Top Stories
ప్రధాన వార్తలు

ఈసారి అధికారం మనదే: వైఎస్ జగన్
రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్న పరిస్థితుల్లో మీరు కేడర్‌కు ఉత్సాహాన్నివ్వడానికి వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో మీరు క్రియాశీలకంగా పని చేయాలి. వారానికి మూడు రోజులు మీ పార్లమెంటు నియోజకవర్గాల్లో తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఆ జిల్లా మీద మీకు పట్టు వస్తుంది. అప్పుడే మీరు చెప్పింది వింటారు. ఇది చాలా ముఖ్యం. మీ వల్ల పార్టీకి మంచి జరగాలి. పూర్తి స్థాయి రాజకీయ నాయకుల్లా పని చేయాలి. కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేం. జైలుకు పంపుతారని భయపడకూడదు. కలియుగంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం చేయాలంటే ఈ రెండు విషయాల్లో వెనకాడకూడదు. అప్పుడే మనం రాజకీయాలు చేయగలుగుతాం. రాష్ట్రంలో విద్య, వ్యవసాయం, వైద్య రంగాలన్నీ పూర్తిగా నీరుగారి పోయాయి. ప్రతి పథకం కనపడకుండా పోతోంది. మరోవైపు అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. ఈ స్థాయిలో అవినీతిని ఎప్పుడూ చూసి ఉండం. రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో కానీ.. ఈ ప్రభుత్వంలో మాత్రం రూపాయికే ఎకరం చొప్పున లూలూ గ్రూపు లాంటి వాళ్లకు రూ.1,500 కోట్ల నుంచి రూ.1,600 కోట్ల విలువైన భూములు వస్తాయి. మరొకరికి రూపాయికే ఎకరా చొప్పున రూ.3 వేల కోట్ల విలువైన భూములు కట్టబెడుతున్నారు. ఈ స్థాయిలో ఏమాత్రం భయం లేకుండా విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. -వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: మన ప్రభుత్వం ఇస్తున్న ప్రతి పథకాన్నీ ఆపేయడంతో పాటు చంద్రబాబు చెప్పింది చేయకపోవడం వల్ల ప్రజలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. ప్రజలు చంద్రబాబు తీరును గమనిస్తున్నారని, ఓటు అనే వారి ఆయుధంతో చంద్రబాబుకు తగిన శాస్తి తప్పదని చెప్పారు. సరైన సమయంలో ప్రజలు, దేవుడు మొట్టికాయలు వేస్తారని.. వచ్చే ఎన్నికల్లో అఖండ విజయంతో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు, రీజినల్ కో–ఆర్డినేటర్లతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలపై చర్చించి, పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ‘మనల్ని అభిమానించే వారిని కొడుతున్నారు.. ఇబ్బంది పెడుతున్నారు. నన్ను అభిమానించినందుకే కదా.. వీళ్లకు దెబ్బలు తగులుతున్నాయన్నది నన్ను బాధిస్తోంది. వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. వాళ్లకు ఏదైనా జరిగితే ముందు బాధపడేది నేనే. అందుకే జగన్ 2.0లో ఈ మాదిరిగా ఉండదని స్పష్టంగా చెబుతున్నా. మొదటి ప్రాధాన్యత ఉంటుంది’ అని స్పష్టం చేశారు. కార్యకర్తల్లో ఇప్పటికే మంచి చైతన్యం వచ్చిందని, కేడర్ ధైర్యంగా నిలబడిందని అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా తాను ఎక్కడికి వెళ్లినా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు తరలి వస్తున్నారని, రాష్ట్రంలో అరాచక పాలన పట్ల వివిధ రూపాల్లో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేని వారిని కూడా కక్షలకు గురి చేస్తుండటం పట్ల ప్రజల్లో తీవ్రమైన అగ్రహం ఉందని తెలిపారు. మన ప్రభుత్వ హయాంలో మన పథకాల ద్వారా పేదల నోట్లోకి నాలుగు వేళ్లూ వెళ్లేవని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలు తింటున్న కంచాన్ని చంద్రబాబు లాగేశారని చెప్పారు. వారి కడుపు కొట్టారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..కూటమి ప్రభుత్వం అనైతిక పనులు చంద్రబాబు రాజకీయాలను ఒక దారుణమైన స్థాయికి తీసుకెళ్లారు. రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు రాకూడదని మన ప్రభుత్వ హయాంలో చాలా కష్టపడ్డాం. చాలా మంది నాయకులను మన పరిపాలనలో కట్టడి చేశాం. తాడిపత్రిలో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీకి స్వల్ప ఆధిక్యత వచ్చింది. వైఎస్సార్సీపీకి 16 వార్డులు, టీడీపీకి 18 వార్డులు వచ్చాయి. కానీ అప్పటి వైఎస్సార్సీపీ తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫలితాన్ని మన వైపు తిప్పుదామని యత్నించారు. కానీ, ఆ రోజు మన ప్రభుత్వంలో మన పార్టీ ఎమ్మెల్యేనే గృహ నిర్భంధం చేశాం. అదే ఇప్పుడు ఏడాది కాలంగా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగు పెట్టనీయడం లేదు. కార్యకర్తల ఆస్తులను విధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగం, కక్ష రాజకీయాలతో రాజకీయ వ్యవస్థ దారుణంగా తయారైంది. ఈ రోజు 99.99 శాతం గ్రామ స్థాయిలో కేడర్ కూడా నా దగ్గర నుంచి చంద్రబాబు తరహా రాజకీయాలు ఆశిస్తున్నారు. చంద్రబాబునాయుడు 12 నెలల రెడ్ బుక్ రాజ్యాంగం చూసిన తర్వాత ఎమ్మెల్యేలే కాదు, గ్రామ స్థాయి కార్యకర్తలు కూడా నా దగ్గర నుంచి అదే ఆశిస్తున్నారు. కేసులు పెట్టించుకునే పరిస్థితి లేకపోతే రాజకీయాలు చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో లేకుండా పోయింది.అవినీతి కంటికి కన్పిస్తోంది రైతులకు ఉచితంగా విద్యుత్ అందించడానికి మనం ‘సెకీ’ (సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)తో యూనిట్ విద్యుత్ రూ.2.49కే కొనుగోలు చేశాం. రైతులకు ఉచితంగా పగటి పూటే తొమ్మిది గంటల పాటు, నాణ్యమైన విద్యుత్‌ను 30 ఏళ్ల పాటు అందుబాటులో ఉండేందుకు మనం గొప్ప అడుగులు వేస్తే.. ఇప్పుడు నిస్సిగ్గుగా ఇవాళ వీళ్లు యూనిట్ విద్యుత్ రూ.4.60కు కొనుగోలు చేస్తున్నారు. సెక్షన్–108 ప్రకారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ) మీద ఒత్తిడి తెచ్చి అమలు చేయించుకున్నారు. మెడ మీద కత్తిపెట్టి వాళ్లతో పని చేయించుకున్నారు. అవినీతి కంటికి కనిపిస్తోంది. గ్రామాల్లో ఇసుక మాఫియా, మట్టి మాఫియా.. అన్నీ స్కాములే. పేకాట క్లబ్బులు దగ్గర నుంచి మొదలు పెడితే.. విచ్చలవిడిగా బెల్టు షాపులు.. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేకు ముట్టజెప్పందే ఏ పనీ కావడం లేదు. పరిశ్రమ నడవాలన్నా, మైనింగ్ యాక్టివిటీ కొనసాగాలన్నా ఎమ్మెల్యే ఆశీస్సులు ఉండాల్సిందే. ఎమ్మెల్యేకు ఇంత, ముఖ్యమంత్రికి ఇంత అని దండుకుంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ప్రజలు ఓటు వేసి ఐదేళ్లు పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ప్రజలు గత్యంతరం లేక చూస్తున్నారంతే. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా తగిన తీర్పు ఇస్తారు.