
సీఎస్‌ఎస్‌ఆర్ పోటీల్లో ఏపీ ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు తృతీయ స్థా
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఎనిమిదో బెటాలియన్ నిర్వహించిన కొలా ప్స్‌డ్ స్ట్రక్టర్ సెర్చ్ అండ్ రెస్క్యూ (సీఎస్‌ఎస్‌ఆర్) పోటీల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఏపీ ఎస్‌డీఆర్‌ఎఫ్) బృందం తృతీయ స్థానంలో నిలిచింది. ఈ పోటీల కోసం పదో బెటాలియన్, ఎన్‌డీఆర్‌ఎఫ్ కొండపావులూరు సహకా రంతో 19 మందితో కూడిన ఏపీ ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం అతి తక్కువ సమయంలో శిక్షణ పొంది ఒరిజినల్ స్థాయిలో మొదటి స్థానాన్ని సాధించి జాతీయ స్థాయి పోటీకి అర్హత సాధించింది. సీఎస్‌ఎస్‌ఆర్ ఆపరేషన్స్ చేసే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌తోపాటు వివిధ రాష్ట్రాలకు దీటైన పోటీ ఇచ్చి జాతీయ స్థాయిలో తృతీయ స్థానాన్ని కై వసం చేసుకుంది. బృంద సభ్యులను రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఏపీ ఎస్‌డీఆర్‌ఎఫ్ విభాగాధిపతి బి.రాజకుమారి, విభాగ అధికారులు అభినందించారు.