
షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
నవాబుపేట: షార్ట్ సర్క్యూతో ఇల్లు దగ్ధమైన సంఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని చాకలపల్లి గ్రామంలో హరిజన మల్కమ్మ ఆదివారం మధ్యాహ్న సమయంలో ఇంట్లో నుంచి బయటికి వచ్చింది. అనంతరం ఒక్కసారిగా ఇంట్లో మంటలు రావటంతో భయబ్రాంతులకు గురైంది. దీంతో గ్రామస్తులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసేలోపు ఇల్లు దగ్ధమైంది. ఇంట్లో దాచుకున్న కూలీ డబ్బులు కాలిబూడిదయ్యాయి. వాటితో పాటు నిత్యవసర సరు కులు సైతం కాలిపోవటంతో ఆమె బోరు న విలపించింది. ఈ విషయంలో బాధితురాలిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
జడ్చర్ల: జడ్చర్ల పట్టణంలో భారీ చోరీ జరిగింది. సీఐ కమలాకర్ వివరాల మేరకు.. 9వ వార్డులోని అశోక్‌నగర్–3లో నివాసం ఉంటున్న శ్రీనివాసమూర్తి శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి తాళంవేసి.. ఉద్యోగ నిర్వహణకు నాగాపూర్ వెళ్తున్న తన కూతురికి హైదరాబాద్‌లో సెండాఫ్ ఇచ్చేందుకు వెళ్లారు. కూతురిని బస్సు ఎక్కించిన అనంతరం అర్ధరాత్రి తిరిగి ఇంటికి చేరుకున్నారు. అయితే ఇంటి తాళాలు విరగొట్టి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి లోపలికి వెళ్లి చూడగా.. బీరువా తాళాలు విరగొట్టి ఉన్నాయి. అందులో దాచిన 12 తులాల బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఇంట్లో వస్తువులను చిందర వందర చేశారు. క్లూస్ టీంకు సాంకేతిక ఆధారాలు దొరకకూడదన్న కారణంతో మిర్చి పౌండర్ చల్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఆలయంలో
వెండి తొడుగు చోరీ
ఇటిక్యాల: ఆలయంలో వెండి తొడుగు చోరీకి గురైన సంఘటన మండల పరిధిలోని సాతర్లలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయంలోకి శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి సుమారు మూడున్నర కిలోల వెండి తొడుగును అపహరించుకుపోయారు. దీని విలువ సుమారు రూ.4లక్షల వరకు ఉంటుంది. ఈ సంఘటనపై ఇటిక్యాల పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు వారు పేర్కొన్నారు.

షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం