
బడుగుల చదువుకు భరోసా
● జీఓ నంబర్ 20తో ఇళ్ల నిర్మాణానికి చిక్కులు ● మచిలీపట్నంలో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణ పనులు ● 60 రోజులుగా ప్లాన్ కోసం అందని దరఖాస్తులు ● పనులు లేక భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులు ● జీఓ సవరణ చేస్తేనే ఇళ్ల నిర్మాణం
జీఓ వచ్చాక ఒక్క
దరఖాస్తు కూడా రాలేదు
జీఓ 20 విడుదలైన తర్వాత కొత్తగా ఒక ప్లాను దరఖాస్తు కూడా రాలేదు. జీఓపై చర్చించడానికి త్వరలో సమావేశం జరుగుతుందని తెలిసింది. దీనిపై ఏదో ఒక నిర్ణయం వస్తే గృహ నిర్మాణాలకు ప్లాన్ దరఖాస్తులు వస్తాయి. జీఓకు అనుగుణంగా అనుమతులు ఇస్తాం. ప్రభుత్వ, అధికారుల ఆదేశాలు అమలు చేయడమే మా విధి. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 20 ప్రజలకు ఉపయోగపడుతుంది.
–శ్రీహరిప్రసాద్, టీపీఓ
ఉపాధి తగ్గింది
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 20తో పనులు తగ్గాయి. నగరంలో గృహ నిర్మాణం మందగించడంతో పనులు వెతుక్కుని వెళ్లాల్సివస్తోంది. ఇసుక ధర ఎక్కువగా ఉండటంతో మధ్య తరగతి ప్రజలు నిర్మాణ పనులకు దూరంగా ఉంటున్నారు. ఈ ప్రభావం కూడా మాపై పడింది. జీఓ సవరణ చేయడంతో పాటు ఇసుక ధరను నియంత్రిస్తేనే భవన నిర్మాణ కార్మికులకు చేతి నిండా పని దొరుకుతుంది. లేకపోతే పని కోసం ప్రతి రోజూ వేట తప్పదు.
–వేకుల నాగరాజు,
భవన నిర్మాణ కార్మికుడు
మచిలీపట్నంటౌన్: ఇల్లు నిర్మించుకోవడం సగటు వ్యక్తి కల. ఇది ఖర్చుతో కూడిన అంశం. పైగా రాష్ట్ర ప్రభుత్వం నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో గృహ నిర్మాణాలకు కొత్త నిబంధనలతో విడుదల చేసిన జీఓ నంబర్ 20తో రెండు నెలలుగా గృహ నిర్మాణాలకు బ్రేక్ పడింది. దీని ప్రభావం పేద, మధ్య తరగతి ప్రజలపై పడటంతో ఆయా వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. వేసవిలో ఇళ్లు పూర్తి చేద్దామనుకునేవారికి నిరాశే మిగులుతోంది.
రెండు నెలలుగా దరఖాస్తులేవీ!
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 20 కారణంగా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో రెండు నెలలుగా నగరపాలక సంస్థలో గృహ నిర్మాణాలకు అవసరమైన ప్లాన్ దరఖాస్తులు అందలేదు. అధికారులు కొత్తగా ప్లాన్లు మంజూరు చేసింది లేదు. జీఓలోని కఠిన నిబంధనలు పేద, మధ్య తరగతి ప్రజల పాలిట శాపంగా మారింది.
కొత్త నిబంధనలు ఇవే
ఇళ్ల నిర్మాణాలకు జీఓ నంబర్ 20తో గృహ నిర్మాణదారులు, లైసెన్‌స్డ్ సర్వేయర్లు ఎంఎంసీ గడప తొక్కలేక పోతున్నారు. నూతన చట్టంలో పొందు పర్చిన ఐదు అంశాలు మధ్యతరగతి కుటుంబాల వారిని తీవ్ర ఇబ్బందులు కలిగించేవిగా ఉన్నాయి. జీఓ ప్రకారం ప్లాన్‌కు దరఖాస్తు చేసుకుంటే అనుమతి మేరకే ఇల్లు నిర్మించాలి. అత్యవసర పరిస్థితుల్లో 10 శాతం డీవియేషన్ ఉండవచ్చు. అంతకుమించి మార్పులు, చేర్పులు జరిగితే భవన నిర్మాణ అనుమతులు రద్దవుతాయి. అంతేకాకుండా గృహ నిర్మాణం అక్రమమైనదిగా నిర్ధారిస్తారు. దీనికి తోడు గృహ నిర్మాణానికి ప్లాన్ గీసిన లైసెన్‌స్డ్ సర్వేయర్ లైసెన్స్‌ను ఐదేళ్లు సస్పెండ్ చేస్తారు.
చర్యలుంటాయి
గృహ నిర్మాణంలో అక్రమాలు ఉంటే యజమానిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇంటి ప్లానుకు దరఖాస్తు చేయాలంటే తప్పనిసరిగా ఎల్టీపీ(లైసెన్‌స్డ్ సర్వేయర్లు), గృహ యజమాని సెల్ఫ్ సర్టిఫికేషన్ తీసుకొని సమర్పించాల్సి ఉంటుంది. ఇళ్ల నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణను జీఓతో ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిబంధనలతో గృహ యజమానులు 300 చదరపు మీటర్ల పరిధిలో ఎల్టీపీ ఇచ్చిన నమూనా ప్రకారం ప్రభుత్వ నిబంధనలతో గృహాన్ని నిర్మించకపోతే చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారనే కారణంతో ఎల్టీపీలు టౌన్ ప్లానింగ్ విభాగం వైపు కన్నెత్తి చూడటం లేదు.
కుదేలవుతున్న నిర్మాణ రంగం
భవన పనులు ప్రారంభమైతే నిర్మాణ కార్మికులు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వంటి 32 రకాల పనులు చేసే కార్మికులకు పని దొరుకుతుంది. ప్రస్తుతం ఈ రంగాల కార్మికులు పనులు లేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. గృహ నిర్మాణానికి వినియోగించే పరికరాలు సరఫరా చేసే వ్యాపార సంస్థలకు వ్యాపారం కొనసాగాల్సి ఉంది. ఇళ్లకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులకు పని ఉంటుంది. నిర్మాణరంగంపై సమాజంలో మిగిలిన అన్ని రంగాలు ఆధారపడి ఉన్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని జీఓ నంబర్ 20లో లోపాలు, అభ్యంతరకర అంశాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
విజయవాడ చిల్ట్రన్స్ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ సంఘం ఎన్నిక
60కి పైగా పెండింగ్‌లో
మచిలీపట్నం నగరపాలక సంస్థలో 60 రోజుల్లో దాదాపు 60కి పైగా ప్లాన్లు పెండింగ్‌లో ఉండటంతో సుమారు రూ. 30 లక్షల ఆదాయానికి గండి పడింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే టౌన్ ప్లానింగ్ చట్టం జీఓ నంబర్ 20ను సవరించాలి. నగరంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు, ఎల్టీపీలకు సానుకూలమైన చట్ట సవరణ చేస్తేనే ప్లాన్ దరఖాస్తులు కొనసాగవచ్చని మేధావులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే రెండు నెలల నుంచి ఒక ప్లాన్ కూడా అఫ్రూవల్ కాకపోవడంతో గృహ నిర్మాణదారులు, లైసెన్‌స్డ్ సర్వేయర్లు ప్రభుత్వ నిబంధన మార్పు కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రజల నడ్డి విరచడమే
జీఓ నంబర్ 20 పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచేలా ఉంది. జీఓలోని నిబంధనల ప్రకారం లైసెన్‌స్డ్ సర్వేయర్లు ప్లాన్ పెట్టలేని స్థితి నెలకొంది. జీఓ సవరణ చేస్తేనే ప్లాన్‌ల దరఖాస్తులు ఎంఎంసీకి పెట్టగలం. లేకపోతే భవన నిర్మాణాలు నిలిచిపోతాయి. దీన్ని సవరించి సర్వేయర్లకు, పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేయాలని కోరుతూ మంత్రి రవీంద్రను కలసి విన్నవించాను. ప్రభుత్వం స్పందించి సవరణ చేయాలి. –సీహెచ్ గోపాలరావు(గోపాల్), లైసెన్‌స్డ్ సర్వేయర్ల సంఘ నగర అధ్యక్షుడు

బడుగుల చదువుకు భరోసా

బడుగుల చదువుకు భరోసా

బడుగుల చదువుకు భరోసా

బడుగుల చదువుకు భరోసా