
బుధవారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– IIలోu
ఒక్కసారి ఫెయిలైతే జీవితమే ముగిసినట్టు కాదు
● దీన్ని అధిగమించి సక్సెస్ ఫుల్ లైఫ్‌తో ముందుకెళ్లొచ్చు
● పిల్లల మార్కులను పేరెంట్స్ ప్రతిష్టగా భావించొద్దు
● ఫలితం ఎలా ఉన్నా ప్రోత్సహిస్తేనే బంగారు భవిష్యత్
● పదో తరగతి ఫలితాల వేళ మానసిక, వైద్య నిపుణుల సూచనలు
ఇటీవల విడుదలైన టెన్త్ ఫెయిల్ సినిమాలో హీరో తన గ్రామంలోని పాఠశాలలో పదో తరగతి ఫెయిలవుతాడు. ఆ తరువాత కష్టపడి చదువుతాడు. ఢిల్లీ వెళ్లి పిండిమర, టీస్టాల్ తదితర పనులు చేసుకుంటూనే సివిల్స్‌కు ప్రిపేరవుతాడు. ఒకటి, కాదు రెండు కాదు.. ఆరోసారి తను అనుకున్న ఐపీఎస్ సాధిస్తాడు. అతను మొదటిసారి రాలేదని కుంగిపోకుండా ‘రీస్టార్ట్’ అంటూ తన చదువు మొదలుపెట్టి చివరికి అనుకున్నది సాధిస్తాడు.
మీరు (పరీక్షల్లోనైనా, ఇతర అంశాల్లో అయినా) విఫలమైతే, ఎప్పటికీ వదులుకోకండి ఎందుకంటే వైఫల్యం అంటే నేర్చుకోవడంలో మొదటి ప్రయత్నం అని అర్థం. వైఫల్యం అనే వ్యాధిని చంపడానికి ఆత్మవిశ్వాసం, కృషి ఉత్తమ ఔషధం. అది మిమ్మల్ని విజయవంతమైన వ్యక్తిగా చేస్తుంది. – ఏపీజే అబ్దుల్ కలాం
సాక్షి, వరంగల్: చదువంటే మార్కులు తెచ్చుకోవడం కాదు...జీవితాన్ని నేర్చుకోవడం, పరీక్షలో ఫెయిలవడం సరిదిద్దుకోలేని తప్పేమీ కాదు...అందరూ ఎప్పుడో ఒకప్పుడూ ఫెయిల్ అవుతారు...కానీ పరీక్షలో మార్కులే ప్రతిభకు, సామర్థ్యానికి కొలమానం కాదు...జీవితంలో ఇంకా చాలా అవకాశాలున్నాయనే విషయాన్ని మర్చిపోతే వచ్చేది దుఃఖం, ఆవేశమే. ఇవి సాధిస్తామన్న ఆశను చంపకూడదు. వారం క్రితం వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో తప్పిన కొందరు విద్యార్థులు క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకున్నా దరిమి లా..పదో తరగతి ఫలితాలు బుధవారం వెల్లడవుతున్న నేపథ్యంలో తమ పిల్లలతో తల్లిదండ్రులు ఓ స్నేహితుడిలా...గురువులా మెదిలి వారిలో ఉన్న భయాన్ని పోగొట్టాలి. భవిష్యత్‌పై భరోసా ఇవ్వాల్సిన అవసరముందన్న అభిప్రాయం విద్యావేత్తలు, మానసిక వైద్యనిపుణుల్లో వ్యక్తం అవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షలకు 42,262 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ఫలితాల సమయంలో ర్యాంక్‌లు రాలేదని కొందరు... మార్కులు తక్కువ వచ్చాయని ఇంకొందరు...ఫెయిల్ అయ్యామని మరికొందరు మానసిక ఒత్తిడికి గురై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల కంటే కూడా వారి ఫలితాలపై తల్లిదండ్రులు ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం కూడా ఈ తరహా ఘటనలకు అవకాశం ఇస్తోంది. పిల్లల మార్కులను తల్లిదండ్రులు ప్రతిష్టగా భావించొద్దని సూచిస్తున్నారు. ఇతర విద్యార్థులతో పోల్చడం వల్ల పిల్లలు మానసిక వ్యథకులోనై కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంటుందని అంటున్నారు.
ఇవీ మరవొద్దు...
● ఫలితాలు ఎలా వచ్చినా విద్యార్థులు పాజిటివ్‌గా తీసుకోవాలి. విద్యార్థులతో పాటు కుటుంబం, స్నేహితులు, అధ్యాపకులు, చుట్టుపక్కల వారు ప్రవర్తించే తీరు ప్రభావం చూపుతుంది.
● ఫెయిలైన విద్యార్థి ఇంతటితోనే అంతా అయిపోయిందనే భావనను వీడాలి. ఓ పరీక్షలో మాత్రమే ఫెయిలయ్యామని, జీవితంలో కాదన్న విషయాన్ని గ్రహించాలి.
● ముఖ్యంగా క్షణికావేశానికి గురికాకూడదు. తొందరపాటుగా ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. తమలోని బాధను స్నేహితులు, తల్లిదండ్రులతో పంచుకోవడంతోపాటు నెగెటివ్ ఆలోచనలను దూరం పెట్టాలి.
● ఫెయిలైనా జీవితంలో విజేతలుగా నిలిచిన వారి గురించి తెలియజేయాలి. ఆలోచిస్తూ బాగా చదివేలా వారిని ప్రోత్సహించాలి.
● ఇన్ని చెప్పినా విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మంచిది.
న్యూస్‌రీల్
జిల్లాల వారీగా పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు హనుమకొండ 12,010వరంగల్ 9,237మహబూబాబాద్ 8,194జనగామ 6,238 జేఎస్ భూపాలపల్లి 3,449 ములుగు 3,134

బుధవారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

బుధవారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

బుధవారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025