
చేతకాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వమిది..
ఎల్కతుర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి 16 నెలలు గడుస్తున్నా నేటికీ చిన్న కార్యక్రమం కూడా చేపట్టిని చేతకాని దద్దమ్మ ప్రభుత్వమని తేలిపోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత అన్నారు. ఎల్కతుర్తి మండలం చింతలపల్లి సమీపంలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను ఆమె గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు. మమ్మల్ని, మా కేసీఆర్‌ను జాతీయ స్థాయిలో ఆదర్శంగా తీసుకొని ప్రధానమంత్రి పలు కార్యక్రమాలు రూపొందించే స్థాయికి మాపార్టీ ఎదిగిందని అన్నా రు. తెలంగాణ ప్రజల ఆశ్వీరాదంతో దేశ వ్యాప్తంగా సేవలు కొనసాగించేందుకు బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందినట్లు తెలిపారు. ఒల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ప్రతిపక్షాలకు హితవుపలికారు. రా బోయే రోజుల్లో బీఆర్‌ఎస్ మహిళా నాయకత్వాన్ని పటిష్ట పరుస్తామన్నారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకు డు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ భావితరా లకు ప్రజలకు, యువతకు తమ పార్టీ ఉద్యమం కొ సాగింపు విషయాలపై దిశానిర్దేశం చేసేందుకు ప్రజ లు సభకు రాబోతున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభు త్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, జిల్లా ఇన్‌చార్జ్ గ్యాదరి బాలమల్లు, సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్, నరేందర్, రవిశంకర్, మాలోతు కవిత, చంద్రావతి, లలితా యాదవ్, శ్రీదేవి, హరిరమాదేవి, సుశీలారెడ్డి, రుద్ర రాధ, మాధవి, ప్రసన్న, చారులత, శాలిణి, స్వప్న, హర్షిణి, వసంత, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
ఏర్పాట్ల పరిశీలన..
రజతోత్సవ సంబురాల ఏర్పాట్లను గురువారం సాయంత్రం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిలు పరిశీలించారు.
సభాస్థలిని పరిశీలించిన సీపీ
రజతోత్స సభా స్థలాన్ని గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పరిశీలించారు. ఏర్పాట్లు, బారీకేడ్లు, హెలీప్యాడ్, వీఐపీ పార్కింగ్, వాహనాల పార్కింగ్ రూట్లు, ప్రధాన వేదిక తదితర విషయాలను బీఆర్‌ఎస్ నాయకులు సీపీకి మ్యాప్ ద్వారా వివరించారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయ రూట్లను ఏర్పాటు చేసుకోవాలని, అంబులెన్స్‌లు, అందుబాటులో ఉంచుకోవాలని సీపీ సూచించారు. ఆయన వెంట ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్‌రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ఏఆర్ అడిషనల్ ఎస్సీ సురేష్, ఏఆర్ ఏసీపీ అనంతయ్య, కాజీపేట ఏసీపీ తిరుమల్ ఉన్నారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వెకిలి మాటలు మాట్లాడుతున్నారు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు
కల్వకుంట్ల కవిత

చేతకాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వమిది..