
పూర్తిగా ధర పతనం
నేను ఎకరం విస్తీర్ణంలో మినుము సాగు చేశాను. దిగుబడి అందరికీ బాగానే వచ్చింది. నాకు మాత్రం 5 క్వింటాళ్లే వచ్చింది. మార్కెట్‌లో ధర పూర్తిగా తగ్గిపోయింది. ఆ రేటుకు అమ్మితే ఖర్చులు కూడా రావు. చేసేది లేక పంటను ఇంటిలో నిల్వ చేశా. మంచి ధర వస్తే అమ్ముదామని చూస్తున్నా.
–బీహెచ్ రాజగోపాల్‌రెడ్డి, రైతు, ప్రొద్దుటూరు
సిండికేట్ దోపిడీ
వ్యాపారులు సిండికేట్ అయిపోయారు. గత సీజన్‌లో రూ.9200 ఉన్న ధర ఈ ఏడాది పడిపోవటానికి వారే కారణం. అదేమంటే బర్మా నుంచి మినుము దిగుమతి అవుతోందంటున్నారు. ఆర్‌ఎస్‌కేల్లో మినుము కొనుగోలు చేయాలి.
–కొండవీటి సుబ్బారావు, రైతు, మంతెన
●

పూర్తిగా ధర పతనం