Krishna District Latest News
-
పెత్తనం నీదా.. నాదా.. సై
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అందినకాడికి దోచుకో..అందినంతా దాచుకో అన్న చందంగా తయారైంది పార్లమెంటు ప్రజాప్రతినిధి తీరు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఔపోసన పట్టిన ఆ ప్రజాప్రతినిధి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అక్రమ సంపాదన కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు జిల్లా టీడీపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. పక్కా ప్రణాళిక ప్రకారం ముందుగా ఎస్సీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. ఈ నియోజకవర్గాల్లో తన వ్యూహం ఫలించడంతో మిగిలిన నియోజకవర్గాల్లోనూ వేలు పెట్టడం ప్రారంభించారు. సహజ వనరుల దోపిడీ నుంచి నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు, కార్పొరేషన్ రుణాల మంజూరు ఇలా ప్రతి అంశంలో తన హవా నే కొనసాగేలా ముందుకు సాగుతున్నారు. పార్టీ అధి ష్టానం సైతం పార్లమెంటు ప్రజాప్రతినిధికే ప్రాధాన్యం ఇస్తోంది. పార్టీ పెద్దలే అండగా నిలవడంతో ప్రతి నియోజకవర్గంలో తన వర్గాన్ని ప్రోత్సహిస్తూ జిల్లా టీడీపీలో అంతర్గత పోరుకు తెరలేపారు. ఈ క్రమంలో సీనియర్ ప్రజాప్రతినిధులంతా పార్లమెంటు ప్రజాప్రతినిధి తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎస్సీ నియోజకవర్గాల్లో పెత్తనం పార్లమెంటు ప్రజాప్రతినిధి తన అక్రమ సంపాదన కోసం ముందుగా జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గాలైన తిరువూరు, నందిగామపై దృష్టి సారించారు. తిరువూరు నియోజకవర్గంలో స్థానిక ప్రజాప్రతినిధిపై అధిష్టానానికి వ్యతిరేక భావన ఏర్పడేలా చేయడంలో విజయం సాధించారు. కనీసం స్థానికంగా జరిగే కార్యక్రమాలకు పార్టీ నాయకులు వెళ్లకుండా కట్టడి చేసి అక్కడి ప్రజాప్రతినిధిని ఏకాకిని చేశారు. ఈ నియోజకవర్గంలో మట్టి రవాణాతో పాటు మార్కెట్ యార్డు పదవులు, పార్టీ పదవులు, కార్పొరేషన్ రుణాలను సైతం తన వర్గానికి చెందిన వారికే వచ్చేలా చేయడంలో పార్లమెంటు ప్రజాప్రతినిధి విజయం సాధించారు. ● ఎస్సీ నియోజకవర్గమైన నందిగామలో సైతం పార్లమెంటు ప్రజాప్రతినిధి తన పెత్తనాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఎనిమిది ఇసుక రీచ్‌లలో సగానికిపైగా నడవకుండా నిలిపివేసిన పార్లమెంటు ప్రజాప్రతినిధి తన వర్గానికి చెందిన వ్యక్తులతో ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధి, పార్లమెంటు ప్రజాప్రతినిధి మధ్య వైరం నడుస్తోంది. అంతే కాకుండా నామినేటెడ్ పదవుల కేటాయింపులో కూడా రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. సబ్సిడీ రుణాలు సైతం పార్లమెంట్ ప్రజాప్రతినిధి సూచించిన వారికే ఇస్తున్నారు. ● జగ్గయ్యపేట నియోజకవర్గంలో పార్లమెంటు ప్రజా ప్రతినిధి వర్గం, స్థానిక ప్రజాప్రతినిధి వర్గం, టీడీపీ జిల్లా నాయకుడి వర్గంతో ఇక్కడి టీడీపీ పరిస్థితి మూడు ముక్కలాటగా మారింది. ఇక్కడ మార్కెట్ యార్డు పదవి కోసం ఈ మూడు వర్గాలు పట్టుబడుతున్నాయి. అంతే కాకుండా ఇక్కడ ఇసుక అక్రమ రవాణా కోసం పార్లమెంటు ప్రజాప్రతినిధి వర్గం, స్థానిక ప్రజాప్రతినిధి వర్గాల మధ్య పోరు నడుస్తోంది. ● మైలవరం నియోజకవర్గంలో పార్లమెంటు ప్రజాప్రతినిధి, స్థానిక ప్రజాప్రతినిధి ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. అయినప్పటికీ వారిద్దరి మధ్య అంతర్గతంగా తీవ్రస్థాయిలో వైరం నడుస్తోంది. స్థానికంగా ఇసుక, మట్టి, బూడిద వంటి సహజ వనరులు అధికంగా ఉన్నాయి. వీటి అక్రమ రవాణాలో తన వాటా కోసం పార్లమెంటు ప్రజాప్రతినిధి పట్టుబట్టాడు. దీంతో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య వైరం నెలకొంది. ● విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో సైతం పార్లమెంటు ప్రజాప్రతినిధికి స్థానిక ప్రజాప్రతినిధులకు మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మొత్తంగా జిల్లా మీద పట్టు బిగించేందుకు ప్రయత్నం చేస్తున్న పార్లమెంటు ప్రజాప్రతినిధి ఈ మూడు నియోజక వర్గాల్లో సైతం గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. విజయవాడ నగర పాలక సంస్థ వ్యవహారాల్లో వేలు పెడుతూ ప్రతి పనిలో కమీషన్ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు పార్టీకి చెందిన సీనియర్ ప్రజాప్రతినిధులకు మింగుడు పడటంలేదు. జిల్లాపై పెత్తనం కోసం పార్లమెంటు ప్రజాప్రతినిధి దందా ఎస్సీ నియోజకవర్గాల్లో నాయకులు జీ హుజూర్ అనాల్సిందే అక్రమ సంపాదన కోసం నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు ప్రతి నియోజకవర్గంలో పార్లమెంటు ప్రజాప్రతినిధికి ప్రత్యేక వర్గం ఈ వింత పోకడలపై మండిపడుతున్న సీనియర్ ప్రజాప్రతినిధులు -
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి కృష్ణాజిల్లాకు చెందిన భక్తులు రూ.లక్ష విరాళం సమర్పించారు. కంకిపాడుకు చెందిన పి.శ్రీనివాసరావు, సత్యవతి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు శనివారం ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళం అందజేసింది. ఆలయ అధికారులకు దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. తిరుపతమ్మ ఆలయానికి రూ.లక్ష విరాళం పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మవారి ఆలయానికి శనివారం కృష్ణాజిల్లా, ఉయ్యూరు మండలం, గండికుంట గ్రామానికి చెందిన కగ్గా సాంబయ్య దంపతులు రూ.లక్ష విరాళం సమర్పించారు. ఈ నగదును ఆలయ ఏఈఓ తిరుమలేశ్వరరావు చేతుల మీదుగా ఆందజేశారు. విరాళంలో రూ.50 వేలు నిత్యాన్నదాన పథకానికి, రూ.50 వేలు అంకమ్మవారి ఉపాలయం గోపురం వెండి తాపడానికి వినియోగించాలని కోరారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలను అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు. పాకిస్తానీయులు తక్షణం దేశం విడిచి వెళ్లాలి కోనేరుసెంటర్: జిల్లాలో పాకిస్తాన్ దేశానికి చెందిన వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఈనెల 27వ తేదీలోపు భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. లేనిపక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తులు వెంటనే తమ సమాచారం సంబంధిత పోలీస్స్టేషన్లకు తెలియజేసి, దేశం విడిచి వెళ్లిపోవడానికి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. లేని పక్షంలో చట్టాల ఉల్లంఘన ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమాజ శాంతి, భద్రత కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. డీఎస్సీ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలి కృష్ణలంక(విజయవాడతూర్పు): మెగా డీఎస్సీ నోటిఫికేషన్లో లోపాలు ఉన్నాయని, వాటిని తక్షణమే కూటమి ప్రభుత్వం పరిష్కరించి అభ్యర్థులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను డీఎస్సీకి దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇంటర్, డిగ్రీ, పీజీలో మార్కుల శాతంతో సంబంధం లేకుండా డీఎస్సీకి అనుమతి ఇవ్వాలని కోరారు. బీఈడీ, డైట్ చేసి టెట్ అర్హత సాధించిన వారు ఇప్పుడు ఎందుకు అనర్హులు అయ్యారో చెప్పాలని తెలిపారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వై.రాము, జి.రామన్న మాట్లాడుతూ సిలబస్ విస్తృతి రీత్యా అభ్యర్థులకు ప్రిపరేషన్‌కు 90 రోజులు సమయం ఇవ్వాలని చెప్పారు. డీఎస్సీ పరీక్షలు జరుగుతున్న సమయంలోనే ఏపీపీపీఎస్సీ పరీక్షలు, పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలు ఉన్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని డీఎస్సీ పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఒక జిల్లాకు ఒకే పేపర్ ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు.అనేక మందికి ఎడిట్ ఆప్షన్, సబ్జెక్టు చూపించడం లేదన్నారు. తక్షణమే పై సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. -
కూచిపూడి గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
చిలకలపూడి(మచిలీపట్నం): కూచిపూడి గ్రామాన్ని రాష్ట్ర వారసత్వ సంపద గల ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర నివేదికను వారంలోగా తయారుచేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కూచిపూడి నాట్య కళకు మూలకేంద్రమైన గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ గ్రామాభివృద్ధిలో సినీ తారలు, వ్యాపార దిగ్గజాలను భాగస్వామ్యం చేసి వారి ద్వారా నిధులను సమకూర్చే ప్రయత్నం చేయాల్సి ఉందన్నారు. కూచిపూడి వెళ్లే రహదారి మార్గంలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా గుంతలను పూడ్చివేయాలన్నారు. గ్రామాభివృద్ధి కోసం యునెస్కో వారికి ప్రతిపాదనలు పంపేందుకు డాక్యుమెంటేషన్ సిద్ధం చేయాలన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబరు నెలలో కూచిపూడి వార్షికోత్సవాలను యక్షగాన వసంతం పేరుతో వారం రోజుల పాటు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. సొసైటీని ఏర్పాటు చేసి కూచిపూడి అభివృద్ధి పనులు, వార్షికోత్సవాల నిర్వహణ జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ వ్యవస్థను పటిష్టంగా పనిచేసేందుకు కార్పస్ నిధులు సమకూర్చుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో రాష్ట్ర పర్యాటకశాఖ ప్రాంతీయ సంచాలకురాలు ప్రసన్నలక్ష్మి, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఉయ్యూరు ఆర్డీవో హేలషారోన్, జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, డీఆర్డీఏ పీడీ హరిహరనాఽథ్, డీపీవో జె.అరుణ, జిల్లా పర్యాటక అధికారి రామ్‌లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. వారసత్వ సంపద గల ప్రాంతంగా గుర్తింపు సినీ తారలు, వ్యాపార దిగ్గజాలను భాగస్వాములను చేస్తాం వారి ద్వారా నిధులు సమకూర్చేందుకు యత్నం వారం లోగా సమగ్ర నివేదికకు కలెక్టర్ ఆదేశాలు -
కానుగ కాయలతో జాతీయ జెండా
పెనమలూరు: కానుగ కాయలకు రంగు వేసి జాతీయ జెండాను రూపొందించాడు చిన్నారి లిషాన్. చిన్నారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకోవటానికి ప్రతిభ చాటాడు. తాడిగడప శివ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థి వినుకొండ లిషాన్కు నాలుగున్నర ఏళ్లు. పోరంకికి చెందిన శివప్రసాద్, శిరీష దంపతులు తమ కుమారుడి లిషాన్కు చిత్రకళపై మక్కువ ఉండటాన్ని గుర్తించి గిన్నీస్ బుక్ హోల్డర్, ప్రముఖ చిత్రకారుడు పామర్తి శివ వద్ద శిక్షణ ఇిప్పిస్తున్నారు. లిషాన్ ప్రపంచ రికార్డు ప్రయత్నంలో భాగంగా ఈ నెల 25వ తేదీన 1,211 కానుగ కాయలకు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు వేసి జాతీయ జెండాను రూపొందించాడు. కాయలకు నీలిరంగు వేసి అశోక చక్రాన్ని తీర్చిదిద్దాడు. కానుగ కాయలతో జాతీయ జెండా రూపకల్పనను ఐదు గంటల 11 నిమిషాల్లో పూర్తి చేశాడు. ఈ జెండా 40 అంగుళాల ఎత్తు, 55 అంగుళాల వెడల్పుతో ఉంది. ఈ మేరకు వివరాలను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు, అసిస్ట్ వరల్డ్ రికార్డు సంస్థలకు పంపామని చిత్రకారుడు పామర్తి శివ తెలిపారు. -
పూర్తిగా ధర పతనం
నేను ఎకరం విస్తీర్ణంలో మినుము సాగు చేశాను. దిగుబడి అందరికీ బాగానే వచ్చింది. నాకు మాత్రం 5 క్వింటాళ్లే వచ్చింది. మార్కెట్లో ధర పూర్తిగా తగ్గిపోయింది. ఆ రేటుకు అమ్మితే ఖర్చులు కూడా రావు. చేసేది లేక పంటను ఇంటిలో నిల్వ చేశా. మంచి ధర వస్తే అమ్ముదామని చూస్తున్నా. –బీహెచ్ రాజగోపాల్‌రెడ్డి, రైతు, ప్రొద్దుటూరు సిండికేట్ దోపిడీ వ్యాపారులు సిండికేట్ అయిపోయారు. గత సీజన్లో రూ.9200 ఉన్న ధర ఈ ఏడాది పడిపోవటానికి వారే కారణం. అదేమంటే బర్మా నుంచి మినుము దిగుమతి అవుతోందంటున్నారు. ఆర్ఎస్కేల్లో మినుము కొనుగోలు చేయాలి. –కొండవీటి సుబ్బారావు, రైతు, మంతెన● -
టెన్త్ టాపర్ బ్రదర్స్‌కు కలెక్టర్ ప్రశంస
చిలకలపూడి(మచిలీపట్నం): ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ఇరువురు అన్నదమ్ములను కలెక్టర్ డీకే బాలాజీ శనివారం తన చాంబర్లో అభినందించారు. ఉంగుటూరు మండలం మధిరపాడు గ్రామానికి చెందిన ఇందుపల్లి జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థులు దుబ్బాకుల దుర్గా యశ్వంత్ 591 మార్కులు, దుబ్బాకుల వీర వెంకటనాగేంద్ర 589 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారని వారిని అడగ్గా ఒకరు చార్టర్డ్ అకౌంటెంట్, మరొకరు ఇంజినీర్ అవుతామని తెలిపారు. ఉంగుటూరు మండలం మధిరపాడు గ్రామానికి చెందిన ఈ విద్యార్థుల తల్లిదండ్రులు దుబ్బాకుల నరసింహారావు, నాగదుర్గ వ్యవసాయ కూలీలు. అనంతరం కలెక్టర్ అన్నదమ్ములిద్దరికీ సొంత నిధులతో స్మార్ట్ వాచ్‌లను బహూకరించారు. కార్యక్రమంలో డీఈవో పీవీజే రామారావు, విద్యార్థుల తల్లిదండ్రు లు దుబ్బాకుల నరసింహారావు, నాగదుర్గ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీతారాం పాల్గొన్నారు. -
చెరువులో పడి చిన్నారి మృతి
గూడూరు: ప్రమాదవశాత్తూ చెరువులో పడి చిన్నారి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ఆకుమర్రు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కమ్మగంటి నవనీత్(5), అతని అన్న నిహాక్తో కలిసి శుక్రవారం సాయంత్రం గ్రామ శివార్లలోని బాపనకోనేరు చెరువు దగ్గర బహిర్భూమికి వెళ్లారు. ఆ క్రమంలో ప్రమాదవశాత్తూ నవనీత్ చెరువలో పడి మరణం చెందాడు. కళ్లెదుటే ఆటలాడుకుంటున్న తమ్ముడు నవనీత్ చెరువులో పడిపోవడంతో భయాందోళనకు గురైన నిహాక్ వెంటనే ఊరిలోకి వచ్చి కనపర్తి ఆశీర్వాదం అనే వ్యక్తికి విషయం చెప్పాడు. దీంతో ఆశీర్వాదం చెరువు దగ్గరకు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టేసరికే నవనీత్ నీటిలో పడి ఊపిరాడక విగతజీవిగా మారాడు. తల్లిదండ్రులు కమ్మగంటి రత్నకుమారి, శివనాగరాజులు కన్నీరు మున్నీరయ్యారు. దీనిపై శివనాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గూడూరు ఎస్ఐ కేఎన్వీ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆస్పత్రిలో బాలుడి మృతదేహాన్ని సందర్శించి సంతాపం వ్యక్తం చేశారు. చెరువును అక్రమంగా తవ్వడంతోనే తమ కుమారుడు చనిపోయాడని కమ్మగంటి శివనాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామ సర్పంచి బొల్లా కృష్ణకుమారితో పాటు గ్రామ నాయకుడు కారుమంచి కామేశ్వరరావులపై ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేశారు. -
అగమ్యగోచరంగా ఐసీఆర్పీలు
చల్లపల్లి: ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చేందుకు ఎవరికి వారు అప్పులు సమకూర్చుకోవాలని అధికారులు చిన్నపాటి ఉద్యోగులపై ఒత్తిళ్లు తెస్తుండటంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ(ఏపీసీఎన్ఎఫ్) విభాగంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఐసీఆర్పీల పరిస్థితి ఇది. పేరుకుపోయిన బకాయి వేతనాలు అందక అప్పుల్లో కూరుకుపోయిన తాము ఉన్నతాధికారులు నిర్ధేశించిన లక్ష్యాన్ని అధిగమించటానికి అప్పులు ఎక్కడ నుంచి తేవాలో తెలియక కకావికలమవుతున్నారు. జిల్లా స్థాయిలో సిబ్బంది నియామకం.. ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ(ఏపీఆర్వైఎస్ఎస్) ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం(ఏపీసీఎన్ఎఫ్)ను ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాల్లో ప్రాజెక్టు మేనేజరుతో పాటు క్షేత్రస్థాయి వరకూ సిబ్బందిని నియమించారు. కృష్ణా జిల్లాలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌తో పాటు ప్రతి డివిజన్(మూడు మండలాలు)కు ఒక మాస్టర్ ట్రైనర్(ఎంటీ) చొప్పున ఎనిమిది మంది, మండల స్థాయిలో మండల యాంకర్స్(ఎంఏ), ప్రాజెక్ట్ రిసోర్స్ పర్సన్(పీఆర్పీ)లు, మండల కమ్యూనిటీ రిసోర్స్‌పర్సన్స్(ఎంసీఆర్పీ)లు మొత్తం 13 మంది, మూడు నుంచి నాలుగు గ్రామాలకు కలిపి ఒక యూనిట్ ఇన్చార్జి చొప్పున 25 మంది, వీరి పర్యవేక్షణలో ప్రతి గ్రామైక్య సంఘానికి ఒక ఇంటర్నల్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్(ఐసీఆర్పీ) చొప్పున సుమారు 250 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. కిట్టు ఖరీదు రూ.1,350 రబీ సీజన్ ప్రారంభానికి ముందు రైతుల చేత 32 రకాలతో కూడిన ప్రీమూన్ డ్రై సోయింగ్(పీఎండీఎస్) నవధాన్యాలతో పచ్చిరొట్ట సాగుచేసేలా ఐసీఆర్పీలు పనిచేయాలని అధికారుల నంచి ఆదేశాలొచ్చాయి. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులతో పాటు రసాయనిక ఎరువులతో సేద్యం చేసే ప్రతి రైతు చేత ఒక్క ఎకరాలోనైనా ఈ సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్క ఎకరాకు పచ్చిరొట్టగా 13.5(ఒక కిట్టు) కిలోల నవధాన్యాలు అవసరమవుతాయి. ఒక్కొక్క కిట్టు తయారీకి సగటున రూ.1,350లు ఖర్చు అవుతుంది. నవధాన్యాలను సేకరించి సంచుల్లో నింపటం, కిట్లుగా కట్టడం, రైతులకు అందజేయటం వంటివన్నీ ఐసీఆర్పీలు చూడాలి. దీనికి అవసరమైన నిధులను సెల్ఫ్ హెల్ప్ గ్రూపు(ఎస్‌హెచ్‌జీ)లకు బ్యాంకుల నుంచి రుణం ఇప్పించి ఆ రుణంతో ఐసీఆర్పీల చేత కిట్లు తయారు చేయించి వాటిని రైతులకు అమ్మి, వచ్చిన డబ్బును డ్వాక్రా గ్రూపులకు కట్టుకోవాలని అధికారులు మార్గం చూపించారు. దాదాపు అన్ని ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు ఇప్పటికే లోన్లు ఉండటంతో కొత్త లోను తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావటంలేదు. ఐసీఆర్పీలే సొంత డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పేరుకుపోయిన వేతన బకాయిలు ఒక్కొక్క ఐసీఆర్పీకి పనిచేసే ప్రాంతాన్ని బట్టి నెలకు రూ.7,500 నుంచి రూ.14 వేల వరకూ వేతనాలు ఇస్తారు. బకాయిపడిన 24 నెలల వేతనాల్లో గత మార్చిలో 12 నెలల వేతనాలు మాత్రమే విడుదల చేశారు. ఇంకా 12 నెలల వేతన బకాయిలు అలాగే ఉన్నాయి. ఒక్కొక్క ఐసీఆర్పీ పరిధిలో సుమారు 50 నుంచి 70 మంది వరకూ రైతులు ఉండగా వారికి ఒక్కొక్క కిట్టు అందించాలంటే ఒక్కొక్క ఐసీఆర్పీ రూ.65 వేల నుంచి రూ.98 వేల వరకు పెట్టుబడి పెట్టాలి. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి పీఎండీఎస్ కిట్లు ఎలా ఏర్పాటుచేయాలో అర్థం కాక తలమునకలవుతున్నారు. కిట్లు టార్గెట్లు పూర్తిచేయకపోతే విధుల నుంచి తొలగిస్తామని అధికారులు చెప్పటం ఆందోళన కలిగిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.1,350 ఖర్చు పెట్టి పచ్చిరొట్ట వేసేందుకు రైతులు ముందుకు రావటంలేదు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రయోజనం లేదు. నవధాన్యాల కిట్లను వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై అందిస్తే కొంతమేర లక్ష్యాన్ని చేరుకునే వీలుంటుందని కిందిస్థాయి ఉద్యోగులు, ఐసీఆర్పీలు కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు, వ్యయప్రయాసలు ఎదుర్కొంటున్న తమకు ఈ కిట్ల టార్గెట్ల నుంచి విముక్తి కలిగించాలని, పెండింగ్‌లో ఉన్న తమ వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. అందని జీతాలు.. నవధాన్యాల కిట్ల లక్ష్యాలతో ఆందోళన అప్పుల్లో కూరుకుపోతున్న దుస్థితి అధికారుల వింత పోకడలతో బెంబేలు కిట్ల కొనుగోలుకు ఆసక్తి చూపని రైతులు ఎస్‌హెచ్‌జీ గ్రూపుల ద్వారా రుణాలు.. పీఎండీఎస్ కిట్ల తయారీకి అవసరమైన నిధులను సమకూర్చేందుకు ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు లోన్లు ఏర్పాటుచేస్తున్నాం. ఇప్పటికే వారికి లోన్లు ఉంటే అదనంగా మరలా లోన్లు ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. –పార్థసారథి, జిల్లా ప్రాజెక్టు మేనేజర్, ఏపీసీఎన్ఎఫ్ -
బైక్‌లు చోరీ చేస్తూ.. గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
విజయవాడస్పోర్ట్స్: దొంగిలించిన బైక్‌లను విక్రయించగా వచ్చిన డబ్బులతో గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తున్న ముఠాను సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 9.5 కేజీల గంజాయి, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను టాస్క్‌ఫోర్స్ కార్యాలయం వద్ద టాస్క్‌ఫోర్స్ ఏసీపీ లతాకుమారి వివరించారు. గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు అంశాలపై పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరుగుతున్న పాత నేరస్తులపై దృష్టి సారించామని చెప్పారు. ఈ క్రమంలో మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గులాబీతోటతో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఎ.మనోజ్పార్ధు(గులాబీతోట), షేక్ అలీబాబా(పెనమలూరు)లను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. నిందితులిద్దరూ జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనం, గంజాయి విక్రయానికి పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో పార్క్ చేసిన బైక్‌లను దొంగిలించడం, ఆ వాహనాలపై ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలకు వెళ్లి, అక్కడ వాహనాలను విక్రయించగా వచ్చిన సొమ్ముతో గంజాయిని కొనుగోలు చేసి విజయవాడకు తీసుకువస్తారని తెలిపారు. ఇదే గంజాయిని స్థానిక యువతకు విక్రయిస్తూ సొమ్ము చేసుకోవడాన్ని నిందితులిద్దరూ వృత్తిగా చేసుకుని జీవిస్తున్నట్లు చెప్పారు. ఈ ముఠా సభ్యులు ఐదుగురు ఉన్నారని, వీరంతా సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారన్నారు. ఈ ముఠాలోని ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితుల నుంచి రూ.60 వేల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ సీఐలు శ్రీధర్, రవికుమార్ పాల్గొన్నారు. -
వారంలో పెళ్లి.. విద్యుదాఘాతంతో యువకుడి మృతి
తాళ్లూరు(వత్సవాయి): పది రోజుల్లో వివాహం చేసుకుని సంతోషంగా జీవితాన్ని గడపాల్సిన యువకుడు విద్యుదాఘాతంతో మరణించిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల మేరకు గ్రామానికి చెందిన కంచర్ల వెంకటేశ్వర్లు, భూలక్ష్మి దంపతుల కుమారుడు జితేంద్ర(25). అతను ఆటోలో ఉల్లిగడ్డల వ్యాపారం చేస్తుండేవాడు. జితేంద్రకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. వారం రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి కార్యక్రమాల ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. గురువారం రాత్రి సమయంలో ఇంట్లో ఉన్న కూలర్లో నీళ్లు పోస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి ఒక్కసారిగా కరెంట్ షాకు కొట్టడంతో అపస్మాకరకస్థితిలోకి వెళ్లాడు. కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పదిరోజుల్లో వివాహం చేసుకుని ఘనంగా ఊరేగింపు చేసుకోవాల్సిన తరుణంలో ఇలా అంతిమయాత్ర చేసుకోవాల్సి వచ్చిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఘటనపై తల్లి భూలక్ష్మి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ పి.ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించి కుటుంబసభ్యులకు అందజేశారు. -
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చైత్రమాసం.. పెద్ద ఎత్తున జరుగుతున్న వివాహాలు, వేసవి సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి దుర్గామల్లేశ్వరస్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే దుర్గామల్లేశ్వరస్వామివార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. అంతరాలయంలో ప్రధాన మూలవిరాట్ వద్ద ఖడ్గమాలార్చన, ఆలయ ప్రాంగణంలో జరిగిన లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమం, శాంతి కల్యాణం, నవగ్రహ హోమం, గణపతి హోమాల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం నుంచే భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. రూ. 300 టికెట్‌పై ముఖ మండప దర్శనాన్ని కల్పించిన ఆలయ అధికారులు, రూ. 100, సర్వ దర్శనం క్యూలైన్లలో భక్తులు ముందుకు కదిలేలా చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం మహా నివేదన అనంతరం భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఎండల నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి ప్రాంగణం, మైక్ అనౌన్స్ పాయింట్ వద్ద దేవస్థానం భక్తులకు మజ్జిగను పంపిణీ చేసింది. సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ, పల్లకీ సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. వేసవి సెలవులు నేపథ్యంలో పెరిగిన సందడి అంతరాలయ దర్శనాలు రద్దు -
ఉసురు తీసిన అక్రమ తవ్వకాలు!
కోనేరుసెంటర్: అక్రమ మట్టి తవ్వకాలు ఓ మైనర్ ఉసురు తీశాయి. ఘటన బందరు మండలం పొట్లపాలెం గ్రామ సమీపంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బందరు మండలం బుద్దాలపాలెం గ్రామానికి చెందిన కొక్కు మణికంఠ (15) పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. అతని తల్లిదండ్రులు కొండలరావు, జలజకుమారి వ్యవసాయ పనులు చేస్తుంటారు. వీరికి ఒక పాప కూడా ఉంది. ఇదిలా ఉండగా పదో తరగతి పాస్ అయిన మణికంఠ మట్టి ట్రాక్టర్‌పై పనికి వెళ్తున్నాడు. శుక్రవారం ట్రాక్టర్‌పై బుద్దాలపాలెం నుంచి కొత్తపూడి వెళ్లి మట్టిని డంప్ చేసిన అనంతరం తిరిగి మట్టి దిబ్బల వద్దకు ట్రాక్టర్‌పై బయలుదేరారు. పొట్లపాలెం – బుద్దాలపాలెం మార్గంమధ్యలో రోడ్డుపై ఉన్న గోతిలోకి ట్రాక్టర్ ఒరగటంతో డ్రైవర్ పక్కన కూర్చున్న మణికంఠ ఒక్కసారిగా కిందికి పడిపోయాడు. ఘటనలో ట్రాక్టర్ ట్రక్కు టైరు మణికంఠ తలపై నుంచి వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు ఘటనాస్థలానికి చేరుకుని రోడ్డుపై విగతజీవిగా పడి ఉన్న మణికంఠను చూసి విలపించారు. అతన్ని అంబులెన్స్‌లో మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. మణికంఠ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఘటనపై తల్లి జలజకుమారి బందరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. పిలిచి చంపేశారయ్యా: పదో తరగతి పాసైన ఆనందం మా బిడ్డకు ఎన్నో రోజులు లేకుండానే దేవుడు దక్కరకు వెళ్లిపోయాడయ్యా అంటూ తల్లిదండ్రులు పెడుతున్న ఆర్తనాదాలు చూపరులను సైతం కంటతడిపెట్టించింది. ఇంట్లో ఆడుకుంటున్న తన బిడ్డను ట్రాక్టర్ పనికి రమ్మంటూ పిలుచుకెళ్లి మరీ చంపేశారంటూ బోరున విలపించారు. మద్యం మత్తులో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందంటూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్లో తిష్టవేసి ఇదిలా ఉండగా మైనర్ బాలుడు చనిపోయి అంత్యక్రియలైనా జరగకుండానే జనసేన నాయకులు ఈ కేసును నీరుగార్చడానికి బందరు రూరల్ పీఎస్‌లో తిష్టవేసి పోలీసులకు నయానో భయానో నచ్చజెప్పుకుని అక్రమంగా మట్టిని అమ్ముకుంటున్న గ్రామంలోని టీడీపీ నాయకుడిని బయటపడేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ కాగితాలు ఫోర్సులో లేకపోవటానికి తోడు డ్రైవర్‌కు లైసెన్స్ కూడా ఉండకపోవటం గమనార్హం. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసులో ఏ విధంగా వ్యవహరిస్తారన్నది వేచి చూడాల్సిందే మరి. ఈ పాపం ఎవరిదీ ! కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మండలంలో మట్టి మాఫియా ఆగడాలు అధికమయ్యాయి. మండలంలో అక్రమంగా మట్టి తోలకాలు జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో మట్టి మాఫియా మరింత రెచ్చిపోతోంది. ఇదిలా ఉండగా బుద్దాలపాలెంలో జరిగిన ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ మృతుని తరఫు బంధువులు ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్న కూటమి నాయకులదా...? పట్టించుకోని రెవిన్యూ అధికారులదా...? లేక అధికార దర్పంతో మండలంలో మట్టిని అమ్ముకుని లక్షలు పోగుచేసుకుంటున్న ప్రజాప్రతినిధులదా అంటూ నిలదీస్తున్నారు. ట్రాక్టర్ కింద పడి బాలుడి మృతి ఇంట్లో ఉన్న పిల్లాడిని పిలిచి చంపేశారంటూ తల్లి ఆవేదన కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్న జనసేన నేతలు టీడీపీ నేత మట్టి అక్రమ తరలింపు కారణంగానే ఘటన! -
15 మంది పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు
ఆంధ్రా ఆస్పత్రి పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ రామారావులబ్బీపేట(విజయవాడతూర్పు): పుట్టుకతోనే అత్యంత క్లిష్టతరమైన గుండె సమస్యలు ఉన్న 15 మంది చిన్నారులకు విజయవాడ ఆంధ్రా హాస్పటల్లో ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించారు. హీలింగ్ లిటిల్‌హార్ట్స్, యూకే చారిటీ సౌజన్యంతె ఈ నెల 21 నుంచి 34వ ఉచిత హార్ట్ సర్జరీస్ క్యాంపు నిర్వహించినట్లు ఆస్పత్రి పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ వెంకట రామారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సర్జరీల వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ బెంగుళూరుకు చెందిన పిడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ జగన్నాథ్‌తో పాటు, ఉషశెట్టి, అశ్విని కుమారస్వామిలతో పాటు, ఆంధ్రా హాస్పటల్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ నాగేశ్వరరావుల బృందం సర్జరీలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి నెలా 50 నుంచి 60 మంది పిల్లలకు గుండె సర్జరీలు చేస్తూ, ఇప్పటి వరకూ ఆస్పత్రిలో 4,500 మందికి చిన్నారులకు గుండె సర్జరీలు చేసినట్లు తెలిపారు. ఆంధ్రా మదర్ అండ్చైల్డ్ ఫౌండేషన్, మహేష్‌బాబు ఫౌండేషన్ సహకారం కూడా ఉన్నట్లు చెప్పారు. సమావేశంలో శస్త్ర చికిత్సలు చేసిన వైద్యులు, పిడ్రియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కె.విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. -
దోమ కాటుతో వ్యాపించే వ్యాధులపై అప్రమత్తం
భవానీపురం(విజయవాడపశ్చిమ): దోమ కాటుతో వ్యాపించే మలేరియా, ఫైలేరియా, డెంగూ, చికెన్‌గున్యా, మెదడువాపు వంటి వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ పద్మావతి పేర్కొన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం, ఫ్రైడే డ్రై డే పురస్కరించుకుని శుక్రవారం గొల్లపూడి సచివాలయం–2లో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటిని మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. మెడికల్ అండ్ హెల్త్ జాయింట్ డైరెక్టర్ మల్లీశ్వరి, జిల్లా మలేరియా అధికారి మోతీబాబు మాట్లాడుతూ ఈ ఏడాది మలేరియా దినోత్సవ నినాదం ‘వనరుల చేకూర్పు, మరలా కొత్తగా ఆలోచించు, మళ్లీ ఉత్తేజం పొందు’ స్ఫూర్తితో వైద్య ఆరోగ్య సిబ్బంది పని చేయాలన్నారు. కొండపల్లి పీహెచ్సీ డాక్టర్ పద్మావతి అధ్యక్షతన జరిగిన సదస్సులో డెప్యూటీ డైరెక్టర్ రామనాథం, రూరల్ ఇన్చార్జ్ ఎంపీడీఓ మురళీకృష్ణ, స్టేట్ ఎంటమాలజిస్ట్ కొండారెడ్డి, బయాలజిస్ట్ సూర్య, సబ్ యూనిట్ ఆఫీసర్ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలేరియా వ్యాధులపై అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ పద్మావతి -
సంగీతంలో నిస్వార్థ సేవకే గిన్నిస్ రికార్డ్
పటమట(విజయవాడతూర్పు): వాయిద్యకారులను అనేక మందిని తయారు చేయాలనే లక్ష్యంతో హల్లెల్ మ్యూజిక్ స్కూల్‌ను ప్రారంభించినట్లు ఎషువ బెత్ హాలెల్ మినిస్ట్రీస్ ఫౌండర్ దండింగి అగస్టిన్ తెలిపారు. క్రీస్తు సంగీతంలో నిస్వార్థ సేవ చేసినందుకుఏ గిన్నిస్ రికార్డు వచ్చిందన్నారు. శుక్రవారం విజయవాడ ఏలూరు రోడ్‌లోని గుణదల మెట్రోపాలిటన్ చర్చిలో సంగీతంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన సందర్భంగా సంగీతంలో ప్రావీణ్యం సాధించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందించారు. అనంతరం దండింగి అగస్టిన్ మాట్లాడుతూ దాదాపు 18 దేశాల్లో ఉన్న 7,500 మంది విద్యార్థులకు ఉచితంగా సంగీత విద్యను నేర్పించామన్నారు. ఏడేళ్ల నుంచి 80 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ఎవరైనా నేర్చుకోవచ్చని తెలిపారు. ఈ కోర్స్ పూర్తిగా ఉచితమని, ఎటువంటి ఫీజు లేదన్నారు. గిన్నిస్ రికార్డు కోసం రెండేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నామని, మూడో యత్నంగా వచ్చిందన్నారు. తన సేవలను గుర్తించి ఇంజినియస్ చాం వరల్డ్ రికార్డు గోల్డెన్ ఐకానిక్ అవార్డును తనకు ప్రత్యేకంగా ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో అగస్టిన్ కుటుంబ సభ్యులతో పాటు హాలెల్ మ్యూజిక్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎషువ బెత్ హాలెల్ మినిస్ట్రీస్ ఫౌండర్ అగస్టిన్ -
కూలీలపై దూసుకెళ్లిన కారు
జగ్గయ్యపేట అర్బన్: చెరువుబజారులో కొత్త రైతుబజారు వద్ద ఉన్న భవన నిర్మాణ కార్మికుల అడ్డాలో పనులు కోసం వేచిచూస్తున్న పలువురు కూలీలపైకి వేగంగా వస్తున్న కారు ఢీకొంది. దీంతో ఓర్సు రామకృష్ణ, తాళ్లూరి వాసు, బండి నాగరాజు, కుంచపు నాగరాజు, బత్తుల వెంకట గురువులు అనే ఐదుగురు కూలీలు గాయపడ్డారు. కారు వారిని ఢీకొన్న తర్వాత ఇనుప పోల్‌కు తగిలి ఆగిపోయింది. గాయపడిన వారిని స్థానికుల సాయంతో ప్రథమ చికిత్స కోసం జగ్గయ్యపేట పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్ వెంకటేశ్వర్లు కూడా చెరువు బజారు వాసే. కిరాయికి కారు నడుపుతుంటాడు. అతను ఆ సమయంలో పూటుగా మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం వారిని డిశ్చార్జ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) వారిని పరామర్శించారు. ప్రమాద సంఘటనపై పోలీసులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. పట్టణ ఎస్ఐ–2 వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురికి గాయాలు -
కృష్ణాజిల్లా
శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025మర్యాదపూర్వకంగా.. చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపిని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. నిత్యాన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ నిత్యాన్నదానానికి గుంటూరుకు చెందిన ఎం.శశితేజ కుటుంబం రూ. 1,01,116 విరాళాన్ని అందజేసింది. ‘శక్తి’ యాప్‌పై అవగాహన విజయవాడస్పోర్ట్స్: మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ కె.లతాకుమారి పర్యవేక్షణలో శక్తి టీం ఆంధ్రా లయోల, ఎస్ఆర్ఆర్ కాలేజీల్లో విద్యా ర్థినులకు శక్తి యాప్‌పై అవగాహన కల్పించారు.● గుణదలకు చెందిన వినయ్(పేరు మార్చాం) 9వ తరగతి చదువుతున్నాడు. ఊబకాయం కారణంగా యాక్టివ్‌గా ఉండకపోవడంతో పాటు ఇటీవల నీరసంతో పడిపోయాడు. వైద్యులు పరీక్షించగా మధుమేహం స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. ● భవానీపురానికి చెందిన 10వ తరగతి విద్యార్థి రాకేష్(పేరుమార్చాం) చిన్నప్పుడు బాగానే ఉన్నా, నాలుగేళ్లుగా ఫాస్ట్ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడంతో ఒకేసారి బరువు పెరిగాడు. దీంతో క్రీడల్లో పాల్గొనేందుకు అవకాశం లేక పోవడంతో మానసికంగా కుంగుబాటుకు గురై చదువులో కూడా రాణించలేక పోతున్నాడు. ఇలా వీరిద్దరే కాదు అనేక మంది పిల్లలు ఒబెసిటీ కారణంగా శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒకప్పుడు పిల్లలు బొద్దుగా ఉంటే ముద్దుగా ఉన్నాడని అనేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. బొద్దు ముద్దు కాదంటున్నారు. అలాంటి వారిలో చలాకీతనం లేక పోవడంతో పాటు, చిన్న వయస్సులోనే అనేక మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వయసుకు తగిన బరువు ఉంటే చాలని, అధిక బరువు అనర్థాలకు దారి తీస్తోందంటున్నారు. ప్రస్తుతం ప్రతి వంద మంది పిల్లల్లో 18 మంది అధిక బరువుతో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. సెలవులను సద్వినియోగం చేసుకోవాలి.. పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చేశారు. పిల్లలు ఇంటి వద్దే ఉంటూ స్మార్ట్ఫోన్లు, టీవీల్లో తమకిష్టమైన చానల్స్ చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలా నిశ్చల జీవనశైలికి అలవాటు పడటం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. ఇప్పటికే ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటితో ఒబెసిటీ పిల్లలు ఎక్కువయ్యారు. ఒబెసిటీని అధిగమించేందుకు ఈ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. అవుట్డోర్, ఇన్డోర్ క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, తాజా సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా ఒబెసిటీని తగ్గించుకోవచ్చునంటున్నారు. 9న్యూస్రీల్పిల్లలూ ఇలా చేయండి..ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి.. డయాబెటిస్ వచ్చే ప్రమాదం.. వేసవి సెలవులు 50 రోజులకు పైగానే ఇచ్చారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో క్రీడలు ఆడండి. అవసరమైతే సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో చేరండి. స్విమ్మింగ్ చేయడం ఎంతో మంచిది. సైకిల్‌ను ఇష్టంగా ప్రతిరోజూ తొక్కండి. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండండి. సెల్‌ఫోన్, టీవీ చూస్తూ భోజనం చేసే వారు తగిన మోతాదు కంటే ఎక్కువ తినేస్తారు. ఆ అలవాటు మానుకోవాలి. సెల్‌ఫోన్, టీవీ చూసే టైమ్ తగ్గించాలి. పిల్లల్లో ఒబెసిటీతో మానసిక, ఆరోగ్య సమస్యలు డిప్రెషన్‌తో చదువులోనూ రాణించలేకపోతున్న వైనం వేసవి సెలవుల్లో వ్యాయామంపై దృష్టి పెట్టాలంటున్న వైద్యులు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచన ఒబెసిటీతో ఉన్న పిల్లలు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. వేసవిలో క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ, జంక్‌ఫుడ్స్‌కు దూరంగా ఉండటం ద్వారా స్లిమ్‌గా మారవచ్చు. వేసవిలో దొరికే మామిడి లాంటి సీజనల్ ఫ్రూట్స్‌తో పాటు, ఇంట్లో తయారు చేసిన ఆహారం తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లోనే అవుట్డోర్ క్రీడలు ఆడాలి. ఎండలో ఆడితే డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. – గర్రే హరిత, న్యూట్రీషియన్ ఒబెసిటీ ఉన్న పిల్లల్లో టైప్–2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. కొందరిలో సుగర్ లెవల్స్ అదుపులో ఉండవు. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ కారణంగా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వారంలో రెండు, మూడు సార్లు జంక్‌ఫుడ్, బయట ఆహారం తీసుకోవడం, సెకండరీ లైఫ్‌తో ఊబకాయులుగా మారుతున్నారు. తల్లిదండ్రులు వారిని గుర్తించి.. వాకింగ్, వ్యాయామం వంటివి చేయిస్తే మంచిది. అందుకు వేసవి సెలవులను వినియోగించుకోవాలి. – డాక్టర్ ఎం. సునీత, మధుమేహ నిపుణురాలు -
ప్రధానమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులకు పునర్ శంకుస్థాపన చేసేందుకు మే రెండో తేదీన విచ్చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు తెలిపారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో కమిషనరేట్‌లో పోలీసు అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రధానితోపాటు వీవీఐపీలు, వీఐపీలు పాల్గొంటున్న దృష్ట్యా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రాంతాల్లో శాంతి భద్రతలు, ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తుకు కావల్సిన ఏర్పాట్లపై ఈ సమీక్షలో చర్చించారు. డీసీపీలు కె.జి.వి.సరిత, తిరుమలేశ్వరరెడ్డి, ఎ.బి.టి.ఎస్.ఉదయారాణి, కృష్ణమూర్తినాయుడు, ఎస్.వి.డి.ప్రసాద్, ఏడీసీపీలు జి.రామకృష్ణ, ఎ.వి.ఎల్.ప్రసన్నకుమార్, ఏం.రాజారావు, కె.కోటేశ్వరరావు, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యంమచిలీపట్నంఅర్బన్: పరిసరాల పరిశుభ్రతే ప్రజారోగ్యానికి తొలిమెట్టని కృష్ణా జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్. శర్మిష్ట అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మురుగునీటి నిల్వలున్న ప్రాంతాల్లో దోమల లార్వా వృద్ధి చెందుతుందన్నారు. గతంతో పోలిస్తే మలేరియా కేసులు ఏటేటా తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొన్నారు. దోమ తెరలు వాడాలని, ఇంటి పరిసరాల్లో దోమల నియంత్రణ మందులు పిచికారీ చేయించాలన్నారు. పరిసరాల్లో కొబ్బరి బోండాలు, రోళ్లు, పాతటైర్లు వంటివి లేకుండా చూసుకోవాలని సూచించారు. జిల్లా మలేరియా అధికారి బి. రామారావు మాట్లాడుతూ గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు స్వచ్ఛత, వ్యక్తిగత రక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.బంగారు తాపడం పనులకు రూ. 5 లక్షల విరాళంఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయ బంగారు తాపడం పనులకు హైదరాబాద్‌కు చెందిన భక్తుడు శుక్రవారం రూ.5 లక్షల విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన టి. శ్రీనివాస్ సంపత్ శుక్రవారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశా రు. ఆలయ అధికారిని కలిసి రూ. 5 లక్షల విరాళాన్ని ఆలయ బంగారు తాపడం పనుల నిమిత్తం అందజేశారు. అనంతరం దాతకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.రిజిస్ట్రేషన్ సేవలు సులభతరంగాంధీనగర్(విజయవాడసెంట్రల్): రిజిస్ట్రేషన్ సేవలు సులభతరం చేయడంతోపాటు ప్రజల సమయం ఆదా చేసేందుకు రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తేచ్చినట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ ఏ రవీంద్రనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యూర్ కోడ్ స్కాన్ చేసి సులభంగా స్లాట్ బుక్ చేసుకునే వీలు కల్పించామన్నారు. ఈ నెల 4నుంచే విజయవాడ రీజియన్‌లోని గాంధీనగర్, మచిలీపట్నం రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి తెచ్చామన్నారు. శనివారం నుంచి కృష్ణా జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్, ఎన్టీఆర్ జిల్లాలోని 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు ఉపయోగించుకొని సమయాన్ని ఆదా చేసుకోవాలని కోరారు. -
కొవ్వొత్తులతో ముస్లింల శాంతి ర్యాలీ
చల్లపల్లి: కశ్మీర్లో ఉగ్రవాదుల దాడికి నిరసనగా ముస్లిం మైనార్టీ నాయకులు శనివారం సాయంత్రం శాంతి ర్యాలీ నిర్వహించారు. చల్లపల్లి–మచిలీపట్నం రహదారిలోని పెద్ద మసీదు వద్ద ప్రారంభమైన ర్యాలీ ప్రధాన సెంటర్ నుంచి వైశ్యబజార్ మీదుగా సాగింది. కొవ్వొత్తులు వెలిగించి చనిపోయినవారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థించారు. కులమతాల భేదాలు వద్దు.. ఐకమత్యమే ముద్దు, హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి.. అంటూ నినాదాలు చేశారు. దాడికి పాల్పడిన ఉగ్రమూకలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో ముస్లిం మత గురువు ఇమామ్, పెద్ద మసీదు కమిటీ అధ్యక్షుడు నసీం ఘోరి, గౌసియా మసీదు అధ్యక్షుడు షేక్ అబూ షరీఫ్, చల్లపల్లి, నారాయణరావునగర్‌కు చెందిన ముస్లిం పెద్దలు, యువత, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
సార్వత్రిక విద్య మిథ్య!
