
సెగ్మెంట్‌కు 300 వాహనాలు.. 3 వేల మంది జనసమీకరణ
వరంగల్ జిల్లాలో జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు భారీగా పార్టీ శ్రేణులను తరలింపు కోసం ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీ, అలంపూర్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించారు. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు నియోజకవర్గానికి 300 వాహనాల వరకు సిద్ధం చేసి.. సుమారు మూడు వేల మంది కార్యకర్తలను సభకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. రజతోత్సవ సభకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి దాదాపు 50 వేల మందిని తరలించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు.