
కృష్ణా జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా జాహిద్ ఫర్హీన్
చిలకలపూడి
(మచిలీపట్నం): కృష్ణా జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా జాహిద్ ఫర్హీన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియమించింది. ఆమె సోమ వారం కలెక్టరేట్‌కు విచ్చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జాహిద్ ఫర్హీన్ 2024 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ట్రైనీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమె ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)లో పాల్గొన్నారు. అర్జీల స్వీకరణ, పరిష్కార కార్యక్రమాలను జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి పరిశీలించారు.
డీసీసీబీ చైర్మన్‌గా
నెట్టెం రఘురాం
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్‌గా నెట్టెం రఘురాంను ప్రభుత్వం సోమవారం నియమించింది. ఇప్పటి వరకు డీసీసీబీ ప్రత్యేకాధికారిగా కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ వ్యవహరించారు. రఘురాం జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన నాయకుడు. గతంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
డీసీఎంఎస్ చైర్మన్‌గా బండి రామకృష్ణ
జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్‌గా బండి రామకృష్ణను ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు డీసీఎంఎస్ ప్రత్యేకాధికారిగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ వ్యవహరించారు. రామకృష్ణ మచిలీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు.
ఏపీ ట్రెజరీ, అకౌంట్స్ సర్వీసెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఏపీ ట్రెజరీ అండ్ అకౌంట్స్ సర్వీసెస్ అసోసియేషన్ తొలి కౌన్సిల్ సమావేశం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా జి.రవికుమార్, సహ అధ్యక్షుడిగా కె.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా కె.రాజ్‌కుమార్, కార్యనిర్వాహక కార్యద ర్శిగా బి.శ్రీనివాసరావు, కార్యదర్శిగా జి.శ్రీనివాస్, కోశాధికారిగా ఎల్.వి.యుగంధర్ ఎన్నిక య్యారు. ఇద్దరు మహిళలతోపాటు ఏడుగురు సహాయ కార్యదర్శులకు నూతన కార్యవర్గంలో చోటు కల్పించారు. ఎన్నికల అధికారిగా డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి పి.కిరణ్‌కుమార్, సహాయ ఎన్నికల అధికారిగా గుంటూరు కలెక్టర్ కార్యాలయ తహసిల్దార్ రవికుమార్, ఎన్నికల పరిశీలకులుగా ఒంగోలు రిటైర్డ్ డెప్యూటీ డైరెక్టర్ పి.హనుమంతరావు వ్యవహరించారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌రావు పాల్గొన్నారు.
డీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితి పెంచాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఏడేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించనందున అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఇవ్వా లని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము, కార్య దర్శి జి.రామన్న కోరారు. స్థానిక సున్నపు బట్టీల సెంటర్ సమీపంలో ఉన్న పూలే, అంబేడ్కర్ భవన్‌లో సమాఖ్య ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత, డీఎస్సీ అభ్యర్థులతో సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌లో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని సరిచేయాలని కోరారు. ఏడేళ్లుగా డీఎస్సీ రెగ్యులర్ నోటిఫికేషన్ ప్రకటించనందున అభ్యర్థుల వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. పరీక్షకు 45 రోజుల సమయమే ఉండటం వల్ల డీఎస్సీ అభ్యర్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురతున్నారని, చదువుకోవడానికి 90 రోజుల సమయం ఇవ్వాలని, ఒక జిల్లాకు ఒకే పేపర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రామన్న మాట్లాడుతూ.. అభ్యర్థుల ఇబ్బందులు పరిష్కరించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమాఖ్య నాయకులు శివ, కృష్ణ, డీఎస్సీ అభ్యర్థులు కరుణాకర్, బాబురావు, వీర్రాజు, ప్రసాద్, మోహన్ పాల్గొన్నారు.

కృష్ణా జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా జాహిద్ ఫర్హీన్