చరిత్ర పునరావృతం ఖాయం 2014లో ఇదే కూటమి అధికారంలో ఉంది. ఆ రోజు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదు. చరిత్ర పునరావృతం అవుతుంది. అప్పుడు కూడా రైతులకు రుణమాఫీ అని కొద్దిగా చేసి ఎగనామం పెట్టాడు. పొదుపు సంఘాలకు రుణమాఫీ అన్నాడు. అది కూడా మోసంగా తయారైంది. ఇంటింటికీ రూ.2 వేలు నిరుద్యోగ భృతి అన్నాడు. అదీ మోసమైంది. ప్రతి ఒక్కరికీ మూడు సెంట్ల స్థలం అన్నాడు.. అదీ మోసంగా మిగిలింది. అదే సమయంలో మనం పాదయాత్ర చేసి ప్రజలకు భరోసా ఇచ్చాం. చివరకు ప్రజా వ్యతిరేకత కొట్టొచ్చినట్టు ఎన్నికల ఫలితాల్లో కనిపించింది. చంద్రబాబు ప్రజా వ్యతిరేకతను చీల్చడానికి తన భాగస్వామిని వేరేగా పోటీ చేయించాడు. అయినా చంద్రబాబు ఓటమిని అడ్డుకోలేకపోయారు. ఇప్పుడు కూడా ప్రజలు చంద్రబాబు తీరును గమనిస్తున్నారు. సరైన సమయంలో మొట్టికాయలు వేస్తారు. ముఖ్యమైన వారికి కీలక బాధ్యతలు చాలా ముఖ్యమైన వ్యక్తులుగా భావించిన వారినే పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులుగా నియమించాం. పార్టీ నిర్మాణంలో ఎవరైతే క్రియాశీలకంగా ఉండగలుగుతారు.. ఎవరైతే పార్టీని నడపగలుగుతారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే పార్టీకి బలంగా ఉపయోగపడతారు.. అని చాలా అధ్యయనం చేశాకే మీకు ఈ బాధ్యతలు అప్పగించాం. ఏం జరుగుతున్నా నాతోనే నేరుగా చెప్పగలిగే చనువు మీ అందరికీ ఉంది. పార్టీని పూర్తిగా బలోపేతం చేయడం మీద 11 నెలలుగా మనం ప్రధానంగా ధ్యాస పెట్టాం. జిల్లా స్థాయి నుంచి గ్రామంలో బూత్ కమిటీల నిర్మాణం వరకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. అందులో భాగంగానే జవసత్వాలు నింపి జిల్లా అధ్యక్షులుగా కొత్తవాళ్లను నియమించాం. జిల్లా కమిటీల నుంచి బూత్ కమిటీల వరకు అన్నీ పూర్తి చేసే బృహత్తర బాధ్యతను జిల్లా అధ్యక్షులకు అప్పగించాం. వాళ్లకు సరైన సపోర్ట్ మెకానిజమ్‌గా రీజినల్ కోఆర్డినేటర్లను తీసుకొచ్చాం. రీజియన్‌ను వారు కోఆర్డినేట్ చేస్తూ, జిల్లా అధ్యక్షులకు అవసరమైన సహకారం అందిస్తూ.. వాళ్లతో పని చేయిస్తారు. అప్పుడే పని సులభం అవుతుంది.రీజినల్ కో–ఆర్డినేటర్లతో సమన్వయం జిల్లాలో ఏదైనా నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేయాలన్నా.. రీజినల్ కో–ఆర్డినేటర్లతో పాటు, మీరు కూడా మరింత మమేకమై పని చేయాలి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఆ పార్లమెంట్ నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తిని, ఆ పార్లమెంటు నియోజకవర్గంతో భావోద్వేగం లేని వాళ్లను, అల్టిమేట్‌గా పార్టీ కోసం పనిచేసే వారిని నియమించాం. వీళ్లు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తకు ఉపయోగపడేలా పని చేస్తారు. వీళ్లను ఆయా రీజినల్ కో ఆర్డినేటర్లతో మ్యాపింగ్ చేస్తాం. పార్లమెంటరీ పరిశీలకులు జిల్లా అధ్యక్షులతో మమేకం అయి పని చేయాలి. పార్టీ కమిటీల నియామకాల్లో ఆయా జిల్లా అధ్యక్షులతో కలిసి పని చేయాలి. జిల్లా కమిటీల నుంచి, బూత్ కమిటీల వరకు జిల్లా అధ్యక్షులకు సహాయకారిగా ఉండాలి. ప్రజలకు మరింత చేరువగా.. ప్రతి నియోజకవర్గంలోని పార్టీ ఇన్‌ఛార్జి పనితీరును బేరీజు వేస్తారు. సరిగ్గా పని చేసేలా మోటివేట్ చేయాలి. వారిని ప్రోత్సహించాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త గెలవడం చాలా సులభం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయాల్సిన బాధ్యత పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడిదే. నియోజకవర్గ అభ్యర్థికి ఎవరితోనైనా విభేదాలు ఉంటే, వాళ్ల మధ్య సమన్వయం చేయడంలో కూడా పరిశీలకులదే కీలక బాధ్యత. ఇదంతా జిల్లా అధ్యక్షులతో కలిసి చేయాలి. మీరు, జిల్లా అధ్యక్షులు కలిసి రీజనల్ కోఆర్డినేటర్లకు కాళ్లూ, చేతుల్లా పని చేస్తారు. వారు మీ ద్వారానే అన్ని పనులు చేయించుకుంటారు.గెలుపే మీ పనితీరుకు గీటురాయి మీ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఎంత మందిని మీరు గెలిపిస్తారనేది మీకు పరీక్ష. మీకు, జిల్లా అధ్యక్షులకు మీ మీ పనితీరు ఆధారంగానే మంచి పదవులు వస్తాయి. మీ మీద నేను ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలిపించుకునే బాధ్యత తీసుకోవాలి. అలాగే రీజినల్ కోఆర్డినేటర్లు కూడా, వాళ్ల ప్రాంతాల్లో ఎంత మందిని గెలిపించుకుని వచ్చారన్న దానిపైనే వాళ్లకు పార్టీలో సముచిత స్థానం దక్కుతుంది. చంద్రబాబు ప్రభుత్వం ఏ రకంగా ఫెయిల్ అయిందో అందరికీ కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ప్రజలకిచ్చిన అన్ని హామీలను అమలు చేసి, పారదర్శకంగా పథకాలిచ్చి, రూ.2.73 లక్షల కోట్లు బటన్ నొక్కి, ప్రతి ఇంటికీ పథకాలన్నీ చేర్చిన తర్వాత కూడా మన పరిస్థితే ఇలా ఉంటే, అన్ని రకాలుగా అబద్ధాలు చెప్పి మోసం చేసిన ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు.మీరు పని చేయండి.. మీ బాధ్యత నాది మీరు పని చేయండి. మీ బాధ్యత నాది. మిమ్నల్ని సముచిత స్థానాల్లో కూర్చోబెట్టే బాధ్యత నాది. ప్రతి గ్రామంలో మన పార్టీ బలంగా ఉంది. దీన్ని మరింత ఆర్గనైజ్డ్గా తీసుకుని రావాలి. గ్రామ కమిటీ సభ్యుడిగానో, బూత్ కమిటీలోనో, మహిళా కమిటీ సభ్యురాలిగానో.. ఇలా ఏదో ఒక చోట ప్రతి కార్యకర్తను తీసుకుని రావాలి. అంతిమంగా మీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకుని వచ్చారా లేదా అన్నదే నా పరీక్ష. గ్రామ, బూత్, మండల కమిటీలు ఎప్పుడైతే క్రియాశీలకంగా పని చేయడం మొదలవుతుందో అప్పడే గెలుపు సాధ్యం. మోసం మనకు చేతకాదుమనం అధికారంలోకి వచ్చే నాటికి నీరు–చెట్టు కార్యక్రమానికి సంబంధించి రూ.2,300 కోట్లు చంద్రబాబు హయాంలో పెండింగ్‌లో పెట్టిన బిల్లులు మనం చెల్లించాం. మనం ఇచ్చిన హామీ మేరకు ప్రతి పథకం అమలు చేస్తూ బటన్ నొక్కి జమ చేశాం. విలువలు, విశ్వసనీయత, క్రెడిబులిటీ కోసం మనం తాపత్రయ పడ్డాం. ప్రజల కోసమే ఆలోచన చేశాం. కాబట్టి కేడర్‌కు అనుకున్న మేరకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయాం. చంద్రబాబుకు అవేవీ లేవు. ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు చూసిన తర్వాత మన కార్యకర్తలకు కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. తొలి ప్రాధాన్యత వారికే. అదే టైంలో చంద్రబాబు మాదిరిగా మనం అబద్ధాలు చెప్పలేం. మోసాలు చేయలేం. ఎప్పుడైనా సరే నిజాయితీగానే రాజకీయాలు చేస్తాను. త్వరితగతిన కమిటీల నిర్మాణంబూత్ కమిటీల నియామకం పూర్తయ్యే సరికి పార్టీ నిర్మాణంలో దాదాపుగా 18 లక్షల మంది ఉంటారు. వారికి ఇన్సూరెన్స్ కచ్చితంగా చేస్తాం. వారి ఆలనా పాలన చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటికే పార్టీ నిర్మాణంలో 94 శాతం మండల అధ్యక్షుల నియామకం, 54 శాతం మండల కమిటీల నియామకాలు పూర్తి అయ్యాయి. అనుబంధ విభాగాలకు సంబంధించి 9 వేల మంది అధ్యక్షులను నియమించాం. మే ఆఖరులోగా మండల కమిటీలు పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేయాలి. అప్పుడు మండల కమిటీలు.. గ్రామ స్థాయి కమిటీల నియామకాలను పర్యవేక్షిస్తాయి. జూలై ఆఖరు నాటికి మున్సిపాలిటీ, గ్రామ స్థాయి విలేజ్ కమిటీల నియామకాలు పూర్తి కావాలి. ప్రతి మున్సిపాలిటీలో డివిజన్ ప్రెసిడెంట్ నియామకాలు పూర్తి కావాలి. కార్పొరేటర్ ఉన్నా కూడా డివిజన్ ప్రెసిడెంట్‌ను నియమించాలి. ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నాటికి బూత్ కమిటీలు కూడా పూర్తి కావాలి. ప్రతి గ్రామంలో అత్యధికంగా సర్పంచ్‌లు మన వాళ్లే ఉన్నారు. తొలుత 18 లక్షల మంది క్రియాశీలక (యాక్టివ్) సభ్యులకు ప్రత్యేకంగా ఐడీ కార్డు, ప్రత్యేక ఇన్సూరెన్స్ వస్తాయి. ఆ తర్వాత సభ్యత్వ నమోదు చేస్తాం. అక్టోబర్ తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతాం. తొలుత జిల్లా స్థాయిలో కమిటీలు, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయి కమిటీల హెడ్లను నియమించాం. మండల స్థాయిలో అధ్యక్షుల నియామకం దాదాపు 94 శాతం పూర్తి అయింది. తొలుత నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో వివిధ అనుబంధ విభాగాల కమిటీల అధ్యక్షులను నియమించాలి. మీరు వారానికి మూడు రోజులు వెళ్లి పరిశీలించగలిగితే అన్ని నియామకాలు పూర్తవుతాయి. వచ్చే ఏడాది బ్రహ్మాండంగా ప్లీనరీ నిర్వహిద్దాం.మన హయాంలో రైతులకు భరోసా⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామ సచివాలయంలో కనీస మద్దతు ధరలతో జాబితా పెట్టే వాళ్లం. మద్దతు ధర కోసం రూ.7,600 కోట్లు ఖర్చు చేసి రైతులకు మేలు చేశాం. మన హయాంలో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కన్నా తక్కువ ధర వస్తే అప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకునేది. ఆ పంటలు కొనుగోలు చేసేది. పొగాకు విషయంలో కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం జోక్యం చేసుకునేది. ⇒ ప్రైవేటు కంపెనీలతో పోటీ పడి వేలంలో పాల్గొని, రైతులను ఆదుకున్నాం. ఆయిల్‌పామ్ రైతులనూ ఆదుకున్నాం. తెలంగాణతో సమాన స్థాయిలో ధర వచ్చేలా చూశాం. రూ.80 కోట్లు ఇచ్చాం. ఎలాంటి విపత్తులు వచ్చినా రైతులను ముందుగా ఆదుకునే వాళ్లం. ధాన్యానికి ఎమ్మెస్పీ ఇవ్వడమే కాదు.. అదనంగా గన్నీ బ్యాగ్స్, లేబర్ చార్జీలు, రవాణా ఖర్చు (జీఎల్టీ) కూడా ఇచ్చాం. ⇒ సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే సంప్రదాయం మన దగ్గరే ప్రారంభమైంది. క్రమం తప్పకుండా ఇన్సూరెన్స్ ఇచ్చే వాళ్లం. వ్యవసాయ రంగంపై ఇంత ఫోకస్ పెట్టిన ప్రభుత్వం మనదైతే, ఏ ఫోకస్ పెట్టనిది కూటమి ప్రభుత్వం. క్రమం తప్పకుండా ఐదేళ్ల పాటు మనం రైతులకు పెట్టుబడి సహాయం అందించాం. విపత్తులు వస్తే తక్షణమే వెళ్లి ఆదుకున్నాం. ⇒ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. కనీస మద్దతు ధర అందడం లేదు. రైతును పట్టించుకునే నాధుడే లేడు. ప్రజలకు సమస్యలొస్తే మీరు అక్కడికి వెళ్లాలి. ప్రజలకు అండగా ఉండాలి. ప్రజా సమస్యల పట్ల ఎంత ఎక్కువగా వారికి అండగా ఉంటే.. అంత గట్టిగా ప్రజల్లో బలపడే పరిస్థితి వస్తుంది. అలా జరగకుండా చేసేందుకే చంద్రబాబు వేధింపులకు దిగుతున్నాడు. అయినా ప్రజల కష్టాల్లో వారికి అండగా ఉండాలి’.

ఆపరేషన్ సిందూర్.. తొలిసారి స్పందించిన పాక్ ప్రధాని
ఇస్లామాబాద్: పహల్గాంలో ఉగ్రదాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. ఇక, ఆపరేషన్ సిందూర్‌పై పాకిస్తాన్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తొలిసారి స్పందించారు. పాకిస్తాన్ జాతినుద్దేశించి ప్రసంగించిన షరీఫ్..తమ దేశంపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. భారత్ ధీటుగా సమాధానం ఎలా ఇవ్వాలో తమ దేశానికి, తమ బలగాలకు తెలుసు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. పాక్ సాయుధ దళాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుందన్నారు. మనం వెనక్కి తగ్గుతున్నామని వారు (భారత్) అనుకుంటోంది. కానీ, ఇది ధైర్యవంతుల దేశమని వారు మరచిపోయారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత దళాలు బాంబుల వర్షం కురిపించాయి. జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని నేలమట్టం చేశాయి. విజయవంతంగా జరిపిన ఈ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిపిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు సమాచారం. ఇందులో 10 మంది మసూద్ కుటుంబసభ్యులే ఉన్నారు. మసూద్ అజార్ సోదరి - ఆమె భర్త, మసూద్ మేనల్లుడు - అతడి భార్య, మేనకోడలు, ఐదుగురు చిన్నారులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈమేరకు జైషే వర్గాలను ఉటంకిస్తూ కథనాలు పేర్కొన్నాయి. వీరితో పాటు అజార్ అత్యంత సన్నిహితులు కూడా నలుగురు మరణించినట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన లేదు.Shehbaz Sharif says Pakistan will Retaliate & Avenge the blood🤣~ He is stammering. Unable to read the script given by Pakistan Army. Multiple CUTS just in 30 seconds. This is not Shehbaz. This is Asif Munir. This is Pakistan Army. P*gets have gone mad. pic.twitter.com/WbwQz83KPw— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) May 7, 2025మరోవైపు, ఉగ్రస్థావరాలపై భారత సైనిక చర్య నేపథ్యంలో పాకిస్థాన్ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. అన్ని ఆసుపత్రుల సిబ్బంది అత్యవసర విధుల్లో ఉండాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా 48 గంటలపాటు గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, బుధవారం సాయంత్రానికి ప్రధాన మార్గాల్లో విమాన రాకపోకలను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. ఇస్లామాబాద్, పంజాబ్‌లలో విద్యాసంస్థలు మూసివేసింది. దేశవ్యాప్తంగా భద్రతా బలగాలను సిద్ధంగా ఉంచింది.

ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం.. వ్యాపారాలలో ముందడుగు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.ఏకాదశి ప.1.42 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: ఉత్తర రా.10.07 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.9.48 నుండి 10.39 వరకు, తదుపరి ప.2.55 నుండి 3.46 వరకు, అమృత ఘడియలు: ప.2.24 నుండి 4.10 వరకు.సూర్యోదయం : 5.35సూర్యాస్తమయం : 6.17రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకుయమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు మేషం.... ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. కుటుంబసమస్యలు తీరతాయి.వృషభం... కుటుంబ, ఆరోగ్యసమస్యలు. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు.బంధువులతో తగాదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలలో కొన్ని సమస్యలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.మిథునం... రాబడి కంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు. బంధువులతో మాటపట్టింపులు. విద్యార్థులకు శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగమార్పులు.కర్కాటకం... ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. పనులు చకచకా సాగుతాయి..సింహం.... కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు ఆకస్మిక ప్రయాణాలు.వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు.కన్య.... కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు.విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.తుల... ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవరోధాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం.వృశ్చికం... నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. కళాకారులకు సన్మానాలు. ఆస్తి వివాదాలు తీరతాయి.ధనుస్సు..... పనులు విజయవంతంగా పూర్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. రాబడి పెరుగుతుంది. వస్తు,వస్త్రలాభాలు. ఆస్తుల వివాదాలు తీరతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.మకరం.... ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు.ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులలో జాప్యం. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి కుంభం....అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. బంధువులను కలుసుకుంటారు. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. శారీరక రుగ్మతలు.మీనం.... కొత్త పనులు ప్రారంభిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ధనలబ్ధి. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

