. రాజధాని అమరావతి అభివృద్ధి పేరుతో మూలపాడు, త్రిలోచనాపురం, జమీమాచవరంలో భూసేకరణపై గురువారం గ్రామ సభలు నిర్వహించారు. రాజధానిలో ల్యాండ్ పూలింగ్‌లో తీసుకున్న భూముల రైతులకు ఇప్పటికీ ప్లాట్లు కేటాయించలేదని తహసీల్దార్ వెంకటేశ్వర్లు దృష్టికి రైతులు తీసుకొచ్చారు. కొంతమందికి ప్లాటు ఇచ్చినా అభివృద్ధికి నోచుకోలేద న్నారు. ఇప్పటికే రెండు వేల ఎకరాలు లంక భూ ములు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండగా, పర్యాటక అభివృద్ధి, స్పోర్ట్స్ క్లబ్ పేరుతో మరో రెండు వేల ఎకరాలు తీసుకుంటే వ్యవసాయానికి భూమి మిగలదని రైతులు వాపోయారు. రాజధానిలో వేల ఎకరాల భూమి ఇప్పటికీ ఖాళీగా ఉందన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మరో మూడు నాలుగేళ్లు పడుతుందని, ఈ లోపు ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అమరావతి రాజ ధాని ఇప్పటికీ అభివృద్ధి కాలేదని, ఈ ప్రాంతం ఎప్పుడు అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి తాము తెచ్చుకోబోమని స్పష్టం చేశారు. ల్యాండ్ పూలింగ్‌లో ఏమి ఇస్తారో ముందు ప్రకటించాలని పట్టుబట్టారు. భూమి ఉంటే జీవనోపాధి కలుగుతుందని, ప్లాటు ఉంటే కుటుంబం గడవదని పేర్కొన్నారు. రైతుల వాదనలతో సభ రసాభాసగా మారింది. పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చారు. కొటికలపూడిలో గ్రామసభలో ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇవ్వబోమని జమీమాచవరం రైతులు చెప్పారు. మూలపాడులో 313 ఎకరాలు, త్రిలోచనాపురంలో 1,390 ఎకరాలు, జమీమాచవరంలో 301 ఎకరాలు ల్యాండ్ పూలింగ్‌లో తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తహసీల్దార్ ప్రకటించారు. రైతుల అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. జెడ్పీ వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి, వైస్ ఎంపీపీ బండి నాగమణి, సర్పంచులు రెంటపల్లి నాగరాజు, చింతల భూలక్ష్మి, పలువురు రైతులు పాల్గొన్నారు. మూలపాడులో తెగేసి చెప్పిన రైతులు -
దుస్తులు ఆరేస్తుండగా విద్యుత్ తీగె తగిలి మృతి
కంచికచర్ల: ఇంటి ముందు ఉన్న తీగైపె ఉతికిన దుస్తులు ఆరేసే క్రమంలో విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందిన ఘటన కంచికచర్లలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ బి.రాజు కథనం మేరకు కంచికచర్ల ప్రణీత కాలనీకి చెందిన చమ్మేటి నందిని(24) ఇంటి ముందు దుస్తులు ఆరేసే తీగైపె బుధవారం రాత్రి ఈదురుగాలులకు విద్యుత్ తీగె తెగి పడింది. ఇది గమనించని నందిని యథావిధిగా రోజూలాగానే ఉతికిన దుస్తులను తీగైపె ఆరేస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో ఒక్కసారిగా కింద పడిపోయింది. గమనించిన స్థానికులు ఆమెను వైద్య చికిత్స కోసం స్థానిక ప్రయివేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలికి భర్త, కుమారుడు ఉన్నారు. నందిని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
శుభకార్యానికి వెళుతూ...
గుడ్లవల్లేరు: వారంతా శుభకార్యానికి హాజరయ్యేందుకు ఎంతో హుషారుగా ట్రాక్టర్లో బయలుదేరారు. అయితే వారి ఆనందం క్షణాల్లోనే ఆవిరై పోయింది. ట్రాక్టరు బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే ఘోరం జరిగిపోయింది. ట్రాక్టర్‌ను స్టార్ట్ చేసి అక్కడే రివర్స్ చేస్తుండగా అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ఉన్న ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరో ఐదుగురు స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నందివాడ మండలం రుద్రపాక వద్ద ఉన్న గాజులపాలెంలో జరిగే వివాహానికి హాజరయ్యేందుకు గురువారం గుడ్లవల్లేరు మండలం విన్నకోటకు చెందిన బంధువుల బృందం ట్రాక్టర్లో బయలుదేరింది. ఊరు దాటకముందే ఊళ్లోనే ట్రాక్టర్ రివర్స్ చేసే క్రమంలో అదుపు తప్పి తిరగబడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముత్యాల అరుణ్(16), కూరెళ్ల అభిషేక్(15) చికిత్స పొందుతూ మృతి చెందారు. కె.జయరాజు అనే వ్యక్తికి పొట్ట చీల్చుకుని పేగులు బయటపడటంతో గుడివాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జయరాజుకు ఆపరేషన్ చేశాక గానీ ఏ విషయం చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఐదుగురు కూడా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులిద్దరి భౌతిక కాయాలకు గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి ఆయా కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఏఎస్ఐ వి.బాల వెంకటేశ్వరరావు తెలిపారు. ట్రాక్టర్ తిరగబడటంతో ఇద్దరు యువకుల దుర్మరణం మరొక వ్యక్తి పరిస్థితి విషమం చికిత్స పొందుతున్న మరో ఐదుగురు వ్యక్తులు -
ఇంగ్లిష్‌లో ‘పవర్’ చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
అది ఓ మారుమూల గ్రామం.. అందులో ఓ ప్రాథమిక పాఠశాల.. పరిమిత సంఖ్యలో ఉండే విద్యార్థులు.. వారికి వాడుక భాష తప్ప.. తెలుగు కూడా సరిగ్గా రాని పరిస్థితి. అలాంటి వారు జాతీయ స్థాయి వేదికపై ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడటం, రాయడం అంటే ఆషామాషీ కాదు. కానీ దానిని సుసాధ్యం చేసి చూపించారు ఈ బుడతలు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పుణ్యమాని ఇంగ్లిష్ మీడియంలో చదువుతూ.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా 30లక్షల మంది విద్యార్థులతో పోటీ పడి తమ పాఠశాల, గ్రామం, జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని చాంపియన్‌గా నిలిపి వారెవ్వా వండర్ కిడ్స్ అనిపించుకున్నారు. జి.కొండూరు: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య అనేది చారిత్రక తప్పిదంలా నానా యాగీ చేసిన నేటి పాలకులకు, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు సాధిస్తున్న అద్భుత ఫలితాలు చెంపపెట్టులా మారాయి. దీనికి ప్రత్యక్ష సాక్ష్యమే ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండల పరిధి కనిమెర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. మారుమూల పల్లెటూరులో ఉన్న ఈ పాఠశాల ఇప్పుడు దేశంలోనే హాట్ టాఫిక్‌గా మారింది. జాతీయ స్థాయి ఇంగ్లిష్ వర్డ్ పవర్ చాంపియన్ షిప్ పోటీలలో మొదటి రెండు స్థానాలను కై వసం చేసుకొని, రాష్ట్రానికి ఓవరాల్ చాంపియన్ ట్రోఫీని సాధించి.. కార్పొరేట్ పాఠశాలలకు తామేమీ తక్కువ కాదని నిరూపించారు ఇక్కడి విద్యార్థులు. పట్టు సాధించే విధంగా.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం విద్యను అమలు చేసిన నాటి నుంచి కనిమెర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లిష్ విద్యా బోధన జరుగుతోంది. ఈ పాఠశాలకు మండవ విజయలక్ష్మి ఒక్కరే ఉపాధ్యాయురాలుగా, హెచ్ఎంగా పని చేస్తున్నారు. విద్యార్థులకు ఇంగ్లిష్‌పై పట్టు సాధించే విధంగా విజయలక్ష్మి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం అందించిన పుస్తకాలను విద్యార్థులకు అర్థమయ్యేలా వినూత్న పద్ధతుల్లో అదనంగా ప్రతి రోజూ ముప్పై నిముషాలు ప్రత్యేక తరగతి నిర్వహించి బోధన చేశారు. పేద కుటుంబ నేపథ్యం.. కనిమెర్ల గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన అన్నా చెల్లెళ్లు బి.రేవంత్‌కుమార్, బి. సింధు ప్రియ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి రాష్ట్రానికి పేరు తెచ్చారు. ఈ చిన్నారుల తండ్రి భూపతి ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తుండగా, తల్లి దయామణి వ్యవసాయ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నివసించడానికి పక్కా ఇల్లు కూడా లేని ఈ కుటుంబం నుంచి ఇద్దరు చిన్నారులు జాతీయస్థాయిలో ప్రతిభచాటి రాష్ట్రానికి, జిల్లాకి, కనిమెర్ల గ్రామానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టారు. వీరిద్దరికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ సైతం వీరిద్దరితో పాటు హెచ్ఎం విజయలక్ష్మిని సన్మానించి ప్రత్యేకంగా అభినందించారు. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇంగ్లిష్ మీడియం విద్యతో సత్ఫలితాలు ‘నాడు–నేడు’తో ప్రభుత్వ పాఠశాలలో చదువుతూనే అద్భుతాలు జాతీయ ఇంగ్లిష్ వర్డ్ పవర్ చాంపియన్ షిప్ పోటీల్లో సత్తా మొదటి రెండు స్థానాలు కై వసం చేసుకున్న అన్నా చెల్లెళ్లు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ విద్యను ప్రవేశపెట్టడంతో పాటు పాఠశాలలకు మెరుగైన వసతులను అందించడమే లక్ష్యంగా గత ప్రభుత్వం చేపట్టిన ‘నాడు–నేడు’ కార్యక్రమం కింద కనిమెర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఆధునికీకరణ కోసం రూ.12లక్షల వరకు ఖర్చు పెట్టారు. ఈ నిధులతో భవనం మరమ్మతులు, ప్రహరీ నిర్మాణం, టాయిలెట్ల రిపేర్లు, అత్యాధునిక సామగ్రి, విద్యోపకరణాలు అందించడం వంటి పనులను చేశారు. -
సీహెచ్ఓలకు ఉద్యోగ భద్రత కల్పించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల (సీహెచ్ఓ)కు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.సందీప్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్‌లో హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీహెచ్‌ఓలు బుధ వారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సందీప్ కుమార్ మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం ఆరేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న సీహెచ్‌ఓలను పర్మినెంట్ చేయాలన్నారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ జరగాలని, పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, రద్దు చేసిన ఈఎఫ్పీఓను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని, నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ప్రకటించాలని ఈ సందర్భంగా కోరారు. ఎఫ్ఆర్ఎస్ నుంచి సీహెచ్‌ఓలను మినహాయించాలని, హెచ్ఆర్ పాలసీతోపాటు ట్రాన్స్ఫర్, ఇంక్రిమెంట్, ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, సీహెచ్ఓలకు కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో అసోసియేషన్ ప్రతినిధులు, సీహెచ్‌ఓలు పాల్గొన్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ -
భూగర్భ జలవిలాపం
కూటమి అధికారంలోకి వచ్చాక యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాక్షి ప్రతినిధి, విజయవాడ: వీరులపాడు మండలంలో కట్టలేరు ఒడ్డునే ఉన్న దొడ్డదేవరపాడు గ్రామానికి తాగునీటి కష్టాలు తప్పడం లేదు. గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వి.అన్నవరం వద్ద వైరా నదిలో బోరు వేసి, అక్కడి నుంచి పైపులైన్ ద్వారా దొడ్డదేవరపాడు గ్రామంలోని ట్యాంక్‌ను నీటితో నింపుతున్నారు. ఆ నీటిని గ్రామంలోని దళిత కాలనీ, బీసీ కాలనీకి వంతుల వారీగా మూడు రోజులకోసారి సరఫరా చేస్తున్నారు. అది కూడా అరకొరగానే. తరచూ పైపులైన్లు లీకవడం, విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల ఇబ్బందులు తప్పడంలేదు. తీగునీరు అందని దళితవాడ వాసులు కట్టలేరులో చలమల నీటితోనే దాహార్తి తీర్చుకుంటున్నారు. యువకులు సైకిళ్లకు ప్లాస్టిక్ క్యాన్లు కట్టుకుని, మహిళలు బిందెలతో చెలమల వద్దకు వచ్చి తాగునీటిని తీసుకెళ్లడం ఇక్కడ నిత్య కృత్యం. తాగునీటి కష్టాలు ఒక్క దొడ్డదేవరపాడు గ్రామానికే పరిమితం కాలేదు. ఏటిపట్టు గ్రామాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. నీరు అందక రక్షిత మంచినీటి పథకం మోటార్లు పాడైపోతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాకు ఓ వైపు కృష్ణానది మూడు వైపులా మున్నేరు, వైరా, కట్టలేరు ఉపనదులు ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాల మోటార్లను కృష్ణా, ఉపనదుల ఒడ్డునే ఏర్పాటు చేశారు. కూటమి అధికారం చేపట్టిన తర్వాత వాగులు, వంకలు, ఏర్లు అన్న తేడా లేకుండా విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతు న్నాయి. కృష్ణా నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపట్టడంతో పరివాహక ప్రాంతంలోని రక్షిత మంచినీటి పథకాలకు నీరు అందడం లేదు. నదికి నీటి ప్రవాహ పాయలు కుడివైపుగా ఉండడం, ఎడమవైపు పొక్లెయిన్లతో ఇసుక తవ్వడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. కంచికచర్ల మండలంలోని పరిటాల గ్రామంలో గత ఏడాది మార్చిలో 7.34 మీటర్లలో లోతున భూగర్భలాలు నమోద య్యాయి. ఈ ఏడాది మార్చి నాటికి 8.63 మీటర్లకు పడిపోయాయి. పెండ్యాలలో 3.99 మీటర్ల నుంచి 4.5 మీటర్లకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఎక్కడ చూసినా ఇసుక తవ్వకాల జాడలే.. కంచికచర్ల మండలంలో దాదాపు అన్ని గ్రామాలకు కృష్ణానది నుంచి, నాలుగైదు గ్రామాలకు మున్నేటి నుంచి తాగునీటి సరఫరా జరుగుతోంది. ప్రస్తుతం కృష్ణానదిలో ఎక్కడ చూసినా ఇసుక తవ్విన జాడలే కనిపిస్తున్నాయి. నదిలో నీరు లేకపోవడంతో మండల ప్రజలు తాగునీరు, వాడుక నీటి అవసరాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చందర్లపాడు మండలం కాసరబాద నది ఒడ్డునే ఉన్నప్పటికీ నీటి కష్టాలు తప్పడం లేదు. ఇక్కడ ఇసుక తవ్వకాలు అడ్డగోలుగా సాగుతున్నాయి. పొక్కునూరు గ్రామంలోనూ నీటి ఎద్దడితో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. వత్సవాయి మండ లంలో మున్నేరు పరివాహక గ్రామాల్లో సైతం భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి అవస్థలు తప్పడం లేదు. డ్యామ్ ఉన్న పోలంపల్లిలోనే భూగర్భ జలమట్టం తగ్గిపోయింది. ఎ.కొండూరు మండలంలో స్థానికంగా లభించే నీటిని తాగునీటికి వినియోగించే పరిస్థితి లేదు. ఎటు చూసినా ఇసుకే.. విచ్చలవిడి ఇసుక తవ్వకాలతో అడుగంటిన భూగర్భ జలాలు నదీ పరివాహక ప్రాంతాల్లో ఎండిపోయిన రక్షిత నీటి పథకాలు పల్లెలు, పట్టణాల్లో తాగునీరు అదంక ప్రజలకు తప్పని ఇబ్బందులు నందిగామ పట్టణంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. పట్టణానికి తాగునీరు సరఫరాచేసేందుకు మునేరులో ఆరు బోర్లు వేశారు. నాలుగు బోర్లలో నీరు పూర్తిగా అడుగంటింది. రెండు బోర్ల ద్వారా అరకొర నీరు సరఫరా అవుతోంది. దీంతో మునిసిపాలిటీలో నాలుగైదు రోజులకు ఓ సారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఉచిత ఇసుక పథకం పేరుతో కూటమి నేతలు జేసీబీలతో విచ్చలవిడిగా ఇసుకను తోడేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. చందర్లపాడు మండలం కాసరబాద కృష్ణానదిలో ఇసుక రీచ్ పేరుతో ఇరవై అడుగుల లోతు పెట్టి పెద్ద పొక్లెయిన్లతో ఇసుకను తవ్వటంతో నదిలో ఇసుక తప్ప చుక్కనీరు కనిపించటంలేదు. కంచికచర్ల మండలం కీసర, వేములపల్లి, పెండ్యాల, రీచ్‌లలో ఇసుకను అక్రమంగా తవ్వకాలు జరపటంతో మున్నేరులో కనీసం పశువులు తాగేందుకు చుక్కనీరు కరువైంది. నీరు అందక విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయి. ఇటీవల గండేపల్లి, కంచికచర్ల గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే విద్యుత్ మోటార్లు పూర్తిగా కాలిపోయాయి. -
రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విప్లవం
– మంత్రి కొల్లు రవీంద్ర ఐనంపూడి(పామర్రు): రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విప్లవం మొదలైందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఐనంపూడి గ్రామంలో రూ.11.26 కోట్లతో ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణానికి కృష్ణా జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పురోభి వృద్ధికి అడుగులు పడ్డాయన్నారు. వచ్చే ఆరు నెలల్లో ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణ పను లను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ ఉపాధ్యక్షుడు వల్లూరిపల్లి గణేష్, కెదరవల్లి ప్రవీణ్‌చంద్ర, మాజీ సర్పంచ్ బొప్పన భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో కొత్త రేషన్‌కార్డులు జారీ కోసం అర్హులు తమ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ బుధవారం సూచించారు. కొత్త బియ్యం కార్డుల జారీతో పాటు కార్డులో సభ్యుల చేర్పులు, కార్డుల విభజన, సభ్యుల తొలగింపు, కార్డు సరెండర్, చిరునామా మార్పు, ఆధార్ సీడింగ్ సర్దుబాటు సేవలు పొందొచ్చని పేర్కొన్నారు. సమీపంలోని సచివాలయాల ద్వారా అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అందించి వారికి కావాల్సిన సేవలు పొందాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. -
కోటిరెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటాం
వైఎస్సార్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పామర్రు: ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఏరువ కోటిరెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వైఎస్సార్ సీపీ ఉమ్మడి కృష్ణా జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కోటిరెడ్డి లేని లోటు తీరనిదన్నారు. ఏరువ కోటిరెడ్డి ఇటీవల మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌తో కలిసి సుబ్బారెడ్డి బుధవారం పరామర్శించారు. వైఎస్సార్ సీపీ ప్రారంభం నుంచి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి కోటిరెడ్డి అని సుబ్బారెడ్డ కొనియాడారు. అనంతరం కోటిరెడ్డి భార్య విజయలక్ష్మి, కుమా రుడు అజయ్‌కుమార్‌రెడ్డి, కుమార్తె ఫణిప్రియను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతిభకే పట్టం సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి లక్ష్మణరావు పెనమలూరు: సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డీమ్డ్ టూ బీ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకే సీట్లు కేటాయిస్తామని సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు అన్నారు. కానూరులో సిద్ధార్థ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష(ఎస్ఈఈఈ) 2025 ఫలితాలను ఆయన బుధవారం ప్రకటించారు. ఉత్తమ మార్కులు సాధించిన ఐదుగురు విద్యార్థులకు పూర్తి ఫీజు రాయితీ ఇచ్చామని, 470 మంది విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా రూ.3 కోట్ల స్కాలర్షిప్లిస్తామని తెలిపారు. అకాడమీ అధ్యక్షుడు ఎం.రాజయ్య మాట్లాడుతూ.. అకాడమీ పరిధిలోని విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యా బోధన చేస్తున్నా మని తెలిపారు. వైస్ చాన్స్‌లర్ పి.వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. ఎస్ఈఈఈ ప్రవేశ పరీక్షలో ఎం.రేష్మశ్రీ, అబ్దుల్ కౌసర్, మల్లినేని మణి తేజ ర్యాంకులు సాధించగా వీరితో పాటు జేఈఈలో ప్రతిభ చాటిన బొప్పన హర్షిత, ఎం. జె.సుమతో కలిపి ఐదుగురి పూర్తి ట్యూషన్ ఫీజు రాయితీ ఇచ్చామని పేర్కొన్నారు. ఈ నెల 12 నుంచి 17 వరకు 900 ర్యాంకుల వరకు మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఎ.వి.రత్నప్రసాద్, డైరెక్టర్ బావినేని పాండురంగారావు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.రవి చంద్ర, డీన్లు జి.ఎన్.స్వామి, డి.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
రైతన్నకు కంటి మీద కునుకు కరువు
భయం.. భయం.. కంకిపాడు: ధాన్యం లోడులు కదలటం లేదు. నిన్నటి వరకూ గోనె సంచుల కొరతతో ఇబ్బందులు పడ్డ రైతులు.. ప్రస్తుతం రవాణా వాహనాల సమస్యతో అష్టకష్టాలు పడుతున్నారు. ఫలితంగా ధాన్యం రోడ్ల పక్కనే నిల్వ చేసుకోవాల్సి వస్తోంది. మారుతున్న వాతావరణ పరిస్థితులతో పంట ఏమవుతుందో అన్న ఆందోళన రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు విన్నవిస్తున్నారు. మెండుగా దిగుబడులు.. ఈ ఏడాది రబీ సీజన్లో కృష్ణా జిల్లా వ్యాప్తంగా 12,285 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. వాతావరణం అనుకూలించటం దిగుబడులు గణనీయంగా వచ్చాయి. ఎకరాకు 45–50 బస్తాల వరకూ దిగుబడులు చేతికొచ్చాయి. 43 వేల టన్నులు ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనాలు చెబుతున్నాయి. గత ఖరీఫ్ సీజన్లో మిగులు ధాన్యంతో కలిపి ఈ దఫా 75వేల టన్నులు ధాన్యం సేకరించాల్సి ఉంది. ఇప్పటికే 50వేల టన్నులకు పైగా ధాన్యాన్ని సివిల్ సప్లయీస్ అధికారులు సేకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటుగా, పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతా ల్లో మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ధాన్యం బస్తాలు రోడ్డు మార్జిన్లలో నిల్వ చేసి ఉంచారు. రవాణా వాహనాలు ఏవీ? జిల్లా వ్యాప్తంగా రవాణా వాహనాల సమస్య జటిలంగా ఉంది. అష్టకష్టాలు పడి రైతులు ఆర్ఎస్ కేలు, మిల్లుల వద్ద నుంచి గోనె సంచులు తీసుకుని ఆరబోసిన ధాన్యాన్ని బస్తాలకు ఎత్తుకున్నారు. అయితే రవాణా వాహనాలు సమృద్ధిగా లేకపోవటంతో ధాన్యం ఎక్కడిదక్కడే పేరుకుపోయింది. లారీలు రాకపోవటంతో బస్తాలు మిల్లులకు కదలటం లేదు. అధికారులు, మిల్లర్ల చుట్టూ పదే పదే తిరిగినా సమస్య అరకొరగానే తీరుతుంది తప్ప, పూర్తి స్థాయిలో పరిష్కారానికి నోచటం లేదని రైతులు వాపోతున్నారు. దళారులకు వెంటనే లారీలను పంపే మిల్లర్లు రైతుల పక్షాన నిలవటం లేదన్న ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్క కంకిపాడు మండలానికే సుమారు 30 లారీలకు పైగా అవసరం ఉందంటే సమస్య తీవ్రత ఇట్టే అవగతమవుతుంది.అకాల వర్షాలు రైతులను పట్టి పీడిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో రైతులు కుదేలవుతున్నారు. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని సంతోషించే లోపే, అకాల వర్షాలు తమ పాలిట శాపంగా మారాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగలు, రాత్రి వేళల్లో ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలీక, కల్లాలు, రోడ్డు మార్జిన్లలోనే పడిగాపులు పడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. కాపాడుకున్న పంట ఎక్కడ వర్షం బారిన పడి నష్టపోవాల్సి వస్తుందోనన్న భయంతో అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. -
అనుక్షణం.. అప్రమత్తం
కోడూరు: ఉగ్రవాదుల పీచమణిచేందుకు పాకిస్తాన్‌పై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన నేపథ్యంలో పోలీసు, మైరెన్ శాఖలు అప్రమత్తమయ్యాయి. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం జిల్లాలోని సముద్ర తీరప్రాంత గ్రామాల వెంట పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దివిసీమలోని కోడూరు, నాగాయలంక మండలాల్లోని తీరప్రాంత గ్రామాల్లో పర్యటించి, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సముద్రం వెంట ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే అవకాశం ఉందని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్ఐలు చాణిక్య, పూర్ణమాధురి సూచించారు. అపరిచిత వ్యక్తులు, అక్రమ చొరబాటుదారులు, బోట్లు సముద్రం వెంట కనిపిస్తే వెంటనే సమాచారమివ్వాలని ఆదేశించారు. పాలకాయతిప్ప సముద్ర శింకు వద్ద నిలిపి ఉన్న బోట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోస్టల్ సెక్యూరిటీ అధికారులు కూడా తీరం వెంట ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారని, అత్యవసర సమయంలో మత్స్యకారులు కూడా వారికి సహకరించాలని ఎస్ఐలు కోరారు. నిరంతర పర్యవేక్షణ.. పాలకాయతిప్ప బీచ్‌తో పాటు పవిత్ర సాగర సంగమ ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ కెమెరాతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాను సముద్రం వెంట కూడా పంపి, అనుమానాస్పద బోట్లపై ఆరా తీశారు. తీరం వెంట ఉన్న మడ చెట్లు, బోట్లతో పాటు కరకట్ట వెంట కూడా డ్రోన్‌తో పర్యవేక్షించారు. ప్రతి రోజు ఈ డ్రోన్ నిఘా ఉంటుందని ఎస్ఐలు చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా అప్రమత్తమైన పోలీసు, మైరెన్ శాఖలు తీరప్రాంత గ్రామాల వెంట ప్రత్యేక నిఘా -
ఆపరేషన్ సిందూర్‌కి సంఘీభావం
నాగాయలంక: పాకిస్తాన్ భూ భాగంలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి విజయవంతంగా దాడి జరిపి, ఉగ్రవాదుల పీచమణిచిన భారతీయ సైనిక దళాలకు వందనం చేస్తూ నాగాయలంకలో బుధవారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. స్థానిక సుదర్శి మానవతా సేవాసంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 60అడుగుల భారీ జాతీయ పతాకం చేతబూనిన వివిధ వర్గాల ప్రజలు, సంస్థల ప్రతినిధులతో మానవహారం నిర్మించి.. జైహింద్ నినాదాలతో జేజేలు పలికారు. సంస్థ నిర్వాహకులు తలశిల రఘుశేఖర్, కనిగంటి నారాయణ పర్యవేక్షణలో తొలుత ప్రధాన మార్గంలో ర్యాలీగా ట్రాఫిక్ ఐలెండ్ కూడలికి చేరుకుని అక్కడ మానవహారం నిర్మించారు. డీసీ మాజీ చైర్మన్ బీసాబత్తిని ప్రసాద్, చన్నగిరి లతామోహన్, అమ్మారావు తదితరులు పాల్గొన్నారు. -
రైతులను ఆదుకోవడంలో కూటమి విఫలం
రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పామర్రు: ప్రస్తుతం రాష్ట్రంలో రైతులందరూ అకాల వర్షాల కారణంగా ఇబ్బందుల్లో ఉన్నారని, వీరిని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ ఉమ్మడి కృష్ణా జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. కృష్ణాజిల్లా పామర్రులో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ధాన్యం, మినుములు, మొక్క జొన్న తదితర పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో రైతులు అయిన కాడికి పంటను తెగనమ్ముకుని నష్ట పోతున్నారని వివరించారు. రోజురోజుకీ మినుముల ధర తగ్గిపోతున్నా కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం రైతుల పట్ల కూటమి నేతలకు ఉన్న శ్రద్ధ అర్థమవుతోందన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులకు ఎప్పుడూ అండగా ఉంటూ పండిన పంటలకు గిట్టుబాటు ధరను కల్పించామని గుర్తు చేశారు. స్పందించకపోతే ఉద్యమమే.. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రైతుల తరఫున వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను నిర్వహించేందుకు వెనుకాడేది లేదని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్‌కుమార్, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు తాడిశెట్టి శ్రీనివాసరావు, ఎంపీపీ దాసరి అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చర్యలు కోనేరుసెంటర్: భద్రతా దళాల ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా విద్వేషపూరితమైన సమాచారాన్ని షేర్ చేసినా, పోస్ట్ చేసిన ఆడియో, వీడియో మెసేజ్‌ల రూపంలో గ్రూపుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించినా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్‌రావు హెచ్చరించారు. ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేసే ముందు అది వాస్తవమైనదా కాదా నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే గ్రూపుల్లో షేర్ చేయాల్సి ఉంటుందన్నారు. అందుకు విరుద్ధంగా జరిగితే మెసేజ్‌లు ఫార్వర్డ్ చేసిన వ్యక్తులతో పాటు సంబంధిత గ్రూప్ అడ్మిన్లు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం వెనుకాడమని హెచ్చరించారు. జగదీష్ నల్లూరికి లెజెండరీ అవార్డు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఓటీఎస్ అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట జగదీష్ నల్లూరికి లెజెండరీ అవార్డు లభించింది. హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్–2025లో ఈ అవార్డు ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేతుల మీదుగా వెంకట జగదీష్ నల్లూరి ఈ అవార్డు అందుకున్నారు. మీడియా, ప్రకటన రంగానికి చేసిన అసాధారణ సేవలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేశారు. నలభై ఏళ్లకు పైగా అనుభవంతో, వెంకట జగదీష్ ప్రాంతీయ ప్రకటన రంగంలో కీలక పాత్ర పోషించారు. జాతీయ, ప్రాంతీయ ప్రాధాన్యం కలిగిన అనేక ప్రభావవంతమైన ప్రచారాలను ఆయన నడిపారు. ఈ సందర్భంగా వెంకట జగదీష్ మాట్లాడుతూ హైబిజ్ టీవీ నుంచి ఈ అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. క్రికెట్ అండర్–19 ఉమ్మడి జిల్లా జట్లు ఎంపిక విజయవాడస్పోర్ట్స్: ఉమ్మడి కృష్ణా జిల్లా అండర్–19 పురుషులు వన్డే, మల్టీ డేస్ జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.రవీంద్రచౌదరి తెలిపారు. 2025–26 సీజన్ కోసం మల్టీ డేస్ జట్టుకు రాజేష్ (కెప్టెన్), కార్తికేయ, కార్తికేయవర్మ, హర్షసాయిసాత్విక్, భానువరప్రసాద్, హరిదుర్గామణికంఠ, నిఖిల్, అఖిల్, ఆకర్ష్, ధీరుడు, గోవతం, యశ్వంత్, లలిత్, శ్రేయేష్, ఆదర్శ్, బవానీప్రసాద్.. వన్డే జట్టుకు రాజేష్(కెప్టెన్), కార్తికేయ, హేమంత్, హర్షసాయిసాత్విక్, భానువరప్రసాద్, రెనేష్, నిఖిల్, విఘ్నేష్, ధీరుడు, గోవతం, యశ్వంత్, లలిత్, ఆదర్శ్, శ్రేయేష్, రణధీర్, అవినాష్‌లను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. -
ఆర్టీసీ ఉద్యోగుల నిజాయితీ
బస్సులో మర్చిపోయిన రూ. 1.29 లక్షల నగదు అప్పగింత బస్టాండ్(విజయవాడపశ్చిమ): బస్సులో మర్చిపోయిన నగదును తిరిగి ప్రయాణికులకు అందించి ఆర్టీసీ ఉద్యోగులు తమ నిజాయితీని చాటుకున్నారు. వివరాలు ఇవి.. సోమవారం రాత్రి కాళేశ్వరరావు మార్కెట్ నుంచి మంగళాపురం వెళ్తున్న రూట్ నెంబర్ 49ఎం బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు రూ.1,29,800 నగదు ఉంచిన బ్యాగును మర్చిపోయి మంగళాపురంలో దిగి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన అనంతరం గుర్తించిన ప్రయాణికులు గవర్నరుపేట–2 డిపో వద్దకు వెళ్లారు. అప్పటికే బస్సులో మర్చిపోయిన బ్యాగును గుర్తించిన కండక్టర్ కుమారి, డ్రైవర్ రాజారావు నగదు కలిగిన బ్యాగును ఇన్చార్జ్ డిపో మేనేజర్ కె. బసవయ్యకు అప్పగించారు. ప్రయాణికుల నుంచి వివరాలు తీసుకున్న మేనేజర్ సెక్యూరిటీ సిబ్బంది సమక్షంలో బ్యాగును అందజేశారు. -
‘ఏఎన్ఎంలకు ఏబీసీడీలు రావు’
● సోషల్ మీడియాలో ఓ సీహెచ్ఓ పోస్టు ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఏఎన్ఎంలు ● నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు ● వైద్యశాఖ సిబ్బంది మధ్య కొరవడిన సమన్వయం లబ్బీపేట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వంలో వైద్యశాఖ అస్తవ్యస్తంగా మారుతోంది. ఆ శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల మధ్య సమన్వయం లోపించడంతో పేదలకు వైద్య సేవలు అందని ద్రాక్షగా మారుతున్నాయి. ఏడాదిగా వీరి మధ్య చాపకింద నీరులా ఉన్న వివాదం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బహిర్గతం అయ్యింది. సిబ్బంది ప్రత్యక్ష ఆరోపణలకు దిగుతున్నారు. అంతేకాక నల్ల బ్యాడ్జిలతో నిరసనలు తెలుపుతూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ పరిష్కరించాల్సిన వైద్యశాఖ ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు. సోషల్ మీడియా పోస్టుతో.. ఇటీవల తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్లు పలు డిమాండ్లతో నిరవధిక సమ్మెకు దిగారు. వారి సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ తరుణంలో ఓ సీహెచ్ఓ.. ‘ఏబీసీడీలు రాని ఏఎన్ఎంలకు రూ.50 వేలు, సూపర్వైజర్లకు రూ.70 వేలు, రూ.లక్ష జీతాలు.. గ్రాడ్యుయేషన్ చేసిన మాకు తక్కువ జీతాలా.. ఏఎన్ఎంల యాప్‌లు అన్నీ మేమే చూస్తున్నాం, మెడికల్ ఆఫీసర్స్ యాప్‌లు కూడా మేమే చేస్తున్నాం’ అంటూ పెట్టిన పోస్టు వివాదానికి దారి తీసింది. ఎప్పటి నుంచో ఏఎన్ఎంలు, సీహెచ్‌ఓల మధ్య వివాదం నడుస్తుండగా, ఇప్పుడు ఈ పోస్టుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు కారణమవుతోంది. ఏఎన్ఎంల నిరసన.. తమకు ఏబీసీడీలు రావంటూ సీహెచ్‌ఓలు అవమానించడంపై ఏఎన్ఎంలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా దీనిపై నిరసనలు తెలుపుతున్నారు. సోమవారం నల్ల బ్యాడ్జిలతో విధులకు హాజరైన ఏఎన్ఎంలు, మంగళవారం ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. సీహెచ్‌ఓల తీరు బాగా లేదని, తమకు ఏబీసీడీలు రావనడం ఏమిటని మండిపడుతున్నారు. ప్రస్తుతం వారి మధ్య వివాదం నడుస్తుండగా, ఇది ఎక్కడి వరకూ కొనసాగుతుందోనని ఆ శాఖ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. -
పంట సంరక్షణలో అన్నదాతలు
● తడిచిన మొక్కజొన్న, ధాన్యం ఆరబెట్టే పనిలో నిమగ్నం ● పల్లపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలింపు ● దెబ్బతిన్న పంట.. మద్దతు ధరపై ఆందోళన కంకిపాడు: రైతులు పంట సంరక్షణ పనులపై దృష్టి పెట్టారు. భారీ వర్షానికి తడిసిన మొక్కజొన్న, ధాన్యాన్ని ఎండబెట్టి నాణ్యతను కాపాడుకునేందుకు సంరక్షణ చర్యల్లో నిమగ్నమయ్యారు. వర్షంతో తడిసిన ధాన్యం, మొక్కజొన్న నాణ్యత దెబ్బతిని మద్దతు ధరపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలి వాన బీభత్సం కారణంగా కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కల్లాలు, ఖాళీ స్థలాల్లో ఆరబోసి రాశులు మీద ఉన్న ధాన్యం, మొక్కజొన్న తడిసిపోయింది. మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలు సైతం వర్షానికి తడిశాయి. పంట చేతికొచ్చిన తరుణంలో భారీ వర్షం ఊహించని ఉపద్రవంలా రైతులపై విరుచుకుపడింది. మద్దతుపై ఆందోళన.. భారీ వర్షం రైతులకు అకాల నష్టాన్ని తెచ్చిపెట్టినట్లయ్యింది. వర్షానికి ధాన్యం తడవటంతో మళ్లీ తేమశాతం పెరగటంతో మద్దతు ధర దక్కే విషయంలో నష్టపోవాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 75 కిలోల బస్తాకు బయటి దళారులు రూ. 1,350 ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఆర్ఎస్కేల ద్వారా సంచులు, రవాణా వాహనాలను సమకూర్చి మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలన్న వాదన దాళ్వా రైతుల నుంచి వ్యక్తమవుతోంది. దీంతో పాటు సుమారు 4 వేల ఎకరాల్లో కల్లాల్లో ఉన్న మొక్కజొన్న పంట తడవటంతో గింజలు నలుపెక్కుతాయని వాపోతున్నారు. క్వింటా రూ. 2 వేలు పలుకుతుందని, నాణ్యత దెబ్బతింటే ధర ఎంత పలుకుతుందో తెలీటం లేదని ఆవేదన చెందుతున్నారు. కష్టకాలంలో మొక్కజొన్న రైతులు మునిగిపోయారు. ఇప్పటికై నా వర్ష ప్రభావ ప్రాంతాలను గుర్తించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను స్థానికంగా తెరిచి మద్దతు ధర అందేలా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చలిగాలుల నుంచి.. సోమవారం, మంగళవారం ఉదయం వేళల్లో తీవ్రమైన ఎండ, వడగాల్పులు కారణంగా పంటను ఆరబెట్టేందుకు అనుకూల పరిస్థితి ఏర్పడింది. దీంతో తడిసిన ధాన్యం రాశులు, మొక్కజొన్న రాశులను పూర్తి స్థాయిలో తిరగబెట్టి ఎండగట్టారు. కూలీలు, దంతిల సాయంతో రాశులను ఎండబెట్టి కాటాలు వేయించారు. పల్లపు ప్రాంతాలైన డొంకరోడ్లలో ఉన్న మొక్కొజొన్న, ధాన్యం రాశులను మెరక ప్రాంతాల్లో ఉన్న ఖాళీ వెంచర్లలోకి తరలించి సంరక్షించుకున్నారు. సాయంత్రం వేళల్లో చలిగాలులకు తేమ పెరగకుండా చుట్టూ పరదాలు, టార్పాలిన్లు కట్టి పంటను జాగ్రత్త చేసుకుంటున్నారు. -
నిషేధిత భూములకు విముక్తి కలిగించాం
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంటౌన్: ఎన్నో ఏళ్లుగా 22(ఏ) నిషేధిత జాబితాలోని భూములకు విముక్తి కలిగించి వాటిపై అనుభవదారులకు సర్వహక్కులు కల్పించామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణతో కలిసి మంగళవారం నగరంలోని 4, 5 డివిజన్ల పరిధిలోని సర్కారుతోటలో ఉన్న సెక్షన్ 22 (ఏ)లో నమోదైన భూములకు మినహాయింపు ఉత్తర్వులు విడుదల చేసే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నేడు వారి భూములను 22(ఏ) నిషేధిత జాబితా నుంచి తొలగించి దాదాపు 340 మందికి పూర్తి హక్కులు కల్పించి అందుకు సంబంధించిన ఉత్తర్వులను వారికి అందించామన్నారు. సమస్యలపై ప్రత్యేక దృష్టి.. కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఉన్న ప్రభుత్వం వారి భూములను 22(ఏ) నిషేధిత జాబితా నుంచి చట్టబద్ధంగా తొలగించి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు పూర్తి హక్కులు కల్పించిందన్నారు. బందరు ఆర్డీఓ కె. స్వాతి, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె నాని తదితరులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ కంచికచర్ల: జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా రోజుకి లక్షమంది కూలీలకు పనులు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. కంచికచర్ల మండలం పరిటాలలో జరుగుతున్న ఉపాధిహామీ పథకం పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం ద్వారా పనిచేసే కూలీలకు రోజుకు రూ. 307 వచ్చేలా కొలతలు ఇచ్చి పనులు చేయిస్తున్నామని చెప్పారు. ప్రతి కూలీ 100రోజులు పని పూర్తి చేసేలా ఉపాధిహామీ పథకం అధికారులు చూడాలన్నారు. పథకం ద్వారా రైతులు తమ పొలా ల్లో నీటిని నిల్వ చేసుకునేందుకు ఫార్మ్ పాండ్(నీటి కుంట)లను తీయించుకోవాలని కలెక్టర్ అన్నారు. నందిగామ ఆర్డీఓ కే బాలకృష్ణ, ఎంపీడీఓ బీఎం విజయలక్ష్మి, ఏఓ కె. విజయకుమార్, ఏపీఓ రమాదేవి, ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు. -
కృష్ణా జిల్లా కలెక్టర్‌కు రెడ్ క్రాస్ రాష్ట్ర అవార్డు
మచిలీపట్నంఅర్బన్: మానవీయ సేవల్లో అత్యుత్తమ కృషికి గుర్తింపుగా కృష్ణా జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా శాఖ అధ్యక్షుడు డి.కె.బాలాజీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారని జిల్లా కార్యదర్శి శంకర్నాథ్ భవిరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది బుడమేరు, కృష్ణా నది వరదల్లో ప్రజలను ఆదుకోవడంలో కలెక్టర్ చూపిన నాయకత్వం, సేవా కార్యక్రమాల నిర్వహణకు గుర్తింపుగా ఈ అవార్డు వరించిందని పేర్కొన్నారు. వరదబాధితులకు ఆహారం, అవసరమైన సహాయాన్ని అందించడంతో పాటు, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పని కూడా చురుకుగా నిర్వహించారని వివరించారు. ప్రపంచ రెడ్ క్రాస్, తలసీమియా దినోత్సవాల సందర్భంగా ఈ నెల ఎనిమిదో తేదీన రాజ్ భవన్ దర్బార్‌లో నిర్వహించే కార్యక్రమంలో గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈ అవార్డు ప్రదానం చేస్తారని తెలిపారు. దుర్గగుడి ఈఓగా శీనానాయక్ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఈఓగా శీనానాయక్‌ను నియమిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. బుధవారం సాయంత్రం ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని సమాచారం. ‘భద్రతేది... భవానీ?’ శీర్షికన ‘సాక్షి’లో ఈ నెల రెండో తేదీన దుర్గగుడి భద్రతపై కథనం ప్రచురితమైంది. ఆలయంలో జరుగుతున్న మాస్టర్ ప్లాన్ పనులు, ఈఓ అందుబాటులో లేకపోవడం, అన్ని విభాగల్లో చోటు చేసుకుంటున్న వైఫల్యాలను ఈ కథనం వివరించింది. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి దుర్గగుడి ఈఓగా ఉన్న రామచంద్ర మోహన్‌కు ఆ తర్వాత దేవదాయ శాఖ కమిషనర్‌గా, అదనపు కమిషనర్‌గా బాధ్యతలు అప్ప గించింది. రాష్ట్రంలో అతి పెద్ద దేవాలయాల్లో రెండో స్థానంలో ఉన్న దుర్గగుడికి శాశ్వత ఈఓ లేకపోవడం కూటమి పాలనకు నిదర్శనంగా నిలవడమే కాకుండా భక్తుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం దుర్గగుడి ఈఓగా శీనా నాయక్‌ను నియమించింది. 10న డయల్ యువర్ ఎస్పీకోనేరుసెంటర్(మచిలీపట్నం): ప్రజా సమ స్యల పరిష్కారం కోసం ఈ నెల పదో తేదీన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు మంగళవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజలు తమ సమస్యలను స్వయంగా తన దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు సత్వరమే చర్యలు తీసుకుంటా నని పేర్కొన్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని బాధితుల కోసం ఈ కార్యక్ర మాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు 94407 96400 నంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఎస్పీ సూచించారు.దక్షిణ ఆసియా వైద్య సదస్సులో సిద్ధార్థ వైద్యుల ప్రతిభ లబ్బీపేట(విజయవాడతూర్పు): మంగుళూరులో ఈ నెల రెండు నుంచి నాలుగో తేదీ వరకు జరిగిన 13వ దక్షిణ ఆసియా దేశాల చర్మ వ్యాధి వైద్యుల సదస్సులో విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల వైద్యులు ప్రతిభ చూపారు. ఆ సదస్సులో పాల్గొన్న చర్మవ్యాధుల విభాగాధిపతి డాక్టర్ టి.వాణి సమర్పించిన పరిశోధన పత్రానికి పోస్టర్ విభాగంలో అవార్డు లభించింది. ఆమె పర్యవేక్షణలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు పలు పరిశోధన పత్రాలు సమర్పించారు. స్కాలర్ షిప్ పోటీల్లో డాక్టర్ టి.వాణితో పాటు మరో నలుగురు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని మంగళవారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అశోక్‌కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు అభినందించారు. కలెక్టర్ బాలాజీ -
‘ఉపాధి’ కూలీలకు 80 లక్షల పని దినాలు లక్ష్యం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఇబ్రహీంపట్నం: ఉపాధి హామీ పథకం కింద ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది కూలీలకు 80 లక్షల పనిదినాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. మండలంలోని గుంటుపల్లి గ్రామంలో కలెక్టర్ మంగళవారం పర్యటించారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న అమృత సరోవర్ పనులను పరిశీలించారు. ఉపాధి పనులు అత్యంత నాణ్యతగా, పారదర్శకంగా జరగాల న్నారు. ఇప్పటి వరకు 25 వేల పనిదినాలు కల్పించామన్నారు. ప్రతి కూలీకి రూ.307 దినసరి కూలి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మండు వేసవిని దృష్టిలో ఉంచుకుని కూలీలు తెల్లవారుజామున పని ప్రదేశానికి చేరు కుని ఉదయం పది గంటలకు పని ముగించి ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ పలుగు చేతబట్టి కూలీలతో పాటు మట్టిని తవ్వారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధిహామీ పీడీ ఎ.రాము, ఏపీఓ ప్రమీల, పంచాయతీ కార్యదర్శి మునేశ్వరరావు పాల్గొన్నారు. -
ప్రజారోగ్యంపై సమ్మెట
లబ్బీపేట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వ మొండి వైఖరితో పల్లె వైద్యం పడకే సింది. గ్రామీణ ప్రజలకు చేరువగా ఉంటూ, వైద్య సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీ సర్లు (సీహెచ్‌ఓలు) నిరవధిక సమ్మె చేపట్టారు. దీంతో గ్రామాల్లోని విలేజ్ హెల్త్ క్లినిక్స్ (హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు)లో వైద్య సేవలు నిలిచిపోయాయి. ఇప్పటి వరకూ అనేక మంది గ్రామీణులు తమ ఇంటికి సమీపంలోనే ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్‌కు వెళ్లి పలు రకాల వైద్య సేవలు పొందేవారు. పాముకాటు, విషం తాగడం వంటి వాటికి తక్షణ ప్రాథమిక వైద్యం అందించేలా సీహెచ్‌ఓలు ప్రత్యేక శిక్షణ పొందారు. అవసరమైతే విలేజ్ హెల్త్ క్లినిక్ నుంచే నిపుణులతో టెలిమెడిసిన్‌లో సంప్రదించి రోగులకు అవసరమైన మందులు అందించేవారు. ఇప్పుడు ఆ సేవలన్నీ నిలిచిపోయాయి. సీహెచ్‌ఓల న్యాయమైన డిమాండ్లపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. చేసేది లేక తమ సమస్యల పరిష్కారం కోసం సీహెచ్‌ఓలు నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో ఎన్టీఆర్ జిల్లాలోని 257, కృష్ణా జిల్లాలోని 357 వెల్నెస్ సెంటర్లలో వైద్య సేవలు నిలిచిపోయాయి. కీలకంగా వెల్నెస్ సెంటర్లు కరోనా తర్వాత విలేజ్ హెల్త్ క్లినిక్‌లు వైద్య సేవలు అందించడంలో కీలకంగా మారాయి. అక్కడ బీఎస్సీ నర్సింగ్ చదివిన వారికి సీహెచ్‌ఓలుగా పోస్టింగ్ ఇచ్చారు. అంతేకాకుండా అత్యవసర సమయంలో అందించాల్సిన ప్రాథమ చికిత్సలపై కూడా వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పాము కాటు, పాయిజన్ వంటి కేసులు వచ్చినప్పుడు ఆస్పత్రికి వెళ్లే సమయానికి చేయాల్సిన తక్షణ వైద్యంపై వారికి తర్ఫీదు ఇచ్చారు. దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు వంటి వారికి పరీక్షలు నిర్వహించడం మందులు ఇవ్వడం వంటివి సీహెచ్‌ఓలు చేస్తున్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌కు వైద్యం కోసం వచ్చిన రోగులకు టెలిమెడిసిన్ ద్వారా నిపుణులైన వైద్యులతో సంప్రదించి మందులు అందిస్తున్నారు. ఇలా ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో ఒక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రజలకు చేరువలో వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రతి బుధ, శనివారం గర్భిణులు, బాలింతలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా అక్కడే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ సేవలు నిలిచిపోయాయి. సీహెచ్‌ఓల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం నిరవధిక సమ్మెబాట పట్టిన సీహెచ్‌ఓలు వెల్నెస్ సెంటర్లలో నిలిచిన వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాల్లో అందని అత్యవసర ప్రాథమిక వైద్యంసీహెచ్ఓల డిమాండ్లు ఇవీ.. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఆరేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారిని రెగ్యులర్ చేయాలి. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ జరగాలి. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలి. ఈపీఎఫ్ఓను పునరుద్ధరించాలి క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించి క్రమబద్ధీకరించాలి నిర్ధిష్టమైన జాబ్ చార్ట్ అందించాలి ఎఫ్ఆర్ఎస్ నుంచి సీహెచ్ఓలకు మినహాయింపు ఇవ్వాలి హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్, ఎక్స్‌గ్రేషియా, పితృత్వ సెలవులు వంటివి అమలు చేయాలి.సమస్యలను పరిష్కరించాలి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు అత్యాధునిక భవనాలు నిర్మించడమే కాకుండా, అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుత ప్రభుత్వం వాటిపై నిర్లక్ష్యంగా వ్యవహరించ డంతో సేవలు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వైద్య రంగంపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తోంది. ఇది మంచి పద్ధతి కాదు. – డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ వైద్య విభాగం -
ఇంగ్లిష్‌లో ‘పవర్’ చూపించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ముంబైలో ఏప్రిల్ 23న నిర్వహించిన జాతీయ స్థాయి ఇంగ్లిష్ వర్డ్ పవర్ చాంపియన్‌షిప్ పోటీలలో ఎన్టీఆర్ జిల్లా విద్యార్థులు ప్రతిభకనబరిచారు. దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల నుంచి విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో మన రాష్ట్రం నుంచి ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం కనిమెర్ల ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు పాల్గొని సత్తా చాటారు. ఈ పోటీల్లో మొత్తం 2 నుంచి 5వ తరగతి వరకు 4 విభాగాలలో పోటీలు నిర్వహించగా, వీటిలో 4వ తరగతి విభాగంలో రేవంత్ ప్రథమ స్థానం, 2వ తరగతి విభాగంలో సింధు ప్రియ ద్వితీయ స్థానం సాధించింది. ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించింది. విజేతలు మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశను కలిశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. బహుమతులు అందజేశారు. పాఠశాల ఉపాధ్యాయురాలు విజయలక్ష్మిని సత్కరించారు. కాలువలోకి దూకి యువతి ఆత్మహత్య కోనేరుసెంటర్: ఇష్టం లేని వివాహం చేస్తున్నారని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బందరు మండలం ఎన్. గొల్లపాలెంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్. గొల్లపాలెం గ్రామానికి చెందిన కుక్కల విద్య (19) పదో తరగతి వరకు చదువుకుంది. తండ్రి సురేష్ వ్యవసాయ పనులు చేస్తుంటాడు. ఆమెకు సమీప బంధువుకు ఇచ్చి వివాహం చేసేందుకు నిర్ణయించాడు. అయితే ఇంకా చదువుకోవాలకునే విద్య విషయాన్ని తండ్రికి చెప్పింది. అందుకు ఆయన నిరాకరించాడు. అంత స్తోమత కుటుంబానికి లేదంటూ బుజ్జగించాడు. తెచ్చిన సంబంధం చేసుకోవాలంటూ ఆదేశించాడు. దీంతో పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని విద్య సోమవారం మధ్యాహ్నం తండ్రి బైక్ వేసుకుని బయటికి వెళ్లింది. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవటంతో అనుమానం వచ్చిన తండ్రి గ్రామంలో ఆరా తీశాడు. అతని బైక్ చిన్నాపురం గ్రామ సమీపంలోని గుండేరు వంతెనపై ఉన్నట్లు పరిచయస్తులు చెప్పారు. అక్కడికి వెళ్లి చూడగా బైక్ కనిపించింది. సురేష్ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. పోలీసులు మంగళవారం గుండేరు కాలువలో ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విద్య కాలువలో శవమై కనిపించింది. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. ట్రావెల్స్ యజమాని బలవన్మరణంతోట్లవల్లూరు: అనుమానాస్పద స్థితిలో కార్ ట్రావెల్స్ యజమాని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రమైన తోట్లవల్లూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన పేర్ల సుధాకర్‌రెడ్డి(33) స్థానిక కనకదుర్గమ్మ కాలనీలో మూడేళ్లుగా నివాసం ఉంటున్నాడు. పెనమలూరులో పీఎస్ఆర్ ట్రావెల్స్ పేరుతో కృష్ణారెడ్డి అనే వ్యక్తితో కలిసి నిర్వహిస్తున్నాడు. వ్యాపార పనుల నిమిత్తం వారం రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన సుధాకర్‌రెడ్డి ఈ నెల 5 సోమవారం రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చాడు. సుధాకర్‌రెడ్డి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఉండటాన్ని మంగళవారం ఉదయం కుటుంబసభ్యులు గమనించారు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లి పేర్ల రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అవినాశ్ తెలియజేశారు. -
బీచ్ ఫెస్టివల్ బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మంగినపూడి బీచ్‌లో జరిగే బీచ్ ఫెస్టివల్‌ను దిగ్విజయంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ ఆర్.గంగా ధరరావు తెలిపారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు జరిగే బీచ్ ఫెస్టివల్‌ను పురస్కరించుకుని మంగినపూడి బీచ్‌ను ఎస్పీ మంగళవారం సందర్శించారు. అక్కడ జరుగుతున్న భద్రతా ఏర్పాట్లను పరి శీలించారు. బందోబస్తుకు సంబంధించి అధికా రులు, సిబ్బందికి దిశానిద్దేశం చేశారు. అనంతరం ఎస్పీ గంగాధరరావు మాట్లాడుతూ.. ముంగినపూడి బీచ్‌లో మూడు రోజులు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే బీచ్ ఫెస్టివల్‌కు పటిష్ట బందోబస్తు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపు సక్రమంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. హెలిప్యాడ్, సభా వేదిక చుట్టుపక్కల ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. వాచ్ టవర్స్ ఏర్పాటు చేసి పర్యాటకులు బీచ్ లోతుకు వెళ్లకుండా పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టం ద్వారా అప్రమత్తం చేసేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఉత్సవాలు జరిగే మూడు రోజులు గజ ఈతగాళ్లను బీచ్ వద్ద అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ సాయిబాబు, అవనిగడ్డ తహసీల్దార్ హరనాథ్, బందరు డీఎస్పీ సీహెచ్.రాజ, బందరు రూరల్ ఎస్ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
చివరికి కడగండ్లే!
