దేశ సమైక్యతను దెబ్బతీసే కుట్ర | - | Sakshi
Sakshi News home page

దేశ సమైక్యతను దెబ్బతీసే కుట్ర

Published Thu, Apr 24 2025 1:56 AM | Last Updated on Thu, Apr 24 2025 1:58 AM

కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌

కర్నూలు (టౌన్‌): దేశ సమైక్యతను దెబ్బతీసేందుకే ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారని, వారి కుట్రలను సమర్థవంతంగా తిప్పి కొట్టాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ పోలిటికల్‌ ఆడ్వైజరీ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ అన్నారు. పర్యాటక ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని బుధవారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. 26 మంది అమాయకులు ప్రా ణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఉగ్రమూకల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలన్నారు. మృతుల కుటుంబాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ప్రగాఢ సానుభూతి తెలుపుతుందని, కేంద్ర ప్రభుత్వం వారికిఅన్ని విధాలుగా అండగా నిలబడాలని కోరారు.

మంగళగిరికి ఎంపీడీఓలు, స్థానిక ప్రజా ప్రతినిధులు

కర్నూలు(అర్బన్‌): జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ఈ నెల 24న ( నేడు ) మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ హాల్‌లో రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. బుధవారం జెడ్పీలోని తన చాంబర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రస్థాయి కార్యక్రమానికి తనతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎంపీడీఓలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు హజరవుతున్నట్లు వెల్లడించారు.

గనులపై మైనింగ్‌ అధికారుల దాడులు

కొలిమిగుండ్ల: బెలుం–బెలుం శింగవరం గ్రామా ల మధ్యలో ఉన్న నాపరాతి గనులపై బుధవారం భూగర్భ గనుల శాఖ అధికారుల బృందం దాడులు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్‌ చేస్తున్నారనే కారణంతో స్థానిక పోలీసులతో కలిసి మైనింగ్‌ అధికారులు ఈ దాడులు చేశారు. ఎంత మేర గనుల తవ్వకా లు చేశారనే వాటిపై కొలతలు సేకరించారు. నాపరాళ్ల వెలికి తీసేందుకు ఉపయోగించే ఆరు కోత మిషన్లతో పాటు ప్రొక్లెయినర్‌, ట్రిప్పర్‌ను స్వాధీ నం చేసుకొని పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఉంచారు. అధికారులు దాడులకు వచ్చా రని తెలుసుకున్న చుట్టు పక్కల గనుల యజమానులు, కూలీలు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లి పోయారు.

ఏసీబీ డీఎస్పీగా సోమన్న

కర్నూలు: కర్నూలు రేంజ్‌ ఏసీబీ డీఎస్పీగా సోమన్న నియమితులయ్యారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఇక్కడ డీఎస్పీగా ఉన్న వెంకటాద్రి చిత్తూరు స్పెషల్‌ బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి డీఎస్పీ స్థానం ఖాళీగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల తర్వాత డీఎస్పీ పోస్టును భర్తీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. అనంతపురం జిల్లాకు చెందిన సోమన్న 1991లో ఎస్‌ఐ హోదాలో పోలీసు శాఖలో చేరి కర్నూలు రేంజ్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఎస్‌ఐగా, సీఐగా సేవలందించారు. కొంతకాలం పాటు ఆదోని డీఎస్పీగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌లో పనిచేస్తున్న ఈయన కర్నూలుకు నియమితులయ్యారు. అయితే మరో ఆరు మాసాల పాటు అటాచ్‌మెంట్‌ కింద సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌లోనే విధులు నిర్వహిస్తూ కర్నూలు పర్యవేక్షణ బాధ్యతలు కూడా చూసుకునేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రెండు సీఐ పోస్టులు ఖాళీ

కర్నూలు రేంజ్‌ ఏసీబీ విభాగంలో ప్రస్తుతం క్రిష్ణారెడ్డి, క్రిష్ణయ్య, రాజ ప్రభాకర్‌, శ్రీనివాసులు సీఐలుగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఇంతియాజ్‌, వంశీనాథ్‌, ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లడంతో రెండు సీఐ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖాళీ సీఐ పోస్టులను కూడా భర్తీ చేసి ఏసీబీ విభాగాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

దేశ సమైక్యతను  దెబ్బతీసే కుట్ర 1
1/1

దేశ సమైక్యతను దెబ్బతీసే కుట్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement