Top Stories
ప్రధాన వార్తలు

పహల్గాం ఉగ్రదాడిలో విస్తుపోయే విషయాలు
ప్రభుత్వాధికారులను, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకునే పహల్గాం దాడి జరిగిందా? కాల్చి చంపే ముందు ఉగ్రవాదులు టూరిస్టుల ఐడీ కార్డులను ఎందుకు చెక్ చేశారు?. పైగా మృతుల్లో ఐబీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల ఉద్యోగులే అధికంగా ఉండడం.. ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. పహల్గాం ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.కశ్మీర్ గడ్డపై నరమేధానికి ఉగ్రవాదులు ఈ పర్యాటక ప్రాంతాన్నే ఎంచుకోవడం వెనుక భద్రతాధికారులు పలు కారణాలు చెబుతున్నారు. పహల్గాం పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ వ్యాలీ(baisaran valley)కి కశ్మీర్ ‘మినీ స్విట్జర్లాండ్’గా పేరుంది. శీతాకాలంలో మంచు దుప్పటి పర్చుకునే ఈ ప్రాంతం.. మిగతా కాలంలో పచ్చిక బయళ్లతో, ఫైన్ చెట్లతో.. యూరప్ అల్పైన్ లోయలను తలపిస్తుంటుంది. అందుకే దేశం నలుమూలల నుంచి పర్యాటకలకు వేసవిలో ఈ ప్రాంతానికి క్యూ కడుతుంటారు. పైగా ల్యూలియన్ సరస్సుకు బైసరన్ వ్యాలీ బేస్‌గా ఉండడంతో పాటు ట్రెక్కింగ్ కోసం సాహస యాత్రికులు ఈ ప్రాంతానికి క్యూ కడుతుంటారు.అయితే పహల్గాం(pahalgam) బైసరన్ లోయకు ఉన్న ప్రత్యేకతలే.. ఉగ్రవాదులు సులువుగా చొరబడి అమాయకులపై దాడి చేయడానికి వీలు కలిపించింది. ఇక్కడి పచ్చదనం పాడు కాకూడదన్న ఉద్దేశంతో మోటార్ వెహికిల్స్‌ను అనుమతించరు. పహల్గాం టౌన్ నుంచి ఐదు కిలోమీటర్ల పాటు కాలినడకన లేదంటే పొట్టి గుర్రాలను(Pony) పర్యాటకులు ఆశ్రయించాల్సి ఉంటుంది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం కోసం తీసుకున్న ఈ చర్యలు ఈ ప్రాంతాన్ని ఒంటరిని చేసేశాయి. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో లేదంటే ఊహించని సంఘటనల సమయంలో చర్యలకు జాప్యం కలిగేలా చేశాయి. ప్రభుత్వాధికారులే లక్ష్యంగా.. పక్కా ప్లాన్‌తోనే బైసరన్ వ్యాలీలో ఉగ్రదాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. మంగళవారం మధ్యాహ్నా సమయంలో (2.45గం.-3గం. ప్రాంతంలో) సైన్యం దుస్తుల్లో సమీప అడవుల నుంచి వచ్చిన బృందం.. టూరిస్టులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. బాడీక్యామ్‌లు ధరించిన ముగ్గురు టెర్రరిస్టులు పర్యాటకులను ఒక చోటా చేర్చి.. వివరాలను ఆరా తీసి మరి కాల్చి చంపి ఆ దృశ్యాలను రికార్డు చేశారు. టూరిస్టులు పారిపోతున్న టైంలో స్నైఫర్ ఫైర్ చేశారు. అయితే ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆరుగురు ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో 26 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. బైరసర్ వ్యాలీ దగ్గర వాహనాలు లేకపోవడంతో క్షతగాత్రుల తరలింపు మరింత ఆలస్యమైంది. భద్రతా బలగాలు కూడా కాస్త ఆలస్యంగానే అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈలోపు దట్టమైన అడవుల్లోకి ఉగ్రవాదులు పారిపోగలిగారు. జమ్ము కశ్మీర్‌లోనే అంత్యంత ప్రశాంతమైన పర్యాటక ప్రాంతంగా పేరు ఉన్న బైసరన్ వ్యాలీ.. నిన్నటి దాడితో ఆ పేరుపై నీలినీడలు కమ్ముకునేలా చేసుకుంది.ఎమోషనల్ పోస్టులుపహల్గాం ఉగ్రదాడి గురించి తెలిశాక.. చాలా మంది(సెలబ్రిటీలతో సహా) సోషల్ మీడియాలో బైసరన్ వ్యాలీ అనుభూతుల్ని పంచుకుంటున్నారు. గతంలో తాము అక్కడికి వెళ్లిన సందర్భంలో దిగిన చిత్రాలను షేర్ చేస్తూ.. ఉగ్రదాడిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతమైన ఆ నేల నెత్తురోడడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రాన్ని కోరుతున్నారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)#baisaranvalley. Kashmir. Had been there 2 years before with family. Can’t imagine today this tragic incidence has happened at the same place. My heart goes out to the victims, their families and all those tourist civilians who lost their life🙏 pic.twitter.com/MabmrYmG5F— Rakesh Banerjee (@RakeshB41201077) April 22, 2025 Most people refer to Baisaran Valley in Pahalgam as "Mini Switzerland" but I prefer to call it by its own name Baisaran. After all, it’s Kashmir, not Switzerland. Why would I compare such a breathtaking place in Kashmir to another country? Baisaran has its own unique charm.. pic.twitter.com/MDLDXl41L7— batukh (@Samaandar_) March 13, 2025

తండ్రి బాటలోనే లోకేశ్.. ఎంకరేజ్ చేస్తున్న పవన్!
ఏపీలో ప్రజాస్వామ్యం మూడు కుట్రలు, ఆరు ప్రలోభాలుగా పరిఢవిల్లుతోంది!. విశాఖపట్నం నగర పాలక సంస్థ మేయర్ పదవి నుంచి వైఎస్సార్సీపీకి చెందిన వెంకట కుమారిని దించివేయడానికి ఇన్ని కుట్రలు పన్నాలా?. పదవీకాలం ఏడాది కూడా లేకపోయినా, ఎందుకు ఇంత కక్కుర్తి?. బహుశా కూటమి నేతలు, కార్యకర్తల అరాచకాలు త్వరితగతిన తెలిసిపోతున్నాయనో, విశాఖలో తమ పెత్తనం సాగాలనో మరే కారణంతోనో అవిశ్వాస తీర్మానం పెట్టి కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు నిర్ణయం తీసుకుని ఉండాలి.అయితే, ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు సర్కార్ స్థానిక సంస్థల స్వతంత్రను దెబ్బతీస్తోంది. ఇందుకు అధికార యంత్రాంగాన్ని వాడుకుంటుంది. చంద్రబాబు తొలుత ముఖ్యమంత్రి అయింది ఇలాంటి కుట్రలతోనే అని అంతా అంటారు. అదే పద్దతిని ఆయన ఇప్పటికీ కొనసాగించడం దురదృష్టకరం. ఇప్పుడు ఆయన కుమారుడు లోకేశ్ కూడా అదే బాటలో ఫిరాయింపులను ఎంకరేజ్ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు, లోకేశ్‌లకు విధేయుడుగా ఉంటూ ప్రశ్నించడం లేదు కనుక వారికి ఇబ్బంది ఉండడం లేదు.గతంలో జగన్ ప్రభుత్వ టైమ్‌లో ఇలాంటి వాటిని ప్రోత్సహించలేదు. ఎన్నికలలో కేవలం రెండు మున్సిపాలిటీల్లోనే టీడీపీ గెలిచే అవకాశం ఉన్నప్పుడు కూడా వారిని డిస్టర్బ్ చేయలేదు. ఇందుకు ఆ రోజుల్లో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర రెడ్డి ఓపెన్ గానే అంగీకరించారు. కానీ, చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రాగానే స్థానిక సంస్థలలో వేధింపుల పర్వం ఆరంభించారు. పలు మండల పరిషత్తులలో వివిధ కారణాలతో ఉప ఎన్నికలు జరిగినప్పుడు కూటమి పెద్దలు పెద్ద ఎత్తున కొనుగోలు లావాదేవీలను సాగించారు. అయినా కేవలం 11 చోట్ల మాత్రమే మెజార్టీ లేకపోయినా మండలాలను కైవశం చేసుకున్నారు. మిగిలిన 39 చోట్ల వైఎస్సార్సీపీ గెలిచింది. ఎర్రగొండపాలెం వద్ద ఒక మండల పరిషత్ ఎన్నికలో వైఎస్సార్సీపీ మహిళా ఎంపీటీసీ టీడీపీ వారి దాష్టికాన్ని తట్టుకుని ఓటు వేయడం సంచలనమైంది.ఈ మధ్యనే ఆదోని మున్సిపల్ ఛైర్పర్సన్ వైఎస్సార్సీపీ నుంచి మారిన నేపథ్యంలో అక్కడ మెజార్టీ కౌన్సిలర్లు ఒకే తాటిపై నిలబడి ఆమెను పదవి నుంచి దించేశారు. పార్టీ ఫిరాయింపునకు జవాబు ఇచ్చారు. అలా అన్ని చోట్ల సాధ్యపడదు. ఉదాహరణకు తిరుపతి ఉప మేయర్ ఎన్నికకు సంబంధించి పోలీసుల మద్దతుతో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడడం, ఒక్క టీడీపీ కార్పొరేటరే ఉన్నప్పటికీ ఆ పదవిని గెలుచుకోవడం జరిగింది. ఈ ఓటింగ్ తర్వాత కొందరు కార్పొరేటర్లు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి వద్దకు వచ్చి టీడీపీ వారి వేధింపులకు తట్టుకోలేక వైఎస్సార్సీపీకి ద్రోహం చేశామని కన్నీరు, మున్నీరయ్యారు. అవకాశం ఉన్న చోట్ల మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, జెడ్పీ ఛైర్మన్లను ప్రలోభ పెట్టి టీడీపీలోకి చేర్చుకుంటున్నారు. లొంగకపోతే అధికారుల చేత ఒత్తిడి చేయిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఛైర్మన్లకు సహకరించకుండా ఐఏఎస్‌లు సైతం దారుణంగా వ్యవహరిస్తున్నారు.ఉదాహరణకు గుంటూరు కమిషనర్, ఐఏఎస్ అధికారి మేయర్‌కు కనీసం సమాచారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ ఉంది. దాంతో మేయర్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ మేయర్‌కు ఇవ్వవలసిన ప్రోటోకాల్ ఇవ్వడం లేదు. ఇది స్థానిక సంస్థలను అవమానించడమే. విశాఖపట్నంలో బీసీ వర్గానికి చెందిన మహిళ మేయర్‌ను పదవి నుంచి దించడానికి కొద్ది నెలలుగా టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. కార్పొరేటర్లను రకరకాల ప్రలోభాలకు లోను చేయడానికి యత్నించింది. కొంతమందిని విదేశీ యాత్రలకు పంపారు. టీడీపీ కూటమి దాష్టికాలకు తట్టుకోవడానికి వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కొందరు కేరళ వెళ్లారట. అక్కడకు వెళ్లి కూడా టీడీపీ నేతలు కొందరిని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని ఒక కార్పొరేటర్ వెల్లడించారు.కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకున్నా వారికి పూర్తి బలం రాలేదు. దాంతో ముప్పై మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను టీడీపీ కొనుగోలు చేసిందని చెబుతున్నారు. ఎలాగైతేనేం విశాఖ నగర పాలక సంస్థను కైవసం చేసుకున్నామని కూటమి పెద్దలు సంబర పడుతున్నారు. ఈ క్రమంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశామని వారు బాధపడడం లేదు. ఈ వైఖరిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ అధినేత జగన్ .. కూటమి ఇలా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బలం లేకపోయినా ఎలా పదవులలోకి వస్తారని ఆయన ప్రశ్నించారు.ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు పార్టీ ఫిరాయింపులపై స్పష్టమైన విధాన నిర్ణయం చేశారు. వేరే పార్టీవారు ఎవరైనా టీడీపీలోకి రావాలంటే పదవి వదలి పెట్టి రావాలని కండిషన్ పెట్టారు. ఆ సూత్రానికి చంద్రబాబు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చారు. సొంత మామ ఎన్టీ రామారావును పార్టీ చీల్చి ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసిన చంద్రబాబుకు ఇలాంటి కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు పెద్ద విషయమా అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తుంటారు. 2014 టర్మ్‌లో కూడా ఇలాగే చేశారు. ఉదాహరణకు మూడు నగరపాలక సంస్థలలో వైఎస్సార్సీపీ గెలిస్తే, నెల్లూరు మేయర్‌ను టీడీపీలోకి లాగేసింది. అసెంబ్లీలో 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు ఆధ్వర్యంలో కొనుగోలు చేశారన్నది బహిరంగ రహస్యం. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చి రాజ్యాంగానికి గండి కొట్టారు.జగన్ దీనికి నిరసనగా అసెంబ్లీని బహిష్కరించి ప్రజలలోకి వెళ్లారు. 2024లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చినా, చంద్రబాబు తన పద్దతులను మార్చుకోలేదు. ఒకప్పుడు పార్టీ ఫిరాయింపులను విమర్శిస్తూ ఎమ్మెల్యేలను పశువుల మాదిరి కొంటారా అని వ్యాఖ్యానించిన చంద్రబాబు, తాను అధికారంలోకి వచ్చినప్పుడల్లా అదే పనిచేయడం ఆయన ప్రత్యేకత. దీనిపై బీజేపీ లోక్ సభ సభ్యుడు సీఎం రమేష్ హర్షం వ్యాక్తం చేస్తూ అరాచక పాలనకు ముగింపు పలికారని అన్నారు. అంతే తప్ప ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశామన్న సంగతిని మాత్రం విస్మరించారు. ఆయన పేరుకు బీజేపీ తప్ప, ఒరిజినల్‌గా చంద్రబాబు సొంత మనిషిగానే అంతా పరిగణిస్తారు.టీడీపీ నేతలు తాము విశాఖ నగరంలో అధికారంలోకి వచ్చామని సంబర పడుతుండవచ్చు. కానీ, ప్రజలలో మాత్రం ఏహ్య భావాన్ని మూట కట్టుకున్నారని చెప్పాలి. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా కూటమి నేతలు, ఇలాంటి అరాచకాలకు పాల్పడుతుండటం దురదృష్టకరం. స్థానిక సంస్థలలో అధికారం వచ్చినంత మాత్రాన పెద్దగా ఒరిగేదేమీ ఉండదని అనుభవం చెబుతున్నప్పటికీ, చంద్రబాబు అండ్ కో మాత్రం యథా ప్రకారం ఈ కుట్రలను కొనసాగిస్తున్నారు. 1995లో కుట్రతోనే అధికారంలోకి వచ్చి.. అప్పటి నుంచి వాటినే అమలు చేస్తున్న చంద్రబాబు ఇంతకన్నా గొప్పగా ఉంటారని ఆశించలేమేమో!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల విశ్లేషకులు.

భారీగా తగ్గిన బంగారం ధర
Gold Price Drop: దేశంలో తారాస్థాయికి చేరిన బంగారం ధరలు (Gold Prices) నేడు (ఏప్రిల్ 23) భారీగా దిగివచ్చాయి. అంతకంతకూ పెరుగుతూ రూ.లక్షను మార్క్‌ను దాటేసిన పసిడి ధర ఈరోజు అత్యంత భారీగా తగ్గి రూ.లక్ష దిగువకు వచ్చేసింది.అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, డాలర్‌తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు ఈ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఏప్రిల్ 23 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.2750, రూ.3000 చొప్పున క్షీణించాయి. 👉ఇదీ చదవండి: చూశారా.. ‘బంగారమే డబ్బు’!చెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.2750, రూ.3000 చొప్పున క్షీణించాయి.ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,500- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,300ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్‌ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్‌మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.2750, రూ.3000 చొప్పున క్షీణించాయి.ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.2750, రూ.3000 చొప్పున క్షీణించాయి.బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,350- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,150బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.2750, రూ.3000 చొప్పున క్షీణించాయి.👉ఇది చదివారా? బంగారం.. ఈ దేశాల్లో చవకే..!! బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు భారత రూపాయి విలువ, దిగుమతి సుంకాలు, స్థానిక ట్యాక్స్‌లు, రవాణా ఖర్చులు ధరలలో వ్యత్యాసాలకు కారణమవుతున్నాయి. అదనంగా, భారతదేశంలో వివాహ సీజన్, పండుగల సమయంలో బంగారం డిమాండ్ పెరగడం వల్ల ధరలు కొంత పెరిగే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు, హాల్‌మార్క్ సర్టిఫికేషన్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్ బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. అలాగే, వివిధ జ్యువెలరీ షాపుల్లో ధరలు, మేకింగ్ ఛార్జీలను సరిపోల్చడం ద్వారా మంచి డీల్ పొందవచ్చు.👉ఇది చదివారా? ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,11,000 వద్ద ఉండగా ఢిల్లీలో రూ. 1,01,000 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

మమ్మల్ని నిందించకండి.. పహల్గాం దాడిపై స్పందించిన పాక్
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిపై పొరుగు దేశం పాకిస్థాన్ స్పందించింది. ఉగ్రదాడిలో పర్యాటకుల ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసింది. అయితే దాడుల వెనుక తమ ప్రమేయం ఉందన్న వాదనను ఖండిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.అనంతనాగ్ జిల్లాలో జరిగిన దాడిలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ ఘటనపై మేం ఆందోళన చెందుతున్నాం. మృతుల కుటుంబాలకు మా సంతాపం తెలియజేస్తున్నాము. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము అని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే అంతకు ముందు.. పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ పహల్గాం దాడిపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని.. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తామూ వ్యతిరేకిస్తామని ప్రకటించారు.ఇదీ చదవండి: పహల్గాం దాడి సూత్రధారి సైఫుల్లా సాజిద్.. పాక్ ఆర్మీ హస్తం?భారత్‌లో జమ్ము కశ్మీర్, ఛత్తీస్‌గఢ్, మణిపూర్ సహా దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో తిరుగుబాట్లు నడుస్తున్నాయని.. బహుశా ఈ క్రమంలోనే పహల్గాం దాడి జరిగి ఉంటుందని, ఇందులో విదేశీ శక్తుల దాడి అయ్యి ఉండకపోవచ్చని ఓ స్థానిక న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. ప్రాథమిక హక్కులను కోల్పోయిన వ్యక్తులపై సైన్యం లేదంటే పోలీసులు దారుణాలకు పాల్పడుతుంటే.. పాకిస్తాన్‌ను నిందించడం అలవాటుగా మారిపోయింది. పహల్గాం దాడిలో.. మమ్మల్ని నిందించకండి’’ అంటూ ఖ్వాజా అసిఫ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై భారత్ స్పందించాల్సి ఉంది. We have absolutely nothing to do with it. We reject terrorism in all its forms and everywhere, says Pakistan's Defence Minister Khawaja Asif on the #Pahalgam attack.#pahalgamattack pic.twitter.com/qGiTz6uVOn— Ghulam Abbas Shah (@ghulamabbasshah) April 23, 2025 పహల్గాంలోని బైసరన్‌లో ఉగ్రదాడి చేసి పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)’ .. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఏర్పడిందే. తొలుత టీఆర్ఎఫ్ ఆన్లైన్లో కార్యకలాపాలు నడిపించింది. ఆపై లష్కరే తోయిబా(LeT) వంటి పలు ఉగ్ర సంస్థ సభ్యులను తీసుకుని ఫిజికల్ గ్రూపుగా ఏర్పాటైంది. 2019లో ఏర్పాటైనప్పటి నుంచి టీఆర్ఎఫ్ దాడులకు దిగుతూ.. కశ్మీర్ ప్రాంతంలో ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. దీంతో 2023లో టీఆర్ఎఫ్ను ఉగ్రసంస్థల జాబితాలో భారత్ చేర్చింది. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐనే టీఆర్ఎఫ్ను సృష్టించిందని భారత నిఘా వర్గాల సమాచారం. లష్కరే తోయిబా నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి ఈ టీఆర్ఎఫ్ను ఏర్పాటు చేయించినట్లు చెబుతుంటారు.

LSG VS DC: ఆ కారణం చెప్పి ఓటమిని కప్పిపుచ్చుకోవాలనుకోవడం లేదు: పంత్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 22) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ, ఎల్ఎస్జీ తలపడ్డాయి. లక్నో హోం గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఢిల్లీ పేసర్ ముకేశ్ కుమార్ (4-0-33-4) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. మార్క్రమ్ (52), మిచెల్ మార్ష్ (45) తొలి వికెట్‌కు 10 ఓవర్లలో 87 పరుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చినా ఆ ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు సరిగ్గా ఆడకపోవడంతో లక్నో స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఆఖర్లో ఆయుశ్ బదోని (21 బంతుల్లో 36) బ్యాట్ ఝులిపించడంతో లక్నో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇన్నింగ్స్ ముగిసే సమయంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్ రెండు బంతులు ఆడి డకౌటయ్యాడు. మార్క్రమ్ ఔటయ్యాక మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సిన పంత్ ఆఖరి ఓవర్లో బ్యాటింగ్‌కు రావడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. రాహుల్ (57 నాటౌట్), అభిషేక్ పోరెల్ (51), అక్షర్ పటేల్ (34 నాటౌట్) సత్తా చాటడంతో 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతూ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఈ మ్యాచ్‌లో ఆటగాడిగానే కాకుండా, కెప్టెన్‌గా కూడా విఫలమైన పంత్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ సీజన్లో లక్నోకు ఢిల్లీ చేతిలో ఇది రెండో ఓటమి. వైజాగ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా ఢిల్లీ లక్నోను చిత్తు చేసింది.నిన్నటి మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ చాలా బాధగా కనిపించాడు. ప్రజెంటేషన్ సందర్భంగా మాట్లాడుతూ ఇలా అన్నాడు. మేము 20 పరుగులు తక్కువ చేశామని తెలుసు. ఈ మైదానంలో టాస్ చాలా కీలకపాత్ర పోషిస్తుంది. తొలుత బౌలింగ్ చేసే జట్టుకు వికెట్ నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఛేజింగ్ సమయంలో పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా మారుతుంది. ఈ పిచ్‌పై ఇది ఎప్పుడూ జరిగేదే. దీన్ని సాకుగా చూసి ఓటమిని కప్పిపుచ్చుకోవాలనుకోవడం లేదు.బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కు వెళ్లడంపై స్పందిస్తూ.. వికెట్ తీరును సద్వినియోగం చేసుకుంటాడని సమద్‌ను ముందుగా పంపాము. మిల్లర్‌ను సైతం అదే ఉద్దేశంతో నా కంటే ముందు బరిలోకి దించాము. వికెట్ తీరు ముందు ఇవేవి వర్కౌట్ కాలేదు. తదుపరి మ్యాచ్‌లపై స్పందిస్తూ.. ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచనలు లేవు. బృంద సభ్యులందరం కలిసి కూర్చుంటాము. అప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్‌పై డిస్కస్ చేస్తాము. ఈ ఓటమిని ఇక్కడే మరచిపోయే ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తాము. ఈ మ్యాచ్‌లో ఓడినా లక్నో పాయింట్ల పట్టికలో మరో స్థానం కిందికి దిగజారలేదు. అయితే రన్‌రేట్ మాత్రం మైనస్‌లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు -0-054 రన్‌రేట్‌తో ఐదో స్థానంలో (10 పాయింట్లు) కొనసాగుతుంది. గుజరాత్, ఢిల్లీ చెరి 12 పాయింట్లతో టాప్-2లో ఉండగా.. ఆర్సీబీ, పంజాబ్ తలో 10 పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

జత్వానీ కేసుతో నాకేం సంబంధం లేదు: పీఎస్ఆర్ స్వీయ వాదనలు
విజయవాడ, సాక్షి: ముంబై నటి జత్వానీ కాదంబరి కేసుతో తనకేం సంబంధం లేకపోయినా ఇబ్బంది పెడుతున్నారని సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు(PSR Anjaneyulu) అన్నారు. బుధవారం ఉదయం ఆయన్ని సీఐడీ పోలీసు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. రిమాండ్ కోసం వాదనలు జరగ్గా.. తన కేసులో తానే పీఎస్ఆర్ వాదనలు వినిపించారు.ముంబయి నటి జెత్వానీ కాదంబరిని వేధించారంటూ ఏపీ సీఐడీ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులును మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ బేగంపేటలోని నివాసం నుంచి ఆయన్ని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. ఈ ఉదయం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. జత్వానీ కేసులో ఏం జరిగిందనేది జడ్జి ముందు స్వయంగా వాదనలు వినిపించారు. తన పాత్ర లేకపోయినా కేసు పెట్టారని వాదించారు. అసలు ఈ కేసులో ఏం జరిగిందనే అంశాలను జడ్జికి వివరించారు. మాజీ డీసీపీ విశాల్ గున్నీని ప్రొటెక్ట్ చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ రావడంతో అప్రూవర్‌గా మారారు. 164 స్టేట్ మెంట్ ఇవ్వమని విశాల్ గున్నీని అడిగినా.. ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. ఈ కేసులో తనకు సంబంధం లేని విషయాలను చెప్పించారు అని జడ్జి ముందు పీఎస్ఆర్ వాపోయారు. అయితే వాదనలు ముగిసిన అనంతరం పీఎస్ఆర్కు సీఐడీ కోర్టు వచ్చే నెల 7వ తేదీదాకా రిమాండ్ విధించారు. దీంతో విజయవాడ సబ్ జైలుకు ఆయన్ని తరలించనున్నారు.ఇదీ చదవండి: పీఎస్ఆర్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ ఏమన్నారంటే..

RRRలో నటించా.. జెప్టో యాడ్‌లో కూడా నేనే.. : ఎన్టీఆర్ డూప్
ఓపక్క సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే మరోపక్క నటుడిగా ప్రయత్నిస్తున్నాడు ఈశ్వర్ హారిస్. అంతేకాదు.. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు బాడీ డబుల్ (డూప్)గా కూడా చేస్తున్నాడు. అంటే కొన్ని సీన్లలో తారక్ స్థానంలో ఈయనే నటిస్తాడన్నమాట! తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈశ్వర్ (Eshwar Harris).. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.అలా ఆర్ఆర్ఆర్లో అవకాశంఅతడు మాట్లాడుతూ.. జార్జ్ రెడ్డి సినిమాలో విలన్‌గా చిన్న పాత్రలో నటించాను. కొత్తపోరడు, పులిమేక వంటి వెబ్‌సిరీస్‌లు చేసుకుంటూ వచ్చాను. ఆచార్యలో రామ్‌చరణ్ ఫ్రెండ్‌గా నటించాను. అయితే ఎడిటింగ్‌లో నా సీన్లు పోయాయనుకోండి. కానీ ఆ సినిమా షూటింగ్ సమయంలో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి నువ్వు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) లాగే ఉన్నావ్ అన్నాడు. రాజమౌళి టీమ్ నీ గురించి నెల రోజుల నుంచి వెతుకుతున్నారు అని చెప్పాడు. అలా ఆర్ఆర్ఆర్ మూవీలో భాగమయ్యాను.కొమురం భీముడో పాటలో..ఉదయం 6 గంటలకల్లా సెట్స్‌లో ఉండాలనేవారు. ఓరోజు నేను రావడం ఐదు నిమిషాలు ఆలస్యమయ్యేసరికి వందల ఫోన్ కాల్స్ వచ్చాయి. రాజమౌళి ఆరింటికే షూటింగ్ మొదలుపెట్టేస్తాడు. చాలా పక్కాగా ఉంటాడు. కొమురం భీముడో పాటలో మూడు, నాలుగు షాట్స్ నావే ఉంటాయి. తారక్ అన్న స్థానంలో నన్ను వేలాడదీశారు.. నా కాళ్లు, చేతులకు రక్తం కారే సన్నివేశాలు షూట్ చేశారు. ఆ పాటలో కాళ్లు, చేతులు నావే కనిపిస్తాయి. ఫైటింగ్స్‌లాంటివైతే నేనేం చేయలేదు.వార్ 2 కోసం అడిగారుమొన్న వార్ 2 సినిమా (War 2 Movie) కోసం అడిగారు. అర్జంట్‌గా ముంబై వచ్చేయాలన్నారు. కానీ విమానయాన ఛార్జీలకు కూడా డబ్బులివ్వనన్నారు. మనకన్నా బాలీవుడ్ దారుణంగా ఉందనిపించింది. రెమ్యునరేషన్ నచ్చకపోవడంతో రానని చెప్పేశాను. ఈ మధ్యే జూనియర్ ఎన్టీఆర్.. జెప్టో యాడ్ కూడా చేశాను. జూనియర్ ఎన్టీఆర్ అన్నను చూడగానే నాకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. సింగిల్ టేక్‌లో చాలా సింపుల్‌గా నటిస్తాడు.జెప్టో యాడ్ చేశా..అయితే యాడ్ షూటింగ్ అప్పుడు ఆయనకు కాస్త జ్వరం వచ్చింది. పైగా డైట్లో ఉన్నాడు. అసలే వార్ 2లో హృతిక్ రోషన్‌ను మ్యాచ్ చేయాలి కదా మరి! హృతిక్‌ను మ్యాచ్ చేయడమంటే మామూలు విషయం కాదు. జెప్టో యాడ్‌లో క్యారవాన్ ఇచ్చి మంచి భోజనం పెట్టి తారక్ అన్నతో సమానమైన గౌరవం ఇచ్చారు. బాడీ డబుల్‌గా చేసినప్పుడు సినిమాను బట్టి లక్షల్లో పారితోషికం ఇస్తారు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈశ్వర్.. భీమా, స్వయంభూ వంటి పలు చిత్రాలు చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Eshwar Harris (@eshwar_harris) చదవండి: సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి

పహల్గాం: ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్?
పహల్గాం ఉగ్రదాడి.. కేంద్రం సీరియస్.. అప్డేట్స్ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్కశ్మీర్, పీవోకేలో ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్?ప్రధాని మోదీ, రక్షణ మంత్రి వరుస సమావేశాలుహోం మంత్రి అమిత్ షా క్షేత్రస్థాయి పర్యటనకశ్మీర్ పరిస్థితులను ప్రధాని మోదీకి వివరించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో త్రివిధ దళాధిపతుల సమావేశంకేంద్రం ఆదేశాల అమలుకు సిద్ధమంటున్న త్రివిధ దళాధిపతులుపహల్గాం ఉగ్రదాడి ప్రధానాంశంగా.. సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశంసమావేశం అనంతరం కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం పహల్గాంలో కూంబింగ్‌పహల్గాంలో కొనసాగుతున్న కూబింగ్‌ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేటఒకవైపు.. క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న బలగాలుమరోవైపు డ్రోన్ల సాయంతో కొనసాగుతున్న గాలింపుఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదలపహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదలముగ్గురి చిత్రాలను విడుదల చేసిన కేంద్రంఅందులో అసిఫ్ అనే ఉగ్రవాదిబాడీ క్యామ్ ధరించి దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులుమొత్తం ఏడుగురు దాడికి పాల్పడినట్లు చెబుతున్న ప్రత్యక్ష సాక్షులుకానీ, దాడికి పాల్పడింది ముగ్గురి నుంచి నలుగురే?దాడులకు పాల్పడింది తామేనంటూ ప్రకటించిన లష్కరే తోయిబా విభాగం ది రెసిస్టెంట్ ఫ్రంట్ పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్‌రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశంప్రస్తుత పరిస్థితిని వివరించిన త్రివిధ దళాధిపతులుప్రతిచర్యకు సిద్ధమని ప్రకటనసాయంత్రం ఆరు గంటలకు కేబినెట్ కీలక సమావేశంమరోవైపు భద్రతా ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ భేటీ పలు నగరాల్లో హైఅలర్ట్‌దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హైఅలర్ట్ కశ్మీర్ పహల్గాం దాడితో అప్రమత్తమైన కేంద్రంఢిల్లీ, ముంబై సహా పలు నగరాలకు భద్రతాపరమైన హెచ్చరికలు జారీ చేసిన హోం శాఖ బైసరన్‌కు అమిత్ షాపహల్గాం బైసరన్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకాల్పులు జరిపిన ప్రాంతంలో పర్యటించిన షాప్రతి చర్య తప్పదని, ఉగ్రవాదులపై కఠిన చర్యలు ఉంటాయని బాధిత కుటుంబాలకు హోం మంత్రి హామీ నేటి ఐపీఎల్ మ్యాచ్‌లో సంఘీభావంపహల్గాం ఉగ్రదాడికి సంఘీభావం తెలుపుతున్న ప్రముఖులుఐపీఎల్ క్రికెటర్ల సంఘీభావంఇవాళ హైదరాబాద్ ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌దాడికి సంఘీభావంగా నల్ల బ్యాడ్జీలు ధరించనున్న ప్లేయర్స్‌ఒక నిమిషం మౌనం పాటించనున్న ఆటగాళ్లు రంగంలోకి ఎన్‌ఐఏపహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ బృందంహోటల్స్, లాడ్జిలను జల్లెడ పడుతున్న అధికారులుదాడి తర్వాత అడవుల్లోకి పరారైనట్లు చెబుతున్న ప్రత్యక్ష సాక్షులుఅయినప్పటికీ పహల్గాంను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపడుతున్న భద్రతా బలగాలుప్రత్యక్ష సాక్షులను ప్రశ్నిస్తున్న ఎన్ఐఏ టీం పలు రాష్ట్రాల్లో పాక్ వ్యతిరేక నిరసనలుపహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ దేశవ్యాప్త నిరసనలు రోడ్డెక్కిన ప్రజలుపాక్, ఉగ్రవాద వ్యతిరేక నినాదాలతో ర్యాలీలుఉగ్రవాదం నశించాలంటూ ఫ్లకార్డులతో ప్రదర్శన పహల్గాం ఉగ్రదాడిలో((Pahalgam Terror attack) మరణించిన మృతులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బుధవారం ఉదయం శ్రీనగర్ కంట్రోల్ రూంలో సైనిక గౌరవ వందనం నడుమ మృతదేహాలపై పుష్ప గుచ్ఛాలను ఉంచారాయన. అనంతరం దాడిలో గాయపడి అనంత్‌నాగ్ ఆస్పత్రిలో క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. #WATCH | Union Home Minister Amit Shah pays tributes to the victims of the Pahalgam terror attack, in Srinagar, J&K pic.twitter.com/tPRSj4ewUg— ANI (@ANI) April 23, 2025మంగళవారం రాత్రే శ్రీనగర్‌కు చేరుకున్న హోం మంత్రి అమిత్ షా(Amit Shah).. వివిధ భద్రతా బలగాల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించిన సంగతి తెలిసిందే. ఈ సమీక్షలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా కూడా పాల్గొన్నారు. ఈ ఉదయం మృతదేహాలకు ఆయన నివాళి అర్పించిన అనంతరం.. ప్రత్యేక విమానాల్లో మృతదేహాలను స్వస్థలాలకు తరలించనున్నారు. మరోవైపు.. పహల్గాం ఘటనకు కారకులైన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. అడవుల్లోకి పారిపోయిన ముష్కరుల కోసం డ్రోన్లతో భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం ఉగ్రవాదులు తెగబడ్డారు. ప్రకృతి అందాలను చూసి పరవశిస్తోన్న వారిపై పాశవికంగా దాడి చేసి 28 మందిని పొట్టన పెట్టకున్నారు. ఈ ఉగ్రవాద దాడి ఘటనపై ప్రపంచం మొత్తం స్పందించింది. అమాయకులపై జరిగిన ఈ హేయ చర్యను ప్రపంచ నాయకులు ఖండించారు. అమెరికా నుంచి రష్యా వరకు, ఇటలీ నుంచి ఇజ్రాయెల్ వరకు ప్రధాన నేతలు ఈ దాడిని తీవ్రంగా తప్పుబడుతూ, భారత్‌కు బలమైన సంఘీభావాన్ని ప్రకటించారు.

కఠోర సాధన, అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే, సివిల్స్‌లో సత్తా
వరంగల్ నగరానికి చెందిన ఇట్టబోయిన సాయి శివాని (Ettaboyina Sai Shivani) యూపీఎస్సీ (UPSC) సివిల్స్‌లో సత్తా చాటారు. ఇప్పటికే ప్రిలిమ్స్ క్లియర్ చేసిన శివాని మెయిన్స్ లోనూ మెరిసి 11వ ర్యాంక్‌తో తెలుగు రాష్ట్రాల నుంచి టాపర్‌గా నిలిచారు. కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో రెండో ప్రయత్నంలో మెరుగైన ర్యాంక్ సాధించి కలను సాకారం చేసుకుకుంది 22 ఏళ్ల యువతి. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన గ్రూప్ వన్ పరీక్షలోనూ జోనల్ స్థాయిలో 11వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్ హోదా లేదా డీఎస్పీ ఉద్యోగం వచ్చే అవకాశం దక్కించుకున్నారు. అంతలోనే ఇప్పుడూ సివిల్స్ లో ఏకంగా 11వ ర్యాంక్ సాధించి... రోజుల వ్యవధిలోనే రెండు ఉన్నత ఉద్యోగాలకు అర్హత సాధించగలిగారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే... ‘నాన్న రాజు మెడికల్ రిప్రంజెటివ్‌గా పనిచేస్తారు. అమ్మ రజిత గృహిణి. మా చెల్లి సరయూ సఖి హైదరాబాద్ లో సీఏ, తమ్ముడు సాయి శివ బాచుపల్లిలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. నేను ఖమ్మంలోని నిర్మల్ హృదయ్ పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు, ఆ తర్వాత వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఐఐటీ ఇంటర్మీడియట్, బీటెక్ (ఈసీఈ) కలిపి ఆరేళ్ల పాటు చదివా. ఆ తర్వాత నా తల్లిదండ్రులు ఐఏఎస్ కావాలన్న నా కలను వారి కలగా మార్చుకొని నాకు అండగా నిలిచారు. చదువు కునేటప్పుడు నాకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా నాకు కావలసిన ప్రతిదీ సమకూర్చారు. కుటుంబపోషణ కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా చదువు కోసం చిన్నప్పటి నుంచి అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. కుటుంబ ్ర΄ోద్బలంతోనే నేను ఈరోజు సివిల్స్‌లో ర్యాంక్ సాధించగలిగా. 2023లో ఐదు మార్కులతో ప్రిలిమ్స్ మిస్ అయ్యింది. అయినా అకుంఠిత దీక్ష, ఆత్మవిశ్వాసంతో ఈ విజయం సాధించగలిగా. ప్రజల జీవితాల్లో మరి ముఖ్యంగా మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఐఏఎస్ కావాలనుకున్నాన’ని శివాని తెలిపారు. కఠోర సాధన చేసిందితమ కుమార్తె సాయి శివాని కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో ఇంట్లోనే ఉండి సివిల్స్‌కు సంబంధించిన పుస్తకాలతోపాటు ఢిల్లీలో ఉండే సత్యం జైన్ అనే వ్యక్తి నిర్వహించే అండర్ స్టాండింగ్ యూపీఎస్సీ ఆన్లైన్లో తరగతులకు హాజరై కఠోర సాధనతో కలెక్టర్ కావాలన్న లక్ష్యాన్ని సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు ఇట్టబోయిన రాజు, రజితలు. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేది. ఒత్తిడిని జయించేందుకు యోగా చేసేది. భగవద్గీత చదివేది. మా కలకు శ్రేయోభిలాషుల ఆశీస్సులు, దేవుడి దయ తోడు కావడం వల్లే మా కుమార్తె తన కలను సాకారం చేసుకునే దిశగా ముందుకెళ్లింది’’ అని సంతృప్తి వ్యక్తం చేశారు. – వాంకె శ్రీనివాస్, సాక్షి, వరంగల్

కశ్మీర్ ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీవాసులు మృతి
శ్రీనగర్/విశాఖపట్నం: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం సమీప బైసరన్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు బయటకు వస్తున్నాయి. ఈ ఘటనలో విశాఖ వాసి చంద్రమౌళిని ముష్కరులు దారుణంగా హత్య చేసినట్టు తెలిసింది. ఉగ్రవాదులు.. చంద్రమౌళిని వెంటాడి మరీ కాల్చినట్లు సమాచారం.వివరాల ప్రకారం.. పహల్గాంలో మంగళవారం ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో విశాఖ వాసి ఉన్నారు. విశాఖ వాసి చంద్రమౌళిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. అతడిని వెంటాడి మరీ కాల్చినట్లు సమాచారం. చంపొద్దని వేడుకున్నా.. మోదీకి చెప్పుకోవాలంటూ విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. ఇక, చంద్రమౌళి.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి అని తెలిసింది. చంద్రమౌళి బంధువు DSP నాగేశ్వర్ రావు తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. ఈ నెల 18న చంద్రమౌళి కశ్మీర్‌కు బయలుదేరి వెళ్లారు. ఆరుగురు కలిసి విహారయాత్రకి వెళ్లారు. ఇలాంటి దుర్ఘటన చాలా బాధాకరం. ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మధ్య గ్రాండ్‌గా చంద్రమౌళి పుట్టినరోజు వేడుకలు జరిపాం. ఇప్పటికీ మా వదినకి ఆయన చనిపోయిన విషయం తెలియదు. ఉగ్రవాద దాడిలో మృతి చెందిన చంద్రమౌళి సమీప బంధువు కుమార్ రాజా తాజాగా మాట్లాడుతూ..‘ఈనెల 16న ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా కశ్మీర్ టూర్‌కి వెళ్లారు. మొత్తం ఆరుగురు వెళ్లారు. ఈనెల 25 నాటికి తిరిగి రావాల్సి ఉంది. చంద్రమౌళి ఫ్యామిలీతో పాటు అప్పన్న, శశిధర్ ఫామిలీలు వెళ్లాయి. చంద్రమౌళి తప్పించుకునే ప్రయత్నం చేశారు.. కానీ, ముష్కరులు హతమార్చారు. మిగిలిన ఐదుగురు క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. మృతదేహం ఇవాళ రాత్రి విశాఖకు తరలిస్తారు. ఆయన ఇద్దరు కుమార్తెలు అమెరికా ఉన్నారు. వారిద్దరూ రేపు.. విశాఖకు చేరుకుంటారు. ఎల్లుండి అంత్యక్రియలు జరుగుతాయి. నెల్లూరు వాసి మృతి..కశ్మీర్‌లోని పహాల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు మృతిచెందాడు. నిన్న జరిగిన ఉగ్రదాడిలో మధుసూదన్‌ని కాల్చి చంపిన ఉగ్రవాదులు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్న మధుసూదన్. బెంగళూరులో స్థిరపడ్డ మధుసూదన్ కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్ళగా ఈ విషాదకర ఘటన నెలకొంది. కావలి కుమ్మరి వీధిలో సోమిశెట్టి తిరుపాలు పద్మ దంపతుల కుమారుడుగా గుర్తింపు. మృతుడు మధుసూదనన్‌కు భార్య ఇద్దరు పిల్లలు. నేడు ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని చెన్నైకి తరలింపు.. సాయంత్రానికి కావలికి చేరుకోనున్న మధుసూదన్ మృతదేహాం. అతడి తల్లిదండ్రులు హార్ట్ పేషంట్స్ కావడంతో విషయం గోప్యంగా ఉంచిన బంధువులు.
సుగవాసి సుబ్రమణ్యం పార్టీ వీడనున్నారా?
వైరాగ్యంతోనే ముక్తి
మమ్మల్ని నిందించకండి.. పహల్గాం దాడిపై స్పందించిన పాక్
ఆలయాల్లో పూజలు అందుకుంటున్న సినీతారలు వీరే...
మరో ఓటీటీలో 'మసూద'.. భయపెడుతూ, థ్రిల్‌ని పంచే సినిమా
RRRలో నటించా.. జెప్టో యాడ్‌లో కూడా నేనే.. : ఎన్టీఆర్ డూప్
తండ్రి బాటలోనే లోకేశ్.. ఎంకరేజ్ చేస్తున్న పవన్!
భార్య, అత్తపై అల్లుడి దాడి
PSL 2025: అత్యంత అరుదైన క్లబ్లో చేరిన డేవిడ్ వార్నర్
టాటా కమ్యూనికేషన్స్ లాభం డబుల్
నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక
IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..
‘నువ్వు’ కాదు ‘మీరు’.. విజయశాంతి రిక్వెస్ట్
YSRCP: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు
కీరవాణి దగ్గర చాకిరీ.. సింగర్స్ అందరికీ ఇష్టమే: లిప్సిక
హారన్ కొడుతుంటే భారతీయ సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాడ్సార్!
బ్రెయిన్ సర్జరీ.. అరగుండుతో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న అషూ రెడ్డి
ఈ రాశి వారికి పరపతి పెరుగుతుంది.. ఆస్తిలాభం
మళ్లీ పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్
అంత నీచమైన ఆలోచన నాకు లేదమ్మా?.. ప్రవస్తి ఆరోపణలపై స్పందించిన సునీత
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన టాలీవుడ్ స్టార్ సింగర్
వెహికల్‌పై ఆ స్టిక్కర్లు లేకుంటే రూ.5000 జరిమానా
Pahalgam: నెత్తురోడిన కశ్మీరం.. ఉగ్రదాడిలో 26 మంది బలి
వివాహేతర సంబంధం: భార్యను పోలీసులకు అప్పగించిన భర్త
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. శ్రేయస్ రీ ఎంట్రీ? యువ సంచలనానికి పిలుపు!
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి
ఇది క్షమించరాని చర్య.. మా గుండె పగిలిపోయింది: చిరంజీవి, ఎన్టీఆర్
‘ మీ ఉద్యోగాల్లో మీరు తిరిగి చేరండి.. మిగతాది నేను చూసుకుంటా’
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
గన్నవరం విమానాశ్రయం రికార్డు
సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా..బాబు భేతాళ కుట్ర బట్టబయలు
‘రింగు’లో 8 వరుసల వంతెనలు
కానిస్టేబుల్‌తో నిర్మల వివాహేతర సంబంధం..
అయ్యా.. సీఎంసారూ.. మీరు వచ్చిననాడే నా పెళ్లి!
ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు: రోహిత్‌పై విమర్శలు
శ్రీదేవి కోరిన మొక్కు నిజం చేసిన దేవుడు.. ఈ ఆలయం ఎక్కడంటే?
చెలరేగిన కేఎల్ రాహుల్.. లక్నోను చిత్తు చేసిన ఢిల్లీ
'మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు'.. ప్రవస్తి ఆరోపణలకు నిర్మాత క్లారిటీ
మొదటి రోజే సినిమా రివ్యూలు.. హీరో నాని రియాక్షన్ ఏంటంటే?
జనావాసాల్లోకి సింహం.. ఫ్రెండ్ కళ్లముందే యువతి ప్రాణం తీసింది!
పహెల్ గామ్ దుర్ఘటన పై స్పందించిన రామ్ చరణ్
Hyderabad: పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ
టీమిండియా క్రికెటర్ మంచి మనసు.. రూ.7 లక్షల ఆర్ధిక సాయం
కశ్మీర్ ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీవాసులు మృతి
భారీగా తగ్గిన బంగారం ధర
అతడొక అద్బుతం.. చాలా క్లాస్‌గా ఆడుతున్నాడు: రాయుడు
నాకు నువ్వు వద్దు!
ఢిల్లీ చేరుకున్న మోదీ.. ఎయిర్‌పోర్టులోనే ధోవల్‌తో సమీక్ష!
LSG VS DC: ఇది కదా ప్రతీకారమంటే.. లక్నో ఓనర్‌కు ఇచ్చి పడేసిన రాహుల్
నేను ఊహించలేకపోయా.. ఆ ఒక్క పని చేసుంటే.. కోర్ట్‌పై పరుచూరి రివ్యూ
రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. ‘హిట్‌మ్యాన్’కే ఇది సాధ్యం!
వాళ్ల సినిమాల కోసమైతే ఎగేసుకుని వెళ్తారు.. ప్రేక్షకులపై హరీశ్ శంకర్ విమర్శలు
ఎంత తవ్వినా ఆ కంపెనీ ఆనవాళ్లు కనపడడం లేద్సార్!!
CCTV: నిను వీడని నీడను నేనే..!
విజయనగరం: గురువును చెప్పుతో కొట్టిన విద్యార్థిని
Bengaluru: 12 ఏళ్లుగా.. భయం భయంగానే?
పోలీసులు, మేజిస్ట్రేట్లుపై హైకోర్టు రిజిస్టర్ జనరల్‌కు ఫిర్యాదు
మొన్న గ్రూప్ వన్, ఇప్పుడు సివిల్స్
Pahalgam: జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో 27మంది టూరిస్టులు మృతి
కశ్మీర్ ఉగ్రదాడిలో నేవీ అధికారి మృతి.. నవవధువు ఆవేదన
తిరుమలలో లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన భక్తులు
పహల్గాం ఉగ్రదాడిలో విస్తుపోయే విషయాలు
నన్ను అలా ఎవరైనా పిలుస్తే.. చాలా ఇష్టం: తమన్నా
కూకట్‌పల్లిలో దారుణం.. తన బంధానికి అడ్డొస్తున్నాడని చెల్లెలి భర్తతో..
ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల
పహల్గాం దాడి సూత్రధారి సైఫుల్లా సాజిద్.. పాక్ ఆర్మీ హస్తం?
నిస్సహాయులను చుట్టుముట్టి కాల్చేశారు!
రెండు వేల మందితో ములుగు కర్రెగుట్టల రౌండప్.. భారీ ఎన్కౌంటర్!
చూశారా.. ‘బంగారమే డబ్బు’!
‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’లో ఇదేం ఘోరం
బంగ్లాదేశ్ యువకుడికి బర్త్ సర్టిఫికెట్
జత్వానీ కేసుతో నాకేం సంబంధం లేదు: పీఎస్ఆర్ స్వీయ వాదనలు
‘కొత్త పన్ను’.. పంచ తంత్రం!
బొడ్డు కింద చీర కట్టుకోమన్నారు.. బాడీ షేమింగ్ చేశారు: లేడీ సింగర్ ఆవేదన
ఏపీలో టెన్త్ ఫలితాలకు ముహూర్తం ఫిక్స్
పహల్గాం: ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్?
అంతా చేసి..భర్త కన్పించలేదంటూ ఫిర్యాదు
తమిళ పరిశ్రమలోకి సుహాస్.. శక్తికి మించి సంపాదించానంటున్న సూరి
గట్టిగా క్లాస్ పీకాను.. అప్పటినుంచి రెచ్చిపోయాడు: నాని
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదాలు.. ప్రయాణీకులకు గాయాలు
రేవంత్ రావాలి.. నా లగ్గం జరగాలి
అమెరికా సంబంధమా.. అసలే వద్దు!
LSG VS DC: పంత్‌పై మండిపడుతున్న అభిమానులు.. గొయెంకాకు సరైన శాస్తి జరిగింది..!
భూగర్భ నీరు @ కందకంతో చేరు!
పోలీసులు, మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కన్నుమూత
ఓటీటీ/ థియేటర్లో 20 సినిమాలు.. వీకెండ్లో వేసవి వినోదం
వ్యవస్థల విధ్వంసం: వైఎస్ జగన్
చైనాలో 10జీ నెట్వర్క్..!
ఇంట్లో ఇల్లాలు.. వీధిలో ప్రియురాలు.. పెళ్లైన 15 రోజులకే..
ఫిక్సింగ్ ఆరోపణలు.. స్పందించిన రాజస్తాన్ రాయల్స్
ఐదు రోజులుగా గూగుల్‌లో అదే పని..
దర్శన్‌కు పవిత్ర ఏమవుతారు?
ఏలూరు సాక్షి కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని దౌర్జన్యం
ఆ ఊరి పేరు ఐ.ఐ.టి. విలేజ్
నేడు ఏపీ టెన్త్ ఫలితాలు
అద్భుతం.. డిచ్పల్లి ఖిల్లా రామాలయం
పరాకాష్టకు రెడ్‌బుక్ కుట్ర .. పీఎస్ఆర్ ఆంజనేయులు అక్రమ అరెస్ట్
మొక్కజొన్న సాగుపై ఆరా
ఇంటి కలహం.. అంతు చూసింది
ఢిల్లీ మళ్లీ...
'ఖబడ్దార్ తీన్మార్ మల్లన్న'
తిరుపతిలో రోడ్డు ప్రమాదం, బస్సు బోల్తా
ఛావా మరో క్రేజీ రికార్డ్.. పుష్ప-2 సరసన చేరిన బాలీవుడ్ మూవీ!
Annamalai: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై
ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రాజస్థాన్ రాయల్స్‌పై ఆరోపణలు
ఊరిస్తున్న వాన్స్ టూర్
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన వైఎస్ జగన్
పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
సుగవాసి సుబ్రమణ్యం పార్టీ వీడనున్నారా?
వైరాగ్యంతోనే ముక్తి
మమ్మల్ని నిందించకండి.. పహల్గాం దాడిపై స్పందించిన పాక్
ఆలయాల్లో పూజలు అందుకుంటున్న సినీతారలు వీరే...
మరో ఓటీటీలో 'మసూద'.. భయపెడుతూ, థ్రిల్‌ని పంచే సినిమా
RRRలో నటించా.. జెప్టో యాడ్‌లో కూడా నేనే.. : ఎన్టీఆర్ డూప్
తండ్రి బాటలోనే లోకేశ్.. ఎంకరేజ్ చేస్తున్న పవన్!
భార్య, అత్తపై అల్లుడి దాడి
PSL 2025: అత్యంత అరుదైన క్లబ్లో చేరిన డేవిడ్ వార్నర్
టాటా కమ్యూనికేషన్స్ లాభం డబుల్
నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక
IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..
‘నువ్వు’ కాదు ‘మీరు’.. విజయశాంతి రిక్వెస్ట్
YSRCP: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు
కీరవాణి దగ్గర చాకిరీ.. సింగర్స్ అందరికీ ఇష్టమే: లిప్సిక
హారన్ కొడుతుంటే భారతీయ సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాడ్సార్!
బ్రెయిన్ సర్జరీ.. అరగుండుతో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న అషూ రెడ్డి
ఈ రాశి వారికి పరపతి పెరుగుతుంది.. ఆస్తిలాభం
మళ్లీ పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్
అంత నీచమైన ఆలోచన నాకు లేదమ్మా?.. ప్రవస్తి ఆరోపణలపై స్పందించిన సునీత
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన టాలీవుడ్ స్టార్ సింగర్
వెహికల్‌పై ఆ స్టిక్కర్లు లేకుంటే రూ.5000 జరిమానా
Pahalgam: నెత్తురోడిన కశ్మీరం.. ఉగ్రదాడిలో 26 మంది బలి
వివాహేతర సంబంధం: భార్యను పోలీసులకు అప్పగించిన భర్త
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. శ్రేయస్ రీ ఎంట్రీ? యువ సంచలనానికి పిలుపు!
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి
ఇది క్షమించరాని చర్య.. మా గుండె పగిలిపోయింది: చిరంజీవి, ఎన్టీఆర్
‘ మీ ఉద్యోగాల్లో మీరు తిరిగి చేరండి.. మిగతాది నేను చూసుకుంటా’
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
గన్నవరం విమానాశ్రయం రికార్డు
సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా..బాబు భేతాళ కుట్ర బట్టబయలు
‘రింగు’లో 8 వరుసల వంతెనలు
కానిస్టేబుల్‌తో నిర్మల వివాహేతర సంబంధం..
అయ్యా.. సీఎంసారూ.. మీరు వచ్చిననాడే నా పెళ్లి!
ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు: రోహిత్‌పై విమర్శలు
శ్రీదేవి కోరిన మొక్కు నిజం చేసిన దేవుడు.. ఈ ఆలయం ఎక్కడంటే?
చెలరేగిన కేఎల్ రాహుల్.. లక్నోను చిత్తు చేసిన ఢిల్లీ
'మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు'.. ప్రవస్తి ఆరోపణలకు నిర్మాత క్లారిటీ
మొదటి రోజే సినిమా రివ్యూలు.. హీరో నాని రియాక్షన్ ఏంటంటే?
జనావాసాల్లోకి సింహం.. ఫ్రెండ్ కళ్లముందే యువతి ప్రాణం తీసింది!
పహెల్ గామ్ దుర్ఘటన పై స్పందించిన రామ్ చరణ్
Hyderabad: పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ
టీమిండియా క్రికెటర్ మంచి మనసు.. రూ.7 లక్షల ఆర్ధిక సాయం
కశ్మీర్ ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీవాసులు మృతి
భారీగా తగ్గిన బంగారం ధర
అతడొక అద్బుతం.. చాలా క్లాస్‌గా ఆడుతున్నాడు: రాయుడు
నాకు నువ్వు వద్దు!
ఢిల్లీ చేరుకున్న మోదీ.. ఎయిర్‌పోర్టులోనే ధోవల్‌తో సమీక్ష!
LSG VS DC: ఇది కదా ప్రతీకారమంటే.. లక్నో ఓనర్‌కు ఇచ్చి పడేసిన రాహుల్
నేను ఊహించలేకపోయా.. ఆ ఒక్క పని చేసుంటే.. కోర్ట్‌పై పరుచూరి రివ్యూ
రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. ‘హిట్‌మ్యాన్’కే ఇది సాధ్యం!
వాళ్ల సినిమాల కోసమైతే ఎగేసుకుని వెళ్తారు.. ప్రేక్షకులపై హరీశ్ శంకర్ విమర్శలు
ఎంత తవ్వినా ఆ కంపెనీ ఆనవాళ్లు కనపడడం లేద్సార్!!
CCTV: నిను వీడని నీడను నేనే..!
విజయనగరం: గురువును చెప్పుతో కొట్టిన విద్యార్థిని
Bengaluru: 12 ఏళ్లుగా.. భయం భయంగానే?
పోలీసులు, మేజిస్ట్రేట్లుపై హైకోర్టు రిజిస్టర్ జనరల్‌కు ఫిర్యాదు
మొన్న గ్రూప్ వన్, ఇప్పుడు సివిల్స్
Pahalgam: జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో 27మంది టూరిస్టులు మృతి
కశ్మీర్ ఉగ్రదాడిలో నేవీ అధికారి మృతి.. నవవధువు ఆవేదన
తిరుమలలో లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన భక్తులు
పహల్గాం ఉగ్రదాడిలో విస్తుపోయే విషయాలు
నన్ను అలా ఎవరైనా పిలుస్తే.. చాలా ఇష్టం: తమన్నా
కూకట్‌పల్లిలో దారుణం.. తన బంధానికి అడ్డొస్తున్నాడని చెల్లెలి భర్తతో..
ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల
పహల్గాం దాడి సూత్రధారి సైఫుల్లా సాజిద్.. పాక్ ఆర్మీ హస్తం?
నిస్సహాయులను చుట్టుముట్టి కాల్చేశారు!
రెండు వేల మందితో ములుగు కర్రెగుట్టల రౌండప్.. భారీ ఎన్కౌంటర్!
చూశారా.. ‘బంగారమే డబ్బు’!
‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’లో ఇదేం ఘోరం
బంగ్లాదేశ్ యువకుడికి బర్త్ సర్టిఫికెట్
జత్వానీ కేసుతో నాకేం సంబంధం లేదు: పీఎస్ఆర్ స్వీయ వాదనలు
‘కొత్త పన్ను’.. పంచ తంత్రం!
బొడ్డు కింద చీర కట్టుకోమన్నారు.. బాడీ షేమింగ్ చేశారు: లేడీ సింగర్ ఆవేదన
ఏపీలో టెన్త్ ఫలితాలకు ముహూర్తం ఫిక్స్
పహల్గాం: ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్?
అంతా చేసి..భర్త కన్పించలేదంటూ ఫిర్యాదు
తమిళ పరిశ్రమలోకి సుహాస్.. శక్తికి మించి సంపాదించానంటున్న సూరి
గట్టిగా క్లాస్ పీకాను.. అప్పటినుంచి రెచ్చిపోయాడు: నాని
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదాలు.. ప్రయాణీకులకు గాయాలు
రేవంత్ రావాలి.. నా లగ్గం జరగాలి
అమెరికా సంబంధమా.. అసలే వద్దు!
LSG VS DC: పంత్‌పై మండిపడుతున్న అభిమానులు.. గొయెంకాకు సరైన శాస్తి జరిగింది..!
భూగర్భ నీరు @ కందకంతో చేరు!
పోలీసులు, మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కన్నుమూత
ఓటీటీ/ థియేటర్లో 20 సినిమాలు.. వీకెండ్లో వేసవి వినోదం
వ్యవస్థల విధ్వంసం: వైఎస్ జగన్
చైనాలో 10జీ నెట్వర్క్..!
ఇంట్లో ఇల్లాలు.. వీధిలో ప్రియురాలు.. పెళ్లైన 15 రోజులకే..
ఫిక్సింగ్ ఆరోపణలు.. స్పందించిన రాజస్తాన్ రాయల్స్
ఐదు రోజులుగా గూగుల్‌లో అదే పని..
దర్శన్‌కు పవిత్ర ఏమవుతారు?
ఏలూరు సాక్షి కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని దౌర్జన్యం
ఆ ఊరి పేరు ఐ.ఐ.టి. విలేజ్
నేడు ఏపీ టెన్త్ ఫలితాలు
అద్భుతం.. డిచ్పల్లి ఖిల్లా రామాలయం
పరాకాష్టకు రెడ్‌బుక్ కుట్ర .. పీఎస్ఆర్ ఆంజనేయులు అక్రమ అరెస్ట్
మొక్కజొన్న సాగుపై ఆరా
ఇంటి కలహం.. అంతు చూసింది
ఢిల్లీ మళ్లీ...
'ఖబడ్దార్ తీన్మార్ మల్లన్న'
తిరుపతిలో రోడ్డు ప్రమాదం, బస్సు బోల్తా
ఛావా మరో క్రేజీ రికార్డ్.. పుష్ప-2 సరసన చేరిన బాలీవుడ్ మూవీ!
Annamalai: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై
ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రాజస్థాన్ రాయల్స్‌పై ఆరోపణలు
ఊరిస్తున్న వాన్స్ టూర్
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన వైఎస్ జగన్
పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
సినిమా

'అజిత్' అభిమానులకు గూస్బంప్స్ తెప్పించిన సాంగ్ విడుదల
అజిత్ (Ajith Kumar) హీరోగా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే రూ. 200 కోట్ల క్లబ్లో చేరింది. ఏకంగా తన కెరీర్లోనే టాప్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, ఈ సినిమాలోని ఒక మ్యూజిక్ థీమ్‌తో ఉన్న పాట అజిత్ అభిమానుల్లో పూనకాలను తెప్పించింది. దానిని ఇప్పుడు వీడియో వర్షన్‌ను మేకర్స్ విడుదల చేశారు. మలేషియాకు చెందిన సింగర్ డార్కీ ప్రత్యేకమైన వాయిస్‌తో ఈ పాటలో మెప్పించాడు. అతని వాయిస్‌కు పోటీగా జి. వి. ప్రకాష్ కొట్టిన మ్యూజిక్ అదిరిపోయిందని చెప్పవచ్చు. అజిత్ అభిమానులను విపరీతంగా ఆకట్టకున్న సాంగ్‌ను మీరూ చూసేయండి.

వాళ్ల సినిమాల కోసమైతే ఎగేసుకుని వెళ్తారు.. ప్రేక్షకులపై హరీశ్ శంకర్ విమర్శలు
టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్ వేదికలపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పటికే ఆయన పలుమార్లు తన కామెంట్ల వల్ల నెట్టింట నెగటివిటీని తెచ్చుకున్నారు. తాజాగా ‘ప్రేమలు’ మూవీ ఫేమ్ నస్లేన్ కె.గఫూర్ (Naslen K.Gafoor) నటించిన ‘జింఖానా’ (Gymkhana) ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఏప్రిల్ 25న విడుదల కానున్న ఈ మూవీని దర్శకుడు ఖలీద్ రెహమాన్ తెరకెక్కించారు.దర్శకుడు హరీశ్ శంకర్ సినిమాలు బాగుంటాయని ఆయనకు గుర్తింపు ఉంది. అందుకే అతని నుంచి వచ్చే ప్రతి ప్రాజెక్ట్‌కు క్రేజ్ ఉంటుంది. అయితే, ఒక్కోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్‌మీడియాలో వివాదస్పదంగానే వైరల్ అవుతుంటాయి. తాజాగా ‘జింఖానా’ మూవీ ప్రీ రిలీజ్ కోసం ముఖ్య అతిథిగా వెళ్లిన హరీశ్ ఏమన్నారంటే.. నేను గతంలో డ్రాగన్ సినిమాను ప్రమోట్ చేశాను. ఆ సమయంలో ఒకమాట అన్నాను.. మన సినిమాలకంటే పక్క భాషల సినిమాలే తెలుగువారు ఎక్కువగా చూస్తారన్నా.. అప్పుడు నన్ను అందరూ విమర్శించారు. ఆ సమయంలో ఆ మాట ఎందుకనాల్సి వచ్చిందంటే.. నా లాస్ట్ సినిమా (మిస్టర్ బచ్చన్)ను ఎవరూ చూడలేదు. కానీ, అదే టైమ్‌లో వచ్చిన మరో భాష సినిమా (తంగలాన్)ను చూశారు. అందుకే నేను అలాంటి వ్యాఖ్యలు చేశాను. ఇప్పడు కూడా అదే చెబుతున్నా.. ఇతర భాషల సినిమాలను చూసేందుకు ఎగేసుకుని వెళ్తాం కదా.. ఇదే విధంగా ఈ సినిమాను (జింఖానా) కూడా చూడండి. దయచేసి తెలుగు ప్రేక్షకులు అందరూ ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేయండి. ఎవరెలా అనుకున్నా నాకు ఇబ్బంది లేదు. నా అభిప్రాయం చెప్పాను.' అని అన్నారు.హరీశ్ శంకర్ కామెంట్లకు నెటిజన్లు కూడా తమదైన స్టైల్లో రియాక్ట్ అవుతున్నారు. పక్క భాషల సినిమాలను రీమేక్ చేసే నువ్వు కూడా ఇలాంటి కామెంట్లు చేస్తే ఎలా అంటూ విమర్శిస్తున్నారు. సినిమా బాగుంటే తమకు భాషతో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. గతంలో మీ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులే హిట్ చేశారనే విషయం మరచిపోతే ఎలా హరీశ్ అంటూ గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. తాము ఎలాంటి సినిమాలు చూస్తామో, చూడాలో చెప్పడానికి మీరు ఎవరు..? అంటూ హరీశ్‌పై ఫైర్ అవుతున్నారు.

'మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు'.. ప్రవస్తి ఆరోపణలకు నిర్మాత క్లారిటీ
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించిన ‘పాడుతా తీయగా’(Padutha Theeyaga) గురించి గాయని ప్రవస్తి (Pravasthi) చేసిన ఆరోపణలపై జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత ప్రవీణ (Praveena Kadiyala) క్లారిటీ ఇచ్చారు. రెండురోజుల క్రితం ప్రవస్తి ఒక వీడియో ద్వారా కీరవాణి(M. M. Keeravani), సునీత, చంద్రబోస్‌ల గురించి సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆపై తనను మెంటల్‌గా హింసించారని, బాడీ షేమింగ్ చేశారని ఆమె ఆరోపించారు. ప్రోగ్రాం నిర్వాహకులు కూడా తమకు చీరలు ఇచ్చి బొడ్డు కిందకు కట్టుకో, ఎక్స్‌ఫోజింగ్ చేయాలి అన్నట్లుగా చెప్పేవారని ప్రవస్తి చెప్పుకొచ్చింది. అయితే, ఆ ప్రోగ్రాం నిర్మాత ప్రవీణ తాజాగా క్లారిటీ ఇచ్చారు.వారు ఎంచుకున్న పాటకు తగ్గట్టే కంటెస్టెంట్లకు తాను దుస్తులు డిజైన్ చేయిస్తానని జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత ప్రవీణ క్లారిటీ ఇచ్చారు. తమ షోలో ఎక్కడా కూడా బాడీ షేమింగ్‌పై వ్యాఖ్యలు చేయమని చెప్పారు. ప్రవస్తి చెబుతున్నట్లుగా ఫేవరెట్ కంటెస్టెంట్లకు సులభమైన పాటలు ఇచ్చి.. ఆమెకు మాత్రమే కష్టమైన పాటలు ఇస్తామని చెప్పడంలో ఎలాంటి నిజం లేదని ఆమె చెప్పారు. పాటల ఎంపిక కోసం ప్రతి షెడ్యూల్లో ఓ క్రియేటివిటీ టీమ్ నాలుగు రకాల పాటలను ఎంపిక చేస్తుంటుందని నిర్మాత ప్రవీణ అన్నారు. తమ ప్రోగ్రామ్ టెలీకాస్ట్ అయ్యే ఛానల్‌కు ఏ పాటల రైట్స్ ఉన్నాయో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని మాత్రం చెబుతామని తెలిపారు. అలా ప్రతి కంటెస్టెంట్ ఆరు పాటలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నారు. వాటిపై రిహార్సల్స్ పూర్తి చేసుకుని, వారు రెడీ అని చెప్పాకే తాము షూటింగ్ ప్రారంభిస్తామని ఆమె అన్నారు.అలా అనడం తప్పే: సునీత‘మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు’ అని కాస్ట్యూమర్ అన్నారంటూ ప్రవస్తి చేసిన ఆరపణలకు సింగర్ సునీత ఇలా సమాధానం ఇచ్చారు. 'కంటెస్టెంట్స్ ఎంపిక చేసుకున్న పాటకు తగిన విధంగానే కాస్ట్యూమ్స్‌ని నేను డిజైన్ చేయిస్తుంటా. ఇక్కడ పాటది మాత్రమే ఛాయిస్ ఉంటుంది. ప్రవస్తితో ఆ కాస్ట్యూమర్ అలా ప్రవర్తించి ఉంటే అది ముమ్మాటికే తప్పే. కానీ, జరిగిన విషయం అదే సమయంలో నాతో గానీ, డైరెక్టర్‌తో గానీ చెప్పాల్సింది. డ్రెస్సు విషయంలో అలా వేసుకో, ఇలా వేసుకో అని నేనెప్పుడూ చెప్పలేదు.' అని అన్నారు.Gnapika entertainment producer praveena kadiyala about singer #Pravasthi issue.#ETV #paduthatheeyaga pic.twitter.com/OlhBtBiaNe— Vamsi Kaka (@vamsikaka) April 22, 2025

ఇది క్షమించరాని చర్య.. మా గుండె పగిలిపోయింది: చిరంజీవి, ఎన్టీఆర్
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల ఘటనపై సినీ హీరో చిరంజీవి స్పందించారు. మంగళవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో దుండగులు అతి సమీపం నుంచి తూటాల వర్షం కురిపించారు. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడికి దిగారు. ఇప్పటికి 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం సమీప బైసరన్ లోయలో ఈ హృదయ విదారకమైన ఘటన జరిగింది. ఇది క్షమించరాని క్రూరమైన చర్య అంటూ చిరంజీవి సోషల్‌మీడియా ద్వారా తెలిపారు.జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో 26 మంది అమాయక ప్రజలతో పాటు పర్యాటకులను కాల్చి చంపడం క్షమించరాని క్రూరమైన చర్య. ఈ దారుణమైన దాడి చాలా భయంకరమైనది. ఘటనకు సంబంధించిన విషయాలను చూస్తుంటే గుండె పగిలిపోయింది. మరణించిన వారి కుటుంబాలకు బరువెక్కిన హృదయంతో సానుభూతి తెలియజేస్తున్న. ఆ కలిగిన నష్టాన్ని ఏదీ పూడ్చలేదు. - చిరంజీవిపహల్గాం దాడి గురించి తెలిసి నా గుండె ముక్కలైంది. బాధితుల కుటుంబాలందరికీ, వారి బంధువులందరికీ నా సానుభూతి తెలియచేస్తున్నాను. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. నిజంగా ఈ దుర్ఘటన హృదయ విదారకం. - అల్లు అర్జున్పహల్గామ్ దాడిలో మరణించిన వారిని చూస్తుంటే నా హృదయం బరువెక్కుతోంది. ఇప్పడు నా ఆలోచనలు అన్నీ ఆ కుటుంబాల చుట్టే తిరుగుతున్నాయి. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని, ఆపై వారి కుటుంబాలకు న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నాను. - ఎన్టీఆర్ A dark day… Deeply saddened by the attack in #Pahalgam.Hope we find the strength to stand together against such cruelty..🙏🏻🙏🏻🙏🏻My thoughts and prayers are with the families during this difficult time….— Mahesh Babu (@urstrulyMahesh) April 23, 2025 ఇది చీకటి రోజు... పహల్గామ్లో జరిగిన దాడితో చాలా బాధపడ్డాను.ఇలాంటి క్రూరత్వానికి వ్యతిరేకంగా కలిసి నిలబడే శక్తి మనకు లభిస్తుందని ఆశిస్తున్నాను..ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు మరియు ప్రార్థనలు బాధిత కుటుంబాలతో ఉన్నాయి- మహేశ్ బాబుమూడు నెలల క్రితం మేము అక్కడే ఉన్నాము. దాదాపు 20 రోజుల పాటు 200 మందికి పైగా అక్కడే గడిపాం. పహల్గాం ఒక కలలా ఉంది. ఆ ప్రదేశం మాదిరే అక్కడి ప్రజలను కూడా మరిచిపోలేం. ఈ ఘటన గురించి తలుచుకుంటే హృదయం విరిగిపోయింది. పంచుకునేందుకు మాటలు కూడా రావడం లేదు. -నానిరెండేళ్ల క్రితం పహల్గాంలో నా సినిమా షూటింగ్ అక్కడే జరిగింది. షూటింగ్ సమయంలో కాశ్మీరీ స్నేహితులు మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. వారి మధ్య నా పుట్టినరోజు జరుపుకున్నాను. నిన్న జరిగినది హృదయ విదారకం ఘటన నాకు కోపం తెప్పించింది. తుపాకుల వెనుక దాక్కున్న ఈ ఉగ్రవాదం ఇలా పర్యాటకులను కాల్చడం అత్యంత సిగ్గుచేటు, పిరికితనం. బాధితులకు, వారి కుటుంబాలకు మేము అండగా నిలుస్తాము. కాశ్మీర్‌కు మేము ఎప్పటికీ అండగా నిలుస్తాము. ఎప్పటికైనా సరే ఈ పిరికివాళ్ళను నిర్మూలిస్తారని నేను ఆశిస్తున్నాను. నా భారతదేశం ఎప్పటికీ ఉగ్రవాదానికి తలవంచదు. - విజయ్ దేవరకొండ
న్యూస్ పాడ్‌కాస్ట్

జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి... కాల్పులకు 26 మంది బలి, మరో 20 మందికి పైగా గాయాలు.. మృతుల్లో ఇద్దరు విదేశీయులు

బాబోయ్ బంగారం. దేశంలో తొలిసారి లక్ష రూపాయల మార్కును దాటేసిన పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం

ఆంధ్రప్రదేశ్‌లో డొల్ల కంపెనీకి ఎకరం 99 పైసల చొప్పున అత్యంత ఖరీదైన భూమిని కేటాయించిన కూటమి ప్రభుత్వం...3 వేల కోట్ల రూపాయల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగ

అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు... ఎంపీ మిథున్‌రెడ్డి విచారణలో సిట్ బాగోతం బట్టబయలు

వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు... దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు

సుదీర్ఘ కాలంగా వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులను ఇకపై కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నాం... ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాం... సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్‌లో ఫీజుల షెడ్యూల్‌కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్‌లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్‌కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం
క్రీడలు

LSG VS DC: ఇది కదా ప్రతీకారమంటే.. లక్నో ఓనర్‌కు ఇచ్చి పడేసిన రాహుల్
గత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గొయెంకా తన పట్ల వ్యవహరించిన తీరుకు నాటి లక్నో కెప్టెన్, ప్రస్తుత ఢిల్లీ ఆటగాడు కేఎల్ రాహుల్ తనదైన శైలిలో బదులిచ్చాడు. నిన్న (ఏప్రిల్ 22) ఎల్ఎస్జీపై విజయానంతరం గొయెంకా కరచాలనం చేస్తూ తనతో మాట్లాడే ప్రయత్నం చేయగా.. రాహుల్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు. రాహుల్ చర్యకు గొయెంకా సహా మైదానంలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఇదేంటబ్బా రాహుల్ ఇలా ప్రవర్తించాడని అనుకున్నారు.THE COMEBACK MAN - KL RAHUL. 🦁 pic.twitter.com/EQ67LvjLVl— Mufaddal Vohra (@mufaddal_vohra) April 22, 2025అయితే దీని వెనుక పెద్ద స్టోరీనే ఉంది. గత సీజన్లో సన్‌రైజర్స్ చేతిలో ఓటమి అనంతరం గొయెంకా రాహుల్‌ను బహిరంగంగా అవమానించాడు. అందరి ముందు నిలదీశాడు. గొయెంకా చర్యకు మనసు నొచ్చుకున్న రాహుల్ లక్నోను వీడి ఢిల్లీ పంచన చేరాడు. ఇప్పుడు అవకాశం రావడంతో లక్నో ఓనర్‌కు తన ఆటతీరుతోనే బుద్ది చెప్పాడు. తనను ఘోరంగా అవమానించిన గొయెంకాపై వారి సొంత మైదానంలోనే ప్రతీకారం తీర్చుకున్నాడు. Sanjeev Goenka tried to stop KL Rahul, but Rahul rejected any interaction. pic.twitter.com/1aQ68CIcic— Himanshu Pareek (@Sports_Himanshu) April 22, 2025నిన్న (ఏప్రిల్ 22) ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి ఢిల్లీని గెలిపించాడు. సిక్సర్‌తో మ్యాచ్ ముగించి గొయెంకాకు తానేమి చేయగలనో నిరూపించాడు. ఈ సీజన్లో లక్నోపై ఢిల్లీకి ఇది రెండో విజయం. వైజాగ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా ఢిల్లీ లక్నోను చిత్తు చేసింది. అయితే తన భార్య బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండటంతో రాహుల్ ఆ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. సీజన్ ప్రారంభం నుంచే గొయెంకాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూసిన రాహుల్.. నిన్న అవకాశం రావడంతో తన దెబ్బను రుచి చూపించాడు. ఈ సీజన్లో రాహుల్ మాంచి కసితో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 323 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. నిన్నటి మ్యాచ్‌లో రాహుల్ ఓ భారీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.ఎల్ఎస్జీలో రాహుల్ ప్రస్తానంలక్నో ఐపీఎల్ అరంగేట్రం నుంచి కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్.. తొలి రెండు సీజన్లలో (2022, 2023) ఆ జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. అయితే గత సీజన్లో రాహుల్ లక్నోను ప్లే ఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు. గత సీజన్లో నెమ్మదిగా ఆడుతున్నాడని కూడా రాహుల్‌పై విమర్శలు వచ్చాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఢిల్లీ పేసర్ ముకేశ్ కుమార్ (4-0-33-4) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (52) అర్ద సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్ (45), ఆయుశ్ బదోని (36) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. రాహుల్ (57 నాటౌట్), అభిషేక్ పోరెల్ (51), అక్షర్ పటేల్ (34 నాటౌట్) సత్తా చాటడంతో 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.

టైటిల్‌కు చేరువలో హంపి
పుణే: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ ఐదో అంచె టోర్నమెంట్లో భారత స్టార్ గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి టైటిల్‌కు చేరువైంది. అలీనా కష్లిన్స్కాయ (పోలాండ్)తో మంగళవారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను హంపి 61 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. మరోవైపు చైనా గ్రాండ్‌మాస్టర్ జు జినెర్ 50 ఎత్తుల్లో భారత్‌కే చెందిన జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్‌ను ఓడించింది. ఎనిమిదో రౌండ్ తర్వాత హంపి, జు జినెర్ ఆరు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరులో జు జినెర్పై హంపి పైచేయిగా ఉంది. నేడు జరిగే చివరిదైన తొమ్మిదో రౌండ్లో నుర్గుల్ సలీమోవా (బల్గేరియా)తో హంపి; పొలీనా షువలోవా (రష్యా)తో జు జినెర్ తలపడతారు. భారత ఇతర గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక, వైశాలి రమేశ్‌బాబు తమ ఎనిమిదో రౌండ్ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. మెలియా సలోమి (జార్జియా)తో గేమ్‌ను హారిక 116 ఎత్తుల్లో... సలీమోవాతో గేమ్‌ను వైశాలి 47 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. బత్కుయాగ్ మున్‌గున్‌తుల్ (మంగోలియా), పొలీనా షువలోవా మధ్య జరిగిన మరో గేమ్ 91 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. ఎనిమిదో రౌండ్ తర్వాత దివ్య దేశ్‌ముఖ్ ఐదు పాయింట్లతో మూడో స్థానంలో, నాలుగు పాయింట్లతో హారిక ఐదో స్థానంలో, 3.5 పాయింట్లతో వైశాలి ఆరో స్థానంలో ఉన్నారు.

ఉప్పల్‌లో సన్‘రైజ్’ అయ్యేనా?
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ 18వ సీజన్లో నిలకడ కనబర్చలేకపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఏడు మ్యాచ్‌లాడి 2 విజయాలు 5 పరాజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్... బుధవారం మరో మారు ముంబై ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. గత గురువారం వాంఖడే వేదికగా ముంబైతోనే తమ చివరి మ్యాచ్ ఆడిన ఎస్ఆర్హెచ్... స్వల్ప విరామం అనంతరం మరోసారి ముంబైతోనే తలపడుతోది. ఈ సీజన్లో ఆడితే బ్రహ్మండం... లేదంటే శూన్యం అన్నట్లు సాగుతున్న హైదరాబాద్... ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి. జట్టులో లెక్కకు మిక్కిలి హిట్టర్లు ఉన్నా... వారంతా కలిసి కట్టుగా కదం తొక్కలేకపోతుండటమే ఎస్ఆర్హెచ్ను ఇబ్బంది పెడుతోంది. సొంతగడ్డపై బీభత్సం సృష్టించే ఆరెంజ్ ఆర్మీ... ఉప్పల్‌లో అయినా తిరిగి విజయాల బాట పట్టాలని చూస్తోంది. మరోవైపు గత మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి ఫామ్‌లోకి వచ్చిన ముంబై ఇండియన్స్... అదే జోరు కొనసాగిస్తూ పాయింట్ల పట్టికలో పైపైకి దూసుకెళ్లాలని భావిస్తోంది. తాజా సీజన్లో ఆడిన తొలి 5 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయమే సాధించిన ముంబై ఇండియన్స్... ఆ తర్వాత గాడిన పడింది. స్టార్ పేసర్ బుమ్రా వచ్చాక బౌలింగ్ మరింత రాటుదేలగా... గత మ్యాచ్‌తో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ లయ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉప్పల్‌లో సన్‌రైజర్స్ పరుగుల ఉప్పెన సృష్టిస్తుందా లేక ముంబై గెలుపు జోరు కొనసాగుతుందా చూడాలి! టాపార్డర్ రాణిస్తేనే... గతేడాది నిలకడైన ప్రదర్శనతో రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ జట్టు... ఈసారి అదే తీవ్రత కొనసాగించలేకపోతోంది. తొలి పోరులో భారీ స్కోరు చేసి ప్రత్యర్థులను బెదరగొట్టిన రైజర్స్... ఆ తర్వాత మాత్రం పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటోంది, ఎస్ఆర్హెచ్ తరఫున ఆడిన తొలి పోరులోనే సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత ఆకట్టుకోలేకపోతుండగా... గత సీజన్లో ‘ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు’ దక్కించుకున్న ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి పూర్తిగా విఫలమవుతూ ఉన్నాడు. ఓపెనర్లు అభిõÙక్ శర్మ, ట్రావిస్ హెడ్‌పై జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది. దానికి తగ్గట్లు వీరిద్దరు ఆడిన రోజు టీమ్ మొత్తం చెలరేగుతుండగా... ఓపెనర్లు విఫలమైన సందర్భంలో మాత్రం ఓ మాదిరి స్కోరు చేసేందుకు కూడా తడబడుతోంది. మిడిలార్డర్లో క్లాసెన్, అనికేత్ వర్మ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఇషాన్, నితీశ్ కూడా గాడిన పడాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. అటు బౌలింగ్‌లోనూ రైజర్స్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. కెప్టెన్ కమిన్స్‌తో పాటు టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ, హర్షల్ పటేల్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుండగా... ఇషాన్ మలింగ, జీషన్ అన్సారీపై అధిక భారం పడుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో రైజర్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ముంబై అలవోకగా ఛేదించింది. అయితే అది వాంఖడేలోని కాస్త టరి్నంగ్ పిచ్కాగా... ఉప్పల్ ఫ్లాట్ పిచ్‌పై ఎలాంటి ఫలితం వస్తుందనేది ఆసక్తికరం. ‘హ్యాట్రిక్’తో జోరుమీదున్న ముంబై ఎప్పట్లాగే ఈసారి కూడా పరాజయాలతోనే సీజన్‌ను ప్రారంభించిన ముంబై ఇండియన్స్... ఆ తర్వాత పుంజుకుంది. గత మూడు మ్యాచ్‌లను పరిశీలిస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)పై హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై విజయాలు సాధించింది. చెన్నైతో పోరు ద్వారా రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు అదనపు బలాన్నిస్తోంది. రోహిత్, సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సీఎస్కే నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు 15.4 ఓవర్లలోనే అధిగమించింది. హైదరాబాదీ తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, నమన్ ధీర్‌తో మిడిలార్డర్ కూడా బలంగా ఉంది. బౌలింగ్‌లోనూ ముంబైకి పెద్దగా ఇబ్బందులు లేవు. గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన స్టార్ పేసర్ బుమ్రా మునుపటి వేగం అందిపుచ్చుకోగా... బౌల్ట్, దీపక్ చహర్ అతడికి సహకరిస్తున్నారు. సాంట్నర్, అశ్వని కుమార్ మరోసారి కీలకం కానున్నారు. అయితే సొంతగడ్డపై ఎంతటి బౌలింగ్ బృందాన్ని అయినా చిత్తు చేయగల ఆరెంజ్ ఆర్మీ హిట్టర్లను ముంబై బౌలర్లు ఏమేరకు అడ్డుకుంటారనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. తుదిజట్లు (అంచనా) సన్‌రైజర్స్ హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, క్లాసెన్, అనికేత్ వర్మ, హర్షల్ పటేల్, షమీ, జీషాన్ అన్సారీ, ఇషాన్ మలింగ, రాహుల్ చహర్. ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్, రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్, తిలక్ వర్మ, నమన్ ధీర్, సాంట్నర్, దీపక్ చహర్, కరణ్ శర్మ, బౌల్ట్, బుమ్రా.10 సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య ఇప్పటి వరకు 24 మ్యాచ్‌లు జరగగా... అందులో హైదరాబాద్ జట్టు 10 విజయాలు సాధించింది. మరో 14 మ్యాచ్‌ల్లో ముంబై గెలుపొందింది.

నందిని, జ్యోతి యర్రాజీలకు స్వర్ణ పతకాలు
జాతీయ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది. కొచ్చిలో జరుగుతున్న ఈ మీట్లో మంగళవారం మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన అగసార నందిని పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఏడు క్రీడాంశాల (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్‌పుట్, 200 మీటర్లు, లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్లు) సమాహారమైన హెప్టాథ్లాన్‌లో నందిని మొత్తం 5813 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. పూజ (హరియాణా; 5401 పాయింట్లు) రజతం, మౌమిత మండల్ (రిలయన్స్; 5373 పాయింట్లు) కాంస్యం సాధించారు. మరోవైపు మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ బంగారు పతకాన్ని దక్కించుకుంది. రిలయెన్స్ జట్టు తరఫున బరిలోకి దిగిన జ్యోతి యర్రాజీ 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.23 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. విజేతగా నిలిచే క్రమంలో జ్యోతి ఆసియా చాంపియన్‌షిప్ అర్హత ప్రమాణ సమయాన్ని (13.26 సెకన్లు) కూడా అధిగమించింది.
బిజినెస్

అదానీ నుంచి ఎయిర్‌టెల్‌కు స్పెక్ట్రమ్
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థ భారతీ హెక్సాకామ్‌తో కలిసి అదానీ డేటా నెట్వర్క్స్(ఏడీఎన్ఎల్) నుంచి 400 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ వినియోగ హక్కులను కొనుగోలు చేయనున్నట్లు మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ పేర్కొంది. 2022లో నిర్వహించిన వేలం ద్వారా 26 గిగాహెట్జ్ బ్యాండ్‌లో 400 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్ అనుబంధ సంస్థ ఏడీఎన్ఎల్ సొంతం చేసుకుంది. ఇందుకు రూ. 212 కోట్లు వెచ్చించింది.కాగా.. ఈ స్పెక్ట్రమ్‌ను వినియోగించుకునేందుకు వీలుగా ఏడీఎన్ఎల్తో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఎయిర్టెల్ పేర్కొంది. దీనిలో భాగంగా గుజరాత్(100 ఎంహెచ్‌జెడ్), ముంబై(100 ఎంహెచ్‌జెడ్), ఆంధ్రప్రదేశ్(50 ఎంహెచ్‌జెడ్), రాజస్తాన్(50 ఎంహెచ్‌జెడ్), కర్ణాటక(50 ఎంహెచ్‌జెడ్), తమిళనాడు(100 ఎంహెచ్‌జెడ్)లో స్పెక్ట్రమ్‌ను వినియోగించుకోనున్నట్లు తెలియజేసింది.

భారత్ వృద్ధి అంచనాలు డౌన్
న్యూయార్క్: అంతర్జాతీయంగా అనిశి్చతి, వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాలను 6.5 శాతం నుంచి 6.2 శాతానికి కుదించింది. ప్రైవేట్ వినియోగం దన్నుతో భారత వృద్ధి అంచనాలు కాస్త స్థిరంగా ఉండగలవని వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ (డబ్ల్యూఈవో)లో పేర్కొంది. 2025లో గ్లోబల్ వృద్ధి గత అంచనాల కన్నా 0.5 పర్సంటేజీ పాయింట్లు తక్కువగా 2.8 శాతంగా ఉండనుంది.2026లో ఇది 3 శాతంగా ఉండొచ్చు. కెనడా, జపాన్, బ్రిటన్, అమెరికా అంచనాలను ఐఎంఎఫ్ కుదించింది. అమెరికా వృద్ధి గతంలో ఊహించిన దానికన్నా 2.7 శాతం కన్నా చాలా తక్కువగా 1.8% స్థాయిలో ఉంటుందని పేర్కొంది. విధానాలపరమైన అనిశ్చితి, వాణిజ్య ఉద్రిక్తతలు, బలహీన డిమాండ్, ఊహించిన దానికన్నా వినియోగ వృద్ధి నెమ్మదిగా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణమని తెలిపింది.

