
నియోజకవర్గాల యాక్షన్ ప్లాన్‌పై వర్క్‌షాప్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘స్వర్ణాంధ్ర 2047’ సాధనలో భాగంగా నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పనకు రెండు రోజులు జరిగే వర్క్‌షాప్ బుధవారం ప్రారంభమైంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సిబ్బందికి వర్క్‌షాప్ చేపట్టారు. ఏపీ సెక్రటేరియట్ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్లు రావి రాంబాబు, జె.విజయలక్ష్మి, సీనియర్ సలహాదారు డి.వి.వి.సీతాపతిరావు పాల్గొని సిబ్బందికి శిక్షణనిచ్చారు. విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పనకు నియోజకవర్గాల పరిధిలోని అవకాశాలు, బలాలు, అనుకూల, ప్రతికూల అంశాలను గుర్తించ డంపై అవగాహన కల్పించారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, వారి టీం సభ్యుల నుంచి సలహాలు, అభిప్రాయాలు సేకరించారు. వర్క్‌షాప్‌లో రెండు జిల్లాల నుంచి నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, నియోజకవర్గ హెడ్ క్వార్టర్ మండల పరిషత్ అధికారులు, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్లు, ప్రణాళిక శాఖ సిబ్బంది, జీఎస్‌డబ్ల్యూఎస్ నుంచి ప్రణాళికా శాఖకు ఆన్‌డ్యూటీపై తీసుకున్న సిబ్బంది పాల్గొన్నారు. వర్క్‌షాప్ గురువారం కూడా కొనసాగుతుందని అర్థగణాంకాధికారి ఎం.లలితాదేవి తెలిపారు.