
లస్సీ.. ఇష్టంగా తాగుతా
లస్సీ అంటే చాలా ఇష్టం. వేసవి కాలంలో లస్సీని ఎక్కువగా తాగుతా. ఎండలో తిరిగే సమయంలో లస్సీ తాగడం శరీరానికి చల్లటి ఉపశమనం లభి స్తుంది. ధర కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. – సాయికుమార్, మహబూబ్‌నగర్
హైదరాబాద్ తరహాలో తయారు..
18 ఏళ్ల నుంచి క్లాక్‌టవర్‌లో ‘హైదరాబాద్ ఫలుదా సెంటర్’ నడుపుతున్నాను. హైదరాబాద్‌లో తరహాలో ఫలుదా తయారు చేస్తున్న. దీంతో ఫలుదా తాగడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. లస్సీని కూడా ప్రత్యేకంగా తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నాం. జిల్లాకేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చి ఫలుదా ఇష్టంగా ఆరగిస్తున్నారు.
– మహ్మద్ షబ్బీర్‌అలీ, ఫలుదా, లస్సీ సెంటర్, మహబూబ్‌నగర్
సొంత పొలం నుంచే..
20 ఏళ్ల నుంచి జిల్లా కేంద్రంలో చెరుకు రసం కేంద్రాన్ని నడుపుతున్నాం. మా సొంత పొలంలో పండించిన చెరుకు గడలనే వాడుతున్నాం. 0వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఆరోగ్యపరంగా లాభాలు ఉన్న చెరుకు రసాన్ని వేసవితో సంబంధం లేకుండా ఏడాది పొడువునా సెంటర్‌ను నడుపుతున్నాం.
– లక్ష్మణ్‌నాయక్, మహబూబ్‌నగర్

లస్సీ.. ఇష్టంగా తాగుతా

లస్సీ.. ఇష్టంగా తాగుతా