దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు

Published Thu, Apr 17 2025 1:35 AM | Last Updated on Thu, Apr 17 2025 1:35 AM

దుర్గ

దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు

భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామి సన్నిధిలో నిత్యం జరిగే అన్నప్రసాద వితరణ నిమిత్తం పలువురు దాతలు బుధవారం విరాళాలు అందజేశారు. కాకినాడ జిల్లా జగన్నాథగిరికి చెందిన కె. వెంకట నాగేశ్వరరావు రూ. లక్ష, ఆయన కుటుంబ సభ్యులైన కె. వెంకట లక్ష్మి పేరిట రూ. లక్ష, కేపీ శ్రీదేవి పేరుతో మరో రూ. లక్ష కలిపి మొత్తం రూ.3 లక్షలు, విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడికి చెందిన ఎం. సురేష్‌ రూ. లక్ష విరాళంగా ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు దాతలు, వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అలాగే అమ్మవారి చిత్రపటాలు, ప్రసాదాలు అందజేశారు.

విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు

భవానీపురం(విజయవాడపశ్చిమ): సంకట హర చతుర్థి సందర్భంగా ఇంద్రకీలాద్రిపైగల శ్రీదుర్గామల్లేశ్వర స్వామి సన్నిధిలోని యాగశాలలో బుధవారం శ్రీవిఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతికి అభిషేకం చేసి హోమం జరిపించారు. మానవులను కష్టాల నుంచి గట్టెక్కించేది సంకట హర చతుర్థి పూజ అని, వినాయకునికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి అని అర్చకస్వాములు భక్తులకు వివరించారు. అలాగే సంకట హర చతుర్థి పూజ ఆచరించడం వల్ల మనిషి జాతకంలోని సమస్యలు తొలిగిపోయి అన్ని పనుల్లో ఏర్పడే సంకటాలు సమసిపోయి, సఫలత చేకూరుతుందని వివరించారు.

రాష్ట్ర కమిటీ ఎన్నిక

భవానీపురం(విజయవాడపశ్చిమ): సంచార పశు ఆరోగ్య సేవ వాహనాల (1962) కాంట్రా క్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా బి.నరేష్‌ నాయక్‌ (కృష్ణాజిల్లా) ఎన్నికయ్యారు. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలో ఇటీవల జరిగిన మహాసభలో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా ఎ.వి.నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా ఎం.ఎన్‌.వి.శ్రీధర్‌ (ఎన్టీఆర్‌ జిల్లా), కోశాధికారిగా జె.వెంకటేశ్వర్లు (తిరుపతి బాలాజీ), ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా ఎం.సురేష్‌ (విజయనగరం), ఉపాధ్యక్షుడిగా జి.రోహిత్‌ కుమార్‌ (శ్రీకాకుళం), మల్లిక (కాకినాడ), డి.వి.సతీష్‌ (వెస్ట్‌ గోదావరి), షేక్‌ షరీఫ్‌ (పల్నాడు), కార్యదర్శులుగా ఎ.హేమసుందర్‌ (తూర్పు గోదావరి), పెదపాటి సురేష్‌ (అంబేడ్కర్‌ కోనసీమ), కె.రవి (ఏలూరు), సి.సంతోష్‌ కుమార్‌ (కడప) ఎన్నియ్యారు. రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఐ.లక్ష్మీనారాయణ, ఆర్‌.నరేష్‌, టి.దుర్గాప్రసాద్‌, కె.రాకేష్‌, పి.నాగేంద్రబాబు, బి.రవికిరణ్‌, కె.రమేష్‌, ఆర్‌.గోపాలరావు, సీహెచ్‌ చిట్టిబాబు, బి. గోవింద నాయక్‌, ఎం.సతీష్‌ కుమార్‌, టి.జోహారి, మోహన్‌ను ఎన్నుకున్నారు.

కొనుగోలు కేంద్రాన్ని

సద్వినియోగం చేసుకోండి

జగ్గయ్యపేట అర్బన్‌: రైతులు దళారీలు, మిల్లర్ల చేతిలో నష్టపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని అమ్ముకోవాలని ఎన్టీఆర్‌ జిల్లా వ్యవసాయశాఖ అధికారి డీఎంఎఫ్‌ విజయకుమారి అన్నారు. జగ్గయ్యపేటలోని మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఏ గ్రేడు ధాన్యానికి రూ. 2,320, సాధారణ రకం రూ. 2,300 మద్దతు ధర ప్రకటించిందని, రైతులు పీపీసీ ద్వారా ధాన్యం అమ్ముకోవాలని సూచించారు. గోనె సంచులు, హమాలీల ఖర్చులు, రవాణా ఖర్చులు కూడ ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. రానున్న రెండు మూడు రోజులు వర్ష సూచన ఉన్నందున రైతులు తమ వరి కోతలను వాయిదా వేసుకోవాలన్నారు. ఆరబెట్టిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడం లేదా సురక్షిత ప్రాంతాలకు చేరవేసి, తడవకుండా భద్రపరచుకోవాలని సూచించారు. ఏడీఏ భవాని, ఏవో వరలక్ష్మి, రైతులు పాల్గొన్నారు.

దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు 1
1/3

దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు

దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు 2
2/3

దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు

దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు 3
3/3

దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement