
దోమ కాటుతో వ్యాపించే వ్యాధులపై అప్రమత్తం
భవానీపురం(విజయవాడపశ్చిమ): దోమ కాటుతో వ్యాపించే మలేరియా, ఫైలేరియా, డెంగూ, చికెన్‌గున్యా, మెదడువాపు వంటి వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ పద్మావతి పేర్కొన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం, ఫ్రైడే డ్రై డే పురస్కరించుకుని శుక్రవారం గొల్లపూడి సచివాలయం–2లో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటిని మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. మెడికల్ అండ్ హెల్త్ జాయింట్ డైరెక్టర్ మల్లీశ్వరి, జిల్లా మలేరియా అధికారి మోతీబాబు మాట్లాడుతూ ఈ ఏడాది మలేరియా దినోత్సవ నినాదం ‘వనరుల చేకూర్పు, మరలా కొత్తగా ఆలోచించు, మళ్లీ ఉత్తేజం పొందు’ స్ఫూర్తితో వైద్య ఆరోగ్య సిబ్బంది పని చేయాలన్నారు. కొండపల్లి పీహెచ్‌సీ డాక్టర్ పద్మావతి అధ్యక్షతన జరిగిన సదస్సులో డెప్యూటీ డైరెక్టర్ రామనాథం, రూరల్ ఇన్‌చార్జ్ ఎంపీడీఓ మురళీకృష్ణ, స్టేట్ ఎంటమాలజిస్ట్ కొండారెడ్డి, బయాలజిస్ట్ సూర్య, సబ్ యూనిట్ ఆఫీసర్ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలేరియా వ్యాధులపై అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు
డాక్టర్ పద్మావతి