
హోంగార్డ్‌ల సంక్షేమానికి నిరంతరం కృషి
కోనేరుసెంటర్(మచిలీపట్నం): హోం గార్డ్‌ల సంక్షే మంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని స్పందన సమావేశపుహాలులో ఆయన బుధవారం హోంగార్‌ుడ్స దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. హోంగార్డ్స్ విభాగం పోలీస్ శాఖలో అంతర్భాగమేనన్నారు. పోలీసులతో సమానంగా విధులు నిర్వ ర్తించే హోంగార్డులకు పోలీసుశాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసు కురావాలని సూచించారు. విధుల్లో ప్రతిభ కనబరచిన ప్రతి హోంగార్డుకు రివార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో హోంగార్డులంతా తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్సును కలిగి ఉండాలన్నారు. అప్పుడే అనుకోని ప్రమాదం జరిగినప్పుడు వారి కుటుంబ సభ్యులకు రూ.30 లక్షల వరకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని సూచించారు. నిత్యం వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలని, ప్రతి శుక్రవారం జరిగే పరేడ్‌లో తప్పనిసరిగా పాల్గొనా లని సూచించారు. వృత్తి, ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలను పలువురు హోంగార్డులు ఎస్పీ గంగా ధరరావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. తన పరిధిలో ఉన్నంత వరకు ప్రతి సమస్యకూ పరిష్కారం చూపుతానని ఎస్పీ హామీ ఇచ్చారు. తన పరిధికి మించిన సమస్యలను ప్రభుత్వంతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు. హోంగార్డులు చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు తన దృష్టికి వస్తే శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ఏ మాత్రం వెనుకాడబోనని హెచ్చరించారు. అవసరమైతే సర్వీసు నుంచి తొలగిస్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో హోంగార్డ్స్ కమాండెంట్ విజయవాడ రీజియన్ ఆనంద్ బాబు, అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, అడిషనల్ ఎస్పీ ఏఆర్ బి.సత్య నారాయణ, ఏఆర్ డీఎస్పీ వెంకటేశ్వరరావు, హోమ్ గార్డ్స్ డీఎస్పీ విజయవాడ డివిజన్ ఎన్. వెంకటరమణ, హోంగార్డ్స్ ఆర్‌ఐ రవికుమార్ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఎస్పీ గంగాధరరావు