కంకిపాడు సెక్షన్ పరిధిలో బందరు కాలువలో పేరుకుపోయిన గుర్రపుడెక్క సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా డెల్టాలో చివరి ఆయకట్టుకు సాగు నీరు చేరడం గగనంగా మారుతోంది. కాలువలు, డ్రెయిన్ల నిర్వహణ, మరమ్మతులను ప్రభుత్వం గాలికి వదిలేసింది. దీంతో రైతులకు కష్టాలు, కడగండ్లు తప్పడం లేదు. ఇప్పటికే కాలువలు గుర్రపు డెక్క, తూటి కాడతో నిండిపోయాయి. ఈపాటికే పిచ్చిమొక్కల తొలగింపుతోపాటు, అక్కడక్కడ కాంక్రీట్ పనులు, షట్టర్లకు మరమ్మతులు చేయాల్సింది. అయితే ప్రభుత్వం ఈ పనులు చేసే దిశగా అడుగులు వేయటం లేదు. జూన్ మొదటివారంలోపు పనులు పూర్తి చేయకుంటే, తర్వాత కాలువలకు సాగు నీరు విడుదల చేస్తారు. పనులు చేసే అవకాశం ఉండదు. ఇదే అదునుగా పనులు మంజూరు అయినప్పటికీ, పనులు చేయకుండానే మమ అనిపించి నిధులు మింగేసే అవకాశం కూడా ఉంది. సకాలంలో పనులు చేయకపోతే చివరి ఆయకట్టుకు నీరు అందక రైతులు గడ్డు పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. వర్షాలు వస్తే, డ్రెయిన్లు పొంగి పొలాల నుంచి నీరు బయటకిపోక అల్లాడిపోతున్నారు. డెల్టా పరిధిలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా తూర్పు డెల్టా పరిధిలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి 5.62 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సింది. పనుల మంజూరులో జాప్యం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటి సంఘాలకు రూ.10లక్షల వరకు నామినేషన్‌పై పనులు కట్టబెట్టే వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో నీటి పారుదల శాఖ కాలువల్లో తూటికాడ, పిచ్చిమొక్కల తొలగింపు, షట్టర్ల మరమ్మతులు, కాంక్రీట్ పనులు చేసేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మార్చి నెలలోనే ప్రభుత్వానికి పంపా రు. ప్రభుత్వం ఇప్పటికీ పనులు చేసేందుకు అనుమతులు మంజూరు చేయలేదు. దీంతో ఈ నెలలో పనులు పూర్తి కావటం గగనమే. గత ఏడాది పనులకు టెండర్లు ఆలస్యంగా పిలిచి, ఖరారు చేయడంలో జాప్యం జరిగింది. 160 పనులు రూ.32.79కోట్లతో చేపట్టారు. దీంతో టీడీపీ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని, టెండర్లతో సంబంధం లేకుండానే కొంత మంది కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పారు. వారు 40–48 శాతం లెస్ వేసి పనులు దక్కించుకున్నారు. వీరంతా పనులు చేయకుండానే మమ అనిపించి చేతులు దులుపుకున్నారు. కాంట్రాక్టర్లు, నీటి పారుదల శాఖ అధికారులతో కుమ్మకై ్క బిల్లులు దండుకొంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.బుడమేరులో మేటవేసిన గుర్రపుడెక్క కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో 5.62 లక్షల ఎకరాల్లో ఆయకట్టు కాలువలు, డ్రెయిన్లలో పేరుకుపోయిన తూటికాడ కొద్దిపాటి వర్షానికే పొలాల మునక ఇంకా ప్రతిపాదన దశలోనే పనులు జూన్ మొదటి వారంలోపు పనులు చేయకపోతే కష్టాల సాగేఈ ఏడాది ప్రతిపాదిత పనులు.. డివిజన్ పనుల విలువ సంఖ్య (రూ.కోట్లలో) కృష్ణా తూర్పు 121 8.45 కృష్ణా సెంట్రల్ 144 7.28 డ్రెయినేజి విభాగం 288 9.00 స్పెషల్ 15 1.30 మొత్తం 568 26.03 కృష్ణా డెల్టా కింద ఆయకట్టు ఇలా..(ఎకరాల్లో) కాలువ కృష్ణా ఎన్టీఆర్ బందరు 1.51లక్షలు – కేఈబీ 1.38 లక్షలు – ఏలూరు 0.56 లక్షలు 1,332 రైవస్ 2.17 లక్షలు 425 మొత్తం 5.62లక్షలు 1,757 -
జిల్లాలో 648 మి.మీ వర్షపాతం
గుడివాడరూరల్: జిల్లా వ్యాప్తంగా ఆదివారం 648 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం కురిసిన వర్షాలకు పంట నష్టం తదితర వివరాలపై జిల్లాల వారీగా సమీక్షించారు. కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ గుడివాడ ఆర్డీవో కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లాలోని కొన్ని మండలాల్లో ఎక్కువగా వర్షం కురిసిందని, బంటుమిల్లి మండలంలో 109.2 మిల్లీమీటర్లు, కంకిపాడు మండలంలో 56.2 మిల్లీ మీటర్లు, ఉయ్యూరు మండలంలో 52.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందన్నారు. జిల్లాలో 76 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని, అందులో ముఖ్యంగా 64 హెక్టార్లలో అరటి తోటలు దెబ్బతిన్నాయని, కంకిపాడులో ఒక గేదె చనిపోయిందని కలెక్టర్ సీఎంకు వివరించారు. సీఎం కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ బాలాజీ వెల్లడి -
పర్యావరణ పరిరక్షణకు చర్యలు
కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): మొక్కలు విరివిగా నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్ లో సోమవారం సాయంత్రం ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి వివిధ శాఖల అధికారులతో మొక్కల పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భావితరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, విరివిగా మొక్కలను నాటి వాటిని పరిరక్షించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, వ్యక్తిగత గృహాలకు మొక్కలను ఉచితంగా పంపిణీ చేసేందుకు మచిలీపట్నం నగరంలో చిన్నాపురం డాక్టర్ గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ లక్ష్మణస్వామి ముందుకు వచ్చారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణస్వామిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. రానున్న జూలై నాటికి మొక్కలు నాటే ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఆ లోపుగా మొక్కల పంపిణీకి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, డ్వామా పీడీ ఎన్వీ శివప్రసాద్, కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉష, జిల్లా అటవీ శాఖ అధికారి సునీత, నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫణి ధూర్జటి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జి.రమేష్, దేవదాయ, సాంఘిక సంక్షేమ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. గుర్తు తెలియని వృద్ధురాలు మృతి మోపిదేవి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు కృష్ణా జిల్లా మోపిదేవిలో 216 జాతీయ రహదారిపై ఎస్.విహార్ సమీపంలో ఆదివారం రోడ్డు దాటుతుండగా సుమారు 65 సంవత్సరాల వయస్సు గల వృద్ధ మహిళను ద్విచక్ర వాహనం ఢీకొన్నట్లు తెలిపారు. గాయపడిన వృద్ధురాలు మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు వివరించారు. మృతి చెందిన వృద్ధురాలిని గుర్తుపట్టిన వారు సమాచారం పోలీస్ స్టేషన్లో ఇవ్వవలసిందిగా ఎస్ఐ సత్యనారాయణ కోరారు. -
నేరస్తులకు కచ్చితంగా శిక్షలు పడాలి
వర్క్‌షాప్‌లో కృష్ణా ఎస్పీ గంగాధరరావు కోనేరుసెంటర్: నేరాలకు సంబంధించిన దర్యాప్తుల్లో నేరస్తులు శిక్షల నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి అవకాశం లేకుండా పోలీసుల దర్యాప్తు ఉండాలని ఎస్పీ ఆర్. గంగాధరరావు సూచించారు. దర్యాప్తులో నేరాలకు సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలను సంపూర్ణంగా సేకరిస్తేనే అది సాధ్యపడుతుందని ఆ దిశగా అధికారులు, సిబ్బంది దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ కేసులకు సంబంధించిన దర్యాప్తు చేసే అధికారులకు ఫారెన్సిక్ ఎవిడెన్స్ సేకరించడం, సంరక్షించడం, టెస్టింగ్‌కు పంపే సమయం, ప్యాకింగ్‌లో పాటించవలసిన అంశాలపై ప్రత్యేక నిపుణులతో ఒకరోజు వర్క్ షాప్‌ను నిర్వహించారు. జిల్లా పోలీసు సమావేశపు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి పోలీస్ అధికారికి ఏదో ఒక రూపంలో సవాలు ఎదురవుతూనే ఉంటుందన్నారు. నేరానికి దారి తీసిన అంశాలను తెలుసుకునేందుకు ప్రతి పోలీసు అధికారి సంపూర్ణ నిష్ణాతుడై ఉండాలన్నారు. ఈ సదస్సులో నేర్చుకున్న ప్రతి అంశం దర్యాప్తు వేగవంతంగా పూర్తి కావటానికి, నేరస్తులకు వీలైనంత త్వరగా శిక్షపడేలా చేయడానికి, సహాయపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో అడ్మిన్ వి.వి నాయుడు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్. శ్రీలత, అసిస్టెంట్ డైరెక్టర్లు ఎస్.వీర కుమారి, జె. సత్యరాజు, సైంటిఫిక్ ఆఫీసర్ కె. సురేంద్రబాబు, మెడికల్ ఆఫీసర్ డి.హుమేరా జుబేదా ఖానం తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి సమస్యను పరిష్కరిస్తాం
కోనేరుసెంటర్: మీకోసం కార్యక్రమంలో అందిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను సానుకూలంగా ఆలకించిన ఎస్పీ ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధైర్యపడొద్దు...ప్రతి ఒక్కరికీ పోలీసులు అండగా ఉంటారంటూ భరోసా కల్పించారు. స్టేషన్ల వారీగా అందిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఫిర్యాదుదారుల మన్ననలు పొందేందుకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. అర్జీదారులతో అమర్యాదగా మాట్లాడినా, సూటిబోటి మాటలతో అవమానించినా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరితోనూ అభిమానంగా మాట్లాడాలని, వారి సమస్యను మన సమస్యగా భావించాలని, ఏ ఒక్కరు అసహనంతో వెనుతిరిగి వెళ్లకూడదని, ఆ విధంగా పోలీసులు పనిచేయాలని ఉద్బోధించారు. ప్రధానమైన అర్జీలు : సోమవారం జరిగిన మీకోసంలో 41 ఫిర్యాదులను ఎస్పీతో పాటు ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ అందుకున్నారు. ● గూడూరు నుంచి వెంకయ్య అనే వృద్ధుడు తన ఇద్దరు కుమారులు వృద్ధాప్యంలో ఉన్న తామిద్దరికీ భోజనం పెట్టకుండా, వైద్య ఖర్చులు, మందులకు డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, వ్యవసాయ పొలం తాలూకు కౌలు డబ్బులు కూడా తీసుకుని ఇబ్బంది పెడుతున్నారని, న్యాయం చేయమని ప్రాధేయపడ్డాడు. ● గుడివాడ నుంచి పుష్ప అనే మహిళ తనకు వివాహం జరిగే నాటికి తన భర్తకు చెడు వ్యసనాలు ఉన్నాయని, ఈ సంగతిని దాచి పెట్టి వివాహం జరిపించారని, ఇటీవల పూటుగా మద్యం తాగుతూ మానసికంగా, శారీరకంగా హింసలకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. బయట వ్యక్తుల దగ్గర అప్పులు చేస్తూ వారి నుంచి తనకు ప్రాణ హాని కలిగేలా చేస్తున్నాడని తనకు రక్షణ కల్పించి న్యాయం చేయమని కోరింది. ● చల్లపల్లి నుంచి కుమారి అనే వివాహిత వచ్చి తనకు వివాహం జరిగి 7 సంవత్సరాలు అవుతోందని, ఒక కుమార్తె జన్మించిందని, అప్పటినుంచి తన భర్త మితిమీరిన అనుమానంతో తీవ్ర వేధింపులకు గురి చేస్తూ పుట్టింటికి పంపించేశాడని, కనీసం కుమార్తెను బతికించుకోవడానికి డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని వాపోయింది. ఉద్యోగానికి వెళ్దామన్నా సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఎటువంటి ఆధారం లేకుండా చేస్తున్నాడని న్యాయం చేయమని వేడుకుంది. బాధితుల సమస్యలు ఆలకించిన ఎస్పీ చట్ట పరిధిలో ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మీకోసంలో అర్జీలు స్వీకరించిన జిల్లా ఎస్పీ అర్జీల పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు -
సకాలంలో సంతృప్తికర పరిష్కారమే లక్ష్యం
గుడివాడరూరల్: ప్రజల నుంచి వచ్చే అర్జీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. గుడివాడ ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారం మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలసి ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 58 అర్జీలు వచ్చాయని ఆర్డీవో కార్యాలయ అధికారులు తెలిపారు. సమావేశంలో ఆర్డీవో జి.బాలసుబ్రహ్మణ్యం, మునిసిపల్ కమిషనర్ మనోహర్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. ● గుడివాడ మండలం మోటూరు గ్రామంలోని పంచాయతీ మంచినీటి చెరువులో ఎటువంటి ఆమోదం లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారని గ్రామానికి చెందిన గంటా శ్రీను కలెక్టర్‌కు అర్జీ అందజేశారు. ● పట్టణంలోని 30వ వార్డు ధనియాలపేట కాలనీలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ విచ్చలవిడిగా సంచరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని కళింగ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మజ్జాడ నాగరాజు, ఆ కాలనీ మహిళలతో కలసి కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు. ● గుడివాడ మండలం మోటూరు గ్రామానికి చెందిన వనం విజయశాంతి, కె.స్వప్న తాము బీసీ కాలనీలో నివసిస్తున్నామని, ఇంటిపై విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. వీటి వల్ల కొన్నేళ్ల క్రితం ఇద్దరు టాపీ కార్మికులు చనిపోయారని వివరించారు. ఇది అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని కలెక్టర్‌కు విన్నవించారు. అర్జీదారుల ఇబ్బందులు.. ఆర్డీవో కార్యాలయం వద్ద మీకోసం కార్యక్రమాన్ని ఉదయం 10.30గంటలకు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొంటారని ముందుగానే అధికారులు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి అర్జీదారులు 10.30గంటలకే రాగా.. కలెక్టర్ రెండున్నర గంటల పాటు ఆలస్యంగా రావడంతో అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తొలుత తాగడానికి నీరు కూడా లేకపోవడంతో అర్జీదారులు అధికారులను ప్రశ్నిస్తే అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. ‘మీకోసం’లో కలెక్టర్ బాలాజీ -
ఉత్తమ ప్రదర్శనగా ‘27వ మైలురాయి’
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలం కొలకలూరులో కొలంకపురి నాటక కళాపరిషత్, శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి 11వ ఆహ్వాన నాటికల పోటీల్లో యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్, విజయవాడ వారి ‘27వ మైలురాయి’ నాటిక ఉత్తమ ప్రదర్శన బహుమతిని అందుకుంది. ఇదే నాటికలో వైదేహి పాత్రలో నటించిన ప్రముఖ రంగస్థల, టీవీ, సినీ నటి సురభి ప్రభావతి ఉత్తమ నటిగా, రాజన్న పాత్రధారి పవన్‌కుమార్ ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా, నాటిక రచయిత పీటీ మాధవ్ ఉత్తమ రచయిత బహుమతులను అందుకున్నారు. మూడు రోజులపాటు జరిగిన నాటికల పోటీల్లో విజేతలకు చివరి రోజైన ఆదివారం రాత్రి బహుమతులను అందజేశారు. ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా చైతన్య కళాస్రవంతి, విశాఖపట్నం వారు ప్రదర్శించి ‘అసత్యం’ నాటిక ఎంపికై ంది. ఇదే నాటికకు మరో నాలుగు బహుమతులు దక్కటం విశేషం. రఘుపతి పాత్రధారి వై.అనిల్‌కుమార్ ఉత్తమ ప్రతినాయకుడు, నాటిక దర్శకుడు పి.బాలాజీనాయక్‌కు, సంగీతాన్ని అందించిన పి.లీలామోహన్కు ఉత్తమ సంగీతం, ఉత్తమ లైటింగ్‌కు థామస్ బహుమతులను అందుకున్నారు. తృతీయ ఉత్తమ ప్రదర్శనగా విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ వారి ‘స్వేచ్ఛ’ నాటిక ఎంపికై ంది. ఇదే నాటికలో నటించిన గోవాడ వెంకట్ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. న్యాయనిర్ణేతలుగా ఆంజనేయులు నాయుడు (పొన్నూరు), చలసాని కృష్ణప్రసాద్ (విశాఖపట్నం), మానాపురం సత్యనారాయణ (పాలకొల్లు) వ్యవహరించారు. -
జిల్లా స్థాయి ‘మీ కోసం’లో 126 అర్జీలు స్వీకరణ
చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్లోని సమావేశపు హాలులో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొలుత జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ పథకానికి సంబంధింఛి జిల్లాలో ఎనిమిది గ్రామాల్లో ఈ నెల 10వ తేదీన ప్రత్యేక శిబిరాలు నిర్వహించి అప్పటికప్పుడే దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలు అందిస్తామన్నారు. కోర్టు కేసుల్లో అప్రమత్తంగా ఉండాలి.. కోర్టు కేసులకు సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి కోర్టులు అడిగిన సమాధానాన్ని కౌంటర్ రూపంలో దాఖలు చేయాలన్నారు. అత్యవసర కేసులు ఉంటే వాటిపై ప్రత్యేక దృష్టిసారించి కోర్టు ఏమి అడిగింది, దానికి ఏ విధమైన సమాధానం చెప్పాలో ప్రభుత్వ న్యాయవాదులను సంప్రదించి ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు 126 అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు. -
సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
గుడివాడరూరల్: నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గుడివాడ మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావులతో కలసి నియోజక వర్గంలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ప్రధానంగా తాగునీటి సమస్య, ఉపాధి హామీ పథకం పనులు, ఇరిగేషన్, డ్రైనేజీ, వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్థక, రహదారులు, భవనాలు పీఎం సూర్యఘర్, ఇళ్ల నిర్మాణాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలోని దనియాలపేటతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందని, ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించాలని ఆదేశించారు. గుడివాడ టిడ్కో గృహ సముదాయంతో పాటు నందివాడ, గుడ్లవల్లేరు, గుడివాడ మండలాల్లో తాగునీటి సమస్య ఉందని ఎమ్మెల్యే రాము కలెక్టర్‌కు వివరించగా ఆ శాఖ అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. తాగునీటి సమస్యపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మాత్రం పనితీరు మార్చుకోవడం లేదని, తీరు మార్చుకుని పని చేయాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. నియోజక వర్గంలో గృహ నిర్మాణ పనులపై ఆ శాఖ అధికారులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సిమెంటు, ఇనుము, ఇసుక వంటి సామగ్రి అందుబాటులో ఉన్నప్పటికీ పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని గృహ నిర్మాణ శాఖ ఈఈ రామోజీనాయక్ను కలెక్టర్ ప్రశ్నించారు. పనితీరు మార్చుకుని వీలైనంత త్వర గా నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ బిల్లుల ఖ ర్చులను తగ్గించుకునేందుకు పీఎం సూర్యఘర్ కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ప్రజలందరూ వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూ చించారు. సమావేశంలో ఆర్డీవో జి.బాలసుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ ఎస్.మనోహర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నటరాజన్, ఆర్అండ్బీ ఈఈ లోకేష్, పశు సంవర్థకశాఖ జిల్లా అధికారి నరసింహు లు, ఏపీ ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ పార్థసారథి, కూటమి నాయకులు బూరగడ్డ శ్రీకాంత్, యలవర్తి శ్రీనివాసరావు, దింట్యాల రాంబాబు, వా సే మురళి, కర్రే వెంకటగిరి, గోవాడ శివ, అన్ని ప్ర భుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి ఎమ్మెల్యే రాముతో కలసి అధికారులతో సమీక్ష -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళల దుర్మరణం
మూలపాడు(ఇబ్రహీంపట్నం): రెక్కాడితే గాని డొక్కాడని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగింది. సేకరించిన వివరాల మేరకు.. ఇబ్రహీంపట్నంకు చెందిన తొమ్మిది మంది మహిళా వ్యవసాయ కూలీలు సమీపంలోని కేతనకొండ గ్రామంలో మిరపకాయల కోతకు వెళ్లేందుకు ఆటోలో బయలుదేరారు. మూలపాడు నుంచి రాంగ్రూట్లో కేతనకొండ వైపు ఆటో వెళ్తున్న క్రమంలో జెడ్పీ పాఠశాల సమీపంలో హైదరాబాద్ వైపు నుంచి ఎదురుగా వస్తున్న వాహనం కూలీల ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కూలీలు పదిమీటర్ల దూరంలో గాల్లోకి ఎగిరి చెల్లాచెదురుగా పడ్డారు. వారిలో వేల్పుల మరియమ్మ(45), భూక్యా దుర్గ(49) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడిన మూఢావత్ గౌరి పరిస్థితి విషమంగా ఉంది. కన్నెగంటి స్వప్న, వేల్పుల మరియమ్మ, చింత వసంత, షేక్ మౌలాబీ, వెంకటకుమారి, తుపాకుల దుర్గ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వేల్పుల మరియమ్మ, భూక్యా దుర్గ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ చంద్ర శేఖర్ తెలిపారు. కూలీల ఆటోను ఢీకొట్టిన కారు మరో ఏడుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఘటన -
తిరుపతమ్మ ఆలయానికి ట్రాక్టర్ ట్రక్కు బహూకరణ
పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయానికి సోమవారం పెనుగంచిప్రోలుకు చెందిన కర్ల భాస్కరరావు, పద్మావతి దంపతుల కుమారులు కర్ల రామకృష్ణారావు, వసుంధర దంపతులు, కర్ల శ్రీనివాసరావు, పద్మావతి దంపతులు రూ.2.50లక్షల విలువైన ట్రాక్టర్ ట్రక్కును బహూకరించారు. గతంలో వీరు ఆలయానికి రూ.10 లక్షల విలువైన ట్రాక్టర్‌ను కూడా అందించారని అధికారులు తెలిపారు. ఆలయ అధికారులు దాతలను అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాలతో సత్కరించారు. ఈఓ కిషోర్‌కుమార్, ఆలయ డైరెక్టర్ బెజవాడ శ్రీనివాసరావు పాల్గొన్నారు. 8 నుంచి చెస్ ఉచిత శిక్షణ శిబిరం విజయవాడస్పోర్ట్స్: ప్రభుత్వ, మునిసిపల్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు గ్లోబల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల ఎనిమిదో తేదీ నుంచి చెస్ ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఆ అకాడమీ కార్యదర్శి షేక్ ఖాసీం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొగల్రాజపురంలోని సిద్ధార్థ అకాడమీ పక్కనే ఉన్న తమ అకాడమీలో జూన్ ఎనిమిదో తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు 98495 14138 నంబరును సంప్రదించి, పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. గుంటూరు జీజీహెచ్ సిబ్బందికి మెమోలు గుంటూరు జీజీహెచ్: గుంటూరు జీజీహెచ్‌లో సోమవారం అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆకస్మిక తనిఖీలు చేశారు. తొలుత గతంలో నర్సింగ్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన ఆషా సజనిపై వచ్చిన ఆరోపణలపై విచారణ నిర్వహించారు. అనంతరం ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్లో తనిఖీలు చేసి, ఆపరేషన్ థియేటర్లో సక్రమంగా ఓటీ డ్రస్సులు ధరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసి సంబంధిత వైద్య సిబ్బంది, వైద్యులకు మెమోలు జారీ చేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణను ఆదేశించారు. మార్చురీ విభాగంలో తనిఖీలు చేశారు. లిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మనోజ్ మార్చురీ విభాగంలో విధులు నిర్వర్తిస్తుండటంతో అతని ని అక్కడి నుంచి తొలగించాలని ఆదేశించారు. వైద్య విద్యార్థులకు మార్చురీ విభాగంలో క్లినికల్ తరగతులు నిర్వహించేందుకు వసతులు పరిశీలించారు. నాట్కో క్యాన్సర్ సెంటర్ విభాగంలో వైద్యులు, వైద్య అధికారులతో సమావేశం నిర్వహించి ఆస్పత్రి అభివృద్ధిపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంఈ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, నర్సింగ్ రిజిస్ట్రారు సుశీల తదితరులు ఉన్నారు. దక్షిణ భారత టెన్నిస్ బాల్ క్రికెట్ చాంప్ రన్నర్‌గా ఏపీ విజయవాడస్పోర్ట్స్: దక్షిణ భారత టెన్నిస్ బాల్ క్రికెట్ అండర్–14 బాలుర చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర జట్టు రన్నరప్ ట్రోఫీని కై వసం చేసుకుందని ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్.డి. ప్రసాద్ తెలిపారు. నెల్లూరులో ఇటీవల ఈ పోటీల్లో రాష్ట్ర జట్టు అత్యంత క్రీడా నైపుణ్యం ప్రదర్శించిందన్నారు. ప్రతిష్టాత్మకమైన పోటీ ల్లో ట్రోఫీ సాధించిన జట్టును ఆయన అభినందించారు. ఇదే క్రీడా స్ఫూర్తితో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లోనూ రాణించి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. ట్రోఫీ సాధించిన జట్టును ఎన్టీఆర్ జిల్లా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకృష్ణ, కె.ఎస్.స్వామి అభినందించారు. రేపటి నుంచి తిరుకల్యాణోత్సవాలు వేదాద్రి(జగ్గయ్యపేట): వేదాద్రి గ్రామంలో వేంచేసియున్న శ్రీ యోగానంద లక్ష్మినరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. 14వ తేదీ వరకు జరిగే కల్యాణోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కల్యాణ మహోత్సవాలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చలువ పందిళ్లు వేశారు. -
నష్టం పోతున్నాం..
డ్రెయిన్లు, కాలువల్లో సకాలంలో పూడికతీత పనులు చేయకపోవడంతో పంట పొలాలు నీట మునిగిపోతున్నాయి. చేయాల్సిన సమయంలో పూడిక తీత పనులు చేయకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మకై ్క పనులు చేయకుండా బిల్లులు చేయించేసుకుంటున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. –శ్రీనివాసరావు, రైతు గుడివాడ పూడికతీతీ వెంటనే చేపట్టాలి ప్రధాన కాలువలు, అనుబంధ కాలువలు అన్నీ గుర్రపు డెక్కతో నిండిపోయాయి. మట్టి మేట వేసుకుపోయి వాటి నుంచి సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వేసవిలో కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టకపోతే ఖరీఫ్ నాటికి భూములకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బంది నెలకొంటుంది. – నెరుసు నాని, రైతు ఉప్పులూరు ● -
పని ఒత్తిడితో ఉక్కిరి బిక్కిరి
లబ్బీపేట(విజయవాడతూర్పు): పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వార్డు సచివాలయ ఏఎన్ఎంలు పని ఒత్తిడితో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్వేలు, కార్యక్రమాలతోనే తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుండగా, మరోవైపు మునిసిపల్ అధికారులు ఆ పన్ను వసూళ్లు, ఈ పన్ను వసూళ్లు అంటూ సంబంధం లేని పనులు చెబుతుండటంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ప్రతి సచివాలయంలో ఒక్కో ఏఎన్ఎం విధులు నిర్వహిస్తున్నారు. విజయవాడలో నిత్యం ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకూ పనిచేసినా వారికిచ్చిన టార్గెట్లు పూర్తికావడం లేదు. దీంతో ఇదేమి ఖర్మ అంటూ తమను తామే నిందించుకుంటున్నారు. తమను వైద్యశాఖకే పరిమితం చేయాలంటూ వేడుకుంటున్నారు. నిముషం తీరిక లేక.. ప్రస్తుతం ఏఎన్ఎంలకు దాదాపు 30 రకాల యాప్‌లు ఇచ్చారు. వాటిలో నిత్యం సమాచారాన్ని నిక్షిప్తం చేయాల్సి ఉంది. ఒక్కోసారి నెట్వర్క్ పనిచేయక చికాకు తెప్పిస్తోంది. గర్భిణుల గుర్తింపు, హైరిస్క్ గర్భిణుల పర్యవేక్షణ, డ్రైడే ఫ్రైడే, ఆశ డే, వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ వంటి వాటితో పాటు, ఎన్సీడీ–సీడీ సర్వే ప్రతిరోజూ ఇంత మందిని చేయాలని నిర్ణయించారు. ఒక్కొక్కరినీ రెండు వందల ప్రశ్నలు అడిగి యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా ఒక్కొక్కరికీ 45 నిముషాల వరకూ సమయం పడుతుంది. కుటుంబంలో ముగ్గురు, నలుగురు ఉంటే అక్కడే రెండు గంటల సమయం సరిపోతుంది. దీంతో మిగిలిన కార్యక్రమాలు చేయలేక పోతున్నారు. మునిసిపల్ అధికారుల వేధింపులు.. వైద్యశాఖ కార్యక్రమాలతోనే ఏఎన్ఎంలు ఉక్కిరి బిక్కిరి అవుతుంటే, మరోవైపు మునిసిపల్ అధికారులు సైతం సచివాలయ ఏఎన్ఎంలకు పలు పనులు అప్పగిస్తున్నారు. ప్రతిరోజూ గంట పాటు వారితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ టార్గెట్లు పెడుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పన్ను వసూళ్లు కూడా తామే చేయాలంటున్నారంటూ చెబుతున్నారు. ఈ ఉద్యోగం తాము చేయలేమంటూ ప్రత్యామ్నాయం చూసుకుంటున్న వారు ఉంటున్నారు. పట్టణ ప్రాంత ఏఎన్ఎంల ఆవేదన ఒకవైపు సర్వేలు, మరోవైపు పన్ను వసూళ్లు అసలు తాము ఎవరి పరిధిలో పని చేస్తున్నామో తెలియడం లేదంటున్న ఏఎన్ఎంలు విజయవాడలో ఓ ఏఎన్ఎంకు వేధింపులు వైద్యశాఖకే పరిమితం చేయాలి.. ప్రస్తుతం ఏఎన్ఎంలు విధుల్లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. వారికి అనేక రకాల యాప్‌లు ఇచ్చి వాటిలో సమాచారం అప్లోడ్ చేయమంటున్నారు. అంతేకాదు మునిసిపాలిటీల్లో పనిచేసే ఏఎన్ఎంలకు వారి పనులు కూడా చెప్పడంతో మరింత ఒత్తిడితో సతమతం అవుతున్నారు. ఏఎన్ఎంలను వైద్యశాఖ పరిధిలోనే పనిచేసేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి. – అంగిరేకుల దుర్గాప్రసాద్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఇవే నిదర్శనం.. బాపట్ల జిల్లా రేపల్లెలో వార్డు సచివాలయ ఏఎన్ఎం పని ఒత్తిడి తట్టుకోలేక పోతున్నానని, ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోందంటూ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఉదయం6 నుంచి రాత్రి 10 గంటల వరకూ విధులేనంటూ ఆమె డెత్‌నోట్‌లో పేర్కొంది. విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతంలో పనిచేసే ఏఎన్ఎం తమకిచ్చిన టార్గెట్ పూర్తి కాక పోవడంతో రాత్రి 8 గంటల సమయంలో కూడా ఎన్సీడీ– సీడీ సర్వే కోసం ఓ ఇంటికి వెళ్లింది. ఈ సమయంలో సర్వేలు ఏమిటీ పనిపాట లేదా అంటూ ఒకరు అసభ్యంగా మాట్లాడటంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇలా నిత్యం ఏఎన్ఎంలు పని ఒత్తిడితో పాటు, టార్గెట్లు రీచ్ అయ్యే క్రమంలో అవమానాలకు గురవుతూనే ఉన్నారు. -
ఆర్టీసీ డ్రైవరు, కండక్టరుపై దాడి
బంటుమిల్లి: గుడివాడ ఆర్టీసీ బస్సు డ్రైవరు, కండక్టరుపై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. 20 రోజుల క్రితం డ్రైవరు బస్సు ఆపకుండా వెళ్లడంతో ప్రయాణికులు, డ్రైవరు మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ రోజు డ్రైవరు మద్దా నాగరాజుతో గొడవపడ్డ బంటుమిల్లికి చెందిన సోమిశెట్టి వెంకటనారాయణ తన స్నేహితులు దాసు శ్రీనివాసరావు, రాఘవరపు సతీష్‌లతో కలసి స్థానిక ఆంధ్రబ్యాంకు సెంటర్లో బస్సును అడ్డుకుని డ్రైవరు నాగరాజుపై దాడి చేశారు. ఈ గొడవను వీడియో తీస్తున్న కండక్టరు పర్వతనేని శ్రీదేవీని కూడా అసభ్యంగా బూతులు తిట్టి దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనతో సెంటర్లో ఇరువైపుల ట్రాఫిక్ స్తంభించింది. ఎస్ఐ గణేష్‌కుమార్ సంఘటన స్థలం వద్దకు చేరుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ సమస్య పరిష్కరించారు. పెడన మండలం, ఉరిమి గ్రామానికి చెందిన డ్రైవరు మద్దా నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటనారాయణ, శ్రీనివాసరావు, సతీష్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నారు. -
ఘనంగా పంచరత్న కృతుల గోష్టిగానం
విజయవాడ కల్చరల్ : సద్గురు త్యాగరాజ స్వామి జయంతి సందర్భంగా దుర్గాపురంలోని శివరామకృష్ణ క్షేత్రంలో నిర్వహిస్తున్న సంగీతోత్సవాలు ఆదివారం ముగిసాయి. త్యాగరాజ స్వామి రచించిన ఘనరాగ పంచరత్న కీర్తనలను సంగీత విద్వాంసులు, యువ సంగీత కళాకారులు ఆలపించారు. జగదానందకారక, దుడుగల నన్నే, సాధించెనే ఓ మనసా, కనకన రుచిరా, ఎందరో మహానుభావులను మధురంగా ఆలపించారు. మల్లాది సూరిబాబు, మల్లాది సోదరులు, గౌరీనాథ్, గాయత్రి గౌరీనాఽథ్, శ్రీరాం చరణ్ , మోదుమూడి సుధాకర్ అంజనా సుధాకర్ , ఎన్సీహెచ్ కృష్ణమాచార్యులు, చిట్టాకార్తీక్, విష్ణుభొట్ల సొదరీమణులు, లంకా తేజస్విని, మల్లాది కార్తీక త్రివేణి, చారుమతి పల్లవితోపాటు 200 మంది సంగీత విద్వాంసులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నాట్యాచార్యుడు చింతారవి బాలకృష్ణ బృందం కూచిపూడి సంప్రదాయంలో త్యాగరాజ స్వామికి నృత్య నీరాజనాలు సమర్పించారు.ముగిసిన త్యాగరాజ స్వామి జయంతి ఉత్సవాలు -
గుర్రంపై గంజాయి తరలింపు
వత్సవాయి :గుర్రంపై గంజాయి అమ్మకాన్ని వత్సవాయి పోలీసులు గుట్టరట్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తెలంగాణలోని వేరే ప్రాంతాల నుంచి గంజాయిను గుర్రం మీద తీసుకొస్తారు. గుర్రంపై ఉన్న సంచుల్లో గంజాయి ప్యాకెట్లను వేసుకుని వస్తారు. గుర్రం మీద ఒకరు... గుర్రాన్ని అనుసరిస్తూ మరొకరు బైక్‌పై వస్తారు. అయితే అప్పుడుప్పడు గుర్రం వత్సవాయి ఎస్సీ కాలనీకి రావడాన్ని గమనించిన కొందరు అనుమానంతో పోలీసులకు రహస్యంగా సమాచారం అందించారు. శనివారం రాత్రి సమయంలో ఎస్సీ కాలనీ వద్ద గుర్రాన్ని నిలిపి కొందరు యువకులు మాట్లాడుకుంటుండగా పోలీసులు దాడిచేసి వారిని పట్టుకున్నారు. దీంతో గుర్రంపై నున్న సంచిలో గంజాయి ప్యాకెట్లు ఉండడాన్ని గమనించి వెంటనే గుర్రంతోపాటు నంబర్‌లేని బైక్, వత్సవాయికి చెందిన ఇద్దరు యువకులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. అయితే గుర్రాన్ని తీసుకొని వచ్చిన కొందరు యువకులు మాత్రం పరారయ్యారు. ఎస్ఐ పి. ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిడుగుపడి యువకుడి మృతి కోసూరు(మొవ్వ): ఉపాధి కోసం పని మాట్లాడుకోవడానికి వెళ్తూ పిడుగుపడి యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాతంగి సుప్రదీప్ (22) వెల్డింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. పని మాట్లాడుకోవడానికి తన మిత్రుడు పాగోలు అనిల్ కుమార్‌తో కలిసి బైక్ మీద బాపట్ల జిల్లా కొల్లూరు ప్రయాణమయ్యాడు. వీరు కోసూరు నుంచి కొడాలి మీదగా శ్రీకాకుళం కృష్ణానదిలోని బాట నుంచి వెళుతుండగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులు వచ్చి బైక్ వెళ్తున్న సుప్రదీప్పై పిడుగు పడింది. ఈ ఘటనలో సుప్రదీప్ సంఘటన స్థలంలోనే మృతి చెందగా అనిల్ కుమార్‌కు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమీపంలో ఉన్న వారు 108కు సమాచారం అందించగా వారు వచ్చి సుప్రదీప్ మృతి చెందాడని నిర్దారించి అనిల్ కుమార్‌ను ఆసుపత్రికి తరలించారు. కాగా సుప్రదీప్ మృతి వార్త తెలుసుకోవటంతో ఒక్కసారిగా కోసూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడు రెండు సంవత్సరాల క్రిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఏడాది వయస్సు ఉన్న కుమారుడు ఉన్నాడు. -
చిన్నారిని చిదిమేసిన కారు
పామర్రు: కారు ఢీకొని ఏడాదిన్నర చిన్నారి దుర్మరణం చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... డోకిపర్రుకు చెందిన ఉప్పలపాటి దుర్గారావు, హారిక దంపతులు తమ కుమార్తె హన్వికను ఒడిలో కూర్చు బెట్టుకుని బైక్‌పై పామర్రు నుంచి గుడివాడ జాతీయ రహదారిలో వస్తున్నారు. కొండాయపాలెం వద్దకు చేరుకోగానే అదే రహదారిలో మచిలీపట్నం నుంచి గుడివాడ వెళ్తున్న కారు బైక్‌ను ఓవర్ టేక్ చేస్తూ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై నున్న వాళ్లు కింద పడిపోయారు. వారిని కారు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దుర్గారావు, హారికతో పాటు చిన్నారి హన్వికకు తీవ్ర గాయాలయ్యాయి. హాస్పటల్‌కు తీసుకెళ్తుండగా హన్విక మార్గ మధ్యలో మృతి చెందింది. దంపతులకు పామర్రులోని వైద్యశాలకు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ సంఘటనలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న సిమెంట్ స్తంభాన్ని సైతం ఢీకొట్టింది. కారులో డ్రైవర్, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కలగానే చింతలపూడి ఎత్తిపోతల!
