
శాసీ్త్రయ సంగీతానికి పూర్వ వైభవం
విజయవాడ కల్చరల్: శాసీ్త్రయ సంగీతానికి పూర్వ వైభవం తేవడానికి శ్రీ సద్గురు సంగీత సభ కృషి చేస్తోందని సంగీత సభ అధ్యక్షుడు బీవీఎస్ ప్రకాష్ చెప్పారు. శ్రీసద్గురు సంగీత సభ ఆధ్వర్యాన త్యాగరాజస్వామి 258వ జయంతి సందర్భంగా ఎనిమిది రోజులపాటు నిర్వహించే జాతీయ సంగీతోత్సవాలు శివరామకృష్ణ క్షేత్రంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ శాసీ్త్రయ సంగీతం సజీవ స్రవంతి అని అభివర్ణించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి గౌరీనాథ్ మాట్లాడుతూ త్యాగరాజ కృతి వైభవం నేటి తరం యువ సంగీత విద్వాంసులు తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు బి.హరిప్రసాద్, జేఎస్‌ఎస్ ప్రసాద్ శర్మ, గాయత్రి గౌరీనాథ్, చారుమతి పల్లవి తదితరులు పాల్గొన్నారు. రుగ్వేదం పద్మశ్రీ, కృష్ణశ్రీ, వి.శ్యామకృష్ణ, హంసిని, సూరి కిరణ్మయి, మల్లాది కార్తీక, త్రివేణి, జొన్నలగడ్డ సాయిశ్రావణి త్యాగరాజ కృతులను మధురంగా గానం చేశారు.