
వ్యాపారాలు పడిపోయాయి..
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. దీంతో వ్యాపారాలు దారుణంగా పడిపోయాయి. దీని ప్రభావంతో వ్యాపారులతో పాటుగా ఆభరణాల తయారీ చేసే కార్మికులు నానా తంటాలు పడుతున్నారు.
– కోన శ్రీహరిసత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి, బెజవాడ జ్యూవెలరీ అండ్
బులియన్ మర్చంట్స్ అసోసియేషన్
ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..
బంగారు ఆభరణాల తయారీ కార్మికులు పనులు లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులకు చేరుకున్నారు. ఇటీవల యనమలకుదురులో ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు బంగారం ధరల పెరుగుదల ప్రధాన కారణం. చాలా మంది ఈ వృత్తిని వదిలేసి రోజువారీ కార్మికులుగా వెళ్లి పోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి.
– తోలేటి శ్రీకాంత్, చైర్మన్, వైఎస్సార్ సీపీ చేతివృత్తుల విభాగం
పరిస్థితి దయనీయం..
ఆభరణాల తయారీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. తులం బంగారం లక్షకు చేరుకోవటంతో ఈ పరిస్థితులు చాలా రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది. పనులు లేకపోవటంతో ఆదాయం లేక పస్తులుండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి.
– మందారపు పోతులూరి ఆచారి, ప్రధాన కార్యదర్శి, శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం
●

వ్యాపారాలు పడిపోయాయి..

వ్యాపారాలు పడిపోయాయి..