
అంబేడ్కర్ అందరివాడు
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రపంచంలోనే దీటైన రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందరివాడని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు హాలులో ఘనంగా నిర్వహించారు. తొలుత నగరంలోని అంబేడ్కర్ సర్కిల్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేశారు. అనంతరం జిల్లా పరిషత్ సమావేశపు హాలులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రతిరోజు మన తలంపులో గాని, ప్రతి అడుగులో గాని మహనీయుడు అంబేడ్కర్ కనపడతారన్నారు. ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉందన్నారు. బందరు పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ అంబేడ్కర్ దేశ భవిష్యత్తును ఆనాడే ఆలోచించి రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు.
ప్రపంచ మేధావి అంబేడ్కర్..
కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ కొలంబియా విశ్వవిద్యాలయం 2004లో ప్రకటించిన ప్రపంచంలోని 100 మంది మేధావుల్లో మొట్టమొదటి పేరు బీఆర్ అంబేడ్కర్ ఉండటం ఆయన సాధించిన ఘన కీర్తికి నిదర్శనమన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్లనారాయణరావు, రాష్ట్ర నాటక రంగ సంస్థ అధ్యక్షుడు గుమ్మడి గోపాలకృష్ణ, ఎంయూడీఏ చైర్మన్ మట్టా ప్రసాద్, ఎస్పీ ఆర్ గంగాధరరావు, ఎస్సీ సంఘాల నాయకులు ఘంటా వెంకటేశ్వరరావు, కొడాలి శర్మ, వంపుగడవల చౌదరి, సాంఘిక సంక్షేమశాఖ డెప్యూటీ డైరెక్టర్ షేక్ షాహిద్‌బాబు పాల్గొన్నారు.
ఎకై ్సజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర