పెత్తనం నీదా.. నాదా.. సై | - | Sakshi
Sakshi News home page

పెత్తనం నీదా.. నాదా.. సై

Published Sun, Apr 27 2025 1:57 AM | Last Updated on Sun, Apr 27 2025 1:57 AM

పెత్త

పెత్తనం నీదా.. నాదా.. సై

సాక్షి ప్రతినిధి, విజయవాడ: అందినకాడికి దోచుకో..అందినంతా దాచుకో అన్న చందంగా తయారైంది పార్లమెంటు ప్రజాప్రతినిధి తీరు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఔపోసన పట్టిన ఆ ప్రజాప్రతినిధి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అక్రమ సంపాదన కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు జిల్లా టీడీపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. పక్కా ప్రణాళిక ప్రకారం ముందుగా ఎస్సీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. ఈ నియోజకవర్గాల్లో తన వ్యూహం ఫలించడంతో మిగిలిన నియోజకవర్గాల్లోనూ వేలు పెట్టడం ప్రారంభించారు. సహజ వనరుల దోపిడీ నుంచి నామినేటెడ్‌ పదవులు, పార్టీ పదవులు, కార్పొరేషన్‌ రుణాల మంజూరు ఇలా ప్రతి అంశంలో తన హవా నే కొనసాగేలా ముందుకు సాగుతున్నారు. పార్టీ అధి ష్టానం సైతం పార్లమెంటు ప్రజాప్రతినిధికే ప్రాధాన్యం ఇస్తోంది. పార్టీ పెద్దలే అండగా నిలవడంతో ప్రతి నియోజకవర్గంలో తన వర్గాన్ని ప్రోత్సహిస్తూ జిల్లా టీడీపీలో అంతర్గత పోరుకు తెరలేపారు. ఈ క్రమంలో సీనియర్‌ ప్రజాప్రతినిధులంతా పార్లమెంటు ప్రజాప్రతినిధి తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ఎస్సీ నియోజకవర్గాల్లో పెత్తనం

పార్లమెంటు ప్రజాప్రతినిధి తన అక్రమ సంపాదన కోసం ముందుగా జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గాలైన తిరువూరు, నందిగామపై దృష్టి సారించారు. తిరువూరు నియోజకవర్గంలో స్థానిక ప్రజాప్రతినిధిపై అధిష్టానానికి వ్యతిరేక భావన ఏర్పడేలా చేయడంలో విజయం సాధించారు. కనీసం స్థానికంగా జరిగే కార్యక్రమాలకు పార్టీ నాయకులు వెళ్లకుండా కట్టడి చేసి అక్కడి ప్రజాప్రతినిధిని ఏకాకిని చేశారు. ఈ నియోజకవర్గంలో మట్టి రవాణాతో పాటు మార్కెట్‌ యార్డు పదవులు, పార్టీ పదవులు, కార్పొరేషన్‌ రుణాలను సైతం తన వర్గానికి చెందిన వారికే వచ్చేలా చేయడంలో పార్లమెంటు ప్రజాప్రతినిధి విజయం సాధించారు.

● ఎస్సీ నియోజకవర్గమైన నందిగామలో సైతం పార్లమెంటు ప్రజాప్రతినిధి తన పెత్తనాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఎనిమిది ఇసుక రీచ్‌లలో సగానికిపైగా నడవకుండా నిలిపివేసిన పార్లమెంటు ప్రజాప్రతినిధి తన వర్గానికి చెందిన వ్యక్తులతో ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధి, పార్లమెంటు ప్రజాప్రతినిధి మధ్య వైరం నడుస్తోంది. అంతే కాకుండా నామినేటెడ్‌ పదవుల కేటాయింపులో కూడా రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. సబ్సిడీ రుణాలు సైతం పార్లమెంట్‌ ప్రజాప్రతినిధి సూచించిన వారికే ఇస్తున్నారు.

● జగ్గయ్యపేట నియోజకవర్గంలో పార్లమెంటు ప్రజా ప్రతినిధి వర్గం, స్థానిక ప్రజాప్రతినిధి వర్గం, టీడీపీ జిల్లా నాయకుడి వర్గంతో ఇక్కడి టీడీపీ పరిస్థితి మూడు ముక్కలాటగా మారింది. ఇక్కడ మార్కెట్‌ యార్డు పదవి కోసం ఈ మూడు వర్గాలు పట్టుబడుతున్నాయి. అంతే కాకుండా ఇక్కడ ఇసుక అక్రమ రవాణా కోసం పార్లమెంటు ప్రజాప్రతినిధి వర్గం, స్థానిక ప్రజాప్రతినిధి వర్గాల మధ్య పోరు నడుస్తోంది.

● మైలవరం నియోజకవర్గంలో పార్లమెంటు ప్రజాప్రతినిధి, స్థానిక ప్రజాప్రతినిధి ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. అయినప్పటికీ వారిద్దరి మధ్య అంతర్గతంగా తీవ్రస్థాయిలో వైరం నడుస్తోంది. స్థానికంగా ఇసుక, మట్టి, బూడిద వంటి సహజ వనరులు అధికంగా ఉన్నాయి. వీటి అక్రమ రవాణాలో తన వాటా కోసం పార్లమెంటు ప్రజాప్రతినిధి పట్టుబట్టాడు. దీంతో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య వైరం నెలకొంది.

● విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గాల్లో సైతం పార్లమెంటు ప్రజాప్రతినిధికి స్థానిక ప్రజాప్రతినిధులకు మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మొత్తంగా జిల్లా మీద పట్టు బిగించేందుకు ప్రయత్నం చేస్తున్న పార్లమెంటు ప్రజాప్రతినిధి ఈ మూడు నియోజక వర్గాల్లో సైతం గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. విజయవాడ నగర పాలక సంస్థ వ్యవహారాల్లో వేలు పెడుతూ ప్రతి పనిలో కమీషన్‌ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు పార్టీకి చెందిన సీనియర్‌ ప్రజాప్రతినిధులకు మింగుడు పడటంలేదు.

జిల్లాపై పెత్తనం కోసం పార్లమెంటు ప్రజాప్రతినిధి దందా ఎస్సీ నియోజకవర్గాల్లో నాయకులు జీ హుజూర్‌ అనాల్సిందే అక్రమ సంపాదన కోసం నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు ప్రతి నియోజకవర్గంలో పార్లమెంటు ప్రజాప్రతినిధికి ప్రత్యేక వర్గం ఈ వింత పోకడలపై మండిపడుతున్న సీనియర్‌ ప్రజాప్రతినిధులు

పెత్తనం నీదా.. నాదా.. సై1
1/1

పెత్తనం నీదా.. నాదా.. సై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement