
విద్యాసంస్థల్లో మరుగుదొడ్లు నిర్మించాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్
మహబూబాబాధ్: స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రభుత్వ విద్యాసంస్థల్లో మరుగుదొడ్లు నిర్మించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో మరుగుదొడ్ల నిర్మా ణం, పలు అంశాలపై సంబంధిత అధికారులతో స మీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలన్నారు. జన సంచారం ఉన్న ప్రాంతాల్లో సీ్త్ర, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణం చేట్టాలన్నారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీఏఓ విజయనిర్మల, డీఈఓ రవీందర్‌రెడ్డి, డీపీఓ హరిప్రసాద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.