
మహిళలకు చక్కటి ఉపాధి..
●
మన్నెగూడలో
విక్రయిస్తా..
తాటి ముంజలను వేరే వారి వద్ద పెద్దమొత్తంలో కొనుగోలు చేసి స్థానికంగా, పరిగి సమీపంలోని మన్నెగూడలో విక్రయిస్తా. అన్నీ ఖర్చులు పోను రోజు రూ.రెండు వేల వరకు వస్తున్నాయి. దాదాపు రెండు నెలల పాటు ఉపాధి లభిస్తుంది.
– రాములు, చిన్నవార్వాల్, గండేడ్
సాగు పనులతోపాటు..
ఏటా అంతారం గ్రామానికి వెళ్లి తాటి ముంజలు కొనుగోలు చేస్తాం. గతంలో రూ.300కు 100 ముంజలు ఇచ్చేవారు.. ప్రస్తుతం రూ.500 నుంచి రూ.600 వరకు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. వీటిని కోస్గి తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకుంటాం. వేసవిలో ముంజల విక్రయంతో ఉపాధి లభిస్తున్నది. వ్యవసాయం చేస్తూనే తాటి ముంజలు అమ్ముతా. – మంజుల,
గుండుమాల్, నారాయణపేట
తాటి ముంజల విక్రయంతో ఈ ప్రాంతంలోని వందలాది మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఎండకాలం రెండు నెలలు మాత్రమే సీజన్ ఉండటంతో మగవారు గెలలు కోసిస్తే మహిళలు ఓపికగా కూర్చొని విక్రయిస్తుంటారు. కొందరు సొంత పొలాల్లో ఉన్న చెట్ల నుంచి తీసిన ముంజలు విక్రయించి ఉపాధి పొందుతుండగా.. మరికొందరు కొనుగోలు చేసి రహదారుల పక్కన, గ్రామాల్లో తిరుగుతూ అమ్ముతున్నారు. 12 తాటి ముంజలు రూ.100కు విక్రయిస్తుండగా.. ఈ సీజన్‌లో రోజు రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేలకుపైగా సంపాదిస్తున్నారు. సొంత చెట్లు ఉన్నవారైతే మరింత లాభమే గడిస్తున్నారు.
వేసవిలో
చల్లగా..!
జోరుగా తాటి ముంజల విక్రయాలు
● గండేడ్, కుల్కచర్ల ప్రాంతాల్లో అధికం
● కిడ్నీ వ్యాధులకు మేలంటున్న వైద్యులు
● గ్రామీణ మహిళలకు ఉపాధి
గండేడ్: మండు వేసవిలో ఉపాధి అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్న సమయంలో పల్లెల్లో తాటి ముంజల విక్రయాలు మహిళలకు ఆసరాగా నిలుస్తున్నాయి. వీటిని గ్రామాల్లో విక్రయించడంతో పాటు పట్టణాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. తాటి ముంజలు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్యులు సూచిస్తున్నారు. ఓ వైపు ఆరోగ్యం.. మరోవైపు ఉపాధి కల్పిస్తూ ఆరోగ్య ప్రదాయినిగా నిలుస్తుంది. గండేడ్ మండలంతో పాటు పక్కనే ఉన్న కుల్కచర్ల మండలంలోని రుసుంపల్లి, చిన్నవార్వాల్, పుట్టపహాడ్, అంతారం, ఘనాపూర్ తదితర గ్రామాల్లో తాటి చెట్ల అధికంగా ఉన్నాయి. పొద్దుపొద్దునే నోరూరించే తాటి కల్లుతో పాటు ముంజలు ఇక్కడ లభిస్తాయి. ఒక్కో చెట్టుకు వెయ్యి నుంచి 1,500 వరకు తాటి ముంజలు పండుతాయి.
పట్టణాలకు తరలిస్తూ..
ఇక్కడి ముంజలను ఏటా గంపల కొద్ది హైదరాబాద్, ముంబైకి బస్సులు, రైళ్లలో తీసుకెళ్లి అక్కడ విక్రయిస్తున్నారు. 100 తాటిముంజలను స్థానికంగా రూ.450 నుంచి రూ.500 వరకు విక్రయిస్తుండగా.. అక్కడి వ్యాపారులు మాత్రం రెండు మూడింతలు ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటారు. అలాగే వికారాబాద్ జిల్లా తాండూరు, కొడంగల్, పరిగి, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని మహబూబ్‌నగర్, హన్వాడ, నారాయణపేట జిల్లాలోని గుండుమాల్, కోస్గి తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. ప్రధాన కూడళ్లల్లో ఎక్కడ చూసినా తాటిముంజలే దర్శనమిస్తాయి.

మహిళలకు చక్కటి ఉపాధి..

మహిళలకు చక్కటి ఉపాధి..

మహిళలకు చక్కటి ఉపాధి..

మహిళలకు చక్కటి ఉపాధి..