
ఫ్రిజ్‌లకు గిరాకీ
వేసవిలో ఇంట్లో అడుగుపెట్టే చల్లని నేస్తం ఫ్రిజ్. కూల్‌వాటర్‌తో పాటు వేసవిలో తిండిపదార్థాలు చెడిపోకుండా ఉండడానికి ఇది చాలా అవసరం. ఈ నేపథ్యంలో పలువురు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇన్వెర్టర్లపైనా నడిచే ఫ్రిజ్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. రూ.12,500 నుంచి రూ.30 వేల వరకు ధరలు అందుబాటులో ఉన్నాయి. సింగిల్, డబుల్, త్రిపుల్ డోర్ ఫ్రిజ్‌లు కొనుగోలు చేస్తుండగా.. సామాన్య, మధ్య తరగతి ప్రజలు బేసిక్ మోడళ్ల ఫ్రిజ్‌లు తీసుకుంటుండటంతో వ్యాపారం ఊపందుకుంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 100 వరకు ఫ్రిజ్‌ల షాపులు ఉండగా ఈ వేసవి సీజన్‌లో రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉంది.
● ఒకప్పుడు టేబుల్ ఫ్యాన్లు, ఆ తర్వాత సీలింగ్ ఫ్యాన్ల హవా నడిచింది. ఇప్పుడు కూలర్లు, ఏసీల గాలి వీస్తోంది. ఒకప్పుడు ఉన్నత, మధ్య తరగతి ఇళ్లకే పరిమితమైన కూలర్లు ఇప్పుడు తక్కువ ధర, చిన్న సైజుల్లోనూ లభిస్తుండడంతో అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. లోకల్‌మేడ్ కాకుండా బ్రాండెడ్ కూలర్లు సైతంలో మార్కెట్లో ఉన్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేసవిలో రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల మేర వీటి వ్యాపారం నడుస్తుంది.