Operation Sindoor: ఉగ్ర తండాలపై 'రక్త సిందూరం'
అమాయక మహిళల నుదుటి నుంచి ముష్కరులు తుడిచేసిన సిందూరం వారి పాలిట రక్తసిందూరమే అయింది. దెబ్బతిన్న పులి పంజా విసిరితే ఎలా ఉంటుందో పాక్‌కు, దాని ప్రేరేపిత ఉగ్ర ముఠాలకు తెలిసొచ్చింది. పహల్గాం ఉగ్ర దాడికి భారత్ అంతకంతా బదులు తీర్చుకుంది. పాక్, పీఓకేల్లోని 9 ప్రాంతాలపై సైన్యం విరుచుకుపడింది. లష్కరే, జైషే వంటి ఉగ్ర సంస్థల ప్రధాన స్థావరాలతో పాటు శిక్షణ శిబిరాలను సమూలంగా తుడిచిపెట్టింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టి ‘ఆపరేషన్ సిందూర్’ను దిగి్వజయంగా పూర్తి చేసింది. ‘జైహింద్’ అంటూ పహల్గాం మృతులకు ఘనంగా నివాళులు అర్పించింది.న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడికి పక్షం రోజుల్లోనే భారత్ బదులు తీర్చుకుంది. అమాయక పర్యాటకులను పాశవికంగా పొట్టన పెట్టుకున్న ఉగ్ర ముష్కరులకు జన్మలో మర్చిపోలేని గుణపాఠం నేరి్పంది. వారిని ప్రపంచం అంచుల దాకా వేటాడైనా కలలో కూడా ఊహించనంత కఠినంగా శిక్షిస్తామన్న ప్రధాని ప్రతిజ్ఞను సైన్యం దిగి్వజయంగా నెరవేర్చింది. ప్రతీకార దాడుల విషయంలో పూర్తి స్వేచ్ఛనిస్తూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటాక మెరుపు దాడులు చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాదులు మౌలానా మసూద్ అజర్ సారథ్యంలోని జైషే మహ్మద్, హఫీజ్ సయీద్ నేతృత్వంలోని లష్కరే తొయిబాతో పాటు హిజ్బుల్ ముజాహిదీన్ తదితర ఉగ్ర తండాల వెన్ను విరిచింది. వాటి ప్రధాన స్థావరాలతో పాటు శిక్షణ శిబిరాలను కూడా నేలమట్టం చేసేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట 25 నిమిషాల దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. త్రివిధ దళాలు పూర్తి సమన్వయంతో, అత్యంత కచ్చితత్వంతో ఆపరేషన్ నిర్వహించాయి. ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్‌తో వైమానిక దళం, సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణులతో ఆర్మీ ద్విముఖ వ్యూహంతో ఏక కాలంలో దాడులకు దిగాయి. అత్యాధునిక స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు, హామర్ ప్రెసిషన్ బాంబులు, గైడెడ్ బాంబ్ కిట్లు, ఆత్మాహుతి డ్రోన్లతో 9 ఉగ్రవాద శిబిరాలను నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేశాయి. వీటిలో ఐదు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉండగా నాలుగు స్వయానా పాక్ గడ్డ మీదే ఉండటం విశేషం! బాలాకోట్ దాడుల మాదిరిగా పాక్ గగనతలంలోకి వెళ్లకుండా మన ఎయిర్‌ఫోర్స్ అమ్ములపొదిలోని అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు సరిహద్దులకు ఇవతలి నుంచే అరగంట లోపే పని ముగించేశాయి. అర్దరాత్రి 1:05కు మొదలైన దాడులు 1:30కు ముగిశాయి. ఆ వెంటనే 1:44 గంటలకు రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ‘‘కాసేపటి క్రితం ఆపరేషన్ సిందూర్ చేపట్టాం. పాక్, పీఓకేల్లో నుంచి భారత్‌పై ఉగ్ర దాడులకు వ్యూహరచన చేసిన ఉగ్రవాద మౌలిక వ్యవస్థలపై దాడులు చేశాం. ఉద్రిక్తతలకు తావులేని రీతిలో, పూర్తి కచ్చితత్వంతో కేవలం ఉగ్ర శిబిరాలను మాత్రమే ధ్వంసం చేశాం. పాక్ సైన్యాన్ని, సైనిక వ్యవస్థలను, పౌరులను ఏ మాత్రమూ లక్ష్యం చేసుకోలేదు. లక్ష్యాల ఎంపిక, దాడిలో ఆ మేరకు పూర్తి సంయమనం పాటించాం’’ అని వెల్లడించింది. ‘‘ఈ రోజు మనం చరిత్ర సృష్టించాం. భారత్ మాతా కీ జై’’ అంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘పహల్గాం బాధితులకు న్యాయం జరిగింది. జైహింద్’’ అని సైన్యం పేర్కొంది. దాడుల వీడియోను ఎక్స్‌లో ఉంచింది. మృతుల్లో జైషే చీఫ్ అజర్ కుటుంబానికి చెందిన 10 మంది ఉన్నారు. దీన్ని అజర్ కూడా ధ్రువీకరించాడు. జైషే ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడుల్లో వారితో పాటు తన నలుగురు సన్నిహిత సహచరులు కూడా మరణించినట్టు చెప్పుకొచ్చాడు. పాక్ ప్రేరేపిత ఉగ్ర తండాల పీచమణచేలా అద్భుతంగా సాగిన సైనిక చర్య భారతీయులందరికీ గర్వకారణమంటూ ప్రధాని మోదీ ప్రస్తుతించారు. భారత దాడుల్లో 26 మందే మరణించారని, 46 మందికి పైగా గాయపడ్డారని పాక్ చెప్పుకుంది. సరైన సమయంలో ప్రతీకారం తీర్చుకుంటామంటూ తొలుత ప్రగల్భాలకు దిగినా కాసేపటికే దిగొచ్చింది. గట్టి ప్రతి చర్యలు తప్పవంటూ బీరాలు పలికిన రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ‘ఇప్పటికైనా ఉద్రిక్తతలు పెరగకుండా భారత్ చూస్తే మేమూ సహకరిస్తాం’ అంటూ సాయంత్రానికల్లా మాట మార్చారు. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో బైసారన్ మైదానంలో 26 మంది పర్యాటకులను లష్కరే ఉగ్రవాదులు కిరాతకంగా కాల్చి చంపడం తెలిసిందే.అద్భుత నైపుణ్యం దాడులపై నిపుణులు సైన్యం ఆపరేషన్ సిందూర్‌ను అమలు చేసిన తీరును రక్షణ నిపుణులు ఎంతగానో కొనియాడుతున్నారు. ఉగ్ర శిబిరాల పరిసరాల్లోని నివాసాలు తదితరాలకు ఏమాత్రమూ నష్టం జరగకుండా, కేవలం లక్ష్యాలను మాత్రమే నేలమట్టం చేస్తూ అత్యంత కచ్చితత్వంతో దాడులు జరపడం అద్భుతమని చెబుతున్నారు. ‘‘పాక్ సైనిక స్థావరాలు, కీలక మౌలిక వ్యవస్థల వంటివాటి జోలికే వెళ్లకుండా సంయమనం పాటించడం నిస్సందేహంగా అద్భుతమైన దౌత్య ఎత్తుగడే. తద్వారా ప్రతీకార దాడులకు దిగేందుకు పాక్‌కు ఎలాంటి సాకూ లేకుండా పోయింది. పైగా 9 ఉగ్ర శిబిరాల్లో 4 స్వయానా పాక్ భూభాగంలోనే ఉండటంతో ఆ తండాలను దాయాది ఇప్పటికీ పెంచి పోషిస్తోందని నిర్ద్వంద్వంగా నిరూపణ అయింది. దాంతో పాక్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. అంతర్జాతీయ సమాజం ముందు మరోసారి ధూర్త దేశంగా మిగిలింది’’ అని వారు వివరించారు. దాడులు చేసిన ప్రాంతాల్లో కొన్ని సరిహద్దుల నుంచి ఏకంగా 100 కి.మీ. లోపల ఉండటం విశేషం. తద్వారా పాక్‌లో ఏ లక్ష్యాన్నైనా, ఎప్పుడైనా అత్యంత కచ్చితత్వంతో ఛేదించే సత్తా తనకుందని భారత్‌కు మరోసారి నిరూపించింది. 25 నిమిషాలు.. 9 లక్ష్యాలుదాడుల విషయంలో సైన్యం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పక్కాగా వ్యవహరించి అత్యంత విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించింది. నిఘా వర్గాలు పక్షం రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించి లష్కరే, జైషే తదితర ఉగ్రవాద సంస్థ శిబిరాలతో పాటు ప్రధాన కార్యాలయాల ఆనుపానులను పక్కాగా సేకరించాయి. వాటి ఆధారంగా ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగాయి. సరిహద్దులకు ఆవల క్షిపణి నిరోధక వ్యవస్థలు తదితరాలతో కాచుకుని కూచున్న శత్రు సైన్యం అంచనాలకు అందకుండా వ్యవహరించాయి. సరిహద్దులు దాటకుండానే ఆపరేషన్ నిర్వహించాయి. మురిద్కే, బహావల్‌పూర్‌ల్లోని లష్కరే, జైషే ప్రధాన స్థావరాల్లో ఒక్కోచోట కనీసం 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.