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విద్యలవాడగా పేరుగాంచిన జిల్లాలో ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఫలితాలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. అధికారుల తీరు, కోఆర్డినేటర్ల నిర్లక్ష్యంతో జిల్లా ప్రతిష్టను దిగజార్చటమే కాకుండా అభ్యర్థుల భవితతో ఆటలాడుతున్నారంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మార్చి మాసంలో సాధారణ ఎస్ఎస్సీ పరీక్షలు, ఇంటర్మీడియెట్ పరీక్షలతో పాటుగా ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఓపెన్ స్కూల్లో అభ్యసించే పది, ఇంటర్ అభ్యర్థులకు సైతం పరీక్షలను ఏకకాలంలో నిర్వహించింది. సాధారణ పదో తరగతి పరీక్ష ఫలితాలతో పాటుగా ఓపెన్ స్కూల్ ఫలితాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఫలితాల్లో రాష్ట్రంలో 26 జిల్లాల్లోనూ 24, 25 స్థానాల్లో ఎన్టీఆర్ జిల్లా ఉండటం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. అందని పాఠ్య పుస్తకాలు.. సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియెట్ కోర్సులకు సంబంధించి ఏటా ఆ సంస్థ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది. ఫీజు చెల్లించిన వారికి పుస్తకాలను సకాలంలో పంపిణీ చేస్తుంది. కానీ ఈ ఏడాది సకాలంలో పుస్తకాలు అందలేదని ఆయా కోర్సులకు ఫీజులు చెల్లించిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీనిపై పత్రికల్లోనూ వార్తలు వచ్చాయి. వాటికి సంబంధించి కోఆర్డినేటర్లు సైతం పలు కారణాలను చెబుతూ తమను తప్పుదోవ పట్టించారని పలువురు ఫీజు చెల్లించిన అభ్యర్థులు వాపోతున్నారు. సకాలంలో పుస్తకాలు అందకపోవటం వల్లే చాలా మంది అరకొర చదువులతో పరీక్షలకు హాజరయ్యారని, అందుకే ఈ తరహా ఫలితాలు వచ్చాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు ఏపీ సార్వత్రిక విద్యాపీఠం అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు ఈ ఏడాది పూర్తిగా పర్యవేక్షణను వదిలేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దాంతో అడ్మిషన్ల సంఖ్య భారీగానే పడిపోయిందని, అలాగే ఫలితాలు సైతం దిగజారిపోయాయంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. విద్యాపీఠం షెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సిన విధులను సైతం నిర్వహించలేదని దానిని రాష్ట్ర స్థాయి అధికారులు సైతం పర్యవేక్షించలేదని కోఆర్డినేటర్లు చెబుతున్నారు. వేలాది రూపాయలు దండుకున్నారు! తమ నుంచి వేలాది రూపాయలు దండుకున్నారని, తీరా పరీక్ష ఫలితాల్లో తమకు అన్యాయం చేశారంటూ పలువురు అభ్యర్థులు కోఆర్డినేటర్లను ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా ఓపెన్ స్కూల్ కోర్సులను నిర్వహించే సంస్థలు విద్యార్థులకు పలు మాయ మాటలు చెప్పి వారి నుంచి వేలాది రూపాయాలు దండుకున్నారని ప్రచారం జరిగింది. ‘మిమ్మల్ని పాస్ చేయిస్తాం, మీరు చూసి రాసుకోవచ్చు’ అంటూ పలు రకాలుగా వారిని మభ్యపెట్టి భారీ వసూళ్లకు పాల్పడిన విషయాలపై పెద్ద స్థాయిలో విమర్శలు సైతం వచ్చిన విషయం తెలిసిందే. తీరా పరీక్షలు సాధారణ షెడ్యూల్లో పెట్టడం, గట్టిగా నిఘా ఉంచటం, ఎక్కడా మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా చేయటంతో ఫలితాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఫలితం.. సు‘దూరం’ ఇదీ ఎన్టీఆర్ జిల్లాలో పరిస్థితి: కానరాని తరగతుల జాడ.. దూరవిద్యలో దారుణ ఫలితాలు ఓపెన్ స్కూల్ ఫలితాల్లో భారీగా పడిపోయిన ఉత్తీర్ణత ‘పది’లో 25వ స్థానం, ఇంటర్లో 24వ స్థానానికి పరిమితమైన జిల్లా సకాలంలో అందని పాఠ్య పుస్తకాలు, జరగని తరగతులు ఓపెన్ స్కూల్ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు ఫీజు చెల్లించిన అభ్యర్థులకు ఆయా స్టడీ సెంటర్ల ద్వారా కోఆర్డినేటర్లు తరగతులను నిర్వహించాల్సి ఉన్నా.. అలా జరగలేదు. సార్వత్రిక విద్యాపీఠం జిల్లా అధికారులు ఎక్కడా సరైన పర్యవేక్షణ కానీ పరిశీలన కానీ చేసిన దాఖలాలు లేవని పలువురు అభ్యర్థులు విమర్శిస్తున్నారు. అందువల్లే కోఆర్డినేటర్లు తరగతులు నిర్వహించకుండానే తమ నుంచి వేలాది రూపాయలు దండుకొని రోడ్డుపైన వదిలేశారంటూ వాపోతున్నారు. ఓపెన్ స్కూల్ పరీక్ష ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి పదో తరగతికి 4.34 శాతం, ఇంటర్మీడియెట్‌లో 20.61 శాతం ఫలితాలు వచ్చాయి. ‘పది’లో రాష్ట్రంలోనే 25వ స్థానంలో నిలువగా, ఇంటర్మీడియెట్ ఫలితాల్లో 24వ స్థానంలో నిలిచింది. పదో తరగతి పరీక్షలకు 1,499 మంది హజరయ్యారు. అందులో వారిలో 785 మంది బాలురు, 714 బాలికలు ఉన్నారు. అందులో కేవలం 65 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో 26 మంది బాలురు, 39 మంది బాలికలు ఉన్నారు. ఇంటర్మీడియెట్ కోర్సుకు సంబంధించి 2,751 మంది విద్యార్థులు పరీక్షకు హజరయ్యారు. వారిలో 1715 మంది బాలురు, 1036 మంది బాలికలు ఉన్నారు. అందులో 567 మంది ఉత్తీర్ణులయ్యారు. వారిలో 301 మంది బాలురు, 266 మంది బాలికలు ఉన్నారు. -
కృష్ణా వర్సిటీకి ఉన్నత విద్యా అవార్డు
రుద్రవరం (మచిలీపట్నం రూరల్): కృష్ణా వర్సిటీ ప్రతిష్టాత్మక ఇండియా ఉన్నత విద్యా అవార్డ్ సాధించిందని విశ్వవిద్యాలయం రెక్టార్ ఆచార్య ఎంవీ బసవేశ్వరరావు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పనితీరు ఆధారంగా కృష్ణా వర్సిటీ మూడో స్థానంలో నిలిచిందన్నారు. ఎడ్యుకేషన్ వరల్డ్ ఆధ్వర్యంలో శుక్రవారం న్యూఢిల్లీలోని హోటల్ గ్రాండ్లో నిర్వహించిన కార్యక్రమంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సభ్యుడు జతీన్ పరాంజపే చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు బసవేశ్వరరావు తెలిపారు. తొలుత శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం సాధిస్తున్న విజయాలు, పొందుతున్న ఫలితాలపై బసవేశ్వరరావు ప్రసంగించారు. 30న జాబ్‌మేళా చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పనశాఖ ఆధ్వర్యాన ఈ నెల 30న ఉయ్యూరులో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ఉయ్యూరులోని ఏజీ, ఎస్జీ సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా జరుగుతుందని పేర్కొన్నారు. పలు కంపెనీల్లో ఉద్యోగాలకు 10వ తరగతి నుంచి పీజీ చదివిన 18 నుంచి 30 సంవత్సరాల్లోపు యువత అర్హులని వివరించారు. ఎంపికై న వారికి ఆకర్షణీయ వేతనంతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగావకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 96187 13243, 88851 59008లో సంప్రదించాలని సూచించారు. -
తక్కువ ధరకు ధాన్యం అమ్మొద్దు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రబీలో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధర కంటే తక్కువకు అమ్మొద్దని మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం గాంధీనగర్‌లోని రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకుని నష్టపోతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. మిల్లర్లు తక్కువ ధరకు కొంటున్నారని వస్తున్న వార్తలను ఖండించారు. తేమ శాతం ఎక్కువగా ఉందని, ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు లేని ధాన్యాన్ని తక్కువకు కొనుగోలు చేసి ఉండొచ్చని వివరించారు. మిల్లర్లు ఏవైనా అవకతవకలకు పాల్పడితే అసోసియేషన్ దృష్టికి తేవాలన్నారు. సమావేశంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ భాస్కరరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు పులిపాటి శ్రీనివాసరావు, కార్యదర్శి అన్నే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు -
డీఎస్సీ నిబంధనలు సడలించాలి
డీవైఎఫ్ఐ ధర్నా గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డీఎస్సీ నోటిఫికేషన్లో అనేక లోపాలు ఉన్నాయని, నిబంధనలు సడలించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రామన్న డిమాండ్ చేశారు. శుక్రవారం విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్‌లో డీఎస్సీ అభ్యర్థులతో కలిసి డీవైఎఫ్ఐ ఆధ్వర్యాన ధర్నా జరిగింది. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలను డీఎస్సీకి అనర్హులు చేసే నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఇంటర్, డిగ్రీ, పీజీలో 45, 50 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను తొలగించాలన్నారు. తెలంగాణలో సైతం 40 శాతానికి అనుమతి ఇచ్చారని గుర్తు చేశారు. సిలబస్ విస్తృతిరీత్యా అభ్యర్థుల ప్రిపరేషన్‌కు 90 రోజులు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీ పరీక్షలు ఒకే సమ యంలో లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అభ్యర్థుల వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. డీఎస్సీకి అప్లై చేసుకోడానికి ఇచ్చిన వెబ్ సైట్స్, టోల్ ఫ్రీ నంబర్లు పని చేయడం లేదన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము, జిల్లా అధ్యక్షుడు పి. కృష్ణ, సెంట్రల్ సిటీ అధ్యక్షుడు శివ, పలువురు అభ్యర్థులు పాల్గొన్నారు. -
భవన నిర్మాణ కార్మికుల ధర్నా
మచిలీపట్నంటౌన్: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికులు గురువారం జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్‌కు చేరుకుని ధర్నా చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా కార్యదర్శి మాదాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది కార్మికులు భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నా పేర్కొన్నారు. ఈ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు కాకపోవటంతో ఇబ్బందులు పడుతు న్నాని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు అన్ని రాష్ట్రాల్లో బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని వివరించారు. మొన్నటి వరకు కలిసి ఉన్న తెలంగాణలో కూడా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయన్నారు. మన రాష్ట్రంలోనూ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె.వి.గోపాలరావు మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అమలవుతున్న సంక్షేమ పథకాలకు అదనంగా కొత్త పథకాలు అభివృద్ధి చేసి అమలు చేస్తున్నారన్నారు. మన రాష్ట్రంలో మాత్రం 12, 14 మెమో ఇచ్చి అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆపివేశారని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చినట్లుగా రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా సమీక్ష కమిటీ సమావేశానికి విచ్చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, మంత్రి కొల్లు రవీంద్రకు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా సీఐటీయూ అధ్యక్షుడు కళ్లం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు వై.నరసింహారావు, బేతా శీను, ఎండి కరీముల్లా, మాజేడి శ్రీనివాస రావు, పెదబాబు, బిల్డింగ్ వర్కర్స్ మండల కమిటీ అధ్యక్ష కార్యదర్శులు బండారు శీను, మీర్ ఆలీ అక్బర్ పాల్గొన్నారు. -
విద్యుత్ అదాలత్‌లతో సమస్యల పరిష్కారం
సీజీఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమ్మానుయేల్ చల్లపల్లి: ఏపీసీపీడీసీఎల్ పరిధిలో ఉన్న ఏడు సర్కిల్స్‌లో అపరిష్కృతంగా ఉన్న విద్యత్ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కన్జూమర్ గ్రీవెన్సెస్ రెడ్రస్సెల్ ఫోరం(సీజీఆర్ఎఫ్) పనిచేస్తోందని సంస్థ చైర్మన్, విశ్రాంత న్యాయమూర్తి ఎన్.విక్టర్ ఇమ్మానుయేల్ తెలిపారు. చల్లపల్లిలో గురువారం జరిగిన విద్యుత్ అదాలత్ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన ‘సాక్షి’తో మాట్లా డారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ఒంగోలు, పల్నాడుతో పాటు డీఆర్డీఏ సర్కిళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సర్కిళ్ల పరిధిలో ఉన్న వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు సీజీఆర్ఎఫ్ పని చేస్తోందన్నారు. గతంలో సమస్యల పరిష్కారం కోసం తిరుపతి వరకూ వెళ్లాల్సి వచ్చేదన్నారు. 2020లో విజయవాడ గుణదల ప్రధాన కేంద్రంగా తనతోపాటు మరో ముగ్గురు సభ్యులతో ఇక్కడ కార్యాలయాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. ప్రజలు వ్యవప్రయాసలకోర్చి ఇక్కడి వరకూ రావాల్సిన అవసరం లేకుండా వారి వద్దకే వెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు విద్యుత్ వినియోగదారుల అదాలత్‌లు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ ఏడు సర్కిళ్ల పరిధిలో నాలుగేళ్లలో 190 ప్రాంతాల్లో విద్యుత్ వినియోగదారుల అదాలత్‌లు నిర్వహించిగా వెయ్యికి పైగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఫిర్యాదులు అందాయన్నారు. నాలుగు సమస్యలు మాత్రమే పెండింగ్‌లో ఉండగా, మిగిలిన వాటిని పరిష్కరించామని తెలిపారు. సమస్యలను పరిష్కరించడంలో తిరుపతి, విశాఖపట్నం సీజీఆర్ఎఫ్ల కంటే విజయవాడ సీజీఆర్ఎఫ్ ముందు వరుసలో ఉందన్నారు. -
టూరిజం ప్యాకేజీలపై అవగాహన కల్పించాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో రూపొందించిన ప్రత్యేక ప్యాకేజీలపై పర్యాటకులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ప్యాకేజీలకు సంబంధించి కరపత్రాలను ఆకర్షణీయంగా రూపొందించాలన్నారు. కలెక్టరేట్లో టూరిజం ప్యాకేజీపై పర్యాటక, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) అధికారులతో పాటు వివిధ భాగస్వామ్య పక్షాలతో కలెక్టర్ లక్ష్మీశ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు, మూడు, నాలుగు రోజుల పర్యాటక ప్యాకేజీల వివరాలతో రూపొందించిన కరపత్రాలను పరిశీలించారు. ప్యాకేజీల కింద సందర్శనకు వీలయ్యే ప్రాంతాలు, ప్యాకేజీల ధరలు, పర్యాటకులకు కల్పించే వివిధ సౌకర్యాలు తదితర వివరాలతో రూపొందించిన కరపత్రాల్లో చేయాల్సిన మార్పులు, చేర్పులపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హోటళ్లు, ట్రావెల్ తదితర విభాగాల అసోసియేషన్లతో పాటు వివిధ భాగస్వామ్య పక్షాలతో పలు దఫాల్లో సమావేశాలు నిర్వహించి రూపొందించిన పర్యాటక ప్యాకేజీలపై విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాల్సిన అవసరముందన్నారు. ఇందుకు అవసరమైన ప్రచార సామగ్రిని సిద్ధం చేయాలన్నారు. చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాల విశిష్టతను పర్యాటకులకు వివరించేందుకు వీలుగా గైడ్లను గుర్తించాలన్నారు. త్వరితగతిన వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, ఏపీటీడీసీ–సీఆర్ఓ సుహాసిని పాల్గొన్నారు. -
వైజాగ్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీపై చర్యలు తీసుకోవాలి
● మా కుమారుడి ఆత్మహత్యకు ఆ కళాశాల డీన్, వైస్ ప్రిన్సిపాలే కారణం ● మూడేళ్ల కాలంలో కాలేజీ విద్యార్థులు ముగ్గురు చనిపోయారు ● కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు ఉమాదేవి, రాజేశ్వరరావు వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విశాఖపట్నంలోని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ విద్యార్థి శిరం ప్రణీత్ ఆత్మహత్యకు ఆ కళాశాల యాజమాన్యమే కారణ మని విద్యార్థి తల్లిదండ్రులు శిరం ఉమాదేవి, రాజేశ్వరరావు ఆరోపించారు. ఆ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విజయవాడలోని తమ ఇంటి వద్ద వారు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ కుమారుడు శిరం దత్తప్రణీత్ విశాఖపట్నం తగరపువలసలోని ఎన్ఆర్ఐ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడని పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం ఆ కళాశాల ఏఓ తమకు ఫోన్ చేసి ‘మీ అబ్బాయి భవనం నాలుగో అంతస్తు నుంచి దూకేశాడు. ఆస్పత్రిలో ఉన్నాడు. వచ్చి చూసు కోండి’ అని చెప్పారని తెలిపారు. ఆ రోజు రాత్రికి తాము విశాఖపట్నం వెళ్లే సరికి తమ కుమారుడు మార్చురీలో ఉన్నాడని చెప్పారు. కళాశాల డీన్ పి.వి.సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ వేధింపుల కారణంగానే తమ కుమారుడు మరణించాడని వారు కన్నీటి పర్యంతమయ్యారు. తమ బిడ్డ భవనం నుంచి దూకిన తరువాత తక్షణం స్పందించలేదన్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లిన తరువాత ఏ చికిత్స అందించారనే అంశాలను సైతం తమకు చెప్పలేదని ఆరోపించారు. తమ కుమారుడి మృతి విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఘటనా స్థలంలో ఆనవాళ్లు లేకుండా కాలేజీ యాజమాన్యం చెత్తాచెదారం వేసిందన్నారు. తమ కుమారుడిలాగే గడిచిన మూడు సంవత్సరాల్లో మరో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థులు తమకు చెప్పారని వివరించారు. కాలేజీ డీన్ పి.వి.సుధాకర్‌పై గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా వచ్చాయన్నారు. కాలేజీ యాజమాన్యానికి ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తల అండదండలు ఉండడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రమికవేత్త ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు వారిపై ఏ విధమైన చర్యలూ తీసుకోలేదన్నారు. వరుస ఘటనలు జరుగుతున్నా పోలీసులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. తమ కుమారుడి మరణంపై తగిన దర్యాప్తు చేసి కారకులైన వారిని శిక్షించాలని కోరారు. విలేకరుల సమావేశంలో విద్యార్థి కుటుంబ సభ్యులు రవి ప్రసాద్, గంగాభవాని, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు -
సీఎస్ఎస్ఆర్ పోటీల్లో ఏపీ ఎస్డీఆర్ఎఫ్కు తృతీయ స్థానం
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఎనిమిదో బెటాలియన్ నిర్వహించిన కొలా ప్స్డ్ స్ట్రక్టర్ సెర్చ్ అండ్ రెస్క్యూ (సీఎస్ఎస్ఆర్) పోటీల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఏపీ ఎస్డీఆర్ఎఫ్) బృందం తృతీయ స్థానంలో నిలిచింది. ఈ పోటీల కోసం పదో బెటాలియన్, ఎన్డీఆర్ఎఫ్ కొండపావులూరు సహకా రంతో 19 మందితో కూడిన ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందం అతి తక్కువ సమయంలో శిక్షణ పొంది ఒరిజినల్ స్థాయిలో మొదటి స్థానాన్ని సాధించి జాతీయ స్థాయి పోటీకి అర్హత సాధించింది. సీఎస్ఎస్ఆర్ ఆపరేషన్స్ చేసే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌తోపాటు వివిధ రాష్ట్రాలకు దీటైన పోటీ ఇచ్చి జాతీయ స్థాయిలో తృతీయ స్థానాన్ని కై వసం చేసుకుంది. బృంద సభ్యులను రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఏపీ ఎస్డీఆర్ఎఫ్ విభాగాధిపతి బి.రాజకుమారి, విభాగ అధికారులు అభినందించారు. -
ఉపాధి కూలీల ఆకలి కేకలు
పామర్రు: మండు టెండలో నిత్యం కష్ట పడుతున్న ఉపాధి కూలీలకు కష్ట కాలం దాపురించింది. రోజంతా రెక్కలు కష్టంతో స్వేదం చిందిస్తున్నా వారికి ఆకలి బాధలు తప్పడం లేదు. కూలి డబ్బులను కేంద్రం ఇప్పటి వరకు విడుదల చేయక పోవడంతో వారు పడుతున్న వేదన వర్ణణాతీతం. సుమారు మూడు నెలలుగా శ్రమిస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. జిల్లాలో సుమారు 2.53 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. వాటిలో 3.29 లక్షల మంది సభ్యులు ఉన్నారు. జనవరి 15 నుంచి ఇప్పటి వరకు వారికి దినసరి కూలి అందలేదు. గతంలో వారానికి పది రోజులకు ఒక్కసారి కూలి డబ్బులు చెల్లించేవారు. మూడు నెలల తరబడి కూలి అందకపోవడంతో కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు నెలల వ్యవధిలో సుమారు 14 లక్షల పని దినాలు కల్పించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా వారు పడుతున్న కష్టానికి ఫలితం రాలేదు. పండుగలకూ పస్తులే ఈ ఏడాది ఆరంభంలో జనవరి 15వ తేదీ వరకు కొంత మేర కూలీలకు డబ్బులు అందాయి. ఆ తరువాత నుంచి పెండింగ్ పడుతూ వచ్చారు. జనవరిలో రిపబ్లిక్ డే మొదలుకొని మహా శివరాత్రి, రంజాన్, ఉగాది, శ్రీరామ నవమి, గుడ్‌ఫ్రైడ్ వంటి పర్వదినాలు వచ్చినప్పటికీ వారికి పస్తులు తప్పడం లేదు. ఉపాధి హామీ పథకంలో భాగంగా పని చేస్తున్న కూలీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇంత వరకు విడుదల చేయలేదు. దీంతో కూలీలు పస్తులతో కాలక్షేపం చేయాల్సి వస్తోంది. బకాయిల కోసం ఎదురుచూపులు జిల్లాలో గ్రామీణ ఉపాధి హమీ పథకం కింద పని చేస్తున్న కూలీలకు సంబంధించి సుమారు రూ.35 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే సుమారు మూడు లక్షల మంది కూలీలకు ఉపశమనం లభిస్తుంది. కూలీల కుటుంబాలకు మూడు నెలల మొత్తం ఒకేసారి అందిస్తే ఆర్థికంగా కొంత వెసులు బాటు లభిస్తుందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. మూడు నెలలుగా అందని వేతనాలు జిల్లాలో 2.53 లక్షల జాబ్ కార్డులు సుమారు 3.29 లక్షల మంది కూలీలు జిల్లాలో రూ.35.45 కోట్ల బకాయిలు -
ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు విజయ డెయిరీ ఆర్థిక సాయం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): పహల్గాం ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు విజయ డెయిరీ తరఫున ఆర్థిక సాయం అందించనున్నామని సంస్థ చైర్మన్ చలసాని ఆంజనేయులు ప్రకటించారు. ఉగ్రవాదుల దాడులకు నిరసనగా కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) ప్రాంగణంలో గురువారం మానవ హారం నిర్మించారు. ఫ్యాక్టరీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ కేశినేని చిన్ని హాజరయ్యారు. ఎంపీ కేశినేని చిన్ని, చైర్మన్ చలసాని ఆంజనేయులు, ఎండీ కొల్లి ఈశ్వరబాబు, డెయిరీ బోర్డు సభ్యులు, ఉద్యోగులు, సిబ్బంది నల్ల రిబ్బన్లు ధరించి మానవ హారంలో పాల్గోని పాకిస్తాన్ చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎంపీ, చైర్మన్ మీడియాతో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి పాకిస్తాన్ ఆధ్వర్యంలోనే జరిగిందని, దీనిని భారతీయులందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారని పేర్కొన్నారు. దేశ ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న అరాచక శక్తుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉగ్రదాడిలో రాష్ట్రానికి చెందిన చంద్రమౌళి, మధుసూదనరావు మరణించారని, వారి కుటుంబాలకు విజయ డెయిరీ తరఫున రూ.1.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల వైజ్ఞానిక విహారయాత్ర
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వైజ్ఞానిక విహార యాత్ర కోసం బయలుదేరి వెళ్లారు. ఏపీ ప్రభుత్వం, సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ విహార యాత్రను చేపట్టారు. జిల్లా లోని ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ వైజ్ఞానిక ప్రదర్శ నల్లో ప్రతిభ చూపిన 101 మంది విద్యార్థులు, 10 మంది గైడ్ టీచర్లతో కలిసి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నుంచి బుధవారం రాత్రి వారు తరలివెళ్లారు. గురువారం చైన్నెలోని పెరియార్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్, బీఎం బిర్లా ప్లానిటోరియం, ఎవల్యూషన్ పార్క్‌లు, స్నేక్ పార్క్, మెరీనా బీచ్‌లను సందర్శించారు. విద్యార్థులు ఈ వైజ్ఞానిక విహార యాత్ర ద్వారా అంతరిక్ష పరిశోధన, విశ్వ ఆవిర్భావం, జీవపరిణామ క్రమం, న్యూక్లియర్ పవర్, పర్యావరణ పరిరక్షణ మొదలైన విషయాలను ప్రత్యక్ష పరిశీ లన ద్వారా తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ ఆఫీసర్ డాక్టర్ మైనం హుస్సేన్ పాల్గొన్నారు. -
అన్న చేతిలో తమ్ముడు హతం
కాకరవాయి(వత్సవాయి): కుటుంబ తగాదాల నేపథ్యంలో అన్న చేసిన దాడిలో గాయపడిన తమ్ముడు మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి వత్సవాయి మండలం కాకరవాయి గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కాకరవాయి గ్రామానికి చెందిన బెజ్జం ముక్కటి, భాగ్యమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారిలో చిన్న వాడైన అర్జున్‌కు వివాహం కాలేదు. ముక్కంటి భాగ్యమ్మ, ఆమె కుమారుడు శ్రీనివాసరావు గతంలో చనిపోయారు. అన్నదమ్ములు కొండ, శ్రీనివాసరావు కుటుంబాలతోపాటు అర్జున్ పక్కపక్క ఇళ్లలో నివసిస్తున్నారు. కొండ, అర్జున్ మధ్య కుటుంబ తగాదాల నేపథ్యంలో గొడవలు జరుగుతున్నాయి. బుధవారం వారి మధ్య వాగ్వాదం జరిగింది. కొండ ఆవేశంతో క్రికెట్ స్టంప్‌లో తమ్ముడు అర్జున్‌పై దాడిచేశాడు. అర్జున్ తలకు బలమైన గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు జగ్గయ్యపేట వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో అర్జున్ మరణించాడు. మృతుడి సోదరి రాణి ఫిర్యాదు మేరకు ఎస్ఐ పి.ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేశారు. -
కన్నీటి ధార!
బంగారం ధర ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంది. తులం బంగారం లక్ష మార్కు దాటేసింది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ.. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు బంగారు ఆభరణాల తయారీ కార్మికులు మాత్రం పనులు లేక పస్తులుండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పెరిగిన ధరల కారణంగా కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీంతో ఆ రంగంపై ఆధారపడి ఉన్న చిన్న వ్యాపారులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో వాణిజ్య రాజధానిగా పిలిచే ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కార్మికులపై దాని ప్రభావం అధికంగా పడుతోంది. బంగారు ఆభరణాల తయారీ కార్మికులకు ‘ధరా’ఘాతంవన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారుగా 40 వేల మంది బంగారు ఆభరణాల తయారీ కార్మికులు ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రధానంగా విజయవాడ పాతబస్తీలో సుమారుగా 50 సముదాయాల్లో ఐదు నుంచి ఆరు వందలకు పైగా, గవర్నర్‌పేట బీసెంట్‌రోడ్డు పరిసర ప్రాంతాల్లో మరో రెండు వందలకు పైగా కార్ఖానాలు కొనసాగుతున్నాయి. సుమారుగా 25 వేల మంది కార్మికులు వీటిపై ఆధారపడి ఉన్నారు. ఇవి కాకుండా రెండు జిల్లాలో పెద్ద స్థాయిలో ఆభరణాల తయారీ చేసే మరో వంద వరకూ కార్ఖానాలు పని చేస్తున్నాయి. వీటిల్లో ఏడెనిమిది వేల మంది వరకూ కార్మికులు పని చేస్తున్నారు. అలాగే వ్యక్తిగతంగా ఇళ్ల వద్ద ఆభరణాల తయారీ చేసే వారి సంఖ్య సైతం ఏడెనిమిది వేల వరకూ ఉంటుంది. వీరిలో సుమారు ఏడు నుంచి పది వేల మంది బెంగాల్ కార్మికులు ఉన్నట్లు అంచనా. పనులు లేక ఆత్మహత్యలు.. పనులు లేక బంగారు ఆభరణాల తయారీ కార్మిక కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. ఇటీవల కొంతమంది కార్మికులు పనులు లేక ఆదాయం రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆ సంఘాల నేతలు చెబుతున్నారు. యనమలకుదురులో ఒక కార్మికుడు ఆభరణాల తయారీకి వినియోగించే సైనెడ్‌ను కూల్‌డ్రింక్‌లో కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు పేర్కొంటున్నారు. అలాగే పనులు లేకపోవటంతో చాలా మంది ఈ రంగాన్ని వదిలి ఇతర రంగాలకు తరలిపోతున్నారని వారు వాపోతున్నారు. బహుళజాతి సంస్థలతో తీవ్ర ప్రభావం.. దశాబ్దం క్రితం వరకూ స్వర్ణకారుల జీవితాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగిపోయాయి. దాదాపుగా అందరికీ చేతినిండా పనులు ఉండేవి. కానీ పది సంవత్సరాలుగా బహుళజాతి సంస్థల కారణంగా స్థానికంగా పనులు తగ్గి కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయి. ముఖ్యంగా చాలా సంస్థలు ఉత్తరాది నుంచి ఆభరణాలను తయారు చేయించుకొని దిగుమతి చేసుకుంటున్నాయి. విస్తృత ప్రచార ఆర్భాటాలు, ఆకర్షించే దుకాణ సముదాయం, ఆకట్టుకునే రాయితీలు, భారీ పెట్టుబడులతో కార్పొరేట్ సంస్థలు ఈ రంగంలోకి రావటంతో స్వర్ణకారుల బతుకు చిత్రం భారంగా మారింది. పని బంగారం.. బతుకు నిస్సారం పసిడి ధర భారీగా పెరగడంతో దిగజారిన కొనుగోళ్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పడిపోయిన ఆభరణాల తయారీ పనులు పనులు లేక అవస్థలు పడుతున్న కార్మికులు వేరే పనులు చూసుకుంటున్న స్వర్ణకారులు -
ప్రణాళిక లేని ‘సమీక్ష’
చిలకలపూడి(మచిలీపట్నం): వేసవి ప్రణాళికలు లేవు.. గత సమావేశపు నిర్ణయాలపై సమీక్షలు లేవు.. రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం.. రెండు గంటల్లోనే చర్చ సమాప్తం.. అంతా తూతూమంత్రం, మొక్కుబడి పర్వం.. ఇది గురువారం జిల్లా పరిషత్ సమావేశపు హాలులో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జరిగిన రెండో జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్సీ) తీరు. సాధారణంగా డీఆర్సీలో రానున్న మూడు నెలల్లో వాతావరణ పరిస్థితులను బట్టి ప్రజల అవసరాలను ఏ విధంగా తీర్చాలో చర్చ జరగాలి.. గత డీఆర్సీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా అమలు చేస్తున్నారో వాటిపై కూడా సంబంధిత అధికారులు.. మంత్రులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. అయితే అలాంటివేమి లేకుండానే సమీక్ష ముగిసింది. ఉదయం పది గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై కేవలం రెండు గంటల్లో ముగియడం గమనార్హం. వ్యవసాయ అనుబంధ శాఖలపై సమీక్ష.. డీఆర్సీ సమావేశంలో తొలుత వ్యవసాయ అనుబంధశాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ముందుగా పంట బీమాపై చర్చ జరిగింది. ఈ చర్చలో వ్యవసాయశాఖ అధికారులు హెక్టారుకు రూ. 1.03 లక్షల బీమాకు రూ. 3 వేలు ప్రీమియం చెల్లించాలని, బ్యాంకు నుంచి రుణం పొందితే ఇన్స్యూరెన్స్ ప్రీమియం బ్యాంకు అధికారులు మినహాయించి రుణం ఇస్తారని, రుణం పొందని రైతులు సమీపంలోని సచివాలయానికి వెళ్లి తప్పనిసరిగా బీమాకు సంబంధించిన ప్రీమియం చెల్లిస్తే ఏదైనా విపత్తులు సంభవించినప్పుడు నష్టపరిహారం అందే అవకాశం ఉంటుందని కలెక్టర్ ఈ సమీక్షలో తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రతి మిల్లులో డ్రయ్యర్లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ అధికారులకు సూచించారు. తోట్లవల్లూరు మండలంలో మొక్కజొన్న ఎక్కువగా పండిందని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వీరంకి గురుమూర్తి సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రొటోకాల్‌పై నిలదీత.. నియోజకవర్గాల్లో జిల్లా అధికారులు ఎటువంటి కార్యక్రమాలు చేసినా తమకు తెలియపర్చటం లేదని పామర్రు శాసనసభ్యుడు వర్ల కుమార్‌రాజా సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజాప్రతినిధులకు తెలియకుండానే సమావేశాలు పెట్టుకుంటున్నారని ప్రజలు ఎన్నుకున్న తమకు శాఖలపరంగా విషయాలు తెలియపరిస్తే తాము కూడా ప్రజలకు అవగాహన కల్పించే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమయంలో గన్నవరం శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ తమ నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై సమావేశాలు తనకు తెలియకుండా నిర్వహిస్తున్నారని కనీసం ప్రొటోకాల్ కూడా పాటించరా? అని ఆయన కలెక్టర్‌ను ప్రశ్నించారు. అధికారికంగా నిర్వహించే సమావేశాలకు కూడా తనకు ఆహ్వానం లేకపోతే తదుపరి మీరు పంపే ఆహ్వానాలకు తాను హాజరుకానని ఆయన తేల్చి చెప్పారు. కృష్ణాజిల్లా నుంచి ఎక్కువగా వలస పోతున్నారని, దీనిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించటం లేదన్నారు. జిల్లాలో అన్యాక్రాంతమైన భూములపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో కలెక్టర్ వివరించాల్సిన అవసరం ఉందని యార్లగడ్డ నిలదీశారు. అలాగే పశుసంవర్ధకశాఖపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కుబడిగా ముగిసిన డీఆర్సీ సమావేశం రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం ప్రొటోకాల్‌పై ఎమ్మెల్యేల రగడ కలెక్టర్‌పై ఎమ్మెల్యే యార్లగడ్డ అసహనం జిల్లా అధికారులు బందరులోనే ఉండాలి.. ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించే సమయంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అధికారులు కాలువలపై దృష్టిసారించడం లేదని మండిపడ్డారు. ఇంజినీరింగ్ అధికారులు ఎక్కువగా విజయవాడ నుంచి వస్తున్నారని అన్నిశాఖల అధికారులందరూ బందరులో కచ్చితంగా ఉండాల్సిందేనని హెచ్చరించారు. ఈ విషయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించాలని మంత్రి సూచించారు. -
టాప్ లేపిన అన్నదమ్ములు
మచిలీపట్నంఅర్బన్: తల్లిదండ్రుల స్ఫూర్తి, ఉపాధ్యాయుల శిక్షణతో ఒకే కుటుంబంలో సొంత అన్నదమ్ములు పదో తరగతి పరీక్ష ఫలితాల్లో కృష్ణాజిల్లా ఫస్ట్, సెకండ్ ర్యాంకర్లుగా నిలిచి శభాష్ అనిపించారు. ఉంగుటూరు మండలం, మధిరపాడు గ్రామానికి చెందిన దుబ్బాకుల నరసింహారావు, నాగదుర్గ దంపతులకు దుబ్బాకుల దుర్గాయశ్వంత్, దుబ్బాకుల వీర వెంకట నాగేంద్ర కుమారులు. వీరిరువురూ ఉంగుటూరు మండలం ఇందుపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివారు. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ కూలీలు కాగా.. తల్లిదండ్రుల కష్టాన్ని, ఉపాధ్యాయుల శిక్షణను సద్వినియోగం చేసుకొని ప్రణాళిక, సమన్వయంతో దుబ్బాకుల దుర్గా యశ్వంత్ 600 మార్కులకుగాను 591 మార్కులు సాధించి కృష్ణాజిల్లా మొదటి స్థానం, అతని తమ్ముడు దుబ్బాకుల వీర వెంకట నాగేంద్ర 589 మార్కులు సాధించి జిల్లా ద్వితీయ స్థానం సాధించాడు. డీఈఓ కార్యాలయం వద్ద ఫ్లెక్సీ.. ఒకే కుటుంబంలోని అన్నదమ్ములు జిల్లా మొదటి, ద్వితీయ ర్యాంకులు సాధించటంతో జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు వారిద్దరిని అభినందిస్తూ వారి ఫొటోలు, సాధించిన మార్కులు, ర్యాంకులతో ఫ్లెక్సీని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. వారుండేది కుగ్రామమైనా, వేదిక ప్రభుత్వ పాఠశాలైనా కళ్లముందున్న లక్ష్యాన్ని.. పట్టుదల, ప్రణాళిక, నిరంతర సాధనతో అందుకోవడం అభినందనీయమని పలువురు అభినందిస్తున్నారు. ‘పది’ ఫలితాల్లో కృష్ణా జిల్లా మొదటి రెండు ర్యాంకులతో సత్తా వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు -
వ్యాపారాలు పడిపోయాయి..
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. దీంతో వ్యాపారాలు దారుణంగా పడిపోయాయి. దీని ప్రభావంతో వ్యాపారులతో పాటుగా ఆభరణాల తయారీ చేసే కార్మికులు నానా తంటాలు పడుతున్నారు. – కోన శ్రీహరిసత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి, బెజవాడ జ్యూవెలరీ అండ్ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. బంగారు ఆభరణాల తయారీ కార్మికులు పనులు లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులకు చేరుకున్నారు. ఇటీవల యనమలకుదురులో ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు బంగారం ధరల పెరుగుదల ప్రధాన కారణం. చాలా మంది ఈ వృత్తిని వదిలేసి రోజువారీ కార్మికులుగా వెళ్లి పోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి. – తోలేటి శ్రీకాంత్, చైర్మన్, వైఎస్సార్ సీపీ చేతివృత్తుల విభాగం పరిస్థితి దయనీయం.. ఆభరణాల తయారీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. తులం బంగారం లక్షకు చేరుకోవటంతో ఈ పరిస్థితులు చాలా రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది. పనులు లేకపోవటంతో ఆదాయం లేక పస్తులుండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి. – మందారపు పోతులూరి ఆచారి, ప్రధాన కార్యదర్శి, శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం ● -
ఈవీఎం గోడౌన్‌కు పటిష్ట భద్రత
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఈవీఎం, వీవీప్యాట్ గోడౌన్‌కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలోని ఈవీఎం, వీవీప్యాట్ గోడౌన్‌ను ఆయన అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాల పని తీరు, అగ్నిమాపక దళ పరికరాలు తదితరాలను తనిఖీ చేశారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎం. లక్ష్మీనరసింహం, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ చంద్రమౌళి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత నావికాదళంతో కృష్ణా వర్సిటీ ఒప్పందం రుద్రవరం(మచిలీపట్నంరూరల్): భారత నావికాదళంతో కృష్ణా విశ్వవిద్యాలయం సంయుక్త పరిశోధనలు చేసేందుకు ఒప్పందం కుదిరినట్లు కేయూ రెక్టర్ ఆచార్య ఎంవీ బసవేశ్వర రావు తెలిపారు. ఈ మేరకు గురువారం న్యూ ఢిల్లీలోని నావికాదళ కేంద్రంలో నావెల్ ఆర్కిటెక్చర్ డైరెక్టరేట్ డైరెక్టర్ అభిలాష్ శ్రీ కుమారన్, తాను ఎంఓయూపై సంతకాలు చేశామని చెప్పారు. ఈ ఒప్పందం ప్రకారం భారత నావికాదళం, కృష్ణా విశ్వవిద్యాలయం సంయుక్తంగా పరిశోధనలు నిర్వహిస్తాయన్నారు. అలాగే నావికాదళ అధికారుల విద్యార్థులు కూడా కేయూలో విద్యనభ్యసించే అవకాశం కల్పిస్తామన్నారు. అనంతరం అభిలాష్ శ్రీ కుమారన్‌ను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో సీడీఆర్ తరుణ్ చందర్ కమల్ తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ సీఈవో, డీపీవోలకు అవార్డులు చిలకలపూడి(మచిలీపట్నం): జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో కె. కన్నమనాయుడు, జిల్లా పంచాయతీ అధికారి జె. అరుణ అవార్డులు అందుకున్నారు. 15వ ఆర్థిక సంఘ నిధులు సమర్థంగా వినియోగించినందుకు సీఈఓ.. జిల్లాలో స్వచ్ఛాంధ్ర కల సాకారం చేసే విధంగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించినందుకు డీపీవో అవార్డుకు ఎంపికయ్యారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చేతుల మీదుగా వీరు ఇరువురూ అవార్డులను గురువారం స్వీకరించారు. జీజీహెచ్‌కు క్యాన్సర్ స్క్రీనింగ్ పరికరాలు అందజేత లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రభుత్వాస్పత్రికి రాజ్యసభ సభ్యుడు వి.విజయేంద్ర ప్రసాద్ రూ.50 లక్షలు విలువ చేసే రెండు రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరికరాలను అందజేశారు. తన నియోజకవర్గ అభివృద్ధి నిధులను వెచ్చించి కొనుగోలు చేసిన వాటిని గురువారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ వెంకటేశ్వరరావుకు ఎంపీ తరఫున ఆరా సంస్థ ప్రతినిధి అందజేశారు. డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలలో రొమ్ము క్యాన్సర్ పెరుగుతున్న నేపథ్యంలో స్క్రీనింగ్ డివైజ్‌లు అందించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, ఎంపీ విజయేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ పరికరాలు బరువు తక్కువగా ఉండటమే కాకుండా, పరీక్ష చేసేటప్పుడు ఎటువంటి నొప్పి లేకుండా ఉండే విధంగా తయారు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అశోక్‌కుమార్, సీఎస్ ఆర్ఎంఓ డాక్టర్ పద్మావతి పాల్గొన్నారు. -
లోక్ అదాలత్‌ను విజయవంతం చేద్దాం
చిలకలపూడ(మచిలీపట్నం): జిల్లాలో వచ్చే నెల 10వ తేదీన జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతంగా నిర్వహించి, జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టేందుకు కక్షిదారులు సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపి కోరారు. గురువారం సాయంత్రం నగరంలోని న్యాయస్థానాల సముదాయంలో గల న్యాయ సేవా సదన్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వివిధ అధికారులు, కక్షిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి లోక్ అదాలత్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తాను విజయనగరం, విశాఖపట్నంలో పనిచేసినప్పుడు లోక్ అదాలత్‌ను ఎంతో అద్భుతంగా నిర్వహించామన్నారు. అదే తరహాలో కొత్త ఒరవడితో జిల్లాలో నిర్వహించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో జిల్లాను నిలబెట్టేందుకు పోలీసు అధికారులు, న్యాయవాదులు, బీమా కంపెనీలు, విద్యుత్తు బీఎస్ఎన్ఎల్ తదితర ప్రభుత్వ శాఖలు అందరూ సహకరించాలన్నారు. స్టేషన్ల వారీగా కమిటీలు.. ముఖ్యంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సర్కిల్ కమిటీలు ఏర్పాటు చేసుకొని సర్కిల్ ఇన్స్పెక్టర్ అధ్యక్షతన కోర్టు కేసులను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పర్యవేక్షించాలని న్యాయమూర్తి సూచించారు. లోక్ అదాలత్ సమయంలో వీలైనన్ని ఎక్కువ కోర్టు కేసులు పరిష్కారం అయ్యేందుకు న్యాయమూర్తులతో పాటు పోలీసులు న్యాయవాదులు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలన్నారు. అదనపు ఎస్పీ వీవీ నాయుడు మాట్లాడుతూ ప్రధాన న్యాయమూర్తి సూచించిన విధంగా జిల్లాలోని 2,450 కేసులను పర్యవేక్షించి స్టేషన్ల వారీగా సర్కిల్ కమిటీలను ఏర్పాటు చేసి పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కేవీ రామ కృష్ణయ్య, న్యాయమూర్తులు పాండురంగారెడ్డి, సుజాత, కేఆర్ఆర్సీ ఎస్డీసీ శ్రీదేవి, మచిలీపట్నం డీఎస్పీ సీహెచ్ రాజా, మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. పోతురాజు, న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి -
పదవిలో బాధ్యతగా వ్యవహరించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): పదవి ద్వారా వచ్చిన అధికారంతో బాధ్యతగా వ్యవహరించాలి తప్ప అజమాయిషీ చేయకూడదని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి జి.గోపీ సూచించారు. మచిలీపట్నం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం, జిల్లాకు బదిలీపై వచ్చిన న్యాయమూర్తులకు స్వాగతం, బదిలీపై వెళ్లిన న్యాయమూర్తులకు వీడ్కోలు కార్యక్రమం బార్ అసోసియేషన్ హాలులో బుధవారం జరిగింది. తొలుత బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు అధికారం వచ్చి నప్పుడు అజమాయిషీని ఆయుధంగా కాకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మచిలీపట్నంతో తనకు అనుబంధం ఉందని, తన మామయ్య మచిలీపట్నంలో ఎనిమిది సంవత్సరాల పాటు పనిచేశారని పేర్కొన్నారు. తాను మచిలీపట్నం బదిలీ అయినట్లు తెలియగానే ఎంతో సంతోషించానన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.పోతురాజు మాట్లాడుతూ.. తనతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్న న్యాయవాదులకు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. బార్, బెంచ్ సమన్వయంతో పనిచేసేలా తనవంతు కృషి చేస్తానన్నారు. తమకు న్యాయమైన సమస్యలు ఉంటే న్యాయమూర్తులకు చెప్పుకోవటంతో పాటు అవసరమైతే నిరనసనలు కూడా చేపడ్తామన్నారు. మచిలీపట్నంలో ట్రిబ్యునల్ కోర్టులు రావడానికి సహాయసహకారాలు అందించాలని న్యాయమూర్తులను కోరారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపీ, ఆరో అదనపు జడ్జి పి.పాండురంగమూర్తి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ ఒ.వెంకటేశ్వరరావుకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. జిల్లా కోర్టు నుంచి బదిలీపై వెళ్తున్న జడ్జిలు ఎన్.మేరీ, ఎం.వి.వాహిని, సాయిశ్రీవాణిని శాలువాలతో సత్కరించారు. తొలుత మంత్రి కొల్లు రవీంద్ర బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపీ -
థాయ్‌ల్యాండ్ టూ ఘంటసాల
ఘంటసాల: సమాజం సుఖశాంతులతో ఉండాలంటే గౌతమ బుద్ధుడి బోధనలు శరణ్యమని బౌద్ధ గురువు బంతే ధమ్మధజ థెరో అన్నారు. రూ.4 లక్షల విలువైన థాయ్‌ల్యాండ్ మెటల్, ఫైబర్‌తో తయారు చేసిన రెండు గౌతమ బుద్ధుడి విగ్రహాలు థాయ్‌ల్యాండ్ నుంచి బుధవారం ఘంటసాల గ్రామంలోని బుద్ధ విహార్‌కు చేరుకున్నాయి. ఈ సందర్భంగా బంతే ధమ్మ ధజ థెరో మాట్లాడుతూ.. ప్రత్యేకమైన బుద్ధుడి విగ్రహాలు థాయ్‌ల్యాండ్ నుంచి తొలుత ఓడలో చైన్నెకు చేరుకున్నాయని, అక్కడి నుంచి రైలు ద్వారా మచిలీపట్నం వచ్చాయని, అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో ఘంటసాల బుద్ధవిహార్‌కు తరలించామని తెలిపారు. ఈ విగ్రహాలను మే 12న జరిగే బుద్ధ జయంతి ఉత్సవాల్లో ప్రదర్శనకు ఉంచుతామని పేర్కొన్నారు. థాయ్ ల్యాండ్ నుంచి వచ్చిన బుద్ధుడి విగ్రహాలకు మచిలీపట్నం రైల్వే స్టేషన్లో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు దర్శించుకున్నారు. బంతే ధమ్మ ధజ థెరో ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఘంటసాల చేరుకున్న విగ్రహాలకు బౌద్ధ స్తూపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బుద్ధ విహార్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బుద్ధవిహార్‌కు చేరినగౌతమబుద్ధుడి విగ్రహాలు -
హోంగార్డ్‌ల సంక్షేమానికి నిరంతరం కృషి
కోనేరుసెంటర్(మచిలీపట్నం): హోం గార్డ్ల సంక్షే మంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని స్పందన సమావేశపుహాలులో ఆయన బుధవారం హోంగార్ుడ్స దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. హోంగార్డ్స్ విభాగం పోలీస్ శాఖలో అంతర్భాగమేనన్నారు. పోలీసులతో సమానంగా విధులు నిర్వ ర్తించే హోంగార్డులకు పోలీసుశాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసు కురావాలని సూచించారు. విధుల్లో ప్రతిభ కనబరచిన ప్రతి హోంగార్డుకు రివార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో హోంగార్డులంతా తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్సును కలిగి ఉండాలన్నారు. అప్పుడే అనుకోని ప్రమాదం జరిగినప్పుడు వారి కుటుంబ సభ్యులకు రూ.30 లక్షల వరకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని సూచించారు. నిత్యం వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలని, ప్రతి శుక్రవారం జరిగే పరేడ్‌లో తప్పనిసరిగా పాల్గొనా లని సూచించారు. వృత్తి, ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలను పలువురు హోంగార్డులు ఎస్పీ గంగా ధరరావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. తన పరిధిలో ఉన్నంత వరకు ప్రతి సమస్యకూ పరిష్కారం చూపుతానని ఎస్పీ హామీ ఇచ్చారు. తన పరిధికి మించిన సమస్యలను ప్రభుత్వంతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు. హోంగార్డులు చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు తన దృష్టికి వస్తే శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ఏ మాత్రం వెనుకాడబోనని హెచ్చరించారు. అవసరమైతే సర్వీసు నుంచి తొలగిస్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో హోంగార్డ్స్ కమాండెంట్ విజయవాడ రీజియన్ ఆనంద్ బాబు, అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, అడిషనల్ ఎస్పీ ఏఆర్ బి.సత్య నారాయణ, ఏఆర్ డీఎస్పీ వెంకటేశ్వరరావు, హోమ్ గార్డ్స్ డీఎస్పీ విజయవాడ డివిజన్ ఎన్. వెంకటరమణ, హోంగార్డ్స్ ఆర్ఐ రవికుమార్ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ గంగాధరరావు -
నిత్యాన్నదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి బుధవారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. విజయవాడకు చెందిన ఎల్.నారాయణ కుటుంబం ఆలయ అధికారులను కలిసి రూ.1,01,116 విరాళం అందజేసింది. ఒంగోలుకు చెందిన డి.శివకృష్ణ ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. మహిళలకు ‘శక్తి’ యాప్‌తో రక్షణవిజయవాడస్పోర్ట్స్: ఆపద సమయంలో మహిళలకు ‘శక్తి’ యాప్ రక్షణగా నిలుస్తుందని మహిళా పోలీస్‌స్టేషన్ ఏసీపీ లతాకుమారి సూచించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శక్తి యాప్ ఆవశ్యకతపై విద్యార్థినులు, గృహిణులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జి.కొండూరు గ్రామం, విజయవాడ నగరంలోని డెంటల్ కాలేజీ, సెంట్రల్ ఎకై ్సజ్ కాలనీలో మహిళా హాస్టల్, పలు ప్రధాన కూడళ్ల వద్ద విద్యార్ధినులు, గృహిణులకు మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది బుధవారం ఈ యాప్‌పై అవగాహన కల్పించారు. ఏసీపీ లతాకుమారి మాట్లాడుతూ.. మహిళలు, బాలికల రక్షణకు ఎన్నో చట్టా లున్నాయన్నారు. ఆపద సమయంలో మహిళలకు రక్షణగా నిలిచేందుకు శక్తి యాప్‌ను రూపొందించామన్నారు. ఈ యాప్‌ను ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని ఆపద సమయంలో సాయం పొందాలని సూచించారు. బాధితులు యాప్‌లో సమాచారం అందించిన పది నిమిషాల్లో పోలీస్ సాయం అందుతుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇంటర్మీడియెట్ అధికారిగా ప్రభాకరరావు వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌గా బి.ప్రభాకరరావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఆ పదవిలో కొనసాగిన సి.ఎస్.ఎస్.ఎన్.రెడ్డి కడపకు బదిలీపై వెళ్లారు. పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న రెడ్డికి జిల్లా ఇంట ర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం ఆయన ప్రమోషన్‌పై కడప అధికారిగా నియమితులయ్యారు. ఏలూరు జిల్లా నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న ప్రభాకరరావుకు ఎన్టీఆర్ జిల్లా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన సి.ఎస్.ఎస్.ఎన్.రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. -
నియోజకవర్గాల యాక్షన్ ప్లాన్‌పై వర్క్‌షాప్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘స్వర్ణాంధ్ర 2047’ సాధనలో భాగంగా నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పనకు రెండు రోజులు జరిగే వర్క్‌షాప్ బుధవారం ప్రారంభమైంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సిబ్బందికి వర్క్‌షాప్ చేపట్టారు. ఏపీ సెక్రటేరియట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్లు రావి రాంబాబు, జె.విజయలక్ష్మి, సీనియర్ సలహాదారు డి.వి.వి.సీతాపతిరావు పాల్గొని సిబ్బందికి శిక్షణనిచ్చారు. విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పనకు నియోజకవర్గాల పరిధిలోని అవకాశాలు, బలాలు, అనుకూల, ప్రతికూల అంశాలను గుర్తించ డంపై అవగాహన కల్పించారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, వారి టీం సభ్యుల నుంచి సలహాలు, అభిప్రాయాలు సేకరించారు. వర్క్‌షాప్‌లో రెండు జిల్లాల నుంచి నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, నియోజకవర్గ హెడ్ క్వార్టర్ మండల పరిషత్ అధికారులు, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్లు, ప్రణాళిక శాఖ సిబ్బంది, జీఎస్‌డబ్ల్యూఎస్ నుంచి ప్రణాళికా శాఖకు ఆన్‌డ్యూటీపై తీసుకున్న సిబ్బంది పాల్గొన్నారు. వర్క్‌షాప్ గురువారం కూడా కొనసాగుతుందని అర్థగణాంకాధికారి ఎం.లలితాదేవి తెలిపారు. -
రెవెన్యూ సిబ్బందిపైనే అనుమానాలు
నందిగామలోని పంట పొలంలో బుసకను ట్రాక్టర్లలోకి నింపుతున్న జేసీబీపెడన: మండల పరిధిలో బుసకాసరులు రెచ్చిపోతున్నారు. బుసక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిస్తున్నారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నా లెక్కచేయడంలేదు. ఏకంగా బుసక తోడేందుకు జేసీబీలను ఏర్పాటుచేసి ట్రాక్టర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు ఎవరైనా అడ్డుకుంటే ఇంటి అవసరాలకు అంటూ వాదనకు దిగుతున్నారు. నందిగామ కేంద్రంగా.. బుసక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండటంలేదు. అధికారులను లెక్కచేయక యథేచ్ఛగా బుసకను తరలించి అక్రమార్కులు సొమ్ముచేసుకుంటున్నారు. పెడన మండలంలోని నందిగామ గ్రామ శివారులో జేసీబీతో పంట పొలాలను తవ్వి బుసకను ట్రాక్టర్లు ద్వారా తరలించే ప్రక్రియకు అక్రమార్కులు బుధవారం ఉదయం శ్రీకారం చుట్టారు. స్థానికులు కొందరు అధికారులకు ఈ సమాచారం అందించారు. అధికారులు స్పందించి స్థానిక సిబ్బందిని పంపించి బుసక తవ్వకాలను నిలుపుదల చేయించారు. సిబ్బంది వెళ్లగానే బుసక తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయి. స్థానికంగా ఉండే రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బందికి ఈ సమాచారం తెలిసినా స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుసకను ఆక్రమంగా తరలించే వారి ఒత్తిడితో మిన్నకుండి పోతున్నారా లేక మరేదేయినా కారణం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుసక తవ్వకాలను అడ్డుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తున్నా ఆ దిశగా స్థానిక సిబ్బంది ముందుకు అడుగులు వేయకపోవడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నందిగామలో యథేచ్ఛగా బుసక అక్రమ రవాణా అధికారులు అడ్డుకున్నా లెక్కచేయని అక్రమార్కులు ఇంటి అవసరాల కోసమంటూ అధికారులపై కస్సుబుస్సు నందిగామలో బుసకను తరలిస్తున్నట్లు తమకు సమాచారం వచ్చింది. అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేయడమే కాకుండా మండల కేంద్రం నుంచి కూడా సిబ్బందిని పంపించి బుసక తరలించకుండా చర్యలు తీసుకున్నాం. ఇంటి అవసరాల నిమిత్తం తరలించుకుంటున్నామని అంటున్నారు. ఆది వాస్తవమా కాదా అని పరిశీలించి నివేదిక ఇవ్వాలని స్థానిక రెవెన్యూ సిబ్బందిని ఆదేశించాను. బుసక తరలిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – కె.అనిల్‌కుమార్, ఇన్చార్జి తహసీల్దారు, పెడన వారం రోజులుగా పెడన మండల వ్యాప్తంగా బుసక రవాణా కట్టడికి రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. బుసకను తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని ఫైన్ వేస్తున్నారు. పగలు, రాత్రి విధులు నిర్వహించిన తరువాత అధికారులు విశ్రాంతి తీసుకునే సమయంలో అక్రమార్కులు గప్‌చిప్‌గా బుసకను తరలిస్తున్నారు. అధికారులు వచ్చే సమయంలో తవ్వకాలు, రవాణాను నిలిపివేస్తున్నారు. రెవెన్యూ శాఖ నుంచే అధికారులు దాడికి వస్తున్నారనే సమాచారం లీకవుతోందని, అందుకే అధికారులు రాని సమయంలో బుసక తవ్వకాలు, రవాణా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల రెవెన్యూ సిబ్బంది వెళ్లి బుసక తరలింపు నిలుపుదల చేయాలని చెప్పడంతో సదరు బుసక తరలింపు నిర్వహకుడు వారిపై కస్సుబుస్సులాడారు. ఇంటి అవసరాల నిమిత్తం తోలుకుంటున్నామని, ఎలా అడ్డుకుంటారని ఎదురుదాడికి దిగారు. బయట ప్రాంతాలకు వెళ్తే పట్టుకోవాలంటూ ఉచిత సలహా ఇవ్వడం గమనార్హం. ఇంటి అవసరాలకు బుసకను తరలించేందుకు జేసీబీలు అవసరం ఉండదు. అక్రమ రవాణా చేసేందుకే జేసీబీలను వాడుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. -
‘సాక్షి’ కార్యాలయంపై దాడికి ఖండన
చిలకలపూడి(మచిలీపట్నం): ఏలూరు ‘సాక్షి’ కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని మచిలీపట్నం మీడియా ప్రతినిధులు డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ డీకే బాలాజీని బుధవారం కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సంఘటనను పత్రికలో ప్రచురించినందుకు కోపోద్రిక్తుడై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు ఏలూరు ‘సాక్షి’కార్యాలయంపై దాడి చేయడం అమానుషమైన చర్య అన్నారు. ఎమ్మెల్యేతోపాటు 100మందికి పైగా అనుచరులు అక్కడ ఉన్న పాత్రికేయులపై దాడికి యత్నించడంతోపాటు కార్యాలయంలో ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారన్నారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల చర్య పత్రికా స్వేచ్ఛను కాలరాసేలా ఉందన్నారు. సమాజంలో జరుగుతున్న సంఘటనలు, ప్రజల సమస్యలకు అక్షరరూపం ఇస్తే అధికారమదంతో ఇలా దాడులకు పాల్పడటం తగదన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్ బాధితులను బెదిరింపులకు గురిచేయటం వాస్తవం కాకుంటే వారితో మాట్లాడుకోవాలే తప్ప జరిగిన సంఘటనను తెలియజేసిన పత్రికలపై అక్కసుతో ఈ విధంగా చేయడం భావ్యం కాదని హితవు పలికారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాలాజీకి విజ్ఞప్తి చేశారు. నిందితులను శిక్షించాలని కలెక్టర్‌కు వినతి -
55 వేల ఎకరాల్లో మామిడి..
ఎన్టీఆర్ జిల్లాలో 55 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో మామిడి సాగు అధికంగా ఉంది. గత నెలరోజుల్లో నాలుగుసార్లు గాలిదుమ్ములతో కూడిన వర్షాలు పడటంతో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. సాధారణంగా ఏప్రిల్ నెలలో మామిడి కోతలు ప్రారంభమై మే నెలాఖరుతో ముగుస్తాయి. అంతకుముందు మంచు కారణంగా పూత రాలింది. పూత నిలిచేందుకు రైతులు 5 నుంచి 10సార్లు మందులు స్ప్రే చేశారు. ఇందుకు అదనంగా రైతుకు ఎకరానికి రూ.15 నుంచి రూ.20 వేలు పెట్టుబడి అయింది. తరువాత మంగు తెగులు కారణంగా కొంతనష్టం వాటిల్లింది. గాలులు, వానలకు పెనుగంచిప్రోలులో నేలరాలిన మామిడి కాయలు(ఫైల్) -
బండెనక బండి కట్టి..
కంచికచర్ల: చందర్లపాడు మండలం తుర్లపాడులో నిర్వహించే బడేహజరత్ ఉరుసు ఉత్సవాలకు ముస్లింసోదరులు బుధవారం భారీగా తరలివెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుంచి ముస్లింలు ఎడ్లబండ్లతో ఉరుసు ఉత్సవాలకు హాజరయ్యేందుకు తరలివచ్చారు. ఉరుసు ఉత్సవాలకు తరలివెళ్లే ఎండ్లబండ్లను కంచికచర్ల మండలంలోని పెండ్యాల మున్నేటి తీరాన మాజీఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు బుధవారం ప్రారంభించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన ముస్లింలు బండెనక బండి కట్టి ఉరుసు ఉత్సవాలకు తరలివెళ్లారు. ఈసందర్భంగా డాక్టర్ జగన్మోహనరావు మాట్లాడుతూ మతాలకతీతంగా అందరూ ఉరుసు ఉత్సవాల్లో భాగస్వాములు కావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎడ్లబండ్లపై ఉత్సవాలకు వెళ్తున్న భక్తులకు మున్నేటి తీరాన ఎంపీపీ షేక్ మలక్‌బషీర్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. ఉరుసు ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్లబండ్ల సవారీలను చూసేందుకు పెండ్యాల మునేటి తీరానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యు లు షేక్ బడేహజరత్, వైఎస్సార్సీపీ నాయకులు జిల్లా వక్ఫ్‌బోర్డు డైరెక్టర్ షేక్ గౌస్‌పాషా, సయ్యద్ అహ్మద్, షేక్ పీర్సామియా, షేక్ చాన్బహుదూర్, ఫయీంపాష, అబ్దుల్కరీం, ఖాజాపాషా తదితరులు పాల్గొన్నారు. ఉరుసు ఉత్సవాలకు తరలిన ముస్లింలు -
జక్కంపూడి కాలనీలో కార్డన్ సెర్చ్
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో బుధవారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కాలనీలోని 20 బ్లాకుల్లోని 640 ప్లాట్లలో నివాసం ఉంటున్న ఆయా కుటుంబీకుల వివరాలు, ఆధార్ కార్డులను పోలీసులు తనిఖీ చేశారు. ఇన్చార్జి డీసీపీ గుణ్ణం రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావు పర్యవేక్షణలో కొత్తపేట సీఐ చిన్న కొండలరావు, వన్‌టౌన్ సీఐ గురుప్రకాష్, సీఐలు చంద్ర శేఖర్, ఉమామహేశ్వరరావు, కృష్ణమోహన్, లక్ష్మీనారాయణలతోపాటు పలుస్టేషన్లకు చెందిన ఎస్ఐలు, ఏఎస్ఐలతో కలిపి మొత్తం 130మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఇళ్లలో ఏవైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయేమోనని క్షుణ్నంగా పరిశీలించారు. ఆయా ప్లాట్లలో ఎంత కాలం నుంచి నివాసం ఉంటున్నారు..మీ చుట్టు పక్కల కొత్తగా ఎవరైనా అద్దెకు వచ్చారా..వారేమైనా అనుమానాస్పదంగా ఉన్నారా అని కాలనీవాసులను ఆరా తీశారు. కాలనీలో ఎవరైనా మద్యం, గంజాయి, ఇతర మత్తుమందులు విక్రయిస్తున్నారా? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. డ్రోన్ ద్వారా కాలనీ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ ఐరీష్ వాహనం ద్వారా 128మందికి ఐరీష్ తీయగా వారిలో ఐదుగురు అనుమానితులు ఉండటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. 350 బైక్‌లు, ఆటోల రికార్డులు పరిశీలించారు. సరైన ధ్రువీకరణపత్రాలు లేని 50 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఏడాదిలో రూ.5 లక్షల కోట్ల వ్యాపారం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒకటైన యూకోబ్యాంక్ గత ఆర్థిక సంవత్సరంలో ఐదు లక్షల కోట్ల వ్యాపారం చేసిందని ఆ బ్యాంక్ జోనల్ మేనేజర్ ఎన్.శ్రీకాంత్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పాతబస్తీ బ్రాహ్మణవీధిలో ఏర్పాటు చేసిన ఆబ్యాంక్ విజయవాడ వన్‌టౌన్ శాఖ నూతన ప్రాంగణాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ క్విట్ ఇండియా సమయంలో గాంధీజీ పిలుపు మేరకు దేశంలోని వ్యాపారవర్గాల కోసం జీడీ బిర్లా 1943లో యూకోబ్యాంకును స్థాపించారన్నారు. నాటినుంచి దేశంతోపాటు హంకాంగ్, సింగపూర్ తదితర దేశాల్లోనూ మూడువేలకు పైగా శాఖలతో సేవలందిస్తున్నట్లు వివరించారు. తమ బ్యాంకు ద్వారా వ్యవసాయ, పారిశ్రామిక, ఎంఎస్ఎంఈ రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి దేశాభ్యున్నతికి అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. కస్టమర్లకు గృహ, వాహన రుణాలను గంటల్లోనే మంజూరు చేస్తున్నామన్నారు. మొబైల్ బ్యాంకింగ్ సేవల్లో తమ బ్యాంక్ యాప్‌నకు టాప్ ర్యాంకింగ్ ఉందన్నారు. జోనల్లో ప్రస్తుతం 91శాఖలు ఉన్నాయని, మరో ఐదు శాఖలు త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. వన్టౌన్శాఖ మేనేజర్ యు. శ్రీనివాస్ మాట్లాడుతూ వన్‌టౌన్‌లో తమబ్యాంక్ 48 ఏళ్లుగా సేవలందిస్తున్నట్లు వివరించారు.యూకోబ్యాంక్ డీజీఎం శ్రీకాంత్ -
పల్లె పండుగ నిధులు మంజూరు ఎప్పుడో?
జగ్గయ్యపేట: ఉపాధి హామీ పథకంలో భాగంగా గతేడాది రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆర్భాటంగా పల్లె పండుగ, పంచాయతీ వారోత్సవాల పేరుతో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా మంజూరుకాలేదు. ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సిమెంట్ రోడ్లు, గ్రావెల్ పనులు, రోడ్డు చదు ను, పశువులషెడ్లు పనులకు బిల్లులు ఎప్పుడు మంజూరవుతాయోనని లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 624 పనులు కేటాయింపు... ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 16మండలాల్లో కలిపి రూ. 94.32కోట్ల విలువగల 624 పనులకు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోగా ఈ పనులు పూర్తిచేయాలని నిర్దేశించారు. వీటిలో 535 పనులు పూర్తికాగా, 63 పనులు ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. వత్సవాయి మండలంలో ఐదు పనులు, విజయవాడ–2, పెనుగంచిప్రోలు–4, వీరులపాడు–5, కంచికచర్ల–3, నందిగామ–2, ఏ.కొండురు మండలంలో ఐదు పనులు నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. పూర్తయిన పనులకు సంబంధించి కూటమి ప్రభుత్వం కేవలం రూ.6.8కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగిలిన నిధులను మంజూరు చేయకపోవడంతో కొత్త పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. 720 గోకులం షెడ్లు మంజూరు... పల్లె పండుగలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 720 పశువుల షెడ్లు మంజూరు కాగా ఇందులో 615 పూర్తయ్యాయి. ఇందులో కనీసం పదిశాతం నిధులు కూడా ప్రభుత్వం మంజూరు చేయలేదు. 559 షెడ్లకు సంబంధించి రూ.9కోట్ల మేర బిల్లులు ఇవ్వలేదు. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి షెడ్లు నిర్మాణం పూర్తిచేసుకుంటే ఇప్పటివరకు బిల్లులు ఇవ్వలేదంటూ రైతులు వాపోతున్నారు. ఇకనైనా కూటమి ప్రభుత్వం స్పందించి బిల్లులు మంజూరు చేయాలని కాంట్రాక్టర్లు, గోకులం షెడ్ల లబ్ధిదారులు కోరుతున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు రూ.100 కోట్ల పనులు పదిశాతం నిధులు కూడా ఇవ్వని కూటమి ప్రభుత్వం బిల్లుల కోసం కాంట్రాక్టర్ల ఎదురుచూపులు గోకులం షెడ్ల సబ్సిడీ నిధుల కోసం లబ్ధిదారుల వేడుకోలు బడ్జెట్ రాగానే బిల్లులు చెల్లిస్తాం... ఉపాధి హామీ పథకం, పంచాయితీరాజ్‌శాఖలో చేసిన పనులకు సంబంధించిన అన్ని బిల్లుల వివరాలను కూడా ప్రభుత్వానికి అందించాం. ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాగానే చేసిన పనులకు బిల్లులు చెల్లిస్లాం. –ఏ.రాము, డ్వామా పీడీ, విజయవాడ -
పది పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఆత్మహత్య
బంటుమిల్లి: పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్థాపానికి గురై బంటుమిల్లి మండల పరిధిలోని పెదతుమ్మిడి పంచాయితీ శివారు అర్జావానిగూడెం గ్రామానికి చెందిన గోవాడ మింటు(17) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండోసారి కూడా పరీక్షల్లో ఫెయిల్ కావడంతో కలత చెంది ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యాన్ డ్రైవరుగా పనిచేస్తున్న మింటు తండ్రి రామకృష్ణ డ్యూటీకి వెళ్లగా, పనుల నిమిత్తం తల్లి బయటకు వెళ్లింది. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న మింటు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు బలవన్మరణానికి పాల్పడటం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. స్థానికులు మింటు మృతదేహాన్ని సందర్శించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. చదువుల ఒత్తిడే చంపేసిందిపెనమలూరు: కానూరు ఇంజినీరింగ్ కాలేజీలో మృతి చెందిన బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న యార్లగడ్డ ఖ్యాతిశ్రీ (22) చదువుల ఒత్తిడితోనే మృతి చెందిందని ఆమె తండ్రి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పంచనామా చేశారు. కానూరు ఇంజినీరింగ్ కాలేజీలో ఖ్యాతిశ్రీ మంగళవారం హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకోని మృతిచెందడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆమెతండ్రి యార్లగడ్డ శ్రీనివాసరావు విజయవాడ జీజీహెచ్ వద్ద బుధవారం జరిగిన శవపంచనామాకు హాజరై తమ కుమార్తె ఖ్యాతిశ్రీ సెమిస్టర్ ఫలితాల్లో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయిందని తెలపడంతో ఈ మేరకు పోలీసులు కేసు పంచనామా పూర్తిచేశారు. ఖ్యాతిశ్రీ మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం చేశారు. -
చోరీసొత్తుతో పట్టుబడిన దొంగలు
గూడూరు: రెండు రోజులు క్రితం కంచాకోడూరులో చోరీకి పాల్పడిన దొంగలను, వారు దొంగిలించిన సొత్తుతో సహా బుధవారం గూడూరు పోలీసులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన మానికొండ కృష్ణారావు హైదరాబాదు వెళ్లగా ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న దొంగలు తలుపులు పగలగొట్టి ఇంట్లోని రెండు ఏసీలు, ఒక ఇన్వర్టర్, బ్యాటరీ, బీరువాలోని రెండు బంగారు ఉంగరాలు, మూడు లక్ష్మీదేవి రూపులు దొంగలించుకుపోయారు. కృష్ణారావు మేనమామ ఈమని కేశవరావు ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన గూడూరు ఎస్ఐ కె.సత్యనారాయణ అధునాతన టెక్నాలజీతో దొంగలతో పాటుగా వ్యానులో తరలిస్తున్న సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని కంచాకోడూరుకు చెందిన మేడా సాయి గణేష్, కోళ్ల చరణ్ తేజగా గుర్తించి వారిని అరెస్టుచేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
మామిడి రైతుకూ నష్టాలే
పెనుగంచిప్రోలు: ఈ ఏడాది మామిడి రైతులకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. కోలుకోలేని నష్టం వాటిల్లింది. సాధారణంగా మే నెలలో చెడుగాలులు, వానలు వస్తాయి. ఈసారి ఏప్రిల్ మొదటి వారం నుంచే అకాల వర్షంతోపాటు గాలి దుమ్ములు రావడంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోతకు వచ్చిన తరుణంలో అకాల వర్షం, గాలులకు మామిడి కాయలు నేల రాలాయి. కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో గాలివాన రావడంతో 40 నుంచి 60 శాతానికి పైగా కాయలు రాలిపోయాయి. గాలిదుమ్ము రాక ముందు మామిడి టన్ను రూ.40వేల నుంచి రూ.లక్ష వరకు పలుకగా ప్రస్తుతం టన్ను ధర రూ.30వేల నుంచి రూ.40వేలకు పడిపోయింది. కాయ నాణ్యత ఆధారంగా ధర మారుతోంది. కౌలురైతులకు మరింత నష్టం... ఎకరాకి రూ.20వేలు నుంచి రూ.30వేలు కౌలు చెల్లించి మామిడి తోటలను సాగుచేస్తున్న వారికి ఈ ఏడాది మరింత నష్టం వాటిల్లింది. తెగుళ్లతోపాటు గాలులకు కాయలు రాలడంతో కోలుకోలేని దెబ్బతిన్నారు. ఎకరానికి రూ.20వేలు నుంచి రూ. 25వేల వరకు నష్టాలు తప్పేలా లేవని కౌలురైతులు వాపోతున్నారు. జిల్లాలో మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లో గాలులు మామిడికాయలు భారీగా నేలరాలడంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు ఉద్యానవనశాఖ అధికారులు చెబుతుండగా, నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మామిడిచెట్లకు తొలుత తెగుళ్లు.. ఇటీవల గాలి దుమారం.. అకాల వర్షాలు కోత సమయాన నేలరాలిన కాయలు తీవ్రనష్టాల్లో మామిడిసాగు రైతులు -
రూ.లక్షకు పైగా నష్టం తప్పేలా లేదు
ఈ ఏడాది ఐదెకరాలు మామిడి తోట కౌలుకు తీసుకున్నాను. గాలిదుమ్ములు రాక ముందు టన్ను రూ.లక్ష వరకు ఉంది. ఇప్పుడు టన్ను రూ.30వేలు నుంచి రూ.40వేలు మాత్రమే ఉంది. ఐదెకరాలపై రూ.లక్షకుపైగా నష్టం వచ్చేలా ఉంది. ధర పెరిగితేనే నష్టాల ఊబి నుంచి గట్టెక్కగలం. – దారా వెంకటేశ్వర్లు, కౌలురైతు, పెనుగంచిప్రోలు అనుకూలించని వాతావరణం ఈ ఏడాది మామిడికి వాతావరణం అనుకూలించలేదు. పూత ఆలస్యం కావడంతోపాటు పూత దశలో నల్లతామర, మంగుపురుగు, తెగుళ్లతో కాపు తగ్గింది. కోత సమయంలో గాలులు, వానలకు అధికశాతం కాయ నేలరాలింది. తెగుళ్ల నివారణ మందులు కొట్టేందుకు ఎకరానికి రూ.20వేలు దాకా ఖర్చులు అయ్యాయి. – తిరుపతిరావు, కౌలు రైతు, పెనుగంచిప్రోలు ● -
ఎలక్ట్రిక్ బైక్ దొంగలు ముగ్గురు అరెస్టు
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఎలక్ట్రిక్ బైక్‌లను చోరీ చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద 22 ఎలక్ట్రిక్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నామని సెంట్రల్ ఏసీపీ కె.దామోదర్ తెలిపారు. స్థానిక మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఆయన సోమవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఏసీపీ దామోదర్ కథనం మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఎస్కే బాషా (35), ఉండికి చెందిన జక్కంశెట్టి దుర్గాప్రసాద్ (26), విజయవాడ వాంబేకాలనీకు చెందిన సయ్యద్ యూసఫ్ (28) స్నేహితులు. కారు డ్రైవర్‌గా పనిచేసే బాషా వచ్చే ఆదాయం సరిపోక ఎలక్ట్రిక్ బైక్ రిపేరింగ్ నేర్చుకుని మెకానిక్ షాపు పెట్టుకున్నాడు. అందులోనూ ఆదాయం అంతంత మాత్రంగా ఉండటంతో తాను నేర్చుకున్న విద్యను ఉపయోగించి ఎలక్ట్రిక్ బైక్‌లకు చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకు న్నదే తడవుగా తన స్నేహితులైన దుర్గాప్రసాద్, యూసఫ్‌తో కలిసి చోరీలు ప్రారంభించారు. ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, కై కలూరు, తాడేపల్లి, విజయవాడ తదితర ప్రాంతాల్లో 22 వాహనాలను చోరీ చేశారు. మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎలక్ట్రికల్ బైక్‌ల చోరీపై పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. స్పందించిన పోలీసులు పోలీసు కమిషనర్ ఆదేశానుసారం ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో మాచవరం ఇన్స్పెక్టర్ సీహెచ్.ప్రకాష్ తమ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎలక్ట్రికల్ బైక్‌ల చోరీలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ నెల 21వ తేదీన మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా రెండు ఎలక్ట్రికల్ ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఈ విచారణలో వారు చేస్తున్న ఎలక్ట్రిక్ బైక్‌ల చోరీల విషయం బయటపడింది. వారు దొంగిలించిన 22 ద్విచక్రవాహనాలను పొలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన మాచవరం ఇన్స్పెక్టర్ సీహెచ్ ప్రకాష్, ఎస్ఐ ఎ.వి.శ్రీనివాస్, పోలీస్ కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు అభినందించారు. రూ.10 లక్షల విలువైన 22 వాహనాలు స్వాధీనం -
దేవాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం
విజయవాడ కల్చరల్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దేవాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. తిరుమలలో నిత్యం వివాదాలు చోటు చేసుకుంటు న్నాయని, ఇది రాష్ట్రానికే అరిష్టమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆధ్వర్యంలో మంగళ వారం లబ్బీపేట వేంకటేశ్వరస్వామి దేవస్థాన ప్రాంగణంలో ‘హిందూ ధర్మం.. గోమాత విశిష్టత’ అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనాథ సరస్వతి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన సాధువులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సాధు సంతులపై చేస్తున్న దాడులను ఆపాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. దేవాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని, తిరుమలలో నిత్యం వివాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో హిందు వులు పవిత్రంగా భావించే గోవులు మరణిస్తుంటే ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోందని దుయ్యబట్టారు. సాధు శ్రీశివానంద సరస్వతి మాట్లాడుతూ.. తిరుమలలో అవనీతి రాజ్యమేలుతోందని, ఆగమ శాస్త్రా లకు విరుద్ధంగా కైంక ర్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి నెలా గోవులు మరణిస్తుంటే కాకతాళీయం అంటూ కప్పిపుచ్చుతున్నారని విమర్శించారు. మన గుడి – మన గోవు, మన ధర్మం నినాదం ఇంటింటా మారుమోగాలని సూచించారు. అవధాని డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి ఆలయంలో గోవులను పెంచాలని, వాటి నిర్వహణను గోసంరక్షకులే చూసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో దయానంద సరస్వతి, పూర్ణానంద స్వామి, శివస్వామి, లక్ష్మీశివనందస్వామి, స్వామి సత్యజ్ఞానానంద, ఆత్మానంద స్వామి, సత్యనారాయణ స్వామి, ఓంకార స్వామి పాల్గొన్నారు. తిరుమలలో నిత్యం వివాదాలు సాధు సంతులపై తక్షణం దాడులను అరికట్టాలి రాష్ట్రస్థాయి సదస్సులో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు -
మొక్కజొన్నకు ఆధరణ కరువు
కంకిపాడు: మొక్కజొన్న రైతులను ఆదుకోవటంలో కూటమి సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు దక్కటం లేదు. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా మార్కెట్లో ధర పతనం కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాలను తెరిపించి మద్దతు ధర దక్కేలా చర్యలు చేపట్టాల్సిన సర్కారు మీనమేషాలు లెక్కించటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రోజుకో విధంగా వాతావరణ పరిస్థితులు మార్పు చెందుతుండటంతో రైతుల్లో ఆందోళన అధికమవుతోంది. 11,875 ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రబీ సీజన్లో 11,875 ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు జరిగింది. 20 రోజులుగా మొక్కజొన్న కోతలు జరుగుతున్నాయి. కండెలు ఎండబెట్టి, యంత్రాలతో గింజ వేరు చేసి కల్లాల్లో ఎండబెడుతున్నారు. గింజ వేరు చేయటం, ఎండబెట్టే పనుల్లో రైతులు, కూలీలు నిమగ్నమయ్యారు. ఎకరాకు కౌలు రూ.12 వేలు, పెట్టుబడులు కింద రూ.35 వేల నుంచి రూ.45 వేల వరకూ రైతులు పెట్టుబడులు పెట్టారు. ఎకరాకు మాగాణి పొలాల్లో 35, మెట్ట పొలాల్లో 45 నుంచి 50 బస్తాల వరకూ దిగుబడులు వస్తున్నాయి. దళారుల సిండికేట్ మాయ పంట చేతికి వచ్చి మార్కెట్‌కు తరలించేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. పంట రాక ముందు క్వింటా ధర రూ.2400 వరకు పలికింది. ప్రస్తుతం రూ.2 వేలకు మించి పలకటం లేదు. దళారులు అంతా సిండికేటై ధర నిర్ణయం చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఆశించిన ధర దక్కటం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం క్వింటా మద్దతు ధర రూ.2,225గా నిర్ణయించింది. ఆ ధర కూడా చేతికి అందకపోవటంతో ఆర్థికంగా నష్టపోతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు అకాల వర్షాలు, మారుతున్న వాతావరణ పరిస్థితులు కారణంగా ఎప్పుడెలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న భయం రైతులను వణికిస్తోంది. మూడు ఎకరాల్లో మొక్కజొన్న కౌలు చేశాను. పంట చేతికొ చ్చింది. కంకిపాడు యార్డులో ఆరబెడుతున్నాం. మార్కెట్లో గిట్టుబాటు రేటు లేదు. కొనుగోలు కేంద్రం తెరిస్తే మొక్కజొన్న పంట విక్రయించాలని అనుకుంటున్నాం. కేంద్రం ఎప్పుడు తెరుస్తారో? ఏమో? అర్థం కావటం లేదు. – గడ్డం రాజా, కౌలురైతు, గొడవర్రు, కంకిపాడు మండలం నేను మూడు ఎకరాల్లో మొక్క జొన్న సాగు చేశాను. మాగాణిలో 30 నుంచి 35 బస్తాలు, మెట్టలో 45 బస్తాల పైగా దిగుబడులు వస్తున్నాయి. ప్రభుత్వం చెప్పిన మద్దతు ధరకు మార్కెట్లో ధరకు పొంతన లేదు. క్వింటా ధర రూ.2 వేలకు మించి పలకటం లేదు. బయటి వ్యాపారులే కొనుగోలు చేస్తున్నారు. – కాటూరి శివప్రసాద్, కౌలురైతు, వల్లూరుపాలెం, తోట్లవల్లూరు మండలం వైఎస్సార్ సీపీ పాలనలో రైతులకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచి భరోసా అందించింది. రబీ సీజన్లో కురిసిన అకాల వర్షాలతో పంట దెబ్బతిని నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. అప్పటి వరకూ క్వింటా రూ.1600 మాత్రమే ధర పలికి ఆర్థికంగా నష్టపోతున్న పరిస్థితి. ఆ స్థితిలో యుద్ధప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలను తెరిచి కొనుగోళ్ల విషయంలో నిబంధనలు సడలించి మొక్కజొన్న కొనుగోళ్లు సాగేలా నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవ టంతో రైతులకు ఊరట చేకూరిన విషయం విదితమే. కొనుగోలు కేంద్రాలపై స్పష్టత ఇవ్వని సర్కారు మొక్కజొన్న పంటకు దక్కని మద్దతు ధర వాతావరణ మార్పులతో రైతుల్లో ఆందోళన రైతుల శ్రమను నిలువునా దోచేస్తున్న వ్యాపారులు జాడలేని కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు తెరుస్తారో? ఏమో? రూ.2 వేలకు మించడం లేదు నాడు రైతులకు అండగా.. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు మద్దతు ధర కంటే తక్కువకే వ్యాపారులకు విక్రయిస్తున్నారు. రైతులు నష్టపో కుండా చూడాల్సిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. దళారుల చెర నుంచి రైతులను ఒడ్డున వేసేందుకు సాగు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. కానీ నేటి వరకూ కొనుగోలు కేంద్రాల ఊసు లేదు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం కొనుగోలు కేంద్రాలు తెరిచే విషయమై స్పష్టత ఇవ్వటం లేదు. రైతు సంక్షేమాన్ని యోచించి వెన్నుదన్నుగా నిలవాల్సిన పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. -