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి
శాన్ఫ్రాన్సిస్కో: భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు భారీ అవకాశాలు ఉన్నాయని ఐటీ దిగ్గజాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సాంకేతిక సహకారం, ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికా పర్యటన సందర్భంగా గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, ట్యూరింగ్ సీఈవో జొనాథన్ సిద్ధార్్థ, డేటా రోబో సీఈవో దేబాంజన్ సాహా తదితరులతో మంత్రి సమావేశమయ్యారు. మేకిన్ ఇండియా నినాదం కింద భారత్‌తో పాటు ప్రపంచ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఇక్కడ టెక్నాలజీని అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని థామస్ కురియన్ బృందాన్ని ఆమె కోరారు.భారత ఏఐ మిషన్‌ను ఈ సందర్భంగా కురియన్ ప్రశంసించారు. మరోవైపు, సిద్ధార్్థతో సమావేశంలో కృత్రిమ మేథకు సంబంధించి భారత్ పాలసీలను మంత్రి వివరించారు. ఏఐ విభాగంలో భారతీయ సంస్థలతో కలిసి పనిచేయడంపై సిద్ధార్థ్ ఆసక్తి వ్యక్తం చేసినట్లు ఎక్స్‌లో ఆర్థిక శాఖ పోస్ట్ చేసింది. కృత్రిమ మేథలో సూపర్‌పవర్‌గా ఎదిగే సత్తా భారత్‌కి ఉందని, ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో తాము కూడా భాగం కావాలని భావిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌కి దేబాంజన్ సాహా తెలిపారు. అటు వివిధ పెన్షన్ ఫండ్ మేనేజర్లు, ఇతరత్రా సంస్థాగత ఇన్వెస్టర్లతో రౌండ్‌టేబుల్ కార్యక్రమంలో కూడా మంత్రి పాల్గొన్నారు. ఇంధన రంగం, పర్యావరణహిత ప్రాజెక్టులు, గిఫ్ట్–ఐఎఫ్ఎస్సీ మొదలైన వాటిల్లో పెట్టుబడులు, భాగస్వామ్యాలకు ఉన్న అవకాశాలను ఆమె వివరించారు. సంస్కరణల దన్ను.. వచ్చే రెండు దశాబ్దాల పాటు నిలకడగా వృద్ధి సాధించడమనేది సాహసోపేత సంస్కరణలతో పాటు దేశీయంగా సామర్థ్యాలను పెంపొందించుకోవడంపై ఆధారపడి ఉంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులను దీటుగా ఎదుర్కొనే విధంగా సంస్థల మధ్య భాగస్వామ్య ఒప్పందాలు ఉండటం కూడా కీలకమని హూవర్ ఇనిస్టిట్యూషన్‌లో కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె తెలిపారు.గత దశాబ్దకాలంగా ప్రభుత్వం పలు నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టిందని, 20,000 పైగా నిబంధనలను సరళీకరించడంతో పాటు వ్యాపార చట్టాల్లో క్రిమినల్ సెక్షన్లను తగ్గించిందని, ప్రభుత్వ సర్విసులను డిజిటలీకరించిందని మంత్రి పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేయడంతో పాటు ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంపొందించడం ద్వారా తయారీ రంగ ఆధారిత వృద్ధికి బాటలు వేసినట్లు వివరించారు. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లయ్యే 2047 నాటికి సంపన్న దేశంగా ఎదగాలని భారత్ నిర్దేశించుకుందని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను విస్మరించకుండా దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.

Stocks Market: లాభాల ‘సిక్సర్’
ముంబై: బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీల ర్యాలీ ఆరో రోజూ కొనసాగింది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు విశ్వాసాన్ని పెంచాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 187 పాయింట్లు పెరిగి 79,596 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 24,167 వద్ద నిలిచింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 416 పాయింట్లు ఎగసి 79,824 వద్ద, నిఫ్టీ 117 పాయింట్లు దూసుకెళ్లి 24,243 వద్ద గరిష్టాన్ని అందుకున్నాయి.అయితే అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో సగానికి పైగా లాభాలు హరించుకుపోయాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గించడంలో చైర్మన్ పావెల్ విఫలమయ్యాడంటూ అధ్యక్షుడు ట్రంప్ బహిరంగ విమర్శలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ ఆరు ట్రేడింగ్ సెషన్లలో రూ.33.55 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే, బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.427.37 లక్షల కోట్ల(5.02 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. ఈ ఏప్రిల్ 9 నుంచి(6 రోజుల్లో) సెన్సెక్స్ 5,748 పాయింట్లు, నిఫ్టీ 1,768 పాయింట్లు ఎగిశాయి.⇒ బీఎస్ఈ సూచీల్లో రియల్టీ 2.50%, ఎఫ్ఎంసీజీ 2%, కన్జూమర్ డ్యూరబుల్స్ 1.5% లాభప డ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్‌లు 1% రాణించాయి. ⇒ షేరు వరుస ర్యాలీతో హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారి రూ.15 లక్షల కోట్లకు చేరింది. తద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో దేశీయ సంస్థగా అవతరించింది. ఈ ప్రైవేటు రంగ బ్యాంకు షేరు బీఎస్ఈలో 2% పెరిగి రూ.1,962 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ.1,971 రికార్డు గరిష్టాన్ని తాకింది. ⇒ మైక్రోఫైనాన్స్ విభాగంలో రూ.600 కోట్ల వ్యత్యాసంపై ఫోర్సెనిక్ అడిట్ కోసం ఎర్నెస్ట్–యంగ్ నియమించుకుందనే వార్తలతో ఇండస్ఇండ్ బ్యాంకు షేరు 5% నష్టపోయి రూ.788 వద్ద ముగిసింది.⇒ దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.లక్ష దాటడంతో బంగారం ఆభరణాల షేర్లు మెరిశాయి. త్రిభువన్ దాస్ భీంజీ ఝవేరీ(టీజీజెడ్) 6%, స్కై గోల్డ్ 5%, సెన్కో గోల్డ్ 3 శాతం లాభపడ్డాయి.
ఫ్యామిలీ

న్యూ ట్రెండ్.. ఆక్వా వర్కౌట్స్ : ప్రయోజనాలెన్నో!
పొద్దున్నే లేచి వ్యాయామం కోసం జిమ్‌కి వెళదామని ట్రాక్ సూట్, షూ ధరించేలోగానే చెమట్లతో తడిపేసే సీజన్ ఇది. అందుకే నగరవాసులు నీటి అడుగునే జిమ్దగీకి జై కొడుతున్నారు. చల్లని నీటిలో ఓ వైపు శరీరాన్ని చల్లబరుస్తూ.. మరోవైపు వ్యాయామాలు చేస్తూ సేదతీరుతున్నారు. ముంబై, బెంగళూర్ తదితర నగరాలతో పాటు భాగ్యనగరిలో కూడా ఆక్వా వర్కవుట్స్‌కి ఫిదా అవుతోంది నగర యువత. – సాక్షి, సిటీబ్యూరోపింగ్ జాక్‌లు, ఆర్మ్ లిఫ్ట్‌లు, లెగ్ కిక్స్, లెగ్ షూట్స్ ఇవన్నీ.. రోజూ జిమ్‌లో చేసేవే కదా అనుకోవచ్చు. అయితే అవన్నీ ఇప్పుడు నీటిలోనూ చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు అనుసరిస్తున్న ఆక్వా వర్కౌట్లు/హైడ్రో ఎక్సర్సైజ్లు నగరంలోనూ ఇప్పుడు ప్రాచుర్యం పొందుతున్నాయి. సిటీలో ఏప్రిల్, మే నెలల్లో ఆక్వా సంబంధిత వ్యాయామాలకు డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అనేక కొత్తఎత్తయిన భవనాల్లోనూ, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ అందుబాటులో ఉన్న పూల్స్‌లో ఈ వ్యాయామాల సందడి కనిపిస్తోంది. ‘ఇది సాధారణ వ్యాయామాల మాదిరిగానే ఉంటుంది. కాకపోతే నీటిలో ఉన్నప్పుడు కాళ్లూ, చేతుల కదలికలకు పరికరాల కదలికను జోడించడం సరదాగా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో క్యాలరీలను బాగా ఖర్చు చేయడంలో ఇది సహాయపడుతుంది. నీటిలో సౌకర్యవంతంగా ఉన్నంత వరకూ (ఇది పూల్స్‌లో ఎక్కువ లోతులేని వైపు ఉంటుంది) ఈ ఫార్మాట్ అన్ని వయసుల వారికీ పని చేస్తుంది అని చెబుతున్నారు ఆక్వా ఫిట్ ఇన్స్ట్రక్టర్ కవితారెడ్డి. చదవండి : 25 ఏళ్ల క్రితం చెత్తకుప్పలో వదిలేస్తే.. ఓ అంధురాలి సక్సెస్ స్టోరీవ్యాయామాలెన్నో.. ఆక్వా ఎరోబిక్స్ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇప్పుడు సిటీలో క్యాలరీలను బర్న్ చేసి రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడే అనేక నీటి ఆధారిత వ్యాయామాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఆక్వాటిక్ వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, ఆక్వా జుంబా, హెచ్ఐఐటీ, తబాటా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఆక్వా యోగా, కిక్–బాక్సింగ్ వంటి అనేక రకాలైన వర్కవుట్స్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘డంబెల్స్, నూడుల్స్, ఆక్వా బాక్సింగ్ గ్లోవ్స్, రెసిస్టెన్స్ ట్యూబింగ్, వాటర్ వాకింగ్, ఆక్వా థ్రెడ్మిల్స్, వాటర్ బైక్‌లు ఇంకా ఎన్నో.. పరికరాలతో చేసేందుకు ఆక్వా వ్యాయామాలు అందుబాటులో ఉన్నాయి. ప్రయోజనాలెన్నో.. నీటి అడుగున వ్యాయామాలు బరువు తగ్గడానికి, కండరాలను టోన్ చేయడానికి, శక్తిని పెంచడానికీ సహాయపడతాయని అధ్యయనాలు నిరూపించాయి. తక్కువ అలసటతో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తాయి. ఆర్థరైటిస్ రోగులకు ఇవి ఉత్తమమైనవి. అంతేకాదు ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. ఆక్వా వర్కౌట్లు గర్భిణులకు కూడా మంచిదని చెబుతున్నారు కవిత. ఈ వ్యాయామం వల్ల కీళ్లకు కూడా మేలైన రక్షణ ఉంటుంది. అందుకే సాధారణంగా గాయం నుంచి కోలుకునే క్రమంలో తరచూ హైడ్రో థెరపీని ఉపయోగిస్తారు. కార్డియో–ఇన్‌టెన్సివ్‌గా ఉంటాయి, గాలి కంటే నీరు 13 రెట్లు ఎక్కువ నిరోధకతను కలిగి ఉంటుంది. కాబట్టి నీటి వ్యాయామాలు మరింత పటిష్టంగా ఉంటాయి. నేలమీది వ్యాయామం కంటే ఎక్కువ నిరోధకతను అందిస్తాయి. ఇది ఒక గంటలో 500–1,200 క్యాలరీలు బర్న్ చేయగలదు. నీటిలో ఉన్నప్పుడు శరీర బరువులో 10 శాతం మాత్రమే బరువు కలిగి ఉంటారు. కాబట్టి కీళ్ళు అన్లోడ్ చేయబడినట్లు అనిపిస్తుంది. నేల మీద మనం చేసే వ్యాయామాల్లో తప్పుడు కదలికల వల్ల లిగ్మెంట్స్ చిరిగిపోవడానికి /ఒత్తిడికి / బెణుకు లేదా పగుళ్లకు కారణమవుతుంది. నీటిలో వ్యాయామాల వల్ల గాయం అయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. చికిత్స కోసం నీటి వ్యాయామాలు సిఫార్సు చేస్తారు. ఇది చురుకుదనం, వెయిట్‌లాస్ కోసం ప్రభావవంతంగా ఉంటాయి. కాలుతో త్రిభుజం ఆకారంలో ఉండే డెగేజ్ పాస్ వంటివి ఇందులో ఉన్నాయి. పూల్‌లో నీటి సాంద్రత కాలుని ఎక్కువ దూరం కదపడానికి సహాయపడుతుంది. చదవండి : వాడికి భయపడి పబ్లిక్ టాయ్లెట్లో దాక్కుంది..కట్ చేస్తే ఆర్మీ మేజర్!కొన్ని సూచనలు మాయిశ్చరైజర్‌ని అప్లై చేయడం స్విమ్మింగ్ క్యాప్ ధరించడం ద్వారా చర్మం, జుట్టుకు క్లోరిన్ నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే కళ్లను రక్షించడానికి నీళ్లు కంట్లో కలిగించే చికాకును నివారించడానికి గాగుల్స్ ధరించాలి.నిదానంగా వ్యాయామం ప్రారంభించి కొంచెం కొంచెంగా తీవ్రతను పెంచాలి. శ్వాసను ఎక్కువసేపు బిగబట్టుకోవద్దు. నీటి అడుగున కఠినమైన విన్యాసాలు చేయవద్దు. నైపుణ్యం, స్థాయి, సామర్థ్యానికి తగిన వ్యాయామాలు మాత్రమే చేయాలి.సరైన శిక్షణ పర్యవేక్షణలో ఉంటే తప్ప అధునాతన వర్కవుట్స్ ఎప్పుడూ ప్రయత్నించవద్దు. అనుభవం లేకుంటే డైవింగ్ లేదా ఫ్లిప్ చేయడం మంచిదికాదు. అన్ని సీజన్స్‌లోనూ ఆరోగ్యకరమే.. ఈ వర్కవుట్ కేవలం వేసవిలో మాత్రమే కాదు అన్ని కాలాల్లోనూ ప్రయోజనకరం. బెంగళూరులో ఉన్నప్పుడు వ్యక్తిగత సమస్యల నుంచి పరిష్కారంగా ఎంచుకున్న ఈ వ్యాయామం నగరానికి వచి్చన తర్వాత నాకు పూర్తి స్థాయి ప్రొఫెషన్‌గా మారింది. దీని కోసం సింగపూర్‌లో ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్, ఏరోబిక్ అండ్ ఫిట్నెస్ (ఫిసా) కోర్సును చేశాను. ప్రస్తుతం నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఉన్న స్ట్రోక్స్‌తో పార్ట్నర్గా ఆక్వా వర్కవుట్స్‌లో సిటిజనులకు శిక్షణ అందిస్తున్నాను. ఈ వ్యాయామాల లాభాలపై అవగాహన మరింత పెరిగితే అది మరింతమందికి మేలు కలిగిస్తుంది. – కవితారెడ్డి, ఆక్వా ఫిట్ శిక్షకురాలు

సుగుణాలు - సద్గతులు
భాగవతంలోని ప్రతి చిన్న సంఘటన మనకు ఎన్నో మంచి విష యాలను నేర్పుతుంది. పరీక్షిన్మహారాజు వేటకు వెళ్ళాడు. దాహం వేసి... ఏకాగ్రచిత్తుడై బ్రహానుసంధానం చేసి ఉన్న శమీక మహర్షిని మంచినీళ్లు ఇమ్మని అడిగాడు. కానీ ఆ మహర్షికి అది వినిపించక మిన్నకుండి పోయాడు. దీనితో శమీకుని మెడలో ఒక చచ్చిన పామును వేశాడు. ఇది తెలిసిన మహర్షి కుమారుడైనశృంగి కోపోద్రిక్తుడై... ‘రాజు హరకేశవు లొడ్డిననైన; జచ్చుపో యేడవనాడు తక్షక ఫణీంద్ర విషానల హేతి సంహతిన్’ అని శాపం పెట్టాడు. రాజు దాన్ని విని గంగా తీరాన ప్రాయో పవేశాన్ని ప్రారంభించాడు. ఎందరో మహ ర్షులు వచ్చారు. ఆ రాజు వారికి నమస్కరించి, ‘దయామయుడైన పరమేశ్వరుడు బ్రాహ్మణ రూపమున నాకు శాపమునిచ్చి నాలో వివేక వైరాగ్యాలను మేల్కొలిపాడు. తక్షకుడు నాకు కాటు వేయువరకు శ్రీ మహావిష్ణువు యొక్క గాథలను వినుపించుడు. నేను ఎన్ని జన్మలు ధరించవలసి వచ్చినా అనంతుని యెడల భక్తి ప్రేమలు కలిగి, మహాత్ములతోటి సాంగత్యం, సర్వప్రాణుల యందు ప్రేమ కలుగునట్లు దీవింపుడు’ అని వేడుకొన్నాడు. (పుట 69–ప్రథమ స్కంధము, భాగవత సుధ, శ్రీరామకృష్ణ మఠము, చెన్నై). తనకు శాపమిచ్చిన వానిపై రాజు ప్రతీకారం తీర్చు కోదలచలేదు. పైగా శాపాన్ని వరంగా మార్చుకోగలిగాడు. అది ఆయనలో వివేక, వైరాగ్యాల్ని– ఏవైతే ఏ వ్యక్తి ఆధ్యాత్మికాభివృద్ధికైనా ఆవశ్యకాలో – వాటిని రగిల్చినట్టు భావించాడు. దైవ గాథలను చివరి వరకు విని ప్రాణం వదలదలిచాడు. సాధుసాంగత్యాన్ని కోరాడు. మరీ ముఖ్యంగా ప్రాణులన్నిటి పట్ల ప్రేమ కలిగే విధంగా దీవించమన్నాడు. ఆ సుగుణాలన్నీ ఉన్న వ్యక్తికి సద్గతులు కలుగవా?– రాచమడుగు శ్రీనివాసులు

V I Lenin Birth Anniversary లెనిన్ ప్రాసంగికత
మార్క్స్ – ఏంగెల్స్‌ల రచనలను అధ్యయనం చేసి, వెనుకబడ్డ రష్యాలో సోషలిస్ట్ విప్లవాన్ని విజయవంతం చేసి ‘శాస్త్రీయ సోషలిస్టు సమాజా’న్ని ఈ భూమిపై మొదట నిర్మించినవాడు లెనిన్ మహాశయుడు. 1870 ఏప్రిల్ 22న రష్యాలోని ‘సింబర్క్స్’ పట్టణంలో జన్మించిన ఆయన అసలు పేరు వ్లదిమీర్ ఇల్యీచ్ ఉల్యానోవ్ . లెనిన్ అనేది ఆయన కలం పేరు. తన రచ నల ద్వారా అతివాద, మితవాద అరాచక వాదాన్ని ఎదుర్కొంటూ సోషలిస్టు విప్లవానికి కార్యక్రమ పంథా రూపొందించారు. లెనిన్ తన జీవితకాలంలో 10 సంవత్సరాలకు పైగా ప్రవాస జీవితం గడి పారు. ప్రవాసంలో ఉండగా ఆయన 30కి పైగా రచనలు చేశారు. 1916లో రాసిన ‘సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానపు అత్యు న్నత దశ‘ అందులో ఒకటి. 1917లో రష్యాలో సోషలిస్టు విప్లవం విజయవంతమైంది. రెండవ ప్రపంచ యుద్ధంలో రష్యా ప్రముఖ పాత్ర వహించింది. ప్రపంచంలో సోషలిస్టు శిబిరం ఏర్పడింది. లెనిన్ నాయకత్వాన ఉన్న రష్యా కమ్యూనిస్టు పార్టీ వెనుకబడ్డ దేశాల్లో సామాజిక విముక్తి కొరకు, దోపిడీ రహిత సమాజం ఏర్పాటు కొరకు, వివిధ దేశాల్లో కమ్యూనిస్టు పార్టీల ఏర్పాటు కొరకు సహకరించింది.సామ్రాజ్య వాదం కింద ప్రపంచ విప్లవం రెండు ప్రవాహాలుగా ఉంటుందన్నారు లెనిన్. సామ్రాజ్యవాద దేశాలలో సోషలిస్టు విప్లవంగానూ; ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికన్ దేశా లలో లేక అణచబడిన దేశాలలో ‘జనతా ప్రజాతంత్ర విప్లవాలుగా’నూ ఉంటుందని సూత్రీక రించారు. భారతదేశంలోని కమ్యూనిస్టులు మారిన జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల్లో లెనిన్ చేసిన ఈ సూత్రీకరణను దృష్టిలో ఉంచుకోవలసిన అవసరం, అధ్యయనం చేసి ఐక్యం కావ లసిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశం నేడు నయా వలస, నయా పెట్టుబడిదారీ దశలో ఉన్నది. అలాగే నయా ఫాసిజం హిందూ మతోన్మాద రూపంలో అమెరికన్ సామ్రాజ్యవాదా నికి జూనియర్ భాగస్వామిగా ఉంది. ఈ పరిస్థితుల్లో అన్ని కమ్యూనిస్టు పార్టీలు, దళిత, బహుజన పార్టీలు, ప్రజాతంత్ర సంస్థలు ఐక్యమై కాషాయ ఫాసిస్టు వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు కావాలి. ఇది లెనిన్ సూత్రీకరణకు అనుగుణంగా ఉంటుంది.– మన్నవ హరిప్రసాద్సీపీఐ (ఎమ్ఎల్) రెడ్ స్టార్ పొలిట్ బ్యూరో సభ్యుడు(నేడు లెనిన్ 155వ జయంతి)

భూగర్భ నీరు @ కందకంతో చేరు!
నీరు మనకైనా పంటకైనా ప్రాణాధారం. భూగర్భంలో నీరంటూ ఉంటే బావి ద్వారానో, బోరు బావి ద్వారానో తోడుకొని పంటలు పండించుకోవచ్చు. అసలు భూగర్భంలోనే నీరు ఏటేటా అడుగుకు దిగిపోతుంటే అన్నదాతల ఆశలు ఆవిరైపోతున్నాయి. పంటల కోసం, పశువుల కోసం రోజూ తోడుకోవటానికి భూగర్భంలో నీరు పుష్కలంగా ఉండాలంటే.. వృథాగా చేను దాటి పోయే వర్షపు నీటి పరుగును ఆపి, భూమి లోపలికి చప్పున ఇంకింపజేసుకోవటం ఒక్కటే అత్యుత్తమ మార్గం. అందుకు కందకాలే సోపానాలంటున్నారు తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం పెద్దలు, వాన నీటి సంరక్షణ ఉద్యమకారులు సంగెం చంద్రమౌళి, మేరెడ్డి శ్యాం ప్రసాదరెడ్డి. తెలుగునాట రైతులు తమ భూముల్లో కందకాలు తవ్వుకోవటానికి పదేళ్లుగా మాట సాయం చేస్తున్నారు. వారి సూచనలు వారి మాటల్లోనే..ఎకరానికి రూ. 5 వేల ఖర్చు మన చేలో కురిసిన ప్రతి వాన బొట్టును పొలంలోనే ఇంకించుకోవాలి. మన చేను కిందే భూగర్భ జలాశయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అవసరమైనప్పుడు కావలసినంత నీటిని బోర్ల ద్వారా, బావుల ద్వారా తోడుకొని సమృద్ధిగా పంటలు పండించుకోవాలంటే.. ముందు మనం ‘చేను కిందే చెరువు’ను సృష్టించుకోవాలి. అందుకు ఇదే సరైన సమయం. వానా కాలానికి ముందే పొలంలో కందకాలు తవ్వుకోవాలి. అకాల వేసవి వర్షాలను సైతం భూగర్భంలోకి ఇంకింపజేసుకోవటం తెలివైన పని. వర్షాధార, ఆరుతడి పంటలు సాగు చేసే భూముల్లో.. పొలంలో ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో వాలుకు అడ్డంగా కందకాలు తవ్వుకుంటే.. ఆ పొలానికి అడుగునే చెరువును నిర్మించుకున్నట్లే నీటి భద్రత నిక్కచ్చిగా దొరుకుతుంది. దీనికి ఖర్చు ఎకరానికి సగటున రూ. 5 వేలకు మించి కాదు. కందకాలకు ఎకారానికి 2 సెంట్ల భూమి అవసరం అవుతుంది. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఈ పెట్టుబడి ఎక్కువేమీ కాదని రైతులు గ్రహించాలి.ఏ యే పొలాల్లో ఎలా తవ్వాలి?పొలంలో వాలుకు అడ్డంగా.. ప్రతి 50 మీటర్లకు ఒక చోట.. మీటరు లోతు, మీటరు వెడల్పున సమతల కందకాలను తవ్వుకోవాలి. నేలను బట్టి, వాలు ఎక్కువ తక్కువలను బట్టి కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. పొలం ఆ చివరి నుంచి ఈ చివరికి ఒకే కందకం తవ్వకూడదు. కందకం పొడవు 25 మీటర్లుండాలి. ఆ తర్వాత 5 మీటర్లు ఖాళీ వదిలి, అదే వరుసలో వాలుకు అడ్డంగా మరో 25 మీటర్ల కందకం తవ్వాలి. కందకం తవ్విన మట్టిని పొడవుగా ఒకే కట్టగా కందకం లోతట్టు వైపున గట్టు మాదిరిగా పోయాలి. ఇలా చేస్తే కందకంలోకి వచ్చిన వదర నీరు సైతం పొర్లిపోకుండా ఉంటుంది. నీటి సంరక్షణతో పాటు పొలంలోని విలువైన పైపొర మట్టి కొట్టుకుపోకుండా కూడా కాపాడుకోవచ్చు.ఎర్ర నేలల్లో ఎలా?ఇసుక కలిసిన ఎర్ర నేలలు, చల్కా నేలల్లో నీరు తొందరగా భూమిలోకి ఇంకిపోతుంది. ఇటువంటి పొలాలు వాలు 2% ఉంటే.. పొలం మధ్యలో 50 మీటర్లకు ఒక్కటి చొప్పున కందకాలు తవ్వుకోవాలి. వాలు ఇంకా ఎక్కువగా ఉంటే 40 మీటర్లకు ఒక వరుసలో కందకాలు తవ్వుకోవాలి. ఒక వేళ భూమి వాలు లేకుండా సమతలంగా ఉంటే.. కందకాలకు బదులు మడులు ఏర్పాటు చేసుకోవాలి. అర ఎకరం లేదా ఎకరానికి ఒక మడి చొప్పున ఏర్పాటు చేసుకోవాలి. మడుల కట్టలు కనీసం అర మీటరు ఎత్తుగా వేసి.. పక్కనే కందకం తవ్వాలి.నల్లరేగడి నేలల్లో ఎలా? నల్లరేగడి నేలల్లో నీరు త్వరగా ఇంకదు. కాబట్టి, ఈ నేలలు ఏటవాలుగా ఉన్నా, సమతలంగా ఉన్నా, పొలం మధ్యలో కందకాలు తవ్వకూడదు. పొలం చివరన (బావి లేదా బోరు కింది భాగంలో) నీటి కుంట లేదా ఫామ్ పాండ్‌ను తవ్వుకోవాలి. పొలాల్లో తవ్వే వాన నీటి సంరక్షణ కందకాల విషయంలో సందేహాలుంటే తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను సంప్రదించవచ్చు: సంగెం చంద్రమౌళి (విశ్రాంత ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్): 98495 66009, మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి (విశ్రాంత ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) 99638 19074.3 రోజుల్లో నా జీవితం మారిపోయింది!‘సాక్షి’ దినపత్రిక ‘సాగుబడి’లో కందకాల గురించి కథనం చదివి మా 135 ఎకరాల్లో ఐదేళ్ల క్రితం మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి సూచనల మేరకు కందకాలు వేసవిలోనే తవ్వించాను. నీటి కరువు శాశ్వతంగా తీరింది. అంతకుముందు వందలాది బోర్లు తవ్వినా ప్రయోజనం లేకపోయింది. కందకాలు తవ్విన 3 రోజుల్లోనే పెద్ద వర్షం కురవటంతో బోర్లు రీచార్జ్ అయ్యి నా జీవితం నాటకీయంగా మారిపోయింది. ఆఫ్ ఇంచ్ నీరు పోసే బోర్లు 3 రోజుల్లోనే 3 ఇంచులు నీరు పోయటం మొదలైంది. అంతకుముందు బావిలో నీరు వేసవిలో 60–80 అడుగుల లోతుకు వెళ్లేవి. ఇప్పుడు 18 అడుగుల్లోనే ఉన్నాయి. బోర్లలో అయితే 12–16 అడుగుల్లోనే ఉన్నాయి. 95 ఎకరాల్లో కుంకుడు, బత్తాయి, ఉసిరి, జామ, సీతాఫలం, శ్రీగంధం తోటలకు 3 బోర్లతోనే నీరు పెడుతున్నాం. గతంలో ఈ 95 ఎకరాల్లోనే 247 బోర్లు వేసినా దొరకని నీటి భద్రత కందకాలతో ఒక్క పెద్ద వర్షంతో దొరికింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నీటి ఎద్దడి లేనే లేదు. కుంకుడు తోట ఎండిపోయే దశలో తవ్విన కందకాల వల్ల శాశ్వతంగా గొప్ప మేలు జరిగింది. నా తోటను ఇప్పటికి అనేక రాష్ట్రాల నుంచి 6 లక్షల మంది వచ్చి చూసెళ్లారు. ఈ పుణ్యం అంతా ‘సాక్షి’ ద్వారా తెలుసుకొని, తవ్వుకున్న కందకాలదే! కందకాల్లోనే 740 కొబ్బరి చెట్లు నాటా. చక్కగా పెరుగుతున్నాయి.– లోకసాని పద్మారెడ్డి (99481 11931), పోలేపల్లి, చందంపేట మం‘‘, నల్లగొండ జిల్లా మాతో పాటు ఊరందరికీ మేలు!9 ఏళ్ల క్రితం ‘సాక్షి’ సాగుబడిలో చదివి మా వందెకరాల పొలంలో కందకాలు తవ్వుతుంటే ఊళ్లో రైతులందరూ ‘వీడేందిరా చేనంత గుంతలు కొడుతున్నాడు..’ అంటూ నన్ను పిచ్చోడి లెక్క చూశారు. అయితే, మా పొలంతో పాటు దిగువున ఉన్న రైతుల పొలాల్లో (30 వరకు) బోర్లన్నీ బాగా పారుతున్నాయి. పొలంలో 50 అడుగులకు ఒక వరుస చొప్పున కందకాలు తవ్వటంతో పాటు చెరువులు కూడా తవ్వించాను. దీంతో భూగర్భంలోకి నీరు బాగా ఇంకి, నీటి సమస్య తీరింది. 40 ఎకరాల్లో కుంకుడు తోట నాటా. 5 వేల టేకు చెట్లు నాటా. మామిడి, నేరేడు తదితర వినూత్న రకాలు సాగు చేస్తున్నా.– సాదినేని శ్రీనివాసరావు (99490 99055), శివలింగాపురం, వెల్దుర్తి మండలం, పల్నాడు జిల్లా
ఫొటోలు


నెత్తురోడిన కశ్మీర్ మినీ స్విట్జర్లాండ్.. చూపు తిప్పుకోనివ్వని పహల్గాం బైసరన్ వ్యాలీ ప్రకృతి అందాలు (ఫొటోలు)


'సోదరా' మూవీ హీరోయిన్ ఆరతి గుప్తా (ఫొటోలు)


ప్రేమలు హీరో 'జింఖానా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)


ఉప్పల్ అదిరేలా SRH, ముంబై ప్లేయర్ల ప్రాక్టీస్.. విజయం ఎవరిదో (ఫొటోలు)


హీరోయిన్ ప్రణీత కొడుకు బారసాల వేడుక (ఫొటోలు)


ఓ ఈవెంట్లో సందడి చేసిన బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ (ఫొటోలు)


'మన్మథుడు' అన్షు ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)


భర్త వెంకట దత్తసాయితో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న పీవీ సింధు (ఫోటోలు)


బోనమెత్తిన కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి (ఫొటోలు)


జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం (ఫొటోలు)
అంతర్జాతీయం

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
వాటికన్ సిటీ: క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్(88) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందినట్లు వాటికన్ సిటీ వర్గాలు ప్రకటించాయి. ఈస్టర్ సందర్భంగా నిన్న ఆయన పేరిట సందేశం వెలువడగా.. కొన్ని గంటలకే ఆయన మృతి చెందారని వీడియో సందేశం విడుదల చేయడం గమనార్హం.పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో 1936 డిసెంబర్ 17న ఈయన జన్మించారు. 2013లో నాటి పోప్ బెనెడిక్ట్-16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్ కేథలిక్ చర్చి అధిపతి అయ్యారు. ఆ ఏడాది మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. అమెరికా ఖండం నుంచి ఎన్నికైక తొలి పోప్‌గా ఈయనకంటూ ఓ గుర్తింపు ఉంది. Pope Francis died on Easter Monday, April 21, 2025, at the age of 88 at his residence in the Vatican's Casa Santa Marta. pic.twitter.com/jUIkbplVi2— Vatican News (@VaticanNews) April 21, 2025పోప్ ఫ్రాన్సిస్ తరచూ సమకాలీన సామాజిక అంశాలపై వ్యాఖ్యలు చేస్తుండేవారు. వలసదారులు, శరణార్థుల పట్ల మానవత్వంతో మెలగాలని ప్రపంచ దేశాలకు పిలుపు ఇచ్చిన ఈయన.. అదాయ అసమానతలు, వాతావరణ మార్పులు, మరణ శిక్షలకు వ్యతిరేకంగా పోరాడారు కూడా. 2016లో రోమ్ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడగడం తీవ్ర చర్చనీయాంశమైంది. మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికల టైంలోనూ.. అటు ట్రంప్, ఇటు కమలా హారిస్ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు కూడా. తాజాగా ఈస్టర్ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) పోప్‌ను కలుసుకున్నారు కూడా. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడ్డ పోప్ ఫ్రాన్సిస్.. కొన్నాళ్లపాటు ఆస్పత్రిలో చికిత్స కూడా పొందారు. వాటికన్ సిటీలోని కాసా శాంటా మార్టా (Casa Santa Marta) నివాసంలో సోమవారం కన్నుమూసినట్లు తెలుస్తోంది. పోప్ మృతి పట్ల పలు దేశాల అధినేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Talking Tree: చెట్టుకే మాటలొస్తే.. వినాలని ఉందా?
దాదాపు వందేళ్లక్రితం జగదీశ్ చంద్రబోస్ అనే వృక్షశాస్త్రవేత్త మొక్కలకు ప్రాణం ఉంటుందని నిరూపించారు. అవి ఎండనుంచి శక్తిని. వాతావరణం నుంచి కార్బన్ డయాక్సయిడ్ ను తీసుకుని ఆకులతో శ్వాసించి మనకు ప్రాణాలు నిలిపే ఆమ్లజనిని విడుదల చేస్తాయని నిరూపించారు. అంతేకాకుండా మొక్కలు తమకు హానికారక రసాయనాలను చూసి ఎలర్జీ ఫీలవుతాయని.. వాటిలోనూ మనుషులకు ఉన్నట్లే నాడీ వ్యవస్థ ఉంటుందని చెప్పారు. ఆ తరువాత కొంతమంది శాస్త్రవేత్తలు మొక్కలు తమలోతాము సంభాషించుకుంటాయని.. భావాలు కూడా షేర్ చేసుకుంటాయని పరిశోధించి వివరించారు.. అంటే కొంపదీసి మొక్కలు కూడా మనలా మాట్లాడతాయా ఏందీ అంటూ కొంతమంది అత్యుత్సాహకులు ఆనాడే కామెంట్లు చేసారు.. అయితే అవును మొక్కాలు మాట్లాడతాయి.. ఇదిగో కావాలంటే వినండి అంటూ డబ్లిన్(Dublin)లోని శాస్త్రవేత్తలు మనకు వినిపిస్తున్నారు.మాట్లాడే చెట్టు (టాకింగ్ ట్రీ ) అంటూ ట్రినిటీ కాలేజీలో రూపొందించిన ఈ సరికొత్త ప్రయోగం ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. అసలు చెట్లు.. వృక్షాలు మొక్కలు తీగలు మనతో మాట్లాడితే బావుణ్ణు.. అసలివి మనతో ఏం మాట్లాడతాయి అంటారు.. ఏమో.. అసలు మనతో మాట్లాడితే కదా... ఇలాంటి ఉత్సుకత మనలో చాలామందిలో ఉంటుంది. మన ఉత్సాహాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఆ కాలేజీ ప్రాంగణంలోని ఓ చెట్టుతో సంభాషించే అవకాశాన్ని.. కలిగించారు.. దీనికి అధునాతన సాంకేతికతను జోడించారు.కాలేజీలోని ఇరవయ్యేళ్ళ వయసున్న లండన్ ప్లేన్ చెట్టుతో ముఖాముఖి సంభాషించే అవకాశం కలిగించారు. డ్రోగా5 టెక్నాలజీ సంస్థ మరియు బ్రిటన్‌లోని ఏజెన్సీ ఫర్ నేచర్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును రూపొందించాయి. శాస్త్రవేత్తలు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ... కృత్రిమ మేధస్సు ఇంకా సెన్సర్లను చెట్టుకు అనుసంధానించి చెట్టుకు గొంతును ఇచ్చారు. ఈ సెన్సార్లు చెట్టు అడుగున ఉన్న మట్టి .. దానిలోని తేమ, వాతావరణ ఉష్ణోగ్రత, సూర్యరశ్మి లోని తీవ్రత.. గాలి స్వచ్ఛత వంటివి అంచనావేసి ఆర్టిఫీషియల్ భాషా నమూనాకు అనుసంధానిస్తారు. అవి చెట్టుకు లింక్ చేస్తారు.. అప్పుడు చెట్టు ఎలా ఫీలవుతుందన్నది అట్నుంచి మళ్ళీ మాటల రూపంలో మనకు వినిపిస్తారు. అంటే చెట్టుకు నీళ్లు లేకపోతె.. వేళ్ళు దాహంతో అల్లాడే పరిస్థితి ఉంటే బహుశా.. దాహం.. దాహం.. కాసిన్ని నీళ్లు పోయండర్రా అంటుందేమో చెట్టు! ఆకలేస్తోంది.. ఎవరైనా ఓ గంపెడు ఎరువు తెచ్చి వేసి పుణ్యం కట్టుకోండర్రా అని చెట్టు మ్రాన్పడిపోతుందేమో!.అంతేకాకుండా చెట్లకు కాలజ్ఞానం ఉంటుందని విశ్వసిస్తున్న శాస్త్రవేత్తలు.. అడవుల్లో ప్రజ్వరిల్లే కార్చిచ్చు వంటివాటిని ముందుగానే మనకు తెలుస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చెట్టుతో సంభాషన అనంతరం కొందమంది విద్యార్థులు మాట్లాడుతూ.. మనం సహచరులతో మాట్లాడడం సహజం.. కానీ ఇలా ప్రకృతితో సంభాషణ అనేది వింతగా ఉంది.. చెట్టు చెబుతున్న భావాలు వింటుంటే అద్భుతంగా ఉందని అబ్బురపడుతున్నారు. :::సిమ్మాదిరప్పన్న

ట్రంప్ ఎఫెక్ట్.. ఆ దేశాలకు చైనా సీరియస్ వార్నింగ్
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా చైనా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. చైనా తాజాగా.. తన మిత్ర దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. చైనా ప్రయోజనాలకు నష్టం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటే ఆయా దేశాలపై ప్రతీకార చర్యలు కఠినంగా ఉంటాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా..‘బుజ్జగింపులతో శాంతి స్థాపన జరగదు. రాజీ పడితే గౌరవం లభించదు. దీని వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేకూరదు. స్వల్పకాలిక లాభాల కోసం వెళితే.. అది ఎప్పటికైనా మనకే హాని చేస్తుందన్న విషయాన్ని దేశాలు గుర్తుంచుకోవాలి. చైనా ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఏ దేశమైనా అమెరికాతో వాణిజ్యపరంగా, ఆర్థికంగా ఒప్పందం కుదుర్చుకుంటే దాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే దాన్ని ఎన్నటికీ అంగీకరించబోం. మా నుంచి ప్రతిస్పందన కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇతరుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి తాత్కాలికంగా, స్వార్థపూరితంగా లాభం పొందాలనుకోవడం.. పులి చర్మం కోసం దాంతోనే డీల్ చేసుకోవడం లాంటిది’ అని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వార్నింగ్ ఇచ్చింది.ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే చైనా సహా పలు దేశాలపై టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. వాణిజ్య చర్చల కోసం వాటిని 90 రోజుల పాటు నిలిపివేశారు. అయితే, చైనాకు మాత్రం ఎలాంటి మినహాయింపు లేదని ప్రకటించారు. చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లను ఏకంగా 245 శాతానికి పెంచుతున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. బోయింగ్ విమానాల డెలివరీపై నిషేధం విధించినందుకు చైనాపై అమెరికా ప్రభుత్వం వెంటనే ప్రతీకార చర్యలకు దిగారు. ఈ మేరకు ఫ్యాక్టషీట్ విడుదల చేసింది. BREAKING: China warns it will hit back at any country that sides with the US in ways that hurt its interests."Deals at China's expense won't be accepted. Expect countermeasures" says Min of Commerce.During Trump’s #Tariffwar - China didn’t stay silent then, won’t now either. https://t.co/3U3Vv4KTAP pic.twitter.com/jz1WrTDOGh— Amit Bhawani 🇮🇳 (@amitbhawani) April 21, 2025

‘యెమెన్ లీక్ ఎపిసోడ్’లో బిగ్ ట్విస్ట్
యెమెన్‌పై భీకర దాడులకు సంబంధించి అమెరికా ప్రణాళికలు ముందుగానే బయటపడడం చర్చనీయాంశమైన వేళ.. విస్మయం కలిగించే విషయం ఒకటి వెలుగు చూసింది. హౌతీ రెబల్స్‌పై దాడుల సమాచారాన్ని అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ తన భార్య, కుటుంబ సభ్యులు, వ్యక్తిగత లాయర్‌తోనూ పంచుకున్నట్లు బయటపడింది. సమాచారం లీక్ విషయంలో ఈయన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.న్యూయార్క్: సమాచారం లీక్ అవ్వడానికి కారణమైన ‘సిగ్నల్’ గ్రూప్‌ను తానే క్రియేట్ చేశానని, దీనికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రత సలహాదారు మైక్ వాల్జ్ (Mike Waltz) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ గ్రూప్‌లో సమాచారం ఎలా లీక్ అయ్యిందో అర్థం కావడం లేదని, దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోందని అన్నారాయన. ఈలోపు.. అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్(Pete Hegseth) తన కుటుంబ సభ్యులతోనూ ఆ కీలక సమాచారం పంచుకున్నారనే విషయం వెలుగు చూసింది.యెమెన్‌లోని హౌతీ రెబల్స్‌ను టార్గెట్ చేస్తూ జరిగిన F/A-18 హార్నెట్ దాడుల షెడ్యూల్ల వివరాలను ఆయన మరో ఛాట్‌లో భార్య, తన సోదరుడు, స్నేహితులతోనూ పంచుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఆదివారం ఒక కథనం ప్రచురించింది. అంతేకాదు హెగ్సెత్ భార్య, ఫాక్స్ న్యూస్ ప్రొడ్యూసర్ అయిన జెన్నిఫర్.. సైన్యానికి సంబంధించిన కీలక సమావేశాలకూ హాజరయ్యారని వాల్ స్ట్రీట్ జనరల్ విడిగా మరో కథనం ఇచ్చింది.ఈ కథనాలపై ఇటు అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్.. అటు వైట్‌హౌజ్ వర్గాలు స్పందించాల్సి ఉంది. మరోవైపు.. అత్యంత సున్నితమైన భద్రతా వివరాలను పంచుకోవడానికి ట్రంప్ పేషీ ‘‘సిగ్నల్’’ లాంటి యాప్‌ను వాడడంపై అమెరికాలో తీవ్ర చర్చ నడుస్తోంది.అమెరికా బలగాలు కిందటి నెలలో యెమెన్(Yemen Attacks Plan Leak)పై భీకర దాడులు చేయడానికి సంబంధించిన ప్రణాళికలు ముందుగానే ఓ పాత్రికేయుడికి తెలియడం అమెరికాలో కలకలం రేపింది. సిగ్నల్‌లో గ్రూప్‌చాట్ కోసం తనను రెండు రోజుల ముందే యాడ్ చేశారని ‘అట్లాంటిక్ మ్యాగజైన్’ ఎడిటర్-ఇన్-చీఫ్ జెఫ్రీ గోల్డ్బర్గ్ ప్రకటించారు. లక్ష్యాలు, అమెరికా ఆయుధాల మోహరింపు, దాడులు చేసే దిశ వంటి అంశాలపై గ్రూపులో చర్చించారని, ఆ ప్రకారమే దాడులు జరిగాయని ఆయన వెల్లడించారు. అయితే తన వద్ద ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ.. తాను ఎలాంటి కథనాలు ఇవ్వలేదంటూ చెప్పారాయన.అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర ముఖ్య అధికారులు యెమెన్‌పై చర్చించిన సిగ్నల్ యాప్ గ్రూప్చాట్లో ఈ జర్నలిస్టును యాడ్ చేశారు. దాడుల విషయాలు ఆ పాత్రికేయునికి తెలుసని శ్వేతసౌధం ధ్రువీకరించింది.మరోవైపు.. ఈ ప్రణాళిక లీకైన అంశంపై తనకెలాంటి సమాచారం లేదని అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారు. ఈ భద్రతా ఉల్లంఘనను ట్రంప్ సాధారణ విషయంగా తీసుకున్నప్పటికీ.. డెమోక్రట్లు తీవ్రంగా ఖండించారు. నూతన పాలకవర్గం అజాగ్రత్త వల్లే ఇది జరిగిందని వ్యాఖ్యానించారు.ఇక.. ఈ ఉదంతంపై ఉన్నతస్థాయి నిఘా అధికారులను అమెరికా సెనెట్ విచారిస్తోంది. ఇప్పటికే ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్, సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్, జాతీయ నిఘా డైరెక్టర్ తులసీ గబ్బార్డ్‌లు సెనెట్ నిఘా కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. అయితే గ్రూప్‌ను తానే క్రియేట్ చేసినప్పటికీ సదరు జర్నలిస్టు ఫోన్ నెంబర్ తన వద్ద లేదని అన్నారు. ఫోన్లో లేని నెంబర్ ఎలా గ్రూప్‌లోకి వచ్చిందో తెలుసుకోవడానికి సాంకేతిక నిపుణులు కృషి చేస్తున్నారని .. విషయంలో తాము ఇలాన్ మస్క్ సహాయం కూడా తీసుకుంటున్నట్లు అమెరికా జాతీయ భద్రత సలహాదారు మైక్ వాల్జ్ వెల్లడించారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మార్చి 15న యెమెన్‌పై దాడులను ప్రకటించారు. ఇజ్రాయెల్ నౌకలపై దాడుల్ని పునరుద్ధరిస్తామని ప్రకటించిన యెమెన్ తిరుగుబాటు దళం హూతీలపై అమెరికా ఇటీవల పెద్దఎత్తున దాడులు చేసింది. ఉగ్రవాద స్థావరాలు, ఉగ్ర నేతలపై తమ దళాలు భీకర దాడులు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ దాడుల్లో 50 మందికి పైగా మృతిచెందగా.. అనేకమంది గాయపడ్డారు.
జాతీయం

సివిల్స్ టాపర్ శక్తి
న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్విసెస్ ఎగ్జామినేషన్–2024 ఫలితాల్లో అమ్మాయిలు అద్భుత ప్రతిభ కనబర్చారు. ఆలిండియా ఫస్ట్ ర్యాంకుతోపాటు తొలి ఐదు ర్యాంకుల్లో ఏకంగా మూడు ర్యాంకులు కైవసం చేసుకున్నారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన శక్తి దూబే ఫస్ట్ ర్యాంకు సాధించగా హర్షితా గోయ ల్ రెండో ర్యాంకు, షా మార్గీ చిరాగ్ నాలుగో ర్యాంకు సాధించారు. అబ్బాయిల్లో డోంగ్రే అర్చిత్ పరాగ్ మూడో ర్యాంకు, ఆకాశ్ గార్గ్ ఐదో ర్యాంకు సాధించారు.తొలి 25 ర్యాంకుల్లోనూ 11 ర్యాంకులను అతివలు సాధించి తమ సత్తా చాటారు. అలాగే టాప్–25లో ఇద్దరు తెలుగువాళ్లు ర్యాంకులు సాధించారు. తొలి 1,009 ర్యాంకుల్లో 725 మంది పురుషులు, 284 మంది మహిళలు ఉన్నారు. పరీక్షల్లో విజయం సాధించిన వారిలో జనరల్ కేటగిరీ నుంచి 335 మంది ఎంపికవగా ఆర్థికంగా వెనకబడిన వర్గాల నుంచి 109 మంది ఎంపికయ్యారు. ర్యాంకర్లలో 318 మంది బీసీలు, 160 మంది ఎస్సీలు, 87 మంది ఎస్టీలు ఉన్నారని యూపీఎస్సీ తెలిపింది. మొత్తంగా 1,129 ఖాళీలు ఉన్నట్లు కమిషన్ గతంలో పేర్కొంది. వాటిలో 180 ఐఏఎస్, 55 ఐఎఫ్ఎస్, 147 ఐపీఎస్, 605 గ్రూప్–ఏ పోస్ట్‌లు, 142 గ్రూప్–బీ పోస్ట్‌లు ఉన్నాయి. భిన్న నేపథ్యాలు.. ఆలిండియా టాపర్‌గా నిలిచిన శక్తి దూబే ఎటువంటి కోచింగ్ తీసుకోకుండానే ఐదో ప్రయత్నంలో ర్యాంక్ సాధించగా రెండో ర్యాంకర్ హర్షితా గోయల్ మూడో ప్రయత్నంలో సివిల్స్‌కు ఎంపికైంది. ఆమె ప్రస్తుతం చార్టర్డ్ అకౌంటెంట్‌గా ప్రాక్టీస్ చేస్తోంది. ఇక మూడో ర్యాంక్ సాధించిన 26 ఏళ్ల డోంగ్రే అర్చిత్ పరాగ్ స్వస్థలం మహారాష్ట్రలోని పుణే. అతను తమిళనాడులోని వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు.గతంలో ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. 2023లో సివిల్స్ పరీక్షలో 153వ ర్యాంక్ సాధించినా మెరుగైన ర్యాంక్ కోసం ఈసారి ప్రయత్నించి అందులో సఫలీకృతమయ్యాడు. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన గుజరాత్‌వాసి, నాలుగో ర్యాంకర్ మార్గి చిరాగ్ షా ఐదో ప్రయత్నంలో సివిల్స్‌కు ఎంపికైంది. రెండో ప్రయత్నంలో ఐదో ర్యాంక్ సాధించి సివిల్స్‌కు ఎంపికైన 24 ఏళ్ల ఆకాశ్ గార్గ్ ఢిల్లీ గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో బీటెక్ చదివాడు. మొత్తం 50 మందికిపైగా తెలుగు అభ్యర్థుల ఎంపిక! సివిల్ సర్విసెస్–2024 పరీక్షల ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు అభ్యర్థులు సత్తా చాటారు. మొత్తంగా 50 మందికిపైగా తెలుగు తేజాలు ర్యాంకులు సాధించారు. వరంగల్ జిల్లా శివనగర్‌కు చెందిన ఎట్టబోయిన సాయి శివాని అఖిల ఆలిండియా 11వ ర్యాంకు సాధించి తెలుగు రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. యూపీఎస్సీ ప్రకటించిన 1,009 మంది ర్యాంకర్లలో దాదాపు 50 మందికిపైగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులున్నట్లు సమాచారం.వారిలో టాప్–20లో బన్న వెంకటేష్ 15వ ర్యాంకు సాధించగా 100 లోపు ర్యాంకులు సాధించిన వారిలో రావుల జయసింహారెడ్డి 46వ ర్యాంక్, చింతకింది శ్రవణ్‌కుమార్‌రెడ్డి 62వ ర్యాంకు, సాయి చైతన్య జాదవ్ 68వ ర్యాంకు ఉన్నారు. అలాగే ఎన్.చేతనరెడ్డి 110వ ర్యాంకు, చెన్నంరెడ్డి శివ గణేష్ రెడ్డి 119వ ర్యాంకు, నేలటూరు శ్రీకాంత్‌రెడ్డి 151వ ర్యాంకు సాధించారు. నెల్లూరు సాయితేజ 154వ ర్యాంకు, కొలిపాక శ్రీకృష్ణ సాయి 190వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. 230 మందితో రిజర్వ్ జాబితా.. యూపీఎస్సీ నిబంధనల ప్రకారం మరో 230 మందిని సంస్థ రిజర్వ్ జాబితాలోకి చేర్చింది. అందులో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కేటగిరీలతోపాటు సెంట్రల్ సర్విసెస్ గ్రూప్–ఏ, గ్రూప్–బీ కేటగిరీల్లో ఈ అభ్యర్థులు ఎంపికయ్యారు. గతేడాది జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన యూపీఎస్సీ.. ఇందులో అర్హత సాధించిన వారికి సెపె్టంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. మెయిన్స్‌లో మెరుగైన ఫలితాలు సొంతం చేసుకున్న వారికి ఈ ఏడాది జనవరి 7 నుంచి ఏప్రిల్ 17 వరకు పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలను ప్రకటించింది.టాప్–25 ర్యాంకర్లుశక్తి దూబే (1), హర్షితా గోయల్ (2), డోంగ్రే అర్చిత్ పరాగ్ (3), షా మార్గీ చిరాగ్ (4), ఆకాశ్ గార్గ్ (5), కోమల్ పునియా (6), ఆయుషీ బన్సాల్ (7), రాజ్‌కృష్ణ ఝా (8), ఆదిత్య విక్రమ్ అగర్వాల్ (9), మయాంక్ త్రిపాఠి (10), సాయి శివాని (11), ఆశీ శర్మ (12), హేమంత్ (13), అభిషేక్ వశిష్ట (14), బన్నా వెంకటేశ్ (15), మాధవ్ అగర్వాల్ (16), సంస్కృతి త్రివేది (17), సౌమ్యా మిశ్రా (18), విభోర్ భరద్వాజ్ (19), త్రిలోక్ సింగ్ (20), దివ్యాంక్ గుప్తా (21), రియా సైనీ (22), బి.శివచంద్రన్ (23), ఆర్. రంగ మంజు (24), ఝీ ఝీ ఏఎస్ (25).

పార్లమెంటే సుప్రీం
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో పార్లమెంటే సర్వోన్నతమని పునరుద్ఘాటించారు. ‘‘దాన్ని మించిన అధికారాన్ని మన రాజ్యాంగం మరే అథారిటీకీ ఇవ్వలేదు. కనీసం అలాంటి భావనకు కూడా చోటివ్వలేదు. ఆ మాటకొస్తే దేశంలోని ప్రతి పౌరుడూ సుప్రీమే. ‘దేశ ప్రజలమైన మేము’ అంటూ రాజ్యాంగంలో రాసుకున్న మాట అణుబాంబు వంటిది. దానికున్న శక్తి ఎంతటిదో ప్రతి ఎన్నికల్లోనూ కనిపిస్తుంది’’ అంటూ కుండబద్దలు కొట్టారు. ‘‘రాజ్యాంగపరమైన అంశాల్లో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్.రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత కూడా వారిదే’’ అని స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రపతి వంటి ఉన్నత రాజ్యాంగ పదవులు అలంకారప్రాయమైనవి మాత్రమేనని కొందరంటున్నారు. ఇది పూర్తి తప్పుడు అవగాహన. ప్రతి వ్యవస్థకూ తనవైన బాధ్యతలున్నాయి. ఇలా వాటి ప్రతిష్టను మసకబార్చజూస్తున్న దేశ వ్యతిరేక శక్తుల ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వరాదు’’ అని అభిప్రాయపడ్డారు. మంగళవారం ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. సుప్రీంకోర్టు పరిధులు దాటి వ్యవహరిస్తోందన్న తన వ్యాఖ్యలను పూర్తిగా సమర్థించుకున్నారు. వాటిని తప్పుబట్టిన వారిపై విరుచుకుపడ్డారు.రాజ్యంగ హోదాలో ఉండే వ్యక్తులు మాట్లాడే ప్రతి మాటకూ దేశ అత్యున్నత ప్రయోజనాలే పరమావధి అని గుర్తుంచుకోవాలన్నారు. ‘‘సుప్రీంకోర్టు పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదని ఒక కేసులో, భాగమేనని మరో కేసులో పేర్కొంది. వ్యవస్థలు తమ రాజ్యాంగ పరిధిని మీరినప్పుడు మౌనం వహించడం ప్రమాదకరం. వీటిపై మేధావులు స్పందించాలి. ఆస్తులను ధ్వంసం చేసే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే శక్తులను ఏరిపారేయాలి. నయానాభయానా వినని వారికి చేదుమందు తినిపించక తప్పదు. భారతీయత పట్ల ప్రతి ఒక్కరూ గర్వించాలి’’ అన్నారు.రాజ్యాంగమే సుప్రీం: సిబల్ధన్ఖడ్ తాజా వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మరోసారి తీవ్రంగా తప్పు బట్టా రు. పార్లమెంటు, కార్య నిర్వాహక వ్యవస్థల్లో ఏదీ సుప్రీం కాదని, రాజ్యాంగమే సర్వోన్నతమని అన్నారు. రాష్ట్రపతికి గడువు విషయంలో జాతి ప్రయో జనార్థం రాజ్యాంగ విలువలకు అనుగుణంగానే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందన్నారు. ‘చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు, రాజ్యాంగానికి సరైన భాష్యం చెప్పి పరిపూర్ణ న్యాయం అందించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుకు ఉన్నాయి’’ అని ఆర్టికల్ 142ను ఉటంకిస్తూ చెప్పారు. ఉపరాష్ట్రపతి స్థాయి వ్యక్తి ఇలా రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఎన్నడూ చూడలేదంటూ ధన్‌ఖడ్ గత వ్యాఖ్యలపై కూడా సిబల్ మండిపడటం తెలిసిందే.మాటల మంటలుబిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతికి ఇటీవల సుప్రీంకోర్టు మూడు నెలల గడువు విధించడం, దాన్ని ధన్‌ఖడ్ తీవ్రంగా తప్పుబట్టడం తెలిసిందే. ‘‘న్యాయవ్యవస్థ సూపర్ పార్లమెంటుగా వ్యవహ రిస్తోంది. కార్యనిర్వాహక విధుల్లోకి చొరబడుతోంది. న్యాయ మూర్తులకు మాత్రం ఎలాంటి జవాబు దారీతనమూ లేదు. భారత్ ప్రజాస్వామ్య తరహా పాలనను ఎంచుకున్నది ఇలా న్యాయ మూర్తులే చట్టాలు చేసి కార్యనిర్వాహక విధులు కూడా నిర్వర్తించడానికి కాదు’’ అంటూ ఆక్షేపించారు. ధన్‌ఖడ్ వ్యాఖ్యలు రాజ్యాంగవిరుద్ధమంటూ విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. తాజాగా సుప్రీంకోర్టు కూడా వాటిపై పరోక్షంగా స్పందించింది. కార్య నిర్వాహక విధుల్లో తలదూరుస్తున్నామంటూ తమపై అభియోగాలు మోపుతు న్నారంటూ కాబోయే ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ సోమవారం ఓ కేసు విచారణ సందర్భంగా ఆవేదన వెలిబుచ్చారు.

Pahalgam: నెత్తురోడిన కశ్మీరం.. ఉగ్రదాడిలో 26 మంది బలి
పహల్గాం/శ్రీనగర్/న్యూఢిల్లీ: అందాల కశ్మీరం ఎరుపెక్కింది. ఉగ్ర ఉన్మాదం మరోసారి ఒళ్లువిరుచుకుంది. పర్యాటకులపై తూటాల వర్షం కురిసింది. వారిపై ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలోని బైసారన్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ దారుణానికి 26 మంది పర్యాటకులు బలయ్యారు. 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులున్నారు. వారిలో ఒకరు నేపాలీ కాగా మరొకరిది యూఏఈ. మరో ఇద్దరు స్థానికులు కాగా మిగతావారు కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, బిహార్ తదితర రాష్ట్రాలకు చెందినవారు. 2019లో పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై టెర్రరిస్టులు కాల్పులకు దిగి 47 మందిని పొట్టన పెట్టుకున్న అనంతరం కశ్మీర్లో జరిగిన అతి పెద్ద దాడి ఇదే. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇది తమ పనేనని పాకిస్తాన్‌కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే తొయిబా తాలూకు ముసుగు సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ప్రకటించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీతో సహా పారీ్టలకు అతీతంగా నేతలంతా దాడిని ముక్త కంఠంతో ఖండించారు. ఉగ్రవాదులది మతిలేని ఉన్మాదమంటూ మోదీ మండిపడ్డారు. ‘‘ఈ హేయమైన దాడికి పాల్పడ్డ వారిని వదిలే ప్రసక్తే లేదు. వారందరినీ చట్టం ముందు నిలబెడతాం. ముష్కరుల కుటిల అజెండా ఫలించబోదు. ఉగ్రవాదంపై రాజీలేని పోరు జరపాలన్న మా సంకల్పం మరింత బలపడింది’’ అని ప్రకటించారు. ‘‘మృతుల కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడ్డవారు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. బాధితులందరికీ అన్నివిధాలా సాయం అందజేస్తున్నాం’’ అని ప్రధాని పేర్కొన్నారు. సౌదీ అరేబియాలో ఉన్న ఆయన విషయం తెలియగానే పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని భారత్ తిరిగొచ్చారు. అంతకుముందు సౌదీ నుంచే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడారు. అనంతరం కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ దేకా తదితర ఉన్నతాధికారులు, ఢిల్లీలో ఉన్న జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తదితరులతో షా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వెంటనే ప్రధాని సూచన మేరకు వారందరితో కలిసి మంగళవారం రాత్రే ప్రత్యేక విమానంలో హుటాహుటిన కశ్మీర్ చేరుకున్నారు. రాజ్‌భవన్‌లో పరిస్థితిని సమీక్షించారు. ‘‘తాజా పరిస్థితిని మోదీకి నివేదించా. ఉగ్ర దాడి నన్ను తీవ్రంగా కలచివేసింది. దాడికి తెగబడ్డవారిని వదిలే ప్రసక్తే లేదు. వారి వెనకున్న సూత్రధారులను కూడా ఉక్కుపాదంతో అణచివేస్తాం’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆయన బుధవారం ఘటనాస్థలిని సందర్శించనున్నారు. ఇది కనీవినీ ఎరగని పిరికిపంద చర్య అంటూ జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. ఉగ్రవాదుల కోసం పహల్గాం, పరిసర ప్రాంతాలన్నింటినీ భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. జమ్మూ కశ్మీర్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు కుటుంబసమేతంగా భారత్‌లో పర్యటిస్తున్న వేళ ఈ దాడి జరగడం గమనార్హం. దీన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా ఖండించారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రవాదంపై రాజీలేని పోరులో భారత్‌కు పూర్తిగా వెన్నుదన్నుగా నిలుస్తామని నేతలిద్దరూ పునరుద్ఘాటించారు. ‘‘కశ్మీర్ దారుణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ విషయంలో ప్రధాని మోదీకి, భారత పౌరులకు అన్నివిధాలా మద్దతుగా ఉంటాం’’ అని ట్రంప్ తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్‌సోషల్‌లో పేర్కొన్నారు. ఈ దాడిని దారుణ నేరంగా పుతిన్ అభివర్ణించారు. పెళ్లయిన 6 రోజులకే నూరేళ్లు నిండాయికాల్పుల్లో భర్తను కోల్పోయిన నవవధువుపెళ్లయి కాళ్లకు పారాణి ఆరకముందే ఆ నవవధువు జీవితం తలకిందులైంది. భర్తను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకోవడంతో ఆ నవవధువు తన భర్త మృతదేహాన్ని పట్టుకుని దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చింది. ఈ యువజంట ఏ రాష్ట్రానికి చెందిన వాళ్లు అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. ‘‘మాకు పెళ్లయి కేవలం ఆరు రోజులే అవుతోంది. ఘటన జరిగినప్పుడు మేమిద్దరం పానీపూరీని ఆస్వాదిస్తున్నాం. హఠాత్తుగా ఒక ఉగ్రవాది మా వద్దకు వచ్చాడు. నీ భర్త ముస్లింకాదుకదా అని అన్నాడు. వెంటనే ఆయన తలకు తుపాకీ గురిపెట్టి కాల్చి వెళ్లిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న నా భర్తను ఎవరైనా కాపాడండి’’అంటూ ఆ మహిళ ఏడుస్తున్న హృదయ విదారక వీడియో దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.

UPSC CSE 2024: టాప్ 5లో అమ్మాయిలదే హవా
యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో అమ్మాయిలు మెరిశారు. టాప్-5 ర్యాంకుల్లో మూడు ర్యాంకులు సాధించి మరోసారి శభాష్ అనిపించారు. సివిల్స్ ఫలితాల్లో శక్తి దూబే తొలి ర్యాంకు సాధించగా, హర్షిత గోయల్ రెండో ర్యాంకును కైవసం చేసుకుంది. షా మార్గి చిరాగ్ నాలుగో ర్యాంకును సొంతం చేసుకున్నారు. అయితే టాప్ 5 ర్యాంకులు సాధించిన అభ్యర్థుల గురించి ఒకసారి పరిశీలిద్దాంశక్తి దూబే.. అలహాబాద్ యూనివర్శిటీ నుంచి బయో కెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇక సివిల్స్ మెయిన్స్ పరీక్షకు వచ్చేసరికి ఆమె పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషన్ రిలేషన్స్ సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంచుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ కు చెందిన వారు శక్తి దూబే. 2018 నుంచి సివిల్స్ కు ప్రిపేర్ అయిన ఆమె.. తొలి ర్యాంకును ఒడిసి పట్టి రాష్ట్రానికి వన్నె తెచ్చారు.హర్షిత్ గోయల్.. ఎంఎస్ యూనివర్శిటీ ఆఫ్ బరోడా నుంచి బీకామ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. హర్షిత సైతం పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ను ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారు. హర్యానాకు చెందిన హర్షిత.. గుజరాత్‌లోని వడోదరలో పెరిగారు.హర్షిత వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్.తలసేమియా మరియు క్యాన్సర్‌తో పోరాడుతున్న పిల్లలకు మద్దతు ఇచ్చే బిలీఫ్ ఫౌండేషన్‌తో ఆమె తనవంతు సాయం చేస్తున్నారు.అర్చిత్ పరాగ్వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT) నుండి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అతను తత్వశాస్త్రాన్ని తన ఆప్షనల్ సబ్జెకుగా ఎంచుకున్నారు. గత సంవత్సరం అర్పిత్ పరాగ్.. AIR 153 సాధించడంతో యూపీఎస్సీ ప్రయాణం ఆరంభమైంది.ప్రయాణం ప్రారంభమైంది.మార్గీ చిరాగ్ షాగుజరాత్లోని అహ్మదాబాద్‌కు చెందిన మార్గీ చిరాగ్ షా సోషియాలజీని ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకుని 4వ ర్యాంక్ సాధించింది. ఆమె గుజరాత్ టెక్నలాజికల్ యూనివర్సిటీ నుండి కంప్యూటర్ ఇంజనీరింగ్‌లోగ్రాడ్యుయేషన్ చేశారు.ఆకాష్ గార్గ్ఢిల్లీకి చెందిన ఆకాష్ గార్గ్ ఐదో ర్యాంకును సాధించారు. ఆకాష్ గార్గ్.. ఢిల్లీలోని గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశారు. సోషియాలజీని ఆప్షనల్ సబ్జెట్‌గా ఎంచుకున్నారు.అమ్మాయిలదే ఆధిపత్యంయూపీఎస్సీ లో టాప్‌లో నిలిచిన జాబితాను పరిశీలిస్తే.. గత నాలుగేళ్లలో చూస్తే మూడేళ్లు అమ్మాయిలదే ఆధిపత్యం కనబడింది. 2024, 2022, 2021 సంవత్సర పలితాల్లో అమ్మాయిలు ఫస్ట్ ర్యాంకులను తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుత 2024 ఫలితాల్లో శక్తి దూబే ప్రథమస్థానంలో నిలవగా, 2022లోఇషితా కిషోర్ టాపర్‌గా నిలిచింది. ఇక 2021లో శృతి శర్మ ఫస్ట్ ర్యాంకును కైవసం చేసుకుంది.
ఎన్ఆర్ఐ

పిట్స్‌బర్గ్‌లో నాట్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
అమెరికాలో తెలుగు వారిని కలిపే అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా పిట్స్బర్గ్ లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ నిర్వహించిన ఉగాది వేడుకలకు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన లభించింది. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో పాటు, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీత గీతాలు, నాటక ప్రదర్శనలు, తదితర వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంస్కృతి డాన్స్ స్కూల్ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఉగాది వేడుకల్లో భాగంగానే తెలుగు శ్లోక, తెలుగు వచనం, గణితం, చిత్రలేఖనం, లెగో డిజైన్, చెస్ పోటీలు పిల్లల కోసం నిర్వహించగా, ప్రత్యేకంగా విజేతలకు బహుమతులు అందించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన పిల్లలకు ప్రత్యేకంగా గుర్తింపు, పురస్కారాలను అందజేశారు. ఈ పోటీలు పిల్లలలో సృజనాత్మకతను, విజ్ఞానాన్ని, పోటీ భావనను పెంపొందించేందుకు ఒక గొప్ప వేదికగా నిలిచాయి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ కోఆర్డినేటర్ రవి కొండపి, నాట్స్ వెబ్ సెక్రటరీ రవికిరణ్ తుమ్మల కీలక పాత్ర పోషించారు. వారి నాయకత్వం, అంకితభావం వల్లే ఈ వేడుకలు దిగ్విజయంగా జరిగాయని స్థానిక తెలుగు వారి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ వేడుకలకు వ్యాఖ్యాతలుగా శిల్పా శెట్టి, అర్చనా కొండపి, మోనికాలు వ్యవహారించారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన సంస్కృతి డ్యాన్స్ స్కూల్‌కి నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. ఇక విందు భోజనాన్ని పిట్స్బర్గ్ తత్వా ఇండియన్ క్యూసిన్ అందింయింది., సంప్రదాయ తెలుగు విందు భోజనంతో అందరి చేత ఆహా అనిపించారు.ఉగాది వేడుకలకు సహకరించిన వారికి, వేడుకల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ పిట్స్ బర్గ్ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తెలుగు వారి కోసం ఉగాది వేడుకలను దిగ్విజయంగా నిర్వహించిన పిట్స్బర్గ్ టీంకి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అందాల బొమ్మ.. ఈ గోదావరి భామ
వీరవాసరం: పుట్టింది పల్లెటూరులో.. పెరిగింది పట్నంలో.. ఆపై ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన తెలుగమ్మాయి అక్కడ అందాల పోటీల్లో ఫైనల్‌కు చేరింది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామ శివారు నడపనవారి పాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాంబాబు కుమార్తె కొత్తపల్లి చూర్ణిక ప్రియ (Churnika Priya Kothapalli). అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఆమె తెలుగు సంఘం ఆధ్వర్యంలో డల్లాస్‌లో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025 పోటీల్లో పాల్గొంది. సుమారు 5 వేల మంది పాల్గొన్న పోటీల్లో ఆమె సత్తాచాటి ఫైనల్–20 జాబితాలో చోటు సంపాదించింది. గోదావరి (Godavari) కీర్తిని చాటింది.అమెరికాలోని డల్లాస్ (Dallas) ఐర్వింగ్ ఆర్ట్ సెంటర్ వేదికగా వచ్చే మే 25న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీలో గెలుపొందేందుకు ప్రపంచంలోని తెలుగు ప్రజల ఓట్లే కీలకం. అమెరికాలోని తెలుగు యువతులకు మాత్రమే పరిమితమైన ఈ పోటీల్లో చూర్ణిక ప్రియ అద్భుతమైన ప్రతిభను చాటుతుండటం విశేషం. బీటెక్ పూర్తి చేసిన ఈమె క్లాసికల్ డ్యాన్సర్ గానూ ప్రతిభ చాటింది.చదవండి: టాలెంట్‌ను ట్రంప్ కూడా ఆపలేడు

స్కాట్లాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
స్కాట్లాండ్లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (TAS) ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించారు. ఇవి తెలుగు సంస్కృతిక ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచాయి. ఈ ఉగాది సంబరాలు స్కాట్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న మిడ్లాథియన్‌లోని డాల్కీత్ స్కూల్ కమ్యూనిటీ వద్ద నిర్వహించారు.శ్రీ విశ్వావసు నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సంఘం ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కాట్లాండ్లో ఉన్న వందలాది తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆకర్షణగా నిలిచారు. వందకి పైగా కళాకారులు తమ ప్రతిభ, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుక ప్రస్తుత, మాజీ కమిటీ సభ్యులతో జ్యోతి ప్రజ్వలన మొదలవ్వగా, అనంతరం “మా తెలుగు తల్లికి” గేయంతో సాంస్కృతిక కార్యక్రమంతో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా భారత కాన్సులేట్ అధికారి ఆజాద్ సింగ్, లోథియన్ ప్రాంతానికి చెందిన MSP ఫోయిల్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని, ఇతర సంఘాల ప్రతినిధులను చైర్మన్ శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, హానరరీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి తదితరులు ఘనంగా సత్కరించారు.. సాంస్కృతిక కార్యదర్శి పండరి జైన్ కుమార్ పొలిశెట్టి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కళాకారులు, ప్రేక్షకులు, స్పాన్సర్లు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య ఆకర్షణగా “మనబడి” పిల్లలు ప్రదర్శించిన “పరమానందయ్య శిష్యుల కథ” నాటకం, భాషా నేర్పరితో పాటు సాంస్కృతిక విలువలను చక్కగా చాటింది. ఈ ఉగాది సంబరాలు 2025 తెలుగు వారసత్వాన్ని ముందుకెళ్లలా, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా నిర్వహించడం తోపాటు.. TAS సంఘం ఐక్యత, సేవా ధోరణిని ప్రతిబింభించేలా నిలిచాయి.(చదవండి: న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు)

న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు
ఆక్లాండ్ నగరంలో తెలంగాణా అసోసియేషన్ అఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సంవత్సరాది విశ్వవాసు సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలను నిర్వహించుకున్నారుఈ కార్యక్రమం లో తెలుగుతనం, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పంచాంగ శ్రవణంతో రాశి ఫలితాలను స్థితిగతులను విని ఆనందించారు. ఆ తర్వాత చిన్నారులు పెద్దలు వివిధ తెలుగు సాంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించడమే కాకుండా సాంప్రదాయ పిండి వంటలతో సామూహిక భోజనాలు చేశారు. కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన టే అటటు డెంటల్ క్లినిక్ మోనిక శ్రీకాంత్ తోపాటు సామజికసేవాలో ముందున్న తెలుగు ప్రతినిధులను ఉగాది పురస్కారాలతో గౌరవంగా సన్మానించుకోవడం తోపాటు చిన్నారులకు నృత్యకారులకు బహుమతులని అందజేయడం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ అద్యేక్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త శివ కిలారి, రవి సంకర్ అల్ల, సత్యనారాయణ తట్టల, అసోసియేషన్ మాజీ అధ్యక్షలు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, మేకల ప్రసన్న కుమార్,శైలందర్ రెడ్డి, విశ్వనాధు బాల, విజేత యాచమనేని, మధు ఎర్ర, శైలజ బాలకుల్ల, లింగం గుండెల్లి, శశికాంత్ గున్నాల, కావ్య, వర్ష పట్లోళ్ల, మేకల స్వాతి,కిరణ్మయి, విశ్వనాథ్ అవిటి, సలీం, ప్రమోద్, విజయ్ శ్రీరామ్, చంద్రకిరణ్,రమేష్ రామిండ్ల, మనోహర్ కన్నం, హరీష్, రమేష్ ఆడెపు, పవన్, అనిల్ మెరుగు తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.(చదవండి: హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు)
క్రైమ్

హత్యాయత్నం నిజమా.. నాటకమా?
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): మాజీ మాఫియా డాన్ దివంగత ముత్తప్ప రై చిన్న కుమారుడు రిక్కీ రై పై కాల్పులు జరిగిన కేసులో బిడది పోలీసులు అతని గన్‌మ్యాన్ మన్నప్ప విఠల్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రిక్కీ రై తానే కాల్చుకుని హత్యాయత్నం డ్రామా ఆడుతున్నాడని పోలీసులు తాజాగా అనుమానిస్తున్నారు. రిక్కీ రైకి ఉన్న ముగ్గురు గన్ మ్యాన్లు ఒక్కొక్కరు ఒక్కో వాంగ్మూలం ఇస్తుండడంతో పోలీసుల అనుమానాలు బలపడుతున్నాయి. తన పిన్ని అనురాధ, రాకేశ్ మల్లి, మరో ఇద్దరిపై ఆరోపణలు చేసి రిక్కీ కేసును పక్కదారి పట్టిస్తున్నారా అని సందేహిస్తున్నారు. కాల్పులు జరగడానికి ముందు కుక్కలు అరవడంతో గాల్లోకి కాల్పులు జరిపామని గన్ మ్యాన్లు చెప్పిన మాటల్లో నిజం లేదని గుర్తించారు. హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేశ్ మల్లి తన లాయర్లతో కలిసి రామనగర ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. ఎస్పీ శ్రీనివాసగౌడ అతనిని విచారించారు. పిన్ని అనురాధకు ఊరట ఈ కేసులో ఏ2గా ఉన్న రిక్కి రై పిన్ని అనురాధకు హైకోర్టులో ఊరట దక్కింది. కేసులో నుంచి తన పేరు తొలగించాలని ఆమె హైకోర్టును ఆశ్రయించగా, ఆమెపై తొందరపాటు చర్యలు, బలవంతపు చర్యలు తీసుకోరాదని కోర్టు పోలీసులను ఆదేశించింది. అనురాధకు 14వ తేదీన యూరోప్‌కు వెళ్లిపోయిందని, 6 నెలల క్రితమే ఆస్తి గొడవలపై రాజీ చేసుకున్నారని ఆమె లాయర్ వాదించారు. నాపై హత్యాయత్నం చేసింది పిన్ని అనురాధ..?

వివాహేతర సంబంధం: భార్యను పోలీసులకు అప్పగించిన భర్త
వరంగల్ క్రైం : తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతోపాటు తనను గతంలో సస్పెండ్ చేయించాడనే కోపంతో సామాజిక కార్యకర్త ఛిడం సాయి ప్రకాశ్‌ను హత్య చేసిన కేసులో ఓ కానిస్టేబుల్‌తో సహా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లా వెంకటాçపురం(ఎం) పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న బాషబోయిన శ్రీనివాస్ గతంలో వెంకటాçపురం(కె) పోలీస్ స్టేషన్లో విధులు నిర్వరిస్తున్న క్రమంలో ఓ భూమి విషయంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన చింతం నిర్మలతో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆ విషయంపై నిర్మల భర్తతో కలిసి మృతుడు సాయి ప్రకాశ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్‌ను సస్పెన్షన్ చేశారు. ఫోన్ సమాచారంతో కిడ్నాప్.. హత్యఈనెల 15వ తేదీన నిందితురాలు నిర్మల, ఆమె భర్తతో కలిసి మృతుడు సాయిప్రకాశ్ తన కారులో ఆస్పత్రికి వచ్చారు. ఈ విషయన్ని నిర్మల.. నిందితుడు శ్రీనివాస్‌కు ఫోన్లో తెలియజేయడంతో ప్రణాళిక ప్రకారం కారును వెంబడించి రాత్రి 11.30 గంటల సమయంలో గోపాల్‌పూర్‌లోని బేబిసైనిక్ స్కూల్ వద్ద కారును ఆటోతో ఢీకొట్టించాడు. అనంతరం సాయి ప్రకాశ్‌ను కారులోనే కిడ్నాప్ చేసి హసన్‌పర్తి పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి శాలువతో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని హుస్నాబాద్ పీఎస్ పరిదిలోని జిల్లేడగడ్డ తండా గ్రామ శివారులోని ఓ బావి లో పడేశారు. అనంతరం వేలేరు మండలం మీదుగా హనుమకొండ ఏషియాన్ మాల్ దగ్గర కారు నిలిపి వేసి వెళ్లారు. నిందితుల అరెస్ట్..ప్రధాన నిందితుడు కానిస్టేబుల్ బాషబోయిన శ్రీనివాస్‌తో పాటు ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన డేవిలిసాయి, హనుమకొండకు చెందిన అలోతు అరుణ్‌కుమార్ అలియాస్ పండు, బాదావత్ అఖిల్ నాయక్, బాదావత్ రాజు, వాజేడు వెంకటాపూర్‌కు చెందిన చింతం నిర్మలను అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. నిందితుల నుంచి హత్యకు వినియోగించిన ఓ కారు, రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ఫోన్లు, పిస్టోల్‌ను స్వా«ధీనం చేసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు. అధికారులకు అభినందనలు..సామాజిక కార్యకర్త సాయి ప్రకాశ్ హత్య కేసును వేగంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్, హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్‌రెడ్డి, హనుమకొండ ఇన్స్పెక్టర్ సతీశ్, సిబ్బందిని సీపీ సన్‌ప్రీత్‌సింగ్ అభినందించారు.

పని వారి విషయంలో నిలువెల్లా నిర్లక్ష్యమే!
హైదరాబాద్: నారాయణగూడ పోలీసుస్టేషన్ పరిధిలో నివసించే కేడియా ఆయిల్స్ కంపెనీ యజమాని రోహిత్ కేడియా ఇంట్లో ఈ ఏడాది ఫిబ్రవరి 11న భారీ చోరీ జరిగింది. బీహార్, పశ్చిమ బెంగాల్ లకు చెందిన ముగ్గురు నిందితులు దాదాపు రూ.40 కోట్ల విలువైన సొత్తు దోచుకుపోయారు. వీరిని అరెస్టు చేసిన సందర్భంలో పోలీసులు పని వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని పదేపదే సూచించారు. ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోని కాచిగూడ వాసి, పారిశ్రామిక వేత్త హేమ్ రాజ్ కుటుంబం నేపాలీలను ఎలాంటి ఆధారాలు లేకుండా పనిలో పెట్టుకుంది. ఫలితం... ఆదివారం రాత్రి రూ.2 కోట్ల సొత్తుతో ఆ నేపాలీలు ఉడాయించారు. ఈ కేసును ఈస్ట్‌జోన్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలో దింపిన డీసీపీ డాక్టర్ బి.బాలస్వామి కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పథకం ప్రకారం పనిలో చేరిన నేపాలీలు... కాచిగూడ లింగంపల్లి అమ్మవారి దేవాలయం సమీపంలో హేమ్ రాజ్ తన భార్య మీనా దుగ్గర్, కుమారుడు, కోడలు, మనుమళ్లతో కలిసి ఉంటున్నారు. కొన్నాళ్లుగా వీరి వద్ద నేపాల్‌కు చెందిన ఓ మహిళ పని చేస్తోంది. ఆ ఇంటి వ్యవహారాలు పూర్తిగా తెలిసిన ఆమె అదును చూసుకుని కొల్లగొట్టాలని పథకం వేసింది. త్వరలో తాను పని మానేసి తన స్వదేశానికి వెళ్లిపోతానంటూ ఇటీవల ఆ మహిళ చెప్పింది. తన స్థానంలో పని చేయడానికి తమ దేశం నుంచే వచి్చన మరో మహిళ సిద్ధంగా ఉందని దాదాపు నెల రోజుల క్రితం చేర్చింది. హేమ్రాజ్ ఇంట్లో ప్రస్తుతం రెన్నోవేషన్ పని నడుస్తోంది. దీంతో ఆ పనిలో సహకరించడానికి, ఇంటిని శుభ్రం చేయడానికి మరో మనిషి కావాలంటూ పది రోజుల క్రితం కొత్త పని మనిషికి చెప్పారు. ఆ పని చేయడానికి తన పరిచయస్తుడు ఉన్నాడని చెప్పిన ఈ కొత్త పనిమనిషి మరో నేపాలీని ఆ ఇంటికి తీసుకువచ్చింది. నేపాలీలు అంతా కలిసి అదును చూసుకుని... ఇలా కొత్తగా పనిలో చేరిన ఇద్దరి ఫొటోలు, వివరాలను హేమ్ రాజ్ కుటుంబం తీసుకోలేదు. కనీసం వాళ్లు చెప్పిన పేర్లు నిజమా? కాదా? అనేది పరిశీలించలేదు. వేసవి సెలవుల నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం హేమ్రాజ్ కుమారుడి కుటుంబం విదేశాలకు వెళ్లింది. వృద్ధ దంపతులే ఇంట్లో ఉండటంతో ఆ ఇంటిని కొల్లగొట్టడానికి ఇదే సరైన సమయమని ఇరువురు నేపాలీలు నిర్ణయించుకున్నారు. ఆదివారం రాత్రి వృద్ధ దంపతుల ఆహారంలో మత్తుమందు కలిపారు. వీళ్లు మత్తులో ఉండగా... అల్మారాలు, లాకర్లు పగులకొట్టిన నేపాలీ ద్వయం బంగారం, వజ్రాభరణాలు, నగదుతో సహా మొత్తం రూ.2 కోట్ల విలువైన సొత్తు కాజేశారు. ఇంటిని బయట నుంచి తాళం వేసి యజమాని కారులోనే సంతో‹Ùనగర్ వరకు వెళ్లిన ఇరువురూ వాహనం అక్కడ వదిలేశారు. ఆపై ఆటోలో శంషాబాద్ వైపు ఉడాయించారు. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో వచ్చిన ఫాల్స్ సీలింగ్ వర్కర్లు ఎంత పిలిచినా యజమానల నుంచి స్పందన లేకపోవడంతో సమీపంలో ఉండే బంధువులకు సమాచారం ఇచ్చారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లిన ప్రత్యేక బృందాలు... ఈ నేరంపై పోలీసులకు సోమవారం మధ్యాహ్నం సమాచారం అందింది. ఈస్ట్‌జోన్ డీసీపీ డాక్టర్ బి.బాలస్వామి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. యజమానుల దగ్గర నేపాలీల పేర్లు తప్ప వారి వివరాలు, చిరునామాలు, ఫొటోలు లేకపోవడం దర్యాప్తును సంక్లిష్టం చేసింది. పాత పనిమనిíÙతో పాటు కొత్త పని వాళ్లు ఇద్దరి ఆచూకీ కోసం రాష్ట్రం చుట్టపక్కల ఉన్న సాధారణ, రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మూడు ప్రత్యేక బృందాలు ఉత్తరాదిలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లాయి. నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ఇమ్మిగ్రేషన్ చెక్పోస్టునూ అప్రమత్తం చేశారు. శంషాబాద్ నుంచి నేపాలీలు ఎటు వెళ్లారనేది గుర్తించడానికి వివిధ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. అఫ్జల్‌గంజ్ ఫైరింగ్ కేసు అనుభవం నేపథ్యంలో ఈ నేరగాళ్లు దేశం దాటకముందే పట్టుకోవాలనే లక్ష్యంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

అంతా చేసి..భర్త కన్పించలేదంటూ ఫిర్యాదు
కేపీహెచ్‌బీ కాలనీ(హైదరాబాద్): కూతురు పెళ్లి విషయంలో తలదూర్చవద్దని, ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించిన భర్తను కరెంటు షాక్ పెట్టి హత్య చేసిన కేసులో భార్యతో పాటు సహకరించిన మరో ఇద్దరిని కేపీహెచ్‌బీ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డిలు హత్య కేసు వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా లింగాయపల్లికి చెందిన సాయిలును భార్య కవిత గత శుక్రవారం రాత్రి పథకం ప్రకారం విద్యుత్ షాక్ ఇచ్చి హత్య చేసిన విషయం విదితమే. ఈ కేసులో కవితకు సహకరించిన సోదరి జ్యోతి, ఆమె భర్త మల్లేష్‌లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా నిందితులు మృతదేహాన్ని గుర్తు పట్టకుండా కవర్లో చుట్టి ఆటోలో తరలించి జోగిపేట వద్ద పూడ్చి పెట్టేందుకు యత్నంచగా ఆటో డ్రైవర్ నిలదీయడంతో తిరిగి వారు నివాసం ఉంటున్న మిత్ర హిల్స్‌కు చేరుకొని అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో పూడ్చి పెట్టారు. అనంతరం ఆటో డ్రైవర్ ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. పూడ్చి పెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుట్టు రట్టు చేసిన ఆటో డ్రైవర్... కవర్లో మూటకట్టిన మృతదేహాన్ని చెత్త కుప్పగా నమ్మించి సంగారెడ్డి చెరువులో పడవేసేందుకు ఆటోను మాట్లాడుకొని శనివారం రాత్రి బయలుదేరి వెళ్లగా నిర్మానుష్య ప్రాంతంలో పూడ్చిపెట్టేందుకు యతి్నస్తున్న విషయాన్ని ఆటోడ్రైవర్ వలీనాయక్ కనిపెట్టాడు. అనుమానం వచ్చి కవితను గట్టిగా నిలదీశాడు. దీంతో ఆమె తిరిగి తమను ఎక్కడ ఎక్కించుకున్నావో అక్కడే దించాలని చెప్పడంతో మిత్రహిల్స్ వద్ద దించాడు. అప్పటికే కవర్లో మూటగట్టిన మృతదేహం వాసన రావడంతో అనుమానం వచి్చన ఆటోడ్రైవర్ వలీనాయక్ మరుసటి రోజు కేపీహెచ్‌బీ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డిని కలిసి విషయం చెప్పాడు. దీంతో హత్య కేసు గుట్టు రట్టయింది. ధైర్యంగా ముందుకు వచ్చి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పిన వలీనాయక్ను పోలీస్ అధికారులు అభినందించారు.
వీడియోలు


పేదల ఇళ్లు కూల్చుతారా? ఎమ్మెల్యే రఘురామ రాజుకి వార్నింగ్


నువ్వు రాజువి కాదు రాక్షసుడివి.. రఘురామ రాజుపై మండిపడ్డ మహిళలు


వారి పదవులు పోవడం ఖాయం.. విప్ ధిక్కరించిన వారిపై YSRCP ఫిర్యాదు


పహల్గామ్ ఉగ్రదాడి స్పాట్ కు అమిత్ షా.. ఉగ్రవాదులకు గట్టి హెచ్చరిక


పహల్గామ్ దాడి వెనుక సూత్రధారి సైఫుల్లా సాజిద్


ప్రవస్తి కాంట్రవర్సీపై స్పందించిన లిప్సిక ..!


ఎలిమినేట్ అయినందుకే ఆరోపణలు చేస్తున్నారా..?


పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర


సాక్షి కార్యాలయం వద్ద చింతమనేని హల్ చల్ .. కంప్యూటర్లు ధ్వంసం


పాకిస్తాన్ కు బుద్ది చెప్పండి! మోదీకి.. ట్రంప్, పుతిన్ ఫుల్ సపోర్ట్