2040 నాటికి చంద్రుడిపై మన పాదముద్ర: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ ముందంజలో దూసుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. 2040 నాటికి చందమామపై మన వ్యోమగాములు అడుగు పెట్టబోతున్నారని చెప్పారు. అంగారక(మార్స్), శుక్ర(వీనస్) గ్రహాలపైనా ప్రయోగాలు చేయబోతున్నట్లు వెల్లడించారు. గ్లోబల్ స్పేస్ ఎక్ప్‌ప్లోరేషన్ కాన్ఫరెన్స్(గ్లెక్స్–2025) సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేశారు. అంతరిక్ష ప్రయోగ ప్రణాళికలు వివరించారు. 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత 2040 నాటికి చంద్రుడిపై మన పాదముద్ర ఉంటుందని పేర్కొన్నారు. మరో 15 ఏళ్లలో భారతీయ వ్యోమగాములు చందమామపై అడుగుపెట్టడం తథ్యమని స్పష్టంచేశారు. మన అంతరిక్ష ప్రయాణం ఇతరులతో పోటీకి సంబంధించింది కాదని, అందరినీ కలుపుకొని ఈ రంగంలో ఉన్నత శిఖరాలకు చేరాలన్నదే అసలు లక్ష్యమని ఉద్ఘాటించారు. మొత్తం మానవాళికి లబ్ధి చేకూరేలా అంతరిక్ష ప్రయోగాల్లో తమ ఉమ్మడి లక్ష్యాన్ని అందరితో పంచుకుంటామని వ్యాఖ్యానించారు. జీ20 ఉపగ్రహం ప్రయోగిస్తాం దక్షిణాసియా దేశాల కోసం ఒక శాటిలైట్ ప్రయోగించామని ప్రధాని మోదీ గుర్తుచేశారు. గ్లోబల్ సౌత్ దేశాలకు బహుమతిగా జీ20 ఉపగ్రహం ప్రయోగించబోతున్నామని చెప్పారు. గగన్‌యాన్ ప్రాజెక్టు మన దేశ ఆకాంక్షలకు ప్రతిబింబిస్తోందని అన్నారు. మన తొలి మానవసహిత స్పేస్–ఫ్లైట్‌ను త్వరలో అంతరిక్షంలోకి పంపించబోతున్నామని చెప్పారు. ఇస్రో–నాసా ఉమ్మడి మిషన్‌లో భాగంగా భారతీయ వ్యోమగామి మరికొన్ని వారాల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) చేరుకోబోతున్నాడని వివరించారు. అంతరిక్షం అంటే కేవలం ఒక గమ్యం కాదని.. ఉత్సకత, ధైర్యం, సమీకృత ప్రగతికి ఒక ప్రతీక అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారతదేశ అంతరిక్ష ప్రయాణం ఆ దిశగానే సాగుతోందని చెప్పారు. 1963లో ఒక చిన్న రాకెట్ ప్రయోగంతో మన అంతరిక్ష యాత్ర ఆరంభమైందని గుర్తుచేశారు. అనంతరం ఈ రంగంలో ఎంతగానో పురోగమించామని, చంద్రుడి దక్షిణ ధ్రువంపై స్పేస్‌క్రాఫ్ట్‌ను ల్యాండ్ చేసిన తొలి దేశంగా రికార్డు సృష్టించామని పేర్కొన్నారు. మన ప్రయాణం చరిత్రాత్మకమని అభివరి్ణంచారు. మన రాకెట్లు పేలోడ్స్ కంటే అధికంగా 140 కోట్ల మంది భారతీయుల కలలను మోసుకెళ్తుంటాయని వివరించారు. తొలి ప్రయత్నంలోనే మార్స్ వద్దకు చేరుకున్న దేశంగా ఇండియా చరిత్ర సృష్టించిందన్నారు. చంద్రయాన్ ప్రయోగాలతో చంద్రుడిపై నీటి జాడ కనిపెట్టామని, అత్యంత నాణ్యమైన చంద్రుడి ఫొటోలు చిత్రీకరించామని, అక్కడి దక్షిణ ధ్రువం గురించి మరింత సమాచారం తెలుసుకున్నామని వెల్లడించారు. రికార్డు సమయంలో క్రయోజెనిక్ ఇంజన్లు తయారు చేశామని, ఒకేసారి 100 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించామని గుర్తుచేశారు. 34 దేశాలకు చెందిన 400కుపైగా శాటిలైట్లను మన అంతరిక్ష నౌకల ద్వారా ప్రయోగించామని అన్నారు. ఈ ఏడాది అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానించామని, ఇదొక గొప్ప ముందడుగు అని తెలియజేశారు.

అత్యవసర సేవల ఉద్యోగుల 'సెలవులు రద్దు'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అత్యవసర సేవలు అందించే అన్ని విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుని హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించింది. పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం అర్ధరాత్రి భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడుల నేపథ్యంలో మనమంతా సైన్యంతో ఉన్నామనే సందేశం ఇవ్వాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ సమయంలో రాజకీయాలకు, పార్టీలకు తావు లేదని అన్నారు. మీడియా, సోషల్ మీడియాలో ప్రభుత్వ ఉద్యోగులు అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. ప్రజల కోసం 24/7 టోల్ ఫ్రీ నంబర్ ‘సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నంబర్ వెంటనే ఏర్పాటు చేయాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. మూడు కమిషనరేట్లకు సంబంధించిన సీసీటీవీలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి వచ్చి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలి. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలి. రక్తం, ఆహారం నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలి బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇందుకోసం రెడ్ క్రాస్తో సమన్వయం చేసుకోవాలి. అత్యవసర మందులు కూడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల అందుబాటుపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలి. ఆహార నిల్వలు కూడా తగినంత ఉండేలా చూడాలి. సైబర్ దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. ఫేక్ న్యూస్ ప్రచా రం చేసే వారిపై ఉక్కు పాదం మోపాలి. ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో ఆందోళన మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి వాటిని అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. కీలక ప్రాంతాల్లో భద్రత పెంచాలి అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భద్రత పెంచాలి. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, అన్ని విదేశీ రాయబార కార్యాలయాలు, ఐటీ సంస్థల దగ్గర కూడా భద్రత పెంచాలి. నగరంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే పీస్ కమిటీలతో మాట్లాడాలి. హిస్టరీ షీటర్లు, పాత నేరస్తుల విషయంలో పోలీస్ విభాగం అప్రమత్తంగా ఉండాలి..’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. విదేశీ పర్యాటకులకు రక్షణ కల్పించండి హైదరాబాద్‌లోని ఆర్మీ, నేవీ, వైమానిక కార్యాలయాలు, రక్షణ రంగ సంస్థల దగ్గర భద్రతాపరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసులను ఆదేశించారు. నగరంలో మాక్ డ్రిల్ అనంతర పరిస్థితులపై అధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని చెప్పారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలని చెప్పారు. కేంద్ర నిఘా బృందాలతో , రాష్ట్ర నిఘా బృందాలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. చంపినా చూస్తూ ఊరుకుంటే ఎలా..? ఐసీసీసీ వద్ద ఎండలో నిలబడిన మీడియాను చూసిన రేవంత్‌రెడ్డి తన వాహనం ఆపి వారితో ముచ్చటించారు. ‘భారత రక్షణ రంగంలో హైదరాబాద్ అత్యంత కీలక ప్రాంతం. అన్ని విభాగాలను అప్రమత్తం చేశాం. దేశంలోకి వచ్చి చంపుతుంటే చూస్తూ ఊరుకుంటే ఎలా? ’అని వ్యాఖ్యానించారు.సైన్యానికి సెల్యూట్: సీఎం రేవంత్ ఆపరేషన్ సిందూర్‌లో భారత సాయుధ దళాలు సాధించిన విజయంపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మన సైన్యం దేశ ప్రజలందరినీ గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు. ‘ఒక భారతీయ పౌరుడిగా, నేను ముందుగా మన సాయుధ దళాలకు బలమైన అండగా నిలుస్తున్నా. ఉగ్రవాద నిర్మూలన దిశగా భారత సైన్యం చేపట్టిన ఈ ధైర్యవంతమైన చర్య దేశ భద్రతకు నిదర్శనం. ఈ దాడులు మన సైన్యం సామర్థ్యం, ధైర్యాన్ని ప్రపంచానికి స్పష్టంగా చాటాయి. మనమంతా ఒకే గొంతుకై, ఒకే స్వరంతో ప్రకటిద్దాం.. జై హింద్..’అని సీఎం తన ‘ఎక్స్’ఖాతాలో పోస్టు చేశారు. నేడు సంఘీభావ ర్యాలీ భారత సైన్యానికి సంఘీభావంగా హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర నేతలు పాల్గొననున్నారు.

అదనుచూసి పదునైన పాఠం!
తీరికూర్చుని భారత్‌తో పెట్టుకుంటే ఏమవుతుందో జగడాలమారి పాకిస్తాన్‌కూ, దాని కీలుబొమ్మలైన ఉగ్రమూకలకూ తెలిసొచ్చి ఉండాలి. 2016 నాటి ‘ఉరి’ సర్జికల్ దాడులు, 2019 నాటి బాలాకోట్ వైమానిక దాడులకు అనేక రెట్లు అధికంగా మంగళవారం అర్ధరాత్రి దాటాక ‘ఆపరేషన్ సిందూర్’ సంకేతనామంతో మన త్రివిధ దళాలు పకడ్బందీ సమన్వయంతో పాకిస్తాన్‌లోనూ, ఆక్రమిత కశ్మీర్ లోనూ తొమ్మిది చోట్ల గంటసేపు సాగించిన క్షిపణి దాడులు పాక్ సైన్యాన్నీ, ఉగ్రమూకల్నీ గుక్క తిప్పుకోనీయకుండా చేశాయి. ఉగ్రవాదుల శిక్షణ కేంద్రాలూ, వారి ఆయుధ గిడ్డంగులూ, ఇతరేతర అవసరాలకు వినియోగిస్తున్న బహుళ అంతస్తుల భవంతులూ లక్ష్యంగా మొత్తం 24 చోట్ల సాగించిన దాడుల్లో 70 మంది వరకూ ఉగ్రవాదులు మరణించగా, మరో 60 మంది గాయపడ్డారని చెబు తున్నారు. ఉగ్రవాద ముఠాలైన జైషే మొహమ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ప్రధాన కార్యాలయాలు రెండూ కుప్పకూలాయని సమాచారం. జేఈఎం చీఫ్ మసూర్ అజర్ సోదరితోసహా అతగాడి కుటుంబానికి చెందిన పదిమంది హతమయ్యారని కూడా చెబుతున్నారు. జరిగిన నష్టాన్ని కప్పెట్టే ఎత్తుగడతో అయిదు భారత్ విమానాలను కూల్చామంటూ పాక్ స్వోత్కర్షలకు పోతోంది. సంప్రదాయానికి భిన్నంగా ఈసారి పాక్ లోలోపలివరకూ చొచ్చుకెళ్లి దాడులు సాగించిన తీరూ, ఒక్క క్షిపణి కూడా గురితప్పకుండా శత్రుమూకలపై చండ్రనిప్పులు కురిపించిన విధానం మన త్రివిధ దళాల పకడ్బందీ అంచనాలకూ, పదునైన వ్యూహచతురతకూ దర్పణాలు. పాక్ గడ్డపై గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఉగ్రశిబిరాల ఆనుపానుల్ని శత్రునేత్రానికి చిక్కని విధంగా గత పక్షం రోజులుగా మానవ రహిత విమానాలతో జల్లెడపట్టాకే ఈ దాడులు జరిగాయి. పహల్గామ్ సమీపంలో అకారణంగా, అన్యాయంగా నిరాయుధ భారత పౌరులను గురిచూసి కాల్చిచంపటానికి కిరాయిమూకల్ని పంపి కొన్నిరోజులుగా పాకిస్తాన్ మురుస్తోంది. దీనిపై నిలదీస్తే షరా మామూ లుగా సాక్ష్యాలడుగుతోంది. గత నెల 22న పహల్గామ్ సమీపంలో ఉగ్రవాద ముఠా 26 మందిని పొట్టనబెట్టుకున్నప్పటి నుంచీ భారత ప్రజ ప్రతీకారంతో రగిలిపోతోంది. కంటికి కన్ను సిద్ధాంతం పాటించి గట్టి దెబ్బతీయాల్సిందేనన్న అభిప్రాయం అలుముకుంది. ఈ నేపథ్యంలో మన దళాల దాడులు విజయవంతం కావటం అందరినీ సాంత్వన పరుస్తుందనటంలో సందేహం లేదు.అనుకోని పరిణామాలు తలెత్తితే అనుసరించాల్సిన పద్ధతులపై పౌరులకు అవగాహన కల్పించటానికి బుధవారం మాక్ డ్రిల్ జరగటం, అంతకుముందు రోజు రాత్రే మన త్రివిధ దళాలు దాడులు చేయటం గమనిస్తే వర్తమానం ఎంత జటిలంగా ఉన్నదో అర్థమవుతుంది. ఇది మనం కోరుకున్నది కాదు. మన ప్రమేయం లేకుండా వచ్చిపడిన విపత్తు. అకారణంగా మనపై రుద్దిన సంక్లిష్ట సమస్య. దీనికి దీటుగా స్పందించకపోతే ఉగ్రదాడులకు అంతూ పొంతూ ఉండదు. కనుకనే పహల్గామ్ మారణకాండ గురించి తెలియగానే ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ పర్యటనను రద్దుచేసుకుని వెను దిరిగారు. ఆ వెంటనే మంత్రివర్గ సహచరులతో, త్రివిధ దళాల అధిపతులతో వరస సమాలోచనలు సాగించారు. ఎప్పుడు, ఎక్కడ ఎలా దాడులు సాగించాలో, తీవ్రత ఏ స్థాయిలో వుండాలో మీరే నిర్ణ యించండంటూ మన దళాలకు అధికారం ఇచ్చారు. పర్యవసానంగానే పాక్ ప్రాపకంతో చెలరేగి పోతున్న ఉగ్రముఠాలకు గట్టి సమాధానం వెళ్లింది. ఈ దాడులకు చాలాముందే ఇతరేతర నిర్ణ యాలు తీసుకున్నారు. సింధూ నదీజలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించ టంతోపాటు ఇండియా పలు చర్యలు తీసుకుంది. దీన్నంతటినీ గమనిస్తున్నవారికి మన దేశం సైనిక చర్యకు కూడా వెనకాడబోదని పక్షం రోజుల క్రితమే అర్థమైంది. యుద్ధం దేనికీ పరిష్కారం కాకపోవచ్చు. చర్చలే అంతిమంగా ఎంతటి జటిల సమస్యనైనా పరిష్కరిస్తాయన్న సిద్ధాంతం కూడా సరైనదే కావొచ్చు. కానీ పొరుగు పచ్చగావుంటే ఓర్వలేక నిష్కారణంగా దాడులకు దిగే నైజాన్ని శాంతిప్రవచనాలతో ఎదుర్కొనటం సాధ్యమేనా? ఒకపక్క పహల్గామ్ దాడులతో సంబంధం లేదంటూనే గత కొన్ని రోజులుగా అధీనరేఖ వద్దా, అంత ర్జాతీయ సరిహద్దు వద్దా పాక్ ఎలాంటి కవ్వింపూ లేకుండా కాల్పులకు దిగుతోంది. ఈ దాడుల కారణంగా ఒక్క బుధవారంనాడే పూంఛ్ జిల్లా గ్రామాల్లో 12 మంది పౌరులు బలయ్యారు. తన దుష్ట పన్నాగాలను కప్పిపుచ్చటానికి భద్రతామండలిలో పాకిస్తాన్ అమాయకత్వం నటిస్తూ భారత్ తీసు కుంటున్న వరస చర్యలకు వ్యతిరేకంగా తీర్మానం చేయించాలని విఫలయత్నం చేసింది. రేపో మాపో అది నేరుగా సైన్యాన్ని రంగంలోకి దించి ప్రతీకారం పేరిట చెలరేగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఉగ్రముఠాల ద్వారా మారణహోమానికి పాల్పడటం కన్నా ఒకరకంగా ఇది మంచిదే. భారత్ బెదిరిపోయి సైనిక దాడుల ఆలోచన మానుకుంటుందన్న తప్పుడు ఆలోచనతో కొన్ని రోజులుగా అది అణుబాంబు బెదిరింపులకు కూడా తెగించింది. ఆ దుస్సాహసానికి పూనుకుంటే చేజేతులా స్వీయవినాశనాన్ని కొనితెచ్చుకున్నానని పాక్ పశ్చాత్తాపపడే రోజు ఎంతో దూరంలో ఉండదు. ఈ కష్టకాలంలో దేశ ప్రజానీకం కుల మత భేదాలు మరిచి కలిసికట్టుగా ఉండటం అత్య వసరం. ఇదే అదనుగా నాలుగు ఓట్ల కోసమో, మరికొన్ని సీట్ల కోసమో ప్రజల్లో వైషమ్యాలు సృష్టించాలని చూసే అవాంఛనీయ శక్తుల్ని అందరూ సకాలంలో పోల్చుకుని దూరం పెట్టడం, తగిన బుద్ధి చెప్పటం ఎంతో అవసరం. మనలోని సమష్టితత్వమే ఎంతటి విపత్తునైనా ఎదుర్కొనే ధైర్యాన్ని స్తుంది. విజయాన్ని మన చేతికందిస్తుంది.

రాజ్యాంగ ఉల్లంఘన అంతా రహస్యమే
సాక్షి, అమరావతి: అప్పులు మీద అప్పులు చేసుకుంటూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ 436 గనుల్లోని అత్యంత విలువైన ఖనిజ సంపదను ప్రైవేట్ వారికి సర్వ హక్కులతో తాకట్టు పెడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం అందులోనూ సొంత లాభం చూసుకుంటోంది! ఎందులోనైనా సరే తన వ్యక్తిగత ప్రయోజనం ఉండాలని ఆశిస్తూ అందుకు తగ్గట్టుగా పథకాలు రచిస్తోంది. తాజాగా ఏపీఎండీసీ ద్వారా జారీ చేస్తున్న ఎన్సీడీ బాండ్ల వ్యవహారంలో ఒకపక్క దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా.. రూ.లక్షల కోట్ల విలువైన ఖనిజాలను తాకట్టు పెట్టి ఏపీఎండీసీ ద్వారా ప్రభుత్వం రూ.9 వేల కోట్ల విలువైన బాండ్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం చట్ట విరుద్ధంగా ఏకంగా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కులివ్వడంపై ఆర్థిక నిపుణులు నివ్వెరపోతున్నారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ ఇలా బరి తెగించి రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కులు కల్పించలేదని పేర్కొంటున్నారు. ఎడాపెడా అప్పులు చేస్తున్న కూటమి సర్కారు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో బడ్జెట్ బయట ఏపీఎండీసీ ద్వారా ఎన్సీడీ బాండ్లు జారీ చేసి నిధులను సమీకరిస్తోంది. లాభాల్లో ఉన్న ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పులు చేయడం వల్ల రుణ ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అంతా రహస్యమే..ఎన్సీడీ బాండ్ల జారీకి సంబంధించి అత్యంత కీలకమైన సమాచారాన్ని ఇన్వెస్టర్లకు తెలియకుండా గుట్టుగా ఉంచి కేవలం తమవారే లాభపడేలా ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. బాండ్లు కొనుగోలు చేసిన వారు నేరుగా ప్రభుత్వ సంచిత నిధి నుంచి డబ్బులు తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్న విషయాన్ని రహస్యంగా ఉంచడం ద్వారా రుణ మార్కెట్లో పోటీ లేకుండా పోతుంది. వాస్తవానికి పోటీ ఉంటే వడ్డీ తగ్గి ప్రభుత్వానికి ప్రయోజనం ఉంటుంది.అదే పోటీ లేకుండా చేస్తే ఎక్కువ వడ్డీకి బాండ్లు విక్రయించాల్సి వస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతున్నప్పటికీ తాము ఎంపిక చేసిన వారికి ఎక్కువ వడ్డీకి బాండ్లు విక్రయించి, వారికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా సర్కారు వ్యవహరిస్తోంది. సెకండరీ మార్కెట్లో ఆ బాండ్లను ప్రీమియం ధరలకు విక్రయించడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తులకు పెద్ద ఎత్తున లాభం చేకూర్చి క్విడ్‌ప్రోకో ద్వారా లబ్ధి పొందాలన్నది ప్రభుత్వ పెద్దల ప్రణాళిక.కీలక సమాచారాన్ని తొక్కిపెట్టి..దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కన్సాలిడేటెడ్ ఫండ్‌పై ప్రైవేట్ వారికి హక్కులు కల్పించడం రాజ్యాంగ ఉల్లంఘనే అని ఆర్థిక నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా సర్కారు పెడచెవిన పెడుతోంది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా లెక్క చేయకుండా బాండ్ల జారీకి సిద్ధమైంది. ఈమేరకు బాండ్ల జారీ ప్రక్రియను ఏపీఎండీసీ గురువారం ప్రారంభించనుంది. ఇందుకోసం ఇటీవలే సెబీలోని ఇబీపీ (ఎలక్ట్రానిక్ బుక్ ప్రొవైడర్) ప్లాట్ఫామ్లో ఆన్లైన్ బిడ్డింగ్‌లో పాల్గొనాలని ఇన్వెస్టర్లను ఆహ్వానించింది. ఈ బాండ్ల జారీలో నిబంధనలు, షరతుల గురించి తెలిపే జీఐడీ (జనరల్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్), కేఐడీ (కీ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్) పత్రాలను ఆ పోర్టల్‌లో పెట్టింది. అయితే బాండ్లు కొన్న వారికి ఆర్బీఐ కన్సాలిడేటెడ్ ఫండ్‌పై హక్కులు ఉంటాయనే కీలకమైన సమాచారాన్ని ఆ డాక్యుమెంట్లలో పొందుపరచలేదు.చివరి నిమిషంలో..బుధవారం సాయంత్రం 4.30 గంటలకు మాత్రమే కన్సాలిడేటెడ్ ఫండ్‌పై హక్కుల విషయాన్ని ఈబీపీ ప్లాట్ఫామ్లో పొందుపరిచారు. అదే ఈ విషయం ముందే తెలిసి ఉంటే పెద్ద ఇన్వెస్టర్లు చాలామంది ఈ బాండ్ల కోసం పోటీ పడేవారు. ఎందుకంటే.. కన్సాలిడేటెడ్ ఫండ్ ద్వారా తాము పెట్టిన సొమ్ముకు కచ్చితమైన భరోసా ఉంటుంది కాబట్టి. ఇది ఏ ప్రభుత్వమూ ఇవ్వని బంపర్ ఆఫర్ లాంటిది. ఏ ప్రభుత్వమైనా సరే, ఎంత అప్పు చేసినా దానికోసం ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు అధికారం కల్పించదు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అప్పులు చేయడమే ధ్యేయంగా రాజ్యాంగ విరుద్ధమైన పనులకు సిద్ధమైంది. అయితే ఆ సమాచారం ఇన్వెస్టర్లకు తెలియకుండా రహస్యంగా ఉంచి కేవలం తమకు అనుకూలమైన వారు మాత్రమే బాండ్లు కొనుగోలు చేసేలా వ్యూహం రూపొందించింది. అంటే వారు మాత్రమే బాండ్లు కొనుగోలు చేసి సెకండరీ మార్కెట్లో వాటిని ఎక్కువ వడ్డీకి అమ్ముకునే అవకాశం కల్పించింది. తద్వారా ఏపీఎండీసీ నుంచి నేరుగా బాండ్లు కొనుగోలు చేసిన ప్రభుత్వానికి సన్నిహితులైన వ్యక్తులు లాభపడతారు.సమయం ఇవ్వకుండా..నిజానికి ఈ ప్రయోజనం ప్రభుత్వానికి దక్కాలి. కానీ కుట్రపూరితంగా కన్సాలిడేటెడ్ ఫండ్ విషయాన్ని కేవలం తమ అనుయాయులకు మాత్రమే లీక్ చేసి ఇతర ఇన్వెస్టర్లకు తెలియనివ్వలేదు. దీంతో పెద్ద ఇన్వెస్టర్లు వీటిని సాధారణ బాండ్లుగానే పరిగణించి పెద్దగా ఆసక్తి చూపలేదు. అదే కన్సాలిడేటెడ్ ఫండ్ విషయం తెలిసి ఉంటే చాలామంది బిడ్డింగ్‌లో పాల్గొనేవారని నిపుణులు చెబుతున్నారు.కానీ ఇతరులు బిడ్డింగ్‌లో పాల్గొనకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు ఆ విషయాన్ని జీఐడీ, కేఐడీ డాక్యుమెంట్లలో కావాలనే పొందుపరచలేదు. ఏపీఎండీసీ ఎండీ జారీ చేసిన డాక్యుమెంట్లలో అత్యంత కీలకమైన ఈ విషయం గురించి వెల్లడించకపోవడం తెలిసి చేసిన తప్పిదంగానే కనిపిస్తోంది. ఆఖరి నిమిషాల్లో ఈ విషయాన్ని బయటపెట్టడంతో అర్హత ఉన్న ఇన్వెసర్లు బాండ్లు కొనేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇన్వెస్టర్లు బాండ్లు కొనాలంటే తమ ఇన్వెస్ట్మెంట్ కమిటీల నుంచి అనుమతి తీసుకోవడానికి కొద్ది రోజుల సమయం పడుతుంది. అలాంటి అవకాశం వారికి ఇవ్వకుండా చివరి నిమిషంలో అసలు విషయాన్ని బహిర్గతం చేశారు. తద్వారా ప్రభుత్వ పెద్దలు తమ అనుయాయులు మాత్రమే బాండ్లు కొనుగోలు చేసేలా కుట్ర పన్నారు.

గతానికి భిన్నంగా...
ఏప్రిల్ నెల చివరలో జమ్మూ–కశ్మీర్‌లోని పహల్గామ్లో 26 మంది నిరాయుధులను దారుణంగా హత్య చేసినందుకు ప్రతీకారంగా, మే 7 ఉదయం పాకిస్తాన్లో ఉగ్రవాదులకు స్థావరంగా ఉన్న తొమ్మిది ప్రదేశాలపై భారత సైన్యం దాడి చేసింది. పహల్గామ్ ఘాతుక చర్యకు సమాధానం ఇచ్చి తీరుతామని దేశ రాజకీయ నాయకత్వం స్పష్టం చేయడంతో సైనిక దాడి తప్పదని తేలిపోయింది. అయితే, పాక్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి జరగడం ఇదే మొదటి సారి కాదు, కానీ సరిహద్దు రేఖలు మారుతున్నాయని సూచించే లక్షణాలు ‘ఆపరేషన్ సిందూర్’లో ఉన్నాయి.సరిహద్దును దాటి...పాకిస్తాన్లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై చివరి ప్రధాన దాడి 2019 ఫిబ్రవరిలో చోటు చేసు కుంది. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని బాలాకోట్‌ను అప్పుడు భారత వైమానిక దళం లక్ష్యంగా చేసుకుంది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్ కేంద్ర బిందువైన పంజాబ్ ప్రావిన్స్‌లోని ప్రదేశాలపై భారతీయ సైన్యం దాడికి దిగింది. 