తిరువూరు: చింతలపూడి ఎత్తిపోతల పథకం కలగానే మిగిలేలా ఉంది. ఏళ్లు గడుస్తున్నా పనులు ముందుకు సాగకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం సాగర్ జలాల సరఫరా అరకొరగా ఉండటంతో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు ప్రత్యామ్నాయంగా చేపట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకం ఏళ్లు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. 2009లో రూ.5వేల కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టు మొదటిదశ పనులను ప్రారంభించారు. ఈ పనులు పూర్తికాకముందే 2017లో మళ్లీ టీడీపీ ప్రభుత్వం మరో రూ.3వేల కోట్లతో రెండో దశ పనులకు శ్రీకారం చుట్టింది. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని విస్తరించి సాగర్ ఆయకట్టులో ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా నీటి సదుపాయం కల్పించడానికి రెండో దశను చేపట్టారు. పిట్టలవారిగూడెం నుంచి వేంపాడు మేజరుకు గోదావరి జలాలను తెచ్చి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి సాగర్ ప్రధాన కాలువకు సరఫరా చేయడం ఈ పథకం ఉద్దేశం. 2028 నాటికి చింతలపూడి ఎత్తిపోతల పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు పలుమార్లు చెబుతున్నా పనులు మాత్రం ప్రారంభం కాలేదని రైతులు వాపోతున్నారు. 8 సంవత్సరాలుగా పూర్తికాని పనులు మెట్టప్రాంత రైతులు సాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాధార పంటలు సాగుచేయడం, బోర్లకింద ఆరుతడి పంటలు వేయడంతో ఏడాదికి ఒక పంటకే పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది. రానున్న 2, 3 సంవత్సరాల్లో సాగునీటి కొరత తీవ్రతరమయ్యే అవకాశం ఉన్నందున త్వరితగతిన చింతలపూడి రెండోదశ ఎత్తిపోతల పూర్తిచేసి సాగర్ కాలువలకు గోదావరి జలాలను సరఫరా చేయాలని కోరుతున్నారు. సాగర్ జలాలకు ప్రత్యామ్నాయంగా ప్రతిపాదన ప్రకటనలకే పరిమితం ఉమ్మడి కృష్ణాలో ఐదు నియోజకవర్గాలకు ప్రయోజనం 18 మండలాలకు ప్రయోజనం.... చింతలపూడి ఎత్తిపోతల రెండో దశతో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 5 నియోజకవర్గాల్లోని 18 మండలాలకు సాగు, తాగునీటి కొరత తీర్చవచ్చని భారీ నీటిపారుదల శాఖ అంచనా వేసింది. ఉమ్మడి కృష్ణాలోని మైలవరం, తిరువూరు, గన్నవరం, నూజివీడు, నందిగామ నియోజకవర్గాల పరిధిలోని చాట్రాయి, ముసునూరు, విస్సన్నపేట, రెడ్డిగూడెం, మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీపట్నం, కంచికచర్ల, వీరులపాడు, గంపలగూడెం, తిరువూరు, ఏకొండూరు, నూజివీడు, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు, ఆగిరిపల్లి, విజయవాడ రూరల్ మండలాల్లో మెట్టభూములకు గోదావరి జలాలను సాగర్‌కు ప్రత్యామ్నాయంగా అందే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వేంపాడు మేజరు నుంచి 10 కిలోమీటర్ల కాలువ తవ్వి రామచంద్రాపురం రెగ్యులేటరు వద్ద నూజివీడు బ్రాంచి కాలువకు అనుసంధానం చేయడం ద్వారా మైలవరం బ్రాంచి కాలువకు, మాధవరం, బాపులపాడు, రేపూడి, గానుగపాడు మేజర్లకు గోదావరి జలాలను సరఫరా చేయాలని లక్ష్యంగా ఉంది. రెండోదశ పనుతో లక్ష ఎకరాలకుపైగా పంట భూములకు సాగునీటి సమస్య తీరుతుందని భావించి భారీ నీటిపారుదల శాఖ పనులకు ప్రతిపాదించింది. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
రెడ్డిగూడెం: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన రెడ్డిగూడెం మండల పరిధి కుదప గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొల్లమందల వెంకయ్య(60)కి అదే గ్రామానికి చెందిన బేతు నాగేసు, ఈదురుపాటి చిన్నబ్బాయికి గత కొన్ని రోజులుగా ఆర్థిక లావాదేవీల విషయమై వివాదం నెలకొంది. ఈ క్రమంలో వెంకయ్యపై నాగేసు, చిన్నబ్బాయి రెడ్డిగూడెం పోలీసు స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ నిమిత్తం వెంకయ్యను స్టేషన్‌కు రావాలని ఆదేశించారు. తాను ఎవ్వరి దగ్గర డబ్బులు అప్పు తీసుకోలేదని తాను స్టేషన్‌కు రావాల్సి అవసరం లేదని వెంకయ్య పోలీసులకు తెలిపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఆదివారం ఉదయం పొలంలోకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన వెంకయ్య తిరిగి ఇంటికి రాలేదు. ఈ సమయంలోనే రెడ్డిగూడెం ఎస్ఐతో పాటు కానిస్టేబుల్స్ సైతం వెంకయ్య కోసం ఇంటికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు వచ్చి వెళ్లిన తర్వాత మధ్యాహ్నం దాటినప్పటికీ వెంకయ్య ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామ శివారులోని పొలంలోకి వెళ్లి చూడగా వెంకయ్య శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. వెంకయ్య మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు వెంకయ్యకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
నూతన కార్యవర్గం ఎన్నిక
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ ఎంప్లాయీస్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ ఉమ్మడి కృష్ణాజిల్లా నూతన కార్యవర్గం ఎన్నికై ంది. ఆదివారం గాంధీనగర్‌లోని హనుమంతరాయ గ్రంథాలయంలో కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా కల్యాణ్ కుమార్(నూజివీడు), సెక్రటరీగా నాగ పద్మావతి(గన్నవరం), ట్రెజరర్‌గా నాగమణి(నూజివీడు), వైస్ ప్రెసిడెంట్‌గా మధుబాబు(గన్నవరం), కమిటీ సభ్యులుగా జయంతి(గుడివాడ), వందన(కృష్ణాజిల్లా), కిరణ్(ఎన్టీఆర్) ఎన్నుకున్నారు. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ రాజు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. -
నీట్‌గా.. ప్రశాంతంగా..
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): దేశ వ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)– 2025 ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 13,625మంది విద్యార్థులను కేటాయించగా అందులో 13,455 మంది హాజరయ్యారు. 98.75 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న ఈ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షను జిల్లాలో 28 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పరీక్ష కొనసాగింది. విద్యార్థులను 11.00 గంటల నుంచి పరీక్ష జరిగే ప్రాంగణాల్లోకి అనుమతించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కేంద్రాల ప్రధాన ద్వారాలను మూసివేశారు. అభ్యర్థుల హాల్‌టికెట్‌తో పాటుగా ఇతర గుర్తింపు కార్డుల ఉంటేనే లోపలకు అనుమతించారు. పొడవాటి దుస్తులు, బూట్లు, నగలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలించి అభ్యర్థులను లోపలకు అనుమతించారు. అనంతరం విద్యార్థులు బయోమెట్రిక్ పరిశీలన చేసి ఆ తదుపరి పరీక్ష గదిలోకి అనుమతించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఆయా పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. వారి వాహనాలతో పరిసర ప్రాంతాలన్నీ నిండిపోయాయి. మధ్యాహ్నం 1.30 గంటల వరకూ విద్యార్థుల తల్లిదండ్రులు గేట్ల వద్దనే నిలిచి ఉన్నారు. స్థానిక పోలీసు అధికారులు బందోబస్తు నిర్వహించటంతో పాటుగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూశారు. ఆలస్యంగా పేపరు.. మార్కాపురానికి చెందిన బి. మేఘన కిరణ్మయి అనే విద్యార్థికి సత్యనారాయణపురంలోని కేంద్రీయ విద్యాలయం పరీక్ష కేంద్రంగా కేటాయించారు. ఆమెకు బయోమెట్రిక్ హాజరుకు సంబంధించి సమస్య తలెత్తటంతో టాలీ కాలేదని, 2.00 గంటల తర్వాత టాలీ కావటంతో 2.13 నిమిషాలకు తనను పరీక్ష గదిలోకి అనుమతించినట్లు ఆమె పేర్కొంది. సుమారు 20 నిమిషాలు ఆలస్యంగా పేపర్ ఇచ్చారని, ఆ మేర అదనపు సమయం ఇవ్వకుండా పేపర్ తీసేసుకున్నారని ఆమె తన తండ్రి శ్రీనివాసగణేష్తో కలిసి ‘సాక్షి’కి వివరించింది. ఎంతో కష్టపడి చదివిన తన కుమార్తెకు తీవ్ర అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలంటూ తండ్రి పేర్కొన్నారు. దీనిపై జిల్లా కోఆర్డినేటర్ ఆదిశేషశర్మను వివరణ కోరగా అటువంటిదేమి లేదని, ఆమె అబద్ధం చెబుతున్నట్లు పేర్కొన్నారు. గాలివానతో అవస్థలు.. పరీక్షకు బయలుదేరిన విద్యార్థులు గాలివానతో తీవ్ర అవస్థలకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురవటంతో బస్సులు రాకపోకలకు సైతం ఇబ్బందులు తలెత్తాయి. తల్లిదండ్రులతో ద్విచక్ర వాహనాల్లో బయలుదేరిన విద్యార్థులు వర్షానికి తడిసిమముద్ధయ్యారు. అలాగే పదకొండు గంటల వరకూ పలు ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచి ఉండటంతో ఆటోలు, ఇతర సర్వీసులు అందుబాటులోకి రాలేదు. దాంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. జిల్లాలో 13,625 మందికిగాను 13,455 మంది హాజరు బయోమెట్రిక్ సమస్యతో ఒక విద్యార్థినికి ఆలస్యంగా పేపర్ జారీ అదనపు సమయం ఇవ్వలేదని ఆ విద్యార్థిని ఆరోపణ పరీక్ష నిర్వహణ తీరును పర్యవేక్షించిన కలెక్టర్ లక్ష్మీశ చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా వ్యాప్తంగా మూడు కేంద్రాల్లో నీట్ పరీక్ష జరిగింది. మచిలీ పట్నంలోని కేంద్రీయ విద్యాలయం, కృష్ణా విశ్వవిద్యాలయం కళాశాలతో పాటు గన్నవరంలోని వీఎస్ఎస్టీ జాన్స్ హైస్కూల్లో పరీక్ష నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఇన్విజిలేటర్ల నియామకంతో పాటు నోడల్ అధికారులు, సహాయ నోడల్ అధికారులను నియమించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశారు. పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 1096 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 1073 మంది విద్యార్థులు హాజరయ్యారు. 23 మంది విద్యార్థులు హాజరుకాలేదు. ఎస్పీ ఆర్ గంగాధరరావు కేంద్రీయ విద్యాలయం, కృష్ణా యూనివర్సిటీలోని కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను పరిశీలించి విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. కృష్నా జిల్లాలో 1,073 మంది హాజరు -
గాలి వానతో ఇబ్బందులు పడినా.. సజావుగానే పరీక్ష
కలెక్టర్ పరిశీలన.. విజయవాడలో జరిగిన నీట్ పరీక్షను కలెక్టర్ లక్ష్మీశ పరిశీలించారు. నగరంలోని పీఎస్సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని సందర్శించి, అభ్యర్థుల బయో మెట్రిక్ ధ్రువీకరణ ప్రక్రియను పరిశీలించారు. అదేవిధంగా పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, వీపీ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సిటీ కోఆర్డినేటర్, సెంటర్ సూపరింటెండెంట్, డెప్యూటీ సెంటర్ సూపరింటెండెంట్, అబ్జర్వర్లు, ఇన్విజిలేటర్లు అందరూ సమన్వయంతో పనిచేసి ప్రతిష్టాత్మక పరీక్షను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైనందుకు అభినందనలు తెలిపారు. -
ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు
మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ విద్యా విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) జిల్లాశాఖ దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా అధ్యక్షుడు అంబటిపూడి సుబ్రహ్మణ్యం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా మే 5న పాత తాలూకా కేంద్రాల్లో, మే 9న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మే 14న రాష్ట్ర స్థాయిలో భారీగా ధర్నా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రాథమిక పాఠశాలలు అంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకే అయినప్పటికీ, ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలలను ఏర్పాటు చేయడం విద్యావ్యవస్థలో గందరగోళానికి దారితీస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిషన్‌ను నియమించాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు భారీగా పాల్గొని నిరసన కార్యక్రమాల విజయవంతం చేయాలని ఆయన కోరారు. భగీరథ మహర్షిని స్ఫూర్తిగా తీసుకోవాలి చిలకలపూడి(మచిలీపట్నం): భగీరథ మహర్షి స్ఫూర్తితో జీవితంలో అనుకున్నది సాధించవచ్చని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో ఆదివారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తపస్సుతో గంగను దివి నుంచి భువికి దించిన భగీరథుడు పట్టుదలకు మారుపేరుగా నిలిచారన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చన్నారు. డీఆర్వో కె. చంద్రశేఖరరావు, కలెక్టరేట్ ఏవో సీహెచ్ వీరాంజనేయప్రసాద్, బీసీ సంక్షేమశాఖ అధికారులు, సగర కులసంఘ నాయకులు పాల్గొన్నారు. చదరంగంలో జస్వంత్, మోధిత సత్తా విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి అండర్–9 చెస్ పోటీల బాలుర విభాగంలో పి.జస్వంత్, బాలికల విభాగంలో వి.మోధితరెడ్డి విజేతలుగా నిలిచారు. విజయవాడ శివారు కానూరులోని స్కాట్స్‌పైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో గత రెండు రోజులుగా జరుగుతున్న పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. బాలుర విభాగంలో పి.జయసాకేత్ 6/7 పాయింట్లతో, బాలికల విభాగంలో వై.శ్రీనిఖిల 5.5/7 పాయింట్లతో రన్నర్లుగా నిలిచారు. 26 జిల్లాల నుంచి 134 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల బాల, బాలికల విభాగంలో టాప్–8 క్రీడాకారులకు రూ.40 వేల నగదు బహుమతిని మంజూరు చేశారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో మేజర్ కె.ఆర్.శేషాద్రిరావు, స్కాట్స్‌పైన్ స్కూల్ సీఈవో కొడాలి జాహ్నవి తదితరులు ట్రోఫీలు, నగదు బహుమతిని అందజేశారు. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశామని, జూన్‌లో హరియాణాలో జరిగే జాతీయ పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందని ఆంధ్ర చెస్ అసోసియేషన్ కార్యానిర్వాహక కార్యదర్శి, కృష్ణాజిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి ఎన్.ఎం.ఫణికుమార్ తెలిపారు. భక్తజన కోలాహలం మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానం ఆదివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. ఆదివారం ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. తెల్లవారుజాము నుంచి క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వర ప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్లను ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఆది దంపతులైన దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. భక్తుల తాకిడితో అంతరాలయ దర్శనం నిలిపివేసిన ఆలయ అధికారులు, భక్తులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. రూ.300, రూ.100 టికెట్లతో పాటు సర్వ దర్శనం క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం 6 గంటల నుంచే భక్తులతో క్యూలైన్లు నిండిపోగా, మహా మండపం వైపు నుంచి వచ్చే భక్తులను 5వ అంతస్తు వరకే లిఫ్టులో అనుమతించారు. అక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా భక్తులు కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తడిసి ముద్దయ్యారు.. ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఘాట్‌రోడ్డు మీదగా కొండపైకి చేరుకున్న భక్తులు వర్షంతో తడిసి ముద్దయ్యారు. వర్షం కురుస్తున్న తరుణంలో సర్వ దర్శనం క్యూలైన్లో ఉన్న భక్తులను టికెట్ల క్యూలైన్లోకి ఉచితంగా అనుమతించారు. వర్షంతో తప్పని ఇబ్బందులుఘాట్రోడ్డు మూసివేత.. ఆదివారం ఉదయం 8 గంటలకు భారీ వర్షం కురవడంతో దుర్గగుడి ఘాట్‌రోడ్డును ఆలయ అధికారులు మూసివేశారు. సుమారు గంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో కొండ రాళ్లు విరిగిపడే ప్రమాదం ఉందని దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులు భావించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఘాట్‌రోడ్డుపైకి ఎటువంటి వాహనాలను అనుమతించలేదు. ఉదయం 11గంటల తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడం, భక్తుల తాకిడి అనూహ్యంగా పెరగడంతో ఘాట్‌రోడ్డుపైకి దేవస్థాన బస్సులతో పాటు ద్విచక్ర వాహనాలను అనుమతించారు. సాయంత్రం వరకు దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. -
ముంచేసింది!
అంతటా అస్తవ్యస్తం.. Æ ఈడుపుగల్లులో చెట్లు కూలటంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఓ కారులో ప్రయాణిస్తున్న మున్నా అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానిక సంస్థల పర్యవేక్షణలో పొక్లెయిన్లు, కటింగ్యంత్రాలతో చెట్లను నరికించి రాకపోకలను పునరుద్ధరించారు. Æ పెడన, పెనమలూరు ప్రాంతాల్లో విద్యుత్ వైర్లపై చెట్లు కూలటంతో సుమారు 40 విద్యుత్‌స్తంభాలు నేల కూలాయి. ఆరు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం అయ్యాయి. Æ కంకిపాడు, పెనమలూరు, ఉయ్యూరు, గుడివాడ, బంటుమిల్లి, పెడన పరిసరాల్లోని ప్రధాన రహదారులు వెంబడి వర్షపునీరు నిలిచిపోయింది. Æ పెనమలూరు, కంకిపాడు ప్రాంతాల్లో రోడ్డు మార్జిన్లలో నిర్మించిన పాకలు నేలమట్టం అయ్యాయి. Æ కంకిపాడు, ఉయ్యూరు, గొడవర్రు రోడ్డు, ఈడుపుగల్లు పరిసరాల్లో భారీ వృక్షాలు నేలకూలటంతో రొయ్యూరు–గొడవర్రు, ఈడుపుగల్లు–ఉప్పలూరు, కంకిపాడు–విజయవాడ మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి. కంకిపాడు: గాలి వాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షానికి జిల్లా చిగురుటాకులా వణికింది. ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం పడింది. వర్షం కారణంగా కల్లాలు, ఖాళీ స్థలాల్లో నిల్వ చేసిన మొక్కజొన్న, ధాన్యం వర్షానికి తడిసిపోయాయి. కోతకు సిద్ధంగా ఉన్న మామిడి నేలరాలింది. జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం 8 గంటల వరకూ వాతావరణం సాధారణంగానే ఉన్నా, ఆ తర్వాత ఒక్కసారిగా కారుమబ్బులు కమ్మేశాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. అకాల వర్షం.. అన్నదాతకు ఎంతో కష్టం.. జిల్లా వ్యాప్తంగా 12,875 ఎకరాల్లో రబీ సీజన్లో వరి సాగు చేశారు. మొక్కజొన్న 11875 ఎకరాల్లో, మామిడి గన్నవరం పరిసర ప్రాంతాల్లో 10 వేల ఎకరాల్లో సాగు జరిగింది. ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కోత కోసిన ధాన్యం కల్లాలు, ఖాళీ స్థలాల్లో నిల్వ చేసి ఉంచారు. గోనె సంచులు, రవాణా వాహనాల కొరత కారణంగా గడిచిన వారం రోజులుగా ధాన్యం మిల్లులకు తరలకుండా నిలిచిపోయింది. దీంతో అధికారుల నిర్లక్ష్యంతో రాశులు, బస్తాల కెత్తి న ధాన్యం వర్షానికి తడిసిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. బస్తాల కెత్తిన ధాన్యం తిరిగి ఆరబోసి కాటా వేసేందుకు ఎకరాకు రూ. 5 వేలు పెట్టుబడి అదనంగా అవుతుందని, రాశుల మీద ఉన్న ధాన్యం పూర్తిగా ఆరబోసేందుకు ఎకరాకు రూ. 3వేలు పెట్టుబడులు అవుతాయని ఆవేదన చెందుతున్నారు. మద్దతు ధర, మార్కెట్లో మంచి ధర లభిస్తుందని ఆశించి కల్లాల్లో మొక్కజొన్న నిల్వ చేసుకున్న రైతులకు వర్షం నష్టం మిగిల్చింది. జిల్లాలో పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లోని గ్రామాల్లో 4 వేల ఎకరాల్లో పంట రైతుల వద్ద ఉన్నట్లు సమాచారం. తేమ కారణంగా మొక్కజొన్న గింజలు నలుపు రంగులోకి మారి ధర ఎంతకు పలుకుతుందో కూడా అర్థం కావటం లేదని ఆందోళన చెందుతున్నారు. గన్నవరం పరిసరాల్లోని సూరంపల్లి, గొల్లనపల్లి, మెట్టపల్లి, గోపువారిగూడెం, మాదల వారిగూడెం ప్రాంతాల్లో సాగులో ఉన్న 10 వేల ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లింది. కోతకు సిద్ధంగా ఉన్న బంగినపల్లి, రసాలు నేలరాలి రైతులు నష్టపోయారు. స్విమ్మింగ్ పూల్ ధ్వంసం.. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ పర్యవేక్షణలో నడుస్తున్న ఈడుపుగల్లు స్విమ్మింగ్ పూల్ భారీ వర్షం ధాటికి ధ్వంసమైంది. ప్రధాన గేటు, ప్రహరీపై ఏర్పాటుచేసిన రేకులు, వాటర్ ట్యాంకులు దెబ్బతిన్నాయి. రూ. 5 లక్షల మేరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు డీఎస్డీఓ కార్యాలయ అధికారులు జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. మరమ్మతులు పూర్తయ్యేందుకు వారం సమయం పడుతుందని, అప్పటి వరకూ క్రీడాకారులు శిక్షణకు రావొద్దని అధికారులు సూచించారు. 370 సారలు కల్లంలో ఉన్నాయి.. నేను 15 ఎకరాల్లో వరి సాగు చేశా. వారం క్రితం 10 ఎకరాల్లో పంటను మిల్లుకు తోలాం. ఇంకా ఐదెకరాలకు చెందిన 370 సారలు కల్లంలో కాటా వేసి ఉంచా. వర్షంతో బస్తాలు తడిసిపోయాయి. ఇప్పటికే ఎకరాకు రూ. 30 వేల నుంచి రూ. 40 వేలు పెట్టుబడి అయ్యింది. బస్తాలు తడిసిన కారణంగా ఆరబోతకు ఎకరాకు రూ. 5 వేలు అదనపు ఖర్చు అవుతుంది. లాభం మాట అటుంచితే పంటను కాపాడుకోవటానికి నానా పాట్లు పడాల్సి వస్తుంది. – లుక్కా వెంకటేశ్వరరావు, రైతు, రొయ్యూరు జిల్లాలో గాలి వాన బీభత్సం ఉరుములు, మెరుపులతో అకాల వర్షం తడిసిన ధాన్యం, దెబ్బతిన్న మొక్కజొన్న పల్లపు ప్రాంతాలు జలమయం నేలకూలిన భారీ వృక్షాలు మండుటెండల్లో మహా వర్షంకష్టం అంతా తడిసిపోయింది.. మూడు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. పూర్తిగా పంట ఎండింది. నిన్నటి దాకా రూ. 2వేలకు అడిగారు. ఇంకా ఎండితే రేటు పెరుగుతుందని ఆశించా. వర్షం వచ్చి పంటను పూర్తిగా తడిపేసింది. వర్షం కారణంగా పంట నలుపెక్కుతుంది. రేటు కూడా బాగా తగ్గిస్తారనే భయం వేస్తోంది. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. – గోపి, కౌలురైతు, గొడవర్రు -
కృష్ణాజిల్లా
ఆదివారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2025Iజీజీహెచ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ మన్మధరావు మచిలీపట్నం అర్బన్: మచిలీపట్నం జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ వి.మన్మధరావును నియమిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం విశాఖపట్నం కేజీహెచ్‌లో జనరల్ సర్జరీ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.బ్యాక్లాగ్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉయ్యూరులోని గిరిజన సంక్షేమశాఖ బాలుర గురుకుల పాఠశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి బ్యాక్లాగ్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి ఎం.ఫణిధూర్జటి శనివారం తెలిపారు. ఈ పాఠశాలలో మూడో తరగతి 40 సీట్లు, నాల్గవ తరగతి 40, ఐదో తరగతి 40, ఆరో తరగతి 29, ఏడో తరగతి 26, ఎనిమిదో తరగతి 26, తొమ్మిదో తరగతి 17 సీట్లు ఉన్నాయన్నారు. ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం లక్ష రూపాయలకు మించి ఉండకూడదన్నారు. దరఖాస్తులను ఉయ్యూరు రాజేంద్రనగర్‌లోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో ఈ నెల 28వ తేదీలోగా నేరుగా అందజేయాలన్నారు. లాటరీ పద్ధతి ద్వారా అడ్మిషన్ కమిటీ విద్యార్థులను ఎంపిక చేస్తుందన్నారు. మరిన్ని వివరాల కోసం 99088 39476, 93916 01861 నంబర్లను సంప్రదించాలన్నారు. కృష్ణా యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపిక పెనమలూరు: కృష్ణా యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపిక చేశామని పోరంకి శ్రీకృష్ణవేణి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ వి.భూలక్ష్మి తెలిపారు. ఆమె శనివారం వివరాలు తెలుపుతూ పోరంకిలో జరిగిన జట్టు ఎంపికలో కృష్ణా యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్ జట్టుకు 16 మంది క్రీడాకారులను ఎంపిక చేశామని చెప్పారు. నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్ (పురుషులు) పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందని వివరించారు. జట్టు మేనేజర్‌గా ఎ.వినయ్‌కుమార్‌రెడ్డి, కోచ్‌గా ఆర్.సురేష్ ఉంటారని తెలిపారు. న్యూస్‌రీల్ -
ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి
విస్సన్నపేట: విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవరుపై శుక్రవారం రాత్రి పుట్రేల శివారు జానలగడ్డలో ఇద్దరు యువకులు దాడికి పాల్పడ్డారు. విజయవాడ గవర్నరుపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ పీఎస్ విష్ణు, జానలగడ్డ నుంచి ప్రజలను అమరావతిలో జరిగిన కార్యక్రమానికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా రామానగరానికి చెందిన ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి బస్సు ఆపారు. డ్రైవర్‌ను దూషిస్తూ అతనిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో డ్రైవరు విష్ణుకు తీవ్ర గాయాలు కాగా విస్సన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అనంతరం అతన్ని విజయవాడ తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పోలీసు సిబ్బంది సేవలు అభినందనీయం
కోనేరుసెంటర్: పోలీసుశాఖలో సుదీర్ఘకాలంపాటు విశిష్ట సేవలను అందించిన సిబ్బంది సేవలు అభినందనీయం జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు (అడ్మిన్), ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ కొనియాడారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ పొందిన పలువురు పోలీసులను ఏఎస్పీలు శనివారం ఎస్పీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈసందర్బంగా ఏఎస్పీలు మాట్లాడుతూ పోలీసువృత్తిలో మానసికంగా, శారీరకంగా ఎన్నో రకాల ఒత్తిళ్లు ఉంటాయన్నారు. వాటన్నింటిని అధిగమిస్తూ సర్వీసులో ఎక్కడ ఎలాంటి రిమార్కు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉద్యోగ విరమణ పొందడమనేది అదృష్టంగా భావించాలన్నారు. భవిష్యత్‌లో పోలీసుశాఖ తరుపున ఎలాంటి సహాయం అందించటానికైనా తాము సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన జి.వి.ప్రసాద్ రావు(ఎస్సై, గుడివాడ ట్రాఫిక్) ఎన్.ఎన్.పూర్ణచంద్రరావు(ఏఎస్సై, చల్లపల్లి), డి. వీరరాజు (ఏఎస్సై, ఉయ్యూరు), ఎన్.డి. నాగేశ్వరరావు (ఏఎస్సై, ఉంగుటూరు), డి.ఆంజనేయులు (ఏఎస్సై, నందివాడ)లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బందరు డీఎస్పి సిహెచ్ రాజా, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, చిలకలపూడి సీఐ ఎస్కే నభీ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సతీష్‌కుమార్, రవికిరణ్, పోలీసు అధికారులు, పదవీ విరమణ చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో శనివారం సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి కల్యాణోత్సవాన్ని జరిపించారు. తొలుత స్వామి వారి ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను మేళతాళాలు, మంగళవాయిద్యాలతో కల్యాణ వేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. వేదికపై ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ ఉత్సవంలో పాల్గొన్న ఉభయదాతలు, భక్తులకు ఆలయ అర్చకులు తలంబ్రాలను అందజేశారు. కల్యాణోత్సవం అనంతరం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా ఆలయానికి తరలించగా, భక్తులు, ఉభయదాతలు సేవలో పాల్గొన్నారు. అనంతరం ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
గుడ్లూరు: ముందు వెళ్తున్న ట్రాలీని వెనుక నుంచి ఆటో ఢీకొట్టడంతో ఓవ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన 16వ నంబరు జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి గుడ్లూరు మండలంలోని తెట్టు ఫ్లైఓవర్ వద్ద చోటుచేసుకుంది. ఎస్ఐ వి.వెంకట్రావు కథనం మేరకు..విజయవాడలో కృష్ణలంకకు చెందిన పక్కెళ్ల శ్రీనివాసరావు(48) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. ఆటోలో ఫర్నీచర్ సామగ్రిని నెల్లూరు జిల్లా కలిగిరిలో దించి తిరుగు ప్రయాణమయ్యాడు.ఈక్రమంలో తెట్టు ఫ్లైఓవర్ వద్ద యంత్రాలతో వెళ్తున్న ఓ ట్రాలీ లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈఘటనలో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నియోజకవర్గాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయండి
కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీచిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా అభివృద్ధికి నియోజకవర్గాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో శనివారం సాయంత్రం 2047 విజన్ ప్రణాళికల తయారీపై నియోజకవర్గాల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర – 2047 విజన్ ప్రణాళిక అమలుకు జిల్లాలోని క్షేత్ర స్థాయి పరిస్థితులను, అవసరాలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఆయా నియోజకవర్గాల రూపురేఖలు మార్చే విధంగా ఈ ప్రణాళికలు ఉండాలన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ రంగాలుగా గుర్తించిన వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, ఇన్చార్జ్ సీపీవో పద్మజ, డ్వామా పీడీ శివప్రసాద్‌యాదవ్, పశుసంవర్థక శాఖాధికారి చిననరసింహులు, డీఆర్డీఏ పీడీ హరిహరనాఽథ్, మార్క్‌ఫెడ్ డీఎం మురళీకిషోర్ తదితరులు పాల్గొన్నారు. నీట్ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించండి చిలకలపూడి(మచిలీపట్నం): ఈ నెల 4వ తేదీన జిల్లాలో జరగనున్న నీట్ పరీక్షలో ఎలాంటి అవకతవకలు లేకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి గూగుల్ మీట్ ద్వారా శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. నీట్ పరీక్షలు ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆన్లైన్లో జరుగుతాయన్నారు. మచిలీపట్నంలోని కేంద్రీయ విద్యాలయం, రుద్రవరంలోని కృష్ణా విశ్వవిద్యాలయంతో పాటు గన్నవరంలోని వీఎస్ఎస్టీ జాన్స్ హైస్కూల్లలో మూడు పరీక్ష కేంద్రాలు ఉన్నాయని, ఈ కేంద్రాల్లో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు మచిలీపట్నం, గుడివాడ ఆర్డీవోలను నోడల్ అధికారులుగా, తహసీల్దార్లను సహాయ నోడల్ అధికారులుగా నియమించామన్నారు. జిల్లాలో 1096 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో ఉదయం 11 గంటలకు విద్యార్థులను లోనికి అనుమతించాలని, మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్ష కేంద్రం ద్వారాలను మూసివేయాలన్నారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి నీట్ పరీక్షకు సంబంధించిన అధికారులు, సిబ్బంది, విద్యార్థులను మాత్రమే అనుమతించాలన్నారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు పరీక్ష కేంద్రాలను ముందు రోజు తనిఖీ చేసి నీట్ మార్గదర్శకాల ప్రకారం అన్ని ఏర్పాట్లు సజావుగా చేశారా, లేదా అనేది గమనించాలన్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు వెళ్లేందుకు వీలుగా ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. సమావేశంలో ఎస్పీ ఆర్.గంగాధరరావు, అదనపు ఎస్పీ వీవీ నాయుడు, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఆర్డీవోలు కె.స్వాతి, జి.బాలసుబ్రహ్మణ్యం తదితర అధికారులు పాల్గొన్నారు. -
చోరీలు అరికట్టేందుకు ప్రజలూ సహకరించాలి
ఎస్పీ ఆర్.గంగాధరరావు కోనేరుసెంటర్: వేసవిలో దొంగతనాలను అరికట్టేందుకు ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు శనివారం కోరారు. వేసవి శెలవులను పురస్కరించుకుని ప్రజలు తమ పిల్లలతో కలిసి తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్తున్నవారు తమ ఇళ్లల్లో దొంగతనాలు జరగకుండా ఉండాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాధారణ రోజులతో పోల్చితే వేసవిలో దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటున్నందున నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసినట్లు తెలిపారు. ఇళ్లకు తాళం వేసుకుని ఊరికి వెళ్లేవారు ఆ సమాచారాన్ని స్థానిక పోలీసులకు తెలియజేస్తే ఆయా ఇళ్లపై నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. ఇంటి పరిసరాలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు కనబడేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, అలారం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం మంచిదన్నారు. ఇంటి బయట ఎప్పుడు లైట్ వెలిగేలా చూసుకోవాలన్నారు. తద్వారా చోరులకు ఇంట్లో ఎవరూ లేరనే అనుమానం రాదన్నారు. చుట్టుపక్కల అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు గమనించినట్లయితే సమీప పోలీసులకు సమాచారం అందజేయాలని ప్రజలను కోరారు. -
బీచ్ ఉత్సవాలపై మంత్రి సమీక్ష
చిలకలపూడి(మచిలీపట్నం): ఈనెల 15వతేదీ నుంచి 17వ తేదీ వరకు మూడురోజులపాటు జరుగనున్న మంగినపూడి బీచ్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎకై ్సజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో కలెక్టర్ డీకె బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, ట్రైనీ కలెక్టర్ జాహెద్ ఫర్హీన్‌తో కలిసి బీచ్ ఉత్సవాల నిర్వహణపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఏయే ప్రాంతాల్లో ఫుడ్‌కోర్టులు, ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయాలో మ్యాప్ ద్వారా స్థలాల కేటాయింపుపై చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జాతీయ క్రీడలైన కయాకింగ్ కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు ప్రతిబింబించేలా బీచ్ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. జలక్రీడలు, సాహసక్రీడలు అద్భుతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే క్రీడాకారులు, పర్యాటకులకు కావాల్సిన వసతి, అతిథిగృహాలను సిద్ధం చేస్తున్నామన్నారు. లక్షలాది మంది ప్రజలు ఉత్సవాల్లో పాల్గొననున్న నేపథ్యంలో రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉత్సవాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. మెప్మా పీడీ పి.సాయిబాబు, నాగాయలంక తహసీల్దార్ ఎం.హరినాఽథ్ పాల్గొన్నారు. -
కూటమి నేతలకు ధనార్జనే ధ్యేయం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో విద్యుత్ ఉత్పత్తి అనంతరం వెలువడే బూడిద కూటమి నాయకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. వారు బూడిద నిల్వ చేసి అమ్ముకునేందుకు వ్యాపార సామ్రాజ్యంగా మార్చుకున్నారు. దీంతో ఆ పరిసర ప్రాంతమంతా గాలి, నీటిలో బూడిద కలిసిపోయి ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. తమ ఇళ్లు, పొలాల పైకి బూడిద కాలుష్యం వెదజల్లుతోందని ఇటీవల పశ్చిమ ఇబ్రహీంపట్నం స్థానికులు 65వ నంబర్ జాతీయ రహదారిపై బూడిద లారీలను అడ్డుకుని ధర్నాకు దిగారు. కాలుష్య నివారణ చర్యలు చేపట్టకపోతే ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. గ్రామాలపైకి వెదజల్లుతున్న కాలుష్యం ఎన్టీటీపీఎస్ కాలుష్యంతో పాటు అక్రమ బూడిద డంపింగ్ కేంద్రాలు, లారీల ద్వారా వెదజల్లే కాలుష్యం అనేక గ్రామాల పైకి చేరుతోంది. ముఖ్యంగా పశ్చిమ ఇబ్రహీంపట్నం, జూపూడి, కిలేశపురం, మూలపాడు గ్రామాల్లో బూడిద కాలుష్యం తీవ్రంగా ఉంది. సమీపంలోని బూడిద చెరువు నుంచి గాలి ద్వారా వ్యాపించే కాలుష్యంతో పాటు బూడిద లారీల రాకపోకలతో తీవ్రమైన కాలుష్యం వెదజల్లు తోంది. లోడింగ్‌తో వచ్చిన లారీలు హైవే మీద ఆపడం వలన నీటితో కలిసిన బూడిద రోడ్డుపై పడుతోంది. ఆరిన తర్వాత గాలికి లేచి ఇళ్లల్లోకి చేరుతోంది. ఇళ్లల్లో ప్లోరింగ్‌పై పౌడర్ మాదిరిగా పేరుకుపోయి ఇల్లంతా బూడిద మయంగా మారుతోంది. బూడిద కాలుష్యంతో ప్రజలు శ్వాస, చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఇళ్లల్లోనే కాకుండా పచ్చని పంట పొలాలు సైతం బూడిద కాలుష్యం బారిన పడ్డాయి. కాలుష్యం సోకిన పొలాల్లో దిగుబడులు అంతంతమాత్రంగా ఉంటున్నాయి. కూరగాయలు రంగు మారడం వలన మార్కెట్లో ధర పతనమవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆందోళనకు దిగిన స్థానికులు బూడిద కాలుష్య సమస్య భరించలేని స్థానికులు ఇటీవల రోడ్డెక్కారు. 65వ నంబర్ జాతీయ రహదారిపై బూడిద లారీలను అడ్డుకున్నారు. బూడిద లారీలు రోడ్డుపై ఆపడానికి వీల్లేదని పట్టుబట్టారు. ఎన్టీటీపీఎస్ అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకుని ప్రజలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. కాలుష్య నివారణకు ఎటువంటి చర్యలు చేపడతారో చెప్పాలని ప్రజలు పట్టుబట్టగా, ఏమీ చెప్పలేక ఎన్టీటీపీఎస్ అధికారులు అక్కడి నుంచి జారుకున్నారు. పోలీసులు నచ్చచెప్పడంతో స్థానికులు ఆందోళన విరమించారు.చర్మ రోగాలు సోకుతున్నాయి ఎన్టీటీపీఎస్ నుంచి ఇళ్లల్లో చేరిన బూడిదతో డస్ట్ ఎలర్జీ, చర్మ సంబంధిత వ్యాధులు సోకుతున్నాయి. ఈ విషయం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక్కోసారి రోడ్డు పక్కన కాలువల ద్వారా బూడిద నీరు ఇళ్లల్లోకి చేరుతున్నాయి. కాలుష్య నివారణకు తక్షణం చర్యలు చేపట్టాలి. –షేక్ గాలిబ్ సాహీద్, పశ్చిమ ఇబ్రహీంపట్నం తాగునీటిలో బూడిద ఇటీవల కాలంలో తాగునీరులో బూడిద కలుస్తోంది. పైపులు లీకేజీ వలన నీటి కాలుష్యం జరుగుతోంది. బిందెల అడుగు భాగంలో బూడిద పేరుకుపోతోంది. ఎన్టీటీపీఎస్ అధికారులకు సమస్య వివరించినా ప్రయోజనం లేదు. తక్షణం తాగునీటి కాలుష్యం తగ్గించి స్వచ్ఛమైన జలాలు అందించాలి. –పచ్చిగోళ్ల పండు, ఇబ్రహీంపట్నం ●సీఎం చంద్రబాబు వద్దకు పంచాయితీ అక్రమ బూడిద రవాణాలో ప్రజాప్రతినిధి వర్గం, కొండపల్లి మున్సిపాలిటీ పట్టణ టీడీపీ ఉపాధ్యక్షుడి వర్గం మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పట్టణ ఉపాధ్యక్షుడి లారీలపై ప్రజాప్రతినిధి వర్గం కేసులు నమోదు చేయించడమే కాక, ఫోన్ చేసి దుర్భాషలాడి భయభ్రాంతులకు గురిచేశారు. ఈ విషయాన్ని పట్టణ ఉపాధ్యక్షుడి వర్గం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లింది. ఇక్కడ జరుగుతున్న బూడిద అవినీతిలో ఓ సామాజిక వర్గం, ప్రజాప్రతినిధి పెత్తనం వివరిస్తూ వాట్సాప్ మెసేజ్ ద్వారా సీఎంకు చేరవేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఓ సామాజిక వర్గం కింద మిగిలిన సామాజిక వర్గాల వారు మానసికంగా నలిగిపోయి మనోవేదనకు గురవుతున్నట్లు ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. ఈ పంచాయితీ ఎటువైపు దారి తీస్తుందో వేచిచూడాలి. బూడిదతో నిండిపోతున్న ఇళ్లు, పంట పొలాలు ఇటీవల రోడ్డెక్కి ఆందోళన చేసిన స్థానికులు కాలుష్య నివారణ చర్యలు చేపట్టకపోతే ఉద్యమ బాట సీఎం చంద్రబాబు దృష్టికి బూడిద పంచాయితీ నా దగ్గరేముంది బూడిద అనే నానుడికి కాలం చెల్లింది. బూడిద ఇప్పుడు కూటమి ప్రభుత్వ నేతలకు ధనార్జన వస్తువుగా మారింది. అయితే ఆ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని మాత్రం భస్మం చేస్తోంది. దీనిపై స్థానికులు ధర్నాలు, ఆందోళనలు చేసినా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. చివరకు ఈ బూడిద పంచాయితీ సీఎం చంద్రబాబు దాకా వెళ్లింది. -
అడ్డగోలుగా అడ్వాన్స్ తరగతులు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి జిల్లాలో కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం సెలవులు ప్రకటించినప్పటికీ కార్పొరేట్ విద్యాసంస్థలు యథేచ్ఛగా తరగతులను నిర్వహిస్తూ విద్యార్థులను హింసిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లోని కళాశాలల ప్రాంగణాల్లో విద్యార్థులు ఇరుకు గదుల్లో ఎండ వేడితో తీవ్ర ఇబ్బందులు పడటమే కాక, ఆయా విద్యాసంస్థల ఒత్తిడితో తీవ్ర మానసిక సంఘర్షణకు లోనవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్మీడియెట్ బోర్డు మార్చి నెలలో పరీక్షలు నిర్వహించింది. ఏప్రిల్ లో ఫలితాలను ప్రకటించింది. బోర్డు తమ పరిధిలోని విద్యాసంస్థలకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి సెలవులను ప్రకటించింది. కానీ కార్పొరేట్ సెక్టార్‌లోని అత్యధిక విద్యాసంస్థలు ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా తరగతులను కొనసాగిస్తున్నాయి. ఆనవాయితీకి భిన్నంగా షెడ్యూల్ ప్రతి ఏటా వార్షిక పరీక్షలు పూర్తవగానే విద్యార్థులకు సెలవులు ప్రకటించటం ఆనవాయితీ. కానీ ఈ ఏడాది ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు పూర్తయిన తరువాత ద్వితీయ సంవత్సరం తరగతులను వెంటనే మొదలు పెట్టే విధంగా షెడ్యూల్ ప్రకటించారు. వారికి ఈ నెల 23వ తేదీ వరకూ తరగతులను నిర్వహించి, 24వ తేదీ నుంచి సెలవులు ప్రకటించారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు ప్రకటించకుండానే ఇంటర్మీడియెట్ మొదటి ఏడాదికి అడ్మిషన్లు నిర్వహించే విధంగా ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఇవన్నీ ప్రైవేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాసే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయా లంటూ విద్యార్థి సంఘాల నేతలు మండి పడుతున్నారు. అదే రీతిలో సెలవులు ప్రకటించినప్పటికీ ఉమ్మడి కృష్ణాజిల్లాలోని చాలా విద్యాసంస్థలు విద్యార్థులకు యథావిధిగా తరగతులను కొన సాగిస్తున్నాయి. ప్రవేశ పరీక్షల పేరుతో క్లాసులు కార్పొరేట్ విద్యాసంస్థలు నీట్, ఎంసెట్ ప్రవేశ పరీక్షల పేరుతో ఈ తరగతులను కొనసాగిస్తున్నాయి. ఇంటర్మీడియెట్ సెకండియర్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారు. అది కూడా ఆయా కోర్సులకు వెళ్లే విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షలకు సిద్ధమవుతారు. కానీ సప్లిమెంటరీ పరీక్షలు రాసేవారికి, ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరంలోకి వచ్చిన వారికి సైతం సెలవులు ఇవ్వకుండా ప్రవేశ పరీక్షల పేరుతో యథేచ్ఛగా తరగతులను నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు సైతం కొన్ని విద్యాసంస్థలు బ్రిడ్జి కోర్సులని, మ్యాథ్స్ అవగాహన తరగతులంటూ ప్రత్యేకంగా తరగతులను కొనసాగిస్తున్నాయి. ఒత్తిడి సరికాదంటున్న నిపుణులు సాధారణంగా వార్షిక పరీక్షలు పూర్తయిన తరువాత ఆ విద్యార్థిపై అప్పటి వరకూ కొనసాగిన ఒత్తిడిని నివారించేందుకు కొన్ని రోజులు సెలవులు ప్రకటించటం పరిపాటి. వేసవి ఎండల్లో సెలవుల పేరుతో వారిని కొద్ది రోజులు ఇళ్లకు పరిమితం చేయటం సాధారణంగా జరిగే ప్రక్రియ. ఎటువంటి సెల వులు లేకుండా తీవ్ర స్థాయిలో ఒత్తిడిని పెట్టే విధంగా తరగతులు నిర్వహించటం వలన విద్యార్థులు మానసికంగా తీవ్రమైన సంఘర్షణకు లోనయ్యే ప్రమాదముందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం కార్పొరేట్ సంస్థలతో పాటుగా కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా తరగతులను నిర్వహిస్తుంటే సంబంధిత అధికార యంత్రాంగం చోద్యం చూస్తోందని విద్యార్థి సంఘాల నేతలు మండి పడుతున్నారు. విజయవాడ శివారు ప్రాంతాల్లో ఉన్న కళాశాలలతో పాటుగా నగరం నడిబొడ్డున ఉన్న పలు విద్యాసంస్థలు తరగతులను నిర్వహిస్తున్నాయి. తరగతులు నిర్వహిస్తున్న సమాచారం ఉన్నప్పటికీ ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు ఆ దిశగా దృష్టి సారించకపోవటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు ఇప్పటికై నా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న విద్యాసంస్థలపై దృష్టి పెట్టాలని తల్లి దండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ విద్యార్థులకు సెలవులిచ్చినా యథేచ్ఛగా తరగతులు ప్రవేశ పరీక్షల పేరుతో సెకండియర్ విద్యార్థులకు క్లాసులు బ్రిడ్జి కోర్సులంటూ ఇంటర్ ఫస్టియర్ తరగతులు బరితెగిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలు చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగంపరిశీలించి చర్యలు తీసుకుంటాం కొన్ని విద్యాసంస్థలు నీట్, ఇతర ప్రవేశ పరీక్షలకు తరగతులను నిర్వహిస్తున్నాయి. వారికి కాకుండా ఇతరులకు తరగతులు నిర్వహిస్తే అది నిబంధనలకు విరుద్ధం. అటువంటి విద్యాసంస్థలపై తనిఖీలు చేసి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం. దీనిపై నిఘా ఉంచుతాం. – ప్రభాకరరావు, ఆర్ఐవో, ఎన్టీఆర్ జిల్లా -
అక్రమరవాణాకు అడ్డుకట్ట ఏది?
