
ఎంపీ సీట్లను తగ్గించేందుకు కుట్ర
రామకృష్ణాపూర్: దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లను తగ్గించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని చె న్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నా రు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి 5వ వార్డు అమరవాదిలో బుధవారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా పెట్రోల్, గ్యాస్ ధరలు మన దేశంలోనే ఎక్కువగా ఉన్నాయన్నారు. బాల్క సుమన్ ఎంపీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు క్యాతనపల్లి ఫ్లై ఓవర్‌ను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ర్యాలీ సమన్వయకర్త అంజన్‌కుమార్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ జంగం కళ, పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, రఘునాథ్‌రెడ్డి, వొడ్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య, అజీజ్, మహంకాళి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మందమర్రిలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర
మందమర్రిరూరల్: కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మందమర్రి పట్ట ణంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. అంగడిబజార్‌లో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్‌గాంధీతోపాటు కాంగ్రెస్ ఎంపీలను పార్లమెంటులో మాట్లాడకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, అ నుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మండలంలోని చిర్రకుంటలో నిర్విహించిన కార్యక్రమంలో ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాగా, మండలంలోని పొన్నారంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికై న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి భూమిపూజ చేశారు.
చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
అమరవాదిలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