
నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదాలు
చిన్నపాటి నిర్లక్ష్యంవల్లే అగ్నిప్రమాదా లు ఎక్కువగా జరుగుతున్నాయి. అగ్ని ప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. భవన నిర్మాణంలో నాణ్యమైన విద్యుత్ వైర్లు, స్విచ్ బోర్డులు వినియోగించాలి. ఆసుపత్రులు, హోటళ్లు, సినిమా థియేటర్లు, కల్యాణ మండపాలు, కళాశాలల్లో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. పరికరాల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నాం. చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు.
– భగవాన్‌రెడ్డి, జిల్లా ఫైర్ అధికారి,
మంచిర్యాల