జగ్గయ్యపేట: ఇసుక, గ్రావెల్, బియ్యం అక్రమంగా రవాణ చేస్తే సహించేది లేదంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. కొందరు అక్రమార్కులు పగలూ, రాత్రి తేడా లేకుండా ఏపీ నుంచి యథేచ్ఛగా తెలంగాణకు ఇసుక, గ్రావెల్, బియ్యం రవాణా చేస్తూ పోలీసు, చెక్‌పోస్టు అధికారులకు పనితీరును ప్రశ్నార్థకంగా మార్చారు. దీంతో ఏపీ, తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్టుల ఏర్పాటు కేవలం అలంకారప్రాయమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు అంతఃరాష్ట్ర చెక్‌పోస్టులు... ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా జగ్గయ్యపేట మండలం గరికపాడు, తిరువూరు మండలం ముత్తగూడెం వద్ద అంతఃరాష్ట్ర చెక్‌పోస్టులు ఉండగా ప్రస్తుతం గరికపాడు చెక్‌పోస్టు మాత్రమే పనిచేస్తోంది. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో 13 గ్రామాల్లో సరిహద్దు చెక్‌పోస్టులు పనిచేస్తున్నాయి. మైలవరం నియోజకవర్గంలోని చెక్‌పోస్టులు పూర్తిగా పని చేయడం లేదు. అక్రమ రవాణాతో ధ్వంసమవుతున్న రోడ్లు... ముఖ్యంగా గరికపాడు అంతఃరాష్ట్ర చెక్‌పోస్టు ఉన్నప్పటికి హైదరాబాద్ నుంచి నిషేధిత కోళ్ల వ్యర్థాలు వారంలో మూడురోజులు తెల్లవారుజామున 5 నుంచి 20 లారీలకు పైగా కృష్ణాజిల్లాలోని పలు చేపల చెరువులకు వెళ్తుంటాయి. ఈ నిషేధిత వాహనాలు సరిహద్దు దాటడంలో జగ్గయ్యపేట సర్కిల్లోని కొందరు పోలీసుల అధికారుల పాత్ర ఉన్నట్లు సమాచారం. ఇక కాకినాడ పోర్టు వద్ద రేషన్‌బియ్యం రవాణా నిలిపివేయడంతో అక్రమార్కులు లారీల ద్వారా బియ్యాన్ని తెలంగాణకు తరలిస్తున్నారు. చెక్‌పోస్టు తనిఖీలు తప్పించుకునేందుకు సరిహద్దు గ్రామాల మీదుగా ఈ అక్రమ రవాణా సాగుతోంది. ఇలా ఇసుక, బియ్యం, గ్రావెల్‌తో వెళ్లే భారీ వాహనాల కారణంగా తమ గ్రామంలోని రోడ్లు దెబ్బతింటున్నాయంటూ జగ్గయ్యపేట మండలం అన్నవరం గ్రామస్థులు ఇటీవల నియోజకవర్గ ప్రజాప్రతినిధికి కూడా మొరపెట్టుకోవడం గమనార్హం. నామమాత్రంగా తనిఖీలు... సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది నామమాత్రపు తనిఖీలకు పరిమితమవుతుండటంతో అక్రమార్కులు వారి కళ్లుగప్పి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఉదయం సమయాల్లో పాలేరు, మునేరు, కృష్ణానది నుంచి ఇసుకను తీసుకువచ్చి వారికి అనుకూలమైన ప్రదేశాలలో డంపింగ్ చేస్తూ, పది ట్రాక్టర్లు సరిపడా ఇసుక రాగానే రూట్ మ్యాప్ మేరకు తెలంగాణకు తరలిస్తున్నారు. చెక్‌పోస్టుల్లో పోలీస్ సిబ్బంది ప్రశ్నిస్తే సమీపంలోని పలు గ్రామా ల్లో కర్మాగారాల్లో నిర్మాణాల కోసమంటూ మాస్కా కొడుతున్నారు. ఇలా ముక్త్యాల, రామచంద్రునిపేట, మల్కాపురం, అన్నవరం, వత్సవాయి మండలం పోలంపల్లి, తాళ్ళూరు, పెనుగంచిప్రోలు మండలంలోని గుమ్మడిదుర్రు కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం మధిర ఇసుక భారీగా తరలివెళ్తోంది. గత నెల 25న ముక్త్యాల చెక్‌పోస్టు మీదుగా సూర్యాపేట జిల్లా చింతలపాలెంనకు చెక్‌పోస్టు కానిస్టేబుల్ సహకారంతో ఇసుక ట్రాక్టర్‌ను తరలిస్తుండగా గ్రామంలోని యువకులు అడ్డుకుని పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వగా, ఉన్నతాధికారులు కానిస్టేబుల్‌ను మందలించి అతన్ని చెక్‌పోస్టు విధుల నుంచి తొలగించారు. చందర్లపాడు మండలం కాసరాబాద్, కంచికచర్ల మండలం వేములపల్లి ఇసుక రీచ్‌ల నుంచి గరికపాడు చెక్‌పోస్టు మీదుగా రాత్రి వేళల్లో హైదరాబాద్‌కు నిత్యం ఇసుక లారీలు తరలి వెళ్తున్నాయి. చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అక్రమరవాణా యథేచ్ఛగా సాగుతుండటం గమనార్హం. ఇకనైనా జిల్లా పోలీసు, తనిఖీ విభాగాల అధికారులు స్పందించి ఈ ఇసుక, గ్రావెల్, బియ్యం అక్రమరవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. నామమాత్రంగా చెక్‌పోస్టులు నిద్రనటిస్తున్న ఉన్నతాధికారులు అక్రమార్కులకు స్థానిక పోలీసుల అండ దండలు తెలంగాణకు జోరుగా ఇసుక, గ్రావెల్, బియ్యం అక్రమ తరలింపు కూటమి నేతల సహకారంతోనే.. జిల్లా వ్యాప్తంగా ఆయా సరిహద్దు చెక్‌పోస్టులు ఉన్నప్పటికి దర్జాగా తెలంగాణ రాష్ట్రానికి ఇసుక, గ్రావెల్, బియ్యం తరలిపోతుండటం గమనార్హం. అక్రమార్కులకు అధికారపార్టీ నాయకుల పూర్తి అండదండలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అక్రమార్కులు రాత్రి, పగలు తేడా లేకుండా అక్రమరవాణాను సాగిస్తున్నారు.ముఖ్యంగా వత్సవాయి, తాళ్ళూ రు, పోలంపల్లి, ముక్త్యాల, అన్నవరం, బూదవాడ, జొన్నలగడ్డ, పెద్దాపురం సరిహద్దు చెక్‌పోస్టుల నుంచి ఉచితం పేరుతో ఇసుక తెలంగాణకు తరలిపోతుంది. అంతేకాకుండా తెలంగాణలోని సూర్యపేట నుంచి రామా పురం క్రాస్‌రోడ్డు వరకు 69వ నంబర్ జాతీయ రహదారి ఆరు లైన్ల రహదారిగా నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఈ ప్రాంతం నుంచే గ్రావెల్‌ను ఇష్టానుసారంగా తరలిస్తున్నారు. -
ధాన్యం విక్రయాలకు పోటెత్తిన రైతులు
అనుమంచిపల్లి(జగ్గయ్యపేట): గ్రామంలోని శ్రీ పద్మావతి శ్రీనివాసా పార్ బాయిల్డ్ రైస్ ఇండస్ట్రీస్ వద్ద గురువారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని తిరువూరు, విస్సన్నపేట, నందిగామ, చందర్లపాడు, జగ్గయ్యపేట, మైలవరం మండలాల్లోని ఆయా గ్రామాల నుంచి రైతులు ధాన్యం అమ్మేందుకు ట్రాక్టర్లు, లారీలతో వచ్చారు. అయితే అప్పటికే రెండు రోజులుగా రైస్‌మిల్లులో ధాన్యం లోడుతో ఉన్న వాహనాలుండటంతో వాహనాలు లోపలికి వచ్చేందుకు యాజమాన్యం అనుమతించకపోవటంతో రైతులు, యాజమాన్యం మధ్య రెండు గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ధాన్యం బస్తాలతో వందల కి.మీ.ల దూరం నుంచి వచ్చామని, రెండు రోజుల క్రితం రావటంతో ధాన్యంతో ఇక్కడే ఉంటున్నామని దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వకుండా వారికి అనుకూలమైన వారి వాహనాలను మాత్రం అనుమతిస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న పౌర సరఫరాల శాఖ డీటీ వెంకటేశ్వర్లు పోలీసుల సహకారంతో రైతుల, యాజమాన్యంతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. ఇతర గ్రామాల నుంచి వచ్చిన రైతులకు సంబంధించి పౌర సరఫరాల శాఖ సైట్లో ఇబ్బందులు ఉండటంతోనే ఆలస్యమవుతోందని, అంతే కాకుండా మిల్లులో ఎస్ఏ గోడౌన్లకు సరఫరా చేయాల్సిన బియ్యం గోడౌన్ అధికారులు కొనుగోలు చేయకపోవటంతో రెండు నెలలుగా ఇక్కడే ఉంటున్నాయని, దీంతో రైతుల ధాన్యానికి చోటు లేదని యాజమాన్యం వివరణ ఇచ్చింది. వందకు పైగా లారీలు, ట్రాక్టర్లకు ధాన్యంకు పాసులు జారీ చేయటంతో వివాదం సద్దుమణిగింది.అనుమంచిపల్లిలో రైస్‌మిల్లు వద్ద ఉద్రిక్తత రెండు రోజులుగా ధాన్యం లారీలతో మిల్లు వద్దే మకాం మిల్లులో స్థలం లేదని యాజమాన్యం సమాధానం రంగప్రవేశం చేసిన పౌర సరఫరాల శాఖ అధికారులు రైతులకు పాసుల జారీతో సద్దుమణిగిన వివాదం -
కూటమి పాలనలో అన్ని వర్గాలకు కష్టాలే!
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో కూటమి పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, కార్మికులు, కర్షకులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. కార్మికుల కోసం సంక్షేమ పథకాలు లేవని, వారిని పట్టించుకోవడం వదిలేశారని ఆరోపించారు. మేడే సందర్భంగా విజయవాడలోని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో గురువారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్టీయూసీ, అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పాల్గొన్న దేవినేని అవినాష్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆటో కార్మికులకు ప్రతి ఏటా వాహనమిత్ర పేరుతో రూ.10 వేలు ఇచ్చారని, కేసులు, జరిమానాలు లేకుండా ఐదేళ్ల పాటు ఆటోకార్మికులు ఆనందంగా ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో కార్మికులకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయన్నారు. గత ప్రభుత్వం చిరు వ్యాపారులకు ఏటా రూ.10 వేలు ఇచ్చి గుర్తింపు కార్డులు ఇచ్చిందని, కానీ నేడు టీడీపీ నేతలు చిరు వ్యాపారులను నిత్యం మామూళ్లతో దోచుకుంటున్నారన్నారు. అప్కాస్ ఏర్పాటు చేసి చిరు ఉద్యోగులు, కార్మికులకు క్రమం తప్పకుండా జీతాలు ఇచ్చారని, కానీ నేడు కూటమి ప్రభుత్వం దానిని ఎత్తేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు పాలన ఉందా? సింహాచలం వంటి వరుస ఘటనలు చూస్తుంటే రాష్ట్రంలో అసలు పాలన ఉందా అనే అనుమానం కలుగుతోందని అవినాష్ అన్నారు. వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతిలో తొక్కిసలాట, ఇప్పుడు సింహాచలంలో గోడ కూలి 8 మంది మృతి చెందడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనాలన్నారు. రెడ్‌బుక్ అమలుపైనే దృష్టి రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంపైనే పాలకులు దృష్టి పెడుతున్నారని, పాలనను గాలికొదిలేశారని దేవినేని అవినాష్ విమర్శించారు. విజయవాడలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టిన రక్షణ గోడ వరదల నుంచి లక్షలాది మందిని కాపాడిందని, కూటమి ప్రభుత్వంలో సింహాచలంలో కట్టిన గోడ 8 మంది ప్రాణాలు తీసిందన్నారు. రానున్న రోజుల్లో వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. ప్రతి కార్మికుడికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ రవి, అనుబంధ విభాగాల అధ్యక్షులు గొట్టిపాటి హరీష్, ఏలూరి శివాజీ, శెటికం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏ ఒక్కరూ ఆనందంగా లేరు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు ఎటువంటి సంక్షేమ పథకాలు లేవు ఆటో రోడ్డెక్కితే జరిమానాల బాదుడు మేడే వేడుకల్లో వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
పెనమలూరు: పెనమలూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబ తగాదాలతో గడ్డి మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం పెనమలూరు చెరువు కట్టకు చెందిన ఉప్పలపు రమేష్ (53) స్వగ్రామం మొవ్వ మండలం కాజ గ్రామం. అతను 30 సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులతో వచ్చి పెనమలూరు గ్రామంలో స్థిరపడ్డాడు. కానూరులో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రమేష్‌కు భార్య ఇద్దకు కుమార్తెలు. కుమార్తెలకు వివాహం చేశాడు. కొంతకాలంగా రమేష్‌కు భార్యతో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అతను బుధవారం పెనమలూరు–వణుకూరు రోడ్డులో గడ్డి మందు తాగి ఇంటికి వచ్చి చెప్పగా అతనిని వెంటనే కానూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న రమేష్ గురువారం మృతి చెందాడు. ఈ ఘటనపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.ఆసియా రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌కు కైవల్య, చైత్రదీపికవిజయవాడస్పోర్ట్స్: దక్షిణ కొరియాలో జరిగే ఆసియా రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌కు ప్రాతినిధ్యం వహించే భారత జట్టులో విజయవాడకు చెందిన కొప్పవరపు కై వల్య, పి.చైత్రదీపిక చోటు దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన భారత జట్టు ఎంపిక పోటీల్లో వీరిరువురూ అత్యుత్తమ ప్రదర్శనతో ఆసియా చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు. యూత్ బాలుర సోలో ఫ్రీ స్టయిల్ వ్యక్తిగత విభాగానికి కైవల్య ఎంపిక కాగా, యూత్ పెయిర్ స్కేటింగ్ విభాగానికి కై వల్య, చైత్రదీపిక ఎంపికయ్యారు. వీరిద్దరూ ఇటీవల తైవాన్‌లో జరిగిన తైవాన్ స్కేటింగ్ ప్రపంచ కప్ పలు విభాగాల పోటీల్లో సత్తా చాటి దేశానికి పతకాలు అందించారు. వీరు ప్రస్తుతం పటమటలోని ఎన్ఎస్ఎం స్కూల్లో చదువుతున్నారు. ప్రతిష్టాత్మకమైన పోటీలకు ఎంపికై న వీరిద్దరినీ స్కూల్ ప్రిన్సిపాల్ రాయప్పరెడ్డి అభినందించారు. -
సంగీత ప్రియులకు షడ్రసోపేత విందు
విజయవాడ కల్చరల్: శ్రీ సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో సంగీత సద్గురు త్యాగరాజ స్వామి 258 వ జయంతి సందర్భంగా దుర్గాపురంలోని శివరామ కృష్ణ క్షేత్రంలో నిర్వహిస్తున్న 32 వ జాతీయ సంగీతోత్సవాలు శ్రావ్యంగా సాగుతున్నాయి. గురువారం నాటి కార్యక్రమంలో కె.శర్వాణి, సహాన, జనని, కె.శ్రావ్య శివానీ, ఓరుగంటి లక్ష్మి, సురవరపు విద్య, అనీష్ మీనన్, ఎన్.భవ్యశ్రీ గీతిక, సాత్వికా మోహన్, బి.రఘునాథరావు త్యాగరాజ స్వామి రచించి, స్వరపరచిన కీర్తనలను ఆలపించారు. కరణా జలధే, రారా మాయింటి దాకా, గిరిరాజ సుతా తనయ, సామజవరగమన, పట్టి విడువరాదు తదితర కీర్తనలు శ్రోతలను రంజింపజేశాయి. త్యాగరాజ స్వామి జయంతి ఉత్సవంలో 6 సంవత్సరాల చిన్నారి నుంచి 80 ఏళ్ల విద్వాంసుల వరకు పాల్గొనడం విశేషం. కార్యక్రమంలో శ్రీ సద్గురు సంగీత సభ అధ్యక్షుడు బీవీఎస్ ప్రకాష్, ఉపాధ్యక్షుడు బి.హరిప్రసాద్, కార్యదర్శి పోపూరి గౌరీనాఽథ్, సభ్యులు గాయత్రి గౌరీనాథ్ తదితరులు పాల్గొన్నారు. శ్రావ్యంగా సాగుతున్న జాతీయ సంగీతోత్సవాలు ఆరేళ్ల చిన్నారి, 81 ఏళ్ల వయోవృద్ధ సంగీత విద్వాంసుల గానామృతం త్యాగరాజ కృతులను మధురంగా ఆలపిస్తున్న వైనం -
పాత టైరు షెడ్లో అగ్నిప్రమాదం
ఆటోనగర్(విజయవాడతూర్పు): జవహర్ ఆటోనగర్ రెండవ క్రాస్ 4వ రోడ్డు లోని పాత టైరు షెడ్లో బుధవారం రాత్రి సుమారు 10.30 గంటల తర్వాత అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.15 లక్షలకు పైగా విలువైన పాత టైర్లు అగ్నికి ఆహుతయ్యాయి. షెడ్డు యజమాని హుస్సేన్ బాబా తెలిపిన వివరాల మేరకు... గత రాత్రి 10.30 గంటల తర్వాత హుస్సేన్ బాబా షెడ్డు వెనుక నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. షెడ్డు వెనుక భాగంలో ఎవరైనా చెత్తకు నిప్పు పెట్టడం వల్ల జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆరు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. మంటలను ఆర్పడానికి దాదాపు ఆరు గంటల సమయం పట్టిందని ఆగ్నిమాపక అధికారి నరేష్ తెలిపారు. మంటలు విస్తరించివుంటే... రెండవ క్రాస్ 4వ రోడ్డులో సుమారు 300కు పైగా పాత టైర్ల షాపులు ఉంటాయి. రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మంటలు వ్యాపించి ఈ షాపులకు నిప్పు అంటుకుని ఉంటే రూ.కోట్లల్లో ఆస్తినష్టం జరిగి ఉండేదని స్థానికులు అంటున్నారు. సుమారు రూ.15 లక్షలకు పైగా ఆస్తినష్టం తప్పిన పెను ప్రమాదం -
బావిలో పడిన ట్రాక్టర్ : యువకుడి దుర్మరణం
ఏడాది క్రితమే ఆ కుటుంబ పెద్ద అనారోగ్యంతో మరణించాడు. తల్లిని, చెల్లిని పోషించడానికి ఇరవై ఏళ్ల కుమారుడు కుటుంబ బాధ్యత నెత్తి మీద వేసుకున్నాడు. ఆ కుటుంబానికి ఉన్న ట్రాక్టర్‌ను జీవనాధారం చేసుకుని ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. విధి ఆ కుటుంబంపై పగబట్టింది. నేలబావి రూపంలో ఆ యువకుడిని బలి తీసుకుంది. తిరువూరు: పొలం దుక్కి దున్నడానికి ట్రాక్టరు నడుపుతున్న యువకుడు పొదలమాటున ఉన్న బావిని గమనించకపోవడంతో అందులో పడి దుర్మరణం చెందిన ఘటన ఎ.కొండూరు మండలం రామచంద్రాపురంలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన చల్లా హరీష్(20) తండ్రి వెంకటేశ్వరరావు ఏడాది క్రితం మరణించగా కుటుంబ పోషణ కోసం ట్రాక్టరు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. అదే గ్రామ శివారులోని ఒక పొలం దుక్కి దున్నడానికి ట్రాక్టరు తీసుకెళ్లిన హరీష్ పొలంలో పొదల్లో పాడుబడిన బావిని గమనించకుండా ముందుకు నడపడంతో ట్రాక్టరు బావిలో బోల్తా పడింది. చుట్టుపక్కల రైతులు గమనించి అతనిని బావి నుంచి బయటికి తీసి ఆసుపత్రికి తరలించేందుకు యత్నించగా అప్పటికే మృతిచెందాడు. ఏడాది వ్యవధిలోనే భర్త, కుమారుడు ఇద్దరూ మృతిచెందడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరవుతోంది. తమను ఆదుకునేదెవరంటూ రోదిస్తున్న ఆమెను ఆపతరం ఎవరికీ కావడం లేదు. ఎ.కొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెదపులిపాకలో రెండు పడవలు దగ్ధం
పెనమలూరు: పెదపులిపాక గ్రామంలోని రేవు వద్ద ఉంచిన రెండు పడవలు అనుమానాస్పద పరిస్థితుల్లో దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పెనమలూరు ఎస్ఐ ఫిరోజ్ తెలిపిన వివరాల ప్రకారం పెదపులిపాక గ్రామానికి చెందిన నడకుదురు ఏడుకొండలు, తాడి భాస్కరరావు వారి పడవల్లో కృష్ణానదిలో చేపల వేటకు వెళ్లి చేపలు పట్టి జీవిస్తుంటారు. వేట అనంతరం పడవలు ఘాట్ వద్ద నది ఒడ్డున ఉంచుతారు. అయితే తమ ఇద్దరి పడవలు కాలిపోతున్నాయని స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఏడుకొండలు, భాస్కరరావు ఘటనా స్థలం వద్దకు వెళ్లి మంటలను ఆర్పే యత్నం చేయగా అప్పటికే పడవలు, మోటర్లు, చేపల వలలు దగ్ధమయ్యాయి. రాత్రి సమయంలో పడవలు ఉన్న ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు మద్యం తాగి, సిగరెట్ వేయటంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రెండు పడవలు దగ్ధం కావటంతో రూ.6 లక్షల మేరకు నష్టం జరిగిందని బాధితులు చెబుతున్నారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేశారు. -
రేపటి నుంచి రాష్ట్ర స్థాయి చెస్ టోర్నీ
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి అండర్–9 ఓపెన్, బాలికల రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్ర చెస్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి, కృష్ణాజిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి ఎన్.ఎం.ఫణికుమార్ తెలిపారు. విజయవాడ శివారు కానూరులోని స్కాట్స్‌పైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ నెల 3, 4 తేదీల్లో పోటీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పోటీల పోస్టర్‌ను స్కూల్ ఆవరణలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫణి కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. ఏడు రౌండ్ల పోటీలు జరుగుతాయన్నారు. పోటీల అనంతరం జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర జట్లను ఎంపిక చేస్తామని చెప్పారు. స్కూల్ ప్రిన్సిపాల్ చలసాని ప్రతిమ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి టోర్నీ తమ స్కూల్లో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ టోర్నీకి స్కూల్ తరఫున పూర్త సహకారం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో టోర్నీ డైరెక్టర్ రేణుక, స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయులు శివ పాల్గొన్నారు. -
నోడల్ అధికారులూ.. అప్రమత్తం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రధాని నరేంద్రమోదీ పర్యటన ముగిసే వరకు నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ గురువారం కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మండల, జిల్లాస్థాయి నోడల్ అధికారులు, ఆర్డీఓలు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు తదితరులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ అధికారులు ప్రణాళికలు అమలుచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. దీనికి సమన్వయంతో పని చేయాలని సూచించారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. వేసవి నేపథ్యంలో ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు, తాగునీరు, మజ్జిగ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి బస్సులోనూ మెడికల్ కిట్లు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు వంటివి అందుబాటులో ఉంటాయన్నారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సిద్ధం చేస్తారన్నారు. వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరే బస్సులు వేదిక వద్దకు సరైన సమయానికి చేరుకొని, తిరిగి విజయవంతంగా గమ్యస్థానాలకు చేరుకునే విషయంలో రూట్ అధికారులు, జిల్లాస్థాయి నోడల్ అధికారులు అయిన జిల్లా వ్యవసాయ అధికారి, డీఆర్డీఏ పీడీ, డ్వామా పీడీ, యూసీడీ పీవో నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ప్రణాళికాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్ లక్ష్మీశ వారధి, ప్రకాశం బ్యారేజీ, వెస్ట్ బైపాస్ తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. -
భద్రతేది.. భవానీ?
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కూటమి పాలనలో రాష్ట్రంలో ఆలయాల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. సింహాచలం ఘటనతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో భద్రత ఎంత అని పలువురు సంశయం వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను సాధారణ రోజుల్లో నిత్యం 30 వేల మందికిపైగా, శుక్ర, శని, ఆదివారాల్లో 60 వేల మందికిపైగా భక్తులు దర్శించుకుంటారు. అయితే ఆలయంలో భద్రతా వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పని చేయని సీసీ కెమెరాలు కొండపైకి గత నెల11వ తేదీన ఉత్తరాదికి చెందిన ఇద్దరు వ్యక్తులు అర్ధరాత్రి వేళ కాలినడకన చేరుకోవడంతో పెద్ద దుమారమే రేగింది. గత నెలలోనే ఘాట్ రోడ్డులోని ఓంకారం మలుపు వద్ద నిలిపిన కారులో 272 గ్రాముల బంగారం చోరీకి గురైంది. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు పని చేయకపోవడం గమనార్హం. కొరవడిన చిత్తశుద్ధి కొండపైన కింద 220 సీసీ కెమెరాలు ఉన్నా అవి సరిగా పనిచేయడం లేదు. వాటిని పర్యవేక్షించే పరిస్థితిలేదు. దీన్నిబట్టే అధికారులకు అమ్మవారి భద్రతపై ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం అవుతోంది. కొంత మంది దేవాలయ అధికారులే దర్శనాల దందా చేస్తున్నా పట్టించుకోవడం లేదు. మొత్తం మీద రెగ్యులర్ ఈఓ లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడింది. ఈఓ నియామకంలో అలసత్వం రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యమున్న దుర్గగుడికి ఈఓను నియమించడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. దుర్గగుడి ఈఓగా గత ఏడాది డిసెంబర్ 31న రామచంద్రమోహన్ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత దేవదాయ శాఖ కమిషనర్‌గా, అదనపు కమిషనర్–2గా రామచంద్రమోహన్‌ను ప్రభుత్వం నియమించడంతో ఆ బాధ్యతలు కూడా ఆయనే నిర్వహిస్తున్నారు. ఆయన ప్రభుత్వ పెద్దలు ఆశీస్సులతో ఇక్కడ కొనసాగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. తూతూమంత్రంగా.. ఈఓగా రామచంద్రమోహన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆలయంలో జరిగే ఉత్సవాల్లోనూ వైభవం తగ్గిందని సిబ్బందే బహిరంగంగా పేర్కొంటున్నారు. ఇటీవల మహా శివరాత్రి కల్యా ణోత్సవాలు, చైత్రమాస కల్యాణ బ్రహ్మోత్సవాల్లో ఈ లోటు స్పష్టంగా కనిపించింది. ఆలయంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో ఈఓ పాల్గొనకపోవడంతో తూతూ మంత్రంగానే నిర్వహిస్తున్నారని ఉభయదాతలు బహిరంగంగానే పేర్కొంటున్నారు. సింహాచలం ఘటనతో దుర్గగుడి భద్రతపై సందేహాలు! సీసీ కెమెరాలు లేక పెరుగుతున్న చోరీలు వారంలో ఒకటి, రెండు రోజులే ఉంటున్న ఈఓ జగన్ సర్కార్ ఇచ్చిన రూ.72 కోట్ల నిధులతో అనేక భారీ నిర్మాణాలు వైఎస్సార్ సీపీ హయాంలో అభివృద్ధికి పెద్ద పీట వైఎస్సార్ సీపీ సర్కార్ హయాంలో దుర్గగుడి అభివృద్ధికి పెద్ద పీట వేశారు. రూ.72 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా దుర్గగుడిలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అయితే ఇంజినీరింగ్ పనులను ఈఓ పర్యవేక్షించిన దాఖలాలు లేవు. పనులపై ఇంజినీరింగ్ సిబ్బంది పర్యవేక్షణ సైతం కొరవడింది. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నా పట్టించుకొనే వారే కరువయ్యారు. సింహా చలం అప్పన్న సన్నిధిలో జరిగిన ఘటన తర్వాత అయినా ప్రభుత్వంలో మార్పు వస్తుందని భక్తులు భావిస్తున్నారు. రెగ్యులర్ ఈఓను నియమించి, దుర్గగుడి అభివృద్ధి పనులపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది.అందుబాటులో ఒకటి, రెండు రోజులే.. ఇన్చార్జి ఈఓగా రామచంద్రమోహన్ వారంలో ఒకటి, రెండు రోజులే దుర్గగుడిలో అధికారులకు అందుబాటులో ఉంటున్నారు. దేవస్థానానికి సంబంధించి ప్రతి ఫైల్ ఈ–ఫైల్లో నమోదు చేయాలని చెబుతున్నా.. పూజలు, ఇతర ఆలయ వ్యవహారాలకు ఎప్పుడు అనుమతులు లభిస్తాయో తెలియని అయోమయ పరిస్థితి ఉంది. ఆలయ సిబ్బందికి ప్రతి నెలా వేతనాలు, కాంట్రాక్టర్లకు బిల్లులూ ఆలస్యమవుతున్నాయి. ఆరు నెలలకు ఒక సారి ఆలయ అధికారులు, ఉద్యోగులను అంతర్గత బదిలీలు చేయాలని ఆదేశాలున్నాయి. దుర్గగుడిలో అంతర్గత బదిలీల ఊసే లేదు. అమ్మవారి ఆదాయానికి భారీగా గండి పడేలా రామచంద్రమోహన్ వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. సిఫార్సుల దర్శనాలను కట్టడి చేయడంలో రామచంద్రమోహన్ పూర్తిగా విఫలమయ్యారని భక్తులు ఆరోపిస్తున్నారు. సిఫార్సులపై వచ్చే వారిని నియంత్రించలేక, టికెట్లు కొనుగోలు చేసిన భక్తులను సైతం అంతరాలయంలోకి అనుమతించకపోవడంతో ఆలయ అధికారులతో భక్తులు వివాదాలకు దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. -
ఎయిర్‌పోర్ట్‌లో కట్టుదిట్టమైన భద్రత
విమానాశ్రయం(గన్నవరం): అమరావతి రాజధాని నిర్మాణ పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ రానున్న నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ప్రధాని భద్రత వ్యవహారాలు చూసే ఎన్ఎస్జీ దళాలు ఇక్కడికి చేరుకుని విమానాశ్రయాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నాయి. పోలీస్ శాఖతో కలిసి ఎన్ఎస్జీ దళాలు ప్రధాని భద్రత అంశాలను పర్యవేక్షిస్తున్నారు. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో డాగ్, బాంబ్ స్క్వాడ్లతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని పర్యటనకు సంబంధించి ఎన్ఎస్జీ పర్యవేక్షణలో ట్రయల్‌రన్ కూడా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తిరువనంతపురం నుంచి విమానంలో శుక్రవారం మధ్యాహ్నం 2.50 గంటలకు ఇక్కడకు చేరుకోనున్నారు. అనంతరం 2.55 గంటలకు వాయుసేన హెలికాఫ్టర్‌లో ఇక్కడి నుంచి అమరావతి ప్రాంతానికి బయలుదేరివెళ్తారు. అక్కడ నుంచి సాయంత్రం 5.15 గంటలకు ఇక్కడకు చేరుకుని అదే విమానంలో న్యూఢిల్లీ బయలుదేరి వెళ్తారని అధికారులు తెలిపారు. ప్రధాని రాక సందర్భంగా విమానాశ్రయంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏలూరు రేజ్ డీఐజీ అశోక్‌కుమార్, కృష్ణా ఎస్పీ గంగాధరరావు పరిశీలించారు. రైల్వేస్టేషన్లో విస్తృత తనిఖీలు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైల్వే ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ ఆదేశాల మేరకు డీఎస్పీ రత్నరాజు ఆధ్వర్యాన జీఆర్పీ సీఐ జె.వి. రమణ ఆర్పీఎఫ్ అధికారుల సమన్వయంతో విజయవాడ రైల్వేస్టేషన్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. పహల్గాం ఉగ్రవాదుల దాడి, అమరా వతిలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు ఈ తనిఖీలు చేశారు. విజయవాడ రైల్వేస్టేషన్లో అనుమానితులు, సంఘవిద్రోహ శక్తులను గుర్తించడానికి ప్రత్యేంగా రైల్వే పోలీసులు, జాగిలాలు, డీఎఫ్ఎండీ, హెచ్హెచ్ఎండీలతో స్టేషన్లో క్షుణంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రైల్వే డీఎస్పీ రత్నరాజు మాట్లాడుతూ ఆర్పీఎఫ్ పోలీసుల సమన్వయంతో అసాంఘిక శక్తులు రైల్వే స్టేషన్లోకి చొరబడకుండా పటిష్ట భద్రత చర్యలు చేపట్టినట్లు తెలిపారు. స్టేషన్లోకి ప్రవేశించే అన్ని మార్గాల్లో నిరంతరం గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైల్వేస్టేషన్, పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అనుమానిత వ్యక్తులు గానీ, బ్యాగులు గానీ ఉంటే రైల్వే పోలీసులకు లేదా 139కు ఫోన్‌చేసి సమాచారం అందించాల్సిందిగా కోరారు. దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన జి.నాగకుమారి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి రూ. లక్ష విరాళాన్ని అన్నదానానికి అందజేశారు. చైన్నెకి చెందిన డి.ఫణీంద్రరావు కుటుంబం ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,00,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 9.12 మి.మీ. సగటు వర్షపాతం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో 9.12 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. గంపలగూడెం మండలంలో 25.2 మిల్లీమీటర్లు, ఇబ్రహీంపట్నంలో 22.4, విజయవాడ సెంట్రల్లో 16.4, వెస్ట్‌లో 16.4, వీరులపాడు, జి. కొండూరు, విజయవాడ నార్త్‌లో 15.2 మిల్లీమీటర్ల చొప్పున, విజయవాడ రూరల్‌లో 14.8, ఈస్ట్‌లో 14.6, మైలవరం 9.4, తిరువూరులో 6.6, వత్సవాయి 6.0, కంచికచర్లలో 3.6, ఎ.కొండూరలో 1.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఎన్నో ఆటంకాలను అధిగమించి
శుక్రవారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2025అవనిగడ్డ/నాగాయలంక: గుల్లలమోద క్షిపణి పరీక్ష కేంద్రం దివిసీమ సిగలో కలికితురాయిగా మారనుంది. క్షిపణి పరీక్ష కేంద్రంతో దివిసీమ ఖ్యాతి విశ్వవ్యాప్తం కానుంది. గత 13 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టుకు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారం భోత్సవం చేయనున్నారు. తొలిదశలో రూ.1,600 కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.20 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు దివిసీమ పారిశ్రామికంగా, పర్యాటకంగా ఎంతో అభివృద్ధి సాధించనుంది. అనువుగా ఉంటుందని.. ఇక్కడ సముద్రం మలుపు ఉండటం, దట్టమైన మడ అడవులు పెరగడంతో ఈ ప్రాంతాన్ని అనువైనదిగా ఎంచుకున్నారు. మచిలీపట్నం, చైన్నె ఓడరేవుల నుంచి సముద్రమార్గం ఉంది. దీంతో క్షిపణి ప్రయోగ కేంద్రాలకు అవసరమైన పరికరాలు రోడ్డు రవాణా నుంచి కాకుండా సముద్ర మార్గం నుంచి తీసుకొచ్చే వసతులు ఉన్నాయి. దీనికి తోడు 8 కి.మి. మేర ఇక్కడ జనావాసాలు లేకపోవడం, చెంతనే సముద్రం ఉండటంతో క్షిపణి పరీక్షలకు అనువుగా ఉంటుందని డీఆర్డీఓ అధికారులు నిర్ధారించడం ఈ ప్రాజెక్టుకు ప్రధానంగా కలిసొచ్చే అంశాలు. అన్ని రంగాల్లో అభివృద్ధి ఈ ప్రాజెక్టుకు సుమారు 300 మంది శాస్త్రవేత్తలు, మరో ఆరు వందల మంది సిబ్బంది నివాసం ఉండాల్సి రావడంతో ఈ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందనుంది. భారీ కంటైనర్లు రాకపోకలతో రహదారుల విస్తరణ జరగనుంది.అనుబంధ పరిశ్రమలతో పలు భవనాల నిర్మాణాలు, స్థానికంగా వేలాది మందికి ఉపాధి, పచ్చదనం కోసం చెట్లు పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పర్యావరణ సమతౌల్యం పెరుగుతుంది. న్యూస్‌రీల్13 ఏళ్ల నిరీక్షణ నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధానిడీఆర్డీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ క్షిపణి ప్రయోగ కేంద్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం వర్చువల్ పద్ధతిలో ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇక్కడ లైవ్ ప్రసారాలను తిలకించేందుకు ఈ ప్రాంతంలో భద్రతా చర్యలు, ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీటిని కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధరరావు, డీఆర్డీఓ చైర్మన్ సమీర్ వి.కామత్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. డీఆర్డీఓ ఆధ్వర్యాన గుల్లలమోదలో క్షిపణి పరీక్ష కేంద్రం నేడు వర్చువల్ పద్ధతిలో ప్రారంభోత్సవం తొలివిడతగా రూ.1,600 కోట్లతో పనులు మొత్తం రూ.20 వేల కోట్లతో అభివృద్ధి పనులు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ)కు దేశవ్యాప్తంగా 51 పరిశోధనాలయాలు ఉన్నాయి. జాతీయ భద్రతకు సంబంధించి వైమానిక అవసరాలు, ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభి వృద్ధి, జీవశాస్త్రం, మిస్సైల్స్, యుద్ధ శకటాలు, యుద్ధనౌకలు, క్షిపణిల తయారీపై ఇక్కడ పరిశోధనలు జరుగుతాయి. ఒడిశాలోని బాలాసోర్ కంటే మెరుగైన క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేయాలని 2011లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం 2012లో కృష్ణాజిల్లా నాగాయలంక మండల పరిధిలోని గుల్లలమోద అనువైన ప్రాంతంగా పాలకులు గుర్తించారు. 2011లో బాలాసోర్ కంటే మెరుగైన పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయిం చింది. దీని ఏర్పాటుకు 2012లో గుల్లలమోద అనుకూలప్రాంతంగా గుర్తించారు. తొలుత ఈ ప్రాజెక్టు కోసం 380 ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా వేశారు. గుల్లలమోద పరిసర ప్రాంతాల్లో క్షిపణి పరీక్ష కేంద్రానికి అనువైన భూములన్నీ అటవీ పరిధిలోకి వస్తాయి. ఈ ఆటంకాన్ని అధిగమించడానికి ఐదేళ్లు పట్టింది. 2017లో రెవెన్యూ నుంచి అటవీశాఖకు భూములు బదలాయించడానికి రూ.35 కోట్లు చెల్లించారు. అభయారణ్యం కావడంతో అరుదైన ఆలివ్రెడ్లీ తాబేళ్లు, బావురు పిల్లులు వంటి అంతరించి పోతున్న జీవరాసులు అక్కడ ఉండటంతో అనుమతులకు కొంత సమయం పట్టింది. డీఆర్డీఓ చైర్మన్‌గా పనిచేసిన సతీష్‌రెడ్డి తెలుగువారు కావడంతో గతంలో ఈ ప్రాజెక్టు కోసం ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. -
ప్రధాని సభకు జనసమీకరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రధాన నరేంద్రమోదీ చేతుల మీదుగా శుక్రవారం నిర్వహించే రాజధాని పునఃనిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ప్రభుత్వం ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి భారీ జనసమీకరణ చేస్తోంది. ఒక్కో నియోజకవర్గానికి లక్ష్యం నిర్దేశించి బస్సులను కేటాయిస్తోంది. విజయవాడ నగరంలోని మూడు సర్కిళ్లకు ఒక్కో సర్కిల్‌కు 50 చొప్పున 150 బస్సులు కేటాయించారు. రూరల్‌లోని 16 మండలాలకు ఒక్కో మండలానికి 45 నుంచి 50 బస్సులు ఏర్పాటు చేశారు. జనసమీకరణ బాధ్యతలు స్థానిక నాయకత్వం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్టు, టెక్నికల్ అసిస్టెంట్లు, వెలుగు బుక్ కీపర్లు, సచివాలయాల ఎంఎస్‌కేలకు అప్పగించారు. ఇప్పటికే శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే వారి వివరాలను సేకరించి సిద్ధం చేశారు. ఒక్కో బస్సుకు ఇన్చార్జిగా సచివాలయాల పరిధిలో లైజనింగ్ ఆఫీసర్లను నియమించారు. శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యే వారికి అల్పాహారం, మధ్యాహ్నభోజనం, రాత్రి భోజనం ఏర్పాట్లు చేశారు. చిల్లకల్లు టోల్ ప్లాజా, కొణకంచి అడ్డరోడ్డు వద్ద పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో భోజనం వాటర్ ప్యాకెట్లను సిద్దం చేశారు. ఇబ్రహీంపట్నం అడ్డరోడ్డు వద్ద భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. గ్రామాలకు చేరిన బస్సులు ఇప్పటికే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సులు, ప్రైవేటు వాహనాలు ఆయా గ్రామాలకు చేరుకున్నాయి. డ్వామా, మెప్మా, డీఆర్డీఏ సిబ్బంది జన సమీకరణలో తలమునకలయ్యారు. ఉపాఽధి కూలీలు, డ్వాక్రా మహిళలు, రైతులు ఇలా వేర్వేరుగా బస్సులు కేటాయించారు. బస్సులను నింపే బాధ్యత వారికి అప్పగించారు. ప్రధాని పర్యటన కావడంతో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరం ప్రాంతాల నుంచి సభకు హాజరయ్యే వారు వెస్ట్ బైపాస్ సర్వీస్ రోడ్డు ద్వారా సభ ప్రాంగణానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. అయితే జనసమీకరణ చేయలేక సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఈ దఫా అంగన్వాడీ వర్కర్లను కార్యక్రమానికి దూరంగా ఉంచడం విశేషం భారీగా బస్సులు ఉపాఽధి కూలీలను, డ్వాక్రా మహిళలను తరలించడానికి సన్నాహాలు -
కృష్ణాజిల్లా
గురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2025సెలవుల్లో సరదాగా.. ప్రశాంతంగా పాలిసెట్ –8లోuభక్తిశ్రద్ధలతో మహాలక్ష్మి యాగం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అక్షయ తృతీయను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో బుధవారం మహాలక్ష్మి యాగాన్ని నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని నూతన యాగశాలలో ఆలయ అర్చకులు యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సకల జన సంక్షేమార్థం, లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ వేద పండితులు, అర్చకులు యాగాన్ని జరిపించారు. అమ్మవారి మూలవిరాట్‌కు ఎర్ర కలువలతో విశేష అర్చన జరిగింది. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు జరిపించారు. అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకొని తరించారు. ఉద్యోగ విరమణ చేసిన పోలీసులకు సత్కారం విజయవాడస్పోర్ట్స్: సుదీర్ఘ కాలం క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) కె.జి.వి.సరిత వీడ్కోలు పలికారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ పోలీసులు పి.వి.రమణ(సీపీవో), అబ్దుల్ కలామ్(ఎస్ఐ), కె.రామకృష్ణంరాజు(ఎస్ఐ), ఏ.శ్రీనివాసరావు(ఎస్ఐ), కె.సత్యనారాయణ(ఎస్ఐ), కె.వి.డి.మల్లేశ్వరి(ఎస్ఐ), ఏ.రామరావు(ఏఎస్ఐ), సి.హెచ్.కృష్ణారెడ్డి(ఏఎస్ఐ), ఎల్.విజయరాజు(హెడ్‌కానిస్టేబుల్), డి.శ్రీనివాసరావు(హోంగార్డు), ముల్లంగి సుబ్బులు(హోంగార్డు)లను ఆమె ఘనంగా సత్కరించారు. ట్రాఫిక్ డీసీపీ కృష్ణమూర్తినాయుడు, కార్యాలయ ఏవో సునీత తదితరులు పాల్గొన్నారు. స్కేటింగ్ ఆసియా చాంపియన్‌షిప్‌నకు జెస్సీరాజ్ విజయవాడస్పోర్ట్స్: ఆర్టిస్టిక్ స్కేటింగ్ అండర్–14 ఆసియా చాంపియన్‌షిప్‌నకు జెస్సీరాజ్ మాత్రపు అర్హత సాధించింది. జూలై 20 నుంచి 30వ తేదీ వరకు దక్షణకొరియాలో జరిగే ఈ చాంపియన్‌షిప్‌నకు జెస్సీ మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ఇటీవల జరిగిన జాతీయ జట్టు ఎంపిక పోటీల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం ప్రదర్శించి ఈ పోటీలకు ఎంపికై ంది. మే 15 నుంచి 30వ తేదీ వరకు, జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు మెహాలీలో రెండు విడతలుగా జరిగే భారత్ క్యాంప్‌నకు ఆమె హాజరుకానుంది. పటమటలోని ఎన్ఎస్ఎం స్కూల్లో జెస్సీ పదో తరగతి చదువుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్కూల్ ప్రిన్సిపాల్ రాయప్పరెడ్డి ఆమెను ప్రత్యేకంగా అభినందించి, సత్తా చాటాలని ఆకాంక్షించారు.జి.కొండూరు: ‘వేటాడేది ఒకటి.. పరిగెత్తేది ఇంకొకటి.. దొరికిందా ఇది సస్తాది.. దొరక్కపోతే అది సస్తాది.. ఒక జీవికి ఆకలేసిందా.. ఇంకొక జీవికి ఆయువు మూడిందే’ అంటూ ఓ సినీ కవి రాసిన పాట అక్షరసత్యం. ప్రతి జీవి తన జీవన మనుగడ కోసం చేసే పోరాటంలో ఇది భాగం. కానీ అన్ని తెలిసీ.. అన్నీ అందుబాటులో ఉండీ, బతకడానికి ఎన్నో మార్గాలున్న మనిషి సైతం ప్రకృతి సమతుల్యతలో భాగమైన వన్య ప్రాణులను వేటాడుతూ, దానినే జీవనాధారంగా మార్చుకోవడం సహించలేని విషయం. వేటగాళ్ల ప్రభావంతో ఎంతో అరుదైన అటవీ జంతు సంపద కనుమరుగవుతోంది. ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తు తరాలకు వన్యప్రాణులను చిత్రాలలో చూపించడం తప్ప ప్రత్యక్ష ప్రదర్శన కష్ట తరంగా మారే అవకాశం ఉందని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాహార్తి కోసం పొలాల వైపు.. ఎన్టీఆర్ జిల్లాలో 39వేల హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉంది. ఈ అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల వేట యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వేసవి ఎండలు మండుతున్న క్రమంలో నీటి కోసం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే వన్య ప్రాణులు శివారు వ్యవసాయ భూముల, వాగులు, వంకల వైపు వస్తూ ఉంటాయి. యథేచ్ఛగా వేట.. వేటగాళ్లు ఇదే అదునుగా భావించి వన్య ప్రాణుల పాద ముద్రల ఆధారంగా ఏ జంతువులు సంచరిస్తున్నాయో పసిగట్టి ఉచ్చులు పెడుతున్నారు. వ్యవసాయ భూములు వైపు వస్తున్నాయని పసిగడితే విద్యుత్ తీగల ఆధారంగా వన్య ప్రాణులకు షాకు తగిలేలా ఉచ్చులు పెట్టి జంతువులను పట్టుకుంటున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం, జగ్గయ్యపేట, చందర్లపాడు, వీర్లపాడు, ఏ.కొండూరు, గంపలగూడెం మండలాల పరిధిలోని అటవీ, కొండ ప్రాంతాలలో వేట ఎక్కువగా కొనసాగుతున్నట్లు సమాచారం. వ్యాపారంగా మార్చుకొని.. అటవీ, కొండ ప్రాంతాలలో జంతువులను వేటాడి మాంసాన్ని విక్రయించడం వేటగాళ్లు వ్యాపారంగా మార్చుకున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని అటవీ ప్రాంతాలలో ఎక్కువగా లభించే అడవి పంది, కణుజు, దుప్పి, కొండ గొర్రె, కుందేళ్లు, అరుదైన పక్షులను వేటాడి జంతువును బట్టి కేజీ మాంసం రూ.400 నుంచి 800వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వేసవి కాలం మినహా మిగతా కాలాల్లో అడవి జంతువులు చిక్కని సమయాల్లో కొండముచ్చులను వేటాడి ఆ మాంసాన్నే దుప్పి మాంసంగా విక్రయిస్తున్నట్లు సమాచారం. వేటగాళ్లు పగటి సమయంలో ప్రత్యేకమైన పద్ధతుల్లో ఉచ్చులను పెట్టి రాత్రి సమయాలలో వేట కుక్కలను వెంట తీసుకెళ్లి వేటను కొనసాగిస్తున్నట్లు సమాచారం. అటవీశాఖ అధికారులు పర్యవేక్షణ లోపం వల్లే వేటగాళ్ల ఆగడాలు కొనసాగుతున్నాయని జంతు ప్రేమికులు విమర్శిస్తున్నారు. ఆటాడుకుందాం రండి.. విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో వేసవి సందర్భంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో మే 1 తేదీ నుంచి 31వరకు వేసవి ఉచిత క్రీడా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్స్, స్కేటింగ్ రింక్లలో శిక్షణ తరగతులు జరుగుతాయి. ● స్విమ్మింగ్.. గాంధీనగర్‌లోని జింఖానా గ్రౌండ్స్ దగ్గర ఉన్న సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్, గురునానక్ నగర్‌లోని కార్పొరేషన్ స్విమ్మింగ్ పూల్, చిట్టినగర్‌లోని డాక్టర్ కేఎల్ రావు స్విమ్మింగ్ పూల్స్‌లో శిక్షణ ఇస్తారు. ● బ్యాడ్మింటన్.. బందరురోడ్డులోని దండమూడి రాజగోపాలచారి ఇండోర్ స్టేడియంలో, పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో శిక్షణ తరగతులు జరుగుతాయి. ● స్కేటింగ్.. సత్యనారాయణపురంలోని జీవీఎస్ శాస్త్రి పార్కులో, భవానీపురంలోని రోజ్ గార్డెన్ పార్కులో, దండమూడి రాజగోపాలచారి ఇండోర్ స్టేడియంలో స్కేటింగ్‌లో శిక్షణ ఇస్తారు. ● యోగ.. పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో యోగాలో ఉచిత శిక్షణ తరగతులు కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి బుధవారం నిర్వహించిన పాలిసెట్–2025 ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 88.27 శాతం విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా అధికారులు 18 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 7,661 మంది విద్యార్థులను కేటాయించగా వారిలో 6,762 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరిగింది. విద్యార్థులు గంట ముందుగా పది గంటలకే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించలేదు. జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. విజయసారథి పరీక్షను పర్యవేక్షించారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు నో ఎంట్రీ.. నగరంలోని పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులోని నలంద విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి నున్నకు చెందిన విద్యార్థి సందీప్, కండ్రిక నుంచి వచ్చిన వర్షిత్‌కుమార్ వారి ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో చేరుకున్నారు. అయితే అప్పటికే 11 గంటలు దాటడంతో అధికారులు వారిని అనుమతించలేదు. వారితో పాటుగా మరో ఇద్దరు విద్యార్థులు సైతం ఆలస్యంగా రావడంతో వారూ వెనుదిరిగి వెళ్లిపోయారు. కృష్ణాలో 4,083 మంది హాజరు.. మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లాలోని మొత్తం 10 కేంద్రాల్లో 4,562 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 4,083 మంది హాజరయ్యారని జిల్లా పరిశీలకుడు ఎ.శివప్రసాద్ తెలిపారు. వీరిలో 2,689 మంది బాలురకు గాను 2,424 మంది, 1,873 బాలికలకు గాను 1,659 మంది హాజరయ్యారని చెప్పారు. 7న్యూస్‌రీల్ రాత్రి సమయాల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న వేట జంతు మాంసం విక్రయాలను వ్యాపారంగా మార్చుకున్న వేటగాళ్లు కనుమరుగవుతున్న అరుదైన అటవీ జంతు సంపద వేసవి తాపంతో నీటి కోసం అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న వన్య ప్రాణులు ఎన్టీఆర్ జిల్లాలో 39 వేల హెక్టార్లలో అటవీ ప్రాంతంఇటీవల కొన్ని ఘటనలు.. గతంలో ఉమ్మడి కృష్ణాజిల్లా, ప్రస్తుత ఏలూరు జిల్లా పరిధి ముసునూరు మండలంలోని వేలుపుచర్ల శివారు అటవీ ప్రాంతంలో ఏప్రిల్ 12వ తేదీన వేటగాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న నాలుగు అడవి పందులను అటవీశాఖ అధికారులు ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండల పరిధి మునగపాడు గ్రామ శివారులోని గ్రంథివాని చెరువు వద్ద అడవిలో వదిలేశారు. ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండల పరిధి గంగినేనిశివారులోని కొండ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం పెట్టిన ఉచ్చు తగిలి ఇదే గ్రామానికి చెందిన మేకల కాపరి కాలికి తీవ్ర గాయమైన ఘటన ఇటీవల జరిగింది. ఉచ్చు పెట్టిన వేటగాడు ఎవరో తెలియకపోవడంతో ఎటువంటి ఫిర్యాదు చేయకుండా వైద్యం చేయించుకొని వదిలేశారు. నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.. కొండపల్లి ఫారెస్ట్ సెక్షన్లో వేట జరగకుండా సిబ్బందితో కలిసి నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. జంతువుల కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులను ఇప్పటి వరకు ముప్పై వరకు తొలగించి నిర్యీర్యం చేశాం. ఈ ఉచ్చులన్నీ ఎక్కువగా మొక్కజొన్న చేలు, జంతువులు నీటి కోసం వచ్చే ప్రదేశాలలో పెడుతున్నారు. వేటాడుతూ ఎవరైనా చిక్కితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – ఎం.రామిరెడ్డి, కొండపల్లి ఫారెస్ట్ సెక్షన్ డీఆర్ఓ -
ర్యాంకుల ఫ్యాక్టరీల్లో మార్కుల యంత్రాల్లా విపరీతమైన ఒత్తిడిలో కాలం గడిపే విద్యార్థులకు వేసవి సెలవులు గొప్ప విరామం. ఈ సమయాన్ని విద్యార్థులు ఎక్కువగా వినోదానికి కేటాయిస్తారు. అయితే చిన్నారులు, యువత తమ నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు గొప్ప అవకాశాలు కల్పిస్
‘యోగా’నందం.. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలోని ఈ–బ్లాక్ ఉన్న అమరావతి యోగ అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు ఉచిత శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. వీటిలో యోగాసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాల్లో శిక్షణ ఇస్తారు. వివరాలకు 90147 46719, 98487 32626లో సంప్రదించవచ్చు. డ్యాన్స్ బేబీ డ్యాన్స్.. విజయవాడ బందరురోడ్డులోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో అమరావతి బాలోత్సవం ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్, మ్యాథ్స్, హ్యాపీ హ్యాపీ సమ్మర్ పేరుతో డ్యాన్స్‌లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్లో ఎంఎస్ ఆఫీస్, ట్యాలీ, డీపీపీ, కోలెడ్రా, సీ–లాంగ్వేజ్‌లో యువతీ యువకులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. వివరాలకు 90145 41958లో సంప్రదించవచ్చు. శ్లోకం.. భావం.. చిన్మయ మిషన్ విజయవాడ ఆధ్వర్యంలో చిన్మయ బాలల వేసవి శిబిరం–2025 పేరుతో 7 నుంచి 13ఏళ్ల లోపు బాల, బాలికలకు సంస్కృతి–సంప్రదాయాలు పేరుతో వివిధ అంశాల్లో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. యోగా, భగవద్గీతలోని కథలు, శ్లోకాలు, భజనలు, గేమ్స్, క్విజ్, ఆర్ట్స్, పజిల్స్ అంశాల్లో శిక్షణ ఇస్తారు. ఆసక్తి ఉన్న వారు సూర్యారావు పేటలోని చిన్మయ మిషన్ కేంద్ర కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ‘ఆర్ట్’ఫుల్ స్కిల్.. మొగల్రాజపురం రావిచెట్టు సెంటర్లో ఉన్న జనశిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో వేసవి సందర్భంగా చాక్లెట్ మేకింగ్, శారీ వర్క్, ఫ్లవర్ మేకింగ్, మిర్రర్ వర్క్, స్క్రీన్ ప్రింటింగ్, పెయింటింగ్ ఆర్టికల్స్ కోర్సుల్లో ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 0866–2470420లో సంప్రదించవచ్చు. -
ఐసెట్ నిర్వహిస్తే అడ్డుకుంటాం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పీజీ చదవాలనుకునే పేద విద్యార్థులకు గుదిబండలా మారిన జీవో 77ను రద్దు చేసి, ఆతర్వాతే ఈ ఏడాది ఐసెట్ పరీక్షను నిర్వహించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండగా నారా లోకేష్ యువగళం పాదయాత్రలో జీవో 77 రద్దు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఒక విద్యా సంవత్సరం ముగిసిపోయిందని, లోకేష్ ఇచ్చిన హామీ అలాగే మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. ఈ ఏడాది నిర్వహించే ఐసెట్ పరీక్షకు ముందే జీఓను రద్దు చేయాలని, లేని పక్షంలో ఐసెట్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సమితి సభ్యుడు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి -
రెండేళ్ల తర్వాత తల్లి చెంతకు చేరిన బాలుడు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రెండేళ్ల క్రితం తప్పిపోయిన బాబును నవజీవన్ బాలభవన్ సురక్షితంగా తల్లి చెంతకు చేర్చింది. వివరాలు... కృష్ణాజిల్లా పెదకళ్లేపల్లికి చెందిన బుజ్జిబాబు(12) అనే బాలుడు రెండేళ్ల క్రితం 2023 జూలై 3న తప్పిపోయాడు. అదే గ్రామానికి చెందిన మహిళా సంరక్షక అధికారి భానుప్రియ కంటబడడంతో ఆమె రక్షించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట ప్రవేశపెట్టారు. కమిటీ తాత్కాలిక వసతి కోసం బాబును నవజీవన్ బాలభవన్ ఓపెన్ షెల్టర్‌కు అప్పగించింది. షెల్టర్‌లో నిత్యావసరాలు అందించి కౌన్సెలింగ్ నిర్వహించగా తనది పెద్ద కళ్లేపల్లి గ్రామమని, ఇతర వివరాలు తెలియవని చెప్పాడు. తల్లిదండ్రుల వివరాలు చెప్పలేదు. నవజీవన్ ఫీల్డ్ స్టాఫ్ బాబును పెదకళ్లేపల్లి గ్రామానికి తీసుకెళ్లి వివరాలు సేకరించే ప్రయత్నాలు చేయగా ఫలించలేదు. అక్కడి పెద్దలను కలవగా బాబు తల్లిదండ్రులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు తెలిపారు. ఆ తర్వాత బుజ్జిబాబును తిరిగి సీడబ్ల్యూసీ ముందు ప్రవేశపెట్టగా చిగురు చిల్డ్రన్స్ హోంకు, ఆ తర్వాత దీపానివాస్కు పంపారు. రెగ్యులర్ స్కూల్ జాయినింగ్, ఆధార్ కార్డు కోసం సిబ్బంది బాబును మరోసారి పెద్దకళ్లేపల్లి గ్రామానికి తీసుకెళ్లగా అక్కడ పాఠశాల ఉపాధ్యాయుడు అతని వివరాలు తెలియజేశారు. స్కూల్లో జాయిన్ చేసినా వెళ్లకపోవడంతో మళ్లీ నవజీవన్ బాలభవన్‌కు పంపారు. అక్కడ కౌన్సెలింగ్ ఇస్తూ మరోసారి తల్లిదండ్రుల కోసం ప్రయత్నించగా తల్లి వివరాలు తెలిశాయి. దీంతో నవజీవన్ బాలభవన్ సిబ్బంది బాలుడిని అతని తల్లి చంద్రకళకు సురక్షితంగా అప్పగించారు. కార్యక్రమంలో నవజీవన్ బాల భవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాదర్ నీలం రత్న కుమార్, సంక్షేమ కమిటీ చైర్పర్సన్ కె.సువార్త, ప్రసన్నకుమారి, మమత తదితరులు పాల్గొన్నారు. -
3న కేఎల్‌యూ క్యాంపస్ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థులు అత్యుత్తమ వార్షిక ప్యాకేజీలతో ప్లేస్‌మెంట్స్ సాధించారని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సారథివర్మ తెలిపారు. విజయవాడ మ్యూజియం రోడ్డులో ఉన్న యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది రూ.75 లక్షల వార్షిక ప్యాకేజీతో తమ విద్యార్థి ప్లేస్మెంట్ సాధించటం గర్వకారణమన్నారు. రూ.58 లక్షల ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్‌తో పాటు తమ విద్యార్థులు అనేక రికార్డ్స్ సాధించారని చెప్పారు. ఈ ఏడాది 500కు పైగా కంపెనీలు యూనివర్సిటీని సందర్శించి రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించాయని, ఆరు వేల మందికి పైగా విద్యార్థులు కంపెనీల నుంచి ఆఫర్ లెటర్స్ అందుకున్నారని, 4700 మంది విద్యార్థులు వివిధ ప్యాకేజీలలో ప్లేస్‌మెంట్స్ పొందారని వివరించారు. రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల లోపు వార్షిక ప్యాకేజీలను 35 మందికి పైగా విద్యార్థులు దక్కించుకున్నారన్నారు. సూపర్ డ్రీమ్ కంపెనీలలో 150 మంది విద్యార్థులు ప్లేస్ అయ్యారని చెప్పారు. టీసీఎస్‌లో ఒకేరోజు 617 మంది, కాప్ జెమినీలో 493 మంది, టెక్ మహేంద్రలో 381 మంది ఆఫర్స్ పొందారన్నారు. ఈ ఏడాది జర్మనీ, జపాన్, సింగపూర్, దుబాయ్, మలేషియా వంటి దేశాల్లో అంతర్జాతీయ ప్లేసెమెంట్స్ దక్కించుకున్నారన్నారు. తమ యూనివర్సిటీ విద్యార్థులు సాధించిన విజయాలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులందరిలో ఉత్సాహన్ని నింపేందుకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ విజయోత్సవాన్ని మే మూడో తేదీన వడ్డేశ్వరంలోని యూనివర్సిటీ క్యాంపస్ లో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ప్లేస్‌మెంట్స్ విభాగం డీన్ ఎన్.బి.వి.ప్రసాద్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత సంస్థలైన మైక్రోసాఫ్ట్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్, సిస్కో వంటి కంపెనీలతో పాటు ప్రముఖ కార్పొరేట్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు కూడా పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో యూనివర్సిటీ నైపుణ్యాభివృద్ధి విభాగం డీన్ డాక్టర్ శ్రీనాథ్, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాసరావు, ఎంహెచ్ఎస్ విభాగం డీన్ డాక్టర్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. అతిథులుగా మైక్రోసాఫ్ట్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ కంపెనీ ప్రతినిధులు రూ.75 లక్షల ప్యాకేజీ దక్కించుకున్న కేఎల్‌యూ విద్యార్థి -
యువరాగం కదిలింది.. నవరాగం పలికింది!
విజయవాడ కల్చరల్: సంగీత మూర్తిత్రయంలో ఒకరైన సద్గురు త్యాగరాజ స్వామి 258 వ జయంతి ఉత్సవాలు శ్రీ సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో దుర్గాపురంలోని శివరామకృష్ణ క్షేత్రంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం నాటి కార్యక్రమంలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన యువ కళాకారులు నవ రాగం పలికించారు. చింతలపాటి శ్రీదేవి సంకీర్తన, జీవీఆర్ సంగీత కళాశాల విద్యార్థినులు, మల్లాది అనన్య, మల్లాది అభిజ్ఞ, పుష్పాల షణ్ముఖ్, రాగంపూడి అమూల్య, పసుమర్తి సంధ్య, ముడుంబై లక్ష్మి,, డాక్టర్ యనమండ్ర శ్రీనివాస శర్మ త్యాగరాజ కృతులను ఆలపించారు. యువ వేణువు కళాకారులు వనమాలి, మాధవ్ వేణువుపై హృద్యంగా త్యాగరాజ కృతులను ఆలపించారు. శ్రీ సద్గురు సంగీత సభ కార్యవర్గం బీవీఎస్ ప్రకాష్, గౌరీనాథ్, గాయత్రి గౌరీనాథ్, ప్రసాద్ శర్మ, వీఆర్ సుబ్రహ్మణ్యం, శారదా దీప్తి పాల్గొన్నారు. యువ సంగీత కళాకారులను నిర్వాహకులు ఆత్మీయంగా సత్కరించారు. -
పీఎం పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు
కోనేరుసెంటర్: ఈ నెల 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనను పురస్కరించుకుని జిల్లాలో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు బుధవారం తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గ్రహించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా... ● విశాఖపట్నం నుంచి చైన్నె వైపు వెళ్లే వాహనాలను కాకినాడ జిల్లా కత్తిపూడి సెంటర్ నుంచి వయా కాకినాడ, యానాం, అమలాపురం, రాజోలు, నరసాపురం, మచిలీపట్నం, రేపల్లె, బాపట్ల మీదుగా ఒంగోలుకు మళ్లిస్తారు. ● చైన్నె నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలు ఒంగోలు వద్ద నుంచి త్రోవగుంట, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, మచిలీపట్నం, లోస్రా బ్రిడ్జి, నరసాపురం, అమలాపురం, కాకినాడ, కత్తిపూడి మీదగా విశాఖపట్నం వైపు వెళ్లాలి. ● చైన్నె నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు బుడంపాడు క్రాస్ రోడ్ నుంచి తెనాలి, పులిగడ్డ, మచిలీపట్నం, లోస్రాబ్రిడ్జి, నరసాపురం, అమలాపురం, కాకినాడ, కత్తిపూడి మీదగా విశాఖపట్నం వైపు వెళ్లాలి. ● విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు బైపాస్ మీదుగా వయా గమాన్ బ్రిడ్జి దేవరపల్లి గోపాలపురం, జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి, ఖమ్మం మీదుగా సూర్యాపేట వెళ్లాలి. ● విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు భీమడోలు, ద్వారకాతిరుమల, కామవరపుకోట, చింతలపూడి, ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లాలి. ఏలూరు బైపాస్ నుంచి జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట, ఖమ్మం మీదుగా హైదరాబాద్ వెళ్లాలి. ఏలూరు బైపాస్, చింతలపూడి, సత్తుపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లాలి. ● విశాఖపట్నం నుంచి హైదరాబాదు వెళ్లే వాహనాలు హనుమాన్‌జంక్షన్, నూజివీడు, మైలవరం, ఇబ్రహీంపట్నం, నందిగామ మీదుగా హైదరాబాద్ వెళ్లాలి. ● హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు నందిగామ, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి గామన్ బ్రిడ్జి మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లాలి. ఇబ్రహీంపట్నం, మైలవరం, నూజివీడు, హహనుమాన్జంక్షన్, ఏలూరు మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లాలి. ● విజయవాడ విమానాశ్రయంకు వచ్చే వాహనదారులు రామవరప్పాడు ఫ్లై ఓవర్ మీదుగా ఆంధ్రజ్యోతి, ముస్తాబాద, సూరంపల్లి అండర్ పాస్ ద్వారా కొత్త బైపాస్ రోడ్డుపై నుంచి బీబీ గూడెం అండర్ పాస్ ద్వారా గన్నవరం చైతన్య స్కూల్ జంక్షన్ వద్ద ఎన్ హెచ్ 16 కు వచ్చి అక్కడి నుంచి విజయవాడ విమానాశ్రయానికి వెళ్లాలి. ఈ ట్రాఫిక్ మళ్లింపులో కేవలం భారీ వాహనాలను మాత్రమే మళ్లిస్తారు. ఈ ప్రక్రియ ఈ నెల ఒకటో తేదీ రాత్రి 10 గంటల నుంచి రెండో తేదీ రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటుందని చెప్పారు. -
దేవాలయాల్లో భక్తులకు భద్రత కరువు
గుణదల(విజయవాడ తూర్పు): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేవాలయాల్లో భక్తులకు భద్రత కరువైందని, కేవలం ఆదాయంపైనే యావ తప్ప భక్తుల రక్షణ చర్యల గురించి పట్టించుకోవటం లేదని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ సాయిరామ్ విమర్శించారు. గుణదలలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవాలయాల ఆదాయంపై ఉన్న దృష్టి భక్తులకు భద్రత కల్పించే విషయంలో లేకుండా పాలకులు నిర్లక్ష్యంగా ఉంటున్నారన్నారు. బుధవారం సింహాచలం దేవస్థానంలో తొక్కిసలాట ఘటన, గతంలో తిరుమలలో చోటుచేసుకున్న తోపులాట ఘటనలు ఇందుకు నిదర్శనమన్నారు. కేవలం దేవదాయ శాఖ అధికారులు, కూటమి నాయకుల నిర్లక్ష్యం కారణంగానే భక్తులు మృత్యువాత పడుతున్నారని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రమే దేవాలయాల కూల్చివేత, విగ్రహాల ధ్వంసం వంటి దుర్ఘటనలను చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. దేవుని విషయంలో అపరాధం చేస్తున్న వారికి దేవుడే తగిన బుద్ధి చెబుతాడని అన్నారు. ఇకనైనా దేవదాయ శాఖ భక్తులకు తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో లీగల్ సెల్ నాయకులు పాల్గొన్నారు. -
కనకమహాలక్ష్మి బ్యాంకులో ఘరానా మోసం
మచిలీపట్నంటౌన్: కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో కోఆపరేటివ్ బ్యాంక్‌లో ఘరానా మోసం వెలుగు చూసింది. నగరంలోని ఆజాద్ రోడ్డులో ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి కో–ఆపరేటివ్ బ్యాంకు ప్రైవేటు లిమిటెడ్‌లో రాజుపేటకు చెందిన గుడిసేవ సునీత అనే మహిళ గత సంవత్సరం మే నెలలో నాలుగు బంగారపు గాజులు తాకట్టు పెట్టి రూ.2.40 లక్షలు అప్పుగా తీసు కుంది. తాకట్టు సమయంలో ఒకటికి రెండుసార్లు గీటురాయితో, యాసిడ్‌తో తనిఖీ చేసుకున్న బ్యాంకు అప్రైజర్ ఈ బంగారం మంచిదేనని నిర్ధారించటంతో యాజమాన్యం ఆమెకు గోల్డ్‌లోన్ మంజూరుచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో బ్యాంకు అధికారులు సునీత ఇంటికి వెళ్లి గత ఏడాది మీరు బ్యాంకులో పెట్టిన నాలుగు గాజులు నకిలీవని తేలిందని, వెంటనే వాటిని విడిపించుకుని తీసుకువెళ్లాలని సూచించారు. అయితే తాను పెట్టింది స్వచ్ఛమైన బంగారమని నిర్ధారించే రుణం ఇచ్చారని, ఇప్పుడు అవి నకిలీవని ఎలా చెబుతారని సునీత వారిని ప్రశ్నించింది. ఆడిటింగ్‌లో సుమారు 25 ఖాతాలకు చెందిన బంగారం నకిలీవని తేలిందని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఆమె విస్తుపోయింది. అప్రైజర్, బ్యాంకు అధికారులు కుమ్మక్కై తన బంగారం కాజేశారని దీనిపై పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా బ్యాంకు వారు చెప్పినట్లు చేసి వ్యవహారం సరిచేసుకోవాలని సూచించారని తెలిపింది. బ్యాంకులో పనిచేస్తున్న అప్రైజర్‌పై పలు బ్యాంకులను మోసం చేసిన కేసులు ఉన్నాయని, ఈ మధ్యే అతనిపై దొంగ నోట్ల కేసు కూడా నమోదైందని ఆమె తెలిపారు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ నాగేశ్వరరావును వివరణ కోరగా అప్రైజర్, సునీత కుమ్మకై ్క రుణం తీసుకున్నారని చెప్పారు. పోలీస్ కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తే, వారు పిల్లలు కలవారని కేసు వరకు వెళ్లలేదని బదులివ్వడం గమనార్హం. బ్యాంకులో 25 ఖాతాలకు సంబంధించి దాదాపు రూ.40 లక్షల మేరకు గోల్మాల్ జరిగినట్టు తెలుస్తోంది. అయితే బ్యాంకు పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుందనే ఉద్దేశంతో పోలీసు కేసు పెట్టలేదని, ఈ మొత్తం అప్రైజర్ నుంచి రికవరీ చేసేలా మేనేజర్ కాగితాలు రాయించుకున్నారని తెలుస్తోంది. కుదువపెట్టిన బంగారం మాయం చేసి నకిలీ బంగారం చూపుతున్నారని ఆరోపిస్తున్న బాధితురాలు గోల్డ్ అప్రైజర్ నకిలీ బంగారం తయారు చేయించి బ్యాంకులో జమ చేశారనే అనుమానాలు గోల్డ్ అప్రైజర్‌పై గతంలో దొంగనోట్ల కేసు ఉందని ఆరోపణలు 25 ఖాతాలకు సంబంధించి సుమారు రూ.40 లక్షల కుంభకోణం -
పహల్గాం ఉగ్రదాడి అమానుషం
విజయవాడస్పోర్ట్స్: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో అమాయకులైన 26 మంది పర్యాటకులపై కాల్పులు జరిపి ప్రాణాలు తీయడం అమానుషమని ఆర్టీఓ వెంకటేశ్వరరావు, రవాణా శాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం.రాజుబాబు అన్నారు. ఎంజీ రోడ్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో ఉద్యోగులు జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరుల ఆత్మ శాంతించాలని కోరుతూ నివాళులర్పించారు. ఉగ్రవాదం నశించాలని కోరుతూ ప్ల కార్డులను పట్టుకొని ప్రదర్శన చేశారు. అనంతరం ఆర్టీఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కుటుంబీకుల కళ్ల ముందే ఉగ్రవాదులు కాల్పులు జరిపి ప్రాణాలు తీశారన్నారు. వాళ్ల కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న మానసిక క్షోభ మాటల్లో చెప్పలేమన్నారు. ఇంతటి దారుణానికి పాల్పడిన ముష్కరులపై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. అమరులకు నివాళి.. ఏపీ రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు రాజుబాబు మాట్లాడుతూ.. భారత ప్రజల ఐక్యతను దెబ్బతీసేందుకు మతం ఆధారంగా బాధితులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారన్నారు. ఈ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రెకేత్తించిందన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడిన ఆయా దేశాలపై కఠినంగా వ్యవహరించే విధంగా, తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపుతూ భారత ప్రభుత్వం తీసుకొని నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలన్నారు. భారతీయ హిందూ, ముస్లిం సోదరులు ఎప్పటికీ అన్నదమ్ముల్లవలే కలిసే ఉంటారన్నారు. దేశంలో మత ఘర్షణలు పెట్టే విధంగా ముష్కరులు మతం పేరును అడిగి మరి కాల్చి చంపారన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఉగ్రదాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏపీ రవాణాశాఖ కానిస్టేబుల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భద్రాచలం(రాజా), ఏవోలు సత్యనారాయణ, చంద్రకళ, జోనల్ సంఘం పూర్వపు సహాధ్యక్షురాలు జి.ఉషాసోదరి, కోశాధికారి రామచంద్రరాజు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
భార్యపై కత్తితో దాడి చేసిన భర్త
గుడివాడరూరల్: అనుమానం పెనుభూతమై భార్యపై కత్తితో భర్త విచక్షణా రహితంగా దాడి చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన మట్టా అశోక్, భూమికలకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న అశోక్ చెడు అలవాట్లకు బానిసై తరచూ అనుమానంతో భార్యను వేధిస్తుండేవాడు. ఇటీవల జరిగిన గొడవతో భార్య భూమిక పిల్లలను తీసుకుని సమీపంలో నివాసముంటున్న తల్లి రాణి ఇంటికి వెళ్లింది. ఈక్రమంలో మంగళవారం తన బట్టలు తీసుకునేందుకు చెల్లి అనుష్కతో కలిసి భర్త అశోక్ ఇంటికి వెళ్లిన భూమికపై భర్త కత్తితో విచక్షణా రహితంగా మొఖంపై దాడి చేసి పొట్టలో పొడిచాడు. అడ్డుకోబోయిన చెల్లిపై కూడా దాడి చేయడంతో ఆమె చేతికి తీవ్ర గాయమైంది. అనంతరం అశోక్ పరారయ్యాడు. గాయపడిన వారు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి వారిని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. భూమిక పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య సేవల నిమిత్తం విజయవాడ తరలించారు. బాధితురాలి తల్లి రాణి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ వి.ధీరజ్ వినీల్, స్థానిక పోలీస్ అధికారులతో కలిసి గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చి ఘటనపై ఆరా తీశారు. అనంతరం ఇందిరానగర్ కాలనీలోని సంఘటనా స్థలానికి డీఎస్పీ వెళ్లి పరిశీలించారు. -
మెటల్ డిటెక్టర్లకు మరమ్మతులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని క్యూలైన్లలో ఏర్పాటు చేసిన మెటల్ డిటెక్టర్లకు ఇంజినీరింగ్(ఎలక్ట్రికల్) సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. దుర్గగుడి భద్రత ప్రశ్నార్థకం శీర్షికన మంగళవారం సాక్షి ప్రచురించిన కథనానికి ఆలయ ఈవో కె.రామచంద్రమోహన్ స్పందించారు. ఈవో ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడారు. వెంటనే క్యూలైన్లలోని మెటల్ డిటెక్టర్లకు మరమ్మతులు చేపట్టి పని చేసేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆలయ ఇంజినీరింగ్ సిబ్బంది అమ్మవారి ఆలయ ప్రాంగణంతో పాటు మహా మండపం క్యూలైన్లలోని మెటల్ డిటెక్టర్లకు మరమ్మతులు చేపట్టారు. అదే విధంగా అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తుల లగేజీ, బ్యాగులను క్లోక్‌రూమ్‌లో భద్రపరుచుకునేలా సెక్యూరిటీ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. హ్యాండ్ బ్యాగులు, పర్సులు మినహా ఇతర ఏ బ్యాగులను ఆలయంలోకి అనుమతించలేదు. బ్యాగులు, సంచులతో ఆలయంలోకి నో ఎంట్రీ -
బీచ్‌ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం
మచిలీపట్నంరూరల్: బీచ్‌ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మే 15, 16, 17 తేదీల్లో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్స్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన పలువురు అధికారులతో కలిసి బీచ్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి 980 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతం ఉందని, మంగినపూడి బీచ్‌ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. ఇందుకోసం బీచ్‌లో 150 ఎకరాలను గుర్తించామని, ఇంకా మరో 200 నుంచి 300 ఎకరాలు కూడా గుర్తించే పనులు జరుగుతున్నాయని, ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ నిధులతో రిసార్ట్స్, హోటళ్ల కోసం స్థలాలు కూడా కేటాయిస్తామని చెప్పారు. తద్వారా 1,000 నుంచి 1,500 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయన్నారు. ఈసారి ఉత్సవాల్లో జాతీయ క్రీడలు కయా కింగ్, బీచ్ కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు అనుమతులు వచ్చాయని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, మెప్మా పీడీ సాయిబాబా, రహదారులు భవనాల డీఈ సంగీత, తహసీల్దార్ నాగభూషణం, మైరెన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జగదీష్ చంద్రబోస్, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె నాని, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
వక్ఫ్ ఉద్యమం రాజ్యాంగ పరిరక్షణ పోరాటమే
లబ్బీపేట(విజయవాడతూర్పు): వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమం ముమ్మాటికీ రాజ్యాంగ పరిరక్షణ పోరాటమేనని ముస్లం పర్సనల్ లా బోర్డు జాతీయ సభ్యులు జాకీర్ రషాదీ, మహమ్మద్ ఇషాక్ స్పష్టం చేశారు. ఆ చట్ట సవరణ చేయడం మతస్వేచ్ఛపై దాడిగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు జాతీయ కార్యాచరణలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో మంగళవారం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులతో పాటు వేర్వేరు జిల్లాల్లోని ముస్లిం జేఏసీ సభ్యులు, జిల్లాల కన్వీనర్లు, జమాత్‌ల ప్రతినిధులు హాజరయ్యారు. జాకీర్ రషాదీ, మహమ్మద్ ఇషాక్ మాట్లాడుతూ.. దేశ పౌరులు అందరికీ మత స్వేచ్ఛ కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25, 26, 27, 28లను ఉల్లంఘిస్తూ, ఇతర మతాలకు వర్తించని నిబంధనలు ముస్లింలకు ఎందుకని ప్రశ్నించారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో జూలై వరకూ ఉద్యమ కార్యాచరణ రూపొందించామని, శాంతియుత ఉద్యమాలు చేస్తామన్నారు. నేడు లైట్లు ఆర్పి నిరసన ఈ నెల 30వ తేదీ బుధవారం రాత్రి 9 నుంచి 9.15 గంటల వరకూ ఇళ్లలో, ఫ్యాక్టరీలలో దుకాణాల్లో విద్యుత్ దీపాలు ఆర్పి వేసి నిరసన తెలపాలని నిర్ణయించినట్లు జాకీర్ రషాదీ, మహమ్మద్ ఇషాక్ తెలిపారు. ప్రజాస్వామ్య వాదులు, లౌకిక వాదులు ఈ నిరసనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వక్ఫ్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ రఫీక్ అహ్మద్ మాట్లాడుతూ.. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు అందరూ భారతీయులేనన్న రాజ్యాంగ స్పృహకు భిన్నంగా మత విభజన రాజకీయాలను కేంద్ర ప్రభుత్వం చేస్తోందన్నారు. అందుకు వక్ఫ్ సవరణను అడ్డుకుని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. ముస్లిం జేఏసీ కన్వీనర్ మునీర్ అహ్మద్ మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న శాంతియుత ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఈ అంశంపై సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జమ్యియ్యత్ అహ్లెహదీస్ ప్రతినిధి నసీర్ అహ్మద్ ఉమ్రి, మజ్లిస్ ఉల్ ఉలేమా ప్రతినిధులు ముఫ్తి యూసుఫ్, ముఫ్తి హబీబ్, మిల్లీ కౌన్సిల్ ప్రతినిధి ముఫ్తి ఆసిఫ్, పయమే ఇన్సానియత్, మౌలానా మక్బూల్ నద్వి, ముక్తార్ అలీ, న్యాయవాది అబ్దుల్ మతీన్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు జాతీయ సభ్యులు జాకీర్ రషాదీ, మహమ్మద్ ఇషాక్ విజయవాడలో వక్ఫ్ చట్ట సవరణపై రాష్ట్ర స్థాయి వర్క్‌షాపు -
డీఆర్డీవో కేంద్రం రాష్ట్రానికే గర్వకారణం
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ అవనిగడ్డ/నాగాయలంక: కృష్ణాజిల్లా నాగాయలంక మండలం గుల్లలమోదలో ఏర్పాటు చేయనున్న డీఆర్డీఏ కేంద్రం రాష్ట్రానికే గర్వకారణమని కృష్ణా జిల్లా కలెక్టర్ డి. బాలాజీ అన్నారు. గుల్లలమోదలో ఏర్పాటు చేసిన డీఆర్డీవో క్షిపణి పరీక్ష కేంద్రాన్ని మంగళవారం ఎస్పీ గంగాధర్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సంబంధించి డీఆర్డీఏ సెక్రటరీ డాక్టర్ సమీర్ వి. కామత్‌తో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మే నెల 2వ తేదీన అమరావతి ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ పద్ధతిలో గుల్లలమోద క్షిపణి పరీక్ష కేంద్రాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఇందుకోసం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసా రం ద్వారా వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. అందుకు సంబంధించిన భద్రతా చర్యలను ఆయన ఎస్పీతో చర్చించారు. అధికారికంగా సమాచారం అందాల్సి ఉందని, అందిన వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. పటిష్ట బందోబస్తు.. ఎస్పీ గంగాధర్ మాట్లాడుతూ డీఆర్డీఏ కేంద్రం ఏర్పాటు జిల్లాకే తలమానికమని అన్నారు. ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చే ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో డీఆర్డీఏ కల్నల్ సమీర్, ఆర్డీవో స్వాతి, అవనిగడ్డ డీఎస్పీ టి. విద్య, తహశీల్దార్ హరనాథ్, ఏడీఐవోలు ఫణికుమార్, సెల్వినా పాల్గొన్నారు. -
పోర్టు పనులు సకాలంలో పూర్తి చేస్తాం
మంత్రి జనార్దనరెడ్డి చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం పరిసర ప్రాంతాల ప్రజల చిరకాల వాంఛ అయిన పోర్టు నిర్మాణాన్ని సకాలంలో పూర్తిచేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బి.సి.జనార్దనరెడ్డి అన్నారు. మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి పోర్టు నిర్మాణ పనులను ఆయన సోమవారం పరిశీలించారు. పోర్టు అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోర్టు మ్యాప్‌ను పరిశీలించిన అనంతరం మంత్రి జనార్దనరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 30 శాతం పోర్టు నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు. సకాలంలో పోర్టు నిర్మాణం పూర్తి చేసేలా కాంట్రాక్టర్లను ఆదేశించామన్నారు. అమరావతికి అతిసమీపంలో ఉన్నందున మచిలీపట్నం పోర్టు కీలకంగా మారనుందన్నారు. త్వరితగతిన ఫిషింగ్ హార్బర్ పనులు త్వరితగతిన గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ పనులను పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు ఇస్తామని మంత్రి జనార్దనరెడ్డి పేర్కొన్నారు. మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, వంగలపూడి అనితతో కలిసి హార్బర్ పనులను జనార్దన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం జనార్దనరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే దాదాపు 57 శాతం హార్బర్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. 2026 మార్చి నాటికి ఈ పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో రెండోసారి కాలపరిమితి పొడి గించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ.3,500 కోట్లతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను పూర్తి చేస్తున్నామన్నారు. గిలకలదిండి హార్బర్ నిర్మాణం పూర్తయ్యాక ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు మంత్రి కొల్లు రవీంద్ర కృషి చేస్తున్నారన్నారు. జూన్ 15 నాటికి బోట్లు జెట్టీకి వచ్చేలా చర్యలు చేపడ్తామని మంత్రి రవీంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ, ఎస్పీ జి.గంగాధరరావు, మారి టైం బోర్డు సీఈఓ ప్రవీణ్‌ఆదిత్య, ఆర్డీఓ కె.స్వాతి తదితరులు పాల్గొన్నారు. మైరెన్ పోలీస్స్టేషన్ల ద్వారా నిఘా మైరెన్ పోలీస్‌స్టేషన్ ద్వారా తీరప్రాంతాల్లో నిఘా పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. హార్బర్ పనులను పరిశీలించిన అనంతరం ఆమె మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 21 మైరెన్ పోలీస్స్టేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే మూడు మైరెన్ పోలీస్స్టేషన్లు ఉండటం ఎంతో ఉపయోగకరమని వివరించారు. -
అర్జీలను సత్వరం పరిష్కరించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ ఆదేశించారు. అర్జీలు పునరావృతం కాకుండా న్యాయమైన పరిష్కారం చూపాలని సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జాయింట్ కలెక్టర్‌తో పాటు డీఆర్వో చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ట్రైనీ కలెక్టర్ జాహిద్ ఫర్హీన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం జేసీ గీతాంజలి శర్మ మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల నుంచి ఎన్నో వ్యయప్రయాసల కోర్చి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వస్తుంటారని, వారి సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఆయా సమస్యలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఆ సమస్యకు తగిన సమాధానాన్ని అర్జీదారునికి తెలపాలని స్పష్టంచేశారు. కోర్టు కేసులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు సమాధానం పంపుతూ పెండింగ్‌లో లేకుండా క్లోజ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై 168 అర్జీలను అధికారులు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ పీజీఆర్ఎస్లో 168 అర్జీలు స్వీకరణ -
