
పది పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఆత్మహత్య
బంటుమిల్లి: పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్థాపానికి గురై బంటుమిల్లి మండల పరిధిలోని పెదతుమ్మిడి పంచాయితీ శివారు అర్జావానిగూడెం గ్రామానికి చెందిన గోవాడ మింటు(17) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండోసారి కూడా పరీక్షల్లో ఫెయిల్ కావడంతో కలత చెంది ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యాన్ డ్రైవరుగా పనిచేస్తున్న మింటు తండ్రి రామకృష్ణ డ్యూటీకి వెళ్లగా, పనుల నిమిత్తం తల్లి బయటకు వెళ్లింది. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న మింటు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు బలవన్మరణానికి పాల్పడటం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. స్థానికులు మింటు మృతదేహాన్ని సందర్శించి, కుటుంబసభ్యులను ఓదార్చారు.
చదువుల ఒత్తిడే చంపేసింది
పెనమలూరు: కానూరు ఇంజినీరింగ్ కాలేజీలో మృతి చెందిన బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న యార్లగడ్డ ఖ్యాతిశ్రీ (22) చదువుల ఒత్తిడితోనే మృతి చెందిందని ఆమె తండ్రి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పంచనామా చేశారు. కానూరు ఇంజినీరింగ్ కాలేజీలో ఖ్యాతిశ్రీ మంగళవారం హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకోని మృతిచెందడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆమెతండ్రి యార్లగడ్డ శ్రీనివాసరావు విజయవాడ జీజీహెచ్ వద్ద బుధవారం జరిగిన శవపంచనామాకు హాజరై తమ కుమార్తె ఖ్యాతిశ్రీ సెమిస్టర్ ఫలితాల్లో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయిందని తెలపడంతో ఈ మేరకు పోలీసులు కేసు పంచనామా పూర్తిచేశారు. ఖ్యాతిశ్రీ మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం చేశారు.

పది పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఆత్మహత్య