
విద్యార్థులను సంసిద్ధం చేయాలి
మహబూ బా బాద్ అర్బన్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) విద్యను ప్రవేశపెట్టనున్నారని, అందుకు విద్యార్థులను ఉపాధ్యాయులు సంసిద్ధం చేయాలని జిల్లా గిరిజనశాఖ అధికారి దేశీరాం నాయక్ అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏఐపై ఉపాధ్యాయులకు సోమవారం శిక్షణను ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకుంటున్న ఉపాధ్యాయుల ఇళ్లను దేశీరాంనాయక్ సందర్శించి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా మొదటిరోజు రెగ్యులర్ ఉపాధ్యాయులు 14మంది, సీఆర్టీలు 19 మంది హాజరయ్యారని, గణిత శాస్త్రంపై శిక్షణ జరిగిందన్నారు. కార్యక్రమంలో గిరిజన శాఖ ఏసీ ఏంఓ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
నేడు రాజ్యాంగ
పరిరక్షణ సభ
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని వీఆర్‌ఎన్ గార్డెన్‌లో మంగళవారం ఉదయం 10 గంటలకు రాజ్యాంగ పరిరక్షణ సభ నిర్వహిస్తున్నామని మాలమహానాడు జాతీయ కార్యదర్శి అశోద భాస్కర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణ సభకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్ హాజరుకానున్నట్లు తెలిపారు. సభకు ప్రజలు, ప్రజా స్వామికవాదులు, మేధావులు, విద్యార్థి, ఉద్యో గ, ఉపాధ్యాయ వర్గాలు సబ్బండ కులాల ప్రతినిధులు హాజరుకావాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు చిట్టిమళ్ల మహేశ్, రాష్ట్ర కార్యదర్శి దార కుమార్, నాయకులు కందుకూరి వెంకటాద్రి, ఉసిల్ల ఉదయ్, రాకేశ్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
వినతులను సత్వరమే
పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
● ప్రజావాణిలో 78 అర్జీల స్వీకరణ
మహబూబాబాద్: సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం అనే విషయాన్ని అధికారులు గుర్తు పెట్టుకుని వినతులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా అదనపు కలెక్టర్ వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ వినతులను కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. వినతుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 78 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆర్డీఓ కృష్ణవేణి, సీపీఓ సుబ్బారావు, డీసీఓ వెంకటేశ్వర్లు, డీహెచ్‌ఎస్‌ఓ మరియన్న ఉన్నారు.
నేటి నుంచి ‘భద్రకాళి’
కల్యాణ బ్రహ్మోత్సవాలు షురూ
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో ఏప్రిల్ 29 నుంచి మే 10వరకు భద్రకాళి భద్రేశ్వరస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం అంకురార్పణ పూజలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈఓ శేషుభారతి తెలిపారు. సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం శేషుభారతి మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. కల్యాణోత్సవం సందర్భంగా ఒక్కోరోజు వివిధ కుల సంఘాల వారు అమ్మవారి సేవల్లో పాల్గొనడానికి ముందుకు వచ్చినట్లు ఆరోజున వారి నిర్వహణలోనే పూజా కార్యక్రమాలు జరుగుతాయని ప్రతీరోజు ఉదయం 11 గంటలకు, సాయంత్రం 7 గంటలకు అత్యంత వైభవంగా వాహన సేవలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మే 2న జరిగే కల్యాణోత్సవంలో పాల్గొనదల్చిన భక్తులు 516 రూపాయలు చెల్లించాలన్నారు.

విద్యార్థులను సంసిద్ధం చేయాలి

విద్యార్థులను సంసిద్ధం చేయాలి

విద్యార్థులను సంసిద్ధం చేయాలి