● అన్నదాతల బలవన్మరణం ● అందని పరిహారం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇటీవల కాలంలో అన్నదాతల బలవన్మరణాలు జరుగుతున్నాయి. పంటకు ధర రాక.. ప్రభుత్వం పట్టించుకోపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. అప్పలభారం భరించలేక కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బలవన్మరణాలకు పాల్పడిన రైతులకు ప్రభుత్వం రూ. 7లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాల్సి ఉంది. ఇది సకాలంలో అందడం లేదు. దీనికి కారణం నిబంధనలు ప్రతిబంధకంగా మారడమే. ఆత్మహత్యకు పాల్పడిన రైతుకు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు అన్ని అర్హతలు ఉన్నా.. కొందరు అధికారులు కొర్రీలు వేస్తున్నారు. వీఆర్వో నుంచి కమిషనర్ వరకు వివిధ స్థాయిల్లో నెలల తరబడి ఎక్స్‌గ్రేషియా అంశం పెండింగ్‌లో ఉంటోంది. వివిధ స్థాయిల్లో పెండింగ్ ఎన్టీఆర్ జిల్లాలో గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 8 మంది రైతులు, కౌలు రైతులు అప్పుల పాలై బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీరిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదుగురు రైతుల ఎక్స్‌గ్రేషియా ఫైల్స్ వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయి. మరో ముగ్గురు రైతులకు సంబంధించి వీఆర్వో, తహసీల్దార్ స్థాయిలోనే ఎటూ తేలకుండా నిలిచిపోయి ఉన్నాయి. పంచనామా, పోస్టుమార్టం వంటి ప్రక్రియలు పూర్తైనా ఎక్స్‌గ్రేషియా ఫైల్ ముందుకు కదలడం లేదు. వత్సవాయి మండలం భీమవరానికి చెందిన పిట్టంపల్లి కోటయ్య, కొత్త వేమవరానికి చెందిన కస్తూరి గోపి ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ఫైల్స్ ఏ దశలో ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. కొడవటికల్లుకు చెందిన గుడిపాటి నాగభూషణం, కొత్తపాలెంకు చెందిన పసుపులేటి పూర్ణచంద్రరావు, గంపలగూడెంకు చెందిన చిన్ని కృష్ణ, అనుముల్లంక, షేర్‌మహ్మద్‌పేటకు చెందిన మార్తి తిరుపతిరావు, జయంతిపురంలోని నల్లమట్టి రాంబాబు ఫైల్స్ వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయి. అన్నదాత సుఖీభవ ఏమైంది..? అధికారంలోకి రాగానే రైతులకు ఏటా రూ. 20వేలు పెట్టుబడి సాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత ప్రభుత్వంలో ఉన్న రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవగా పేరు మార్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వ్యవసాయ సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లు ముగిశాయి. కానీ పెట్టుబడి సాయం రాలేదు. పంటలకు గిట్టుబాటు ధర ఊసే లేదు. మరింత మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడకముందే ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. -
ఆయువు తీస్తున్న అప్పులు
దిక్కు తోచని స్థితిలో .. ఈ ఫొటోలో కనిపిస్తోంది చిట్టిబొమ్మ చిన్ని కృష్ణ, ఊరు గంపలగూడెం మండలం అనుముల్లంక. ఇతనికి 1.80 ఎకరాలు సొంత భూమి ఉంది. దీనితోపాటు మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని ఆ భూమిలో మిర్చి సాగు చేశాడు. పెట్టుబడులు, ఎరువులు పురుగు మందుల కోసం వేర్వేరు చోట్ల రూ.20లక్షలు అప్పు చేశాడు. సొంత భూమిని తనఖాపెట్టి మరికొంత అప్పు తెచ్చాడు. పంటల్లో పూర్తిగా నష్టం వచ్చింది.నిత్యం తన అప్పులు ఎలా తీరుతాయంటూ కుటుంబ సభ్యుల వద్ద బాధపడుతూ తన పొలంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఆ కుటుంబం ప్రభుత్వ పరిహారం కోసం ఎదురు చూస్తోంది. ● -
మలేరియా, డెంగీ రహిత జిల్లాగా తీర్చిదిద్దండి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాను మలేరియా, డెంగీ రహితంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించు కుని చేపట్టాల్సిన కార్యక్రమాలపై కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 25వ తేదీ ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ స్థాయిలో ప్రతి కుటుంబానికి దోమల వ్యాప్తిపై రూపొందించిన కర్ర పత్రాన్ని వైద్య ఆరోగ్య, సచివాలయ అధికారులు తప్పనిసరిగా అందించి అవగాహన కల్పించాలన్నారు. 2030 నాటికి దేశ వ్యాప్త మలేరియా నిర్మూలన లక్ష్యానికి ముందే మలేరియా, డెంగీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు.ఈ సమావేశంలో విజయవాడ మునిసిపల్ కమిషనర్ హెచ్.ఎం.ధ్యానచంద్ర, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని, అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ జూపూడి ఉషారాణి, జిల్లా మలేరియా అధికారి మోతిబాబు, డీపీఓ పి.లావణ్య కుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డీఎంఎఫ్ విజయ కుమారి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అధ్యక్షుడు డాక్టర్ బి.హనుమయ్య, డీసీహెచ్ఎస్ డాక్టర్ కె.వి.ఎస్. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు. -
బాలుడిని కాపాడబోయి యువకుడి దుర్మరణం
గుడివాడరూరల్: విద్యుదాఘాతానికి గురైన బాలుడిని కాపాడబోయి ఓ యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. మల్లాయపాలెం పరిధిలోని టిడ్కో సముదాయంలో నివసించే బాలుడు సంతోష్ తమ ఇంటి ముందు విద్యుత్ సర్వీస్ వైరుకు సపోర్టుగా వేలాడుతున్న జియో వైరును పట్టుకుని విద్యుదాఘాతానికి గురయ్యాడు. అదే ప్రాంతానికి చెందిన దొండపాటి తేజ(27) బాలుడిని పట్టుకుని పక్కకు లాగేశాడు. అయితే ఆ వైరు తేజ వీపుభాగంలో తాకడంతో అతను కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. రామస్వామి, మరో ఇద్దరు వారిని కాపాడే ప్రయత్నంలో స్వల్పంగా విద్యుదాఘాతానికి గురయ్యారు. సంతోష్, తేజను స్థానికులు హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన తేజ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడు, మరో ఇద్దరికి స్వల్పంగా గాయపడ్డారు. తేజ గతంలో నందిగామ పట్టణం రమణకాలనీలో భార్యాపిల్లలతో జీవించేవాడు. గుడివాడలో జరుగుతున్న ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులు చేసేందుకు గుడివాడ వచ్చి టిడ్కో సముదాయంలో ఉంటున్నాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందడంతో అతనితో పాటు పని చేసే స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. గుడివాడ తాలూకా ఎస్ఐ ఎన్. చంటిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దుర్గమ్మ సేవలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ మంగళవారం కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన కలెక్టర్ లక్ష్మీశకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈఈ కోటేశ్వరరావు, ఏఈవో చంద్రశేఖర్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టు వస్త్రాలను అందజేశారు. హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యాన హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. నగరంలోని షాజహర్ ముసాఫిర్ఖానా ప్రాంగణంలో జరిగిన కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.సుహాసిని ప్రారంభించారు. ఏటా హజ్ యాత్రికులకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వ్యాక్సినేషన్ చేయడం పరిపాటి. అందులో భాగంగా జిల్లాకు చెందిన 63 మంది యాత్రికులకు వ్యాక్సినేషన్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ ఇన్చార్జి అధికారి డాక్టర్ పద్మావతి, డాక్టర్ ఉస్మాన్, డాక్టర్ రాజా, డాక్టర్ కార్తీక్ పాల్గొన్నారు. ఆ కళాశాలలపై చర్యలు తీసుకోండి: ఏబీవీపీ మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వివిధ పోటీ పరీక్షలు, బెటర్మెంట్, సప్లిమెంటరీ పరీక్షల పేరుతో వేసవి సెలవుల్లో రెగ్యులర్ తరగతులు నిర్వహిస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సభ్యులు ఇంటర్మీడియెట్ బోర్డ్ కమిషనర్ కృతికా శుక్లాకు వినతిపత్రం అందజేశారు. తాడేపల్లిలోని బోర్డు కార్యాలయంలో మంగళవారం ఆమెను కలిసి వినతిపత్రం ఇచ్చామని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట గోపి తెలిపారు. ఏటా వేసవి సెలవులు ప్రకటించిన తర్వాత ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు పోటీ పరీక్షల ప్రిపరేషన్ పేరుతో రెగ్యులర్ తరగతులను నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ముందుగానే అధికారులకు తెలియజేస్తున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న ప్రయివేటు కళాశాలలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. వీటితో పాటుగా కార్పొరేట్ కళా శాలలు ఒకచోట గుర్తింపు పొంది అనేక చోట్ల కాలేజీలు నిర్వహిస్తున్నాయని వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిషత్ రాష్ట్ర కార్య సమితి సభ్యులు దుర్గారావు, శ్యామ్, మోజేస్, చరణ్ వినతిపత్రం అందజేసిన వారిలో ఉన్నారు. కిశోర బాలికల సమగ్రాభివృద్ధికి చర్యలు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు నగరంలోని ఓ హోటల్లో కిశోర బాలల ప్రత్యేక క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్లు ఎం.శిరీష, బి.మనోరంజని పాల్గొన్నారు. మే 2వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు కిశోర బాలికలకు వేసవి సెలవుల్లో నిర్వహించాల్సిన అవగాహన కార్యక్రమాలపై కుమారి మేరీ జోన్స్, యునిసెఫ్ టీం సభ్యులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలిపారు. బాల్య వివాహాలు, రుతుక్రమ పరిశుభ్రత, బాలల హక్కులు, పోషణ, ఆరోగ్యం, లింగ సమానత్వం, విద్య ఆవశ్యకత, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై వివరించారు. కిశోర వికాసంపై గ్రామస్థాయిలో నిర్వహించాల్సిన ప్రణాళికపై జిల్లాల వారీగా కార్యాచరణ నివేదికను రూపొందించారు. కార్యక్రమంలో మహిళాభివృద్ధి ,శిశు సంక్షేమ శాఖ అడిషనల్ అధికారి ఎస్.నాగ శైలజ, ఎన్టీఆర్, కృష్ణా జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ, సాధికారత అధికార్లు డి.శ్రీలక్ష్మి, ఎం.ఎస్ రాణి తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణాజిల్లా
బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025యోగ శిక్షణ ప్రారంభం భవానీపురం: అమరావతి యోగా, ఏరోబిక్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం వేసవి ఉచిత యోగ శిక్షణ శిబిరాన్ని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర ప్రారంభించారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 514.60 అడుగుల వద్ద ఉంది. ఇది 139.6134 టీఎంసీలకు సమానం. అభివృద్ధి పనుల పరిశీలన ఇంద్రకీలాద్రి: దుర్గగుడిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను టెక్నికల్ బృంద సభ్యులు మంగళవారం పరిశీలించారు. ఇంజినీరింగ్ అధికారులకు పలుసూచనలు చేశారు. 7 -
● క్రికెట్ క్రేజ్‌ను సొమ్ము చేసుకుంటున్న వెబ్సైట్లు, యాప్ నిర్వాహకులు ● స్మార్ట్ ఫోన్లో బెట్టింగ్ బోర్డులు ● మ్యాచ్ చూస్తూనే వెబ్సైట్, యాప్‌లలో పందేలు ● జిల్లాలో ఊరికో బుకీ ● ఉమ్మడి కృష్ణా జిల్లాలో భారీగా బెట్టింగ్‌ల జోరు ● పోలీసుల అదుపులో బుకీలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: క్రికెట్ క్రేజ్ అభిమానుల ఉసురు తీసే స్థాయికి తీసుకెళ్లింది. బెట్టింగ్ భూతం అభిమానులను వెంటాడుతోంది. చివరకు అప్పులు పాలై ఆత్మహత్యలు జరుగుతున్న ఘటనలూ ఉన్నాయి. స్మార్ట్ యుగంలో బెట్టింగ్‌ను వెబ్సైట్, యాప్ నిర్వాహకులు సులభతరం చేసేశారు. ప్రత్యేక ప్రోగామింగ్తో రూపొందించుకున్న యాప్, వెబ్సైట్లను క్రికెట్ అభిమానుల అరచేతిలోకి చేర్చారు. ప్రస్తుతం పలు యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. టాస్ ప్రారంభం నుంచీ, బంతి బంతికీ, మ్యాచ్ ముగిసే వరకు బెట్టింగ్ కొనసాగుతూనే ఉంటుంది. రూ.100కు రూ.500, మ్యాచ్ స్వభావాన్ని బట్టి రూ.500కు 50,000 చెల్లింపులు అంటూ పందెపు రాయుళ్లను ఆకర్షిస్తుంటారు. నగదు లావాదేవీలకు యూపీఐ యాప్‌లను వినియోగిస్తున్నారు. రాజస్తాన్, పంజాబ్ కేంద్రంగా ఈ దందా కొనసాగు తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. వాడవాడలా.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఐపీఎల్ బెట్టింగ్ భూతం వాడవాడలా విస్తరించింది. విజయవాడ నగరంలోని సీతన్నపేట, శ్రీనగర్‌కాలనీ, లోటస్, ముత్యాలంపాడు, పటమట, బావాజీపేట, కృష్ణలంక, నున్న, గన్నవరం, ప్రసాదంపాడు, కంకిపాడు, పటమట, చిన అవుటపల్లి, పెద అవుటపల్లి, ఇలా తదితర ప్రాంతాల్లో మెయిన్ బుకీలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. రంగంలోకి దించేదిలా... యాప్/వెబ్సైట్ నిర్వాహకులకు వీరు నేరుగా అందుబాటులో ఉంటారు. వీరి నుంచి కొందరు స్థానిక యువత యాప్/వెబ్సైట్లను ప్రాంచైజీలుగా తీసుకుని క్షేత్ర స్థాయిలోకి బెట్టింగ్‌ను విస్తరించారు. స్థానికంగా ఉన్న బుకీ ముందుగా ఆ ప్రాంతాల్లోని యువత నంబర్లను సేకరించి వాట్సాప్ చాటింగ్ ద్వారా బెట్టింగ్‌లోకి దింపుతారు. వారి వాట్సాప్‌కు యాప్/వెబ్సైట్ లింక్, యూజర్‌నేమ్, పాస్వర్డ్ పంపుతారు. లింక్ క్లిక్ చేయగానే యాప్/వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత అందులోని ఆఫర్లు, మ్యాచ్ జరిగే తీరు ఆధారంగా బెట్టింగ్ జరుగుతుంటుంది. పందెం వేయాలనుకుంటే వాట్సాప్‌లో స్థానిక బుకీకి మెసేజ్ చేయాలి. అతని నుంచి ఓకే అని మెసేజ్‌తో పాటు యూపీఐ క్యూఆర్ కోడ్ పంపిస్తారు. దాన్ని స్కాన్ చేసి నగదు చెల్లించి, ఆ స్క్రీన్ షాట్ మళ్లీ వాట్సాప్ గ్రూప్‌లో అప్లోడ్ చేయగానే స్థానిక బుకీ వెబ్సైట్/యాప్‌లోని బెట్టింగ్ రాయుడి వాలెట్లో నగదు జమ చేస్తాడు. అక్కడ నుంచి బెట్టింగ్ ప్రారంభమవుతుంది. పోలీసుల అదుపులో బుకీలు ఉమ్మడి కృష్ణా , గుంటూరు, ఏలూరు జిల్లాల్లో నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని, విదేశాల్లో ఉండి యాప్ నిర్వహిస్తున్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఇప్పటికే విజయవాడ సీసీఎస్ క్రైం పోలీసులు పలువురిని ఆదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం. లక్షకు రూ.1000 కమిషన్‌ను గ్రామాల్లో ఏజెంట్లకు ఇస్తున్నారు. కాకినాడకు చెందిన పండు రాధే ఎక్స్చేంజ్ బెట్టింగ్ యాప్ తయారు చేయించి, పలువురిని అడ్మిన్‌గా నియమించుకొని బెట్టింగ్‌ను విస్తరించారు. ఇప్పటికే పోలీసులు ప్రసాదంపాడుకు చెందిన కట్టవరపు భాను ప్రసాద్, గన్నవరం మండలం అల్లవరానికి చెందిన కె.రత్నబోసు, కంకిపాడు మండలం మంటాడకు చెందిన కొండేటి గురువెంకటదాస్, ఉంగుటూరు మండలం పెద్ద అవుటుపల్లికు చెందిన ఎస్కే సుభాని, చిన్న అవుటపల్లికి చెందిన కాకి సతీష్‌బాబు, చిల్లి అశోక్‌కు 41ఏ నోటీసులు ఇవ్వడంతో పాటు, వీరిలో కొంత మందిని అదుపులోకి తీసుకొని...బెట్టింగ్ , బెండ్ తీసే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు క్రికెట్ అభిమానులు, కోట్లాది రూపాయల డబ్బును పోగొట్టుకున్నట్లు సమాచారం. -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
పెనమలూరు: తాడిగడప గ్రామంలో వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం తాడిగడప గ్రామం మహాగణపతినగర్కు చెందిన ఉత్తరవల్లి రాజేశ్వరి, భర్త శంకరరావు(36) ఇద్దరు కుమారులతో నివాసం ఉంటున్నారు. రాజేశ్వరి రెస్టారెంట్లో పని చేస్తుండగా భర్త శంకరరావు విద్యుత్ పనులు చేస్తారు. వీరు ఇటీవల ఇల్లు నిర్మించుకున్న సమమంలో రూ.20 లక్షలు అప్పు చేశారు. అప్పుల భారం అధికం కావటంతో శంకరరావు ఆందోళన చెందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం భార్య డ్యూటీకి వెళ్లిన సమయంలో శంకరరావు బెడ్ రూమ్‌లో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకున్నాడు. రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): గుంటుపల్లి రైల్వే వ్యాగన్ వర్క్‌షాపు రోడ్డులోని సిమెంట్ వర్క్స్ కంపెనీ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు సోమవారం గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వయసు 35 ఏళ్ల లోపు ఉంటాయని, ఎత్తు 5.4 అడుగులు, బ్లూ కలర్ ప్యాంటు, రెడ్ కలర్ బన్నీ, మెడలో తాయత్తు కలిగి ఉన్నాడన్నారు. ఆచూకీ తెలిసిన వారు 94406 27084, 90591 21109, 0866–2882333 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సెక్టార్ ఎస్ఐ విజయలక్ష్మి తెలిపారు. బైక్ ఢీ కొని వ్యక్తి మృతి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బైక్ యూ టర్న్ తీసుకుంటుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో బైక్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన సూరాయపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సూరాయపాలేనికి చెందిన తంగెళ్లమూడి శ్రీనివాసరవికుమార్(51) గొల్లపూడిలోని హోల్‌సేల్ మార్కెట్లో ముఠా పని చేస్తుంటాడు. సోమవారం ఉదయం చేపలు తేవడానికి ద్విచక్ర వాహనంపై తుమ్మలపాలెం వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తూ ముత్తవరపు వెంకటేశ్వరరావు గెస్ట్‌హౌస్ వద్ద యూ టర్న్ తీసుకుంటుండగా వెనుక నుంచి వచ్చిన భైక్ ఢీ కొట్టింది. దీంతో శ్రీనివాసరవికుమార్కు తలకు గాయమైంది. స్థానికులు అతనిని గొల్లపూడిలోని ఆంధ్రా హాస్పిటల్లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడి భార్య ఆదిలక్ష్మి ఇచ్చిన పిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. -
కోర్టు కేసుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
చిలకలపూడి(మచిలీపట్నం): కోర్టు కేసులకు సంబంధించి వకాలత్ లేదా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులను ఉపేక్షించేది లేదని, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. నగరంలోని కలెక్టరేట్ మీ కోసం సమావేశ మందిరంలో మీ కోసం కార్యక్రమానికి ముందుగా కలెక్టర్ జిల్లా అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించి, వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోర్టు కేసులకు సంబంధించి ఎప్పటికప్పుడు స్పందించి వకాలత్‌లు లేదా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలన్నారు. కోర్టు కేసులంటే చాలా మంది అధికారులు సర్వ సాధారణంగా తీసుకుంటున్నారని, కేసు రేపు వాయిదా ఉండగా ముందు రోజు స్పందిస్తున్నారని, ఇది సరైన విధానం కాదన్నారు. ముందుగా తెలిసినప్పటికీ దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోకుండా చివరి నిమిషం వరకు ఆగి తన వద్దకు రావడం సరికాదని హితవు పలికారు. ఎవరైనా జిల్లా అధికారి కోర్టు ధిక్కరణకు సంబంధించి నిర్లక్ష్యం వహించి కలెక్టర్‌గా తాను హాజరయ్యే పరిస్థితి తీసుకొస్తే ఉపేక్షించేది లేదని, చివరిసారిగా మరోసారి హెచ్చరిస్తున్నారన్నారు. పీ 4 ఆదర్శ కుటుంబం వాట్సాప్ గ్రూప్.. ప్రతి ఒక్క కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఈహెచ్ఎస్(ఉద్యోగుల ఆరోగ్య పథకం) కింద కార్డులు జారీ అయ్యేలా సంబంధిత జిల్లా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ బాలాజీ చెప్పారు. ఇందుకు సంబంధించి త్వరలో ఒక రోజు సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తామన్నారు. ఆలోగా ఈహెచ్ఎస్లో ఉద్యోగుల పేర్లు నమోదు చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేసి వెంటనే నివేదికను అందజేయాలని సూచించారు. గతేడాది నూతన ప్రభుత్వం సాధించిన ప్రగతి, విజయాలపై ఒక పుస్తకం రూపొందిస్తున్నామని అందుకు సంబంధించిన గణాంక వివరాలు, ఫొటోలు, ప్రజల అభిప్రాయాలతో నివేదికను వెంటనే అందజేయాలన్నారు. నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు మిగిలిన అధికారులతో ఒక బృందంగా ఏర్పడి పీ 4 మార్గదర్శి ఆదర్శ కుటుంబం కార్యక్రమం కింద వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇటీవల ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన పేద విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించి వారు ఉన్నత చదువులు చదువుకోవడానికి ధనికులతో అనుసంధానం చేసి అవసరమైన కోచింగ్ వసతి కల్పించేందుకు కృషి చేయాలన్నారు. 24న డీఆర్సీ సమావేశం.. ఈ నెల 24వ తేదీన జిల్లా సమీక్షా సమావేశం(డీఆర్సీ) జిల్లా ఇన్చార్జి మంత్రివర్యుల అధ్యక్షతన జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ప్రగతి నివేదికలు ఇవ్వని అధికారులు వెంటనే నివేదికలు అందజేయాలని సూచించారు. మీ కోసం అర్జీల పరిష్కారంలో జిల్లా అట్టడుగు స్థాయిలో ఉండటం విచారకరమన్నారు. ఇకనైనా సకాలంలో అర్జీలన్నీ పరిష్కరించి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్నారు. అర్జీదారులతో మర్యాదగా మాట్లాడాలని ఈ విషయమై కిందిస్థాయి అధికారులు సిబ్బంది వరకు సమాచారం చేరవేయాలని సూచించారు. గడువు మీరిన అర్జీలు ఇంకా 28 ఉన్నాయని అత్యధికంగా పోలీస్ శాఖలో అపరిష్కృతంగా ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాల నుంచి వచ్చిన అర్జీలకు కలెక్టరే సంతకం చేసి పంపిస్తేనే అది పరిష్కరించినట్లు అవుతుందని ఈ విషయం ప్రతి అధికారి గుర్తుంచుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ ఎస్డీసీ శ్రీదేవి, జెడ్పీ సీఈఓ కన్నమ నాయుడు, డ్వామా డీఆర్డీఏ పీడీలు శివప్రసాద్, హరిహరనాథ్, డీఎస్ఓ పార్వతి, డీఎంహెచ్ఓ శర్మిష్ట, పౌరసరఫరాల సంస్థ డీఎం పద్మావతి, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు లోకేశ్, నటరాజు, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి వెంకట్రావు, డీపీఓ అరుణ, సీపీఓ గణేషు, జిల్లా వ్యవసాయ అధికారి మనోహర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డీకే బాలాజీ -
మహిళా పోలీసుల ఆరోగ్య రక్షణకు వైద్య శిబిరాలు
పెనమలూరు: మహిళా పోలీసుల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు అన్నారు. కానూరు టాప్‌స్టార్ ఆస్పత్రిలో సోమవారం క్యాన్సర్‌పై అవగాహన, మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. మహిళా పోలీసులు పని ఒత్తిడిలో ఉండి ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుందన్నారు. మహిళా పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే విధుల నిర్వహణ సక్రమంగా జరుగుతుందని, వారి కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకోని క్యాన్సర్‌పై అవగాహన, ఉచిత వైద్య పరీక్షల శిబిరం ఏర్పాటు చేశామన్నారు. క్యాన్సర్ వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే సులభంగా జయించవచ్చన్నారు. ఎన్టీఆర్ జిల్లా సురక్ష ఫౌండేషన్ కన్వీనర్ కేవీ నరసమయ్య మాట్లాడుతూ.. మహిళా పోలీసులతో పాటు ఇతర సిబ్బంది ఆరోగ్య భద్రతకు మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ.. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను తాను డొనేట్ చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీపీ సరిత, టాప్‌స్టార్ ఎండీ తాతినేని శ్రీనివాస్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
మూడు చక్రాల వాహనాల పంపిణీ
చిలకలపూడి(మచిలీపట్నం): సమాజంలో ఇతరుల మాదిరిగానే విభిన్న ప్రతిభావంతులు గర్వంగా బతకాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. కలెక్టరేట్లో పాఠశాల విద్య – సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కలెక్టర్ బాలాజీ దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లను సోమవారం ఉచితంగా పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు ఆరోగ్య శిబిరాలను నిర్వహించి వారికి ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించామన్నారు. ఆ మేరకు జిల్లాలో 132 మందికి 212 బ్యాటరీ మూడు చక్రాల వాహనాలు, చక్రాల కుర్చీలు, మూడు చక్రాల సైకిళ్లు, నడక కర్రలు తదితర రూ.15,63,218 విలువైన పరికరాలు కేంద్ర ప్రభుత్వం తరఫున అలింకో సంస్థ సహకారంతో అందజేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని విభిన్న ప్రతిభావంతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా లబ్ధిపొందిన దివ్యాంగులు తమకు మూడు చక్రాల వాహనాలు అందించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష అధికారి డీటీడబ్ల్యూ ఫణి ధూర్జటి, దివ్యాంగుల శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
దుర్గమ్మకు పలువురు భక్తుల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి కృష్ణాజిల్లా కేసరపల్లికి చెందిన భక్తులు సోమవారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. కేసరపల్లికి చెందిన బి.నీలిమ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,04,893ల విరాళాన్ని అందించారు. నిత్యాన్నదానం, బంగారు తాపడం పనులకు.. విజయవాడకు చెందిన భక్తులు నిత్యాన్నదానానికి, బంగారు తాపడం పనులకు వేర్వేరుగా విరాళాలను అందజేశారు. విజయవాడ మాచవరానికి చెందిన అట్లూరి రామ్మోహన్రావు, సువర్ణ దంపతులు నిత్యాన్నదానానికి రూ.లక్ష, బంగారు తాపడం పనులకు రూ.లక్ష విరాళాన్ని అందించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. -
పొలాల్లో మతి స్థిమితం లేని వ్యక్తి మృతి
పెడన: పంట పొలాలకు వెళ్లే డొంకరోడ్డులో ఒక వ్యక్తి చనిపోయి పడి ఉంటాన్ని స్థానికులు గమనించి సోమవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని ఉప్పలకలువగుంట గ్రామానికి చెందిన చిట్టూరి రామకృష్ణ(60) ఒంటరిగా జీవిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు. తమను పట్టించుకోవడం లేదని భర్తను వదిలి తన ఇద్దరు పిల్లలతో భార్య కంకిపాడు సమీపంలోని నెప్పల్లికి పదేళ్ల కిందట వెళ్లిపోయింది. అప్పటి నుంచి గ్రామంలో రామకృష్ణ ఒంటరిగా జీవిస్తూ ఎవరైనా పెట్టింది తింటూ తిరుగుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఈ నెల 18న గ్రామంలో కనిపించిన రామకృష్ణ ఆ తరువాత కనిపించ లేదని గ్రామస్తులు పేర్కొన్నారు. నందిగామ పంచాయతీ బొడ్డువానిపాలెం డొంకరోడ్డులో పంట పొలాలు వద్ద వడదెబ్బతో పడిపోవడంతో ఎవరూ గమనించలేదు. సోమవారం ఉదయం అటుగా వెళ్లే రైతులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు వాట్సాప్ గ్రూపుల్లో మృతుడి ఫొటోను పెట్టారు. గుర్తు పట్టిన గ్రామస్తులు రామకృష్ణ భార్య లక్ష్మికి సమాచారం ఇవ్వడంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెడన ఎస్ఐ జి.సత్యనారాయణ కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం రామకృష్ణ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
ఇంటర్లో ప్రవేశాలకు హెచ్ఎంలు సహకరించాలి
మచిలీపట్నంటౌన్: ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు ప్రారంభమయ్యాయని విద్యార్థుల ప్రవేశాలకు ప్రధానోపాధ్యాయులు సహకరించాలని ఇంటర్మీడియెట్ జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి, ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి సాల్మన్ రాజు కోరారు. స్థానిక లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సోమవారం మచిలీపట్నం అర్బన్, రూరల్ ప్రధానోపాధ్యాయుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలల్లో నైపుణ్యం కలిగిన విద్య బోధనా, అర్హత కలిగిన అధ్యాపకులు ఉండడంతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులందరికీ ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, రికార్డులు, బ్యాగ్‌లు మధ్యాహ్నం ఉచితంగా భోజన సదుపాయాలను ప్రభుత్వం అందజేస్తోందన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంసెట్ మెటీరియల్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుందరలక్ష్మి, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు. జనరల్ బోగీలు నాటికకు ప్రథమ బహుమతి గుడివాడటౌన్: కృష్ణా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ గుడివాడ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి నాటక పోటీల్లో జనరల్ బోగీలు నాటిక ఉత్తమ ప్రదర్శనగా నిలిచి ప్రథమ స్థానం కై వసం చేసుకుంది. ద్వితీయ స్థానం ఇది అతని సంతకం, తృతీయ స్థానం నాన్నా నేనొచ్చేస్తా, ప్రత్యేక జ్యూరీ ప్రదర్శనగా చిగురు మేఘం ఎంపికై నట్లు నిర్వాహకులు తెలిపారు. మొత్తం 8 నాటికలు ఈ పోటీల్లో పాల్గొన్నాయన్నారు. నాటికలో పాల్గొన్న ప్రతి బృందానికి రూ.20 వేలు పారితోషికం, యువ కళాకారులకు 15 మందికి రూ.1,000 చొప్పున అందజేశామన్నారు. వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.6 వేలు, రూ.5 వేలు, రూ.4 వేలు, జ్యూరీ బహుమతి రూ.4 వేలు, ఇతర బహుమతులకు ఎంపికై న ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. -
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బైక్.. యువకుడి దుర్మరణం
గుడివాడరూరల్: ఆగి ఉన్న లారీని మోటారు బైకు ఢీ కొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని మల్లాయపాలెంలో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం చౌటపల్లి గ్రామానికి చెందిన తాడంకి రాకేష్(19) గ్రామానికి చెందిన అతని స్నేహితుడు వరుణ్‌తేజ్‌తో కలిసి చర్చిలో ఈస్టర్ ప్రార్థనల్లో పాల్గొన్నాడు. సోమవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఇంటికి వెళ్తుండగా మల్లాయపాలెం సమీపంలోని శ్యామలాంబ రైస్‌మిల్లు సమీపంలోకి రాగానే బైక్ అదుపు తప్పి రోడ్డుపై నిర్లక్ష్యంగా నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి ఢీకొన్నారు. దీంతో వారికి తీవ్ర గాయాలు కాగా పలువురు ప్రయాణికులు వెంటనే గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. రాకేష్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్ర గాయాలకు గురైన వరుణ్‌తేజ్‌ను ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల నిమిత్తం విజయవాడ తరలించారు. మృతుడి తల్లి రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుడివాడ తాలూకా ఎస్ఐ ఎన్.చంటిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం రాకేష్ మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ప్రమాదంతో చౌటపల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చర్చిలో ప్రార్థనకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరగడం బాధాకరమని మృతుడు రాకేష్ స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు. చిన్న వయసులోనే రాకేష్ మృతి చెందడం పట్ల స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు -
పాఠశాలను మా ఊరి నుంచి తరలించొద్దు సారూ!
వక్కపట్లవారిపాలెం(నాగాయలంక): మండలంలోని వక్కపట్లవారిపాలెం శివారు బ్రహ్మానందపురం పాఠశాలను గ్రామానికి దూరంగా తరలించవద్దని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వేడుకున్నారు. మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తమ ఇబ్బందులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా పంచాయతీ పరిధిలో రెండు కిలోమీటర్ల దూరంలోని వక్కపట్లవారిపాలెం పాఠశాలలో విలీనం చేసే ప్రక్రియ చేపట్టారని ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సహేతుకం కాదని వాపోయారు. బ్రహ్మానందపురంలో నివసించే వారంతా షెడ్యూల్ కులానికి చెందినవారని, ఇక్కడి పాఠశాలలో 45 మంది విద్యార్థులు 1 నుంచి 5వ తరగతి వరకు చదువుకుంటున్న చిన్న పిలల్లని, వీరంతా రెండు కిలోమీటర్ల దూరం ఎలా నడిచి వెళ్తారని ప్రశ్నించారు. మార్గ మధ్యంలో అవనిగడ్డ–నాగాయలంక, భావదేవరపల్లి ప్రధాన రహదారులు ఉన్నాయని ఈ రహదారులు ఎప్పుడూ వాహనాల రాకపోకలతో రద్దీతో ఉంటాయని, చిన్నపిల్లలు ఆ రోడ్ల వెంట ఎలా వెళ్లగలరని ప్రశ్నించారు. విద్యాశాఖ ఉద్యోగుల సౌలభ్యం కోసం పాఠశాలను తరలించే ప్రయత్నం విరమించకపోతే ప్రత్యక్ష కార్యాచరణతో నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని 30 మందికి పైగా గ్రామస్తులు బందరు వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. కలెక్టర్‌కు బ్రహ్మానందపురం వాసుల వేడుకోలు -
దేశభక్తికి ప్రతీక ఎన్సీసీ
కోనేరుసెంటర్: విలువలతో కూడిన క్రమశిక్షణకు, దేశభక్తికి ఎన్సీసీ ప్రతీక అని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు అన్నారు. స్థానిక చిలకలపూడి నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో సోమవారం ఎన్సీసీ క్యాడెట్లకు క్యాంప్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను కూడా విద్యార్థి దశలో ఎన్సీసీ క్యాడెట్‌గా చేశానని చెబుతూ అప్పటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఎన్సీసీ ద్వారా కలిగే ప్రయోజనాలు వివరించి విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. ఎన్సీసీ శిక్షణలో తీసుకున్న రైఫిల్ ట్రైనింగ్ ఉద్యోగం వచ్చాక పోలీసు శిక్షణలో ఎంతో ఉపయోగపడిందని చెప్పారు. జిల్లా విద్యా శాఖాధికారి రామారావు మాట్లాడుతూ ఎన్సీసీ ద్వారా చక్కని శారీరక దారుఢ్యంతో పాటు ఆత్మస్థైర్యం, సమయస్ఫూర్తి అలవడతాయన్నారు. అనంతరం ఎన్సీసీ విద్యార్థులకు క్యాంప్ కిట్లు అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ సలహాదారుడు డీవీఆర్, పాఠశాల ఎన్సీసీ ఆఫీసర్ అప్పినేడి వెంకట రామాంజనేయులు(రాము), ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.ఎస్పీ ఆర్.గంగాధరరావు -
కనీస సౌకర్యాలు కరువు
పెడన: కృష్ణా జిల్లాలోని నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తిపన్ను కట్టించుకునే అస్సెస్మెంట్లు పెరుగుతున్నా మౌలిక వసతుల కల్పనలో ఆయా పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు వెనుకంజ వేస్తున్నాయి. ఆదాయ మార్గాలు అన్వేషించకుండానే ఆస్తి పన్నుల రూపంలో ఆదాయానికి ఆస్కారం ఏర్పడుతోంది. అయితే ఆస్తి పన్నులు వసూలు చేయడంలోనే అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రైవేటు ఆస్తి పన్నుల జోలికి పోకుండా అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తున్నారనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరో పక్క అస్సెస్మెంట్ల సంఖ్య నగరాలలోను, పట్టణాల్లోనూ ప్రతి సంవత్సరం వేలల్లో పెరుగుతోంది. చిన్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో మాత్రం ఈ సంఖ్య వందల్లోనే పెరుగుతోంది. ఆదాయాన్ని బట్టి అభివృద్ధికి నిధులు కేటాయింపా? ఒక పక్క కార్పొరేషన్లలోను, మున్సిపాలిటీల్లోను, నగర పంచాయతీలలో అస్సెస్మెంట్ల ద్వారా ఆదాయం పెరుగుతూ వస్తోంది. అయితే వసూళ్లు చేయడంలో బాగా వెనుకబడుతున్నారనే విమర్శలున్నాయి. కచ్చితంగా వసూలు చేస్తే మౌలిక వసతులు కూడా కల్పించడానికి వీలవుతుందనే వాదన కొందరి నుంచి వ్యక్తమవుతోంది. పూర్తి స్థాయిలో వసూళ్లు చేయకపోవడం వల్ల పెండింగ్ పడుతూ వస్తుండటంతో మౌలిక వసతులకు ఈ నిధులు కేటాయించలేక పోతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఆదాయాన్ని బట్టి అభివృద్ధికి నిధులు కేటాయింపు అంటే కొన్ని పురపాలక సంఘాలు, మున్సిపాలిటీలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి సాధించలేవనే వాదన కూడా వ్యక్తమవుతోంది. ఆదాయాన్ని బట్టి కాకుండా అన్ని పట్టణాలు, నగరాలను సమాన దృష్టితో చూసి అభివృద్ధి చేయాలని పురప్రజలు కోరుతున్నారు. పట్టణాల్లో పెరుగుతున్న అస్సెస్మెంట్లు పన్నుల వసూళ్లలో మాత్రం వెనుకంజ పారిశుద్ధ్యం, డ్రైనేజీ, తాగునీటి వసతుల కల్పనలో అశ్రద్ధ 2024–25లో మచిలీపట్నం కార్పొరేషన్లో 52,570కి చేరిన ఆస్తి పన్నులు గుడివాడలో 29,384...పెడనలో 7578కు చేరిన అస్సెస్మెంట్లు కృష్ణాజిల్లాలో గత రెండేళ్లుగా పెరిగిన అస్సెస్మెంట్లు కార్పొరేషన్/మున్సిపాలిటీ 2023–24 2024–25 పెరిగినది మచిలీపట్నం 48,272 52,570 4,298 గుడివాడ 26,258 29,384 3,126 తాడిగడప 44,671 48,006 3,335 ఉయ్యూరు 9,911 10,119 208 పెడన 7,234 7,578 344మౌలిక వసతులు మృగ్యంఉయ్యూరు నగర పంచాయతీలో ప్రొపర్టీ ట్యాక్స్ 2024–25 ఏడాదిలో 10,119కి చేరింది. కాని తాగునీటి వసతి పూర్తి స్థాయిలో కల్పించలేకపోతున్నారు. పెడన పురపాలక సంఘంలో ఆస్తి పన్నులు కట్టించుకునే అస్సెస్మెంట్లు పెరుగుతున్నా పారిశుద్ధ్య సిబ్బంది అందుకు తగ్గ విధంగా లేరు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు. కనీస మౌలిక వసతులు కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మౌలిక వసతుల విషయం ప్రభుత్వమే చూసుకోవాలి ఆస్తి పన్నుల ద్వారా అస్సెస్మెంట్లు పెరిగి ఆదాయం పెరుగుతున్నా అందుకు తగ్గ వ్యయం మాత్రం రెట్టింపుగా ఉంటోంది. సిబ్బంది జీతాలతో పాటు విద్యుత్ బిల్లులు, సచివాలయాల అద్దెలు వంటి వాటికే మున్సిపల్ జనరల్ ఫండ్స్ నిధులు సరిపోతున్నాయి. ఇక మౌలిక వసతుల విషయం ప్రభుత్వమే చూసుకోవాలి. – పి.వెంకటేశ్వరరావు, ఆర్ఐ, పెడన -
అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి
● అధికారులకు కలెక్టర్ బాలాజీ ఆదేశం ● మీకోసంలో 201 అర్జీలు స్వీకరణ చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల నుంచి వచ్చే అర్జీల విషయంలో అత్యంత శ్రద్ధ వహించి సానుకూలంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు డీఆర్వో చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, మెప్మా పీడీ సాయిబాబు, జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, పౌరసరఫరాల సంస్థ డీఎం పద్మాదేవి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ పోషణ్ అభియాన్ ఏడో పౌష్టికాహార పక్షోత్సవం జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్‌పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. గర్భస్థ దశ నుంచి రెండు సంవత్సరాల వరకు పౌష్టికాహారం అందజేసేందుకు లక్ష్యంగా ఈ పక్షోత్సవాలు నిర్వహించాలన్నారు. పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారించాలని, ఆరోగ్యకరమైన జీవన శైలి అలవాటు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. మీకోసంలో 201 అర్జీలను స్వీకరించారు. ప్రధానంగా వచ్చిన అర్జీలు ఇవే... ● పమిడిముక్కల మండలం లంకపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు సీహెచ్ రాజ్సురేష్ లంకపల్లి గ్రామంలో గత 60 సంవత్సరాలుగా తన స్వాధీనంలోనే ఉన్న సర్వే నంబర్ 188/5 లో ఉన్న 60 సెంట్ల భూమిని తన వదిన పది మందితో కలిసి వచ్చి ఆక్రమించుకున్నారని, తనకు పోలీస్ రక్షణ కల్పించి తన భూమిని కాపాడాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ● కోడూరు మండలం సాలెంపాలెం గ్రామానికి చెందిన దివ్యాంగురాలు కొప్పనాతి అనూహ్య తన తల్లి విజయ సాయంతో మీకోసం కార్యక్రమానికి వచ్చారు. తనకు ప్రస్తుతం రూ.6 వేలు పింఛను వస్తోందని, పూర్తిగా మంచానికే పరిమితమైన తనకు రూ.15 వేలు పింఛను మంజూరు చేయాలని కోరుతూ అర్జీ ఇచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా చికిత్స చేయించమని వైద్యాధికారులను ఆదేశించారు. ● ముదినేపల్లి మండలం వైవాక గ్రామానికి చెందిన ఎం.వీర వెంకట సుబ్రహ్మణ్యం ఉయ్యూరు మండలం కలువపాములలోని జ్యోతి పాలిటెక్నిక్‌లో తన కుమార్తె చేర్పించానని, అయితే ప్రభుత్వం వారు అందించే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఇచ్చే ఫీజు జమ కాలేదన్నారు. రోజు కూలీ చేసుకుని జీవనం సాగించే తాను కుమార్తె ఫీజు విషయంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నందున న్యాయం చేయాలని కోరుతూ అర్జీ ఇచ్చారు. -
అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
చిలకలపూడి(మచిలీపట్నం):అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కొత్తగా నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులకు కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ఉదయం మీకోసం సమావేశ మందిరంలో రెవెన్యూ శాఖకు చెందిన 12 మందికి కారుణ్య నియామక పత్రాలను కలెక్టర్ అందజేశారు. వారిలో 8 మంది జూనియర్ అసిస్టెంట్లు కాగా, ఒకరు సచివాలయ కార్యదర్శి, ముగ్గురు ఆఫీస్ సబార్డినేట్లు ఉన్నారు. అందులో టి.మణి, సీహెచ్ గోపాలకష్ణ, ఎస్.అజయ్ బాబు, డి.కిరణ్ కుమార్, ఎ.భరత్ కుమార్, ఎం.చైతన్యకుమార్, వై.అహల్య, సీహెచ్ భవానీశంకర్ జూనియర్ అసిస్టెంట్లుగా, వినోద్ కుమార్ సచివాలయ కార్యదర్శిగా, పి.సుజాత, యు.వెంకటరావులను ఆఫీస్ సబార్డినేట్లుగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ కె. చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ ఎస్డీసీ శ్రీదేవి, జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, డ్వామా డీఆర్ డీఏ పీడీలు శివప్రసాద్, హరిహరనాథ్, డీఎస్ఓ పార్వతి, డీఎంహెచ్ఓ డాక్టర్ శర్మిష్ట, పౌరసరఫరాల సంస్థ డీఎం సీహెచ్ పద్మావతి, ఆర్ అండ్ బీ, ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు లోకేష్, నటరాజ్, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి వెంకట్రావు, డీపీఓ అరుణ, సీపీఓ గణేష్, జిల్లా వ్యవసాయ అధికారి మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డీకే బాలాజీ -
‘అప్పులు సాకుగా చూపి పథకాలు ఎగ్గొట్టేందుకు కుట్ర’
