మంగళవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

Published Tue, Apr 29 2025 10:03 AM | Last Updated on Tue, Apr 29 2025 10:03 AM

మంగళవ

మంగళవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

చిలకలపూడి(మచిలీపట్నం): రైతులకు సేవలు అందించాల్సిన రైతు సేవా కేంద్రాలు సమస్యలతో కునారిల్లుతున్నాయి. కూటమి ప్రభుత్వం తీరుతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం స్థాపన దిశగా వైఎస్సార్‌ సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అన్ని సేవలు అందు బాటులో ఉండాలనే ఉద్దేశంతో పలు కార్యాలయాలను ఏర్పాటు చేశారు. రైతుల ముంగిటకే సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తొలుత రైతు సేవా కేంద్రాలుగా పేరుమార్చిన ప్రభుత్వం, ఆ తరువాత వాటి ద్వారా రైతులకు సేవలు అందించకుండా నిర్వీర్యం చేస్తోంది.

కొనుగోలు కేంద్రాలకే పరిమితం

గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాలను నేటి కూటమి ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలుగా మార్పు చేసింది. రైతు సేవలు అందించకుండా కేవలం రైతు పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఈ కేంద్రాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వాటికి మాత్రమే పరిమితం చేసింది. కూటమి ప్రభుత్వంలో విద్యుత్‌, ఇంటర్‌నెట్‌ బిల్లులతో పాటు రావాల్సిన బకాయిల కోసం సిబ్బంది అడిగితే ఉన్నతాధికారులు సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. గట్టిగా ఒత్తిడి చేస్తే ఇతర పనులు అప్పగిస్తూ వేధింపు లకు గురిచేస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. మరో వైపు పాడిపంటల మ్యాగ్‌జైన్‌కు కూడా లక్ష్యాలను నిర్దేశించటంతో వాటి చందా లను తామే వసూలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పది నెలలుగా నిర్లక్ష్యం

గతంలో మేలు

సేవలు నిల్‌

ఎరువుల బుకింగ్‌ లేదు

గతంలో ఆర్బీకేల ద్వారా ఎరువులు, పురుగు మందులు బుకింగ్‌ చేసుకునేవాళ్లం. ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల ద్వారా ఆ అవకాశం లేదు. గతంలో కియోస్క్‌ మిషన్ల ద్వారా ఎరువులు, పురుగు మందులు బుక్‌చేస్తే నాణ్యమైన సరుకు వచ్చేది. వాతావ రణ మార్పులు, మద్దతు ధరలు ఎప్పటికప్పుడు తెలిసేవి.

– పి.విశ్వేశ్వరరావు, రైతు, యండపల్లి,

కృత్తివెన్ను మండలం

పండిన పంట విక్రయించేందుకు ఖాళీ సంచుల కోసం రైస్‌ మిల్లర్ల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో ధాన్యం విక్రయించేందుకు ఖాళీ సంచులను రైతుభరోసా కేంద్రాల వద్దకు వెళ్లి తెచ్చుకునేవాళ్లం. ఇప్పుడు మిల్లర్ల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికై నా పాత పద్ధతిలోనే ఖాళీ సంచులను సేవా కేంద్రాల వద్ద రైతులకు ఇవ్వాలి.

– పెన్నేరు ప్రభాకరరావు, రైతుక్లబ్‌ కన్వీనర్‌,

వడ్లమన్నాడు, గుడ్లవల్లేరు

ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు ఎటువంటి సేవలు అందటం లేదు. గతంలో రైతులు రైతుభరోసా కేంద్రాలకు వెళ్తే వ్యవసాయాధికారులు అందుబాటులో ఉండి ఏ విధమైన విత్తనాలు వేస్తే లాభసాటిగా ఉంటుందో సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించటం లేదు.

– ఎం.ఎం.నాంచారయ్య, మాజీ సర్పంచ్‌,

ఎస్‌.ఎన్‌.గొల్లపాలెం, బందరు మండలం

న్యూస్‌రీల్‌

నిరుపయోగంగా కియోస్క్‌ యంత్రాలు

గత ప్రభుత్వం ప్రతి రెవెన్యూ గ్రామ పరిధి లోని రైతు భరోసా కేంద్రంలో కియోస్క్‌ యంత్రాలను ఏర్పాటు చేసి రైతులకు మరిన్ని సేవలు అందేలా చర్యలు చేపట్టింది. అయితే ఈ యంత్రాల ద్వారా రైతులు ఎప్పటికప్పుడు ఎరువులు, పురుగుమందులు బుకింగ్‌ చేసుకునే సౌకర్యంతో పాటు వాతావరణంలో మార్పులు తెలుసుకుని వాటికి అనుగుణంగా ఏ విధమైన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలో అంచనావేసే వారు. ఎప్పటికప్పుడు మద్దతు ధరలు కూడా ఈ యంత్రాల ద్వారా తెలుసుకునే వారు. ప్రస్తుతం ఎరువులు, పురుగు మందులు బుకింగ్‌ చేసుకునే సౌకర్యాన్ని ఆపే శారు. ఈ యంత్రాల ద్వారా రైతులకు అందే సేవలను అర్ధాంతరంగా నిలిపివేశారు.

అలంకార ప్రాయంగా రైతు సేవా కేంద్రాలు గతంలో ఆర్బీకేల ద్వారా పారదర్శకంగా సేవలు 363 రైతుసేవా కేంద్రాలకు 107 చోట్లే సొంత భవనాలు మరో 27 భవనాలు పూర్తయినప్పటికీ ప్రారంభానికి నోచుకోని వైనం ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూలకుచేరిన కియోస్క్‌ యంత్రాలు

జిల్లాలో వైఎస్సార్‌ సీపీ పాలనలో 363 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటయ్యాయి. 107 గ్రామాల్లో పక్కా భవనాలు నిర్మించారు. మరో 27 భవనాల నిర్మాణం పూర్తయింది. అయితే కూటమి ప్రభుత్వం వాటిని అందుబాటులోకి తీసుకురాలేదు. ప్రతి ఆర్బీకేలో గ్రామ ఉద్యాన అధికారి, గ్రామ వ్యవసాయాధికారి ఎవరో ఒకరు, సిబ్బంది నిత్యం రైతులకు అందుబాటులో ఉంటారు. రైతులకు ఎప్పటికప్పుడు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఈ సిబ్బందిని రైతుల సేవలకు ఉపయోగించకుండా పలు సర్వేలు, పింఛన్ల పంపిణీ వంటి విధులకు వినియోగిస్తోంది. గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల నిర్వహణ, అద్దె చెల్లింపులు ఇతర అంశాలకు నిధులు ఇచ్చేవారు. విద్యుత్‌, ఇంటర్‌నెట్‌ బిల్లులు కూడా చెల్లించేవారు. గత ప్రభుత్వ పాలన ముగిసే సమయం వరకు ఎటువంటి పెండింగ్‌ లేకుండా బిల్లులు చెల్లించారు. విద్యుత్‌ బిల్లులకు అవసరమైన బడ్జెట్‌ను విద్యుత్‌శాఖకు కేటాయించేలా ఉత్తర్వులు ఇచ్చారు. హైస్పీడ్‌ ఇంటర్‌నెట్‌ సదుపాయం సమకూర్చేందుకు సైతం నిధులు కేటాయించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కావస్తున్నా ఇటువంటి వాటికి ఏ మాత్రం బిల్లులు కేటాయించకుండా పక్కదారి పట్టిస్తున్నా రని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మంగళవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 20251
1/5

మంగళవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

మంగళవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 20252
2/5

మంగళవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

మంగళవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 20253
3/5

మంగళవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

మంగళవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 20254
4/5

మంగళవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

మంగళవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 20255
5/5

మంగళవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement