
పోలీస్ గ్రీవెన్స్‌కు10 అర్జీలు
మహబూబ్‌నగర్ క్రైం: ఎంతో నమ్మకంతో న్యాయం కోసం వచ్చే ప్రజల ఫిర్యాదులపై సమగ్రంగా విచారణ చేపట్టి, త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ జానకి అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 10 మంది బాధితుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ శాంతిభద్రతల పరిరక్షణను ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తుందని, ప్రజలు పోలీసులపై పూర్తి నమ్మకం ఉంచాలని కోరారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు, గంజాయి విక్రయం లేదా రవాణా వంటి ఘటనలు గమనించిన వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూం నం.87126 59360, డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
నేడు జిల్లాకేంద్రంలో
విద్యుత్ అంతరాయం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాకేంద్రంలోని ప్రధాన లైన్ 132/33 కేవీ మహబూబ్‌నగర్ సబ్‌స్టేషన్‌లో మరమ్మతు కారణంగా మంగళవారం పట్టణంలో విద్యుత్ సరఫరా ఉండదని ఆ శాఖ పట్టణ ఏడీ తౌర్యానాయక్ సోమవారం ఒక ప్రకనటలో తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం 7 నుంచి 8 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు. దీని కారణంగా పట్టణం– 1, 2 పరిధి మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, ఈ అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రతి కళాశాలలో మాదక ద్రవ్యాల వాడకం నిరోధించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ కృష్ణ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యాంటీ డ్రగ్ కమిటీ ప్రతి కళాశాలలో విద్యార్థులను పర్యవేక్షించాలని, కళాశాలలో డ్రగ్స్, మత్తు పదార్థాల బారిన పడిన వారిని గుర్తించాలని, విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వారానికి రెండు కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా మత్తు పదార్థాల బారినపడితే టోల్ ఫ్రీ నంబర్ 1908కు సమాచారం అందించాలని, వివరాలు అందించిన వారి గురించి గోప్యంగా ఉంచుతామన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. అనంతరం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ బుచ్చయ్య, డీసీఆర్‌బీ డీఎస్పీ వెంకటరమణారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జ్ డీఐఈఓ రామలింగం, ప్రభుత్వ మెడికల్ కళాశాల డైరెక్టర్ రాజ్‌కుమార్, జిల్లా వెల్ఫేర్ అధికారి జరీనాబేగం తదితరులు పాల్గొన్నారు.