శ్రీరాంపూర్‌లో 92 శాతం బొగ్గు ఉత్పత్తి | - | Sakshi
Sakshi News home page

శ్రీరాంపూర్‌లో 92 శాతం బొగ్గు ఉత్పత్తి

Published Wed, Apr 2 2025 1:01 AM | Last Updated on Wed, Apr 2 2025 1:01 AM

శ్రీరాంపూర్‌లో 92 శాతం బొగ్గు ఉత్పత్తి

శ్రీరాంపూర్‌లో 92 శాతం బొగ్గు ఉత్పత్తి

శ్రీరాంపూర్‌: సింగరేణి సంస్థ 2024–25 ఆర్థిక సంవత్సరానికి శ్రీరాంపూర్‌ ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యంలో 92 శాతం సాధించినట్లు ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్‌ తెలిపారు. జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. 2024, ఏప్రిల్‌ 1 నుంచి 2025, మార్చి 31 వరకు ఏరియా మొత్తానికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 63.1 లక్షల టన్నులకు 57.86 లక్షల టన్నులు సాధించినట్లు వివరించారు. కేవలం మార్చి నెలలో నిర్దేశించిన ఉత్పత్తిలో 147 శాతం ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనకు కృషి చేసిన ఉద్యోగులు, సూపర్‌వైజర్లు, అధికారులకు అభినందనలు తెలిపారు.

అధికారులతో సమీక్ష..

ఏరియా అధికారులతో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రక్షణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. గత సంవత్సరం జరిగిన బొగ్గు రవాణా, ఇతర రికార్డులపై చర్చించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఏ విధంగా ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలో అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏరియా ఎస్‌ఓటు జీఎం యన్‌.సత్యనారాయణ, ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్ట్‌ అధికారి ఏవీ.రెడ్డి, టి.శ్రీనివాస్‌, ఏజెంట్లు రాజేందర్‌, వెంకటేశ్వర్లు, శ్రీధర్‌, డీజీఎంలు అరవిందరావు, చిరంజీవులు, డిప్యూటీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ రమేశ్‌బాబు, ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు రామకృష్ణారావు, నాగరాజు, సర్వే అధికారి నర్సింగరావు, పర్యావరణ అధికారి హనుమాన్‌గౌడ్‌ పాల్గొన్నారు.

లక్ష్మీ పూజలు..

నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం సందర్భంగా జీఎం కార్యాలయంలోని ఫైనాన్స్‌ డిపార్టుమెంట్‌లో మంగళవారం లక్ష్మీ పూజలు నిర్వహించారు. ఏరియా జీఎం శ్రీనివాస్‌ ఈ పూజల్లో పాల్గొన్నారు. ఈ సంవత్సరం సంస్థ ఆర్థికంగా మరింత ముందుకు పోవాలని ఆకాంక్షించారు. క్వాలిటీ జీఎం సుసంత సాహూతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

డంప్‌యార్డును తరలించాలి

సీసీసీలోని ముక్కిడి పోచమ్మ ఆలయం సమీపంలోని చెత్త డంపు యార్డును అక్కడి నుంచి తరలించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు కోరారు. మంగళవారం ఆ యూనియన్‌ బ్రాంచ్‌ కార్యదర్శి షేక్‌ బాజీసైదా ఆధ్వర్యంలో నాయకులు జీఎం శ్రీనివాస్‌ను కలిసి వినతి పత్రం అందించారు. చెత్త కాల్చడం వలన పొగతో ఆర్కే 5 కాలనీ, బ్యారెక్స్‌, తాళ్లపల్లి సింగపూర్‌ ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీవాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. డంప్‌యార్డును ఇక్కడి నుంచి దూరంగా తరలిచాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో యూనియన్‌ బ్రాంచ్‌ ఉపాధ్యక్షుడు కొట్టే కిషన్‌రావు, జీఎం కమిటీ చర్చల ప్రతినిధులు బద్రి బుచ్చయ్య, గొల్లపల్లి రామచందర్‌, కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ రీజియన్‌ కార్యదర్శి అఫ్రోజ్‌ ఖాన్‌, ఫిట్‌ కార్యదర్శులు ఆకుల లక్ష్మణ్‌, సంఘం సదానందం, గునిగంటి నర్సింగరావు, సందీప్‌, మారుపెల్లి సారయ్య, నవీన్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement