
జాతి వైరం మరిచి.. స్నేహం చిగురించి..
కుక్క, పిల్లి మధ్య సహజంగానే జాతి వైరం ఉంటుంది. పిల్లి కనిపించిందంటే కుక్క ఒక్క ఉదుటున దాడి చేస్తుంది. కుక్క కనిపిస్తే పిల్లి వెంటనే తన దారి మార్చుకుంటుంది. అయితే విజయవాడ ఏలూరు రోడ్డు సమీపంలో ఓ కుక్క, పిల్లి మధ్య స్నేహం చిగురించింది. రెండూ ఆడుకుంటూ, సరదాగా ఆట పట్టించుకుంటూ సందడి చేస్తున్నాయి. స్థానికులు వాటి సరదా చేష్టలు చూసి ముచ్చట పడుతున్నారు. ఆదివారం కుక్క, పిల్లి ఆడుకుంటూ ఇలా ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ

జాతి వైరం మరిచి.. స్నేహం చిగురించి..

జాతి వైరం మరిచి.. స్నేహం చిగురించి..