
మత్తు మరకలు.. గ్రూపు రాజకీయాలు!
శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రబీలో ధాన్యం సేకరణ ప్రహసనంగా మారింది. వాతావరణ మార్పులను ఆసరాగా చేసుకొని మిల్లర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. తేమశాతం సాకుతో ధరలో కోత విధిస్తున్నారు. లారీలు, సంచుల కొరత పట్టిపీడిస్తోంది. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో కష్టాలే మళ్లీ పునరావృతం అవుతున్నాయి. ఖరీఫ్‌లో అకాల వర్షాలకు పంట దెబ్బతినడంతోపాటు, కల్లాల్లో ధాన్యం తడిసి పోయింది. ఇదే సాకుగా దళారులు రంగంలోకి దిగి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
జిల్లాలో పరిస్థితి..
కృష్ణా జిల్లాలో రబీలో పెనమలూరు, గన్నవరం, తోట్లవల్లూరు, కంకిపాడు, బాపులపాడు, నాగాయలంక మండలాల్లో 12,175 ఎకరాల్లో వరి పంట సాగుచేశారు. ఈ–క్రాప్‌లో కూడా పంట నమో దైంది. 43,811 టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఏడాది రబీలో 10వేల టన్నుల ధాన్యం కొనేందుకు మాత్రమే ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కోసిన వెంటనే కొనుగోలు కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు సైతం ఆలస్యంగా ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 228 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది రబీలో దిగుబడులు ఆశాజనకంగా వచ్చాయి. కొనుగోలు లక్ష్యం మాత్రం అరకొరగానే నిర్దేశించి కూటమి ప్రభుత్వం చేతులు దులుపుకొనే యత్నం చేస్తోంది.
తేమ శాతం సాకుగా..
వాతావరణంలో మార్పులు, అకాల వర్షాలు.. ధాన్యం నిల్వ చేసుకొనే సామర్థ్యం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు మిల్లర్ చెప్పిన రేటు రూ.1400కు అంగీకరించాల్సి వస్తోంది. ఒక్కో రైతు 75 కేజీల బస్తాకు రూ.340కు పైగా నష్టపోతున్నారు. కేజీకి రూ.20 చొప్పున తగ్గిస్తున్నారు. వర్షం పడితే ధాన్యం తడిస్తే, క్వింటా ధర రూ.1200కు పడిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిని సాకుగా చేసుకొని మిల్లర్లు దందా సాగిస్తున్నారు.
పునాదిపాడు గ్రామానికి చెందిన కోటేశ్వరరావు కౌలురైతు. ఈ రబీ సీజన్‌లో 100 ఎకరాల వరకూ కౌలు చేస్తున్నారు. వరి కోత యంత్రంతో కోత కోయించారు. పంట చేతికొచ్చే నాటికి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. కోసిన ధాన్యం కల్లాల్లో ఉంచి కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూశారు. చేసేది లేక బయట వ్యాపారులకు ధాన్యం అమ్మారు. 75 కిలోలు బస్తా రూ.1200 మాత్రమే ధర కట్టారు. పది లారీల వరకూ ధాన్యం తరలించారు. ఆ రేటుకు ధాన్యం అమ్ముకోవటం వల్ల ఒక్కో లారీకి రూ.50 వేలు చొప్పున పది లారీల ధాన్యానికి రూ.5 లక్షలు సొమ్ము నష్టపోయారు. సీజన్ అంతా కష్టపడి వ్యాపారులకు మేలు చేయాల్సి వచ్చిందని ఆయన వాపోతున్నారు.
పునాదిపాడులో ధాన్యాన్ని బస్తాల్లోకి ఎత్తుతున్న కూలీలు
న్యూస్‌రీల్
ఖరీఫ్‌లో మిగిలిన ధాన్యం సంగతేంటి?
గత ఖరీఫ్‌లో ధాన్యం నూర్పిడులు చేయకుండా కుప్పలు వేశారు. ఇలాంటి ధాన్యం జిల్లాలో వ్యసాయాధికారుల అంచనా ప్రకా రం 85వేల టన్నులు ఉంటుందని అంచనా వేశారు. అనధికారిక లెక్కల ప్రకారం రైతుల వద్ద లక్ష టన్నులకు పైగా ధాన్యం ఉంటుందని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. అయితే 1,51,718 హెక్టార్లలో వరి పంట సాగు కావడంతో పాటు, 9,49,265 టన్నుల ధాన్యం ఉత్పత్తి వస్తుందని అప్పట్లో వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అయితే ఖరీఫ్‌లో సైతం కేవలం 6.10 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. ప్రస్తుతం కుప్పల పైన ఉన్న ధాన్యాన్ని కేవలం 65వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించారు. దీంతో రైతులు ఖరీఫ్‌లో కొనకుండా మిగిలి ఉన్న ధాన్యాన్ని మొత్తాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మద్దతు ధర క్వింటా ఏగ్రేడ్ రూ.2,330, కామన్ వైరెటీకి రూ.2.300గా ఉంది. మార్కెట్‌లో దీని కంటే ధర తక్కువగా ఉండటంతోనే కొనుగోలు కేంద్రాల వైపు చూస్తున్నారు.
మద్దతు ధర కోసం ఎదురుచూస్తున్నా..
నేను ఐదు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. పంట చేతికి వచ్చింది. రెండు రోజుల్లో కోత కోయించాలి. వాతావరణం చూస్తే భయమేస్తోంది. మబ్బులు, అడపాదడపా జల్లులతో పంట చేతికి అందుతుందో లేదో అన్న ఆందోళన వెంటాడుతోంది. పచ్చి మీదే ఆర్‌ఎస్‌కేలో కొనుగోలు చేస్తామని చెప్పారు. 75 కిలోలు బస్తా రూ.1500 వరకూ ధర వచ్చేలా ఉంది. బస్తాకు రూ.200 వరకూ నష్టం జరుగుతుంది. అయినా తప్పదు. కల్లాల్లో ధాన్యం ఆరబెడితే వాతావరణం ఏం చేస్తుందో అర్థం కావటం లేదు.
– చొప్పరపు గంగాధర్‌రావు,
కౌలురైతు, కోలవెన్ను

మత్తు మరకలు.. గ్రూపు రాజకీయాలు!

మత్తు మరకలు.. గ్రూపు రాజకీయాలు!

మత్తు మరకలు.. గ్రూపు రాజకీయాలు!

మత్తు మరకలు.. గ్రూపు రాజకీయాలు!

మత్తు మరకలు.. గ్రూపు రాజకీయాలు!

మత్తు మరకలు.. గ్రూపు రాజకీయాలు!

మత్తు మరకలు.. గ్రూపు రాజకీయాలు!