దుర్గగుడి భద్రత ప్రశ్నార్థకం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశమంతా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భద్రతా చర్యలు మచ్చుకైనా కనిపించడం లేదు. ఆలయానికి నిత్యం వేల మంది భక్తులు దుర్గమ్మ దర్శనం కోసం తరలివస్తుంటారు. వారాంతాల్లో అయితే భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది. ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో దుర్గమ్మ ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో నిత్యం రద్దీగా ఉండే ఈ ఆలయంలో కనీస తనిఖీలు కూడా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దసరా ఉత్సవాల సమయంలో దేవస్థానం లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన మెటల్ డిటెక్టర్లు పని చేయడం లేదు. మహామండపం మొదలు అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించే వరకు ఎక్కడా కూడా మెటల్ డిటెక్టర్లు పని చేస్తున్న దాఖలాలు లేవు. ఘాట్‌రోడ్డు మార్గంలో ఉన్న మెటల్ డిటెక్టర్లను లక్ష్మీగణపతి మందిరం పక్కనే ఉన్న గోశాలలో భద్రపరిచారు. లక్ష్మీగణపతి ప్రాంగణంలో షెడ్డు నిర్మాణం కోసం వాటిని తొలగించామని సిబ్బంది చెబుతున్నారు. కనీసం అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించే కీలక మార్గాల్లో వాటిని ఏర్పాటు చేయలేదు. మహామండపం దిగువన ఎటువంటి తనిఖీలు లేకుండానే భక్తుల బ్యాగులను భద్రపరుస్తున్నారు. క్యూలైన్లో ప్రవేశించే వారిని కనీస తనిఖీలు చేయడంలేదు. కొంత మంది భక్తులు బ్యాగులు, సంచులతోనే క్యూలైన్ ద్వారా అమ్మ వారి ఆలయ ముఖ మండపం వరకు వచ్చేస్తున్నారు. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది చేతిలో హ్యాండ్ డిటెక్టర్లు కనిపించడం లేదు. అధికారులు తక్షణం స్పందించి ఆలయంలో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయాలని భక్తులు కోరుతున్నారు. క్యూలైన్లలో పనిచేయని మెటల్ డిటెక్టర్లు సెక్యూరిటీ చేతిలో కనిపించని హ్యాండ్ డిటెక్టర్లు ఆలయ ప్రాంగణంలో మచ్చుకై నా కనిపించని తనిఖీలు ఆలయంలోకి బ్యాగులు, సంచులతో వస్తున్న భక్తులు -
ఏపీ ఎన్జీఓ నేతల కొవ్వొత్తుల ర్యాలీ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పహల్గాం ఉగ్రవాద దాడిని ప్రతిఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు డి.సత్యనారాయణరెడ్డి, కార్యదర్శి పి. రమేష్ కోరారు. అమాయకులైన పర్యాటకులపై దాడిచేసి ప్రాణాలు తీయడం అమానుషమన్నారు. ఉగ్రదాడిని ఖండిస్తూ ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఉగ్రదాడి దేశ ప్రజల హృదయాలను తీవ్రంగా కలచివేసిందన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకయిన భారతీయ ప్రజల ఐక్యతను దెబ్బతీసేందుకు చేసిన ఇలాంటి దాడులను ప్రతిఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉగ్ర దాడిలో అసువులు బాసిన వారి కుటుంబాలకు ప్రగాఢ సాను భూతి తెలిపారు. దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న మానసిక క్షోభ మాటల్లో చెప్పలేనిదని, ఈ కష్టకాలంలో వారికి ప్రతి ఒక్కరూ తోడుగా నిలిచి మనోధైర్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ఏపీ ఎన్జీఓ జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడి అమానవీయ చర్య అని, ముష్కరులు దాడికి తెగబడిన తీరును రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఉగ్రవాదులను, వారిని ప్రోత్సహిస్తున్నవారిపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలకు పాల్పడకుండా కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ ప్రదర్శనలో ఏపీ ఎన్జీఓ నేతలు పలువురు పాల్గొన్నారు. -
రాజధాని నిర్మాణం గర్వకారణం
● మే 2న ప్రధాని మోదీతో పునఃనిర్మాణ పనులు ప్రారంభం ● అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రులు, శాసనసభ్యులు చిలకలపూడి(మచిలీపట్నం): రాజధాని నిర్మాణం రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణంగా మిగలనుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో సోమవారం మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, వంగలపూడి అనిత, జిల్లాకు చెందిన శాసనసభ్యులతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ మే2న ప్రధాని మోదీ రాక సందర్భంగా సభా ప్రాంగణం సమీపంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కృష్ణాజిల్లా నుంచి లక్ష మందికి పైగా ప్రజలు తరలివెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ సభకు వచ్చే ప్రజలకు తాగునీటి సౌకర్యంతో పాటు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమావేశంలో కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ జి.గంగాధరరావు, శాసనసభ్యులు బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము, వర్ల కుమార్‌రాజా, కాగిత కృష్ణప్రసాద్, మారిటోరియం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, మాజీ మంత్రి పీతల సుజాత, అధికారులు పాల్గొన్నారు. -
ప్రధాని పర్యటన ఏర్పాట్ల పరిశీలన
విమానాశ్రయం(గన్నవరం): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను సాధరణ పరిపాలన శాఖ జీఏడీ ప్రధాన కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా ఆదేశించారు. విమానాశ్రయంలో జరుగుతున్న ప్రధాన మంత్రి పర్యటన ఏర్పాట్లను శాంతి భద్రతల ఏడీజీపీ మధుసూదన్‌రెడ్డి, ఐజీ అశోక్‌కుమార్, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీతో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు. అంతర్జాతీయ టెర్మినల్‌లోని వీఐపీ లాంజ్‌రూమ్, ప్రధాని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంటైనర్ విరామశాల, హెలికాప్టర్లు దిగే ప్రదేశాలను పరిశీలించి, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు మీనా దిశానిర్దేశం చేశారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, ఎస్పీ ఆర్.గంగాధరరావు, సహాయ కలెక్టర్ జాహిద్ ఫర్హీన్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సమీక్ష అనంతరం ప్రధాని పర్యటన ఏర్పాట్లపై జేసీ, ఎస్పీతో కలిసి కలెక్టర్ బాలాజీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రధాని భద్రతా ఏర్పాట్లపై ఎస్పీజీ అధికారులు మంగళవారం సాయంత్రం ఏఎస్ఎల్ సమావేశం నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు. విమానాశ్రయంలో అగ్నిమాపక యంత్రాలు పనిచేస్తున్నాయో లేదో పరీక్షించాలని సూచించారు. ప్రధాని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంటైనర్ విరామశాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, ఎయిర్‌పోర్ట్‌లో దెబ్బతిన్న టైల్స్ స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.ఎల్.కె.రెడ్డి, ఆర్డీఓలు బాలసుబ్రహ్మణ్యం, హేలా షారోన్, ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్‌బాబు, అగ్నిమాపక అధికారి ఏసురత్నం, ఆర్టీఓ శ్రీనివాసరావు, ప్రొటోకాల్ అధికారి మోహన్‌రావు, డ్వామా పీడీ శివప్రసాద్ పాల్గొన్నారు. -
ప్రతి సమస్యకు పరిష్కారం
మీకోసంలో జిల్లా ఎస్పీ గంగాధరరావు కోనేరుసెంటర్: మీకోసం కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల పోలీసులు సానుకూలంగా స్పందించాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మసలుకోవాలని చెప్పారు. వయోవృద్ధులు, వికలాంగులు, బాలింతలు న్యాయం కోసం వస్తే వారి సమస్యలను సామరస్యంగా ఆలకించటంతో పాటు సత్వరమే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. అర్జీలు... ● మచిలీపట్నంకు చెందిన ఓ వివాహిత ఎనిమిది నెలల క్రితం తనకు వివాహం జరిగిందని, వివాహ సమయంలో అత్తింటి వారు అడిగినంత కట్న కానుకలను తన పుట్టింటి వాళ్లు ఇచ్చినప్పటికీ అదనపు కట్నం తీసుకురావాలని భర్తతో పాటు అత్త తనను మానసికంగా వేధిస్తున్నారంటూ వాపోయింది. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టినప్పటికీ వారిలో ఏ మార్పు లేదని, న్యాయం చేయమని ప్రాధేయపడింది. ● పామర్రు నుంచి రోహిత్ అనే యువకుడు తాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉండగా, తన సమీప బంధువు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన వద్ద నుంచి రూ.5 లక్షలు తీసుకున్నాడని, ఉద్యోగం విషయంపై మాట్లాడుతుంటే రెండు సంవత్సరాలుగా ఎలాంటి సమాధానం చెప్పకపోగా తమపై దూషణకు పాల్పడుతూ బెదిరిస్తున్నాడని, న్యాయం చేయమని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ● గన్నవరం నుంచి 70 సంవత్సరాల వృద్ధుడు తనకు ఇద్దరు కుమారులు ఉండగా, ఇరువురికీ వివాహం జరిగిందని, తన భార్య మరణించినప్పటి నుంచి కొడుకులెవరూ భోజనం కూడా పెట్టటం లేదని కన్నీరు పెట్టుకున్నాడు. ఆస్తి మొత్తం వాళ్ల పేరిట రాసి తాను ఇంటి నుంచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని, శారీరక దాడికి పాల్పడుతున్నారని, న్యాయం చేయమని ప్రాధేయపడ్డాడు. బాధితుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎస్పీ వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. -
కృష్ణా జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా జాహిద్ ఫర్హీన్
చిలకలపూడి (మచిలీపట్నం): కృష్ణా జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా జాహిద్ ఫర్హీన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియమించింది. ఆమె సోమ వారం కలెక్టరేట్‌కు విచ్చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జాహిద్ ఫర్హీన్ 2024 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ట్రైనీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమె ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)లో పాల్గొన్నారు. అర్జీల స్వీకరణ, పరిష్కార కార్యక్రమాలను జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి పరిశీలించారు. డీసీసీబీ చైర్మన్‌గా నెట్టెం రఘురాం చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్‌గా నెట్టెం రఘురాంను ప్రభుత్వం సోమవారం నియమించింది. ఇప్పటి వరకు డీసీసీబీ ప్రత్యేకాధికారిగా కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ వ్యవహరించారు. రఘురాం జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన నాయకుడు. గతంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. డీసీఎంఎస్ చైర్మన్‌గా బండి రామకృష్ణ జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్‌గా బండి రామకృష్ణను ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు డీసీఎంఎస్ ప్రత్యేకాధికారిగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ వ్యవహరించారు. రామకృష్ణ మచిలీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్గా ఉన్నారు. ఏపీ ట్రెజరీ, అకౌంట్స్ సర్వీసెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం భవానీపురం(విజయవాడపశ్చిమ): ఏపీ ట్రెజరీ అండ్ అకౌంట్స్ సర్వీసెస్ అసోసియేషన్ తొలి కౌన్సిల్ సమావేశం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా జి.రవికుమార్, సహ అధ్యక్షుడిగా కె.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా కె.రాజ్‌కుమార్, కార్యనిర్వాహక కార్యద ర్శిగా బి.శ్రీనివాసరావు, కార్యదర్శిగా జి.శ్రీనివాస్, కోశాధికారిగా ఎల్.వి.యుగంధర్ ఎన్నిక య్యారు. ఇద్దరు మహిళలతోపాటు ఏడుగురు సహాయ కార్యదర్శులకు నూతన కార్యవర్గంలో చోటు కల్పించారు. ఎన్నికల అధికారిగా డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి పి.కిరణ్‌కుమార్, సహాయ ఎన్నికల అధికారిగా గుంటూరు కలెక్టర్ కార్యాలయ తహసిల్దార్ రవికుమార్, ఎన్నికల పరిశీలకులుగా ఒంగోలు రిటైర్డ్ డెప్యూటీ డైరెక్టర్ పి.హనుమంతరావు వ్యవహరించారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌రావు పాల్గొన్నారు. డీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితి పెంచాలి మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఏడేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించనందున అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఇవ్వా లని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము, కార్య దర్శి జి.రామన్న కోరారు. స్థానిక సున్నపు బట్టీల సెంటర్ సమీపంలో ఉన్న పూలే, అంబేడ్కర్ భవన్లో సమాఖ్య ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత, డీఎస్సీ అభ్యర్థులతో సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్లో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని సరిచేయాలని కోరారు. ఏడేళ్లుగా డీఎస్సీ రెగ్యులర్ నోటిఫికేషన్ ప్రకటించనందున అభ్యర్థుల వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. పరీక్షకు 45 రోజుల సమయమే ఉండటం వల్ల డీఎస్సీ అభ్యర్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురతున్నారని, చదువుకోవడానికి 90 రోజుల సమయం ఇవ్వాలని, ఒక జిల్లాకు ఒకే పేపర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రామన్న మాట్లాడుతూ.. అభ్యర్థుల ఇబ్బందులు పరిష్కరించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమాఖ్య నాయకులు శివ, కృష్ణ, డీఎస్సీ అభ్యర్థులు కరుణాకర్, బాబురావు, వీర్రాజు, ప్రసాద్, మోహన్ పాల్గొన్నారు. -
● ఆపరేటర్లకు భద్రత కల్పించాలి ● ఫైబర్‌నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్
ఫైబర్‌నెట్‌ను ఆర్థికంగా ఆదుకుని నిలబెట్టాలి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ ఫైబర్ నెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి నిలబెట్టాలని ఫైబర్‌నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండారు కృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ ధర్నా చౌక్‌లో సోమవారం ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్లు శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవానికి అతి తక్కువ ధరలో ఇంటర్నెట్ సర్వీసులను అందించే సత్తా ఒక్క ఏపీ ఫైబర్ నెట్‌కు మాత్రమే ఉందన్నారు. ఏపీ ఫైబర్ నెట్ వ్యవస్థను నమ్ముకుని వేలాది మంది ఆపరేటర్లు స్వయం ఉపాధి పొందుతున్నారన్నారు. ఫైబర్ నెట్‌ను ఒకే మంత్రిత్వ శాఖ కింద నిర్వహించాలని, ఫైబర్ నెట్ ఆపరేటర్లను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆర్థిక భరోసా, వ్యాపార భద్రత, జీవిత బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. సంస్థకు రెగ్యులర్ ఎండీని నియమించాలని కోరారు. ఆర్థికంగా సహాయ సహకారాలు అందించి సంస్థను కాపాడాలని, ఆపరేటర్లకు భరోసా కల్పించాలన్నారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశను కలిసి వినతిపత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మైపాల రాంబాబు, ప్రధాన కార్యదర్శి బోయపాటి శివ ప్రసాద్, ఉపాధ్యక్షుడు అహ్మద్ ఆలీ, కోశాధికారి శ్రీనివాస్, వివిధ ప్రాంతాలకు చెందిన ఆపరేటర్లు పాల్గొన్నారు. -
క్షిపణి ప్రయోగ కేంద్రంకు పచ్చజెండా
మే 2న ప్రధాని నరేంద్రమోదీతో వర్చువల్ పద్ధతిలో ప్రారంభోత్సవం అవనిగడ్డ: కృష్ణాజిల్లాకు మణిహారం కానున్న నాగాయలంక మండలంలోని గుల్లలమోద క్షిపణి పరీక్ష కేంద్రంకు ఎట్టకేలకు మోక్షం లబించింది. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ కేంద్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మే 2వ తేదీన వర్చువల్ పద్ధతిలో ప్రారంభోత్సవం చేయనున్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో రక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని 2011లో నిర్ణయించగా, 2012లో నాగాయలంక మండలం గుల్లలమోద అనుకూలమైనదిగా గుర్తించారు. ఈ ప్రాజెక్టు కోసం 386 ఎకరాలు అవసరమని అంచనా వేశారు. 2017లో కొంత రెవెన్యూ భూమిని అటవీశాఖకు కేటాయించి ఆ మేరకు అటవీభూమిని ఈ ప్రాజెక్టుకు బదిలీచేశారు. ఇందుకోసం రూ.35కోట్లు చెల్లించారు. అదే సంవత్సరం తొలిదశ అనుమతులు లభించాయి. 2018లో ఈ ప్రాంతాన్ని సీఆర్‌జెడ్ పరిధి నుంచి మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తొలివిడతగా రూ.1800 కోట్లు నిధులు కేటాయించగా ఈ ప్రాజెక్టు చుట్టూ ప్రహరీ, కొన్ని భవనాలు నిర్మించారు. రూ.20 వేల కోట్లు ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేయనున్నారు. 14 ఏళ్లకు మోక్షం మచిలీపట్నం ఆర్డీవో స్వాతి ఆదివారం గుల్లలమోద క్షిపణి ప్రయోగ కేంద్రంను పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్య క్రమానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలను అధికారులతో చర్చించారు. గత 14 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న గుల్లలమోద క్షిపణి ప్రయోగ కేంద్రంకు అడ్డంకులు తొలగి ప్రారంభోత్సవం కానుండటంతో దివిసీమ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
మంగళవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
చిలకలపూడి(మచిలీపట్నం): రైతులకు సేవలు అందించాల్సిన రైతు సేవా కేంద్రాలు సమస్యలతో కునారిల్లుతున్నాయి. కూటమి ప్రభుత్వం తీరుతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం స్థాపన దిశగా వైఎస్సార్ సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అన్ని సేవలు అందు బాటులో ఉండాలనే ఉద్దేశంతో పలు కార్యాలయాలను ఏర్పాటు చేశారు. రైతుల ముంగిటకే సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తొలుత రైతు సేవా కేంద్రాలుగా పేరుమార్చిన ప్రభుత్వం, ఆ తరువాత వాటి ద్వారా రైతులకు సేవలు అందించకుండా నిర్వీర్యం చేస్తోంది. కొనుగోలు కేంద్రాలకే పరిమితం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాలను నేటి కూటమి ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలుగా మార్పు చేసింది. రైతు సేవలు అందించకుండా కేవలం రైతు పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఈ కేంద్రాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వాటికి మాత్రమే పరిమితం చేసింది. కూటమి ప్రభుత్వంలో విద్యుత్, ఇంటర్నెట్ బిల్లులతో పాటు రావాల్సిన బకాయిల కోసం సిబ్బంది అడిగితే ఉన్నతాధికారులు సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. గట్టిగా ఒత్తిడి చేస్తే ఇతర పనులు అప్పగిస్తూ వేధింపు లకు గురిచేస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. మరో వైపు పాడిపంటల మ్యాగ్జైన్కు కూడా లక్ష్యాలను నిర్దేశించటంతో వాటి చందా లను తామే వసూలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పది నెలలుగా నిర్లక్ష్యం గతంలో మేలు సేవలు నిల్ ఎరువుల బుకింగ్ లేదు గతంలో ఆర్బీకేల ద్వారా ఎరువులు, పురుగు మందులు బుకింగ్ చేసుకునేవాళ్లం. ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల ద్వారా ఆ అవకాశం లేదు. గతంలో కియోస్క్ మిషన్ల ద్వారా ఎరువులు, పురుగు మందులు బుక్‌చేస్తే నాణ్యమైన సరుకు వచ్చేది. వాతావ రణ మార్పులు, మద్దతు ధరలు ఎప్పటికప్పుడు తెలిసేవి. – పి.విశ్వేశ్వరరావు, రైతు, యండపల్లి, కృత్తివెన్ను మండలం పండిన పంట విక్రయించేందుకు ఖాళీ సంచుల కోసం రైస్ మిల్లర్ల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో ధాన్యం విక్రయించేందుకు ఖాళీ సంచులను రైతుభరోసా కేంద్రాల వద్దకు వెళ్లి తెచ్చుకునేవాళ్లం. ఇప్పుడు మిల్లర్ల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికై నా పాత పద్ధతిలోనే ఖాళీ సంచులను సేవా కేంద్రాల వద్ద రైతులకు ఇవ్వాలి. – పెన్నేరు ప్రభాకరరావు, రైతుక్లబ్ కన్వీనర్, వడ్లమన్నాడు, గుడ్లవల్లేరు ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు ఎటువంటి సేవలు అందటం లేదు. గతంలో రైతులు రైతుభరోసా కేంద్రాలకు వెళ్తే వ్యవసాయాధికారులు అందుబాటులో ఉండి ఏ విధమైన విత్తనాలు వేస్తే లాభసాటిగా ఉంటుందో సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించటం లేదు. – ఎం.ఎం.నాంచారయ్య, మాజీ సర్పంచ్, ఎస్.ఎన్.గొల్లపాలెం, బందరు మండలం న్యూస్రీల్నిరుపయోగంగా కియోస్క్ యంత్రాలు గత ప్రభుత్వం ప్రతి రెవెన్యూ గ్రామ పరిధి లోని రైతు భరోసా కేంద్రంలో కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేసి రైతులకు మరిన్ని సేవలు అందేలా చర్యలు చేపట్టింది. అయితే ఈ యంత్రాల ద్వారా రైతులు ఎప్పటికప్పుడు ఎరువులు, పురుగుమందులు బుకింగ్ చేసుకునే సౌకర్యంతో పాటు వాతావరణంలో మార్పులు తెలుసుకుని వాటికి అనుగుణంగా ఏ విధమైన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలో అంచనావేసే వారు. ఎప్పటికప్పుడు మద్దతు ధరలు కూడా ఈ యంత్రాల ద్వారా తెలుసుకునే వారు. ప్రస్తుతం ఎరువులు, పురుగు మందులు బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని ఆపే శారు. ఈ యంత్రాల ద్వారా రైతులకు అందే సేవలను అర్ధాంతరంగా నిలిపివేశారు. అలంకార ప్రాయంగా రైతు సేవా కేంద్రాలు గతంలో ఆర్బీకేల ద్వారా పారదర్శకంగా సేవలు 363 రైతుసేవా కేంద్రాలకు 107 చోట్లే సొంత భవనాలు మరో 27 భవనాలు పూర్తయినప్పటికీ ప్రారంభానికి నోచుకోని వైనం ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూలకుచేరిన కియోస్క్ యంత్రాలు జిల్లాలో వైఎస్సార్ సీపీ పాలనలో 363 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటయ్యాయి. 107 గ్రామాల్లో పక్కా భవనాలు నిర్మించారు. మరో 27 భవనాల నిర్మాణం పూర్తయింది. అయితే కూటమి ప్రభుత్వం వాటిని అందుబాటులోకి తీసుకురాలేదు. ప్రతి ఆర్బీకేలో గ్రామ ఉద్యాన అధికారి, గ్రామ వ్యవసాయాధికారి ఎవరో ఒకరు, సిబ్బంది నిత్యం రైతులకు అందుబాటులో ఉంటారు. రైతులకు ఎప్పటికప్పుడు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఈ సిబ్బందిని రైతుల సేవలకు ఉపయోగించకుండా పలు సర్వేలు, పింఛన్ల పంపిణీ వంటి విధులకు వినియోగిస్తోంది. గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల నిర్వహణ, అద్దె చెల్లింపులు ఇతర అంశాలకు నిధులు ఇచ్చేవారు. విద్యుత్, ఇంటర్నెట్ బిల్లులు కూడా చెల్లించేవారు. గత ప్రభుత్వ పాలన ముగిసే సమయం వరకు ఎటువంటి పెండింగ్ లేకుండా బిల్లులు చెల్లించారు. విద్యుత్ బిల్లులకు అవసరమైన బడ్జెట్‌ను విద్యుత్‌శాఖకు కేటాయించేలా ఉత్తర్వులు ఇచ్చారు. హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం సమకూర్చేందుకు సైతం నిధులు కేటాయించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కావస్తున్నా ఇటువంటి వాటికి ఏ మాత్రం బిల్లులు కేటాయించకుండా పక్కదారి పట్టిస్తున్నా రని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
హైవేపై సినీఫక్కీలో చైన్‌స్నాచింగ్
హనుమాన్‌జంక్షన్‌రూరల్: చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారిపై ఓ కిలాడీ జంట బైక్‌పై వెళుతూనే సినీఫక్కీలో మరో స్కూటర్‌పై వెళుతున్న మహిళ మెడలోని బంగారు గొలుసులను చాకచాక్యంగా తెంచుకుని రెప్పపాటులో మాయమయ్యారు. బాపులపాడు మండలంలోని అంపాపురం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఏలూరుకు చెందిన కర్రె పోతురాజు, కనకరత్నం దంపతులు స్కూటర్‌పై గన్నవరం మండలం పురుషోత్తపట్నంలో శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్లారు. సాయంత్రం తిరిగి స్కూటర్‌పై ఇంటికి వెళుతుండగా అంపాపురం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద వెనుకనుంచి వేగంగా బైక్‌పై వచ్చిన ఓ కిలాడీ జంట క్షణాల్లో మహిళ మెడలోని రెండు బంగారు గొలుసులను లాక్కుని పరారయ్యారు. భర్త పోతురాజు స్కూటర్ నడుపుతుండగా వెనుక సీటులో కూర్చున్న కనకరత్నం మెడలోని 32 గ్రాముల విలువైన రెండు బంగారు గొలుసులను దుండగులు బైక్ నడుపుతూనే దొంగిలించటం గమనార్హం. ఓ వ్యక్తి బైక్ నడుపుతుండగా వెనుక సీట్లో కూర్చున మహిళ చాకచక్యంగా కనకరత్నం మెడలోని బంగారు గొలుసులను లాక్కుంది. ఊహించని ఈ ఘటనతో అవాకై ్కన కనకరత్నం వెంటనే తేరుకుని కేకల వేయటంతో భర్త స్కూటర్ ఆపాడు. ఆ తర్వాత చోరీ జరిగిన విషయాన్ని భార్య చెప్పటంతో దుండగుల బైక్‌ను వెంబడించినప్పటికీ వారు మెరుపువేగంతో పరారయ్యారు. ఈ చోరీపై వీరవల్లి పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు కనకరత్నం ఫిర్యాదు ఇవ్వగా ఎస్ఐ శ్రీనివాస్ దర్యాప్తు చేపట్టారు. ఆత్కూర్ టోల్గేట్ సహా హైవేపై పలుచోట్ల సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించి, దుండగుల చిత్రాలను సేకరిస్తున్నారు. -
నాడు కళకళ...నేడు వెలవెల
● ఒకప్పుడు 72 షాపులతో వంద కోట్ల మేరకు వ్యాపారం ● నేడు సగం షాపుల్లోనే వ్యాపార లావాదేవీలు ● స్థానికంగా ఎక్కడికక్కడ ప్రైవేటు దుకాణాలు వెలవడమే కారణం విజయవాడరూరల్: ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికే తలమానికంగా నిలిచిన నున్న మ్యాంగో మార్కెట్ నేడు వ్యాపారాలు లేక వెలవెలబోతోంది. 1999 వ సంవత్సరంలో అప్పటి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, భారీ పరిశ్రమల శాఖా మంత్రి కోటగిరి విద్యాధరరావు చేతుల మీదుగా ప్రారంభమైన నున్న మ్యాంగో మార్కెట్ దాదాపు 15 ఏళ్ల పాటు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లింది. గత పది సంవత్సరాల నుంచి క్రమేపీ వ్యాపార లావాదేవీలు తగ్గుముఖం పట్టి తిరోగమనం దిశగా ఉంది. ఆసియాలోనే అతి పెద్ద మ్యాంగో మార్కెట్ గా పేరొందిన ఈ మ్యాంగో మార్కెట్ నుంచి సుమారు వంద కోట్ల రూపాయల వ్యాపారం ప్రతి మామిడి సీజన్లో జరిగేది. ఇక్కడ నుంచి మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్ తదితర ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు విస్తృతంగా జరిగేవి. కాలక్రమంలో మండల స్థాయిలో ప్రైవేటుగా వ్యాపార దుకాణాలు ఈదర, నూజివీడు, ఎ. కొండూరు, విస్సన్నపేట, చనుబండ, జి.కొండూ రు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల నున్న మ్యాంగో మార్కెట్ దాని ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే మామిడి రైతులకు రవాణా ఖర్చులు, హమాలీ చార్జీలు తడిసి మోపెడవుతున్నాయని, గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో 72 షాపులకు గాను ఈ ఏడాది మామిడి సీజన్లో మార్కెట్లో 40 షాపుల్లో మాత్రమే వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. గత నాలుగు సంవత్సరాల నుంచి మామిడి పూత దశలో కోడిపేను అనే వ్యాధి సోకడంతో ఆశించిన మేర దిగుబడులు లేక జిల్లాలోని మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది ఈ నెలలో కురిసిన అకాల వర్షాల కారణంగా భూమిలో తేమశాతం అధికంగా ఉండి మంగు వ్యాధి ఎక్కువగా వచ్చింది. ఆ వ్యాధి ప్రభావంతో మామిడిలో నాణ్యత లోపించడం వలన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మామిడి బయ్యర్లు ఆసక్తి చూపించడం లేదు. ఈ ఏడాది 10 మంది బయ్యర్లు మాత్రమే రంగ ప్రవేశం చేశారు. దీంతో మామిడి కొనుగోళ్లు మందగించాయి. దీని ప్రభావంతో రోజుకు 20 లారీలు కూడా ఎగుమతులు జరగడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మామిడి రైతుల బాగోగుల గురించి పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం మామిడి పంట, మామిడి రైతులపై సానుకూల దృక్పథంతో ఆలోచించి ఇతర దేశాలకు కూడా మన మామిడి ఎగుమతులు జరిగేందుకు సహాయ సహకారాలు అందించాలని రైతులు కోరుతున్నారు. గత ప్రాభవం కోల్పోయిన నున్న మ్యాంగో మార్కెట్ మామిడి దిగుబడులు తగ్గాయి నున్న గ్రామంలో నాకు నాలుగు ఎకరాల మామిడి తోటలున్నాయి. గత సంవత్సరం 30 టన్నుల మామిడి కాయల దిగుబడులు వచ్చి లక్ష రూపాయల ఆదాయం లభించింది. ఈ ఏడాది దిగుబడులు బాగా తగ్గిపోయాయి. వ్యాధులను నివారించడానికి మందులు వాడటంతో ఖర్చు పెరిగింది. ఖర్చులు పోను రూ.20వేల ఆదాయం కూడా వస్తుందనే ఆశ లేదు. –భీమవరపు శివశేషిరెడ్డి, మామిడి రైతు, నున్న అవగాహన సదస్సులు నిర్వహించాం మామిడి తోటలను ఆశించిన కోడిపేను, మంగు వ్యాధులను నివారించేందుకు రైతులకు అవగాహన సదస్సులను నిర్వహించాం. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మామిడి దిగుబడులు తగ్గాయి. –బాలాజీ జిల్లా ఉద్యానశాఖ అధికారి -
ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేయాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు కోరారు. జనగణనతోపాటు ఓబీసీ కులగణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యాన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే విగ్రహాలకు ఆదివారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం శంకరరావు మాట్లాడుతూ.. నేటి రాజకీయ నాయకులు విగ్రహమూర్తులుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. అందుకే అంబేడ్కర్, పూలే విగ్రహాలకు సమర్పించాల్సి వచ్చిందన్నారు. ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఇస్తూ మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరించాలని దశాబ్దాలుగా కోరుతున్నామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాల మాదిరిగానే బీసీల రక్షణకు చట్టం తీసుకురావాలని, క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలే పార్టీకి వెన్నెముకలని అరెస్ట్ చేస్తారా? శాంతియుతంగా ర్యాలీ చేసే తాము సంఘ విద్రోహులమైనట్లు పోలీసులు వేధించి అరెస్ట్ చేస్తారా అన్ని శంకరరావు ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు బీసీలు పార్టీకి వెన్నెముకలని చెప్పుకొస్తుంటే మరో వైపు పోలీసులు అరెస్ట్‌లు చేయటం ఎంత వరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నేతలు కుమ్మరి క్రాంతికుమార్, అన్నవరపు నాగమల్లేశ్వరరావు, ఎం.ఎస్.ఎన్.మూర్తి, రాష్ట్ర ఉద్యోగ సంఘం అధ్యక్షులు గుంటుపల్లి ఉమామహేశ్వరరావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు మేకా వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి చందు తదితరులు పాల్గొన్నారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు -
ఎయిర్‌పోర్ట్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి స్వాగతం
విమానాశ్రయం(గన్నవరం): కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఆదివారం గన్నవరం విమానాశ్రయంలో బీజేపీ నేతలు స్వాగతం పలికారు. విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న సదస్సులో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ నుంచి ఇక్కడికి విచ్చేశారు. విమానాశ్రయంలో కిషన్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర నాయకులు పాతూరి నాగభూషణం, సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి, వల్లూరి జయప్రకాష్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్లారు. గణితంపై ఆసక్తి పెంచుకోవాలి వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): అబాకస్, వేద గణితం చిన్నారుల్లో గణితంపై ఆసక్తిని, విశ్లేషణాత్మకతను పెంపొందిస్తోందని ఇస్రో రీసెర్చ్ సైంటిస్ట్ ఏడుకొండలు అన్నారు. డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్ రోబోటిక్స్‌లో వేద గణితం ప్రముఖ పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాజా ఎడ్యుకేషనల్ అకాడమీ ఆధ్వర్యాన పొట్టిశ్రీరాములు చలువాది మల్లికార్జునరావు కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రాంగణంలో జాతీయ స్థాయి అబాకస్, వేద గణితం పోటీలను ఆదివారం నిర్వహించారు. 14 రాష్ట్రాలకు చెందిన 1,235 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అబాకస్ –16 , వేదగణితం – 4 , రూబిక్స్ – 2, విభాగాల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి చిట్టా అమర్సుధీర్ మాట్లాడుతూ కృత్రిమ మేధాశక్తిలో వేదగణితం ప్రాముఖ్యత ఎంతో ఉందన్నారు. ప్రిన్సిపాల్ శరవణ కుమార్, రాజా ఎడ్యుకేషనల్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ మార్టూరి పద్మలత మాట్లాడుతూ వేదగణితాన్ని మానసిక గణితం అని కూడా అంటారని చెప్పారు. -
జంక్షన్లో నెల్లూరు ప్రేమజంట
హనుమాన్‌జంక్షన్ రూరల్: నెల్లూరుకు చెందిన ప్రేమజంట హనుమాన్‌జంక్షన్‌లో ఆదివారం హల్చల్ చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. నెల్లూరుకు చెందిన సయ్యద్ ఆఫ్రిన్ కుబ్రా, షేక్ రసూల్ ఇద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి పరారై హనుమాన్‌జంక్షన్ చేరుకున్నారు. ఇద్దరు మేజర్లు కావటంతో ఇక్కడి బంధువులు, స్నేహితుల సహకారంతో మత పెద్దల సమక్షంలో ముస్లిం సంప్రదాయం ప్రకారం ఆదివారం ఆఫ్రిన్, రసూల్ పెళ్లి చేసుకున్నారు. ఆఫ్రిన్ అదృశ్యమైనట్లుగా ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో నెల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమజంట హనుమాన్‌జంక్షన్‌లో ఉన్నట్లుగా సమాచారం అందుకున్న నెల్లూరు పోలీసులు నవ దంపతుల ఉంటున్న బంధువుల ఇంటికి చేరుకున్నారు. ఆఫ్రిన్‌ను తల్లిదండ్రులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి నుంచి ప్రాణహాని ఉందంటూ నెల్లూరు పోలీసులతో వెళ్లేందుకు వధూవరులు అంగీకరించలేదు. దీంతో జంక్షన్ పీఎస్‌కు ప్రేమజంట చేరుకోవడంతో కొద్దిసేపు హైడ్రామా నడిచింది. తమ ఆధార్‌కార్డులు చూపించి, మేజర్లు కావడంతో ఇష్ట్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నామని, తమకు రక్షణ కల్పించాలంటూ నవదంపతులు వేడుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమజంటకు.. ఇద్దరి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి, ఇంటికి పంపుతామని చెప్పడంతో ఎట్టకేలకు నెల్లూరు పోలీసుల వెంట వెళ్లిపోయారు. -
శాసీ్త్రయ సంగీతానికి పూర్వ వైభవం
విజయవాడ కల్చరల్: శాసీ్త్రయ సంగీతానికి పూర్వ వైభవం తేవడానికి శ్రీ సద్గురు సంగీత సభ కృషి చేస్తోందని సంగీత సభ అధ్యక్షుడు బీవీఎస్ ప్రకాష్ చెప్పారు. శ్రీసద్గురు సంగీత సభ ఆధ్వర్యాన త్యాగరాజస్వామి 258వ జయంతి సందర్భంగా ఎనిమిది రోజులపాటు నిర్వహించే జాతీయ సంగీతోత్సవాలు శివరామకృష్ణ క్షేత్రంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ శాసీ్త్రయ సంగీతం సజీవ స్రవంతి అని అభివర్ణించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి గౌరీనాథ్ మాట్లాడుతూ త్యాగరాజ కృతి వైభవం నేటి తరం యువ సంగీత విద్వాంసులు తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు బి.హరిప్రసాద్, జేఎస్ఎస్ ప్రసాద్ శర్మ, గాయత్రి గౌరీనాథ్, చారుమతి పల్లవి తదితరులు పాల్గొన్నారు. రుగ్వేదం పద్మశ్రీ, కృష్ణశ్రీ, వి.శ్యామకృష్ణ, హంసిని, సూరి కిరణ్మయి, మల్లాది కార్తీక, త్రివేణి, జొన్నలగడ్డ సాయిశ్రావణి త్యాగరాజ కృతులను మధురంగా గానం చేశారు. -
వేసవి వినోదం...విజ్ఞానం
కంకిపాడు: వేసవిలో విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేలా గ్రంథాలయ సంస్థ చర్యలు చేపట్టింది. వినోదం, విజ్ఞానాన్ని పెంపొందించేలా వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 28న ప్రారంభం కానున్న శిక్షణ శిబిరాలు జూన్ 6వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 109 వరకూ గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో జిల్లా గ్రంథాలయం 1, ప్రథమ శ్రేణి గ్రంథాలయాలు 7, ద్వితీయ శ్రేణి గ్రంథాలయాలు 18, తృతీయ శ్రేణి లైబ్రరీలు 83 ఉన్నాయి. ఆయా గ్రంథాలయాల్లో వివిధ రకాలైన పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల మెటీరియల్స్, సంస్కృతి, సంప్రదాయాలు, చర్రితలకు సంబంధించిన అనేక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. విజ్ఞానాన్ని అందిస్తూ.. గ్రంథాలయాలను చేరువ చేస్తూ.. వేసవిలో స్నేహితులతో చక్కర్లు కొట్టడం, ఊర్లు తిరుగుతూ సందడిగా గడపటం చేస్తుంటారు. దీంతో పాఠశాలల పునఃప్రారంభం నాటికి చదువుపై పూర్తిగా అశ్రద్ధ, నిర్లక్ష్యం పెరుగుతున్నాయి. దీన్ని అధిగమిస్తూ, గ్రంథాలయ సంస్థ సేవలను విద్యార్థులకు చేరువ చేసే లక్ష్యంతో గ్రంథాలయ పరిషత్ వేసవి విజ్ఞాన శిబిరాలకు శ్రీకారం చుట్టింది. ఆట పాటలు, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనను వెలికితీసేలా చిత్రలేఖనం, కథలు చెప్పటం, వంటి అనేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. లక్ష్యం ఘనం.. ఆచరణ భారం లక్ష్యం ఘనంగా ఉన్నా ఆచరణలో శిబిరాల నిర్వహణ గ్రంథాలయ సిబ్బందికి పెనుభారంగా మారుతోంది. గ్రేడ్–1కి రూ.25 వేలు, గ్రేడ్–2కి రూ.15 వేలు, గ్రేడ్–3కి రూ.8 వేలుచొప్పున వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణకు సొమ్ము కేటాయించారు. సోమవారం నుంచి శిబిరాలు ప్రారంభించాల్సి ఉన్నా ఆ సొమ్ము సంబంధిత గ్రంథాలయాలకు చేరలేదు. దీంతో సిబ్బంది స్థానిక దాతలను సమన్వయం చేసుకుని శిబిరం నిర్వహణ చేయడంతో పాటు ఆఖరి రోజు ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందించాల్సిన ఉంటుంది. షెడ్యూల్ ఇదీ.. ● ఉదయం 8.00 నుంచి 8.30 గంటల వరకూ కథలు వినడం 8.30 నుంచి 10 గంటల వరకూ పుస్తక పఠనం ● 10.00 నుంచి 10.10 వరకూ విరామం ● 10.10 నుంచి 10.30 వరకూ పుస్తక సమీక్ష ● 10.30 నుంచి 11.00 వరకూ కథలు చెప్పటం, ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 12.00 వరకూ స్పోకెన్ ఇంగ్లిష్, డ్రాయింగ్, పేపర్ క్రాఫ్ట్ చెస్, క్యారమ్స్, క్విజ్, జీకే తదితర అంశాలపై పోటీలు జరుగుతాయి. గ్రంథాలయాల్లో నేటి నుంచి వేసవి విజ్ఞాన శిబిరాలు జూన్ 6 వరకూ నిర్వహణ పఠనాశక్తి, విజ్ఞాన సముపార్జనే లక్ష్యం అన్ని ఏర్పాట్లు పూర్తి వేసవి శిబిరాలు ఈనెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 109 కేంద్రాలకు 103 కేంద్రాల్లో పూర్తి స్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉన్నారు. విద్యార్థుల్లో చదివే ఆసక్తి పెంచడం, నైపుణ్యాలను వృద్ధి చేయడం లక్ష్యంగా శిబిరాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. శిబిరాల నిర్వహణకు గ్రాంటు కూడా త్వరలోనే అందిస్తాం. – రవికుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి, మచిలీపట్నం -
ఐక్యంగా ఉగ్రవాదాన్ని అంతమొందిద్దాం
విజయవాడస్పోర్ట్స్: ఐక్యంగా ఉగ్రవాదాన్ని అంతమొందిద్దామని విజయవాడ స్కేటర్లు పిలుపు నిచ్చారు. కశ్మీర్‌లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన పర్యాటకులకు సంఘీభావంగా నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డులో స్కేటర్లు ఆదివారం ర్యాలీ చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో 200 మంది జాతీయ, అంతర్జాతీయ స్కేటర్లు ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్టీఎస్ రోడ్డులోని ఘంటసాల సంగీత కళాశాల నుంచి భానునగర్ జంక్షన్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా రోలర్ స్కేటింగ్ సంఘం అధ్యక్షుడు జె.దుర్గాప్రసాద్ మాట్లాడుతూ భారత్ అభివృద్ధిని తట్టుకోలేక పాకిస్తాన్ మన దేశంలో అల్లర్లు సృష్టిస్తోందన్నారు. పాక్ దుష్ట ప్రయత్నాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉందన్నారు. ఏపీ రోలర్ స్కేటింగ్ సంఘం ఉపాధ్యక్షుడు బచ్చు మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ దేశాలు ఆర్థికంగా, సాంకేతిక పరంగా అభివృద్ధి సాధిస్తుంటే, పాకిస్తాన్ ఆ దేశ యువకులను ఉగ్రవాదులుగా తయారు చేసి భారత్ పైకి ఉసిగొల్పుతోందన్నారు. పాక్ చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు, కోశాధికారి ఎస్.తాతయ్య, కోచ్‌లు వరుణ్, దిలీప్, నాగసేన్, గ్రీష్మిత, మహేష్, నాని, కీర్తి, పాల్గొన్నారు. బీఆర్టీఎస్ రోడ్డులో స్కేటర్ల ర్యాలీ -
భద్రతకు భరోసా ఏదీ!
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్లో భద్రతకు భరోసాపై సంశయం కలుగుతోంది. స్టేషన్లో రైల్వే పోలీసులు, ఇతర భద్రత సిబ్బంది చర్యలు మచ్చుకై నా కనిపించడం లేదు. విజయవాడ స్టేషన్‌కు సుమారు 250 రైళ్లు రోజూ వస్తుంటాయి. ఇక్కడ 10 ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. 1.50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. పూర్తిస్థాయిలో నిఘా ఏదీ.. నగరంలోని రైల్వేస్టేషన్లో నిఘా వ్యవస్థ పూర్తిస్థాయిలో కానరావడం లేదు. ప్రయాణికుల లగేజీల్లో అనుమానాస్పద వస్తువులు ఉంటున్నాయా లేదో కూడా గుర్తించే నిఘా వ్యవస్థ ఉండటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రయాణికులతో పాటుగా సంఘ విద్రోహులు, దొంగలు, అక్రమ రవాణాదారులు యథేచ్ఛగా స్టేషన్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది మాత్రం అప్పుడప్పుడు స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంలను తనిఖీలు చేసి సంతృప్తి చెందుతున్నారు. తాజాగా పహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో ఎక్కువ మంది ప్రజలు వెళ్లే రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్, షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో ఎక్కడ, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అనధికారికంగా.. ప్రధాన ప్రవేశ మార్గాలతో పాటుగా రైల్వే స్టేషన్లోకి వచ్చి వెళ్లడానికి అనధికారిక మార్గాలను కొంతమంది వినియోగించుకుంటున్నారు. రైల్వేపార్సిల్ కార్యాలయం, నైజాంగేటు, కంసాలీపేట, తారాపేట, కాళేశ్వరరావు మార్కెట్, ఖుద్దూస్‌నగర్, రైల్వేకోర్టు తదితర ప్రాంతాల నుంచి కూడాస్టేషన్లోకి రాకపోకలు జరుగుతున్నాయి. రైలులో గంజాయి, మద్యం అక్రమ రవాణదారులు ఈ మార్గాల నుంచి సులువుగా తప్పించుకుని వెళుతున్న సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి కరోనా సమయంలో టిక్కెట్ ఉన్న ప్రయాణికులను తప్ప ఇతరులను స్టేషన్లోకి ప్రవేశించకుండా రైల్వే అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. అదే తరహాలో అనధికారిక మార్గాలతో పాటు స్టేషన్లోకి ప్రవేశ ద్వారాల వద్ద ఆర్పీఎఫ్ భద్రత సిబ్బంది నిఘా పెంచాలి. అనుమానితులను ముందుగానే గుర్తించి ప్రయాణికుల భద్రతకు భరోసా కల్పించడానికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. విజయవాడ రైల్వేస్టేషన్లో కనిపించని ‘నిఘా’ ప్రవేశద్వారాల వద్ద కానరాని ఆర్పీఎఫ్ సెక్యూరిటీ!పెరుగుతున్న నేరాలు రైల్వే స్టేషన్లో నిఘా లోపించడంతో ప్రయాణికులతో పాటు దొంగలు, పాత నేరస్తులు, గంజాయి బ్యాచ్ యథేచ్ఛగా స్టేషన్లో తిరుగుతున్నారు. ప్లాట్‌ఫాంలు, వెయిటింగ్ హాల్స్‌లలో నిద్రిస్తున్న ప్రయాణికుల లగేజీలు, సెల్ఫోన్లను చోరీ చేస్తున్న సంఘటలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రవేశ ద్వారాల వద్ద కానరాని భద్రత నిరంతరం సీసీ కెమెరాలతో పర్యవేక్షణ విజయవాడతో పాటు డివిజన్లోని అన్ని స్టేషన్లలో ఆర్పీఎఫ్ భద్రత సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. విజయవాడ స్టేషన్లో ఏర్పాటు చేసిన కంట్రోలు రూమ్ నుంచి తమ సిబ్బంది స్టేషన్‌లోని పది ప్లాట్‌ఫాంలతో పాటు స్టేషన్ పరిసరాలు, ప్రవేశ ద్వారాల వద్ద రాకపోకలు సాగించే ప్రయాణికులను నిశితంగా పరిశీలిస్తున్నారు. అనుమానం వచ్చిన వారిని తనిఖీ చేస్తుంటారు. ముఖ్యంగా అనధికార ప్రవేశ మార్గాలు, అవుటర్లలో జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఎక్స్ సర్వీస్‌మెన్‌లతో పర్యవేక్షణ ఏర్పాటు చేసి భద్రత చర్యలు చేపట్టాం. – వల్వేశ్వర బి.టి, సీనియర్ డీఎస్సీవిజయవాడ రైల్వే స్టేషన్లోకి ప్రవేశించేందుకు ఐదు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. తూర్పు వైపున రెండు, దక్షిణ వైపు ఒకటి, పశ్చిమం వైపు తారాపేట, వెస్ట్ బుకింగ్ వద్ద రెండు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ప్రతి రోజూ వేల సంఖ్యలో ప్రయాణికులు వీటి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. గతంలో ఈ ద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్లతో ఆర్పీఎఫ్, సెక్యూరిటీ సిబ్బంది ప్రయాణికుల్ని, వారి లగేజీలను క్షుణంగా తనిఖీ చేసి పంపించే వ్యవస్థ ఉండేది. ఇటీవల అటువంటి భద్రత ప్రమాణాలు స్టేషన్లో ఎక్కడా కూడా కనిపించని పరిస్థితి నెలకుంది. ప్రవేశ ద్వారాల వద్ద ఆర్పీఎఫ్ పోలీసులు కుర్చునేందుకు ఏర్పాటు చేసిన కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. -
లేబర్ కోడ్ల విధానం రద్దుకు డిమాండ్
మచిలీపట్నంటౌన్: భారతదేశ కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు, యాజమాన్యాలకు కట్టు బానిసలు చేసే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ల విధానాన్ని రద్దు చేయాలని సీఐటీయూ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాల వెంకటేశ్వరావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా, వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు మే 20వ తేదీన నిర్వహించనున్న సమ్మెను జయప్రదం చేయాలనే పిలుపులో భాగంగా కార్మిక, కర్షక ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు వేతనం అమలు చేయాలని, కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ల విధానాన్ని రద్దు చేయాలని, పది కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా మే 20 జరిగే దేశవ్యాప్త సమ్మెను కృష్ణాజిల్లాలో కూడా అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ జిల్లా నాయకులు లింగం ఫిలిప్, పోస్టల్ ఉద్యోగుల సంఘం డివిజన్ కార్యదర్శి కేవీ రావు, ఏపీ అంగన్ వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రమాదేవి, మచిలీపట్నం రిసోర్స్ పర్సన్స్ మెప్మా ఆర్పీల సంఘం జిల్లా నాయకులు కె. మాధవి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం నారాయణరావు ప్రసంగించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కల్లా వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ సదస్సులో అన్ని కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ముందే ఖరారు!
పేరుకే టెండరు..ఎన్టీఆర్ జిల్లాలో అధికారికంగా ఎనిమిది రీచ్‌లకు అనుమతులున్నాయి. అయితే పార్లమెంట్ ప్రజా ప్రతినిధి చక్రం తిప్పి కేవలం చందర్లపాడు మండలం కసారబాద, కంచర్ల మండలం వేములపల్లి రీచ్‌లలో మాత్రమే ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. పార్లమెంట్ ప్రజాప్రతినిధి ఈ ఇసుక రీచ్‌లను తన కనుసన్నల్లో ఉంచుకొని, ఇసుక కృత్రిమ కొరతను సృష్టించి.. లారీకి రూ.10వేల చొప్పున ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. అది కాక తెలంగాణ రాష్ట్రానికి ఇసుక అక్రమంగా తరలించి, దోపిడీ చేస్తున్నారు. అధికారులకు ఇదంతా తెలిసినా.. ఆయనకు చినబాబు అండదండలు ఉండటంతో ఏమి చేయలేక చేతులెత్తేస్తున్నారు. పేరుకు ప్రభుత్వం ఉచి త ఇసుక అని ఊదరగొడుతున్నా, సామాన్యు నికి ఇసుక అందుబాటులో లేదని, ట్రాక్టర్‌కు ఇసుక లోడ్ చేయాలన్నా, డబ్బులు ఇచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక టెండర్ల కేటాయింపులో మాయాజాలంసాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇసుక టెండర్లలో మాయాజాలం చేశారు. పేరుకు మాత్రం టెండర్లు అంటూ హడావుడి చేసిన యంత్రాంగం.. టెండర్లలో పాల్గొనే సంస్థలకు ఉండాల్సిన అర్హతలు, మార్గదర్శకాల జాబితా విడుదల చేసి, పారదర్శకంగా టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చింది. బిడ్లు తెరిచి, టెండర్లు ఖరారు అయ్యే సమయానికి అసలు రంగు బయట పడింది. నిబంధనల పేరుతో తొలుత టెండర్లు రద్దు చేసి, చివరకు ముందే ఖరారు చేసుకున్న నాలుగు సంస్థలకు టెండర్లు కట్టబెట్టడంలో సక్సెస్ అయ్యింది. ‘బడా’ వ్యూహం.. కృష్ణా జిల్లాలో టెండర్ల ప్రక్రియను అధికారులు శనివారం సాయంత్రానికి పూర్తి చేశారు. టెండర్లు అన్నీ.. స్థానిక ప్రజా ప్రతినిధులకు దక్కేలా ఓ మంత్రి చక్రం తిప్పారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి, స్థానిక సంస్థలను కాదని, తమ బినామీ సంస్థలకు దక్కేలా పావులు కదిపారు. కృష్ణా జిల్లాలో చోడవరం, రొయ్యూరు, నార్తువల్లూరు, లంకపల్లి నాలుగు రీచ్‌లకు ఏప్రిల్ మొదటి వారంలో టెండర్లు పిలిచారు. వీటిలో ఒక్కో క్వారీకి డజనుకుపైగా కాంట్రాక్ట్ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఈ టెండర్లలో పాల్గొనే సంస్థలకు స్థానికంగా జీఎస్టీ కలిగి ఉండాలనే నిబంధన ఉంది. అయితే ఓ మంత్రి, స్థానిక ప్రజా ప్రతినిధులు, తమ బినామీలైన రాష్ట్రేతర సంస్థలతో టెండర్లు దాఖలు చేయించారు. ఈ సంస్థల జీఎస్టీలన్నీ స్థానికంగా కలిగి ఉన్నట్లు లోకల్ బ్రాంచ్‌లో నమోదు చేయించారు. టెండర్ల ప్రక్రియలో స్థానిక సంస్థలు అర్హత సాధించడంతో పోటీ నుంచి ఆ సంస్థలను తప్పించేందుకు పక్కా వ్యూహం అమలు చేశారు. టెండర్ల నోటిఫికేషన్, దరఖాస్తుల్లో కొన్ని తప్పులు ఉన్నట్లు సాకుగా చూపి టెండర్లను రద్దు చేశారు. మంత్రి ఆదేశాలను శిరసా వహించిన యంత్రాంగం వారి బినామీ సంస్థలకే కట్టబెట్టేలా సహకరించారు. ఎన్టీఆర్ జిల్లాలో భారీ దందా.. నిబంధనల పేరుతో స్థానిక సంస్థలకు చెక్ కృష్ణా జిల్లాలో స్థానిక ప్రజాప్రతినిధులకే టెండర్లు చక్రం తిప్పిన ఓ మంత్రి..వత్తాసు పలికిన అధికారులు ఎన్టీఆర్ జిల్లాలో పార్లమెంట్ ప్రజా ప్రతినిధి కనుసన్నల్లోనే అంతా.. ఇప్పటికే అనధికారికంగా వందల లారీల ఇసుక అక్రమ రవాణా కృష్ణా జిల్లాలో టెండర్లు వీరికే.. పెనమలూరులోని చోడవరం ఇసుక రీచ్‌ను స్థానిక నియోజకవర్గ ప్రజా ప్రతినిధికి చెందిన బినామీ సంస్థ దక్కించుకొంది. ఇప్పటికే ఈ రీచ్ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అనధికారికంగా రోజుకు వందల లారీల ఇసుకను తరలిస్తున్నారు. రొయ్యూరు ఇసుక రీచ్ నుంచి గుడివాడకు చెందిన నియోజకవర్గ ప్రజా ప్రతినిధి, మచిలీపట్నం పార్లమెంటు ప్రజా ప్రతినిధి, రోజుకు వందల లారీలను ప్రముఖ కాంట్రాక్టు సంస్థ చేసే పనులకు తరలిస్తున్నారు. ఈ రీచ్‌ను వీరికి చెందిన బినామీ సంస్థే దక్కించుకొంది. పామర్రు నియోజకవర్గ ప్రజా ప్రతినిధికి చెందిన బినామీ సంస్థకు నార్తు వల్లూరు ఇసుక రీచ్ వచ్చింది. ఈ రీచ్‌ను ఇప్పటికే ప్రతి రోజు ఎలాంటి అనుమతులు లేకుండా రోజుకు 400కు పైగా లారీల ఇసుకను అక్రమంగా తరలించి, కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. లంకపల్లి ఇసుక రీచ్‌ను ఓ మంత్రికి చెందిన బినామీ సంస్థ దక్కించుకొంది. ఇవి కాక చాగంటివారిపాలెం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే రోజుకు 200 లారీలకు పైగా ఇసుకను పచ్చనేతలు తరలిస్తున్నారు. మద్దూరు ఇసుక రీచ్‌లో అదే పరిస్థితి నెలకొంది. అధికారులు మాత్రం స్థానిక ప్రజా ప్రతినిధుల అడుగులకు మడుగులు ఒత్తుతూ, కళ్లముందే భారీ దోపిడీ జరుగుతున్న తమకేమి పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. -
ముగిసిన ఫుట్‌బాల్ పోటీలు
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): గుంటుపల్లి కేంద్రీయ విద్యాలయంలో రెండురోజులుగా జరుగుతున్న రీజనల్ స్థాయి ఫుట్‌బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. సంఘటన్ వ్యాయామ క్రీడ ల్లో భాగంగా హైదరాబాద్ రీజియన్ పోటీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎనిమిది టీంలు పాల్గొన్నాయి. హోరాహోరీగా సాగిన పోటీల్లో తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయం(హైదరాబాద్) జట్టు ప్రథమస్థానంలో నిలిచింది. బొల్లారం కేంద్రీయ విద్యాలయం జట్టు ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు బి.రమేష్‌బాబు తెలిపారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్ఐడీ సంచాలకులు భూమ య్య విజేతలకు కప్, సర్టిఫికెట్లు అందజేశారు.ఏడీఎంఈగా డాక్టర్ ఏవీరావుకు ఉద్యోగోన్నతిలబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా ఫుల్ అడిషనల్ చార్జి(ఎఫ్ఏసీ)పై పనిచేస్తున్న డాక్టర్ ఏ వెంకటేశ్వరరావుకు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(ఏడీఎంఈ)గా ఉద్యోగోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోనే ఎనస్థీషియా విభాగాధిపతిగా ఉన్న డాక్టర్ ఏ వెంకటేశ్వరరావు గత ఏడాది నవంబరు 2న ఎఫ్ఏసీపై సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఏడీఎంఈగా ఉద్యోగోన్నతి కల్పించడంతో పూర్తిస్థాయిలో అధికారాలు అప్పగించినట్లయింది. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వరరావుకు పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.జిల్లా చెస్ పోటీల్లో హర్షిత్, శుభశ్రీ సత్తావిజయవాడస్పోర్ట్స్: కృష్ణాజిల్లా స్థాయి అండర్–13 బాల, బాలికల చెస్ చాంపియన్‌షిప్ బాలుర విభాగంలో హర్షిత్‌సాయి, బాలికల విభాగంలో నాగశుభశ్రీ విజేతలుగా నిలిచారు. విజయవాడ శివారు పోరంకిలోని విజ్ఞానభారతి హై స్కూల్లో కృష్ణాజిల్లా చెస్ అసోసియేషన్ ఆదివారం ఈ పోటీలను నిర్వహించింది. బాలుర విభాగంలో అబ్దుల్ ఫెయిజ్, బాలికల విభాగంలో ప్రహస్థా రన్నర్లుగా నిలిచారు. వీరిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశామని కృష్ణాజిల్లా చెస్ సంఘం కార్యదర్శి ఎన్.ఎం.ఫణికుమార్ తెలిపారు. అనంతరం ఓపెన్ కేటగిరీలో జరిగిన పోటీల్లో సందీప్, మోనీష్, రుషీల్సాయి విజేతలుగా నిలిచినట్లు చెప్పారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో విజేతలకు విజ్ఞానభారతి హై స్కూల్ డైరక్టర్ కె.ఆర్.ఎస్.రావు, ఫిట్నెస్ డెవలపర్ ఎ.వేణు, కరూర్ వైశ్య బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ పాల్గొని విజేతలకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు. -
రోడ్డెక్కనున్న కొత్త బస్సులు
ఆటోనగర్(విజయవాడతూర్పు): గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కొనుగోలు చేసిన బస్సులు రోడ్డెక్కనున్నాయి. వీటి రిజిస్ట్రేషన్లు దాదాపుగా పూర్తి అయినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఎన్నికలకు ముందు కొనుగోలు చేసిన బస్సులు.. నాలుగు నెలల కిందట ఆటోనగర్ డిపోకు చేరాయి. వాటిని అధికారుల వినియోగించకపోవడంతో ఎండకు ఎండి, వానకు తడిసి పాడైపోతున్న విషయాన్ని ఇటీవల సాక్షి దినపత్రిక ‘రోడ్డెక్కని కొత్త బస్సులు’ అనే శీర్షికన ప్రచురించింది. దీనిపై స్పందించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ బస్సులన్నింటికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించి, దాదాపుగా పూర్తి చేశారు. డిపోకు మొత్తం 11 బస్సులు మంజూరవగా.. ఇందులో 4 బస్సులు గత కొద్ది రోజుల నుంచి నడుపుతున్నట్టు డీఎం ప్రవీణ్‌కుమార్ చెప్పారు. మరో 7 బస్సులకు పర్మిట్ రావాల్సి ఉందని, త్వరలో వచ్చే అవకాశం ఉందని వివరించారు. -
ఆశావర్కర్స్‌ను ఉద్యోగులుగా గుర్తించండి
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆశ వర్కర్లను ఎన్హెచ్ఎం ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు చెల్లించాలని, అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఎన్హెచ్ఎం ఏర్పడి 20 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘ఆశ వర్కర్లు సాధించిన విజయాలు–ముందున్న సవాళ్లు, ప్రజారోగ్యం–ప్రభుత్వాల బాధ్యత’ అనే అంశాలపై ఆదివారం రాష్ట్ర సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ గత 20ఏళ్లుగా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారే తప్ప, కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న ఆశావర్కర్లకు మెటర్నిటీ లీవ్ కూడా కల్పించకుండా ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయన్నారు. ప్రజారోగ్య వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ కె. సాయిప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వైద్యాన్ని ప్రోత్సహించే విధానం మానుకొని, ప్రభుత్వ వైద్య రంగానికి ప్రోత్సాహం అందించాలని డిమాండ్ చేశారు. పోరాట ఫలితమే జాబ్ చార్ట్.. ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి మాట్లాడుతూ ఆశా వర్కర్స్ పోరాట ఫలితంగా జాబ్ చార్ట్ సాధించుకున్నామన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆశ వర్కర్స్‌పై వేధింపులు కొనసాగుతున్నాయని, రాజకీయ జోక్యంతో అక్రమ తొలగింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెమినార్లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె. పోచమ్మ, కోశాధికారి ఏ.కమల, ఉపాధ్యక్షురాలు ధనశ్రీ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు డిమాండ్ -
ఇంద్రగిరిపై భక్తజన కోలాహలం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. మరో వైపున ఉదయం, సాయంత్రం వేళ భక్తుల రద్దీ మరింత పెరుగుతుండగా, వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు క్యూలైన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో రూ. 500 టికెట్ల విక్రయాలను ఉదయం 8 గంటల నుంచే నిలిపివేశారు. దీంతో వీఐపీలకు, రూ. 300 టికెట్టు కొనుగోలు చేసిన భక్తులకు ముఖ మండప దర్శనం కల్పించారు. రద్దీ నేపథ్యంలో భక్తులకు అమ్మవారి దర్శనం త్వరత్వరగా జరిగేలా క్యూలైన్లను ముందుకు నడిపించారు. ఆలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ భక్తులకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో, చలివేంద్రాలలో మజ్జిగ, మంచినీటిని అందించారు. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులకు ఉచిత ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాలను అందజేశారు. మహా మండపం రెండో అంతస్తులో సిట్టింగ్ పద్ధతిలో, మొదటి అంతస్తులో బఫే పద్ధతిలో అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పెరుగుతున్న రద్దీ ఆర్జిత సేవలకు డిమాండ్.. చైత్ర అమావాస్య, ఆదివారం నేపథ్యంలో పలు ఆర్జిత సేవలకు డిమాండ్ పెరిగింది. తెల్లవారుజామున అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్ వద్ద నిర్వహించే ఖడ్గమాలార్చనకు 20 టికెట్లు, చండీహోమానికి రికార్డు స్థాయిలో రెండు వందలు టికెట్లను విక్రయించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, యాగశాలలో నవగ్రహ హోమం, గణపతి హోమాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద అర్చకులు శాంతి కల్యాణాన్ని నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. సూర్యోపాసన సేవ.. లోక కల్యాణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆదివారం సూర్యోపాసన సేవ నిర్వహించారు. రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు సూర్య భగవానుడి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. -
దోపిడీ!
‘బడి’ తెగించి కంకిపాడు: కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పలు ప్రైవేటు విద్యాసంస్థల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ప్రభుత్వ అండదండలతో పరిధి దాటి వ్యవహరిస్తున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కి వ్యాపారం సాగిస్తున్నాయి. పాఠశాలలనే వ్యాపార సముదాయంగా మార్చేస్తున్నాయి. నోటు పుస్తకాలు, మెటీరియల్స్ విక్రయించి తమ గల్లా పెట్టెలు నింపుకుంటున్నాయి. ప్రజల జేబులు లూటీ అవుతున్నా.. విద్యాశాఖ కనీసం ఆ వైపు కన్నెత్తి చూడకపోవటం విస్మయం కలిగిస్తోంది. జిల్లాలో పరిస్థితి.. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 316 ప్రైవేటు విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో 169 వరకూ హైస్కూల్స్ ఉన్నాయి. ఏటా లక్షకు పైగా విద్యార్థులు ఆయా విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం వేసవి సెలవులు మంజూరయ్యాయి. అయినా ఆయా సంస్థలు అడ్మిషన్ల వేటలో పోటీ పడుతూ పది ఫలితాల సాధన వివరాల పేరుతో తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. అడ్డగోలు వ్యాపారం.. అడ్మిషన్ల ప్రారంభంతోనే విద్య వ్యాపారానికి కొన్ని విద్యాసంస్థలు తలుపులు బార్లా తెరిచాయి. మెటీరియల్స్, నోటు పుస్తకాలు తమ పాఠశాలలోనే కొనుగోలు చేయాలని నిబంధన విధిస్తున్నాయి. అంతే కాకుండా తరగతుల వారీగా రేట్లు నిర్ణయించి అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నాయి. నిబంధనల మేరకు ఏ విద్యాసంస్థలోనూ నోటు పుస్తకాలు, మెటీరియల్స్ విక్రయం జరగకూడదు. కానీ పలు యాజమాన్యాలు నిబంధనలు తుంగలో తొక్కి అడ్డగోలు వ్యాపారానికి తెరతీస్తున్నాయి. గత విద్యాసంవత్సరంలో మెటీరియల్స్, నోటుపుస్తకాలు పదో తరగతి విద్యార్థులకు రూ. 7,800 ధర నిర్ణయిస్తే ఈ ఏడాది 4, 5 తరగతుల చిన్నారులకే రూ. 8 వేలు వరకూ ధర నిర్ణయించారంటే విద్యాసంస్థల దోపిడీ ఏ తీరుగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అదే సెమీ కార్పొరేట్ విద్యాసంస్థల్లో అయితే ఈ దోపిడీ పరాకాష్టకు చేరింది. వాళ్లు చెప్పిందే వేదంగా మారింది. ఆయా విద్యాసంస్థల్లో అడ్డగోలు రేట్లు నిర్ణయించి మెటీరియల్స్, నోటు పుస్తకాలు అమ్మేస్తున్నారు. ఫీజుల్లోనూ అదే స్పీడు.. గత జూన్ నుంచి ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల విషయంలో దూకుడు పెంచాయి. సెమీ స్కూల్స్‌లో వార్షిక ఫీజు రూ. 10వేలు నుంచి రూ. 20వేలు వరకూ పెంచేశాయి. కార్పొరేట్ తరహా సంస్థలు రూ. 50వేలు ఫీజు అదనంగా వసూళ్లు చేశాయి. ఈ ఏడాది కూడా ఫీజులు ఇష్టానుసారంగా వసూలు చేసేందుకు కొన్ని సంస్థలు రెడీ అయిపోయాయి. తమ సంస్థకు వచ్చిన పది ఫలితాలను ఆశచూపుతూ అడ్మిషన్లను పెంచుకుంటున్నాయి. మార్కుల వలలో పడి తల్లిదండ్రులు కష్టమైనా, భారమైనా ప్రైవేటు పాఠశాలల వైపు అడుగులు వేస్తున్నారు. దీంతో విద్యాసంస్థల ఆర్థిక దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల విక్రయాలు అడ్డగోలుగా ప్రజల సొమ్ము లూటీ కూటమి వత్తాసుతో పెట్రేగిపోయి దందా ప్రైవేటు విద్యాసంస్థల ఆగడాలను చూసీ చూడనట్లుగా విద్యాశాఖ మా దృష్టిలో లేదు.. ప్రైవేటు విద్యాసంస్థల్లో పుస్తకాల విక్రయాలకు సంబంధించి మాకు ఎలాంటి సమాచారం లేదు. ఎంఈవోలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. కానీ ఎలాంటి నివేదిక అందించలేదు. పుస్తకాల విక్రయాలకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే షోకాజ్ నోటీసులు ఇవ్వటంతో పాటుగా అవసరమైతే విద్యాసంస్థ గుర్తింపును కూడా రద్దు చేస్తాం. – పీవీజే రామారావు, జిల్లా విద్యాశాఖాధికారి, కృష్ణాజిల్లా ఇష్టారాజ్యంగా ప్రైవేటు విద్యాసంస్థల ఫీ‘జులుం’ కన్నెత్తి చూడని విద్యాశాఖ..ప్రైవేటు విద్యాసంస్థల్లో అడ్డగోలుగా పుస్తకాలు విక్రయాలు జరిగిపోతున్నాయి. అయినా విద్యాశాఖ అధికారులు ఏ ఒక్కరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం తనిఖీలు కూడా చేపట్టడం లేదు. ఫలితంగా విద్య మాటున అడ్డగోలు వ్యాపారం సాగిస్తూ లక్షలు పోగేసుకుంటున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. -
కానుగ కాయలతో జాతీయ జెండా
పెనమలూరు: కానుగ కాయలకు రంగు వేసి జాతీయ జెండాను రూపొందించాడు చిన్నారి లిషాన్. చిన్నారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకోవటానికి ప్రతిభ చాటాడు. తాడిగడప శివ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థి వినుకొండ లిషాన్కు నాలుగున్నర ఏళ్లు. పోరంకికి చెందిన శివప్రసాద్, శిరీష దంపతులు తమ కుమారుడి లిషాన్కు చిత్రకళపై మక్కువ ఉండటాన్ని గుర్తించి గిన్నీస్ బుక్ హోల్డర్, ప్రముఖ చిత్రకారుడు పామర్తి శివ వద్ద శిక్షణ ఇిప్పిస్తున్నారు. లిషాన్ ప్రపంచ రికార్డు ప్రయత్నంలో భాగంగా ఈ నెల 25వ తేదీన 1,211 కానుగ కాయలకు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు వేసి జాతీయ జెండాను రూపొందించాడు. కాయలకు నీలిరంగు వేసి అశోక చక్రాన్ని తీర్చిదిద్దాడు. కానుగ కాయలతో జాతీయ జెండా రూపకల్పనను ఐదు గంటల 11 నిమిషాల్లో పూర్తి చేశాడు. ఈ జెండా 40 అంగుళాల ఎత్తు, 55 అంగుళాల వెడల్పుతో ఉంది. ఈ మేరకు వివరాలను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు, అసిస్ట్ వరల్డ్ రికార్డు సంస్థలకు పంపామని చిత్రకారుడు పామర్తి శివ తెలిపారు. -
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి కృష్ణాజిల్లాకు చెందిన భక్తులు రూ.లక్ష విరాళం సమర్పించారు. కంకిపాడుకు చెందిన పి.శ్రీనివాసరావు, సత్యవతి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు శనివారం ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళం అందజేసింది. ఆలయ అధికారులకు దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.తిరుపతమ్మ ఆలయానికి రూ.లక్ష విరాళంపెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మవారి ఆలయానికి శనివారం కృష్ణాజిల్లా, ఉయ్యూరు మండలం, గండికుంట గ్రామానికి చెందిన కగ్గా సాంబయ్య దంపతులు రూ.లక్ష విరాళం సమర్పించారు. ఈ నగదును ఆలయ ఏఈఓ తిరుమలేశ్వరరావు చేతుల మీదుగా ఆందజేశారు. విరాళంలో రూ.50 వేలు నిత్యాన్నదాన పథకానికి, రూ.50 వేలు అంకమ్మవారి ఉపాలయం గోపురం వెండి తాపడానికి వినియోగించాలని కోరారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలను అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు.పాకిస్తానీయులు తక్షణం దేశం విడిచి వెళ్లాలికోనేరుసెంటర్: జిల్లాలో పాకిస్తాన్ దేశానికి చెందిన వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఈనెల 27వ తేదీలోపు భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. లేనిపక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తులు వెంటనే తమ సమాచారం సంబంధిత పోలీస్స్టేషన్లకు తెలియజేసి, దేశం విడిచి వెళ్లిపోవడానికి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. లేని పక్షంలో చట్టాల ఉల్లంఘన ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమాజ శాంతి, భద్రత కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.డీఎస్సీ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలికృష్ణలంక(విజయవాడతూర్పు): మెగా డీఎస్సీ నోటిఫికేషన్లో లోపాలు ఉన్నాయని, వాటిని తక్షణమే కూటమి ప్రభుత్వం పరిష్కరించి అభ్యర్థులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను డీఎస్సీకి దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇంటర్, డిగ్రీ, పీజీలో మార్కుల శాతంతో సంబంధం లేకుండా డీఎస్సీకి అనుమతి ఇవ్వాలని కోరారు. బీఈడీ, డైట్ చేసి టెట్ అర్హత సాధించిన వారు ఇప్పుడు ఎందుకు అనర్హులు అయ్యారో చెప్పాలని తెలిపారు.డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వై.రాము, జి.రామన్న మాట్లాడుతూ సిలబస్ విస్తృతి రీత్యా అభ్యర్థులకు ప్రిపరేషన్‌కు 90 రోజులు సమయం ఇవ్వాలని చెప్పారు. డీఎస్సీ పరీక్షలు జరుగుతున్న సమయంలోనే ఏపీపీపీఎస్సీ పరీక్షలు, పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలు ఉన్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని డీఎస్సీ పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఒక జిల్లాకు ఒకే పేపర్ ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు.అనేక మందికి ఎడిట్ ఆప్షన్, సబ్జెక్టు చూపించడం లేదన్నారు. తక్షణమే పై సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. -
కూచిపూడి గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
చిలకలపూడి(మచిలీపట్నం): కూచిపూడి గ్రామాన్ని రాష్ట్ర వారసత్వ సంపద గల ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర నివేదికను వారంలోగా తయారుచేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కూచిపూడి నాట్య కళకు మూలకేంద్రమైన గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ గ్రామాభివృద్ధిలో సినీ తారలు, వ్యాపార దిగ్గజాలను భాగస్వామ్యం చేసి వారి ద్వారా నిధులను సమకూర్చే ప్రయత్నం చేయాల్సి ఉందన్నారు. కూచిపూడి వెళ్లే రహదారి మార్గంలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా గుంతలను పూడ్చివేయాలన్నారు. గ్రామాభివృద్ధి కోసం యునెస్కో వారికి ప్రతిపాదనలు పంపేందుకు డాక్యుమెంటేషన్ సిద్ధం చేయాలన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబరు నెలలో కూచిపూడి వార్షికోత్సవాలను యక్షగాన వసంతం పేరుతో వారం రోజుల పాటు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. సొసైటీని ఏర్పాటు చేసి కూచిపూడి అభివృద్ధి పనులు, వార్షికోత్సవాల నిర్వహణ జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ వ్యవస్థను పటిష్టంగా పనిచేసేందుకు కార్పస్ నిధులు సమకూర్చుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో రాష్ట్ర పర్యాటకశాఖ ప్రాంతీయ సంచాలకురాలు ప్రసన్నలక్ష్మి, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఉయ్యూరు ఆర్డీవో హేలషారోన్, జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, డీఆర్డీఏ పీడీ హరిహరనాఽథ్, డీపీవో జె.అరుణ, జిల్లా పర్యాటక అధికారి రామ్‌లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. వారసత్వ సంపద గల ప్రాంతంగా గుర్తింపు సినీ తారలు, వ్యాపార దిగ్గజాలను భాగస్వాములను చేస్తాం వారి ద్వారా నిధులు సమకూర్చేందుకు యత్నం వారం లోగా సమగ్ర నివేదికకు కలెక్టర్ ఆదేశాలు -
పూర్తిగా ధర పతనం
నేను ఎకరం విస్తీర్ణంలో మినుము సాగు చేశాను. దిగుబడి అందరికీ బాగానే వచ్చింది. నాకు మాత్రం 5 క్వింటాళ్లే వచ్చింది. మార్కెట్లో ధర పూర్తిగా తగ్గిపోయింది. ఆ రేటుకు అమ్మితే ఖర్చులు కూడా రావు. చేసేది లేక పంటను ఇంటిలో నిల్వ చేశా. మంచి ధర వస్తే అమ్ముదామని చూస్తున్నా. –బీహెచ్ రాజగోపాల్‌రెడ్డి, రైతు, ప్రొద్దుటూరు సిండికేట్ దోపిడీ వ్యాపారులు సిండికేట్ అయిపోయారు. గత సీజన్లో రూ.9200 ఉన్న ధర ఈ ఏడాది పడిపోవటానికి వారే కారణం. అదేమంటే బర్మా నుంచి మినుము దిగుమతి అవుతోందంటున్నారు. ఆర్ఎస్కేల్లో మినుము కొనుగోలు చేయాలి. –కొండవీటి సుబ్బారావు, రైతు, మంతెన● -
టెన్త్ టాపర్ బ్రదర్స్‌కు కలెక్టర్ ప్రశంస
చిలకలపూడి(మచిలీపట్నం): ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ఇరువురు అన్నదమ్ములను కలెక్టర్ డీకే బాలాజీ శనివారం తన చాంబర్లో అభినందించారు. ఉంగుటూరు మండలం మధిరపాడు గ్రామానికి చెందిన ఇందుపల్లి జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థులు దుబ్బాకుల దుర్గా యశ్వంత్ 591 మార్కులు, దుబ్బాకుల వీర వెంకటనాగేంద్ర 589 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారని వారిని అడగ్గా ఒకరు చార్టర్డ్ అకౌంటెంట్, మరొకరు ఇంజినీర్ అవుతామని తెలిపారు. ఉంగుటూరు మండలం మధిరపాడు గ్రామానికి చెందిన ఈ విద్యార్థుల తల్లిదండ్రులు దుబ్బాకుల నరసింహారావు, నాగదుర్గ వ్యవసాయ కూలీలు. అనంతరం కలెక్టర్ అన్నదమ్ములిద్దరికీ సొంత నిధులతో స్మార్ట్ వాచ్‌లను బహూకరించారు. కార్యక్రమంలో డీఈవో పీవీజే రామారావు, విద్యార్థుల తల్లిదండ్రు లు దుబ్బాకుల నరసింహారావు, నాగదుర్గ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీతారాం పాల్గొన్నారు. -
పెత్తనం నీదా.. నాదా.. సై
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అందినకాడికి దోచుకో..అందినంతా దాచుకో అన్న చందంగా తయారైంది పార్లమెంటు ప్రజాప్రతినిధి తీరు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఔపోసన పట్టిన ఆ ప్రజాప్రతినిధి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అక్రమ సంపాదన కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు జిల్లా టీడీపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. పక్కా ప్రణాళిక ప్రకారం ముందుగా ఎస్సీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. ఈ నియోజకవర్గాల్లో తన వ్యూహం ఫలించడంతో మిగిలిన నియోజకవర్గాల్లోనూ వేలు పెట్టడం ప్రారంభించారు. సహజ వనరుల దోపిడీ నుంచి నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు, కార్పొరేషన్ రుణాల మంజూరు ఇలా ప్రతి అంశంలో తన హవా నే కొనసాగేలా ముందుకు సాగుతున్నారు. పార్టీ అధి ష్టానం సైతం పార్లమెంటు ప్రజాప్రతినిధికే ప్రాధాన్యం ఇస్తోంది. పార్టీ పెద్దలే అండగా నిలవడంతో ప్రతి నియోజకవర్గంలో తన వర్గాన్ని ప్రోత్సహిస్తూ జిల్లా టీడీపీలో అంతర్గత పోరుకు తెరలేపారు. ఈ క్రమంలో సీనియర్ ప్రజాప్రతినిధులంతా పార్లమెంటు ప్రజాప్రతినిధి తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎస్సీ నియోజకవర్గాల్లో పెత్తనం పార్లమెంటు ప్రజాప్రతినిధి తన అక్రమ సంపాదన కోసం ముందుగా జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గాలైన తిరువూరు, నందిగామపై దృష్టి సారించారు. తిరువూరు నియోజకవర్గంలో స్థానిక ప్రజాప్రతినిధిపై అధిష్టానానికి వ్యతిరేక భావన ఏర్పడేలా చేయడంలో విజయం సాధించారు. కనీసం స్థానికంగా జరిగే కార్యక్రమాలకు పార్టీ నాయకులు వెళ్లకుండా కట్టడి చేసి అక్కడి ప్రజాప్రతినిధిని ఏకాకిని చేశారు. ఈ నియోజకవర్గంలో మట్టి రవాణాతో పాటు మార్కెట్ యార్డు పదవులు, పార్టీ పదవులు, కార్పొరేషన్ రుణాలను సైతం తన వర్గానికి చెందిన వారికే వచ్చేలా చేయడంలో పార్లమెంటు ప్రజాప్రతినిధి విజయం సాధించారు. ● ఎస్సీ నియోజకవర్గమైన నందిగామలో సైతం పార్లమెంటు ప్రజాప్రతినిధి తన పెత్తనాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఎనిమిది ఇసుక రీచ్‌లలో సగానికిపైగా నడవకుండా నిలిపివేసిన పార్లమెంటు ప్రజాప్రతినిధి తన వర్గానికి చెందిన వ్యక్తులతో ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధి, పార్లమెంటు ప్రజాప్రతినిధి మధ్య వైరం నడుస్తోంది. అంతే కాకుండా నామినేటెడ్ పదవుల కేటాయింపులో కూడా రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. సబ్సిడీ రుణాలు సైతం పార్లమెంట్ ప్రజాప్రతినిధి సూచించిన వారికే ఇస్తున్నారు. ● జగ్గయ్యపేట నియోజకవర్గంలో పార్లమెంటు ప్రజా ప్రతినిధి వర్గం, స్థానిక ప్రజాప్రతినిధి వర్గం, టీడీపీ జిల్లా నాయకుడి వర్గంతో ఇక్కడి టీడీపీ పరిస్థితి మూడు ముక్కలాటగా మారింది. ఇక్కడ మార్కెట్ యార్డు పదవి కోసం ఈ మూడు వర్గాలు పట్టుబడుతున్నాయి. అంతే కాకుండా ఇక్కడ ఇసుక అక్రమ రవాణా కోసం పార్లమెంటు ప్రజాప్రతినిధి వర్గం, స్థానిక ప్రజాప్రతినిధి వర్గాల మధ్య పోరు నడుస్తోంది. ● మైలవరం నియోజకవర్గంలో పార్లమెంటు ప్రజాప్రతినిధి, స్థానిక ప్రజాప్రతినిధి ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. అయినప్పటికీ వారిద్దరి మధ్య అంతర్గతంగా తీవ్రస్థాయిలో వైరం నడుస్తోంది. స్థానికంగా ఇసుక, మట్టి, బూడిద వంటి సహజ వనరులు అధికంగా ఉన్నాయి. వీటి అక్రమ రవాణాలో తన వాటా కోసం పార్లమెంటు ప్రజాప్రతినిధి పట్టుబట్టాడు. దీంతో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య వైరం నెలకొంది. ● విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో సైతం పార్లమెంటు ప్రజాప్రతినిధికి స్థానిక ప్రజాప్రతినిధులకు మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మొత్తంగా జిల్లా మీద పట్టు బిగించేందుకు ప్రయత్నం చేస్తున్న పార్లమెంటు ప్రజాప్రతినిధి ఈ మూడు నియోజక వర్గాల్లో సైతం గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. విజయవాడ నగర పాలక సంస్థ వ్యవహారాల్లో వేలు పెడుతూ ప్రతి పనిలో కమీషన్ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు పార్టీకి చెందిన సీనియర్ ప్రజాప్రతినిధులకు మింగుడు పడటంలేదు. జిల్లాపై పెత్తనం కోసం పార్లమెంటు ప్రజాప్రతినిధి దందా ఎస్సీ నియోజకవర్గాల్లో నాయకులు జీ హుజూర్ అనాల్సిందే అక్రమ సంపాదన కోసం నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు ప్రతి నియోజకవర్గంలో పార్లమెంటు ప్రజాప్రతినిధికి ప్రత్యేక వర్గం ఈ వింత పోకడలపై మండిపడుతున్న సీనియర్ ప్రజాప్రతినిధులు -
బైక్‌లు చోరీ చేస్తూ.. గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
విజయవాడస్పోర్ట్స్: దొంగిలించిన బైక్‌లను విక్రయించగా వచ్చిన డబ్బులతో గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తున్న ముఠాను సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 9.5 కేజీల గంజాయి, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను టాస్క్‌ఫోర్స్ కార్యాలయం వద్ద టాస్క్‌ఫోర్స్ ఏసీపీ లతాకుమారి వివరించారు. గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు అంశాలపై పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరుగుతున్న పాత నేరస్తులపై దృష్టి సారించామని చెప్పారు. ఈ క్రమంలో మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గులాబీతోటతో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఎ.మనోజ్పార్ధు(గులాబీతోట), షేక్ అలీబాబా(పెనమలూరు)లను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. నిందితులిద్దరూ జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనం, గంజాయి విక్రయానికి పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో పార్క్ చేసిన బైక్‌లను దొంగిలించడం, ఆ వాహనాలపై ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలకు వెళ్లి, అక్కడ వాహనాలను విక్రయించగా వచ్చిన సొమ్ముతో గంజాయిని కొనుగోలు చేసి విజయవాడకు తీసుకువస్తారని తెలిపారు. ఇదే గంజాయిని స్థానిక యువతకు విక్రయిస్తూ సొమ్ము చేసుకోవడాన్ని నిందితులిద్దరూ వృత్తిగా చేసుకుని జీవిస్తున్నట్లు చెప్పారు. ఈ ముఠా సభ్యులు ఐదుగురు ఉన్నారని, వీరంతా సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారన్నారు. ఈ ముఠాలోని ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితుల నుంచి రూ.60 వేల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ సీఐలు శ్రీధర్, రవికుమార్ పాల్గొన్నారు. -
చెరువులో పడి చిన్నారి మృతి
గూడూరు: ప్రమాదవశాత్తూ చెరువులో పడి చిన్నారి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ఆకుమర్రు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కమ్మగంటి నవనీత్(5), అతని అన్న నిహాక్తో కలిసి శుక్రవారం సాయంత్రం గ్రామ శివార్లలోని బాపనకోనేరు చెరువు దగ్గర బహిర్భూమికి వెళ్లారు. ఆ క్రమంలో ప్రమాదవశాత్తూ నవనీత్ చెరువలో పడి మరణం చెందాడు. కళ్లెదుటే ఆటలాడుకుంటున్న తమ్ముడు నవనీత్ చెరువులో పడిపోవడంతో భయాందోళనకు గురైన నిహాక్ వెంటనే ఊరిలోకి వచ్చి కనపర్తి ఆశీర్వాదం అనే వ్యక్తికి విషయం చెప్పాడు. దీంతో ఆశీర్వాదం చెరువు దగ్గరకు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టేసరికే నవనీత్ నీటిలో పడి ఊపిరాడక విగతజీవిగా మారాడు. తల్లిదండ్రులు కమ్మగంటి రత్నకుమారి, శివనాగరాజులు కన్నీరు మున్నీరయ్యారు. దీనిపై శివనాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గూడూరు ఎస్ఐ కేఎన్వీ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆస్పత్రిలో బాలుడి మృతదేహాన్ని సందర్శించి సంతాపం వ్యక్తం చేశారు. చెరువును అక్రమంగా తవ్వడంతోనే తమ కుమారుడు చనిపోయాడని కమ్మగంటి శివనాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామ సర్పంచి బొల్లా కృష్ణకుమారితో పాటు గ్రామ నాయకుడు కారుమంచి కామేశ్వరరావులపై ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేశారు. -
అగమ్యగోచరంగా ఐసీఆర్పీలు
చల్లపల్లి: ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చేందుకు ఎవరికి వారు అప్పులు సమకూర్చుకోవాలని అధికారులు చిన్నపాటి ఉద్యోగులపై ఒత్తిళ్లు తెస్తుండటంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ(ఏపీసీఎన్ఎఫ్) విభాగంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఐసీఆర్పీల పరిస్థితి ఇది. పేరుకుపోయిన బకాయి వేతనాలు అందక అప్పుల్లో కూరుకుపోయిన తాము ఉన్నతాధికారులు నిర్ధేశించిన లక్ష్యాన్ని అధిగమించటానికి అప్పులు ఎక్కడ నుంచి తేవాలో తెలియక కకావికలమవుతున్నారు. జిల్లా స్థాయిలో సిబ్బంది నియామకం.. ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ(ఏపీఆర్వైఎస్ఎస్) ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం(ఏపీసీఎన్ఎఫ్)ను ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాల్లో ప్రాజెక్టు మేనేజరుతో పాటు క్షేత్రస్థాయి వరకూ సిబ్బందిని నియమించారు. కృష్ణా జిల్లాలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌తో పాటు ప్రతి డివిజన్(మూడు మండలాలు)కు ఒక మాస్టర్ ట్రైనర్(ఎంటీ) చొప్పున ఎనిమిది మంది, మండల స్థాయిలో మండల యాంకర్స్(ఎంఏ), ప్రాజెక్ట్ రిసోర్స్ పర్సన్(పీఆర్పీ)లు, మండల కమ్యూనిటీ రిసోర్స్‌పర్సన్స్(ఎంసీఆర్పీ)లు మొత్తం 13 మంది, మూడు నుంచి నాలుగు గ్రామాలకు కలిపి ఒక యూనిట్ ఇన్చార్జి చొప్పున 25 మంది, వీరి పర్యవేక్షణలో ప్రతి గ్రామైక్య సంఘానికి ఒక ఇంటర్నల్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్(ఐసీఆర్పీ) చొప్పున సుమారు 250 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. కిట్టు ఖరీదు రూ.1,350 రబీ సీజన్ ప్రారంభానికి ముందు రైతుల చేత 32 రకాలతో కూడిన ప్రీమూన్ డ్రై సోయింగ్(పీఎండీఎస్) నవధాన్యాలతో పచ్చిరొట్ట సాగుచేసేలా ఐసీఆర్పీలు పనిచేయాలని అధికారుల నంచి ఆదేశాలొచ్చాయి. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులతో పాటు రసాయనిక ఎరువులతో సేద్యం చేసే ప్రతి రైతు చేత ఒక్క ఎకరాలోనైనా ఈ సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్క ఎకరాకు పచ్చిరొట్టగా 13.5(ఒక కిట్టు) కిలోల నవధాన్యాలు అవసరమవుతాయి. ఒక్కొక్క కిట్టు తయారీకి సగటున రూ.1,350లు ఖర్చు అవుతుంది. నవధాన్యాలను సేకరించి సంచుల్లో నింపటం, కిట్లుగా కట్టడం, రైతులకు అందజేయటం వంటివన్నీ ఐసీఆర్పీలు చూడాలి. దీనికి అవసరమైన నిధులను సెల్ఫ్ హెల్ప్ గ్రూపు(ఎస్‌హెచ్‌జీ)లకు బ్యాంకుల నుంచి రుణం ఇప్పించి ఆ రుణంతో ఐసీఆర్పీల చేత కిట్లు తయారు చేయించి వాటిని రైతులకు అమ్మి, వచ్చిన డబ్బును డ్వాక్రా గ్రూపులకు కట్టుకోవాలని అధికారులు మార్గం చూపించారు. దాదాపు అన్ని ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు ఇప్పటికే లోన్లు ఉండటంతో కొత్త లోను తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావటంలేదు. ఐసీఆర్పీలే సొంత డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పేరుకుపోయిన వేతన బకాయిలు ఒక్కొక్క ఐసీఆర్పీకి పనిచేసే ప్రాంతాన్ని బట్టి నెలకు రూ.7,500 నుంచి రూ.14 వేల వరకూ వేతనాలు ఇస్తారు. బకాయిపడిన 24 నెలల వేతనాల్లో గత మార్చిలో 12 నెలల వేతనాలు మాత్రమే విడుదల చేశారు. ఇంకా 12 నెలల వేతన బకాయిలు అలాగే ఉన్నాయి. ఒక్కొక్క ఐసీఆర్పీ పరిధిలో సుమారు 50 నుంచి 70 మంది వరకూ రైతులు ఉండగా వారికి ఒక్కొక్క కిట్టు అందించాలంటే ఒక్కొక్క ఐసీఆర్పీ రూ.65 వేల నుంచి రూ.98 వేల వరకు పెట్టుబడి పెట్టాలి. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి పీఎండీఎస్ కిట్లు ఎలా ఏర్పాటుచేయాలో అర్థం కాక తలమునకలవుతున్నారు. కిట్లు టార్గెట్లు పూర్తిచేయకపోతే విధుల నుంచి తొలగిస్తామని అధికారులు చెప్పటం ఆందోళన కలిగిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.1,350 ఖర్చు పెట్టి పచ్చిరొట్ట వేసేందుకు రైతులు ముందుకు రావటంలేదు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రయోజనం లేదు. నవధాన్యాల కిట్లను వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై అందిస్తే కొంతమేర లక్ష్యాన్ని చేరుకునే వీలుంటుందని కిందిస్థాయి ఉద్యోగులు, ఐసీఆర్పీలు కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు, వ్యయప్రయాసలు ఎదుర్కొంటున్న తమకు ఈ కిట్ల టార్గెట్ల నుంచి విముక్తి కలిగించాలని, పెండింగ్‌లో ఉన్న తమ వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. అందని జీతాలు.. నవధాన్యాల కిట్ల లక్ష్యాలతో ఆందోళన అప్పుల్లో కూరుకుపోతున్న దుస్థితి అధికారుల వింత పోకడలతో బెంబేలు కిట్ల కొనుగోలుకు ఆసక్తి చూపని రైతులు ఎస్‌హెచ్‌జీ గ్రూపుల ద్వారా రుణాలు.. పీఎండీఎస్ కిట్ల తయారీకి అవసరమైన నిధులను సమకూర్చేందుకు ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు లోన్లు ఏర్పాటుచేస్తున్నాం. ఇప్పటికే వారికి లోన్లు ఉంటే అదనంగా మరలా లోన్లు ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. –పార్థసారథి, జిల్లా ప్రాజెక్టు మేనేజర్, ఏపీసీఎన్ఎఫ్ -
వారంలో పెళ్లి.. విద్యుదాఘాతంతో యువకుడి మృతి
తాళ్లూరు(వత్సవాయి): పది రోజుల్లో వివాహం చేసుకుని సంతోషంగా జీవితాన్ని గడపాల్సిన యువకుడు విద్యుదాఘాతంతో మరణించిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల మేరకు గ్రామానికి చెందిన కంచర్ల వెంకటేశ్వర్లు, భూలక్ష్మి దంపతుల కుమారుడు జితేంద్ర(25). అతను ఆటోలో ఉల్లిగడ్డల వ్యాపారం చేస్తుండేవాడు. జితేంద్రకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. వారం రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి కార్యక్రమాల ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. గురువారం రాత్రి సమయంలో ఇంట్లో ఉన్న కూలర్లో నీళ్లు పోస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి ఒక్కసారిగా కరెంట్ షాకు కొట్టడంతో అపస్మాకరకస్థితిలోకి వెళ్లాడు. కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పదిరోజుల్లో వివాహం చేసుకుని ఘనంగా ఊరేగింపు చేసుకోవాల్సిన తరుణంలో ఇలా అంతిమయాత్ర చేసుకోవాల్సి వచ్చిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఘటనపై తల్లి భూలక్ష్మి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ పి.ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించి కుటుంబసభ్యులకు అందజేశారు. -
ఉసురు తీసిన అక్రమ తవ్వకాలు!
కోనేరుసెంటర్: అక్రమ మట్టి తవ్వకాలు ఓ మైనర్ ఉసురు తీశాయి. ఘటన బందరు మండలం పొట్లపాలెం గ్రామ సమీపంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బందరు మండలం బుద్దాలపాలెం గ్రామానికి చెందిన కొక్కు మణికంఠ (15) పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. అతని తల్లిదండ్రులు కొండలరావు, జలజకుమారి వ్యవసాయ పనులు చేస్తుంటారు. వీరికి ఒక పాప కూడా ఉంది. ఇదిలా ఉండగా పదో తరగతి పాస్ అయిన మణికంఠ మట్టి ట్రాక్టర్‌పై పనికి వెళ్తున్నాడు. శుక్రవారం ట్రాక్టర్‌పై బుద్దాలపాలెం నుంచి కొత్తపూడి వెళ్లి మట్టిని డంప్ చేసిన అనంతరం తిరిగి మట్టి దిబ్బల వద్దకు ట్రాక్టర్‌పై బయలుదేరారు. పొట్లపాలెం – బుద్దాలపాలెం మార్గంమధ్యలో రోడ్డుపై ఉన్న గోతిలోకి ట్రాక్టర్ ఒరగటంతో డ్రైవర్ పక్కన కూర్చున్న మణికంఠ ఒక్కసారిగా కిందికి పడిపోయాడు. ఘటనలో ట్రాక్టర్ ట్రక్కు టైరు మణికంఠ తలపై నుంచి వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు ఘటనాస్థలానికి చేరుకుని రోడ్డుపై విగతజీవిగా పడి ఉన్న మణికంఠను చూసి విలపించారు. అతన్ని అంబులెన్స్‌లో మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. మణికంఠ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఘటనపై తల్లి జలజకుమారి బందరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. పిలిచి చంపేశారయ్యా: పదో తరగతి పాసైన ఆనందం మా బిడ్డకు ఎన్నో రోజులు లేకుండానే దేవుడు దక్కరకు వెళ్లిపోయాడయ్యా అంటూ తల్లిదండ్రులు పెడుతున్న ఆర్తనాదాలు చూపరులను సైతం కంటతడిపెట్టించింది. ఇంట్లో ఆడుకుంటున్న తన బిడ్డను ట్రాక్టర్ పనికి రమ్మంటూ పిలుచుకెళ్లి మరీ చంపేశారంటూ బోరున విలపించారు. మద్యం మత్తులో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందంటూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్లో తిష్టవేసి ఇదిలా ఉండగా మైనర్ బాలుడు చనిపోయి అంత్యక్రియలైనా జరగకుండానే జనసేన నాయకులు ఈ కేసును నీరుగార్చడానికి బందరు రూరల్ పీఎస్‌లో తిష్టవేసి పోలీసులకు నయానో భయానో నచ్చజెప్పుకుని అక్రమంగా మట్టిని అమ్ముకుంటున్న గ్రామంలోని టీడీపీ నాయకుడిని బయటపడేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ కాగితాలు ఫోర్సులో లేకపోవటానికి తోడు డ్రైవర్‌కు లైసెన్స్ కూడా ఉండకపోవటం గమనార్హం. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసులో ఏ విధంగా వ్యవహరిస్తారన్నది వేచి చూడాల్సిందే మరి. ఈ పాపం ఎవరిదీ ! కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మండలంలో మట్టి మాఫియా ఆగడాలు అధికమయ్యాయి. మండలంలో అక్రమంగా మట్టి తోలకాలు జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో మట్టి మాఫియా మరింత రెచ్చిపోతోంది. ఇదిలా ఉండగా బుద్దాలపాలెంలో జరిగిన ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ మృతుని తరఫు బంధువులు ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్న కూటమి నాయకులదా...? పట్టించుకోని రెవిన్యూ అధికారులదా...? లేక అధికార దర్పంతో మండలంలో మట్టిని అమ్ముకుని లక్షలు పోగుచేసుకుంటున్న ప్రజాప్రతినిధులదా అంటూ నిలదీస్తున్నారు. ట్రాక్టర్ కింద పడి బాలుడి మృతి ఇంట్లో ఉన్న పిల్లాడిని పిలిచి చంపేశారంటూ తల్లి ఆవేదన కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్న జనసేన నేతలు టీడీపీ నేత మట్టి అక్రమ తరలింపు కారణంగానే ఘటన! -
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చైత్రమాసం.. పెద్ద ఎత్తున జరుగుతున్న వివాహాలు, వేసవి సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి దుర్గామల్లేశ్వరస్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే దుర్గామల్లేశ్వరస్వామివార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. అంతరాలయంలో ప్రధాన మూలవిరాట్ వద్ద ఖడ్గమాలార్చన, ఆలయ ప్రాంగణంలో జరిగిన లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమం, శాంతి కల్యాణం, నవగ్రహ హోమం, గణపతి హోమాల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం నుంచే భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. రూ. 300 టికెట్‌పై ముఖ మండప దర్శనాన్ని కల్పించిన ఆలయ అధికారులు, రూ. 100, సర్వ దర్శనం క్యూలైన్లలో భక్తులు ముందుకు కదిలేలా చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం మహా నివేదన అనంతరం భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఎండల నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి ప్రాంగణం, మైక్ అనౌన్స్ పాయింట్ వద్ద దేవస్థానం భక్తులకు మజ్జిగను పంపిణీ చేసింది. సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ, పల్లకీ సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. వేసవి సెలవులు నేపథ్యంలో పెరిగిన సందడి అంతరాలయ దర్శనాలు రద్దు -
సంగీతంలో నిస్వార్థ సేవకే గిన్నిస్ రికార్డ్
పటమట(విజయవాడతూర్పు): వాయిద్యకారులను అనేక మందిని తయారు చేయాలనే లక్ష్యంతో హల్లెల్ మ్యూజిక్ స్కూల్‌ను ప్రారంభించినట్లు ఎషువ బెత్ హాలెల్ మినిస్ట్రీస్ ఫౌండర్ దండింగి అగస్టిన్ తెలిపారు. క్రీస్తు సంగీతంలో నిస్వార్థ సేవ చేసినందుకుఏ గిన్నిస్ రికార్డు వచ్చిందన్నారు. శుక్రవారం విజయవాడ ఏలూరు రోడ్‌లోని గుణదల మెట్రోపాలిటన్ చర్చిలో సంగీతంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన సందర్భంగా సంగీతంలో ప్రావీణ్యం సాధించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందించారు. అనంతరం దండింగి అగస్టిన్ మాట్లాడుతూ దాదాపు 18 దేశాల్లో ఉన్న 7,500 మంది విద్యార్థులకు ఉచితంగా సంగీత విద్యను నేర్పించామన్నారు. ఏడేళ్ల నుంచి 80 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ఎవరైనా నేర్చుకోవచ్చని తెలిపారు. ఈ కోర్స్ పూర్తిగా ఉచితమని, ఎటువంటి ఫీజు లేదన్నారు. గిన్నిస్ రికార్డు కోసం రెండేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నామని, మూడో యత్నంగా వచ్చిందన్నారు. తన సేవలను గుర్తించి ఇంజినియస్ చాం వరల్డ్ రికార్డు గోల్డెన్ ఐకానిక్ అవార్డును తనకు ప్రత్యేకంగా ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో అగస్టిన్ కుటుంబ సభ్యులతో పాటు హాలెల్ మ్యూజిక్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎషువ బెత్ హాలెల్ మినిస్ట్రీస్ ఫౌండర్ అగస్టిన్ -
దోమ కాటుతో వ్యాపించే వ్యాధులపై అప్రమత్తం
భవానీపురం(విజయవాడపశ్చిమ): దోమ కాటుతో వ్యాపించే మలేరియా, ఫైలేరియా, డెంగూ, చికెన్‌గున్యా, మెదడువాపు వంటి వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ పద్మావతి పేర్కొన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం, ఫ్రైడే డ్రై డే పురస్కరించుకుని శుక్రవారం గొల్లపూడి సచివాలయం–2లో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటిని మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. మెడికల్ అండ్ హెల్త్ జాయింట్ డైరెక్టర్ మల్లీశ్వరి, జిల్లా మలేరియా అధికారి మోతీబాబు మాట్లాడుతూ ఈ ఏడాది మలేరియా దినోత్సవ నినాదం ‘వనరుల చేకూర్పు, మరలా కొత్తగా ఆలోచించు, మళ్లీ ఉత్తేజం పొందు’ స్ఫూర్తితో వైద్య ఆరోగ్య సిబ్బంది పని చేయాలన్నారు. కొండపల్లి పీహెచ్సీ డాక్టర్ పద్మావతి అధ్యక్షతన జరిగిన సదస్సులో డెప్యూటీ డైరెక్టర్ రామనాథం, రూరల్ ఇన్చార్జ్ ఎంపీడీఓ మురళీకృష్ణ, స్టేట్ ఎంటమాలజిస్ట్ కొండారెడ్డి, బయాలజిస్ట్ సూర్య, సబ్ యూనిట్ ఆఫీసర్ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలేరియా వ్యాధులపై అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ పద్మావతి -
15 మంది పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు
ఆంధ్రా ఆస్పత్రి పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ రామారావులబ్బీపేట(విజయవాడతూర్పు): పుట్టుకతోనే అత్యంత క్లిష్టతరమైన గుండె సమస్యలు ఉన్న 15 మంది చిన్నారులకు విజయవాడ ఆంధ్రా హాస్పటల్లో ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించారు. హీలింగ్ లిటిల్‌హార్ట్స్, యూకే చారిటీ సౌజన్యంతె ఈ నెల 21 నుంచి 34వ ఉచిత హార్ట్ సర్జరీస్ క్యాంపు నిర్వహించినట్లు ఆస్పత్రి పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ వెంకట రామారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సర్జరీల వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ బెంగుళూరుకు చెందిన పిడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ జగన్నాథ్‌తో పాటు, ఉషశెట్టి, అశ్విని కుమారస్వామిలతో పాటు, ఆంధ్రా హాస్పటల్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ నాగేశ్వరరావుల బృందం సర్జరీలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి నెలా 50 నుంచి 60 మంది పిల్లలకు గుండె సర్జరీలు చేస్తూ, ఇప్పటి వరకూ ఆస్పత్రిలో 4,500 మందికి చిన్నారులకు గుండె సర్జరీలు చేసినట్లు తెలిపారు. ఆంధ్రా మదర్ అండ్చైల్డ్ ఫౌండేషన్, మహేష్‌బాబు ఫౌండేషన్ సహకారం కూడా ఉన్నట్లు చెప్పారు. సమావేశంలో శస్త్ర చికిత్సలు చేసిన వైద్యులు, పిడ్రియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కె.విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. -
కూలీలపై దూసుకెళ్లిన కారు
జగ్గయ్యపేట అర్బన్: చెరువుబజారులో కొత్త రైతుబజారు వద్ద ఉన్న భవన నిర్మాణ కార్మికుల అడ్డాలో పనులు కోసం వేచిచూస్తున్న పలువురు కూలీలపైకి వేగంగా వస్తున్న కారు ఢీకొంది. దీంతో ఓర్సు రామకృష్ణ, తాళ్లూరి వాసు, బండి నాగరాజు, కుంచపు నాగరాజు, బత్తుల వెంకట గురువులు అనే ఐదుగురు కూలీలు గాయపడ్డారు. కారు వారిని ఢీకొన్న తర్వాత ఇనుప పోల్‌కు తగిలి ఆగిపోయింది. గాయపడిన వారిని స్థానికుల సాయంతో ప్రథమ చికిత్స కోసం జగ్గయ్యపేట పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్ వెంకటేశ్వర్లు కూడా చెరువు బజారు వాసే. కిరాయికి కారు నడుపుతుంటాడు. అతను ఆ సమయంలో పూటుగా మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం వారిని డిశ్చార్జ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) వారిని పరామర్శించారు. ప్రమాద సంఘటనపై పోలీసులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. పట్టణ ఎస్ఐ–2 వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురికి గాయాలు -
కృష్ణా వర్సిటీకి ఉన్నత విద్యా అవార్డు
రుద్రవరం (మచిలీపట్నం రూరల్): కృష్ణా వర్సిటీ ప్రతిష్టాత్మక ఇండియా ఉన్నత విద్యా అవార్డ్ సాధించిందని విశ్వవిద్యాలయం రెక్టార్ ఆచార్య ఎంవీ బసవేశ్వరరావు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పనితీరు ఆధారంగా కృష్ణా వర్సిటీ మూడో స్థానంలో నిలిచిందన్నారు. ఎడ్యుకేషన్ వరల్డ్ ఆధ్వర్యంలో శుక్రవారం న్యూఢిల్లీలోని హోటల్ గ్రాండ్లో నిర్వహించిన కార్యక్రమంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సభ్యుడు జతీన్ పరాంజపే చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు బసవేశ్వరరావు తెలిపారు. తొలుత శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం సాధిస్తున్న విజయాలు, పొందుతున్న ఫలితాలపై బసవేశ్వరరావు ప్రసంగించారు. 30న జాబ్‌మేళా చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పనశాఖ ఆధ్వర్యాన ఈ నెల 30న ఉయ్యూరులో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ఉయ్యూరులోని ఏజీ, ఎస్జీ సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా జరుగుతుందని పేర్కొన్నారు. పలు కంపెనీల్లో ఉద్యోగాలకు 10వ తరగతి నుంచి పీజీ చదివిన 18 నుంచి 30 సంవత్సరాల్లోపు యువత అర్హులని వివరించారు. ఎంపికై న వారికి ఆకర్షణీయ వేతనంతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగావకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 96187 13243, 88851 59008లో సంప్రదించాలని సూచించారు. -
కొవ్వొత్తులతో ముస్లింల శాంతి ర్యాలీ
చల్లపల్లి: కశ్మీర్లో ఉగ్రవాదుల దాడికి నిరసనగా ముస్లిం మైనార్టీ నాయకులు శనివారం సాయంత్రం శాంతి ర్యాలీ నిర్వహించారు. చల్లపల్లి–మచిలీపట్నం రహదారిలోని పెద్ద మసీదు వద్ద ప్రారంభమైన ర్యాలీ ప్రధాన సెంటర్ నుంచి వైశ్యబజార్ మీదుగా సాగింది. కొవ్వొత్తులు వెలిగించి చనిపోయినవారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థించారు. కులమతాల భేదాలు వద్దు.. ఐకమత్యమే ముద్దు, హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి.. అంటూ నినాదాలు చేశారు. దాడికి పాల్పడిన ఉగ్రమూకలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో ముస్లిం మత గురువు ఇమామ్, పెద్ద మసీదు కమిటీ అధ్యక్షుడు నసీం ఘోరి, గౌసియా మసీదు అధ్యక్షుడు షేక్ అబూ షరీఫ్, చల్లపల్లి, నారాయణరావునగర్‌కు చెందిన ముస్లిం పెద్దలు, యువత, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
కృష్ణాజిల్లా
శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025మర్యాదపూర్వకంగా.. చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపిని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. నిత్యాన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ నిత్యాన్నదానానికి గుంటూరుకు చెందిన ఎం.శశితేజ కుటుంబం రూ. 1,01,116 విరాళాన్ని అందజేసింది. ‘శక్తి’ యాప్‌పై అవగాహన విజయవాడస్పోర్ట్స్: మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ కె.లతాకుమారి పర్యవేక్షణలో శక్తి టీం ఆంధ్రా లయోల, ఎస్ఆర్ఆర్ కాలేజీల్లో విద్యా ర్థినులకు శక్తి యాప్‌పై అవగాహన కల్పించారు.● గుణదలకు చెందిన వినయ్(పేరు మార్చాం) 9వ తరగతి చదువుతున్నాడు. ఊబకాయం కారణంగా యాక్టివ్‌గా ఉండకపోవడంతో పాటు ఇటీవల నీరసంతో పడిపోయాడు. వైద్యులు పరీక్షించగా మధుమేహం స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. ● భవానీపురానికి చెందిన 10వ తరగతి విద్యార్థి రాకేష్(పేరుమార్చాం) చిన్నప్పుడు బాగానే ఉన్నా, నాలుగేళ్లుగా ఫాస్ట్ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడంతో ఒకేసారి బరువు పెరిగాడు. దీంతో క్రీడల్లో పాల్గొనేందుకు అవకాశం లేక పోవడంతో మానసికంగా కుంగుబాటుకు గురై చదువులో కూడా రాణించలేక పోతున్నాడు. ఇలా వీరిద్దరే కాదు అనేక మంది పిల్లలు ఒబెసిటీ కారణంగా శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒకప్పుడు పిల్లలు బొద్దుగా ఉంటే ముద్దుగా ఉన్నాడని అనేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. బొద్దు ముద్దు కాదంటున్నారు. అలాంటి వారిలో చలాకీతనం లేక పోవడంతో పాటు, చిన్న వయస్సులోనే అనేక మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వయసుకు తగిన బరువు ఉంటే చాలని, అధిక బరువు అనర్థాలకు దారి తీస్తోందంటున్నారు. ప్రస్తుతం ప్రతి వంద మంది పిల్లల్లో 18 మంది అధిక బరువుతో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. సెలవులను సద్వినియోగం చేసుకోవాలి.. పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చేశారు. పిల్లలు ఇంటి వద్దే ఉంటూ స్మార్ట్ఫోన్లు, టీవీల్లో తమకిష్టమైన చానల్స్ చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలా నిశ్చల జీవనశైలికి అలవాటు పడటం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. ఇప్పటికే ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటితో ఒబెసిటీ పిల్లలు ఎక్కువయ్యారు. ఒబెసిటీని అధిగమించేందుకు ఈ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. అవుట్డోర్, ఇన్డోర్ క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, తాజా సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా ఒబెసిటీని తగ్గించుకోవచ్చునంటున్నారు. 9న్యూస్రీల్పిల్లలూ ఇలా చేయండి..ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి.. డయాబెటిస్ వచ్చే ప్రమాదం.. వేసవి సెలవులు 50 రోజులకు పైగానే ఇచ్చారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో క్రీడలు ఆడండి. అవసరమైతే సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో చేరండి. స్విమ్మింగ్ చేయడం ఎంతో మంచిది. సైకిల్‌ను ఇష్టంగా ప్రతిరోజూ తొక్కండి. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండండి. సెల్‌ఫోన్, టీవీ చూస్తూ భోజనం చేసే వారు తగిన మోతాదు కంటే ఎక్కువ తినేస్తారు. ఆ అలవాటు మానుకోవాలి. సెల్‌ఫోన్, టీవీ చూసే టైమ్ తగ్గించాలి. పిల్లల్లో ఒబెసిటీతో మానసిక, ఆరోగ్య సమస్యలు డిప్రెషన్‌తో చదువులోనూ రాణించలేకపోతున్న వైనం వేసవి సెలవుల్లో వ్యాయామంపై దృష్టి పెట్టాలంటున్న వైద్యులు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచన ఒబెసిటీతో ఉన్న పిల్లలు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. వేసవిలో క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ, జంక్‌ఫుడ్స్‌కు దూరంగా ఉండటం ద్వారా స్లిమ్‌గా మారవచ్చు. వేసవిలో దొరికే మామిడి లాంటి సీజనల్ ఫ్రూట్స్‌తో పాటు, ఇంట్లో తయారు చేసిన ఆహారం తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లోనే అవుట్డోర్ క్రీడలు ఆడాలి. ఎండలో ఆడితే డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. – గర్రే హరిత, న్యూట్రీషియన్ ఒబెసిటీ ఉన్న పిల్లల్లో టైప్–2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. కొందరిలో సుగర్ లెవల్స్ అదుపులో ఉండవు. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ కారణంగా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వారంలో రెండు, మూడు సార్లు జంక్‌ఫుడ్, బయట ఆహారం తీసుకోవడం, సెకండరీ లైఫ్‌తో ఊబకాయులుగా మారుతున్నారు. తల్లిదండ్రులు వారిని గుర్తించి.. వాకింగ్, వ్యాయామం వంటివి చేయిస్తే మంచిది. అందుకు వేసవి సెలవులను వినియోగించుకోవాలి. – డాక్టర్ ఎం. సునీత, మధుమేహ నిపుణురాలు -
ప్రధానమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులకు పునర్ శంకుస్థాపన చేసేందుకు మే రెండో తేదీన విచ్చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు తెలిపారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో కమిషనరేట్‌లో పోలీసు అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రధానితోపాటు వీవీఐపీలు, వీఐపీలు పాల్గొంటున్న దృష్ట్యా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రాంతాల్లో శాంతి భద్రతలు, ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తుకు కావల్సిన ఏర్పాట్లపై ఈ సమీక్షలో చర్చించారు. డీసీపీలు కె.జి.వి.సరిత, తిరుమలేశ్వరరెడ్డి, ఎ.బి.టి.ఎస్.ఉదయారాణి, కృష్ణమూర్తినాయుడు, ఎస్.వి.డి.ప్రసాద్, ఏడీసీపీలు జి.రామకృష్ణ, ఎ.వి.ఎల్.ప్రసన్నకుమార్, ఏం.రాజారావు, కె.కోటేశ్వరరావు, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యంమచిలీపట్నంఅర్బన్: పరిసరాల పరిశుభ్రతే ప్రజారోగ్యానికి తొలిమెట్టని కృష్ణా జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్. శర్మిష్ట అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మురుగునీటి నిల్వలున్న ప్రాంతాల్లో దోమల లార్వా వృద్ధి చెందుతుందన్నారు. గతంతో పోలిస్తే మలేరియా కేసులు ఏటేటా తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొన్నారు. దోమ తెరలు వాడాలని, ఇంటి పరిసరాల్లో దోమల నియంత్రణ మందులు పిచికారీ చేయించాలన్నారు. పరిసరాల్లో కొబ్బరి బోండాలు, రోళ్లు, పాతటైర్లు వంటివి లేకుండా చూసుకోవాలని సూచించారు. జిల్లా మలేరియా అధికారి బి. రామారావు మాట్లాడుతూ గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు స్వచ్ఛత, వ్యక్తిగత రక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.బంగారు తాపడం పనులకు రూ. 5 లక్షల విరాళంఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయ బంగారు తాపడం పనులకు హైదరాబాద్‌కు చెందిన భక్తుడు శుక్రవారం రూ.5 లక్షల విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన టి. శ్రీనివాస్ సంపత్ శుక్రవారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశా రు. ఆలయ అధికారిని కలిసి రూ. 5 లక్షల విరాళాన్ని ఆలయ బంగారు తాపడం పనుల నిమిత్తం అందజేశారు. అనంతరం దాతకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.రిజిస్ట్రేషన్ సేవలు సులభతరంగాంధీనగర్(విజయవాడసెంట్రల్): రిజిస్ట్రేషన్ సేవలు సులభతరం చేయడంతోపాటు ప్రజల సమయం ఆదా చేసేందుకు రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తేచ్చినట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ ఏ రవీంద్రనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యూర్ కోడ్ స్కాన్ చేసి సులభంగా స్లాట్ బుక్ చేసుకునే వీలు కల్పించామన్నారు. ఈ నెల 4నుంచే విజయవాడ రీజియన్‌లోని గాంధీనగర్, మచిలీపట్నం రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి తెచ్చామన్నారు. శనివారం నుంచి కృష్ణా జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్, ఎన్టీఆర్ జిల్లాలోని 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు ఉపయోగించుకొని సమయాన్ని ఆదా చేసుకోవాలని కోరారు. -
తక్కువ ధరకు ధాన్యం అమ్మొద్దు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రబీలో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధర కంటే తక్కువకు అమ్మొద్దని మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం గాంధీనగర్‌లోని రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకుని నష్టపోతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. మిల్లర్లు తక్కువ ధరకు కొంటున్నారని వస్తున్న వార్తలను ఖండించారు. తేమ శాతం ఎక్కువగా ఉందని, ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు లేని ధాన్యాన్ని తక్కువకు కొనుగోలు చేసి ఉండొచ్చని వివరించారు. మిల్లర్లు ఏవైనా అవకతవకలకు పాల్పడితే అసోసియేషన్ దృష్టికి తేవాలన్నారు. సమావేశంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ భాస్కరరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు పులిపాటి శ్రీనివాసరావు, కార్యదర్శి అన్నే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు -
డీఎస్సీ నిబంధనలు సడలించాలి
డీవైఎఫ్ఐ ధర్నా గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డీఎస్సీ నోటిఫికేషన్లో అనేక లోపాలు ఉన్నాయని, నిబంధనలు సడలించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రామన్న డిమాండ్ చేశారు. శుక్రవారం విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్‌లో డీఎస్సీ అభ్యర్థులతో కలిసి డీవైఎఫ్ఐ ఆధ్వర్యాన ధర్నా జరిగింది. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలను డీఎస్సీకి అనర్హులు చేసే నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఇంటర్, డిగ్రీ, పీజీలో 45, 50 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను తొలగించాలన్నారు. తెలంగాణలో సైతం 40 శాతానికి అనుమతి ఇచ్చారని గుర్తు చేశారు. సిలబస్ విస్తృతిరీత్యా అభ్యర్థుల ప్రిపరేషన్‌కు 90 రోజులు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీ పరీక్షలు ఒకే సమ యంలో లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అభ్యర్థుల వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. డీఎస్సీకి అప్లై చేసుకోడానికి ఇచ్చిన వెబ్ సైట్స్, టోల్ ఫ్రీ నంబర్లు పని చేయడం లేదన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము, జిల్లా అధ్యక్షుడు పి. కృష్ణ, సెంట్రల్ సిటీ అధ్యక్షుడు శివ, పలువురు అభ్యర్థులు పాల్గొన్నారు. -
సార్వత్రిక విద్య మిథ్య!
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విద్యలవాడగా పేరుగాంచిన జిల్లాలో ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఫలితాలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. అధికారుల తీరు, కోఆర్డినేటర్ల నిర్లక్ష్యంతో జిల్లా ప్రతిష్టను దిగజార్చటమే కాకుండా అభ్యర్థుల భవితతో ఆటలాడుతున్నారంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మార్చి మాసంలో సాధారణ ఎస్ఎస్సీ పరీక్షలు, ఇంటర్మీడియెట్ పరీక్షలతో పాటుగా ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఓపెన్ స్కూల్లో అభ్యసించే పది, ఇంటర్ అభ్యర్థులకు సైతం పరీక్షలను ఏకకాలంలో నిర్వహించింది. సాధారణ పదో తరగతి పరీక్ష ఫలితాలతో పాటుగా ఓపెన్ స్కూల్ ఫలితాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఫలితాల్లో రాష్ట్రంలో 26 జిల్లాల్లోనూ 24, 25 స్థానాల్లో ఎన్టీఆర్ జిల్లా ఉండటం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. అందని పాఠ్య పుస్తకాలు.. సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియెట్ కోర్సులకు సంబంధించి ఏటా ఆ సంస్థ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది. ఫీజు చెల్లించిన వారికి పుస్తకాలను సకాలంలో పంపిణీ చేస్తుంది. కానీ ఈ ఏడాది సకాలంలో పుస్తకాలు అందలేదని ఆయా కోర్సులకు ఫీజులు చెల్లించిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీనిపై పత్రికల్లోనూ వార్తలు వచ్చాయి. వాటికి సంబంధించి కోఆర్డినేటర్లు సైతం పలు కారణాలను చెబుతూ తమను తప్పుదోవ పట్టించారని పలువురు ఫీజు చెల్లించిన అభ్యర్థులు వాపోతున్నారు. సకాలంలో పుస్తకాలు అందకపోవటం వల్లే చాలా మంది అరకొర చదువులతో పరీక్షలకు హాజరయ్యారని, అందుకే ఈ తరహా ఫలితాలు వచ్చాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు ఏపీ సార్వత్రిక విద్యాపీఠం అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు ఈ ఏడాది పూర్తిగా పర్యవేక్షణను వదిలేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దాంతో అడ్మిషన్ల సంఖ్య భారీగానే పడిపోయిందని, అలాగే ఫలితాలు సైతం దిగజారిపోయాయంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. విద్యాపీఠం షెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సిన విధులను సైతం నిర్వహించలేదని దానిని రాష్ట్ర స్థాయి అధికారులు సైతం పర్యవేక్షించలేదని కోఆర్డినేటర్లు చెబుతున్నారు. వేలాది రూపాయలు దండుకున్నారు! తమ నుంచి వేలాది రూపాయలు దండుకున్నారని, తీరా పరీక్ష ఫలితాల్లో తమకు అన్యాయం చేశారంటూ పలువురు అభ్యర్థులు కోఆర్డినేటర్లను ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా ఓపెన్ స్కూల్ కోర్సులను నిర్వహించే సంస్థలు విద్యార్థులకు పలు మాయ మాటలు చెప్పి వారి నుంచి వేలాది రూపాయాలు దండుకున్నారని ప్రచారం జరిగింది. ‘మిమ్మల్ని పాస్ చేయిస్తాం, మీరు చూసి రాసుకోవచ్చు’ అంటూ పలు రకాలుగా వారిని మభ్యపెట్టి భారీ వసూళ్లకు పాల్పడిన విషయాలపై పెద్ద స్థాయిలో విమర్శలు సైతం వచ్చిన విషయం తెలిసిందే. తీరా పరీక్షలు సాధారణ షెడ్యూల్లో పెట్టడం, గట్టిగా నిఘా ఉంచటం, ఎక్కడా మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా చేయటంతో ఫలితాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఫలితం.. సు‘దూరం’ ఇదీ ఎన్టీఆర్ జిల్లాలో పరిస్థితి: కానరాని తరగతుల జాడ.. దూరవిద్యలో దారుణ ఫలితాలు ఓపెన్ స్కూల్ ఫలితాల్లో భారీగా పడిపోయిన ఉత్తీర్ణత ‘పది’లో 25వ స్థానం, ఇంటర్లో 24వ స్థానానికి పరిమితమైన జిల్లా సకాలంలో అందని పాఠ్య పుస్తకాలు, జరగని తరగతులు ఓపెన్ స్కూల్ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు ఫీజు చెల్లించిన అభ్యర్థులకు ఆయా స్టడీ సెంటర్ల ద్వారా కోఆర్డినేటర్లు తరగతులను నిర్వహించాల్సి ఉన్నా.. అలా జరగలేదు. సార్వత్రిక విద్యాపీఠం జిల్లా అధికారులు ఎక్కడా సరైన పర్యవేక్షణ కానీ పరిశీలన కానీ చేసిన దాఖలాలు లేవని పలువురు అభ్యర్థులు విమర్శిస్తున్నారు. అందువల్లే కోఆర్డినేటర్లు తరగతులు నిర్వహించకుండానే తమ నుంచి వేలాది రూపాయలు దండుకొని రోడ్డుపైన వదిలేశారంటూ వాపోతున్నారు. ఓపెన్ స్కూల్ పరీక్ష ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి పదో తరగతికి 4.34 శాతం, ఇంటర్మీడియెట్‌లో 20.61 శాతం ఫలితాలు వచ్చాయి. ‘పది’లో రాష్ట్రంలోనే 25వ స్థానంలో నిలువగా, ఇంటర్మీడియెట్ ఫలితాల్లో 24వ స్థానంలో నిలిచింది. పదో తరగతి పరీక్షలకు 1,499 మంది హజరయ్యారు. అందులో వారిలో 785 మంది బాలురు, 714 బాలికలు ఉన్నారు. అందులో కేవలం 65 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో 26 మంది బాలురు, 39 మంది బాలికలు ఉన్నారు. ఇంటర్మీడియెట్ కోర్సుకు సంబంధించి 2,751 మంది విద్యార్థులు పరీక్షకు హజరయ్యారు. వారిలో 1715 మంది బాలురు, 1036 మంది బాలికలు ఉన్నారు. అందులో 567 మంది ఉత్తీర్ణులయ్యారు. వారిలో 301 మంది బాలురు, 266 మంది బాలికలు ఉన్నారు. -
విద్యుత్ అదాలత్‌లతో సమస్యల పరిష్కారం
సీజీఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమ్మానుయేల్ చల్లపల్లి: ఏపీసీపీడీసీఎల్ పరిధిలో ఉన్న ఏడు సర్కిల్స్‌లో అపరిష్కృతంగా ఉన్న విద్యత్ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కన్జూమర్ గ్రీవెన్సెస్ రెడ్రస్సెల్ ఫోరం(సీజీఆర్ఎఫ్) పనిచేస్తోందని సంస్థ చైర్మన్, విశ్రాంత న్యాయమూర్తి ఎన్.విక్టర్ ఇమ్మానుయేల్ తెలిపారు. చల్లపల్లిలో గురువారం జరిగిన విద్యుత్ అదాలత్ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన ‘సాక్షి’తో మాట్లా డారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ఒంగోలు, పల్నాడుతో పాటు డీఆర్డీఏ సర్కిళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సర్కిళ్ల పరిధిలో ఉన్న వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు సీజీఆర్ఎఫ్ పని చేస్తోందన్నారు. గతంలో సమస్యల పరిష్కారం కోసం తిరుపతి వరకూ వెళ్లాల్సి వచ్చేదన్నారు. 2020లో విజయవాడ గుణదల ప్రధాన కేంద్రంగా తనతోపాటు మరో ముగ్గురు సభ్యులతో ఇక్కడ కార్యాలయాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. ప్రజలు వ్యవప్రయాసలకోర్చి ఇక్కడి వరకూ రావాల్సిన అవసరం లేకుండా వారి వద్దకే వెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు విద్యుత్ వినియోగదారుల అదాలత్‌లు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ ఏడు సర్కిళ్ల పరిధిలో నాలుగేళ్లలో 190 ప్రాంతాల్లో విద్యుత్ వినియోగదారుల అదాలత్‌లు నిర్వహించిగా వెయ్యికి పైగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఫిర్యాదులు అందాయన్నారు. నాలుగు సమస్యలు మాత్రమే పెండింగ్‌లో ఉండగా, మిగిలిన వాటిని పరిష్కరించామని తెలిపారు. సమస్యలను పరిష్కరించడంలో తిరుపతి, విశాఖపట్నం సీజీఆర్ఎఫ్ల కంటే విజయవాడ సీజీఆర్ఎఫ్ ముందు వరుసలో ఉందన్నారు. -
ఉపాధి కూలీల ఆకలి కేకలు
పామర్రు: మండు టెండలో నిత్యం కష్ట పడుతున్న ఉపాధి కూలీలకు కష్ట కాలం దాపురించింది. రోజంతా రెక్కలు కష్టంతో స్వేదం చిందిస్తున్నా వారికి ఆకలి బాధలు తప్పడం లేదు. కూలి డబ్బులను కేంద్రం ఇప్పటి వరకు విడుదల చేయక పోవడంతో వారు పడుతున్న వేదన వర్ణణాతీతం. సుమారు మూడు నెలలుగా శ్రమిస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. జిల్లాలో సుమారు 2.53 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. వాటిలో 3.29 లక్షల మంది సభ్యులు ఉన్నారు. జనవరి 15 నుంచి ఇప్పటి వరకు వారికి దినసరి కూలి అందలేదు. గతంలో వారానికి పది రోజులకు ఒక్కసారి కూలి డబ్బులు చెల్లించేవారు. మూడు నెలల తరబడి కూలి అందకపోవడంతో కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు నెలల వ్యవధిలో సుమారు 14 లక్షల పని దినాలు కల్పించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా వారు పడుతున్న కష్టానికి ఫలితం రాలేదు. పండుగలకూ పస్తులే ఈ ఏడాది ఆరంభంలో జనవరి 15వ తేదీ వరకు కొంత మేర కూలీలకు డబ్బులు అందాయి. ఆ తరువాత నుంచి పెండింగ్ పడుతూ వచ్చారు. జనవరిలో రిపబ్లిక్ డే మొదలుకొని మహా శివరాత్రి, రంజాన్, ఉగాది, శ్రీరామ నవమి, గుడ్‌ఫ్రైడ్ వంటి పర్వదినాలు వచ్చినప్పటికీ వారికి పస్తులు తప్పడం లేదు. ఉపాధి హామీ పథకంలో భాగంగా పని చేస్తున్న కూలీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇంత వరకు విడుదల చేయలేదు. దీంతో కూలీలు పస్తులతో కాలక్షేపం చేయాల్సి వస్తోంది. బకాయిల కోసం ఎదురుచూపులు జిల్లాలో గ్రామీణ ఉపాధి హమీ పథకం కింద పని చేస్తున్న కూలీలకు సంబంధించి సుమారు రూ.35 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే సుమారు మూడు లక్షల మంది కూలీలకు ఉపశమనం లభిస్తుంది. కూలీల కుటుంబాలకు మూడు నెలల మొత్తం ఒకేసారి అందిస్తే ఆర్థికంగా కొంత వెసులు బాటు లభిస్తుందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. మూడు నెలలుగా అందని వేతనాలు జిల్లాలో 2.53 లక్షల జాబ్ కార్డులు సుమారు 3.29 లక్షల మంది కూలీలు జిల్లాలో రూ.35.45 కోట్ల బకాయిలు -
భవన నిర్మాణ కార్మికుల ధర్నా
మచిలీపట్నంటౌన్: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికులు గురువారం జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్‌కు చేరుకుని ధర్నా చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా కార్యదర్శి మాదాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది కార్మికులు భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నా పేర్కొన్నారు. ఈ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు కాకపోవటంతో ఇబ్బందులు పడుతు న్నాని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు అన్ని రాష్ట్రాల్లో బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని వివరించారు. మొన్నటి వరకు కలిసి ఉన్న తెలంగాణలో కూడా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయన్నారు. మన రాష్ట్రంలోనూ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె.వి.గోపాలరావు మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అమలవుతున్న సంక్షేమ పథకాలకు అదనంగా కొత్త పథకాలు అభివృద్ధి చేసి అమలు చేస్తున్నారన్నారు. మన రాష్ట్రంలో మాత్రం 12, 14 మెమో ఇచ్చి అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆపివేశారని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చినట్లుగా రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా సమీక్ష కమిటీ సమావేశానికి విచ్చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, మంత్రి కొల్లు రవీంద్రకు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా సీఐటీయూ అధ్యక్షుడు కళ్లం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు వై.నరసింహారావు, బేతా శీను, ఎండి కరీముల్లా, మాజేడి శ్రీనివాస రావు, పెదబాబు, బిల్డింగ్ వర్కర్స్ మండల కమిటీ అధ్యక్ష కార్యదర్శులు బండారు శీను, మీర్ ఆలీ అక్బర్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల వైజ్ఞానిక విహారయాత్ర
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వైజ్ఞానిక విహార యాత్ర కోసం బయలుదేరి వెళ్లారు. ఏపీ ప్రభుత్వం, సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ విహార యాత్రను చేపట్టారు. జిల్లా లోని ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ వైజ్ఞానిక ప్రదర్శ నల్లో ప్రతిభ చూపిన 101 మంది విద్యార్థులు, 10 మంది గైడ్ టీచర్లతో కలిసి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నుంచి బుధవారం రాత్రి వారు తరలివెళ్లారు. గురువారం చైన్నెలోని పెరియార్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్, బీఎం బిర్లా ప్లానిటోరియం, ఎవల్యూషన్ పార్క్‌లు, స్నేక్ పార్క్, మెరీనా బీచ్‌లను సందర్శించారు. విద్యార్థులు ఈ వైజ్ఞానిక విహార యాత్ర ద్వారా అంతరిక్ష పరిశోధన, విశ్వ ఆవిర్భావం, జీవపరిణామ క్రమం, న్యూక్లియర్ పవర్, పర్యావరణ పరిరక్షణ మొదలైన విషయాలను ప్రత్యక్ష పరిశీ లన ద్వారా తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ ఆఫీసర్ డాక్టర్ మైనం హుస్సేన్ పాల్గొన్నారు. -
ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు విజయ డెయిరీ ఆర్థిక సాయం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): పహల్గాం ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు విజయ డెయిరీ తరఫున ఆర్థిక సాయం అందించనున్నామని సంస్థ చైర్మన్ చలసాని ఆంజనేయులు ప్రకటించారు. ఉగ్రవాదుల దాడులకు నిరసనగా కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) ప్రాంగణంలో గురువారం మానవ హారం నిర్మించారు. ఫ్యాక్టరీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ కేశినేని చిన్ని హాజరయ్యారు. ఎంపీ కేశినేని చిన్ని, చైర్మన్ చలసాని ఆంజనేయులు, ఎండీ కొల్లి ఈశ్వరబాబు, డెయిరీ బోర్డు సభ్యులు, ఉద్యోగులు, సిబ్బంది నల్ల రిబ్బన్లు ధరించి మానవ హారంలో పాల్గోని పాకిస్తాన్ చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎంపీ, చైర్మన్ మీడియాతో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి పాకిస్తాన్ ఆధ్వర్యంలోనే జరిగిందని, దీనిని భారతీయులందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారని పేర్కొన్నారు. దేశ ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న అరాచక శక్తుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉగ్రదాడిలో రాష్ట్రానికి చెందిన చంద్రమౌళి, మధుసూదనరావు మరణించారని, వారి కుటుంబాలకు విజయ డెయిరీ తరఫున రూ.1.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు.