
అలంపూర్ ఆలయాల్లో చండీహోమాలు..
అలంపూర్: ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని అలంపూర్ ఆలయాలకు వివిధ ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చారు. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి ఆలయంలో నిర్వహించిన చండీ హోమంలో 288 మంది భక్తులు పాల్గొన్నట్లు ఈఓ పురందర్కుమార్ తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. భక్తులకు అన్నదాన సత్రంలో అన్నప్రసాదం అందజేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి వసతి కల్పించారు.