
నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపుపై హర్షం
కూచిపూడి(మొవ్వ): యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో నాట్య శాస్త్రాన్ని ప్రత్యేకంగా నమోదు చేశారని కేంద్ర సాంస్కృతిక పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించటంతో ప్రముఖ కూచిపూడి నాట్య క్షేత్రం కూచిపూడిలో కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కళాపీఠంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చింతా రవి బాలకృష్ణ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏలేశ్వరపు శ్రీనివాసులు, నాట్య విద్యార్థులు కలిసి నటరాజ స్వామికి శనివారం పూలమాలవేసి ఆనందోత్సాహాలతో స్వీట్లు పంచుకొన్నారు.
24 గంటలూ
ఆన్‌లైన్ సేవలు
బంటుమిల్లి: రాష్ట్రంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సబ్ ట్రెజరీల్లో 24 గంటలూ ఆన్‌లైన్ సేవలు అందిస్తున్నామని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ట్రెజ రీస్ అండ్ అకౌంట్స్ ఆఫీసరు డాక్టరు నేతల మోహన్‌రావు తెలిపారు. స్థానిక సబ్ ట్రెజరీని ఆయన శనివారం ఆకస్మిక సందర్శించారు. డీడీ ఎస్.రవికుమార్, ఎస్‌టీఓ గోపీకృష్ణతో కలసి ఆన్‌లైన్ రికార్డులు, మాన్యువల్ రికార్డులను పరిశీలించి అభినందించారు. ఉద్యోగుల జీతాల బిల్లులు, మెడికల్ బిల్లులు, పింఛన్‌దారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎస్‌టీఓ గోపీకృష్ణను ఆదేశించారు. అనంతరం మోహన్‌రావు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 206 సబ్ ట్రెజరీల ద్వార ప్రభుత్వ సేవలు ప్రజలకు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అత్యవసర సేవల్లో ఎక్కడ జాప్యం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్, డీఏ ఎరియర్స్‌ను త్వరలో చెల్లించేందుకు ప్రభుత్వ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
జాతీయ ఖోఖో పోటీలకు గుడివాడ విద్యార్థులు
గుడివాడ టౌన్: ఖేలో ఇండియా జూనియర్ ఖోఖో జాతీయ స్థాయి పోటీలకు గుడివాడ ఎస్‌పీఎస్ మునిసిపల్ హైస్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారని వ్యాయామ ఉపాధ్యాయుడు మడకా ప్రసాద్ శనివారం తెలిపారు. పాఠశా లకు చెందిన డి.రాకేష్, టి.తిమోతి, సాజిత్ ఖాన్, బి.జయ సూర్యతేజ రాష్ట్ర జట్టుకు ఎంపి కయ్యారని పేర్కొన్నారు. మే నాలుగు నుంచి 11వ తేదీ వరకు బిహార్ రాష్ట్రంలోని గయ పట్టణంలో జరిగే జాతీయ స్థాయి ఖోఖో పోటీ లకు తమ విద్యార్థులు ప్రాతినిధ్యం వహిస్తా రని వివరించారు. జాతీయ పోటీలకు ఎంపికై న విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శొంఠి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.
అద్దె గర్భం అనుమతులపై సమీక్ష
లబ్బీపేట(విజయవాడతూర్పు): సహాయక పునరుత్పత్తి సాంకేతికత(ఏఆర్‌టీ), అద్దె గర్భం (సరోగసి) చట్టం 2021 అమలులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా మెడికల్ బోర్డు శనివారం సమావేశమైంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దె గర్భం సేవలు పోందడానికి దరఖాస్తు చేసుకున్న ఏడుగురు దంపతుల అప్లికేషన్‌లను పరిశీలించారు. వారు అర్హత కలిగి ఉన్నారో లేదో చర్చించి పరిశీలించారు. ఈ సందర్భంగా కొన్ని సూచనలు చేశారు. వాటిని అమలు చేస్తే అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. సమావేశంలో ఎన్‌హెచ్‌ఎం కార్యక్రమం జిల్లా అధికారి డాక్టర్ నవీన్, జీజీహెచ్ ప్రసూతి విభాగాధిపతి డాక్టర్ కేశవచంద్ర, పిడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ పి.అనిల్‌కుమార్, డాక్టర్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపుపై హర్షం

నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపుపై హర్షం

నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపుపై హర్షం