
‘భగీరథ’ పైపులైన్ లీకేజీ
పాపన్నపేట(మెదక్): మిషన్ భగీరథ పైపులైన్ జాయింట్ విడిపోవడంతో ఆదివారం నీరు వృథాగా పోయింది. సుమారు 20 ఎకరాల పొలాల్లోకి నీరు చేరింది. మండల పరిధిలోని నార్సింగి గ్రామానికి చెందిన 70 కుటుంబాలతోపాటు పలు గ్రామాలకు తాగునీరు రావడం లేదు. గ్రామ శివారులోని ఎల్లమ్మ గుడి వద్ద మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్‌కు కొత్తగా లింక్ లైన్ ఏర్పాటు చేసి, అర్కెల, దాని పరిధిలోని ఏడు గిరిజన తండాలు, నార్సింగిలోని ఒక ట్యాంకుకు కనెక్షన్ ఇచ్చి తాగునీరందిస్తున్నారు. అయితే మూడు రోజులుగా నీరు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఫోన్ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. నార్సింగి గ్రామ శివారులో పైపులు పగిలి నీరు వృథాగా పోతుందని తెలిపారు.
వృథాగా పోతున్న తాగునీరు
మూడు రోజులుగా
పలు గ్రామాలకు నీటి కష్టాలు
పట్టించుకోని అధికారులు