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అప్పులు సాకుగా చూపి సూపర్ సిక్స్ పథకాలు ఎగ్గొట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర అఽధికార ప్రతినిధి పి.ప్రసాద్ అన్నారు. సంపద సృష్టించి సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారం చేపట్టి 11 నెలలు కావొస్తున్నా ఏ ఒక్క పథకం అమలు చేయలేదన్నారు. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేయాలని కోరుతూ సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే నవరత్నాలకు మించిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రజలను నమ్మించి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. సూపర్ సిక్స్ హామీలతో పాటు ఇతర వర్గాలకు 176 అడ్డగోలు హామీలిచ్చిందన్నారు. అప్పుల పేరుతో ఈ పథకాల ఎగవేతకు పథకం పన్నడం ప్రజాద్రోహమని విమర్శించారు. క్విడ్ ప్రోకోగా.. రైతులకు ఇచ్చిన హామీల్ని వదిలి భారీ భూభాగాల్ని క్విడ్ ప్రొకోగా కంపెనీలకు కట్టబెడుతున్నారని గుర్తు చేశారు. ప్రజలు ఏమీ చేయరని చంద్రబాబు భావిస్తే.. ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు దూరంలోనే లేదని ప్రసాద్ హెచ్చరించారు. పార్టీ నగర కార్యదర్శి పి.పద్మ, ఇఫ్టూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముని శంకర్, దాది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
దేశంలో రాజ్యాంగానికి ముప్పు
పెనమలూరు: దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే పరిస్థితి నెలకొందని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. పోరంకి విజ్ఞాన భారత్ పాఠశాలలో సోమవారం అబ్దుల్ కలాం స్టడీ సర్కిల్ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వాహకుడు అమరయ్యశాస్త్రి అధ్యక్షతన భారత రాజ్యాంగం నేడు ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కొలీజియం కమిటీ దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి అనేక మతాలకు, జాతులకు, కులాలకు దేశ సమైక్యత విధానాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రచించారన్నారు. అయితే దేశంలో నేటి రాజకీయ పరిస్థితుల కారణంగా రాజ్యాంగానికి తూట్లు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థ సైతం నాయకుల చేతిలో సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. అబ్దుల్ కలాం స్టడీ సర్కిల్ విజ్ఞాన వేదిక నిర్వాహకుడు అమరయ్య శాస్త్రి మాట్లాడుతూ ప్రతి నెలా ఇటువంటి సదస్సులు ఏర్పాటు చేస్తామని, దీనికి అందరి మద్దతు కావాలని కోరారు. కార్యక్రమంలో విజ్ఞాన్ భారత్ పాఠశాల కరస్పాండెంట్ ప్రొఫెసర్ కొడాలి రామశేషాద్రిరావు, మండల సీఐటీయూ కార్యదర్శి ఉప్పాడ త్రిమూర్తి, మండల సీపీఎం కార్యదర్శి షేక్.కాశిం, నేతలు షేక్ మస్తాన్, పి.పాతాళలక్ష్మి,పి.లక్ష్మీనారాయణ, సోమశేఖర్, ప్రజా సంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి కార్డుదారుడికి ఈ–కేవైసీ తప్పనిసరి జేసీ గీతాంజలిశర్మ చిలకలపూడి(మచిలీపట్నం): ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని పొందేందుకు రేషన్‌కార్డులోని ప్రతి ఒక్క సభ్యుడు ఈ–కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ తెలిపారు. సోమవారం నాటికి జిల్లాలో 71,110 మంది సభ్యులు ఇంకా ఈ–కేవైసీ చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ లబ్ధిదారుల వివరాలు రేషన్ షాపు డీలరు వద్ద, పౌరసరఫరాల డెప్యూటీ తహసీల్దార్ వద్ద, పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ మొబైల్ షాపులో గ్రామ రెవెన్యూ అధికారి, డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ ద్వారా అందుబాటులో ఉన్న ఈ–పోస్ పరికరాల ద్వారా గాని ఈ–కేవైసీని పూర్తి చేసుకోవచ్చునన్నారు. ముగ్గురు రైల్వే ఉద్యోగులకు జీఎం సేఫ్టీ అవార్డులు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్ల నిర్వహణలో లోపాలను గుర్తించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించిన విజయవాడ డివిజన్‌కు చెందిన ముగ్గురు ఉద్యోగులు ‘జీఎం మ్యాన్ ఆఫ్ ద మంత్ సేఫ్టీ అవార్డును అందుకున్నారు. సోమవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం నుంచి విజయవాడ డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్‌తో పాటుగా సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డివిజన్ల డీఆర్ఎంలతో వర్చువల్ పద్ధతిలో భద్రతపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణం, భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించిన దెందులూరు ఆపరేటింగ్ విభాగంలోని స్టేషన్ సూపరింటెండెంట్ టి.వి.ఎం.యూ మహేశ్వర్, రాజమండ్రి ఆపరేటింగ్ విభాగంలోని పాయింట్ మెన్ కె.నథానియేల్, రాజమండ్రిలోని ట్రైన్ మేనేజర్ లోకేష్‌కుమార్‌లకు జీఎం అరుణ్‌కుమార్ జైన్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ఉద్యోగులను ప్రత్యేకంగా అభినందించారు. ‘స్వచ్ఛ చల్లపల్లి’కి చిత్తూరు జిల్లా మహిళా సర్పంచులు చల్లపల్లి: చిత్తూరు జిల్లాకు చెందిన 25 మంది మహిళా సర్పంచులు స్వచ్ఛ సుందర చల్లపల్లి పరిసరాలను, కార్యక్రమాలను వీక్షించడానికి సోమవారం విచ్చేశారు. స్వచ్ఛ చల్లపల్లికి కృషి చేస్తున్న రథసారఽథులు డాక్టర్ డీఆర్కే ప్రసాద్, పద్మావతి, స్వచ్ఛ కార్యకర్తల కృషిని అభినందించారు. అనంతరం స్వచ్ఛ కార్యక్రమాలను డీఆర్కే ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వారికి వివరించారు. -
ఎల్ఈడీ లైట్లతో ప్రమాదం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): నిబంధనలకు నీళ్ళొదిలేస్తున్నారు.. కనీస ఆలోచన లేకుండా.. ఇతరుల ప్రాణాలకు ముప్పు అని తెలిసినా.. ఎల్ఈడీ లైట్ల వినియోగం యథేచ్ఛగా సాగుతోంది. ద్విచక్ర వాహనాలు మొదలుకుని.. ఆటోలు, లారీలు, ప్రైవేట్ బస్సుల్లో లైట్ల వినియోగం జరుగుతోంది. అయినా పట్టించుకోవాల్సిన రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) అధికారులు మాత్రం మొద్దు నిద్రపోతున్నారు. కొన్నాళ్ళ క్రితం గుంటూరు రూరల్ మండలం అంకిరెడ్డిపాలెం వద్ద ఒక బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. అయితే ప్రమాదానికి కారణం తెలిసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. నేరుగా ఇంజిన్ నుంచి ఎల్ఈడీ లైట్లుకు వైర్లు అనుసంధానం చేయటం ద్వారానే ప్రమాదం జరిగిందని గుర్తించారు. ఆ ప్రమాదంలో బస్సు దగ్ధమై, ప్రయాణికులు మాత్రం స్వల్ప గాయాలతో బయట పడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వాహనాలకు సంబందించి ఎల్ఈడీ లైట్ల వినియోగాన్ని పూర్తిస్థాయిలో నిషేధిస్తూ.. కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకుని వచ్చింది. భారీ ఫోకస్ వచ్చే లైట్లు వినియోగించటం ద్వారా, ఎదురుగా వచ్చే వాహనదారులకు కనపడకపోవటంతో ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు 90శాతం ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కేవలం కంపెనీల ఫోకస్ లైట్లు ఇచ్చిన వాటి వరకే వినియోగించాలనేది చట్టం. అదనపు ఫిట్టింగ్‌లు చేయకూడదని స్పష్టంగా నిబంధనలు ఉన్నప్పటీకీ.. వాహనదారులు యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారు. వాహనాల చట్టం 1988 (మోటార్ వెహికల్ యాక్ట్) ప్రకారం.. వాహనాల్లో అనుమతించని మార్పుల్లో ఎల్ఈడీ లైట్లు వినియోగం ఒకటి. ఈ చట్టంలోని సెక్షన్ 52 ప్రకారం వాహనాల నిర్మాణం, ఫీచర్లలో అనుమతి లేకుండా మార్పులు చేయటం చట్ట విరుద్ధం. ఎల్ఈడీ లైట్లు హాలోజెన్ లైట్ల కంటే అధికంగా ప్రకాశిస్తాయి. తద్వారా ఇతర డ్రైవర్లకు గందరగోళం ఏర్పడటంతోపాటు, అంధత్వాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పలు రాష్ట్రాల్లో ఆర్టీఏ, ట్రాఫిక్ నిబంధనల ప్రకారం అధికమైన వాట్స్, అన్ అప్రూవ్డ్ లైట్లు నిషేదించిన పరిస్థితులు ఉన్నాయి. కారుల్లో 75 వాట్స్, లారీలకు 100 వాట్స్, బైక్‌లకు 10 వాట్స్ లోపు మాత్రమే లైట్ల వినియోగం ఉండాలి. జైలు శిక్షకు కూడా అవకాశం ఆర్టీఏ రూల్ ప్రకారం ఎల్ఈడీ లైట్లు వినియోగం చేపడితే వాహనాన్ని సీజ్ చేయటంతోపాటు జరిమానా విధించవచ్చు. జరిమానా రూ.1,000 నుంచి రూ.పదివేల వరకు పడే అవకాశం ఉంది. గత కొద్ది కాలం క్రితం బెంగుళూరుతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కేవలం వారం రోజుల వ్యవధిలో 8వేల కేసులు నమోదు చేశారంటే ఎల్ఈడీ లైట్లు వినియోగం పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. లైట్ల వినియోగం ద్వారా ఒకొ సారి జైలు శిక్షకు దారి తీసే అవకాశాలు లేకపోలేదు. ఇష్టానుసారంగా వినియోగం ద్విచక్రవాహనాలు మొదలుకుని భారీ వాహనాల వరకు పట్టించుకోని ఆర్టీఏ శాఖ అధికారులు అడ్డగోలుగా అమ్మకాలు.. మోటార్ వెహికల్ షాపుల్లో ఎల్ఈడీ లైట్ల విక్రయాలు చేపట్టకూడదని నిబంధనలు చెబుతున్నాయి ఆయా వాహనాన్ని బట్టి దాని వినియోగానికి సరిపడా వాట్స్ కంటే అధిక ప్రమాణాలు ఉండకూడదని నిబంధనలు ఉన్నాయి. రోడ్డు మంత్రిత్వ శాఖ (మినిస్టరీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా మాత్రమే లైట్లు వినియోగించాలి. అయితే దీనిపై చర్యలు తీసుకునేందుకు ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీసులకు అధికారం ఉంది. అయినా కనీసం చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఇటీవల కాలంలో కేసులు నమోదు చేసిన పరిస్థితి కూడా లేదని చెబుతున్నారు. -
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి ఆది దంపతులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ నేపథ్యంలో అంతరాలయ, వీఐపీ దర్శనాలను దేవస్థానం రద్దు చేసింది. దీంతో భక్తులకు త్వరతిగతిన అమ్మవారి దర్శన భాగ్యం లభించింది. పెద్ద ఎత్తున పాల్గొన్న ఉభయ దాతలు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన ఆర్జిత సేవలకు ఆదివారం డిమాండ్ కనిపించింది. తెల్లవారుజామున అమ్మవారికి ప్రధాన ఆలయంలో నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఆలయ ప్రాంగణంలో శ్రీచక్ర నవార్చన, లక్ష కుంకుమార్చన, చండీ హోమం, నవగ్రహ హోమాలలో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ ఉభయ దాతలు విశేషంగా పాల్గొన్నారు. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి విగ్రహం వద్ద , 7వ అంతస్తులో మైక్ ప్రచార కేంద్రం వద్ద దేవస్థానం మజ్జిగ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. దాతల సహకారంతో ప్రతి రోజు మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. కిటకిటలాడిన క్యూ లైన్లు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి అమ్మవారి అంతరాలయ దర్శనాలను రద్దు చేశారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు కిటకిటలాడాయి. దీంతో ఆలయ అధికారులు అంతరాలయ దర్శనం రద్దు చేశారు. కౌంటర్లలో టికెట్ల విక్రయాలను పూర్తిగా నిలిపివేశారు. రూ.300, రూ.100 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం అయ్యేలా క్యూలైన్లను నియంత్రించారు. రూ.300 టికెట్లపై కేటాయించి క్యూలైన్‌తో పాటు అదనంగా బంగారు వాకిలి దర్శనం కల్పించారు. రూ.100 టికెట్ భక్తులకు వారికి కేటాయించిన క్యూతో పాటు అదనంగా మరో క్యూలైన్ కేటాయించడంతో దర్శనం త్వరగా పూర్తయింది. మధ్యాహ్నం రెండు గంటల వరకు అంతరాలయ దర్శనం పూర్తిగా నిలిపివేశారు. ఆన్లైన్లో ముందుగానే రూ.500 టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం అంతరాలయ దర్శనం కల్పించారు. సూర్యోపాసన సేవ లోక కల్యాణార్ధం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆదివారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సూర్యోపాసన సేవ జరిగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్య భగవానుడి చిత్రపటానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాల అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించారు. సేవలో పలువురు భక్తులు, ఉభయదాతలు పాల్గొనగా, వారికి ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. 21న కానుకల లెక్కింపు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు భక్తులు సమర్పించిన కానుకలు, ముడుపులు, మొక్కుబడులను సోమవారం లెక్కించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. సోమవారం ఉదయం మహా మండపం ఆరో అంతస్తులో ఉదయం 7–30 గంటల నుంచి కానుకల లెక్కింపు జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. దుర్గ గుడి కౌంటర్లలో సీసీ కెమెరాలు అదనపు వసూళ్లకు చెక్ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సెల్‌ఫోన్ భద్రపరుచుకునే కౌంటర్లు, లగేజీ కౌంటర్లలో అదనపు వసూళ్లు, ఉచితంగా ఏర్పాటు చేసిన చెప్పుల స్టాండ్‌లో డబ్బుల వసూళ్లపై భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదులకు ఆలయ అధికారులు చెక్ పెట్టారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మహా మండపం దిగువన, ఘాట్‌రోడ్డులోని ఓం టర్నింగ్ వద్ద చెప్పులు, లగేజీ, సెల్‌ఫోన్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. చెప్పుల స్టాండ్‌ను దేవస్థానం ఉచితంగా నిర్వహిస్తుండగా, లగేజీ, సెల్ఫోన్లు కౌంటర్లను కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్నారు. అయితే రద్దీ సమయంలో భక్తుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఇటీవల ఫిర్యాదులు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో కౌంటర్లోని సిబ్బంది అదనపు వసూళ్లకు చెక్ పెడుతూ ఆయా కౌంటర్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్‌లో సిబ్బంది నిరంతరం ఈ కెమెరాలను పర్యవేక్షిస్తూ, కౌంటర్ల వద్ద ఎటువంటి వివాదాలు జరిగినా వెంటనే ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఆర్జిత సేవలకు డిమాండ్ అంతరాలయ దర్శనం రద్దు -
క్రీస్తు పునరుత్థానం..లోకానికి శుభోదయం
గుణదల(విజయవాడ తూర్పు): మానవాళి రక్షణార్ధమై యేసుక్రీస్తు సిలువ మరణాన్ని జయించి పునరుత్థానుడయ్యాడని మేరీమాత పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు అన్నారు. గుణదల మాత ప్రధానాలయంలో ఈస్టర్ పండుగ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. పునరుత్థానుడైన యేసు క్రీస్తును ఆరాధించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అనేక ప్రాంతాల నుంచి యాత్రికులు రావడంతో పుణ్యక్షేత్రం సందడిగా మారింది. ఈ సందర్భంగా ఆలయంలో సమష్టి దివ్యబలి పూజ నిర్వహించారు. భక్తులనుద్దేశించి ఫాదర్ జయరాజు మాట్లాడుతూ క్రీస్తు పునరుత్థానం లోకానికి జయమన్నారు. మానవాళిని రక్షించేందుకే యేసుక్రీస్తు సిలువ మరణం పొందారని గుర్తు చేశారు. యేసుక్రీస్తు మన కొరకు చేసిన త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని, ఆయన ఆచరించి చూపిన మార్గంలో నడుచుకోవాలన్నారు. ఈస్టర్ పండుగ అందరి జీవితాలలో దీవెనలు నింపాలని ఆశీర్వదించారు. అనంతరం సమష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులతో పాటు యాత్రికులు కూడా పెద్ద సంఖ్యలో పుణ్యక్షేత్రానికి తరలివచ్చారు. కాలి నడకన కొండ శిఖరాగ్రం వరకు వెళ్లి క్రీస్తును వేడుకున్నారు. పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తుల కోసం ఆలయ గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
టెర్రస్ గార్డెన్ పెంపకంతో ఆరోగ్యకరమైన పంట
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంటి టెర్రస్‌పై కూరగాయల పెంపకాన్ని ప్రోత్సహించాలని, తద్వారా రసాయనాలు లేని ఆరోగ్యకరమైన పంట లభిస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా) చౌదరి అన్నారు. ఆదివారం సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ (సీటీజీ) ఆధ్వర్యంలో భవానీపురంలోని వాసవి కల్యాణమండపంలో వంటింటి వ్యర్థాలతో సేంద్రియ ఎరువును తయారు చేసుకుని కూరగాయలు పెంచటంపై అవగాహన సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రతి కుటుంబం తమకు అవసరమైన కూరగాయలను ఎటువంటి రసాయన ఎరువులు లేకుండా వంటింటి వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువును తయారు చేసుకుని పండించుకోవాలని, తద్వారా ఆరోగ్యమైన జీవితాన్ని పొందవచ్చని తెలిపారు. టెర్రస్ గార్డెనింగ్పై యువత ఆసక్తి పెంచుకోవాలన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన పర్యావరణవేత్త మద్దుకూరి సుబ్బారావు మాట్లాడుతూ కిచెన్‌లో కూరగాయలతో వంట చేసినప్పుడు వచ్చే వ్యర్థాలను బయట పడేయకుండా వాటిని కంపోస్ట్ ఎరువుగా తయారు చేసుకోవచ్చన్నారు. ఎటువంటి రసాయనాలు వాడకుండా పండే కూరగాయలను తినటం వలన మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. అంతేకాకుండా పర్యావరణాన్ని కాపాడినవారం అవుతామని అన్నారు. సదస్సుకు ఏపీఎఫ్సీసీఐ అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కరరావు అధ్యక్షత వహించారు. సీటీజీ వ్యవస్థాపకుడు శ్రీనివాస్, విజయవాడ టీమ్ పీవీడీ నాగేశ్వరరావు, గూడవల్లి సురేష్‌బాబు, నర్రా నాగేంద్రప్రసాద్, పద్మజ, జి.పద్మాదేవి పాల్గొన్నారు. -
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి
పెడన: ఈ నెల 18న ఆత్మహత్యకు యత్నించి, మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన సంఘటనపై ఆదివారం పెడన పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని కొంకేపూడి గ్రామానికి చెందిన రాజులపాటి శ్రీను(40) మద్యానికి బానిసయ్యాడు. భార్య రుక్మిణితో గొడవ పడి మద్యానికి డబ్బులు అడిగాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. బంధువులు గమనించి తలుపులు పగలగొట్టి శ్రీనును హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. భార్య రుక్మిణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టాలు తప్పిన సర్వీసు రైలు దుగ్గిరాల: దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో మరమ్మతుల నిమిత్తం వచ్చిన సర్వీసు రైలు ఆదివారం సాయంత్రం పట్టాలు తప్పింది. అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. దీంతో గేటు వద్ద భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. -
ఘనంగా చెన్నుని పుష్పయాగం
మాచర్ల: మాచర్లలోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను అలంకరించారు. అర్చకులు కొండవీటి రాజగోపాలాచార్యులు, ఈఓ ఎం పూర్ణచంద్రరావు, జేఏ వీరారెడ్డి, గౌరవాధ్యక్షులు పోలిశెట్టి చంద్రశేఖరరావు, పందిరి సాంబశివరావు, షరాబు వెంకటరత్నం, గజవెల్లి కిషోర్, కంభంపాటి అనిల్‌కుమార్, సూరె యలమంద, తిరివీధి వెంకట నాగేశ్వరరావు, కంభంపాటి వెంకటరమణలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి వారి పుష్పయాగం మండపంలో జరిపారు. ఈ ఉత్సవాన్ని చూసిన భక్తులు జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ అంటూ నామస్మరణ చేశారు. ఆరోగ్యం పౌరుడి ప్రాథమిక హక్కుగా మారాలి డాక్టర్ పీవీ రమేష్ కృష్ణలంక (విజయవాడ తూర్పు): ఆరోగ్యం పౌరుడి ప్రాథమిక హక్కుగా మారాలని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ అన్నారు. విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ప్రజారోగ్య వేదిక, జన విజ్ఞాన వేదిక, ఎంబీ విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్‌లో వైద్య ఆరోగ్య రంగం – మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ – ఆరోగ్య బడ్జెట్ విశ్లేషణ’ అంశాలపై ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎంవీ రమణయ్య అధ్యక్షతన ఆదివారం రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులో వర్చువల్‌గా రమేష్ మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలన్నారు. ప్రముఖ బడ్జెట్ విశ్లేషకుడు డాక్టర్ డేవిడ్ సుధాకర్ మాట్లాడుతూ ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు జీడీపీలో కనీసం ఆరు శాతం ఉండాలని, అయితే 1.9 శాతానికి మించడం లేదన్నారు. ప్రఖ్యాత వైద్యుడు, ఐఎంఏ మాజీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి.సమరం తదితరులు సదస్సులో పాల్గొన్నారు. అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి పెదవడ్లపూడి(మంగళగిరి) : ప్రేమించుకున్న జర్మనీ అబ్బాయి ఆంధ్రా అమ్మాయి ఇరు కుటుంబాల అంగీకారంతో ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరికి సమీపంలోని పెదవడ్లపూడిలో వైభవంగా హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. పెదవడ్లపూడికి చెందిన సుందర్శనం రవికుమార్, లక్ష్మీ దంపతుల కుమార్తె మౌనిక జర్మనీలో పీహెచ్డీ చేస్తూ ఉద్యోగం చేస్తుంది. అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న జర్మనీకి చెందిన ఫాబియన్ డువెన్ బేక్‌తో పరిచయమై అది ప్రేమగా మారింది. దీంతో ఇరువురూ తమ ఇళ్ళల్లో తల్లితండ్రులకు తెలియజేసి అందరి అంగీకారంతో పెదవడ్లపూడి సాయిబాబా ఆలయంలో వైభవంగా వివాహం చేసుకున్నారు. -
కార్తికేయుని ఆలయంలో భక్తజన సందడి
మోపిదేవి: శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తులతో క్యూలు సందడిగా మారాయి. అన్నప్రసాదం ప్రాంగణం వద్ద భక్తులు బారులు తీరి కనిపించారు. డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో సూపరిటెండెంట్ బొప్పన సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. గోశాల రోడ్డు అభివృద్ధి పనులు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): మహా మండపం నుంచి కనకదుర్గనగర్ వరకు ఉన్న గోశాల రోడ్డు అభివృద్ధి పనులకు ఆదివారం దుర్గగుడి ఈవో కె.రామచంద్రమోహన్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహా మండపం ఎదుట ఏర్పాటు చేసిన అమ్మవారి చిత్రపటం వద్ద పూజలు చేసిన తర్వాత పనులను ప్రారంభించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి మరిన్ని అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. సకాలంలో రోడ్డు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఈఈ వైకుంఠరావు, ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. టేబుల్ టెన్నిస్‌లో షణ్ముఖ్ సత్తా విజయవాడస్పోర్ట్స్: కేంద్రీయ విద్యాలయం రీజనల్ అంతరాష్ట్ర టేబుల్ టెన్నిస్ పోటీల్లో విజయవాడ క్రీడాకారుడు ఆర్.షణ్ముఖ్ సత్తా చాటాడు. ప్రకాశం జిల్లా రాజంపల్లిలో ఇటీవల జరిగిన పోటీల్లో అండర్–17 బాలుర విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 39 కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులు తలపడ్డారు. నగరంలోని మధురానగర్ కేంద్రీయ విద్యాలయం–1లో షణ్ముఖ్ పదో తరగతి చదువుతున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీల్లో బంగారు పతకం సాధించిన షణ్ముఖ్‌ను, అతనికి శిక్షణ ఇచ్చిన కోచ్ షేక్ గౌస్‌బాషా, షేక్ అబ్దుల్‌ను ఏపీ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.విశ్వనాథ్, సంయుక్త కార్యదర్శి బి.శ్రీనివాస్ అభినందించారు. సాఫ్ట్‌బాల్ విజేత ఏజీ అండ్ ఎస్జీ జట్టు పెనమలూరు: కృష్ణా యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఏజీ అండ్ ఎస్జీ కాలేజీ విజేతగా నిలిచింది. తాడిగడప మున్సిపాలిటీ పోరంకి కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో ఆదివారం కృష్ణా యూనివర్సిటీ ఇంటర్‌కాలేజీ సాఫ్ట్‌బాల్ పోటీలు జరిగాయి. ఉయ్యూరు ఏజీ అండ్ ఎస్జీ కాలేజీ ప్రథమ స్థానంలో నిలిచింది. ద్వితీయ స్థానంలో గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీ, తృతీయ స్థానంలో ఆంధ్ర లయోల కాలేజీ, నాలుగో స్థానంలో ఎస్ఆర్ఆర్ ఆండ్ సీవీఆర్ ప్రభుత్వ కాలేజీ నిలిచాయి. విజేత జట్టుకు రెక్టర్ ప్రొఫెసర్ మండల బసవేశ్వరరావు, టీడీపీ నేత అనుమోలు ప్రభాకరరావు బహుమతీ ప్రదానం చేశారు. టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వినయ్‌కుమార్‌రెడ్డి, ప్రిన్సిపాల్ భూలక్ష్మి, సెలక్షన్ కమిటీ సభ్యులు డాక్టర్ ఆర్.రఘురామ్, చంద్రబాబు పాల్గొన్నారు. -
బడుగుల చదువుకు భరోసా
● జీఓ నంబర్ 20తో ఇళ్ల నిర్మాణానికి చిక్కులు ● మచిలీపట్నంలో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణ పనులు ● 60 రోజులుగా ప్లాన్ కోసం అందని దరఖాస్తులు ● పనులు లేక భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులు ● జీఓ సవరణ చేస్తేనే ఇళ్ల నిర్మాణం జీఓ వచ్చాక ఒక్క దరఖాస్తు కూడా రాలేదు జీఓ 20 విడుదలైన తర్వాత కొత్తగా ఒక ప్లాను దరఖాస్తు కూడా రాలేదు. జీఓపై చర్చించడానికి త్వరలో సమావేశం జరుగుతుందని తెలిసింది. దీనిపై ఏదో ఒక నిర్ణయం వస్తే గృహ నిర్మాణాలకు ప్లాన్ దరఖాస్తులు వస్తాయి. జీఓకు అనుగుణంగా అనుమతులు ఇస్తాం. ప్రభుత్వ, అధికారుల ఆదేశాలు అమలు చేయడమే మా విధి. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 20 ప్రజలకు ఉపయోగపడుతుంది. –శ్రీహరిప్రసాద్, టీపీఓ ఉపాధి తగ్గింది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 20తో పనులు తగ్గాయి. నగరంలో గృహ నిర్మాణం మందగించడంతో పనులు వెతుక్కుని వెళ్లాల్సివస్తోంది. ఇసుక ధర ఎక్కువగా ఉండటంతో మధ్య తరగతి ప్రజలు నిర్మాణ పనులకు దూరంగా ఉంటున్నారు. ఈ ప్రభావం కూడా మాపై పడింది. జీఓ సవరణ చేయడంతో పాటు ఇసుక ధరను నియంత్రిస్తేనే భవన నిర్మాణ కార్మికులకు చేతి నిండా పని దొరుకుతుంది. లేకపోతే పని కోసం ప్రతి రోజూ వేట తప్పదు. –వేకుల నాగరాజు, భవన నిర్మాణ కార్మికుడు మచిలీపట్నంటౌన్: ఇల్లు నిర్మించుకోవడం సగటు వ్యక్తి కల. ఇది ఖర్చుతో కూడిన అంశం. పైగా రాష్ట్ర ప్రభుత్వం నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో గృహ నిర్మాణాలకు కొత్త నిబంధనలతో విడుదల చేసిన జీఓ నంబర్ 20తో రెండు నెలలుగా గృహ నిర్మాణాలకు బ్రేక్ పడింది. దీని ప్రభావం పేద, మధ్య తరగతి ప్రజలపై పడటంతో ఆయా వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. వేసవిలో ఇళ్లు పూర్తి చేద్దామనుకునేవారికి నిరాశే మిగులుతోంది. రెండు నెలలుగా దరఖాస్తులేవీ! రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 20 కారణంగా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో రెండు నెలలుగా నగరపాలక సంస్థలో గృహ నిర్మాణాలకు అవసరమైన ప్లాన్ దరఖాస్తులు అందలేదు. అధికారులు కొత్తగా ప్లాన్లు మంజూరు చేసింది లేదు. జీఓలోని కఠిన నిబంధనలు పేద, మధ్య తరగతి ప్రజల పాలిట శాపంగా మారింది. కొత్త నిబంధనలు ఇవే ఇళ్ల నిర్మాణాలకు జీఓ నంబర్ 20తో గృహ నిర్మాణదారులు, లైసెన్స్డ్ సర్వేయర్లు ఎంఎంసీ గడప తొక్కలేక పోతున్నారు. నూతన చట్టంలో పొందు పర్చిన ఐదు అంశాలు మధ్యతరగతి కుటుంబాల వారిని తీవ్ర ఇబ్బందులు కలిగించేవిగా ఉన్నాయి. జీఓ ప్రకారం ప్లాన్‌కు దరఖాస్తు చేసుకుంటే అనుమతి మేరకే ఇల్లు నిర్మించాలి. అత్యవసర పరిస్థితుల్లో 10 శాతం డీవియేషన్ ఉండవచ్చు. అంతకుమించి మార్పులు, చేర్పులు జరిగితే భవన నిర్మాణ అనుమతులు రద్దవుతాయి. అంతేకాకుండా గృహ నిర్మాణం అక్రమమైనదిగా నిర్ధారిస్తారు. దీనికి తోడు గృహ నిర్మాణానికి ప్లాన్ గీసిన లైసెన్స్డ్ సర్వేయర్ లైసెన్స్‌ను ఐదేళ్లు సస్పెండ్ చేస్తారు. చర్యలుంటాయి గృహ నిర్మాణంలో అక్రమాలు ఉంటే యజమానిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇంటి ప్లానుకు దరఖాస్తు చేయాలంటే తప్పనిసరిగా ఎల్టీపీ(లైసెన్స్డ్ సర్వేయర్లు), గృహ యజమాని సెల్ఫ్ సర్టిఫికేషన్ తీసుకొని సమర్పించాల్సి ఉంటుంది. ఇళ్ల నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణను జీఓతో ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిబంధనలతో గృహ యజమానులు 300 చదరపు మీటర్ల పరిధిలో ఎల్టీపీ ఇచ్చిన నమూనా ప్రకారం ప్రభుత్వ నిబంధనలతో గృహాన్ని నిర్మించకపోతే చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారనే కారణంతో ఎల్టీపీలు టౌన్ ప్లానింగ్ విభాగం వైపు కన్నెత్తి చూడటం లేదు. కుదేలవుతున్న నిర్మాణ రంగం భవన పనులు ప్రారంభమైతే నిర్మాణ కార్మికులు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వంటి 32 రకాల పనులు చేసే కార్మికులకు పని దొరుకుతుంది. ప్రస్తుతం ఈ రంగాల కార్మికులు పనులు లేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. గృహ నిర్మాణానికి వినియోగించే పరికరాలు సరఫరా చేసే వ్యాపార సంస్థలకు వ్యాపారం కొనసాగాల్సి ఉంది. ఇళ్లకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులకు పని ఉంటుంది. నిర్మాణరంగంపై సమాజంలో మిగిలిన అన్ని రంగాలు ఆధారపడి ఉన్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని జీఓ నంబర్ 20లో లోపాలు, అభ్యంతరకర అంశాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. విజయవాడ చిల్ట్రన్స్ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ సంఘం ఎన్నిక 60కి పైగా పెండింగ్‌లో మచిలీపట్నం నగరపాలక సంస్థలో 60 రోజుల్లో దాదాపు 60కి పైగా ప్లాన్లు పెండింగ్‌లో ఉండటంతో సుమారు రూ. 30 లక్షల ఆదాయానికి గండి పడింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే టౌన్ ప్లానింగ్ చట్టం జీఓ నంబర్ 20ను సవరించాలి. నగరంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు, ఎల్టీపీలకు సానుకూలమైన చట్ట సవరణ చేస్తేనే ప్లాన్ దరఖాస్తులు కొనసాగవచ్చని మేధావులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే రెండు నెలల నుంచి ఒక ప్లాన్ కూడా అఫ్రూవల్ కాకపోవడంతో గృహ నిర్మాణదారులు, లైసెన్స్డ్ సర్వేయర్లు ప్రభుత్వ నిబంధన మార్పు కోసం ఎదురుచూస్తున్నారు.ప్రజల నడ్డి విరచడమే జీఓ నంబర్ 20 పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచేలా ఉంది. జీఓలోని నిబంధనల ప్రకారం లైసెన్స్డ్ సర్వేయర్లు ప్లాన్ పెట్టలేని స్థితి నెలకొంది. జీఓ సవరణ చేస్తేనే ప్లాన్ల దరఖాస్తులు ఎంఎంసీకి పెట్టగలం. లేకపోతే భవన నిర్మాణాలు నిలిచిపోతాయి. దీన్ని సవరించి సర్వేయర్లకు, పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేయాలని కోరుతూ మంత్రి రవీంద్రను కలసి విన్నవించాను. ప్రభుత్వం స్పందించి సవరణ చేయాలి. –సీహెచ్ గోపాలరావు(గోపాల్), లైసెన్స్డ్ సర్వేయర్ల సంఘ నగర అధ్యక్షుడు -
జాతి వైరం మరిచి.. స్నేహం చిగురించి..
కుక్క, పిల్లి మధ్య సహజంగానే జాతి వైరం ఉంటుంది. పిల్లి కనిపించిందంటే కుక్క ఒక్క ఉదుటున దాడి చేస్తుంది. కుక్క కనిపిస్తే పిల్లి వెంటనే తన దారి మార్చుకుంటుంది. అయితే విజయవాడ ఏలూరు రోడ్డు సమీపంలో ఓ కుక్క, పిల్లి మధ్య స్నేహం చిగురించింది. రెండూ ఆడుకుంటూ, సరదాగా ఆట పట్టించుకుంటూ సందడి చేస్తున్నాయి. స్థానికులు వాటి సరదా చేష్టలు చూసి ముచ్చట పడుతున్నారు. ఆదివారం కుక్క, పిల్లి ఆడుకుంటూ ఇలా ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
అడ్డుకునేందుకు కార్పొరేట్ సంస్థల యత్నం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో విద్యా సంస్కరణలు అమలు చేసిన ఘనత నాటి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిది. ఆయన పాలన పేద విద్యార్థులకు సువర్ణాక్షరం. ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేట్ సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దడమే కాకుండా ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ పేదలకు అవకాశం కల్పించడానికి ఆలోచన చేశారు. ఆయన ప్రవేశపెట్టిన విద్యాహక్కు చట్టం ద్వారా ప్రతి ప్రైవేట్ విద్యాసంస్థ మొదటి తరగతిలో 25 శాతం సీట్లు పేదలకు కేటాయించేలా నిర్ణయించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో 2022–23 నుంచి ఈ పథకాన్ని అమలు చేశారు. అదే క్రమంలో ఎన్టీఆర్ జిల్లాలోనూ ఈ పథకాన్ని అమలు చేయడంతో వేలాది మంది పేద కుటుంబాలు లబ్ధి పొందాయి. అధిక శాతం విద్యార్థులకు అందుబాటులో.. విద్యాహక్కు చట్టం సెక్షన్ 12 (1) సీ ద్వారా గడిచిన మూడేళ్లలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 4,056 మంది విద్యార్థులను మొదటి తరగతికి విద్యాశాఖ ఎంపిక చేసింది. వారిని వారి సమీప ప్రాంతాల్లోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుకునే వీలు కల్పించింది. తొలి ఏడాది 2022–2023 విద్యాసంవత్సరంలో 120 మందికి, 2023–2024లో 1,127 మందికి అవకాశం కల్పించింది. 2024–2025 విద్యాసంవత్సరంలో మొదటి ఫేజ్‌లో 990, రెండో ఫేజ్‌లో 397, నాలుగో ఫేజ్‌లో 1422 మందిని ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరిలో అధిక శాతం విద్యార్థులు ఆయా విద్యాసంస్థల్లో కొనసాగుతున్నారు. 2025–26 సంవత్సరానికి నోటిఫికేషన్ ఈ విద్యాహక్కు చట్టం –2009 సెక్షన్ 12 (1)సీ అమలులో భాగంగా 2025–2026 విద్యా సంవత్సరానికి ఐబీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, స్టేట్ సిలబస్ చదువుతున్న పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశానికి ఈ నెల 28 నుంచి మే 15వ తేదీ వరకూ వివిధ వర్గాల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. విద్యార్థులు ఆధార్ ద్వారా ప్రాథమిక వివరాలతో http://cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు అర్హతలు ఇవి ఐబీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాల్లో ప్రవేశం కోసం 31.03.2025 నాటికి ఐదేళ్ల వయసు నిండి ఉండాలి. స్టేట్ సిలబస్ పాఠశాలల్లో ప్రవేశానికి 01.06.2025 నాటికి ఐదేళ్ల వయసు నిండాలి. విద్యా హక్కు చట్టం–2009, సెక్షన్ 12(1) ఇ ప్రకారం, ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో బలహీన, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పిల్లలకు వారి నివాసానికి ఒక కిలోమీటర్ లేని పక్షంలో రెండు కిలోమీటర్లు తర్వాత మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లను కేటాయించింది. ఎంపిక విధానం ఒకటో తరగతి ప్రవేశాలకు పోర్టల్‌లో నమోదు కోసం ఈ నెల 28 నుంచి మే 15 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. వచ్చిన దరఖాస్తుల్లో విద్యార్థుల అర్హతలను మే 16 నుంచి 20వ తేదీ వరకూ నిర్ధారణ ప్రక్రియను చేపడతారు. లాటరీ ద్వారా మొదటి విడత ఫలితాలను మే 21 నుంచి 24 మధ్య విడుదల చేస్తారు. సీట్లు పొందిన విద్యార్థుల ప్రవేశాల నిర్ధారణ జూన్ 2వ తేదీ చేస్తారు. రెండో విడత లాటరీ ఫలితాలను జూన్ 6వ తేదీ విడుదల చేస్తారు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం కింద 25 శాతం ఉచిత సీట్లు పథకాన్ని ప్రవేశపెట్టిన జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ జిల్లాలో గత మూడేళ్లలో 4,056 మందికి అవకాశం 2025–26 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ ఇచ్చిన సమగ్ర శిక్షాభియాన్ అడ్డుకోవాలని చూసినా ముందుకే.. పేదలకు అన్ని విధాలుగా భరోసా ఇచ్చిన నేత జగన్మోహన్రెడ్డి. ఆయన నిరంతరం పేద కుటుంబాలు చదువు కోవాలి.. తద్వారా వారి కుటుంబాలు అభి వృద్ధి చెందాలని భావించారు. అందులో భాగంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ క్రమంలోనే విద్యాహక్కు చట్టం ద్వారా 25 శాతం సీట్లు పేదలకు కేటాయించే దిశగా చర్యలు చేపట్టారు. ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని చూసినా ఆయన ముందుకు సాగారు. –వానపల్లి రవీంద్ర, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన నిర్ణయాన్ని అడ్డుకునేందుకు ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. వివిధ రూపాల్లో నాటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు అండగా నిలవాల్సిందేనని సూచించారు. దాంతో కార్పొరేట్ సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. న్యాయస్థానం విద్యాహక్కు చట్టం అమలు చేయాల్సిందేనని తీర్పు ఇవ్వడంతో పాటు కొన్ని సూచనలు చేసింది. దాంతో ఏటా పేద వర్గాలకు కార్పొరేట్ సంస్థల్లో 25 శాతం సీట్లు ఉచితంగా దక్కుతున్నాయి. -
స్వచ్ఛాంధ్రతో పరిశుభ్రంగా గ్రామాలు
మైలవరం: స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి లావణ్యకుమారి తెలిపారు. మైలవరం ఎస్వీఎస్ కల్యాణ మండపంలో గ్రామ పంచాయతీ, వెలుగు కార్యాలయం ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విచ్చల విడిగా ప్లాస్టిక్ వస్తువులు వినియోగించడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని చెప్పారు. క్యారీ బ్యాగులు ఎక్కడబడితే అక్కడ పడేయడంతో భూమి ఉపరితలంలో పేరుకుపోతున్నాయని తెలిపారు. దీంతో వర్షపు నీటిని భూమి పీల్చుకోలేకపోతుందని పేర్కొన్నారు. వాడిన ప్లాస్టిక్ వస్తువులను పంచాయతీ పారిశుద్ధ్య వాహనం వచ్చినపుడు అప్పగిస్తే వాటిని దూరంగా డంప్ చేస్తారని వెల్లడించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా ఉంచకుని ఆరోగ్యవంతమైన గ్రామాలను తీర్చిదిద్దుకోవాలని సూచించారు. రోగం వచ్చాక మందులు వాడేకన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మేలన్నారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మోతి బాబు మాట్లాడుతూ ఇళ్లలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. పంచాయతీ కార్మికులను సత్కరించారు. తహసీల్దారు అబ్దుల్ ధారియా, సర్పంచ్ మంజుభార్గవి, తదితరులు పాల్గొన్నారు. మైలవరం లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఈ వేస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె.అప్పారావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ బి. శివహరిప్రసాద్, ఉమామహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.జిల్లా పంచాయతీ అధికారి లావణ్యకుమారి -
ఉత్సాహంగా రన్ ఫర్ జీసస్
లబ్బీపేట(విజయవాడతూర్పు): క్రీస్తు సందేశం సమస్త మానవాళికి శాంతి సందేశం కావాలని విజయవాడ కేథలిక్ డయోసిస్ బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు, సీఎస్ఐ కృష్ణా, గోదావరి డయోసిస్ బిషప్ టి. జార్జికొర్నేలియస్ పిలుపునిచ్చారు. ఈస్టర్ (పాస్కా) సందర్భంగా ఏపీ ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చిలు, నగరంలోని అన్ని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శనివారం రన్ ఫర్ జీసస్ నిర్వహించారు. పటమటలోని సెయింట్ పాల్స్ చర్చి వద్ద బిషప్‌లు జోసఫ్ రాజారావు, కొర్నేలియస్, మోన్సిన్యోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్‌లు పునరుత్థానుడైన క్రీస్తును స్వాగతిస్తూ కాగడాలు వెలిగించి ఆనందోత్సాహాల మధ్య రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా బిషప్‌లు రాజారావు, కొర్నేలియస్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాన్ని క్రైస్తవులు ఎంతో భక్తి విశ్వాసాలతో జరుకుంటున్నారని చెప్పారు. ఫాదర్ మువ్వల ప్రసాద్, ప్రెసిడెంట్ అండ్ డైరెక్టర్ పాస్టర్ ఎస్. జయకుమార్ బాబు మాట్లాడుతూ రన్ ఫర్ జీసెస్ తెలుగు రాష్ట్రాల్లో దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సెయింట్ పాల్స్ కథెడ్రల్ చర్చి నుంచి ప్రారంభమైన ర్యాలీ సెయింట్ పాల్స్ బసిలికా సీయస్ఐ చర్చి ప్రాంగణానికి చేరుకొంది. రన్ ఫర్ జీసెస్ స్టేట్ కో–ఆర్డినేటర్ శివాజిరాజు అల్లూరి విశ్వప్రసాద్, ప్రవీణ్, కరుణానిధి, మాజీ డెప్యూటీ మేయర్ ఎస్. గ్రిటన్ తదితరులు పాల్గొన్నారు. -
అద్భుతం.. హంసలదీవి సాగరతీరం
కుటుంబసభ్యులతో కలిసి తీరంలో సేదతీరిన జేసీ గీతాంజలి శర్మ కోడూరు: ప్రకృతి రమణీయ దృశ్యాలకు నెలవైన హంసలదీవి సాగరతీరం అద్భుతంగా ఉందని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. కుటుంబసభ్యులతో కలిసి జేసీ సాగరతీరాన్ని శనివారం వేకువజామున సందర్శించారు. పాలకాయతిప్ప శింకు నుంచి పవిత్ర కృష్ణా, సాగర సంగమం వరకు పడవ ప్రయాణం చేసి ప్రకృతి అందాలను తిలకించారు. మడచెట్ల వివరాలను అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాగర సంగమ విశిష్టతను రెవెన్యూ అధికారులు జేసీకి వివరించారు. అక్కడ కొంతసేపు సేదతీరి పాలకాయతిప్ప బీచ్‌లో పర్యటించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాబేళ్ల సంతానోత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కేంద్రంలో ఉత్పత్తి అయిన తాబేళ్ల పిల్లలను కుటుంబ సభ్యులతో కలిసి జేసీ సముద్ర బాట పట్టించారు. తాబేళ్ల పిల్లలు సముద్రం వైపు బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్తున్న దృశ్యాలను కెమెరాల్లో బంధించారు. పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో ఉన్న వివిధ రకాల జీవరాశుల నమునాలను ఆసక్తిగా తిలకించారు. మైరెన్ ఎస్ఐ పూర్ణమాధురి, రెవెన్యూ, అటవీ, పంచాయతీరాజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయండి
మధురానగర్(విజయవాడసెంట్రల్): హనుమజ్జయంతిని పురస్కరించుకుని హిందూ సమాజానికి ధైర్య సాహసాలను ఇచ్చే హనుమాన్ శోభాయాత్ర (బైక్ ర్యాలీ)ను విజయవంతం చేయాలని శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు. వచ్చేనెల 22న విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగబోయే శోభాయాత్ర స్టిక్కర్, పోస్టర్ విడుదల కార్యక్రమం మాచవరం దాసాంజనేయస్వామి దేవాలయంలో శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా శివస్వామి పాల్గొని వీహెచ్‌పీ కేంద్రీయ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, వీహెచ్‌పీ ప్రాంత కోశాధికారి దుర్గాప్రసాద్ రాజు, వీహెచ్‌పీ విజయవాడ మహానగర్ అధ్యక్షులు సానా శ్రీనివాస్‌తో కలిసి బైక్ స్టిక్కర్, వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. విశ్వ హిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు. -
కారు ఢీకొని ఇద్దరు దుర్మరణం
బంటుమిల్లి: మండల పరిధిలోని నారాయణపురం గ్రామ శివారులో 216 జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు టీవీ మెకానిక్‌లు దుర్మరణం చెందారు. ఎస్ఐ గణేష్‌కుమార్ కథనం మేరకు... మచిలీపట్నం పట్టణానికి చెందిన వాసాబత్తుల వీరాచారి (40), అనకాపల్లి శివప్రసాదు (40) ద్విచక్రవాహనంపై రాజమండ్రి వెళ్లి పనులు పూర్తి చేసుకుని మచిలీపట్నం తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయం 6 గంటల సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగం పేరుతో రూ. 22 లక్షలు స్వాహా పెనమలూరు: ఉద్యోగం పేరుతో మహిళ వద్ద రూ. 22 లక్షల సొమ్ము సైబర్ నేరగాళ్లు స్వాహా చేసిన ఘటనపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. తాడిగడప గ్రామానికి చెందిన నూకల విజయశ్రీ ఉద్యోగం కోసం ప్రయత్నాల్లో ఉంది. ఆమె ఆన్లైన్లో రెంట్కామ్ అనే వెబ్సైట్లో చాట్ చేయగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమెతో చాటింగ్ చేసి గ్రూప్‌లో చేర్చారు. ఆన్లైన్లో ఆమెకు టాస్కు ఇవ్వగా సకాలంలో పూర్తి చేసింది. దీంతో సైబర్ నేరగాళ్లు సొమ్ము పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని విజయశ్రీకి ఆశ చూపి నమ్మించారు. సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి ఈ నెల 5 నుంచి 7వ తేదీల్లో విజయశ్రీ పలు దఫాలుగా రూ. 22,09,857 ఆన్లైన్లో సొమ్ము ట్రాన్స్ఫర్ చేసింది. సొమ్ము బదిలీ అయిన తర్వాత గ్రూప్‌లో ఉన్న వ్యక్తులు స్పందించడం మానేశారు. దీంతో తాను మోసపోయానని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య మంగొల్లు(వత్సవాయి): ఫ్యాన్‌కు ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఏలూరి నరసింహారావు, స్వాతి దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె అయిన ఏలూరి రాజ (14) జగ్గయ్యపేటలోని ఒక ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. తెల్లవారుజామున ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. తల్లి స్వాతి ఫిర్యాదు మేరకు ఎస్ఐ పి.ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్ప్రతికి తరలించారు. అడవిలో వృద్ధుడి మృతదేహం గుర్తింపు తిరువూరు:మండలంలోని లక్ష్మీపురం అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతున్న వృద్ధుడి మృతదేహాన్ని శనివారం పశువుల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 8న చిట్టేల గ్రామానికి చెందిన పెరుమాళ్ళ ఆశీర్వాదం (72) కనిపించట్లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా శనివారం లక్ష్మీపురం అటవీ ప్రాంతంలో వృద్ధుడి మృతదేహం చెట్టుకు వేలాడుతున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. చెట్టుకు లుంగీతో వేలాడుతున్న మృతదేహాన్ని ఆశీర్వాదంగా కుటుంబసభ్యులు గుర్తించారని చెప్పారు. ఆయనది హత్యా, ఆత్మహత్యా అనే విషయమై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. కుళ్లిపోయి అస్తిపంజరంగా మారిన మృతదేహానికి సంఘటనా స్థలంలోనే పంచనామా చేసి ఖననం చేసినట్లు వెల్లడించారు. -
కారు పల్టీకొట్టి నలుగురికి తీవ్ర గాయాలు
నున్న(విజయవాడరూరల్): వెస్ట్ బైపాస్ జాతీయ రహదారి నున్న గ్రామంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలతో పాటు ఇద్దరు పిల్లలకు గాయాలైన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న కారు విజయవాడ వెస్ట్ నేషనల్ బైపాస్ రోడ్డులో నున్న స్లిప్‌వే వద్దకు వచ్చేసరికి కంట్రోల్ తప్పి రోడ్డు పక్కన ఉన్న సిమెంటు దిమ్మను వేగంగా ఢీ కొట్టింది. కారు పల్టీకొట్టగా డ్రైవింగ్ చేస్తున్న పాము కాసుబాబు లోపల ఇరుక్కు పోయాడు. ఆయన భార్య శిరీషకు తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు మగ పిల్లలకు గాయాలు కాగా ఒక బాబుకి కుడి కాలు విరిగింది. హైవేపై వెళుతున్న ప్రయాణికులు,సెక్యూర్టీ సిబ్బంది హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి వెళ్లి కారులో ఇరుక్కుపోయిన వారిని బటయకు తీశారు. నేషనల్ హైవే అంబులెన్స్‌లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాకినాడకు చెందిన పాము కాసుబాబు హైదరాబాద్ రెడ్డీస్ ల్యాబ్‌లో ఐటీ మేనేజర్ గా పని చేస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో ఇద్దరు పిల్లలు భార్యతో కలిసి కారులో కాకినాడు వెళుతున్నారు. నేషనల్ హైవే పక్కన టవర్ నిర్మాణం పనులు నిమిత్తం రోడ్డుపై పనులు పూర్తి కాలేదు. రోడ్డు సగభాగంలో రబ్బీష్ కుప్పలు పోసి సింగిల్‌వే మూసివేసి ఉండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న నున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తతో పాటు ఇద్దరు పిల్లలకు గాయాలు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతుండగా ఘటన -
పెద ఓగిరాలలో భారీ చోరీ
ఉయ్యూరు రూరల్: మండలంలోని పెద ఓగిరాలలో శనివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. ఇంటి యజమాని నిద్రిస్తున్న క్రమంలో చోరీ జరిగినట్లుగా కంకిపాడు సీఐ మురళీకష్ణ తెలిపారు. గ్రామానికి చెందిన మా రెడ్డి మాధవి ఒంటిరిగా ఉంటుంది. భర్త వ్యాపారం రీత్యా గుంటూరులో ఉంటారు. కుమారుడు అమెరికాలో సెటిల్ అయ్యాడు. మాధవి ఒక్కరే ఉంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో దుండగులు వెనుక తలుపుకున్న తాళం వద్ద గొళ్లాన్ని విరగ్గొట్టి లోపలకు ప్రవేశించారు. బీరువాలో ఉన్న రూ.15 లక్షల నగదుతో పాటు కొంత బంగారాన్ని దొంగిలించినట్లు తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లతో పరిశీలించారు. గన్నవరం డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు ఘటన స్థలాన్ని సందర్శించి బాధితురాల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ బాబు తెలిపారు. బైక్ చోరీ.... భారీ చోరీ జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే ఇంటి బయట నిలిపి ఉంచిన ఓ బైకును సైతం దొంగలు అపహరించారు. ప్రతిరోజు ఇంటి లోపల భద్రపరచుకునే వాహన యజమాని శుక్రవారం రాత్రి బయటనే పార్కింగ్ చేసి ఉంచడంతో దుండగులు ఆ బైకును సైతం దొంగిలించారు. -
నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపుపై హర్షం
కూచిపూడి(మొవ్వ): యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో నాట్య శాస్త్రాన్ని ప్రత్యేకంగా నమోదు చేశారని కేంద్ర సాంస్కృతిక పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించటంతో ప్రముఖ కూచిపూడి నాట్య క్షేత్రం కూచిపూడిలో కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కళాపీఠంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చింతా రవి బాలకృష్ణ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏలేశ్వరపు శ్రీనివాసులు, నాట్య విద్యార్థులు కలిసి నటరాజ స్వామికి శనివారం పూలమాలవేసి ఆనందోత్సాహాలతో స్వీట్లు పంచుకొన్నారు. 24 గంటలూ ఆన్లైన్ సేవలుబంటుమిల్లి: రాష్ట్రంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సబ్ ట్రెజరీల్లో 24 గంటలూ ఆన్లైన్ సేవలు అందిస్తున్నామని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ట్రెజ రీస్ అండ్ అకౌంట్స్ ఆఫీసరు డాక్టరు నేతల మోహన్‌రావు తెలిపారు. స్థానిక సబ్ ట్రెజరీని ఆయన శనివారం ఆకస్మిక సందర్శించారు. డీడీ ఎస్.రవికుమార్, ఎస్టీఓ గోపీకృష్ణతో కలసి ఆన్లైన్ రికార్డులు, మాన్యువల్ రికార్డులను పరిశీలించి అభినందించారు. ఉద్యోగుల జీతాల బిల్లులు, మెడికల్ బిల్లులు, పింఛన్‌దారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎస్టీఓ గోపీకృష్ణను ఆదేశించారు. అనంతరం మోహన్‌రావు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 206 సబ్ ట్రెజరీల ద్వార ప్రభుత్వ సేవలు ప్రజలకు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అత్యవసర సేవల్లో ఎక్కడ జాప్యం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్, డీఏ ఎరియర్స్‌ను త్వరలో చెల్లించేందుకు ప్రభుత్వ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జాతీయ ఖోఖో పోటీలకు గుడివాడ విద్యార్థులుగుడివాడ టౌన్: ఖేలో ఇండియా జూనియర్ ఖోఖో జాతీయ స్థాయి పోటీలకు గుడివాడ ఎస్పీఎస్ మునిసిపల్ హైస్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారని వ్యాయామ ఉపాధ్యాయుడు మడకా ప్రసాద్ శనివారం తెలిపారు. పాఠశా లకు చెందిన డి.రాకేష్, టి.తిమోతి, సాజిత్ ఖాన్, బి.జయ సూర్యతేజ రాష్ట్ర జట్టుకు ఎంపి కయ్యారని పేర్కొన్నారు. మే నాలుగు నుంచి 11వ తేదీ వరకు బిహార్ రాష్ట్రంలోని గయ పట్టణంలో జరిగే జాతీయ స్థాయి ఖోఖో పోటీ లకు తమ విద్యార్థులు ప్రాతినిధ్యం వహిస్తా రని వివరించారు. జాతీయ పోటీలకు ఎంపికై న విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శొంఠి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. అద్దె గర్భం అనుమతులపై సమీక్ష లబ్బీపేట(విజయవాడతూర్పు): సహాయక పునరుత్పత్తి సాంకేతికత(ఏఆర్టీ), అద్దె గర్భం (సరోగసి) చట్టం 2021 అమలులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా మెడికల్ బోర్డు శనివారం సమావేశమైంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దె గర్భం సేవలు పోందడానికి దరఖాస్తు చేసుకున్న ఏడుగురు దంపతుల అప్లికేషన్లను పరిశీలించారు. వారు అర్హత కలిగి ఉన్నారో లేదో చర్చించి పరిశీలించారు. ఈ సందర్భంగా కొన్ని సూచనలు చేశారు. వాటిని అమలు చేస్తే అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. సమావేశంలో ఎన్హెచ్ఎం కార్యక్రమం జిల్లా అధికారి డాక్టర్ నవీన్, జీజీహెచ్ ప్రసూతి విభాగాధిపతి డాక్టర్ కేశవచంద్ర, పిడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ పి.అనిల్‌కుమార్, డాక్టర్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
అన్ని వర్గాలనూ మోసం చేసిన కూటమి
లబ్బీపేట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ కృష్ణా, గుంటూరు జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పది నెలల పాలనలోనే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వక విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొ న్నారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షుల పదవీ బాధ్యతల స్వీకారోత్సవం శనివారం విజయవాడలోని ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు ఎప్పుడు మంచి చేయా లని ఆలోచన చేసే వారన్నారు. వైద్య రంగాన్ని మెరుగు పరిచి పేదలకు నాణ్యమైన వైద్యం అందేలా చూశారన్నారు. నేడు కూటమి ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేస్తున్నట్లు ఆరోపించారు. వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తున్నారని, ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్దాం.. కూటమి ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్దామని కార్యకర్తలు, నాయకులకు వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందని, గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలచి గిట్టుబాటు ధర కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. పేదలకు మేలు చేసేందుకు అందించిన సంక్షేమ పథకాలను సైతం కూటమి ప్రభుత్వం అటకెక్కించిందన్నారు. నిత్యం వైఎస్సార్ సీపీపై అసత్య ప్రచారాలు చేస్తూ, తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. సంపద సృష్టి పేరుతో అందరినీ మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు పెద్దపీట.. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు వైఎస్సార్ సీపీ పెద్దపీట వేస్తుందన్నారు. కార్యకర్తలందరూ క్రమ శిక్షణతో పనిచేయాలని, కష్టపడిన ప్రతి ఒక్కరికీ పదవులు వస్తాయన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహనరావు, నల్లగట్ల స్వామిదాసు, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్, ఎండీ రుహుల్లా, జగ్గయ్యపేట పార్టీ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, డెప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజరెడ్డి, బెల్లం దుర్గతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. సంక్షేమం లేదు.. అంతా క్షామమే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం రాజ్యసభ సభ్యుడు, కృష్ణా, గుంటూరు జిల్లాల వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి -
స్వచ్ఛ ఆంధ్ర నిర్మాణంలో భాగస్వాములు కావాలి
గన్నవరం: స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ కోరారు. మండలంలోని దావాజిగూడెంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ–వేస్ట్‌పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సమూన్ మాట్లాడుతూ.. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకాధికారిని నియమించిందని తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యవంతమైన జీవనం కోసం పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. కృష్ణా కలెక్టర్ డి.కె.బాలాజీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యర్థాలు విపరీతంగా పెరిగాని, వాటిని శాస్త్రియ పద్ధతిలో నిర్వీర్యం చేయకపోతే పర్యావరణానికి, మానవాళికి హాని జరుగుతుందని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ కోసం ప్రతి పంచాయతీలో కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇళ్లలోని ఈ– వ్యర్థాలను ప్రజలు ఈ సెంటర్లలో అప్పగించాలని సూచించారు. బుద్దవరం పంచాయతీ శాశ్వత భవన నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే, ప్రభుత్వ విఫ్ యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. హనుమాన్‌జంక్షన్ నుంచి రామవరప్పాడు వరకు జాతీయ రహదారి సుందరీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సర్పంచి బడుగు బాలమ్మ, డీపీఓ జె.అరుణ, వైస్ ఎంపీపీ కొమ్మరాజు సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ విమానాశ్రయం(గన్నవరం): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా మే రెండో తేదీన గన్నవరం విమానాశ్రయానికి విచ్చేస్తున్న సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. ప్రధాన మంత్రి పర్యటన నేపథ్యంలో విమానాశ్రయంలో ఎస్పీ ఆర్.గంగాధరరావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి కలెక్టర్ పలు శాఖల జిల్లా అధికారులతో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అమరావతి రాజధాని పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి విచ్చేస్తున్నట్లు తెలిపారు. అధికారులందరూ సమన్వయంతో లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రధానితో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఎయిర్‌పోర్ట్‌కు వస్తారని తెలిపారు. వీవీఐపీలు పర్యటించే ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందో బస్తు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సాధారణ ప్రయాణికులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముందుగానే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునేలా సమాచారం అందించాలని సూచించారు. ప్రధాని భద్రతపై ఎస్పీజీతో చర్చించి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రముఖులు రాకపోకల సమయంలో ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ మీదుగా అమరావతి వరకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు వహించాలని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఆర్డీఓ బాల సుబ్రహ్మణ్యం, డీఎంహెచ్ఓ డాక్టర్ శర్మిష్ఠ, ఆర్అండ్బీ అధికారి లోకేష్, ఆర్టీఓ శ్రీనివాసు, డీఎస్ఓ పార్వతి, డీఎఫ్ఓ సునీత, ఎయిర్పోర్ట్ సహాయ మేనేజర్ శ్రీలేఖ, డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
రైతులపై కూటమి నిర్లక్ష్యం
కంకిపాడు: పెసర కొనుగోళ్లు ప్రారంభమై నెల కావస్తోంది. నేటికీ ఏ ఒక్క రైతు ఖాతాలోనూ ఒక్క పైసా కూడా జమ కాలేదు. రోజుల తరబడి సొమ్ము కోసం రైతులు కొనుగోలు కేంద్రాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. స్వయంగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఓ రైతు పెసర సొమ్ము ఎప్పుడిస్తారంటూ ప్రశ్నిస్తే ప్రతిపాదనలు వెళ్లాయంటూ ఆయన మొక్కుబడిగా సమాధానం ఇచ్చి వెళ్లిపోయారు. దీనిని బట్టి రైతులపై కూటమి సర్కారుకు ఎంత శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చు. పేరుకేమో రైతు పక్షపాత ప్రభుత్వమని ప్రచారం చేసుకుంటున్న కూటమి సర్కారు రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసిందంటూ రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఏడాది రబీ సీజన్లో కృష్ణాజిల్లా వ్యాప్తంగా 2,84,237 ఎకరాల్లో మినుము, మూడు వేల హెక్టార్లలో పెసర సాగైంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించటంతో పంట దిగు బడులు ఆశాజనకంగా వచ్చాయి. ఎకరాకు ఏడెనిమిది క్వింటాళ్ల దిగుబడులు వచ్చాయి. ఎకరాకు పంట చేతికొచ్చేనాటికి రూ.30 వేల వరకూ పెట్టుబడులు పెట్టారు. బయట మార్కెట్ డీలా గత ఏడాది రబీ సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది రబీ సీజన్లో బయటి మార్కెట్లు డీలా పడ్డాయి. మినుము మద్దతు ధర క్వింటా రూ.7400 ఉంటే బయట మార్కెట్లో రూ.7200 మాత్రమే. గత ఏడాది రూ.9100 వరకూ ధర పలికింది. పెసర క్వింటా మద్దతు ధర రూ.8682. రూ.7400లకు మించి ధర దక్కటం లేదు. అపరాల రైతులు పడుతున్న మద్దతు కష్టాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. డిమాండ్‌కు అనుగుణంగా గత నెల 19న జిల్లాలో ఎనిమిది కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. ధర వ్యత్యాసం తక్కువగా ఉండటంతో మినుము రైతులు స్థానికంగానే దళారులకు పంట విక్రయిస్తున్నారు. మరి కొందరు మంచి ధర కోసం నిల్వ చేసుకుంటున్నారు. పెసర రైతులు మాత్రం క్వింటాకు రూ.1200 వరకూ తేడా ఉండటంతో కొనుగోలు కేంద్రాలకు తరలించి పంటను విక్రయిస్తున్నారు. రవాణా, కూలి ఖర్చుల భారం రవాణా, కూలి ఖర్చులు రైతులకు తలకు మించిన భారంగా మారాయి. కొనుగోలు కేంద్రం వద్దకు పెసరను ప్రైవేటు వాహనాల్లో తరలించటం, జల్లెడ పట్టించటం, కాటా వేయటానికి అయ్యే ఖర్చులు కూడా రైతులే భరించాల్సి ఉంది. పెట్టుబడులతో పాటు రవాణా, కూలి ఖర్చులు రూ.2 వేలు అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. నెల రోజులుగా సాగుతున్న పెసర కొనుగోళ్లు ఇప్పటి వరకూ ఒక్క పైసా అందక రైతుల అవస్థలు నగదు కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్‌కు గోడు వినిపించిన రైతు అయినా రైతుల ఆవేదనను పట్టించుకోని ప్రభుత్వం రైతులకు అందని సొమ్ము ప్రతిపాదనలు పంపించాం జిల్లా వ్యాప్తంగా 683 టన్నుల పెసర కొనుగోలు చేశాం. రైతులకు అందాల్సిన సొమ్ముపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపించాం. నాలుగు రోజుల్లో సొమ్ము విడుదలవుతుందని సమాచారం. విడుదల కాగానే రైతులకు ఖాతాలకు జమ చేస్తాం. రైతులు ఆందోళన చెందొద్దు. – మురళీకిషోర్, డీఎం, మార్క్‌ఫెడ్, కృష్ణాజిల్లా కూటమి ప్రభుత్వం రైతులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. సీజన్ ముగియగానే మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా రైతులు తీవ్ర అగచాట్లు పడ్డారు. పంటకు మార్కెట్లో ధర పలకక, కొనుగోలు కేంద్రాలు తెరవక, దళారులకు తెగనమ్ముకుని నష్టపోయారు. ఆర్థికంగా నష్టాన్ని చవిచూశారు. మార్కెట్ పరిస్థితులపై ముందుగానే క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా నివేదిక తెప్పించుకుని తదనుగుణంగా రైతులు నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యల్లో కూటమి విఫలమైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆరుగొలను, పెరికీడు, ఆత్కూరు, కంకిపాడు, కేసరపల్లి, బొడ్డపాడు, గుడివాడ, మొవ్వ ప్రాంతాల్లో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పెసలు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకూ 344 మంది రైతుల నుంచి 683.75 టన్నుల పెసర కొనుగోలు చేసి గోదాములకు తరలించారు. ఇందుకు రైతులకు రూ.3.77 కోట్లు అందాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరణ ప్రక్రియ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా నేటికీ ఒక్క రూపాయి కూడా రైతులకు అందలేదు. కూటమి ప్రభుత్వం చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోందని, తమను నిర్లక్ష్యం చేయటం అలవాటుగా మారిందని రైతులు వాపోతున్నారు. పెసర సొమ్ము అందక ఇబ్బంది పడుతున్నామంటూ కోలవెన్నుకు చెందిన ఓ రైతు ఇటీవల పునాదిపాడులో మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ప్రశ్నిస్తే ప్రతిపాదనలు పంపాము రాగానే వస్తాయంటూ వెళ్లిపోవటం గమనార్హం. -
ఐక్యరాజ్య సమితి సమావేశాలకు మోజెస్ అబ్రహాం హాజరు
చిలకలపూడి(మచిలీపట్నం): న్యూయార్స్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న ఎకనామికల్ అండ్ సోషల్ కౌన్సిల్ (ఈసీఓఎస్ఓసీ) యూత్ ఫోరం–2025 సమావేశాలకు మచిలీపట్నానికి చెందిన డాక్టర్ బొకినాల మోజెస్అబ్రహాం భారత ప్రతినిధిగా హాజరయ్యారు. ఈ నెల 15న ప్రారంభమైన ఈ సమావేశాలు గురువారం ముగిశాయి. ప్రపంచ వ్యాప్తంగా పాల్గొన్న యువనాయ కులతో కలిసి ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు’ అంశంపై జరిగిన చర్చలో మోజెస్ అబ్రహాం పాల్గొన్నారు. ఆరోగ్యం, లింగ సమానత్వం, వాతావరణ పరిరక్షణ, శాస్త్రసాంకేతికత, యువ ఉద్యోగవకాశాలు వంటి అంశాలపై తాను ప్రసంగించానని డాక్టర్ మోజెస్ తెలిపారు. పాలసీ నిర్ణయాల్లో యువత భాగస్వామ్యం, శాంతి నిర్మాణం, డిజిటల్ పరివర్తన, ప్రపంచ స్థాయి భాగస్వామ్యాల ప్రాధాన్యతను ఈ ఫోరం ప్రధానంగా ప్రతిబింబించిందని తెలిపారు. మోజెస్ మచిలీపట్నం నోబెల్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుంచి ఫిజిక్స్‌లో డాక్టరేట్, ఐఐటీ కాన్పూర్, యూనివర్సిటీ ఆఫ్ బార్సిలోనా వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో శుద్ధ ఇంధన సాంకేతికతపై పరిశోధనలు చేశారు. ప్రస్తుతం ఫిలడెల్ఫియాలోని డ్రెక్సెల్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రకటించిన ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రపంచ యువ నాయకులతో కలిసి చర్చలు జరపడం గర్వంగా ఉందని మోజెస్ తెలిపారు. -
వేదాంక్షికి గిన్సిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
మధురానగర్(విజయవాడసెంట్రల్): నగరం లోని కావ్య కౌస్తుభ కుచిపూడి నృత్యాలయం విద్యార్థిని పరమాత్ముని శ్రీవెంకట కృష్ణ వేదాంక్షి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. 2023 డిసెంబర్లో హైదరాబాద్‌లో 4,218 మంది కుచిపూడి కళాకారులు క్లాసికల్ ఇండియన్ డాన్స్‌లో ఏడు నిమిషాల పాటు అతిపెద్ద ఏకకాలిక ప్రదర్శన ఇచ్చి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. గురువు డాక్టర్ కోట సరిత మార్గ దర్శనంలో వేదాంక్షి కుచిపూడి కళా వైభవంలో పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నిలిచింది. ప్రథమ చికిత్సలపై అవగాహన పెంచుకోవాలి లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రథమ చికిత్స లపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర వైద్యవిద్య సంచాలకుడు డాక్టర్ నరసింహం సూచించారు. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలో బేసిక్ లైఫ్ సపోర్టు విభాగం ఆధ్వర్యంలో విద్యుత్ శాఖలో పనిచేసే 60 మంది సిబ్బందికి గురువారం శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీఎంఈ డాక్టర్ నరసింహం మాట్లాడుతూ.. అత్యవసర విభాగమైన విద్యుత్ శాఖ ఉద్యోగులకు ప్రథమ చికిత్సపై శిక్షణ అవసరమన్నారు. బీఎల్ఎస్ విభాగం నోడల్ ఆఫీసర్ డాక్టర్ సొంగా వినయ్‌కుమార్ మాట్లాడుతూ.. విద్యుత్ షాక్, గుండెపోటు, పాము కాటు వంటి సందర్భాల్లో ప్రథమ చికిత్సలపై వైద్యులు అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు. అడిషనల్ డీఎంఈ డాక్టర్ డి.వెంకటేష్, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కాలేజీ బస్సు ఢీకొని మహిళ మృతి
పెనమలూరు: మండలంలోని పెదపులిపాక గ్రామంలో గురువారం ఓ ఇంజినీరింగ్ కాలేజీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఓ వివాహిత దుర్మరణం చెందింది. పెనమలూరు పోలీసుల కథనం మేరకు.. బాపట్ల జిల్లా రేపల్లె పద్మసాలివారి వీధికి చెందిన చిలుమూరు శిరీష(38), శ్రీనివాసకిరణ్ భార్యాభర్తలు. శిరీష పుట్టినిల్లు తాడిగడప. గురువారం ద్విచక్రవాహనంపై వారు తాడిగడప వస్తుండగా పెదపులి పాకలోని చెరువు వద్ద ఓ ఇంజినీరింగ్ కాలేజీ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాసకిరణ్, శిరీష ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. శిరీష తలపై బస్సు చక్రాలు ఎక్కాయి. దీంతో ఆమె తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీనివాసకిరణ్ అవనిగడ్డలో విద్యుత్ శాఖలో పని చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రోటావేటర్‌లో పడి కౌలు రైతు మృతి
కోడూరు: డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ కౌలు రైతు రోటావేటర్‌లో పడి మృతిచెందిన ఘటన కోడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. హెడ్ కానిస్టేబుల్ పి.కె.వి.సత్యనారాయణ కథనం మేరకు.. కోడూరు శివారు నాయుడుపేట గ్రామానికి చెందిన మల్లా నాగమల్లేశ్వరరావు (60) అదే గ్రామంలో 80 సెంట్ల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం పంటభూమి ఖాళీగా ఉండడంతో కూరగాయాల సాగుకు ఏర్పాట్లు చేశాడు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమ యంలో ఈ భూమిలో రోటావేటర్తో మట్టి పని చేపట్టాడు. రోటావేటర్ బ్లేడ్లకు మట్టి పట్టడంతో నాగమల్లేశ్వరావు తొలగించే ప్రయత్నం చేశాడు. నాగమల్లేశ్వరరావును గమనించకుండా డ్రైవర్ ప్రభు కుమార్ రోటావేటర్ బ్లేడ్లను తిప్పాడు. దీంతో నాగమల్లేశ్వరరావు రెండు కాళ్లు రోటా వేటర్ బ్లేడ్లలోకి వెళ్లి విరిగిపోయాయి. ఓ బ్లేడు నాగమల్లేశ్వరరావు డొక్కలో బలంగా దిగింది. స్థానికులు హుటాహుటిన నాగమల్లేశ్వరరావును అవనిగడ్డ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డ్రైవర్ ప్రభుకుమార్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని మృతుడి భార్య వెంకటేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్‌సీ సత్యనారాయణ తెలిపారు. -
ఫలించిన లక్ష్యం.. మెరిసిన మత్స్యం
తిరువూరు: ఇంటర్మీడియెట్ విద్యలో గత ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ఫలితం ఇప్పుడు ప్రతిబింబిస్తోంది. దీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాణ్యమైన విద్య అందుతోంది. గత ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు ఫలించాయని ఈ ఏడాది ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు మరోమారు నిరూపించాయి. తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల రెండు సంవత్సరాలుగా స్టేట్ టాప్ ర్యాంకర్లను అందించింది. గతేడాది ఆదూరి స్వప్న హెచ్ఈసీ గ్రూపులో 912 మార్కులు సాధించి జగనన్న ఆణిముత్యాలు పురస్కారానికి ఎంపికై ంది. ఈ ఏడాది ఇదే కళాశాలలో ఫిషరీస్ ఒకేషనల్ గ్రూపు విద్యార్థిని పింగళి ప్రత్యూష 964 మార్కులు సాధించి మరోసారి రాష్ట్రస్థాయిలో కళాశాలకు పేరు తెచ్చింది. అకుంఠిత దీక్షతో ఆశయసాధన నిరుపేద కుటుంబానికి చెందిన ప్రత్యూష పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాక కోవిడ్ పరిస్థితుల కారణంగా చదువు కొనసాగించలేకపోయింది. ఆమె సొంత ఊరు అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామం. ఆ గ్రామంలో పదో తరగతి పూర్తయిన తదుపరి బైపీసీ గ్రూపులో ఇంటర్మీడియెట్ చదవడానికి ప్రయత్నించినా పరిస్థితులు అనుకూలించక మధ్యలోనే మానేయాల్సి వచ్చింది. తల్లి చిన్నతనంలోనే మరణించగా తండ్రి రెక్కల కష్టంతో చదివిస్తుండటంతో ఎలాగైనా ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే లక్ష్యంతో ప్రత్యూష మళ్లీ ఇంటర్మీడియెట్లోనే చేరాలని నిర్ణయించుకుంది. ఫిషరీస్‌లో చదువుకోవాలన్నది ఆమె లక్ష్యం. తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కోర్సు ఉండటం, వసతి గృహం కూడా అందుబాటులో ఉందని గుర్తించింది. తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ గ్రూపులో ఫిషరీస్ కోర్సు తీసుకుంది. తన సోదరి ప్రోత్సాహంతో తిరువూరు కళాశాలలో చేరి ఇక్కడే బాలికల ప్రభుత్వ వసతిగృహంలో ఉంటూ చదువు కొనసాగించింది. కళాశాలలో నిర్వహించే అన్ని పరీక్షల్లోనూ మంచి మార్కులు సాధిస్తుండటంతో ఆ బాలికపై కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. స్టేట్ ర్యాంకు సాధించాలనే లక్ష్యంతో బాలికకు అవసరమైన ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ ఏడాది ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 1000కి 964 మార్కులు సాధించడంలో తోడ్పాటు అందించారు. -
కేఈబీ కాలువలో విద్యార్థి గల్లంతు
ఘంటసాల: తల్లితో కలసి కాలువ దగ్గరకు వెళ్లి ఈత కొడుతూ విద్యార్థి గల్లంతైన ఘటన ఘంటసాల మండలం పాపవినాశనంలో గురువారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. పాపవినాశనం గ్రామానికి చెందిన పత్తిపాటి వెన్నెల, ఏడుకొండలు దంపతులు. వారికి కుమారుడు పవన్ (15), కుమార్తె ఉన్నారు. 11 సంవత్సరాల క్రితం ఏడుకొండలు కేఈబీ కెనాల్లో గల్లంతై మృతి చెందాడు. అప్పటి నుంచి వెన్నెల తన రక్కల కష్టంతో పిల్లలను సాకుతోంది. పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న పవన్ కొద్ది రోజులుగా తల్లితో పాటు వ్యవసాయ కూలి పనులకు వెళ్తున్నాడు. గురు వారం ఉదయం తల్లీకుమారులు మొక్కజొన్న కండెలు విరిచేందుకు వెళ్లారు. ఇంటికి వచ్చాక దుస్తులు ఉతికేందుకు వెన్నెల కేఈబీ కాలువ వద్దకు వెళ్లింది. ఆమెతోపాటు పవన్ కాలువ వద్దకు వెళ్లాడు. సరదా ఈత కొట్టేందుకు కాలువలోకి దిగాడు. కాలువలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో పవన్ గల్లంతయ్యాడు. వెన్నెల ద్వారా సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇరిగే షన్ అధికారులకు సమాచారం ఇచ్చి నిమ్మగడ్డ లాకు వద్ద గేట్లు వేసి నీరు ఆపాలని కోరారు. అయితే చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. తన కళ్ల ఎదుటే కుమారుడు గల్లంతవడంతో వెన్నెల కన్నీరుమున్నీరుగా విలపించింది. -
స్పందించని సహృదయం
లబ్బీపేట(విజయవాడతూర్పు): పేద రోగులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ హృదయం స్పందించడంలేదు. ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)లో అత్యాధునిక సౌకర్యాలు, వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నా అత్యవసర సమయంలో రోగులు తమ గుండెలను అరచేతిలో గుంటూరుకు వెళ్లాల్సిన పరి స్థితి దాపురించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యం పొందలేక, ప్రభుత్వాస్పత్రికి వస్తే గుంటూరు వెళ్లండని వైద్యులు ఉచిత సలహా ఇస్తుండటంతో చేసేదేమీ లేక రోగులు తమ పేదరికాన్ని నిందించుకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. గుండె శస్త్ర చికిత్స విభాగానికి గ్రహణం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని గుండె శస్త్ర చికిత్స విభాగానికి గ్రహణం పట్టింది. ఆ విభాగంలో ఆధునిక సౌకర్యాలు ఉన్నా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఆ విభాగంలో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, పోస్ట్ ఆఫ్ ఇంటెన్సివ్ కేర్ వార్డును ఏర్పాటు చేసి ముగ్గురు వైద్యులను నియమించారు. ప్రస్తుతం గుండె ఆపరేషన్లు జరగడం లేదు. గుండె ఆపరేషన్లు అవసరమైన రోగులను గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లండంటూ వైద్యులు ఉచిత సలహా ఇస్తున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఐదో అంతస్తులో కార్డియో థోరాసిక్ శస్త్ర చికిత్స (గుండె ఆపరేషన్) విభాగం ఉంది. అక్కడ ఆధునిక ఆపరేషన్ థియేటర్‌తో పాటు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కూడా ఉంది. ఈ విభాగాన్ని కోవిడ్‌కు ముందు ఏర్పాటు చేశారు. కోవిడ్ నేపథ్యంలో ఎక్కువ రోజులు మూత పడి ఉండటంతో మరలా 2023లో రూ.20 లక్షలతో థియేటర్‌ను ఆధునికీకరించారు. లామినర్ ఫ్లోరింగ్, రోగులకు ఇన్ఫెక్షన్లు రాకుండా మాడ్యులర్లను ఏర్పాటు చేశారు. శస్త్ర చికిత్స అనంతరం రోగులను ఉంచేందుకు ఆధునిక సౌకర్యాలతో పోస్ట్ ఆఫ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ శస్త్ర చికిత్సలు మాత్రం జరగడం లేదు. అందుబాటులో ముగ్గురు వైద్యులు కార్డియో థోరాసిక్ శస్త్ర చికిత్స విభాగంలో ప్రస్తుతం ముగ్గురు వైద్యులు ఉన్నారు. వారంలో మూడు రోజులు (సోమ, బుధ, గురు) అవుట్‌పేషెంట్లు వారు సేవలు అందిస్తున్నారు. గుండె సర్జరీలు మాత్రం చేయడం లేదు. చేతి రక్తనాళాలు, కాళ్ల రక్తనాళాల్లో పూడికలు వంటి వాటికి మాత్రమే సర్జరీలు చేస్తున్నారు. ఇక్కడ గుండె ఆపరేషన్లు చేసేందుకు అవసరమైన సిబ్బందికి నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సి ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం చొరవ చూపడం లేదు. దీంతో గుండె సర్జరీ తర్వాత రోగులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై ప్రస్తుతం జీజీహెచ్ సిబ్బందికి సరైన అవగాహన లేక పోవడంతోనే సర్జరీలు చేసేందుకు వైద్యులు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ప్రభుత్వం చొరవ చూపి గుండె సర్జరీలు చేసేలా చూడాలని రోగులు వేడుకొంటున్నారు. గుంటూరు రిఫర్ చేస్తున్నారు ప్రస్తుతం కార్డియాలజీ విభాగంలో క్యాథ్‌ల్యాబ్ పీపీపీ మోడ్‌లో నిర్వహిస్తున్నారు. అక్కడ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత స్టెంట్ అవసరమైతే అక్కడే వేస్తున్నారు. బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తే మాత్రం గుంటూరుకు రిఫర్ చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ ఉన్న రోగులు అయితే విజయవాడలోని ఏదో ఒక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తున్నారు. ఇక్కడికి ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు జిల్లాలకు చెందిన రోగులు వస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి ఇక్కడి వచ్చిన వారు, మరలా గుంటూరు వెళ్లా లంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోతున్నారు. బెజవాడ జీజీహెచ్‌లో హృద్రోగులకు అందని మెరుగైన వైద్యం ఆధునిక సౌకర్యాలున్నా గుండె వైద్య విభాగం అలంకార ప్రాయం బైపాస్ ఆపరేషన్లకు గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతోపేదలకు గుండె ఆపరేషన్లు దూరం గుంటూరు వెళ్లమన్నారు ఇటీవల నాకు తెలిసిన వ్యక్తికి ఛాతీలో నొప్పి వస్తే ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. అక్కడ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. ఇక్కడ సర్జరీలు చేయడం లేదని, గుంటూరు వెళ్లాలని వైద్యులు చెప్పడంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వాళ్లతో మాట్లాడి చేయించాల్సి వచ్చింది. ఇలా ఎంతో మంది గుండె సర్జరీల కోసం ఇబ్బంది పడుతున్నారు. – సయ్యద్ అలీం, కో ఆప్షన్ సభ్యుడు, వీఎంసీ గతంలోనే సౌకర్యాల కల్పన గత ప్రభుత్వ హయాంలోనే విజయవాడ జీజీహెచ్‌లో గుండె శస్త్ర చికిత్సలు చేసేందుకు సౌకర్యాలు కల్పించాం. ఆపరేషన్ థియేటర్‌ను రూ.20 లక్షలతో ఆధునికీకరించాం. ముగ్గురు వైద్యులను నియమించాం. ఇంతలో ఎన్నికలు రావడంతో సేవలను ప్రారంభించలేకపోయాం. ప్రస్తుత ప్రభుత్వం వైద్య రంగాన్ని విస్మరించింది. గుంటూరులో గుండె సర్జరీలు చేస్తుంటే విజయవాడలో చేయక పోవడం బాధాకరం. – యర్రంశెట్టి అంజిబాబు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ సభ్యుడు -
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
పెనమలూరు: విద్యార్థులు క్రీడల్లో రాణించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్, మాజీ ఇండియన్ టీం క్రికెటర్ ఎం.ఎస్.కె.ప్రసాద్ సూచించారు. కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ డీమ్డ్ టూబీ యూనివర్సిటీలో గురువారం తొలి వార్షిక క్రీడోత్సవంలో ఆయన ప్రసంగించారు. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే అవసరమన్నారు. క్రీడల్లో రాణిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు. తాను ఇండియన్ టీమ్‌లో ప్లేయర్‌గా, బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ పని చేసినందుకు చాలా గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వివిధ క్రీడల్లో ఉత్తమ ప్రదిభచాటిన యు.సాయిసుబ్రహ్మణ్యం, త్రినాథ్చౌదరి, ప్రణీత, ఎ.మణికంఠకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు ఎం.రాజయ్య, కార్యదర్శి పి.లక్ష్మణరావు, వైస్‌చాన్స్‌లర్ వెంకటేశ్వరరావు, ప్రో వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఎ.వి.రత్నప్రసాద్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.రవిచంద్, ఫిజికల్ డైరెక్టర్ పి.రఘు తదితరులు పాల్గొన్నారు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
కృష్ణలంక(విజయవాడతూర్పు): విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కృష్ణలంక జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సు అగ్నికి ఆహుతైంది. బస్సులో ప్రయాణికులు ఎవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. విజయవాడకు చెందిన ఓ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ వెళ్లే క్రమంలో ప్రయాణికులను ఎక్కించుకునేందుకు గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో వారధి వైపు నుంచి జాతీయ రహదారి గుండా భవానీపురం వెళ్తోంది. బస్టాండ్ సమీపానికి చేరుకోగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దానిని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును పక్కన ఆపాడు. క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సు అగ్నికి ఆహుతైంది. బస్సులో నుంచి మంటలు ఎగిసిపడటాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బస్సులో ప్రయాణికులెవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించడంతో ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని ఫైర్ సిబ్బంది, పోలీసులు భావిస్తున్నారు. -
ఒకరిపై ఒకరు ిఫిర్యాదులు..
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రతిష్ట మసకబారుతోంది. పరీక్షల నిర్వహణలో విఫలం అవడం, సిబ్బందిలో గ్రూపు రాజకీయాలు పెచ్చుమీరడంతో వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఓ కాంట్రాక్టు ఉద్యోగి వైద్య విద్యార్థులకు గంజాయి తీసుకువచ్చి విక్రయిస్తున్నాడంటూ అధికారులకు ఫిర్యాదులు సైతం రావడంలో ఒక్కసారిగా అంతా షాక్ తిన్నారు. ఇంత జరిగిన తర్వాత పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలకు అధికారులు చేస్తున్నా, పరువు బజారున పడిందంటూ వైద్య వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికై నా కఠిన నిబంధనలు విధించాలంటూ పలువురు వైద్యులు కోరుతున్నారు. స్లిప్పులు రాస్తూ.. ఈ నెల 7 నుంచి 21 వరకూ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఇక్కడ నిమ్రా, ఎన్ఆర్ఐ విద్యార్థులతో పాటు, సిద్ధార్థ విద్యార్థులు కూడా పరీక్షలు రాస్తున్నారు. అయితే విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చాయి. అంతేకాదు పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో యూనివర్సిటీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఒకసారి ముగ్గురు, మరోసారి ఇద్దరి నుంచి స్లిప్పులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున కాపీయింగ్ జరిగినట్లు చెబుతున్నారు. అందుకు వైద్య కళాశాలలో కొందరి పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సమయం కంటే ముందుగానే పేపర్ డౌన్లోడ్ చేసినట్లు కూడా విమర్శలు వచ్చాయి. విద్యార్థులకు గంజాయి.. వైద్య కళాశాల హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు ఒక కాంట్రాక్టు ఉద్యోగి గంజాయి విక్రయిస్తున్నాడంటూ అధికారులకు రాతపూర్వక ఫిర్యాదులు అందడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే విచారించి ఆ ఉద్యోగిని విధుల నుంచి తప్పించారు. గంజాయి విక్రయించారా లేదా అనేది ఇప్పటి వరకూ తేల్చలేదు. ఇదిలా ఉంటే, ఆ ఉద్యోగిని మరలా విధుల్లోకి తీసుకోవాలంటూ పలువురు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఆరోపణలు ఉన్న వ్యక్తిని ఎలా తీసుకుంటారని పలువురు ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ అంశం వివాదాస్పదంగా మారింది. మసకబారుతున్న వైద్య కళాశాల ప్రతిష్ట సిద్ధార్థ మెడికల్ కాలేజీలో వ్యవస్థ అస్తవ్యస్తం యథేచ్ఛగా విద్యార్థుల మాస్ కాపీయింగ్ విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నారంటూ ఆరోపణలు ఉద్యోగుల మధ్య గ్రూపుల గోల ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో దశాబ్దాలుగా ఇక్కడే పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. వారంతా గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, తప్పుడు ఫిర్యాదులు ఇస్తూ కళాశాల పరువు తీస్తున్నారంటూ పలువురు మండిపడుతున్నారు. అంతేకాకుండా అవినీతి, అక్రమాల్లో సైతం వారి పాత్ర ఉంటున్నట్లు చెబుతున్నారు. ఇటీవల వచ్చిన ఆరోపణలన్నీ దీర్ఘకాలంగా ఇక్కడే పనిచేస్తున్న వారిపైనే అంటున్నారు. అధికారులు ప్రక్షాళన చేయకుంటే రానున్న రోజుల్లో వైద్య కళాశాల పరువు మరింతగా బజారున పడే అవకాశం ఉందంటున్నారు. పరిస్థితి విషమించక ముందే చర్యలు తీసుకోవాలని పలువురు ఉద్యోగులు హితవు పలుకుతున్నారు. -
వయోవృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు
చిలకలపూడి(మచిలీపట్నం): విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా స్థాయి విభిన్న ప్రతిభావంతుల కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలోని వయో వృద్ధులకు పోషణ, ట్రిబ్యునల్‌లో బ్యాంకు అకౌంట్‌ను ఓపెన్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జూన్ 15న ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు. కార్యక్రమంతో పాటు ప్రత్యేక మెడికల్ క్యాంపులు, ఉపకరణాల పంపిణీ చేయాలన్నారు. అక్టోబర్ 1వ తేదీన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామస్థాయిలో వారిని సన్మానించాలన్నారు. బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు.. దివ్యాంగుల కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో సదరం చూసే ఉద్యోగిని తక్షణమే మొదటి అంతస్తు నుంచి కిందకు మార్చేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ను కలెక్టర్ ఆదేశించారు. అన్ని బ్యాంకుల్లో దివ్యాంగులకు ప్రాధాన్యం ఇచ్చి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. లిఫ్ట్, ర్యాంపులు నిర్మించాలన్నారు. ప్రతి కార్యాలయంలో దివ్యాంగుల కోసం గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమించాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ వెంకటనాయుడు, జెడ్పీ సీఈవో కె. కన్నమ్మనాయుడు, డీఎంఅండ్‌హెచ్‌వో ఎస్. శర్మిష్ట, ఆర్డీవో కె. స్వాతి, వికలాంగుల సంక్షేమశాఖ అధికారి రామరాజు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న కలెక్టర్ బాలాజీ -
మత్తు మరకలు.. గ్రూపు రాజకీయాలు!
శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, విజయవాడ: రబీలో ధాన్యం సేకరణ ప్రహసనంగా మారింది. వాతావరణ మార్పులను ఆసరాగా చేసుకొని మిల్లర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. తేమశాతం సాకుతో ధరలో కోత విధిస్తున్నారు. లారీలు, సంచుల కొరత పట్టిపీడిస్తోంది. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో కష్టాలే మళ్లీ పునరావృతం అవుతున్నాయి. ఖరీఫ్‌లో అకాల వర్షాలకు పంట దెబ్బతినడంతోపాటు, కల్లాల్లో ధాన్యం తడిసి పోయింది. ఇదే సాకుగా దళారులు రంగంలోకి దిగి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో పరిస్థితి.. కృష్ణా జిల్లాలో రబీలో పెనమలూరు, గన్నవరం, తోట్లవల్లూరు, కంకిపాడు, బాపులపాడు, నాగాయలంక మండలాల్లో 12,175 ఎకరాల్లో వరి పంట సాగుచేశారు. ఈ–క్రాప్‌లో కూడా పంట నమో దైంది. 43,811 టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఏడాది రబీలో 10వేల టన్నుల ధాన్యం కొనేందుకు మాత్రమే ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కోసిన వెంటనే కొనుగోలు కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు సైతం ఆలస్యంగా ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 228 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది రబీలో దిగుబడులు ఆశాజనకంగా వచ్చాయి. కొనుగోలు లక్ష్యం మాత్రం అరకొరగానే నిర్దేశించి కూటమి ప్రభుత్వం చేతులు దులుపుకొనే యత్నం చేస్తోంది. తేమ శాతం సాకుగా.. వాతావరణంలో మార్పులు, అకాల వర్షాలు.. ధాన్యం నిల్వ చేసుకొనే సామర్థ్యం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు మిల్లర్ చెప్పిన రేటు రూ.1400కు అంగీకరించాల్సి వస్తోంది. ఒక్కో రైతు 75 కేజీల బస్తాకు రూ.340కు పైగా నష్టపోతున్నారు. కేజీకి రూ.20 చొప్పున తగ్గిస్తున్నారు. వర్షం పడితే ధాన్యం తడిస్తే, క్వింటా ధర రూ.1200కు పడిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిని సాకుగా చేసుకొని మిల్లర్లు దందా సాగిస్తున్నారు. పునాదిపాడు గ్రామానికి చెందిన కోటేశ్వరరావు కౌలురైతు. ఈ రబీ సీజన్లో 100 ఎకరాల వరకూ కౌలు చేస్తున్నారు. వరి కోత యంత్రంతో కోత కోయించారు. పంట చేతికొచ్చే నాటికి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. కోసిన ధాన్యం కల్లాల్లో ఉంచి కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూశారు. చేసేది లేక బయట వ్యాపారులకు ధాన్యం అమ్మారు. 75 కిలోలు బస్తా రూ.1200 మాత్రమే ధర కట్టారు. పది లారీల వరకూ ధాన్యం తరలించారు. ఆ రేటుకు ధాన్యం అమ్ముకోవటం వల్ల ఒక్కో లారీకి రూ.50 వేలు చొప్పున పది లారీల ధాన్యానికి రూ.5 లక్షలు సొమ్ము నష్టపోయారు. సీజన్ అంతా కష్టపడి వ్యాపారులకు మేలు చేయాల్సి వచ్చిందని ఆయన వాపోతున్నారు. పునాదిపాడులో ధాన్యాన్ని బస్తాల్లోకి ఎత్తుతున్న కూలీలు న్యూస్రీల్ఖరీఫ్లో మిగిలిన ధాన్యం సంగతేంటి? గత ఖరీఫ్‌లో ధాన్యం నూర్పిడులు చేయకుండా కుప్పలు వేశారు. ఇలాంటి ధాన్యం జిల్లాలో వ్యసాయాధికారుల అంచనా ప్రకా రం 85వేల టన్నులు ఉంటుందని అంచనా వేశారు. అనధికారిక లెక్కల ప్రకారం రైతుల వద్ద లక్ష టన్నులకు పైగా ధాన్యం ఉంటుందని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. అయితే 1,51,718 హెక్టార్లలో వరి పంట సాగు కావడంతో పాటు, 9,49,265 టన్నుల ధాన్యం ఉత్పత్తి వస్తుందని అప్పట్లో వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అయితే ఖరీఫ్‌లో సైతం కేవలం 6.10 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. ప్రస్తుతం కుప్పల పైన ఉన్న ధాన్యాన్ని కేవలం 65వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించారు. దీంతో రైతులు ఖరీఫ్‌లో కొనకుండా మిగిలి ఉన్న ధాన్యాన్ని మొత్తాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మద్దతు ధర క్వింటా ఏగ్రేడ్ రూ.2,330, కామన్ వైరెటీకి రూ.2.300గా ఉంది. మార్కెట్లో దీని కంటే ధర తక్కువగా ఉండటంతోనే కొనుగోలు కేంద్రాల వైపు చూస్తున్నారు. మద్దతు ధర కోసం ఎదురుచూస్తున్నా.. నేను ఐదు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. పంట చేతికి వచ్చింది. రెండు రోజుల్లో కోత కోయించాలి. వాతావరణం చూస్తే భయమేస్తోంది. మబ్బులు, అడపాదడపా జల్లులతో పంట చేతికి అందుతుందో లేదో అన్న ఆందోళన వెంటాడుతోంది. పచ్చి మీదే ఆర్ఎస్కేలో కొనుగోలు చేస్తామని చెప్పారు. 75 కిలోలు బస్తా రూ.1500 వరకూ ధర వచ్చేలా ఉంది. బస్తాకు రూ.200 వరకూ నష్టం జరుగుతుంది. అయినా తప్పదు. కల్లాల్లో ధాన్యం ఆరబెడితే వాతావరణం ఏం చేస్తుందో అర్థం కావటం లేదు. – చొప్పరపు గంగాధర్‌రావు, కౌలురైతు, కోలవెన్ను -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా గోపీ బాధ్యతల స్వీకరణ
చిలకలపూడి (మచిలీపట్నం): జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జి.గోపీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న అరుణసారిక బదిలీ కావటంతో విశాఖపట్నం ఏపీ వాల్యూయాడెడ్ ట్యాక్స్ అప్పిలయేట్ ట్రిబ్యూనల్ చైర్మన్‌గా పనిచేస్తున్న జి. గోపీని జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఈ నేపథ్యంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ లోపభూయిష్టం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ లోపభూయిష్టంగా చేశారని ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ విమర్శించారు. గాంధీనగర్‌లోని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన రోస్టర్ విధానంతో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రోస్టర్ విధానాన్ని పక్కనపెట్టి మాల, మాదిగ ఉప కులాలకు సమన్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీలకు ఉన్న 15శాతం రిజర్వేషన్‌ను మాదిగలకు 7, మాలలకు 7, ఉప కులాలకు ఒక శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అప్పుడే మాదిగల 30 ఏళ్ల పోరాటానికి ఫలితం ఉంటుందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఆర్డినెన్స్ వద్దని, ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేయాలని, ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన లోపభూయిష్టమైన వర్గీకరణ వల్ల మాదిగలకు నష్టం జరుగుతుంటే, మాదిగలకు ఐకాన్ అని చెప్పుకొనే మంద కృష్ణమాదిగ ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. ఈ నెల 23 నుంచి మే 30వ తేదీ వరకు రాష్ట్రంలోని ముఖ్య నగరాలు, పట్టణాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు చెరుకూరి కిరణ్ మాదిగ, పూనూరు జార్జ్ మాదిగ, మంద నాగమల్లేశ్వరరావు మాదిగ, రెల్లి సంఘం నాయకుడు ఎర్రంశెట్టి ప్రసాద్ రెల్లి పాల్గొన్నారు బీచ్ కబడ్డీ పోటీలకు స్థల పరిశీలన మంగినపూడి(మచిలీపట్నంరూరల్): మండల పరిధిలోని మంగినపూడిబీచ్‌లో మే నెలలో నిర్వహించనున్న బీచ్ కబడ్డీ పోటీలకు అనువైన ప్రదేశం కోసం అధికారులు, స్పోర్ట్స్ అథారిటీ బృందం గురువారం బీచ్‌లోని పలు ప్రాంతాలను పరిశీలించారు. జాతీయస్థాయి బీచ్ కబడ్డీ పోటీలు నిర్వహించే ప్రాంతాన్ని పరిశీలించిన మెప్మా పీడీ పి. సాయిబాబు, కబడ్డీ అసోసియేషన్ అధికారులు పరిశీలించి నిర్వ హించే ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఆంధ్ర కబ డ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ యలమంచిలి శ్రీకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ అర్జునరా వు, కృష్ణాజిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు పరిశుభ్రతే లక్ష్యం గన్నవరం: మండలంలోని సూరంపల్లి గ్రామంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి. అర్జునరావు నేతృత్వంలో అధికారులు పర్యటించారు. గ్రామంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించిన ఈ బృందం పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పనిచేస్తోందన్నారు. దీని కోసం ప్రతి గ్రామంలోని ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పారిశుద్ధ్య సిబ్బంది తప్పనిసారిగా ఇళ్ల నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని చెప్పారు. ఈ చెత్త ద్వారా వర్మికంపోస్ట్ ఎరువుల తయారీతో సంపదను సృష్టించాలన్నా రు. సర్పంచ్ ఈలప్రోలు శ్రీనివాసరావు, ఎంపీ డీఓ టి. స్వర్ణలత, ఈఓపీఆర్డీ టి. భారతి, పంచా యతీ కార్యదర్శి టి. లక్ష్మణరావు పాల్గొన్నారు. -
జిల్లాలో విరివిగా మొక్కలు పెంపకం
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమానికి సంసిద్ధం కావాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమంపై సంబంధిత అధికారులతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే వర్షాకాలానికి ముందుగానే రహదారి మార్గాలు, విద్యాసంస్థలు, కాలువలు, చెరువు గట్లపై మొక్కలు విరివిగా నాటి పచ్చదనం పెంపొందించేలా చూడాలని కోరారు. మేజర్ గ్రామపంచాయతీల్లో రహదారులను గుర్తించి మొక్కల పెంపకానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. చాలా గ్రామ పంచాయతీల్లో తాగునీటి చెరువులు ఉన్నాయని వాటి గట్లపై కూడా మొక్కలు నాటాలని ఆదేశించారు. మొక్కలకు నీరు పోసి సంరక్షించే బాధ్యతను పంచాయతీలో ఒకరికి బాధ్యత అప్పగించాలని పేర్కొన్నారు. వారికి మూడు సంవత్సరాల పాటు ఉపాధి హామీ పథకం ద్వారా వేతనం చెల్లిస్తామని వెల్లడించారు. గ్రామాల్లో కనీసం 25 సెంట్లకు పైగా ఉన్న స్థలాన్ని గుర్తించాలని అక్కడ పల్లెవనాల అభివృద్ధికి చొరవ చూపాలని చెప్పారు. జిల్లాలో 196 పాఠశాలల్లో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. కావాల్సిన మొక్కల జాబితా సంబంధిత అధికారులు డ్వామా పీడీ కి అందజేస్తే వారు సరఫరా చేస్తారన్నారు. ఆయా జిల్లాలోని అన్ని దేవాలయాల ప్రాంగణాలతో పాటు వాటికి ఆనుకుని ఉన్న స్థలాల్లో కూడా మొక్కల పెంపకం చేపట్టాలని కోరారు. సంక్షేమ వసతి గృహాల్లోనూ మొక్కలు పెంచేలా చూడాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, డ్వామా పీడీ శివప్రసాద్ యాదవ్, డీఈవో పీవీజె రామారావు పాల్గొన్నారు. కలెక్టర్ డీకే బాలాజీ -
సేవా కార్యక్రమాల నిర్వహణ అభినందనీయం
జిల్లా ఎస్పీ గంగాధరరావు పెడన: ప్రార్థించే పెదవులు కంటే సాయం చేసే చేతులు మిన్న అన్న విధంగా 1989 పోలీస్ బ్యాచ్ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. రామలక్ష్మీ వీవర్స్ కాలనీలోని అమ్మఫుడ్ ఫౌండేషన్‌లో వృద్ధులకు 1989 పోలీస్ బ్యాచ్ బుధవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ బ్యాచ్ సేవా కార్యక్రమాలను నిర్వహించి అందరి మన్ననలు పొందుతున్నారని చెప్పారు. పెద్దలు ఆశీస్సులుతో మరింత మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. సంతృప్తికరమైన జీవితాన్ని ఆశ్వాదించడానికి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. అనంతరం అమ్మఫుడ్ ఫౌండేషన్ నిర్వాహకులు మల్లికార్జునరావు దంపతులను సన్మానించి వారికి రూ.10వేల నగదు అందజేశారు. 1989 పోలీస్ బ్యాచ్‌లో ఉత్తమసేవా అవార్డులు పొందిన కొసనం హేమానందం, లక్ష్మణరావులను, ఇతర రాష్ట్రాల్లో ఆట పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన జి.ఉమామహేశ్వరరావు, అంజిబాబులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, ఏఎస్‌లు, కానిస్టేబుళ్లు వి. రాజేంద్రప్రసాద్, వీరవల్లి గోపీ, రణధీర్, అడపా వెంకటేశ్వరరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం మార్గదర్శకాలకు అనుగుణంగానే ఎంబీబీఎస్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. అశోక్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7న ప్రారంభమైన పరీక్షలు, 21 వరకూ కొనసాగనున్నాయని, తమ విద్యార్థులతో పాటు, ఎన్ఆర్ఐ, నిమ్రా కళాశాలల విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు. పరీక్ష హాలుకు అనధికారికంగా ఎవరూ వెళ్లకుండా గ్రిల్స్ ఏర్పాటు చేశామని, పర్యవేక్షకులుగా అధ్యాపకులనే నియమించినట్లు పేర్కొన్నారు. సీసీటీవీ పర్యవేక్షణతో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు వినియోగించకుండా తనిఖీలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రశ్నాపత్రాలను సైతం ఉదయం 9.40 గంటల తర్వాతే డౌన్లోడ్ చేస్తున్నామని వివరించారు. డీఎంఈ, రిజిస్ట్రార్ ఆదేశాల మేరకు చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, పరీక్షల విభాగంలోని అన్ని బోధనేతర సిబ్బందిని మార్పు చేసినట్లు పేర్కొన్నారు. కఠినమైన ఏర్పాట్లు చేసినప్పటికీ కొన్ని మాల్ ప్రాక్టీస్ ఘటనలు జరిగాయని, ఇన్విజిలేటర్ల నుంచి వివరణలు కోరుతూ మెమోలు ఇచ్చినట్లు తెలిపారు. రూ.4.30 లక్షలు స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు పెనమలూరు: పోరంకికి చెందిన వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.4.30 లక్షల సొమ్ము స్వాహా చేసిన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం పోరంకి శ్రీనివాసానగర్, మధురిమ అపార్టుమెంట్‌కు చెందిన కె.వీరవెంకటనాగచక్రధర్ పశువులు దాణా వ్యాపారం చేస్తాడు. కొద్ది నెల క్రితం పనిపై బెంగళూరుకు వెళ్లాడు. తిరిగి బెంగళూరు నుంచి విజయవాడకు రావటానికి వీఆర్ఎల్ ట్రావెల్స్ బస్ టికెట్ తీసుకున్నాడు. అయితే బస్సు మిస్ అవ్వటంతో టికెట్ సొమ్ము తిరిగి ఇవ్వమని వీఆర్ఎల్ వెబ్సైట్లో ఫిర్యాదు చేశాడు. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ ద్వారా లైన్లోకి వచ్చి వీరవెంకటనాగచక్రధర్ నమ్మించి బ్యాంకు ఖాతా నెంబర్, ఐడీ, పాస్ వర్డ్ తీసుకున్నాడు. ఆ తరువాత ఫోన్ బ్లాక్‌చేసి అతని బ్యాంకు ఖాతాలో రూ.4.30 లక్షల సొమ్ము స్వాహా చేశాడు. ఈ ఘటన పై బాధితుడు పోలీసులకు ఆశ్రయించి ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. -
ఘనంగా దాసాంజనేయ స్వామి దేవస్థానం ప్రతిష్ట
హనుమాన్‌జంక్షన్ రూరల్:బాపులపాడు మండలం వీరవల్లిలో కృష్ణా మిల్క్ యూనియన్‌కు చెందిన ‘ప్రాజెక్టు కామథేను’ పాల ఫ్యాక్టరీ ప్రాంగణంలో సీతారామ లక్ష్మణ సమేత దాసాంజనేయ స్వామి దేవస్థానం ప్రతిష్టా మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట కనులపండువగా సాగింది. మహోత్సవం తిలకించేందుకు పాడి రైతులు, పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు దంపతుల చేతుల మీదగా ఆలయ శిఖర ప్రతిష్టను చిన్న జీయర్ స్వామి నిర్వహించారు. సీతారాముల పట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భద్రాద్రి దేవస్థానం నుంచి తెచ్చిన ముత్యాల తలంబ్రాలను భక్తులను అందించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ఆయన ప్రవచనాన్ని అందించారు. కృష్ణాజిల్లా ప్రాంతంలో గోవుల పెంపకం మరింత పెరగాలని, గో సంపద వృద్ధి చెందటం ద్వారా నేల సారాన్ని పెంచుకునే కృషి చేయాలి సూచించారు. పాల సహకార సొసైటీలకు యూనియన్ తరుపున బోనస్‌లను చిన్న జీయర్ స్వామి చేతుల మీదగా పంపిణీ చేశారు. అనంతరం మహా అన్నప్రసాద వితరణ జరిగింది. కృష్ణా మిల్క్ యూనియన్ ఎండీ కొల్లి ఈశ్వర బాబు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావు, ఇతర పాలకవర్గ సభ్యులు, పాల సహాకార సంఘాల అధ్యక్షులు, సిబ్బంది పాల్గొన్నారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తు చేసుకోండి – డీఎస్డీవో అజీజ్ విజయవాడస్పోర్ట్స్:ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యాన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ పర్యవేక్షణలో మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు జరిగే వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు ఆసక్తి ఉన్న క్రీడా సంఘాలు, వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు, కోచ్‌లు, సీనియర్ క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా డీఎస్డీవో ఎస్.ఎ.అజీజ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని క్రీడాంశాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. శాప్ ఆదేశాల మేరకు ఒక్కో క్రీడాంశంలో ఎనిమిది నుంచి 14 సంవత్సరాల లోపు వయసున్న 25 మంది బాలురు, 25 మంది బాలికలకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 17వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఇందిరాగాంధీ స్టేడియంలోని తమ కార్యాలయంలో పూర్తి చేసిన దరఖాస్తులను అందజేయాలని సూచించారు. హోరాహోరీగా బార్ అసోసియేషన్ ఎన్నికలు చిలకలపూడి(మచిలీపట్నం): బార్ అసోసియేషన్ ఎన్నికలు బుధవారం హోరాహోరీగా జరిగాయి. అధ్యక్షుడి స్థానానికి ముగ్గురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. బూరగడ్డ అశోక్‌కుమార్, తుంగల హరిబాబు, డి.పోతురాజు పోటీలో ఉండగా 53 ఓట్ల ఆధిక్యంతో పోతురాజు అధ్యక్షుడిగా గెలుపొందారు. ఉపాధ్యక్ష స్థానానికి ముగ్గురు పోటీపడగా రెడ్రౌతు రమణరావు గెలుపొందారు. ప్రధాన కార్యదర్శి స్థానానికి సిద్ధినేని సత్యసాయిబాబుపై శాయన సుధాకర్ గెలుపొందారు. కోశాధికారిగా పసుమర్తి సూర్యప్రకాశరావు ఉషా రాధాకృష్ణమూర్తిపై గెలుపొందారు. సహ కార్యదర్శిగా గాదె శామ్యూల్ అద్దెపల్లి నిరంజనరావుపై గెలుపొందారు. లైబ్రరీ కార్యదర్శిగా వి.శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీనియర్ న్యాయవాది వింజమూరి శివరామ్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. -
అకాల వర్షం.. అపార నష్టం
పెనుగంచిప్రోలు: పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం, ఈదురు గాలులు రైతులను తీవ్రంగా నష్టపరిచింది. మంగళవారం రాత్రి వచ్చిన గాలులకు మొక్కజొన్న నేలవాలగా, మామిడికాయలు రాలిపోయాయి. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, మిర్చి అక్కడక్కడా తడిసింది. కోత కోసి అమ్మేదశలో మొక్కజొన్న, అసలే అంతంత మాత్రం కాపుకొచ్చిన మామిడి ఈదురు గాలులకు వర్షార్పణం అయాయ్యని రైతులు ఆవేదన చెందుతున్నారు. అసలే మద్దతు ధర లేక ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న తరుణంలో మిర్చి, ధాన్యం కల్లాల్లో ఆరబోసి పట్టాలు కప్పినా గాలులకు పట్టాలు కొట్టుకు పోయి అక్కడకడ్కడా తడవటంతో కొనే నాథుడు ఉండటని లేదని అంటున్నారు. ఈ ఏడాది రబీ సాగు చేస్తున్న రైతులతో పాటు, మామిడి, మొక్కజొన్న మీద ఆశలు పెట్టుకున్న రైతులందరికీ చేదు అనుభవమే ఎదురయింది. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు పట్టాలు కూడా ప్రభుత్వం అందించలేకపోతుందని వాపోతున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సాయం అందించాలని కోరుతున్నారు. వత్సవాయి: మంగళవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులు బెంబేలెత్తిపోయారు. కల్లాల్లో ఉన్న మిర్చి, మొక్కజొన్న పంటలపై పట్టాలను కప్పుకున్నారు. రాత్రి సమయంలో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన పెద్ద వర్షం ప్రారంభమైంది. సుమారు గంటపాటు వర్షం పడింది. ఈదురుగాలులు బాగా రావడంతో కొన్నిచోట్ల పంటపై కప్పిన పట్టాలు కూడా లేవడంతో పంట తడిచిపోయింది. అసలే మిర్చి పంటకు సరైన ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే మూలిగేనక్కపై తాటికాయ పడ్డట్లు రైతుల పరిస్థితి ఉందని వాపోతున్నారు. జగ్గయ్యపేట: ఈదురుగాలులతో కూడిన వర్షంతో కల్లాల్లోని ధాన్యం రాశులు తడిసిపోయాయి. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా కష్టాలు పడ్డారు. పట్టణంలోని మార్కెట్ యార్డులోని ధాన్యం, ఆటోనగర్ కల్లాల్లోని మొక్కజొన్న, గౌరవరం, షేర్‌మహ్మద్‌పేట గ్రామాల్లోని కల్లాల్లోని ధాన్యం పూర్తిగా తడిసింది. కొన్ని కల్లాల్లో ధాన్యం తడిసి మొలకెత్తినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయాధికారి విజయకుమారి బుధవారం పరిశీలించారు. తీవ్రంగా దెబ్బతిన్న పంటలు ఆందోళనలో రైతులు ఆదుకోవాలని వినతి -
కేబుల్ వైర్ల దొంగలు అరెస్టు
తోట్లవల్లూరు: పంట పొలాల్లో వ్యవసాయ మోటార్లకు సంబంధించిన కేబుల్ వైర్లు కత్తిరించే దొంగలను పోలీసులు పట్టుకున్నారు. రైతులకు గత కొంతకాలంగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చోరులు ఎట్టకేలకు దొరికారు. మండలంలోని బొడ్డపాడు–చినపులిపాక మార్గంలో కల్వర్టు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కేబుల్ వైర్ల చోరీ వెలుగు చూసింది. ఎస్ఐ సీహెచ్ అవినాష్ తెలిపిన వివరాల ప్రకారం..గన్నవరం మండలం బుద్దవరానికి చెందిన చలందార్ల స్వామి, ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన చలమచర్ల మహేశ్వరరావు అలియాస్ మహేష్, అదే గ్రామానికి చెందిన మరో 17 ఏళ్ల బాలుడు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. తమకు అవసరమైన డబ్బును సంపాదించే క్రమంలో మండల పరిధిలోని లంక ప్రాంతాల్లో గల పంట పొలాల్లో వ్యవసాయ మోటార్లకు చెందిన కేబుల్ వైర్లను తస్కరించడం మొదలుపెట్టారు. చోరీ చేసిన వైర్లను కాల్చి దానిలోని రాగితీగను అమ్ముకోవటానికి తీసుకెళుతూ పట్టుబడినట్లు ఎస్ఐ చెప్పారు. నిందితుల నుంచి తొమ్మిది కేజీల రాగి వైరు, ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భార్య, కుమారుడుఅదృశ్యంపై కేసు పెనమలూరు: కానూరులో భార్య, కుమారుడు అదృశ్యమయ్యారని భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం... కానూరు శివాలయం వీఽధికి చెందిన లంకె దుర్గాప్రసాద్, భార్య దుర్గాభవాని, 3 సంవత్సరాల కుమారుడితో ఉంటున్నాడు. ప్రైవేటు కంపెనీలో పని చేస్తాడు. ఈ నెల 14వ తేదీ రాత్రి దుర్గాప్రసాద్ ఫోన్ మాట్లాడుతుండగా కుమారుడు ఫోన్ కావాలని అల్లరి చేశాడు. ఈ విషయమై భార్యాభర్తలకు మధ్య గొడవ జరిగింది. రాత్రి దుర్గాభవాని, కుమారుడు ఇంట్లో నిద్రపోగా దుర్గాప్రసాద్ దగ్గరలో ఉన్న తల్లి ఇంట్లో నిద్రపోయాడు. అయితే 15వ తేదీ ఉదయం దుర్గాప్రసాద్ ఇంటికి రాగా భార్య, కుమారుడు కనిపించలేదు. తాను తిరిగి రానని భార్య ఇంటి గోడపై రాసింది. దుర్గాప్రసాద్ వెంటనే దుర్గాభవాని పుట్టిల్లు పామర్రుకు ఫోన్ చేయగా రాలేదని తెలిపారు. బంధువులతో కలిసి పలు ప్రాంతాల్లో వెతికినా భార్య, కుమారుడి జాడ తెలియలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
పోష్ చట్ట ప్రయోజనాలు పుస్తకావిష్కరణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): హైకోర్టు న్యాయవాది అనుపమ దార్ల రచించిన ‘మీరు పనిచేసే చోట లైంగిక వేధింపులా.. పోష్ చట్ట ప్రయోజనాలు’ పుస్తకాన్ని రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం ఆవిష్కరించారు. లైంగిక వేధింపుల నివారణ చట్టం ఆధారంగా చేసుకుని రచించినట్లు రచయిత అనుపమ తెలిపారు. అందరికీ అర్థమయ్యేలా తెలుగులో రచించిన పుస్తకంలో చట్టంలోని నిబంధనలు, వ్యవస్థీకృత, అసంఘటిత రంగంలో పనిచేసే మహిళల హక్కులు తదితర అంశాలను వివరించినట్లు పేర్కొన్నారు. శ్రామిక మహిళలకు సురక్షితమైన పని ప్రదేశాలు పొందడానికి ఈ చట్టం బలమైన కవచం అయినప్పటికీ, అమలు కేవలం కాగితాలకే పరిమితమని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం ఈ పుస్తకాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్పు ట్రస్టు డైరెక్టర్ రావూరి సూయజ్, హ్యాపీ లైఫ్ కౌన్సెలింగ్ సెంటర్ డైరెక్టర్, మనస్తత్వవేత్త డి.కల్యాణి తదితరులు పాల్గొన్నారు. సందేశాత్మకంగా సాంఘిక నాటికలు విజయవాడ కల్చరల్: పీఎమ్‌కే ఫైన్ ఆర్ట్స్, ఏపీ చలన చిత్ర వాణిజ్యమండలి ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని కందుకూరి కల్యాణమండపంలో ఐదురోజులపాటు నిర్వహించే 44వ జాతీయ సాంఘిక నాటికల పోటీలు బుధవారం రాత్రి ప్రారంభమయ్యాయి. తొలి నాటికగా ఆరాధన ఆర్ట్స్ అకాడమీ గుంటూరు వారు ప్రదర్శించిన మరీ అంతొద్దు నాటిక సందేశాత్మకంగా సాగింది. రచన ఆకురాతి భాస్కర్ చంద్ర, దర్శకత్వం నడింపిల్లి వెంకటేశ్వరరావు. రెండవ నాటికగా చెరుకురు సాంబశివరావు రచించి, దర్శకత్వం వహించిన విముక్తి నాటికను, మూడో నాటికగా ద్వార బంధాల చంద్రయ్య నాయుడు నాటికను ప్రదర్శించారు. కార్యక్రమాలను కళాపోషకుడు డోగిపర్తి శంకరరావు ప్రారంభించారు. నాటక రంగానికి పూర్వవైభవం తీసుకురావాలని సూచించారు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పీఎమ్‌కే ఫైన్ ఆర్ట్స్ వ్యవస్థాపకుడు పసుపులేటి వెంకటరమణ పాల్గొన్నారు. రంగస్థల సినీ నటుడు కొప్పుల ఆనంద్ నిర్వహించారు. -
ఖేలో ఇండియా రాష్ట్ర జట్లు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: ఏడో ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అండర్–18 కబడ్డీ (బాలుర), ఖోఖో (బాలుర), ఫుట్‌బాల్(బాలికల) జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర జట్లను ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో బుధవారం ఎంపిక చేశారు. కబడ్డీకి 49 మంది, ఖోఖో పోటీకి 45 మంది, ఫుట్‌బాల్‌కు 49 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ (టెక్నికల్) రమణ పర్యవేక్షణలో స్పోర్ట్స్ ఆఫీసర్లు సురేంద్ర, కోటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా డీఎస్డీవో ఎస్.ఎ.అజీజ్ ఈ పోటీలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి ముందుగా ఆన్లైన్లో నమోదు చేశారు. మధ్యాహ్నం నుంచి జరిగిన ఎంపిక పోటీలను శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ప్రారంభించారు. ఈ పోటీలకు పరిశీలకులుగా ఆయా క్రీడాంశాలకు సంబంధించి అసోసియేషన్ల ప్రతినిధులు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ), నామినేటెడ్ స్పోర్ట్స్ పర్సన్స్ వ్యవహరించారు. జట్లకు ఎంపికై న క్రీడాకారులు మే 2 నుంచి 15వ తేదీ వరకు బీహార్‌లో జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2025 జాతీయ పోటీల్లో పాల్గొంటారని శాప్ ఎండీ పి.ఎస్.గిరీషా వెల్లడించారు. -
దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామి సన్నిధిలో నిత్యం జరిగే అన్నప్రసాద వితరణ నిమిత్తం పలువురు దాతలు బుధవారం విరాళాలు అందజేశారు. కాకినాడ జిల్లా జగన్నాథగిరికి చెందిన కె. వెంకట నాగేశ్వరరావు రూ. లక్ష, ఆయన కుటుంబ సభ్యులైన కె. వెంకట లక్ష్మి పేరిట రూ. లక్ష, కేపీ శ్రీదేవి పేరుతో మరో రూ. లక్ష కలిపి మొత్తం రూ.3 లక్షలు, విజయవాడ రూరల్ మండలం గొల్లపూడికి చెందిన ఎం. సురేష్ రూ. లక్ష విరాళంగా ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు దాతలు, వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అలాగే అమ్మవారి చిత్రపటాలు, ప్రసాదాలు అందజేశారు. విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలుభవానీపురం(విజయవాడపశ్చిమ): సంకట హర చతుర్థి సందర్భంగా ఇంద్రకీలాద్రిపైగల శ్రీదుర్గామల్లేశ్వర స్వామి సన్నిధిలోని యాగశాలలో బుధవారం శ్రీవిఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతికి అభిషేకం చేసి హోమం జరిపించారు. మానవులను కష్టాల నుంచి గట్టెక్కించేది సంకట హర చతుర్థి పూజ అని, వినాయకునికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి అని అర్చకస్వాములు భక్తులకు వివరించారు. అలాగే సంకట హర చతుర్థి పూజ ఆచరించడం వల్ల మనిషి జాతకంలోని సమస్యలు తొలిగిపోయి అన్ని పనుల్లో ఏర్పడే సంకటాలు సమసిపోయి, సఫలత చేకూరుతుందని వివరించారు. రాష్ట్ర కమిటీ ఎన్నికభవానీపురం(విజయవాడపశ్చిమ): సంచార పశు ఆరోగ్య సేవ వాహనాల (1962) కాంట్రా క్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా బి.నరేష్ నాయక్ (కృష్ణాజిల్లా) ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఇటీవల జరిగిన మహాసభలో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా ఎ.వి.నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా ఎం.ఎన్.వి.శ్రీధర్ (ఎన్టీఆర్ జిల్లా), కోశాధికారిగా జె.వెంకటేశ్వర్లు (తిరుపతి బాలాజీ), ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం.సురేష్ (విజయనగరం), ఉపాధ్యక్షుడిగా జి.రోహిత్ కుమార్ (శ్రీకాకుళం), మల్లిక (కాకినాడ), డి.వి.సతీష్ (వెస్ట్ గోదావరి), షేక్ షరీఫ్ (పల్నాడు), కార్యదర్శులుగా ఎ.హేమసుందర్ (తూర్పు గోదావరి), పెదపాటి సురేష్ (అంబేడ్కర్ కోనసీమ), కె.రవి (ఏలూరు), సి.సంతోష్ కుమార్ (కడప) ఎన్నియ్యారు. రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఐ.లక్ష్మీనారాయణ, ఆర్.నరేష్, టి.దుర్గాప్రసాద్, కె.రాకేష్, పి.నాగేంద్రబాబు, బి.రవికిరణ్, కె.రమేష్, ఆర్.గోపాలరావు, సీహెచ్ చిట్టిబాబు, బి. గోవింద నాయక్, ఎం.సతీష్ కుమార్, టి.జోహారి, మోహన్‌ను ఎన్నుకున్నారు. కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి జగ్గయ్యపేట అర్బన్: రైతులు దళారీలు, మిల్లర్ల చేతిలో నష్టపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని అమ్ముకోవాలని ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయశాఖ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి అన్నారు. జగ్గయ్యపేటలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఏ గ్రేడు ధాన్యానికి రూ. 2,320, సాధారణ రకం రూ. 2,300 మద్దతు ధర ప్రకటించిందని, రైతులు పీపీసీ ద్వారా ధాన్యం అమ్ముకోవాలని సూచించారు. గోనె సంచులు, హమాలీల ఖర్చులు, రవాణా ఖర్చులు కూడ ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. రానున్న రెండు మూడు రోజులు వర్ష సూచన ఉన్నందున రైతులు తమ వరి కోతలను వాయిదా వేసుకోవాలన్నారు. ఆరబెట్టిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడం లేదా సురక్షిత ప్రాంతాలకు చేరవేసి, తడవకుండా భద్రపరచుకోవాలని సూచించారు. ఏడీఏ భవాని, ఏవో వరలక్ష్మి, రైతులు పాల్గొన్నారు. -
గురుకులంలో కొత్త చరిత్ర
నిమ్మకూరు(పామర్రు): గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ ఇంటర్మీడియెట్ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా సత్తా చాటారు. గత విద్యా సంవత్సరాల్లో చదువుల కోసం శ్రద్ధతో తీసుకున్న ప్రత్యేక చర్యలు వారికి ఉపకరించాయి. ఉత్తమ ఫలితాలు.. పామర్రు మండల పరిధి నిమ్మకూరు గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు గత ప్రభుత్వం మంచి వసతులతో కూడిన విద్యను అందించింది. విద్యార్థులకు కళాశాలలో అన్ని సబ్జెక్టులలో మెరుగైన విద్యాబోధన, ల్యాబ్‌లలో అన్ని రకాల పరీక్షలకు చక్కని తర్ఫీదునిచ్చింది. అవసరమైన వారికి ప్రత్యేక శిక్షణ తరగతుల నిర్వహించింది. అంతే కాకుండా హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు మంచి ఆహారం, వసతి తదితరాలను కల్పించింది. వాటి ఫలితంగా విద్యార్థులు పరీక్షల్లో సత్తా చాటారు. గురుకుల కళాశాలలో 2024–25 ఏడాదిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో వెలమల మణికంఠ ఎంపీసీ గ్రూపులో 987/1000, బైపీసీలో దూది రేష్మ 990/1000, సీఈసీలో ఆర్. వనదుర్గ 949/1000 సాధించి ఏపీ గురుకులాల స్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచారు. ఎంఈసీలో జీవీవీఎస్ చైతన్య 971/1000, సీజీటీలో ఎల్. కుసుమ రాణి 971/1000 సాధించింది. వీరందరూ ఒకే కళాశాలకు చెందిన వారు కావడం.. అందరూ 900లకు పైగా మార్కులు సాధించడం విశేషమని గురుకులం ప్రిన్సిపల్ గ్రేస్ సుభాషిణి పేర్కొన్నారు. -
యాత్రికులకు గుడ్ న్యూస్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పూరి, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ తదితర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించాలనుకునే యాత్రికుల కోసం సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలు నడపనున్నట్లు ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) విజయవాడ డివిజన్ ఏరియా మేనేజర్ ఎం.రాజా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మే ఐదు నుంచి 17వ తేదీ వరకు తొమ్మిది రాత్రిళ్లు, పది పగళ్లు సాగే ఈ యాత్రలో పూరిలోని జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్యదేవాలయం, గయాలోని విష్ణుపాద దేవాలయం, వారణాసిలోని కాశీవిశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణదేవి ఆలయం, సాయంత్రం గంగా హారతి, అయోధ్యలోని సరయు నది వద్ద రామజన్మభూమి, హనుమాన్‌గర్హి, ఆరతి, ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం దర్శనం ఉంటుందన్నారు. ఈ ప్రయాణంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయంలో పాటుగా పర్యాటక ప్రదేశాలను దర్శించుకునేందుకు రోడ్డు మార్గంలో రవాణా సదు పాయం, హోటళ్లలో బస ఏర్పాట్లు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి కోచ్‌కు ఎస్కార్ట్, టూర్ గైడ్, టూర్ మేనేజర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ పర్యాటక రైలుకు విజయవాడ, ఏలూరు, రాజ మండ్రి, సామర్లకోట, తునిలో బోర్డింగ్/డీబోర్డింగ్‌కు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్యాకేజీ వివరాలు ఇలా.. మూడు కేటగిరీల్లో ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయని మేనేజర్ రాజా తెలిపారు ఎకానమీ (స్లీపర్ క్లాస్) పెద్దలకు ఒక్కొక్కరికీ రూ.16,800, పిల్లలకు రూ.15,700, స్టాండర్డ్ (3ఏసీ) పెద్దలకు రూ.26,600, పిల్లలకు రూ.25,300, కంఫర్ట్ (2ఏసీ) పెద్దలకు రూ.34,900, పిల్లలకు రూ.33,300గా పేర్కొన్నారు. టికెట్లు బుకింగ్ కోసం విజయవాడలోని ఐఆర్సీటీసీ కార్యాలయం లేదా 92814 95848, 89773 14121లో సంప్రదించాల్సిందిగా మేనేజర్ రాజా సూచించారు. విజయవాడ మీదుగా ‘భారత్ గౌరవ్’ రైలు -
వీసీ లేక.. సమస్యలు వీడక
లబ్బీపేట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన, దేశంలోనే మొట్ట మొదటి హెల్త్ వర్సిటీగా గుర్తింపు పొందిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ప్రతిష్ట మసకబారుతోంది. విశ్వ విద్యాలయం పేరును మార్చడంపై చూపిన శ్రద్ధ, వైస్ చాన్స్‌లర్ నియామకంపై లేకపోవడంతో కీలక నిర్ణయాల్లో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఫలితంగా వర్సిటీ పరిధిలో వైద్య విద్యను అభ్యసిస్తున్న వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అంతేకాదు ఏదైనా సమస్య తెలిపేందుకు రాష్ట్రంలోని దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి వీసీ అందుబాటులో లేక పోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. పది నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. బలవంతంగా రిజైన్ చేయించి.. హెల్త్ యూనివర్సిటీకి వైస్ చాన్స్‌లర్‌గా ఉన్న డాక్టర్ కె. బాబ్జి పదవీ కాలం 2026 ఫిబ్రవరి వరకూ ఉంది. కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆయనను నియమించిందనే కక్షతో బలవంతంగా పదవిలో నుంచి తప్పుకునేలా చేశారు. పాలకుల ఒత్తిడితో గత ఏడాది జూలై 1 డాక్టర్స్ డే రోజున ఆయన పదవికి రిజైన్ చేశారు. నాటి నుంచి కొత్త వీసీని నియమించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తమకు నచ్చిన వారు దొరక్క పోవడమా.. కూటమి పార్టీల మధ్య సమన్వయం లేక పోవడమో.. కారణమేమో గానీ నియామకం మాత్రం జరపడం లేదు. నోటిఫికేషన్ జారీ చేసి నాలుగు నెలలు గడిచింది.. ఎంపిక ఎప్పుడు చేస్తారో తెలియని దయనీయ స్థితి నెలకొంది. పడకేసిన పాలన.. హెల్త్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా పడకేసింది. ప్రస్తుతం రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ నరసింహం ఇన్చార్జి వీసీగా వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రతిరోజూ అరగంట మాత్రమే వీసీ చాంబర్లో ఉంటున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. అది కూడా సిబ్బంది ఎవరూ విధులకు రాని సమయంలో ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకూ ఉంటున్నట్లు సమాచారం. ఏదైనా అత్యవసర పని ఉంటే ఆ విభాగాలకు చెందిన వారు ఉరుకులు, పరుగులపై రావాల్సి వస్తోందంటున్నారు. లేదంటే ఫైళ్లు తీసుకుని డీఎంఈ కార్యాలయానికి వెళ్లాల్సిందేనని చెబుతున్నారు. దీంతో ప్రతి పనిలోనూ తీవ్రమైన జాప్యం జరుగుతున్నట్లు యూనివర్సిటీ ఉద్యోగులు వివరిస్తున్నారు. మసకబారిన ప్రతిష్ట.. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ప్రతిష్ట కూటమి ప్రభుత్వంలో మసకబారుతోంది. వర్సిటీకి పెద్ద దిక్కు లేక పోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా పరీక్షల నిర్వహణ ఇటీవల అస్తవ్యస్తంగా మారింది. వైద్య కళాశాలల్లో విద్యార్థులతో ఇష్టారాజ్యంగా కాపీలు రాయించారు. విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విద్యార్థుల వద్ద స్లిప్‌లు ఉన్నట్లు గుర్తించారు. యూనివర్సిటీకి పెద్దదిక్కు లేక పోవడంతో చుక్కానీ లేని నావలాగా పరిస్థితి తయారైనట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో వైద్య రంగంతో పాటు, వైద్య విద్యను, యూనివర్సిటీ ప్రతిష్టను కూటమి ప్రభుత్వం మంటగలిపిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత పరిణామాలపై వైద్యవర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో గాడి తప్పిన పాలన వీసీ నియామకంపై కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం పది నెలలుగా వీసీ లేకపోవడంతో కీలక నిర్ణయాల్లో జాప్యం పరీక్షల నిర్వహణపైనా ఇటీవల ఆరోపణలు పాలనా పరంగా అనేక ఇబ్బందులు మసకబారుతున్న యూనివర్సిటీ ప్రతిష్ట -
మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రత్యేక చర్యలు
కోనేరుసెంటర్: జిల్లాలో మహిళలు, చిన్నారుల రక్షణకు పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఏలూరు రేంజ్ ఐజీపీ జీవీజీ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఆయన మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. తొలుత స్టేషన్ సమీపంలోని పింగళి వెంకయ్య విగ్రహానికి ఎస్పీతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన స్టేషన్‌ను సందర్శించి పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ ఆహ్లాదకర వాతావరణంలో ఉండేలా చూసుకోవాలని సూచించారు. స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. రికార్డుల నిర్వహణ విషయంలో సిబ్బంది అత్యంత జాగ్రత్త వహించాలని సూచించారు. అలసత్వం వహించినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు సీరియస్‌గా ఉంటాయని చెప్పారు. సామరస్యంగా పరిష్కరించండి.. స్టేషన్‌కి వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి సమస్యను సామరస్యంగా విని సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఐజీపీ సూచించారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండేలా జాగ్రత్త వహించాలన్నారు. మహిళలు, చిన్న పిల్లలపై జరిగే నేరాలను కట్టడి చేయడానికి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో శక్తి యాప్ గురించి, వారికి ఉన్న రక్షణ చట్టాల గురించి శక్తి టీం బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలన్నారు. సైబర్ నేరాల నియంత్రణకి సామాజిక మాధ్యమాల వినియోగం, ఓటీపీ ఫ్రాడ్స్, బ్యాంక్ మోసాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. స్టేషన్ విజిట్‌కు వచ్చిన ఐజీపీకి జిల్లా ఎస్పీ పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానం పలికారు. సిబ్బంది నుంచి ఆయన గౌరవవందనం స్వీకరించారు. డీఎస్పీ సీహెచ్ రాజ, బందరు సబ్–డివిజన్ సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. మచిలీపట్నం పీఎస్ సందర్శనలో ఐజీపీ అశోక్‌కుమార్ -
ముగిసిన బ్రహ్మోత్సవాలు
తిరుమలగిరి(జగ్గయ్యపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం వాల్మీకోద్భవ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు బుధవారం పవళింపు సేవ, అశ్వ వాహనోత్సవంతో ఘనంగా ముగిశాయి. చివరి రోజు ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై గ్రామంలో ఊరేగించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ ఇళ్ల ముందుకు స్వామి వారు వస్తుండటంతో వారు పోసి హారతులిచ్చి పూజలు చేశారు. అనంతరం ఆలయంలో పూర్ణాహుతి, స్వామి వారికి కలశ స్నాపనోత్సవం, చూరసంవాదం, మహానివేదన, 12 సేవలను అర్చకులు పరాంకుశం వాసుదేవవాచార్యులు, తిరునగరి రామకృష్ణమాచార్యులు ఘనంగా నిర్వహించి ఉత్సవాలు ముగిసినట్లు తెలిపారు. మహిళలకు పసుపు, కుంకుమ, జాకెట్‌తో పాటు కుంకుమ భరణాలను ఆలయ ఏసీ వరప్రసాద్ అందజేశారు. చైర్మన్ భరద్వాజ్, సిబ్బంది పాల్గొన్నారు. -
చేరువైన విజయం
శ్రమ ఫలం..మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన విద్యా సంస్కరణల ఫలితంగా ఓ మట్టిలో మాణిక్యం మెరిసింది. పేదలకు ఇంటర్మీడియెట్ విద్యను చేరువ చేసేందుకు తీసుకొచ్చిన హైస్కూల్ ప్లస్ కాన్సెప్ట్‌తో ఓ పేద విద్యార్థిని కార్పొరేట్ స్థాయి మార్కులు సాధించి సత్తా చాటింది. ఉండటానికి కనీసం ఇల్లు కూడా లేని స్థితిలో.. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవించే కుటుంబంలో నుంచి వచ్చిన హరిణి అనే విద్యార్థిని స్టేట్‌లో ఉన్న హైస్కూల్ ప్లస్‌లలో ప్రథమస్థానం సాధించి ఔరా అనిపించింది. జి.కొండూరు: ‘మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును మాత్రం మన దగ్గర నుంచి ఎవరూ తీసుకోలేరు చిన్నప్పా’ ఇది ఇటీవల వచ్చిన ఓ సినిమాలోని డైలాగ్. ఇదే సిద్ధాంతంతో బడుగు, బలహీన వర్గాలు, నిరుపేదల్లో అక్షరాస్యత పెంచి విద్యా వంతులను చేస్తే ఉన్నత స్థానాలకు చేరుకొని సమాజంలో గౌరవంగా బతుకుతారనే సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఈ సంస్కరణలలో భాగంగానే పేద విద్యార్థులు పదో తరగతి అనంతరం చదువు ఆపకూడదనే లక్ష్యంతో ఇంటర్ విద్యను చేరువ చేసేందుకు ప్రతి మండలానికి ఇంటర్ కళాశాల కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు. 2022–23 విద్యా సంవత్సరానికి గానూ హైస్కూలు ప్లస్‌లను ప్రవేశపెట్టారు. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తోంది. ఇటీవల వచ్చిన ఇంటర్ ఫలితాల్లో మైలవరం ఎంబీఎం గరల్స్ హైస్కూలు ప్లస్‌లో చదివిన భూక్యా హరిణి అనే విద్యార్థిని స్టేట్‌లో ఉన్న హైస్కూల్ ప్లస్‌లలో ప్రథమస్థానం సాధించి ప్రైవేటు కళాశాలలకు సైతం సవాలు విసిరింది. ఆది నుంచి తెలుగు మీడియం చదివిన హరిణి ఇంటర్లో ఇంగ్లిష్ మీడియంలో చేరి అసాధారణ ఫలితాలను సాధించి అబ్బుర పరిచింది. నిరుపేద కుటుంబం నుంచి.. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండల పరిధి వెదురుబీడెం గ్రామానికి చెందిన భూక్యా హరిణి తండ్రి గోపి రోజువారీ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోసిస్తున్నాడు. ఉండడానికి ఇల్లు కూడా లేకపోవడంతో గ్రామ శివారులోని మామిడితోటలోని రేకులషెడ్డులో నివాసం ఉంటున్నారు. హరిణి తల్లి దేవి అనారోగ్యంతో ఇంటి వద్దనే ఉంటారు. హరిణికి తమ్ముడు పూర్వా దుర్గాప్రసాద్ ఉన్నాడు. ఇతను ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు. నిరుపేద కుటుంబం కావడంతో హరిణి చదువంతా ప్రభుత్వ పాఠశాలలోనే కొనసాగింది. సొంత గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదివి, మైలవరం ఎంబీఎం గరల్స్ హైస్కూల్లో తొమ్మిది, పది తరగతులను పూర్తి చేసింది. పదో తరగతిలో 498 మార్కులు సాధించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రైవేటు కళాశాలలో చదివే స్తోమత లేక ఇదే పాఠశాలలో 2023–24 విద్యా సంవత్సరంలో ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్ చేరింది. ఇటీవల వచ్చిన ఫలితాల్లో 978మార్కులతో రాష్ట్రంలో ఉన్న 294హైస్కూల్ ప్లస్‌లలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇదే పాఠశాల నుంచి ఇంటర్ బైపీసీలో 976 మార్కులతో పటాన్ సాజిదా కాతూన్ అనే విద్యార్థిని రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇంటర్ ఫలితాల్లో హైస్కూల్ ప్లస్ విద్యార్థిని సత్తా మాజీ సీఎం జగన్ తీసుకొచ్చిన విద్యా సంస్కరణల ఫలితం ఇంటర్ విద్య కోసం గత ప్రభుత్వంలో హైస్కూల్ ప్లస్‌లు ఏర్పాటు మట్టిలో మాణిక్యాలకు వరంలా మారిన కాన్సెప్ట్ ప్రోత్సాహమిస్తే వైద్య విద్య చదువుతానంటున్న హరిణిహైస్కూల్ ప్లస్ అభివృద్ధి ఇలా.. రాష్ట్రంలో ఉన్న హైస్కూల్ ప్లస్‌లలో ఇంటర్ ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన మైలవరం ఎంబీఎం గరల్స్ హైస్కూల్ ప్లస్‌కు గత ప్రభుత్వ హయాంలో రూ.229.30లక్షలను కేటాయించి అదనపు గదులను నిర్మించారు. వీటితో పాటు నాడు–నేడు కింద ఆధునిక వసతులను కల్పించారు. పాఠశాల తరగతులకే సరిపడా గదులు లేని ఈ పాఠశాలను ఇంటర్ విద్యకు సైతం సరిపడా గదులు నిర్మించడంతో పాటు కళాశాల వాతావరణం ఉట్టిపడేలా తీర్చి దిద్దారు. -
విజ్ఞాన జ్యోతి.. అంబేడ్కర్ స్ఫూర్తి
ఓ సామాజిక విప్లవం.. ఓ తాత్విక అధ్యయనం.. ఓ అభ్యుదయ భావ మూర్తిమత్వం.. అణగారిన ప్రజల గుండెల్లో వెలుగు దివ్వె, భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న మహాశక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని వక్తలు కొనియాడారు. సోమవారం ఆయన జయంతి సందర్భంగా వాడవాడలా అంబేడ్కర్ విగ్రహాల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంతోపాటు అంబేడ్కర్ స్మృతి వనం వద్ద నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు. రాజ్యాంగ రూప శిల్పిగా జాతికి చేసిన మేలులను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ పొలిటికల్ ఎడ్వైజరీ కమిటీ సభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి. గౌతంరెడ్డి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కాలే పుల్లారావు, ఎమ్మెల్సీ రుహుల్లా, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, డెప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ నేత పోతిన వెంకట మహేష్, పలువురు కార్పొరేటర్లు, ఎస్సీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
నిబంధనలు మట్టిపాలు!
● ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా యథేచ్ఛగా తవ్వకాలు ● అనుమతులు లేకుండా దోపిడీ ● ఎంయూడీఏ, బుడమేరు, చెరువుల నుంచి భారీగా తరలింపు ● పట్టించుకోని అధికారులు పేట్రేగిపోతున్న మట్టి మాఫియా సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో మట్టి మాఫియా పేట్రేగిపోతోంది. అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా నిర్వహిస్తూ రూ. కోట్లు గడిస్తోంది. వేసవి కాలం కావడంతో చెరువులు, నదులు, వాగులు, కొండలు, గుట్టల్లో మట్టిని యథేచ్ఛగా తవ్వేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అండదండలు ఈ మాఫియాకు ఉండటంతో, అధికారులు సైతం తమకేమి పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో మట్టి మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ప్రైవేటు వెంచర్లు, కట్టడాలు, రోడ్డు పనులకు భారీగా మట్టి తరలించి, కోట్ల రూపాయలను కొల్లగొడుతోంది. అధికారం మనదే.. లోడెత్తండి.. ● మైలవరం నియోజకవర్గంలో యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. జి.కొండూరు మండల పరిధి కోడూరు చెరువు నుంచి ఇటీవల అక్రమంగా మట్టిని ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రెడ్డిగూడెం మండల పరిధి రెడ్డిగూడెం, రంగాపురం, కొత్తనాగులూరు, జి.కొండూరు మండల పరిధి చిన్ననందిగామ గ్రామాల నుంచి గతంలో డంప్ చేసిన మట్టిని ఇటుక బట్టీలకు అక్రమ రవాణా చేస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. నియోజకవర్గ ప్రజా ప్రతినిధి బంధువు అండతో దందా జరుగుతోందని సమాచారం. ● జగ్గయ్యపేట నియోజకవర్గంలో జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో అక్రమ గ్రావెల్ రవాణా జరుగుతోంది. అధికార పార్టీ నాయకులు రాత్రి వేళల్లో టిప్పర్లు, ట్రాక్టర్లతో రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో 65వ నంబర్ జాతీయ రహదారి సూర్యాపేట నుంచి కోదాడకు 6 రోడ్ల విస్తరణలో భాగంగా గ్రావెల్‌ను రాత్రి వేళల్లో తరలిస్తున్నారు. వత్సవాయి మండలంలో భీమవరం సమీపంలోని కొంగర మల్లయ్యగట్టు నుంచి రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజా ప్రతినిధి అనుచరులు ఈ మట్టి దందాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ● తిరువూరు నియోజకవర్గంలోని ఎ.కొండూరు మండలం గోపాలపురంలో కొండను గుల్ల చేస్తున్నా రు. విస్సన్నపేట మండలంలో కొండపర్వలో భారీగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. రోజుకు వందల ట్రక్కుల మట్టిని తెలంగాణకు తరలిస్తున్నారు. ట్రిప్పర్‌కు రూ.12వేల–రూ.15వేలు వసూలు చేస్తున్నారు. దీంతోపాటు నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు, పొలాల మెరక చేయడానికి, రోడ్లు నిర్మించడానికి విక్రయిస్తున్నారు. విజయవాడ రూరల్ మండల పరిధిలో పోలవరం కుడికాలువ మట్టిని టీడీపీ నేతలు రాత్రివేళల్లో అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు. అధికారులు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారు. తిరువూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధి ప్రోద్బలంతోనే దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. -
రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్
రైతుకు నష్టం కలిగిస్తే సహించేది లేదు విజయవాడరూరల్: రైతుకు నష్టం, నష్టం కలిగితే సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించే మిల్లులను డీ ట్యాగ్ చేస్తామని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఇతర జిల్లాల మిల్లర్ల ద్వారా సేకరిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌తో కలిసి గొల్లపూడి మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం రాయనపాడు, పైడూరుపాడులో పర్యటించి, రైతుల ధాన్యపు రాశులను పరిశీలించి మాట్లాడారు. ప్రత్యేక వెసులుబాటు.. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి బుడమేరు వరదల కారణంగా నష్టపోయిన రైతులకు దాళ్వా పంట ఆలస్యమైనందున ఈ పంటలో నమోదైన ఖరీఫ్‌ని రబీలోకి వచ్చేలా వెసులుబాటు కల్పించినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర మేరకు మిల్లర్లు ధాన్యం సేకరించడం లేదని, అదే విధంగా తరుగు పేరిట అధిక కోతలు విధిస్తున్నట్లు కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లఘించే మిల్లర్లపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో లక్ష టన్నులు అయినా సేకరిస్తామని, రైతులు ఆందోళనతో తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచించారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. విజయవాడ ఆర్డీఓ కావూరి చౌతన్య, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ఎం.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ అందరివాడు
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రపంచంలోనే దీటైన రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందరివాడని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు హాలులో ఘనంగా నిర్వహించారు. తొలుత నగరంలోని అంబేడ్కర్ సర్కిల్లోని అంబేడ్కర్ విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేశారు. అనంతరం జిల్లా పరిషత్ సమావేశపు హాలులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రతిరోజు మన తలంపులో గాని, ప్రతి అడుగులో గాని మహనీయుడు అంబేడ్కర్ కనపడతారన్నారు. ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉందన్నారు. బందరు పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ అంబేడ్కర్ దేశ భవిష్యత్తును ఆనాడే ఆలోచించి రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. ప్రపంచ మేధావి అంబేడ్కర్.. కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ కొలంబియా విశ్వవిద్యాలయం 2004లో ప్రకటించిన ప్రపంచంలోని 100 మంది మేధావుల్లో మొట్టమొదటి పేరు బీఆర్ అంబేడ్కర్ ఉండటం ఆయన సాధించిన ఘన కీర్తికి నిదర్శనమన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్లనారాయణరావు, రాష్ట్ర నాటక రంగ సంస్థ అధ్యక్షుడు గుమ్మడి గోపాలకృష్ణ, ఎంయూడీఏ చైర్మన్ మట్టా ప్రసాద్, ఎస్పీ ఆర్ గంగాధరరావు, ఎస్సీ సంఘాల నాయకులు ఘంటా వెంకటేశ్వరరావు, కొడాలి శర్మ, వంపుగడవల చౌదరి, సాంఘిక సంక్షేమశాఖ డెప్యూటీ డైరెక్టర్ షేక్ షాహిద్‌బాబు పాల్గొన్నారు. ఎకై ్సజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర -
దుర్గగుడి అభివృద్ధి పనులకు విరాళం
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమలవుతున్న నిత్యాన్నదాన పథకంతో పాటు పలు అభివృద్ధి పనులకు గుంటూరుకు చెందిన వై. మధుసూదనరావు విరాళం అందజేశారు. నిత్యాన్నదానానికి రూ. లక్ష, బంగారు గోపురం అభివృద్ధి పనుల నిమిత్తం మరో రూ. లక్ష, దేవస్థానంలో గో సంరక్షణ నిమిత్తం రూ.లక్ష, శివాలయం అభివృద్ధి పనులకు రూ.15,101 కలిపి మొత్తం రూ.3,15,101 విరాళంగా సోమవారం ఆలయ అధికారులను కలిసి అందించారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులకు అమ్మవారి దర్శనం కల్పించి వేద పండితులతో ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. అనంతరం దాతకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.వైభవంగా ద్వాదశ ప్రదక్షిణలుభవానీపురం(విజయవాడపశ్చిమ): చైత్రమాస కల్యాణ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపైగల దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం రాత్రి నిర్వహించిన ద్వాదశ ప్రదక్షిణలు వైభవంగా జరిగాయి. కల్యాణోత్సవం, నదీ విహారం అనంతరం స్వామివారి ఆలయం చుట్టూ ద్వాదశ అంశాలతో (12) ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ద్వాదశ ప్రదక్షిణల్లో పంచ వాయిద్యం, వేద పఠనం, రుద్ర సూక్తం, స్త్రోత్ర పఠనం, భేరి, కాహలకం (కొమ్ము బూర), కాంస్య నాదం, మురళీ నాదం, గానం, నృత్యం, మౌనం అనే అంశాలతో ప్రదక్షిణలు చేశారు. అనంతరం అద్దాల మండపంలో పవళింపు సేవ నిర్వహించారు.ఉద్యోగోన్నతుల విషయంలో అన్యాయంవిజయవాడరూరల్: పంచాయతీరాజ్ శాఖ మండల పరిషత్, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో అడ్మినిస్ట్రేటివ్ అధికారులు(ఏఓ)గా పని చేస్తున్న వారికి ఉద్యోన్నతులు కల్పించే విషయంలో ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏఓల సమావేశం తీర్మానించింది. సోమవారం విజయవాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఏపీ పంచాయతీరాజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశం అల్తాఫ్ హుస్సేన్ అధ్యక్షతన జరిగింది. ఎంపీడీఓలుగా ఉద్యోగోన్నతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం జీఓ–35 ద్వారా ఈఓపీఆర్డీలకు రెండు వంతులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులకు ఒక వంతు చొప్పున కేటాయించడం అన్యాయమని సమావేశం పేర్కొంది. జీఓ–35ని సవరించాలని సమావేశం డిమాండ్ చేసింది. పి.కృష్ణప్రసాద్, ఎస్కే బాబూరావు, రవికుమార్, విజయ్‌కుమార్, పలు జిల్లాల నుంచి ఏఓలు సమావేశంలో పాల్గొన్నారు.కొనసాగుతున్న కల్యాణోత్సవాలుజగ్గయ్యపేట: తిరుమలగిరిలో వేంచేసియున్న వాల్మీదకోద్భవ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారికి సోమవారం కలశ స్నాపనం, సప్తముని పూజా సదస్యం, మహానివేదనం, నిత్యహోమం, బలిహరణ, ఆస్థానోత్సవ కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకుడు తిరునగరి రామకృష్ణమాచార్యులు, పరాంకుశం వాసుదేవాచార్యులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ సదస్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ చైర్మన్ భరద్వాజ్, ఏసీ ప్రసాద్, వేద పండితులు పాల్గొన్నారు. రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. -
నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి
తిరువూరు: భారీ వర్షాలు, ఈదురుగాలులతో నియోజకవర్గంలో రైతులు నష్టపోయిన పంటలకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు విజ్ఞప్తి చేశారు. ఆదివారం తిరువూరు మండలంలో కురిసిన వడగళ్లవానకు తడిసిన ధాన్యాన్ని ఆయన స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. గత వారం రోజుల్లో రెండుసార్లు వీచిన ఈదురు గాలులతో రైతులు పూర్తిగా నష్టపోయారని, మామిడి, బొప్పాయి, వరి, మొక్కజొన్న తదితర పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని స్వామిదాసు పేర్కొన్నారు. లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని చెప్పారు. ఆరుగాలం కష్టపడినా ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నిండా మునిగారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్మకానికి తరలించగా తడిసిన ధాన్యాన్ని, కాకర్లలో మామిడితోటల్లో రాలిన కాయలను పరిశీలించారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు తాళ్లూరి నవీన్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యుడు యరమల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి స్వామిదాసు -
చదువుల సరస్వతులకు సత్కారం
మచిలీపట్నంఅర్బన్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లాలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాల్లో ఉంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థినులను జిల్లా యంత్రాంగం ఘనంగా సత్కరిం చింది. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ జూనియర్ కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 143 మందిలో 104 మంది ఉత్తీర్ణులు కాగా ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో మొత్తం 79 మంది విద్యార్థులలో 73 మంది ఉత్తీర్ణత సాధించారు. 968 మార్కులు సాధించిన శ్యామలీల ఎస్సీ సంక్షేమ బాలికల వసతి గృహాల్లోని విద్యార్థినులు ఇంటర్ మొదటి సంవత్సరంలో 73 శాతం, ద్వితీయ సంవత్సరంలో 93 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎన్. శ్యామలీల అత్యధికంగా ఎంపీసీలో 968 మార్కులు సాధించింది. వొకేషనల్ ఎంపీహెచ్‌డబ్ల్యూలో కాకర రమ్య 964 మార్కులు, బైపీసీలో కె.మేఘన సంధ్య 954 మార్కులు, సీఈసీలో కుతాడ సిరి 926, వొకేషనల్ ఏజీటీలో పెద్ది రమామణి 910, సీఈసీలో బూర్ల లక్ష్మి 903 మార్కులు సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో వొకేషనల్ ఎమ్మెల్టీ కోర్సులో దాసి వర్ష, వి.చంద్రిక 480, దండాబత్తిన వెన్నెల 475, బోయిన ఈశ్వరి నాగజ్యోతి 475 మార్కులు సాధించారు. వొకేషనల్ ఏజీటీ కోర్సులో చాట్రగడ్డ అనుష్క 478 మార్కులు, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులో ఎల్.షైనీ 473 మార్కులు, సీఈసీ కోర్సులో పుట్టి పూర్ణిమ 438, ముంగర మెర్రీ గోల్డ్ 416 మార్కులు సాధించారు. ఎంపీసీలో బదిన కొండలమ్మ 424, ఎ.సాయి నవ్యశ్రీ 420 మార్కులు సాధించారు. బైపీసీలో విశ్వనాథపల్లి కెంపు రత్నం 401 మార్కులు సాధించారు. విద్యార్థినులకు జ్ఞాపికలు ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 17 మంది ఎస్సీ సంక్షేమ బాలికల వసతి గృహాల్లోని విద్యార్థినులకు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం అభినందన జ్ఞాపికలు అందజేశారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని ఎన్.శ్యామలీల(968)తో పాటు ఇతర విద్యార్థినులను అభినందించారు. ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థినులు ఎస్సీ సంక్షేమ బాలికల వసతి గృహాల్లోని విద్యార్థినుల అత్యుత్తమ ప్రదర్శన ఇంటర్ మొదటి సంవత్సరంలో 73 శాతం ఉత్తీర్ణత ద్వితీయ సంవత్సరంలో 93 శాతం ఉత్తీర్ణత -
కాపర్ దొంగలు...కర్షకులకు సవాలు
జి.కొండూరు: కాపర్ దొంగలు రైతులకు తలపోటుగా మారారు. వ్యవసాయ బోర్లలో విద్యుత్ మోటార్లకు ఉండే కాపర్ కేబుళ్లను అందినకాడికి కోసి ఎత్తుకు పోతున్నారు. ఇవే ఘటనలు పదేపదే జరుగుతుండడంతో రైతులు తలలు బాదుకుంటున్నారు. కేబుళ్లకు అయ్యే ఖర్చు కన్నా మోటార్ల రిపేర్లకు అయ్యే ఖర్చు తమకు భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు స్పందించి కేబుళ్ల దొంగలను పట్టుకోవాలని కోరుతున్నారు. జి.కొండూరు మండల పరిధిలోని మునగపాడు, చెర్వుమాధవరం, సున్నంపాడు గ్రామాల్లో ఈ విధంగా తరచుగా విద్యుత్ కేబుళ్లను చోరీ చేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. ఆ మూడు గ్రామాల్లో నిత్యం చోరీలే జి.కొండూరు మండల పరిధిలోని 22 గ్రామ పంచాయతీల పరిధిలో 4 వేల వరకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా చెర్వుమాధవరం, మునగపాడు, సున్నంపాడు గ్రామ పంచాయతీల పరిధిలో 450 వరకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే ఈ మూడు గ్రామాల పరిధిలో గత ఏడాదిన్నర కాలంగా వ్యవసాయ బోర్లలో ఉన్న విద్యుత్ మోటార్లకు స్టార్టర్ బోర్డు నుంచి మోటార్లలోకి విద్యుత్‌ను సరఫరా చేసే కాపర్ విద్యుత్ కేబుళ్లను కోసి చోరీ చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వలన మోటార్లకు వందల అడుగులోతుకు వెళ్లిన కేబుళ్లు జారి బోర్లలో పడిపోతున్నాయి. ఈ క్రమంలో మోటార్లను పైకి తీసి కేబుళ్లను జాయింట్ చేసి మళ్లీ మోటార్లను అమర్చాల్సి వస్తుంది. ఈ పని చేయడానికి ఒక్కొక్క మోటారుకు రూ.3వేల వరకు ఖర్చు అవుతుంది. ఒక్కొక్క మోటారు వద్ద ఇప్పటికే మూడు నుంచి ఐదు సార్లు చోరీలు జరగడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. దొంగలు తాము చోరీ చేసిన కాపర్ విద్యుత్ కేబుళ్లను కరిగించి దాని నుంచి కాపర్‌ను వేరు చేసి కేజీ రూ.300 నుంచి 400 వరకు విక్రయిస్తారని తెలుస్తోంది. బయట మార్కెట్లో కాపర్ విలువ కేజీ రూ.800 నుంచి రూ.900 వరకు ఉన్న క్రమంలో చోరీ చేసిన కాపర్‌కి డిమాండ్ ఉండడంతో దొంగలు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిత్యం ఈ మూడు గ్రామాల్లోనే చోరీలు జరగడం పట్ల రైతులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ మూడు గ్రామాల్లోనే పాడి పశువులు, పందెం కోళ్లు సైతం చోరీలు జరగడంతో స్థానికంగా ఉండే వ్యక్తులే ఈ పని చేస్తున్నారనే ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ మోటార్ల వద్ద విద్యుత్ కేబుళ్ల చోరీ అస్తమానం రిపేర్ల ఖర్చుతో రైతులకు ఆర్థిక భారం వరుస చోరీ ఘటనలతో బెంబేలు దొంగలపై పోలీసులు దృష్టి పెట్టాలంటున్న రైతులు -
కడసారి చూపునకు వస్తూ...
యడ్లపాడు: నాయనమ్మ మరణించిందని తెలిసి కడసారి చూపునకు వస్తున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ హృదయ విదారక ఘటన పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. చిలకలూరిపేట పోలిరెడ్డిపాలెం ఎదురుగా ఉన్న లక్ష్మీనర్సింహ కాలనీకి చెందిన మక్కెన శ్రీనివాసరావు దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో చిన్నవాడైన శివరామకృష్ణ(28)కి ఏడాదిన్నరక్రితం సమీప బంధువు నందినితో పెళ్లయింది. శివరామకృష్ణ విజయవాడలోనే ఉంటూ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదివారం చిలకలూరిపేట రూరల్ మండలం అప్పాపురంలో ఉన్న నాయనమ్మ సుబ్బలమ్మ చనిపోయిందన్న వార్త తెలిసి చూసేందుకు బైక్‌పై బయలుదేరాడు. యడ్లపాడు గ్రామంలోని ఎన్ఎస్ఎల్ నూలుమిల్లు వద్ద ఫ్లై ఓవర్ వద్దకు రాగానే ఎదురుగా వెళ్తున్న వాహనం సడన్ బ్రేక్ వేయడంతో బైక్ అదుపు తప్పి ఆ వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో శివరామకృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో కుటుంబసభ్యులు శివరామకృష్ణను విజయవాడ సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సుబ్బులమ్మ భౌతికకాయాన్ని చూసేందుకు వచ్చిన బంధుమిత్రులు సోమవారం ఉదయం ఆమెకు అప్పాపురం గ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించారు. శివరామకృష్ణ భౌతికకాయానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం నానమ్మ మరణ వార్త విని వస్తుండగా దుర్ఘటన -
రైతులను ఇబ్బంది పెడితే బ్లాక్‌లిస్టులో పెడతాం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడితే మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెడతామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. నగరంలోని కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఆయన జిల్లాలోని రైస్ మిల్లర్లతో ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రైతుల నుంచి మిల్లర్లపై అనేక ఆరోపణలు వస్తున్నాయని, ఇప్పటికై నా పద్ధతి మార్చుకోవాలని లేదంటే చర్యలు తప్పవన్నారు. మిల్లర్ల విషయంలో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నప్పటికీ కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. తేమశాతం, నూకలు సాకు చూపి రైతులను ఇబ్బందులకు గురి చేయకూడదన్నారు. మిల్లర్లు పద్ధతి మార్చుకుని ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దళారీ వ్యవస్థను సహించేది లేదని అన్నారు. ధాన్యం అన్ లోడింగ్ విషయంలో కాలయాపన చేయయడం రైతును ఇబ్బంది పెట్టడమేనని, 24 గంటల్లో మార్పు రావాలన్నారు. పంట దిగుబడి విషయంలో రైతు సంతోషంగా ఉన్నాడని, కొనుగోలు జరిగిన 24 గంటల్లో నగదు రైతు ఖాతాలకు జమ అవుతున్నప్పటికీ, మిల్లర్ల విషయంలో రైతు అసంతృప్తిని అర్థం చేసుకుని పూర్తి సహకారం అందించాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ రబీలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి జరగటం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేసినా, దళారీ వ్యవస్థను ప్రోత్సహించినా సంబంధిత మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. సమావేశంలో ఆర్డీఓ కె.చైతన్య, పౌరసరఫరాల శాఖ డీఎం ఎం.శ్రీనివాస్, మిల్లర్లు పాల్గొన్నారు. మిల్లర్లకు మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక -
ప్రమాదంలో పడిన రాజ్యాంగం
భవానీపురం(విజయవాడపశ్చిమ): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం నేడు పెను ప్రమాదంలో పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ పాలనలో రాజ్యాంగాన్ని మార్చివేసేందుకు అనేక కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ పార్లమెంట్ స్థానాలు వస్తే అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనుస్మృతి రాజ్యాంగాన్ని తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేశారని అన్నారు. భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచి లౌకికవాదాన్ని మట్టు పెట్టేందుకు ఇటీవల ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లు నిదర్శనమని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకుని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రజాస్వామ్యవాదులు ప్రతిజ్ఞ చేయాలని, అదే అంబేడ్కర్‌కు నిజమైన నివాళి అన్నారు. సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ లౌకిక వ్యవస్థకు పెద్ద పీట వేసే దేశ ప్రజలు అయోధ్య ఎన్నికతో బీజేపీకి బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని వ్యతిరేకించేవారు కాలగర్భంలో కలిసిపోతారని అన్నారు. డీ లిమిటేషన్ పేరుతో ఉత్తర, దక్షిణ భారత దేశాన్ని విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ అనుసరిస్తున్న మతోన్మాద రాజకీయాలు లౌకిక వ్యవస్థకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు లంకా దుర్గారావు, నక్కా వీరభధ్రరావు, బుట్టి రాయప్ప, పంచదార్ల దుర్గాంబ, ఎం. సాంబశివరావు, కేవీ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ -
రాజధాని అభివృద్ధికి భూముల పరిశీలన
ఇబ్రహీంపట్నం: అమరావతి రాజధాని అభివృద్ధికి మండలంలోని జూపూడి, చినలంక, పెదలంక గ్రామాల్లోని లంక భూములను రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి పి.నారాయణ, ఎమ్మెల్యేలు వసంత వెంకట కృష్ణప్రసాద్, బొండా ఉమామహేశ్వరరావు, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఈ ప్రాంతంలో భూములు సేకరించి స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. నదీ ప్రవాహానికి ఆటంకం లేకుండా మెరక ప్రాంత భూములు 2 వేల ఎకరాలు సేకరించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. త్వరగా అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇందుకు అవసరమైన హైలెవల్ కమిటీ వేసి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అమరావతి స్పోర్ట్స్ సిటీలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, క్రీడా విశ్వవిద్యాలయం నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. అథ్లెట్లు, ఫిజియోథెరఫిస్టులు, కోచ్‌లకు కూడా ఇక్కడే శిక్షణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపడతామని తెలిపారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ ఆశయ స్ఫూర్తితో పాలించిన జగన్
భవానీపురం(విజయవాడ పశ్చిమ): అంబేడ్కర్ ఆశయ స్ఫూర్తితోనే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన సాగించారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్ద పీట వేసి అధికారంలో భాగస్వాములను చేశారని గుర్తు చేశారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్సార్ సీపీ వైఎస్సార్ సీపీ పొలిటికల్ ఎడ్వైజరీ కమిటీ సభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డిలతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రైవేటు పరం చేస్తే ఉద్యమిస్తాం : వెలంపల్లి విజయవాడ నడిబొడ్డున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేస్తే ఉద్యమిస్తామని వైఎస్సార్ సీపీ పొలిటికల్ ఎడ్వైజరీ కమిటీ సభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు హెచ్చరించారు. భారత రాజ్యాంగ రూపకల్పనతో దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేసిన అంబేడ్కర్ విగ్రహం విజయవాడలోనే ఉండాలని భావించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 125 అడుగుల ఎత్తులో నగర నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేశారని అన్నారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం చట్ట సవరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ అంబేడ్కర్ ఆలోచనలను తు.చ తప్పకుండా అమలు చేసిన ఏకై క ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని అన్నారు. గౌతంరెడ్డి మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తొలగిపోయి సమసమాజం ఏర్పడాలన్నదే అంబేడ్కర్ ఆలోచనా విధానమని అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కాలే పుల్లారావు, ఎమ్మెల్సీ రుహుల్లా, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, డెప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజరెడ్డి, వైఎస్సార్ సీపీ నేత పోతిన వెంకట మహేష్, పలువురు కార్పొరేటర్లు, ఎస్సీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
రంగస్థల, సినీ నటుడు బోలెం రామారావుకు నంది అవార్డు
చల్లపల్లి: ప్రముఖ రంగస్థల, సినీ నటుడు కృష్ణాజిల్లా, చల్లపల్లికి చెందిన బోలెం రామారావు నేషనల్ బంగారు నంది అవార్డు అందుకున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వ బాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జి.సి.ఎస్.వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉగాది, డాక్టర్ అంబేడ్కర్ జయంతి, మహనీయుల ప్రత్యేక అవార్డుల–2025 కింద ఈ జాతీయ బంగారు నంది అవార్డును రామారావు అందుకున్నారు. సాధారణ మధ్య తరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన వృత్తిరీత్యా ఆర్టీసీ డ్రైవర్ అయినప్పటికీ మొదటి నుంచి రంగస్థల నాటకాలు, ఏకపాత్రాభినయాలు అంటే మక్కువ ఎక్కువ. కేవలం దివి ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నాటక పరదర్శనలు ఇచ్చిన రామారావు కళారంగ వాసులకు సుపరిచితుడే. సత్యహరిశ్చంద్ర నాటకంలో విశ్వామిత్రుడిగా, వీరబాహుడుగా అనేక ప్రదర్శనలు ఇచ్చారు. బాలనాగమ్మ నాటకంలో మాయల ఫకీరుగా 500లకు పైగా ప్రదర్శనలు, ఏకపత్రాభినయాలు చేసి ప్రేక్షకులను రంజింపజేశారు. విజయ మూవీతో పరిచయం.. రంగస్థల నటుడిగా పేరు ప్రఖ్యాతలు ఘడించిన రామారావుకు సినీ రంగంలో కూడా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. సురేష్ ప్రొడక్షన్లో విజయ మూవీతో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం తరువాత విక్రమార్కుడు, బాహుబలి–1, బ్రహ్మిగాడి వీరగాథ, సైరా నరసింహారెడ్డి వంటి చిత్రాల్లో పలు పాత్రల్లో నటించారు. తెలంగాణ రాష్త్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గుమ్మ డి వెన్నెల, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ పతాని రామకృష్ణగౌడ్, సీనియర్ ఆర్ట్టిస్ట్ దొరైస్వామిల చేతుల మీదుగా బోలెం రామారావు ఆదివారం ఈ అవార్డును, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. బోలెం రామారావుకు పలువురు కళాకారులు, ప్రముఖులు, దివిప్రాంత ప్రజలు అభినందనలు తెలిపారు. -
వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేరుస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వక్తలు డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆంధ్రప్రదేశ్ వడ్డెర/వడియ రాజుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముందు సంఘం రాష్ట్ర కార్యాలయాన్ని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం ప్రారంభించారు. ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 40 లక్షల జనాభా ఉన్న వడ్డెర్లకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవుల్లో అన్యాయం జరుగుతోందన్నారు. వడ్డెర్లను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ వడ్డెర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్ ఈనాటిది కాదన్నారు. స్వాతంత్య్ర వచ్చిన నాటి నుంచి ఎస్టీ జాబితాలో చేర్చాలని పోరాడుతున్నామన్నారు. గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్సార్, జనార్ధనరెడ్డి వడ్డెర్లకు ఎన్నో ఫలాలు అందించారని, కూటమి ప్రభుత్వం వాటన్నింటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తాను చట్టసభల్లో అడుగుపెట్టిన తర్వాత వడ్డెర్ల సమస్యలను అనేక పర్యాయాలు ప్రస్తావించానన్నారు. హక్కుల సాధనకు ప్రతి ఒక్కరు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. క్వారీల్లో అవకాశం కల్పించాలి.. సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు వేముల బేబీరాణి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ పదవులు, నామినేటెడ్ పదవులలో వడ్డెర్లకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. టీటీడీ బోర్డు చైర్మన్‌గా వడ్డెర కులానికి అవకాశం రాలేదన్నారు. కనీసం బోర్డు మెంబర్లుగా కూడా నియమించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల చైర్మన్లుగా, డైరెక్టర్లు వడ్డెర్లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి మండల కేంద్రంలో వడ్డే ఓబన్న విగ్రహం ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని కోరారు. కమ్యూనిటీ హాళ్లు నిర్మాణం చేయాలని, వడ్డెర్లకు క్వారీల్లో అవకాశం కల్పించాలని, సబ్సిడీపై యంత్రపరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓసీసీఐ చీఫ్ అడ్వైజర్ గుంజ నరసింహారావు, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మీకాంతయ్య, మంజుల నాగేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు బత్తుల నాగేశ్వరరావు, కన్వీనర్ వేముల శివ, ప్రధాన కార్యదర్శి వేముల మల్లేశ్వరరావు, యువజన సంఘం అధ్యక్షుడు వీరాంజనేయులు, జాయింట్ సెక్రటరీ ఎర్ల రవిచంద్ర, వేముల శ్రీదేవి, ఒంటిపులి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల బకాయిలపై కేబినెట్లో నిర్ణయం తీసుకోవాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిపడిన రూ.25 వేల కోట్ల చెల్లింపులపై రానున్న మంత్రివర్గ సమావేశంలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ డిమాండ్ చేశారు. తక్షణం ఐఆర్ ప్రకటించాలన్నారు. విజయవాడ విద్యాధరపురంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీపీఎస్‌పై స్పష్టత ఇవ్వాలి.. వేతన సవరణ విషయంలో హైకోర్ట్ విశ్రాంత జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్లో 2025 మార్చి 31 నాటికి ఉన్న బకాయిలను నమోదు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను పునరుద్ధరించాలని కోరారు. ఆర్థికపరమైన చెల్లింపులకు చట్టబద్ధ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జీపీఎస్ చట్టాన్ని కొనసాగిస్తుందా, రద్దు చేస్తుందా అన్న విషయంపై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. సీపీఎస్ ఉద్యోగులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కార దిశగా ఐక్యవేదిక తరుఫున జూన్‌లో విజయవాడలో సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో ఐక్యవేదిక కో చైర్మన్ కరణం హరికృష్ణ, సెక్రటరీ జనరల్ బాజీ పఠాన్, పెన్షన్ సంఘాల అధ్యక్షుడు రామచంద్రరావు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, వీఆర్వోల అసోసియేషన్ అధ్యక్షుడు భూపతి రాజు, ఐక్యవేదిక వైస్ చైర్మన్ కేదారేశ్వరరావు, రవీంద్రబాబు, డెప్యూటీ సెక్రటరీ జనరల్ నరసింహారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మాగంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తక్షణమే ఐఆర్ ప్రకటించాలి ఐక్యవేదిక చైర్మన్ సూర్యనారాయణ -
ఎయిమ్స్‌లో బైపాస్ సర్జరీలు ప్రారంభం
మంగళగిరి: ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) రోగులకు ఇక నుంచి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించనుంది. గుండె జబ్బుల రోగులకు బైపాస్ సర్జరీలతోపాటు ఐసీయూ విభాగం ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు కొన్ని జబ్బులకు ఓపీడీ సేవలు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉండేవి. అయితే ఇప్పుడు ఇన్‌పేషంట్ సేవలు, అత్యవసర విభాగం, ఐసీయూలను ప్రారంభించారు. తొలిసారిగా శనివారం ఓ రోగికి వైద్యులు బైపాస్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. రోజుకు 3,500 మందికి సేవలు2015లో శంకుస్థాపన చేసుకున్న ఎయిమ్స్ 2018లో వైద్య సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం 46 విభాగాలలో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తోంది. ఎయిమ్స్ ఆస్పత్రి భవనాలతోపాటు రెసిడెన్సియల్, మెడికల్, నర్సింగ్ కళాశాలల భవనాల నిర్మాణాలను పూర్తి చేసుకుంది. రోజుకు 3 వేల నుంచి 3,500 మంది రోగులకు సేవలందిస్తున్న ఎయిమ్స్ ఇప్పటివరకు 22,49,986 లక్షల మంది రోగులకు సేవలందించింది. 37,13,713 ల్యాబ్ పరీక్షలు నిర్వహించింది. ఈ నెలలో ఇప్పటి వరకు 38,212 మంది రోగులు ఓపీడీ సేవలందుకోగా మార్చి చివరి వరకు 4,39,933 మంది రోగులకు సేవలందించింది. 42,843 మంది ఇన్ పేషంట్ విభాగంలో చికిత్స పొందారు. ఎయిమ్స్‌కు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రోగులు తరలివస్తుండడం గమనార్హం. విజయవంతంగా బైపాస్ సర్జరీ తొలిసారిగా చేసిన బైపాస్ సర్జరీ విజయవంతం కావడం సంతోషంగా ఉంది. నేను డైరెక్టర్‌గా పదవి చేపట్టిన కొద్ది కాలంలోనే బైపాస్ సర్జరీ జరగడంతో పాటు ఐసీయూ ప్రారంభించి రోగులకు సేవలందిస్తున్నాము. ఇప్పుడు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇతర రాష్ట్రాల నుంచి రోగులు ఇక్కడకు వచ్చి చికిత్స పొందుతున్నారు. ఇకపై మరింత సమర్థంగా వైద్యసేవలు అందిస్తాం. ప్రొఫెసర్ డాక్టర్ అహెంతమ్ శాంత సింగ్ ఎయిమ్స్ డైరెక్టర్ -
మత్స్యకారుల్లో చైతన్యం తీసుకురావాలి
పటమట(విజయవాడతూర్పు): మత్స్యకారులు చైతన్యవంతులై ఐక్యంగా ఉద్యమించినప్పుడే మరిన్ని సంక్షేమ పథకాలు అందిపుచ్చుకుంటారని, సంఘాన్ని చైతన్యం చేయాలని మత్స్యకార సంఘం నాయకులు అర్జిలిదాస్, సైకం భాస్కరరావు, లకనం నాగాంజ నేయులు, కొల్లు శ్రీనివాసరావులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారుల సముదాయ సంఘాల నెట్ వర్క్(ఫిష్ కాన్) ఆద్వర్యంలో పటమట అయ్యప్ప నగర్‌లోని సంఘం కార్యాలయంలో మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధిపై ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మత్స్యకారులు ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టి పట్టి తెచ్చే మత్స్య సంపద ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు విదేశీ మారక ద్రవ్యం ఆర్జించిపెడుతున్న వీరి సంక్షేమాన్ని పాలక పక్షాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. మత్స్యకారులకు అవసరమైన పథకాలు రూపొందించి అమలు చేయలని డిమాండ్ చేశారు. మత్స్యకారులకు గ్రామాల్లో పక్కా ఇళ్లు, నాణ్యమైన విద్య, వైద్యం అవసరమైన అన్ని సౌకర్యాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంది ఇవ్వాలన్నారు. ఫిష్ కాన్ గ్రామ స్థాయి సంఘాల నుంచి ఇంటర్ నేషనల్ సంఘాలతో అనుసంధానమై ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని మత్స్య కారులకు అందిస్తోందని చెప్పారు. సమావేశంలో నాయకులు పీత ఈశ్వర ప్రసాద్, నాగిడి తాతారావు తదితరులు పాల్గొని మత్స్యకారుల సంక్షేమానికి సంబంధించి పలు అంశాలపై సలహాలు, సూచనలు చేశారు. అనంతరం ఫిష్ కాన్ లోగోను నాయకులు ఆవిష్కరించారు. కారు ఢీ కొని టిప్పర్ డ్రైవర్ దుర్మరణం కంకిపాడు: కారు ఢీ కొని టిప్పర్ డ్రైవర్ మృతి చెందిన సంఘటనపై కంకిపాడు పోలీసు స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. ఎస్ఐ డి.సందీప్ తెలిపిన కథనం మేరకు.. పెనమలూరు మండలం తాడిగడప ప్రాంతానికి చెందిన బోయి అచ్చయ్య(46) టిప్పర్ డ్రైవర్. సొంతంగా కిరాయిలు తిప్పుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం ఉదయం జి.కొండూరు నుంచి తన టిప్పర్‌లో కంకరు లోడు చేసుకుని పమిడిముక్కల మండటం మంటాడ గ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో దావులూరు టోల్గేట్ దాటిన తరువాత టిప్పరు ఆపి కాలకృత్యాలు తీర్చుకునేందుకు రోడ్డు దాటే క్రమంలో డివైడర్‌పై నించున్నాడు. విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొని దానిపై నిలబడ్డ అచ్చయ్యను ఢీ కొంది. దీంతో అచ్చయ్య తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. -
విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం
గుడివాడరూరల్: విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఓ చేపల మేత గోడౌన్లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. సేకరించిన వివరాల ప్రకారం పట్టణంలోని ఏలూరురోడ్డులో ఉన్న చేపల మేత గోడౌన్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా విద్యుత్ మీటర్లో నుంచి మంటలు చెలరేగి గోడౌన్‌కు వ్యాపించాయి. దీన్ని గమనించిన స్థానికులు అప్రమత్తమై ఇరుగుపొరుగు ఇళ్ల నుంచి మోటార్ పైపులైన్ల ద్వారా మంటలు పెరగకుండా నియంత్రించారు. స్థానికులు ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన ఫైర్ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దీంతో పెనుప్రమాదం తప్పిందని ఆ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదంలో గోడౌన్లో, సమీపంలోని ఇంట్లో రెండు ఏసీలు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. గోడౌన్ లోపలికి మంటలు వ్యాపించి ఉంటే అక్కడ నిల్వ ఉంచిన కెమెకల్స్ ద్వారా పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు పేర్కొన్నారు.నగరంలో 23 చిత్ర యూనిట్ సందడిగుణదల(విజయవాడతూర్పు): విజయవాడ నగరంలో 23 చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్రం ప్రమోషన్లో భాగంగా ఏలూరు రోడ్డు గుణదలలోని రామ్స్ థియేటర్లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో తేజ మాట్లాడుతూ.. మల్లేశం, మెట్రో వంటి హిట్ చిత్రాల దర్శకుడు రాజ్ రాచకొండ దర్శకత్వంలో 23 పేరుతో చిత్రం విడుదల చేస్తున్నామన్నారు. విభిన్నమైన పాత్రలతో కథనం నడుస్తుందని చెప్పారు. దర్శకుడు రాజ్ రాచకొండ మాట్లాడుతూ.. 1990 దశకంలో చిలకలూరి పేట ప్రాంతంలో జరిగిన ఒక బస్సు అగ్ని ప్రమాద ఘటనను ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించామన్నారు. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. గ్రామీణ నేపథ్యంలో తీసిన సన్నివేశాలు ఆలోచింప చేసే విధంగా ఉంటాయని తెలిపారు. కథాంశంలోని బస్సు ప్రమాదంలో సుమారు 20–23 మధ్య వయసు గల యువకులు మరణించారని అందుకే ఈ చిత్రానికి 23 అనే పేరు పెట్టామన్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పారు. కార్యక్రమంలో చిత్ర హీరోయిన్ తన్మయ పాల్గొన్నారు. -
గాయని మల్లాది స్వాతికి విశిష్ట మహిళా పురస్కారం
విజయవాడకల్చరల్: విజయవాడ నగరానికి చెందిన శాసీ్త్రయ సంగీత విద్వాంసురాలు, గాయని మల్లాది స్వాతికి 2025 సంవత్సరానికి విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నట్లు ఆదివారం ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన బల్లెం వేణుమాధవ్ ఆర్ట్స్ థియేటర్ సంస్థ ప్రతి ఏటా దేశంలో వివిధ రంగాల్లో సేవలను అందించిన వారికి విశిష్ట మహిళా పురస్కారం అందిస్తోంది. 2025 సంవత్సరానికి గానూ స్వాతికి ఈ పురస్కారం లభించింది. హైదరాబాద్‌లోని తెలుగు చలన చిత్ర మండలి హాల్లో సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి చేతుల మీదుగా శనివారం పురస్కారం అందుకున్నారు. స్వాతి నగరంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలలో కర్నాటక సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో కచేరీలు, సినీ సంగీత విభావరి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగరానికి చెందిన పలు సంస్థలు ఆమెను అభినందించాయి. -
కృష్ణానదిలో దూకి యువకుడి ఆత్మహత్య
కోడూరు: అప్పుల బాధ తట్టుకోలేక కృష్ణానదిలోకి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కోడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ చాణిక్య తెలిపిన వివరాల ప్రకారం.. కోడూరు తూర్పు వైపుకు చెందిన గంధం సతీష్(27) అవివాహితుడు, విజయవాడలో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి సతీష్ స్నేహితులతో కలిసి అవనిగడ్డ లంకమ్మ సంబరానికి వెళ్లాడు. సంబరం ముగించుకొని సతీష్ ఇంటికి వచ్చాడు. అయితే అర్ధరాత్రి 1.30గంటల సమయంలో సతీష్ ఆత్మహత్య చేసుకొనేందుకు ఉల్లిపాలెం–భవానీపురం వారధి వద్దకు వెళ్లాడు. వారధి వద్దకు వెళ్లిన తరువాత ‘ఉల్లిపాలెం బ్రిడ్జి మీద నుంచి దూకి చనిపోతున్నానని.. అమ్మనాన్నను జాగ్రత్తగా చూసుకోండి’ అని స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో కంగుతిన్న స్నేహితుడు సతీష్‌కు వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసిన లిఫ్ట్ చేయలేదు. దీంతో స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు హుటాహుటినా వారధిపైకి వెళ్లగా సతీష్ ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్, చెప్పులు ఉండడాన్ని గమనించారు. సతీష్ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్థారించారు. అయితే అర్ధరాత్రి కావడం, నది మధ్యలో లోతు ఎక్కువగా ఉండడంతో అప్పటికప్పుడే సతీష్ అప్పటికప్పడే గల్లంతయ్యాడు. యువకుడు తండ్రి బ్రహ్మారావు ఫిర్యాదు మేరకు ఘటనపై కోడూరు పోలీసులు కేసు నమోదు చేసి, ఆదివారం సతీష్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అవనిగడ్డ ఫైర్ సిబ్బందితో పాటు స్థానిక మత్స్యకారుల సహాయంతో మూడు బోట్లలో పోలీసులు కృష్ణానదిని జల్లెడపట్టారు. ఆదివారం సాయంత్రం 6గంటల సమయంలో వారధికి సమీపంలోని మడచెట్ల వద్ద సతీష్ మృతదేహం లభ్యమైంది. శవ పంచనమా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ఆస్పకి తరలించినట్లు ఎస్ఐ చెప్పారు. అప్పుల బాధ తాళ్లలేక సతీష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. -
పెంతలన్ గేమ్‌కు విస్తృత ప్రచారం కల్పించాలి
పటమట(విజయవాడతూర్పు): పెంతలన్ గేమ్‌కు విస్తృత ప్రచారం కల్పించి రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా మోడరన్ పెంతలన్ అసోసియేషన్ కృషి చేస్తోందని ఆ యూనియన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. మోడరన్ పెంతలన్ జాతీయ క్రీడలు వచ్చే ఏడాది జనవరిలో మేఘాలయలో జరగనున్నాయని ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొనేలా కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. మోడరన్ పెంతలన్ అసోసియేషన్ వార్షిక జనరల్ బాడీ సమావేశం నగరంలోని ఓ హోటల్లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్నారు. రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. 2025 జనరల్ బాడీ అధ్యక్షుడిగా ఉజ్వల ప్రసాద్‌ను, చైర్మన్‌గా తనను, కోశాధికారిగా డింపుల్ కృష్ణ, కార్యదర్శి ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో ఎన్నుకున్నామన్నారు. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విజయవాడ, కాకినాడ, తిరుపతిలో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.