1971 యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం లొంగిపోయిన తర్వాత,భారత వాయుసేన నియంత్రణ రేఖను దాటడం ఇదే మొదటిసారి. దక్షిణ పంజాబ్‌లోని బహావల్పూర్లో జైష్–ఎ–మొహమ్మద్ ప్రధాన కార్యాలయం ఉంది. పంజాబ్‌లోని మరొక ప్రదేశం మురీద్కే! ఇక్కడ లష్కరే తోయిబా చాలా కాలంగా ఉనికిలో ఉంది. అయితే కశ్మీర్లో వాస్తవ సరిహద్దును గుర్తించే ఎల్ఓసీకీ, పాకిస్తానీ పంజాబ్‌కు మధ్య వ్యత్యాసం ఏమిటంటే, స్థిరపడిన అంతర్జాతీయ సరిహద్దు. సూటిగా చెప్పాలంటే, ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులకు చెందిన భౌగోళిక ప్రాంతం ఇప్పుడు విస్తరించింది. ప్రతీకారం తీర్చుకునే విషయంలో పాకిస్తాన్‌లోని ఏ ప్రదేశం కూడా భారత్ లక్ష్యాలకు దూరంగా లేదని తాజా దాడులు స్పష్టంగా సందేశమిస్తున్నాయి.1971 నాటి యుద్ధంలోని ముఖ్యాంశాలలో ఒకటి, భారత సైన్యంలోని త్రివిధ బలగాలూ పాల్గొనడమే! నాటి యుద్ధంలో పూర్తి విజయం సాధించడానికి త్రివిధ దళాలు కలిసి పనిచేశాయి. ఆపరేషన్ సిందూర్‌లో కూడా మూడు దళాలూ పాల్గొన్నాయని ప్రభుత్వం తెలిపింది. వనరులను అత్యంత సమర్థంగా ఉపయోగించుకోవడానికి సైన్యం దీర్ఘకాలిక లక్ష్యంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్లకు ఇది శుభ సూచకం.నిజానికి భారతదేశం నుండి ప్రతిస్పందన అని వార్యం అయింది. అయినా భారీ స్థాయి దళాల కదలికల ద్వారా భారత్ ప్రతిస్పందన ఉంటుందని చెప్పే సూచన లేవీ లేవు. పాకిస్తాన్ వైపు మాత్రం వారు ప్రతిస్పందన కోసం సిద్ధమవుతున్నప్పుడు గణనీయ స్థాయిలో దళాల కదలిక కనిపించింది. అదే సమయంలో భారత్ సంయమన మార్గాన్ని ఎంచుకుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన దాడుల్లో ఏవీ పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోలేదు. ఈ దాడిని ఉగ్రవాద మౌలిక సదుపాయాల నిర్మూలనకే పరిమితం చేశారు. దాడుల తర్వాత కూడా ప్రభుత్వం తన మీడియా ప్రకటనలో భారతదేశం తీవ్ర స్థాయి యుద్ధంలోకి వెళ్లకుండా ఉండాలనుకుంటున్నట్లు స్పష్టంగా సూచించింది.ప్రతిదాడి చేయడానికి ముందు, భారతదేశం తాను అనుకున్న విధంగా ప్రతీకారం తీర్చుకోవడానికి గణనీయమైన స్థాయిలో అంతర్జాతీయ మద్దతును సాధించింది. చైనా మాత్రమే దీనికి మినహాయింపు. అదే సమయంలో, అంతర్జాతీయ ప్రధాన శక్తులు వాణిజ్య యుద్ధంతో పాటుగా పశ్చిమాసియాలో, ఉక్రెయిన్‌లో దీర్ఘకాలిక సంఘర్షణ సవాలును ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఇరుదేశాల మధ్య ఘర్షణలు ఒక స్థాయికి మించి పెరగకూడదని అవి ఆశిస్తున్నాయి.వికసిత భారత్, రుణ సంక్షోభ పాక్‌భారతదేశం మూడు దశాబ్దాలకు పైగా జమ్మూకశ్మీర్‌లో పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదంతో పోరాడు తోంది. ఈ క్రమంలో రెండు దేశాలలోనూ, వేర్వేరు ఆర్థిక పథాల్లో అభివృద్ధి జరుగుతోంది. భారత్ తన ఆర్థిక సరళీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన 1991 నాటికి, పాకిస్తాన్ తలసరి జీడీపీ భారత్ కంటే ఎక్కువగా ఉంది. తాజాగా ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం, 2023లో పాకిస్తాన్ తలసరి జీడీపీ 1,365 డాలర్లు కాగా, భారత్ జీడీపీ 82 శాతం ఎక్కువగా 2,481 డాలర్ల వద్ద ఉంది. అంటే రెండు దేశాల ఆర్థిక పథాలు వాటి వ్యూహాత్మక ఎంపికలను ప్రభావితం చేశాయి.భారత్ ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే మార్గంలో ఉంది. ‘బ్రెగ్జిట్’ తర్వాత అది బ్రిటన్‌తో చేసుకున్న అత్యంత ముఖ్యమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఇటీవలే ముగించింది. మరోవైపు, పాకిస్తాన్ ఒక రుణ సంక్షోభం నుండి మరొక రుణ సంక్షోభానికి గురవుతూ, ఐఎమ్ఎఫ్ ఆపన్న హస్తం కోసం విజ్ఞప్తి చేస్తోంది. అది దాదాపు చైనా కాలనీగా మారింది. ఈ నేపథ్యంలో రెండు దేశాలు ఎంచుకున్న ఎంపికలనూ, పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సార్వభౌమాధికారపు నిరంతర బలహీనతనూ పరిశీలించడం అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో జనరల్ అసీమ్ మునీర్‌కు అది ఎంతో ఉపయోగకరంగా ఉండవచ్చు.సంజీవ్ శంకరన్ వ్యాసకర్త ‘మనీ కంట్రోల్’ ఒపీనియన్స్–ఫీచర్స్ ఎడిటర్

చమురుపై రూ.1.8 లక్షల కోట్లు ఆదా
న్యూఢిల్లీ: చమురు ధరలు కనిష్ట స్థాయికి చేరిన క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు వీటి దిగుమతులపై రూ.1.8 లక్షల కోట్ల మేర ఆదా అవుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల రూపంలోనే సమకూరుతుండడం తెలిసిందే. వీటి దిగుమతుల కోసం భారత్ 2024–25లో 242.4 బిలియన్ డాలర్లను (రూ.20.60 లక్షల కోట్లు) వెచ్చించినట్టు ఇక్రా నివేదిక తెలిపింది. ఎల్ఎన్జీ దిగుమతుల కోసం 15.2 బిలియన్ డాలర్లు (రూ.1.29 లక్షల కోట్లు) ఖర్చు చేసినట్టు పేర్కొంది. ఈ వారంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర 60.23 డాలర్ల కనిష్టానికి చేరుకోవడం గమనార్హం. 2021 ఫిబ్రవరి తర్వాత కనిష్ట స్థాయికి చమురు ధరలు చేరుకుకోవడం మళ్లీ ఇదే మొదటిసారి. 2024 మార్చితో పోల్చి చూసుకున్నా బ్యారెల్ ముడి చమురు ధర 20 డాలర్లు తక్కువగా ఉంది. నాడు పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం రూ.2 చొప్పున తగ్గించడం తెలిసిందే. 2025–26 సంవత్సరంలో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 60–70 డాలర్ల మధ్య ఉండొచ్చని ఇక్రా అంచనా వేసింది. ఈ ధరల ప్రకారం అప్‌స్ట్రీమ్ ఆయిల్ కంపెనీలకు (ముడి చమురు ఉత్పత్తి సంస్థలు) రూ.25,000 కోట్ల మేర పన్నుకు ముందు లాభం సమకూరుతుందని అంచనా వేసింది. ఇక ఎల్ఎన్జీ దిగుమతులపై రూ.6,000 కోట్లు, ముడి చమురు దిగుమతులపై రూ.1.8 లక్షల కోట్ల చొప్పున మిగులుతుందని పేర్కొంది. ఆయిల్ మార్కెటింగ్ (రిటైల్) సంస్థలకు మార్జిన్లు మెరుగ్గా ఉంటాయని.. ఎల్పీజీపై నష్టాలు తగ్గుతాయని వెల్లడించింది.
మాక్‌డ్రిల్స్.. వెల్
బావ మా అక్క మరో పెళ్లి చేసుకుంటుంది..!
ఆపరేషన్ సిందూర్.. తొలిసారి స్పందించిన పాక్ ప్రధాని
డాడీ.. లే డాడీ..
పహల్గాం దాడికి తగిన నివాళి
ఆరుగురి ప్రయాణమే ఈ సినిమా
ట్రైలర్ చూశాక ఈర్ష్య కలిగింది
పాక్‌ను ఇంకెలా దెబ్బ కొట్టాలంటే...
వెండితెరపైకి అహల్యా బాయి హోల్కర్ జీవితం
బ్రిటన్ ఎఫ్టీఏతో వ్రస్త పరిశ్రమకు బూస్ట్..
చూడటానికి మొక్కజొన్న పంట.. కానీ దగ్గరకెళ్తే షాకవ్వుతారు!
సారీ సార్! యుద్ధమొస్తే నేనూ వెళ్లిపోతా...
కుమారుడి ధోతి వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బుల్లితెర నటి మంజుల (ఫొటోలు)
భారత్ మాపై దాడి చేసేది అప్పుడే.. పాక్ మాజీ దౌత్వవేత్త సంచలన ట్వీట్!
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. శుభవార్తలు వింటారు
ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి.. సంఘంలో గౌరవమర్యాదలు
మొదట్నుంచి మీరే ఏదో రకంగా విదేశీయులకు హర్రర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూపిస్తున్నారుగా సార్!!
గోదావరి ప్రజల ఆరాధ్య దైవం.. శ్రీ తలుపులమ్మ తల్లి దేవాలయం (ఫొటోలు)
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్య భాయ్
ఉగ్రబుద్ధిపై వక్రభాష్యం!
ఫ్లాష్ ఫ్లాష్: పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..30 మంది ఉగ్రవాదుల హతం
#MetGala2025 : చరిత్ర సృష్టించిన కియారా.. మొదటిసారి బేబీ బంప్‌తో ఇలా! (ఫొటోలు)
ఆపరేషన్ సిందూర్ అప్డేట్స్.. రేపు కేంద్రం అఖిలపక్ష సమావేశం
భాగ్యశ్రీ బోర్సే బర్త్ డే స్పెషల్.. కిక్ ఇచ్చే ఫోటోలు చూశారా..?
నేడు ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల
యుద్ధానికి సిద్ధం!.. నేడు కేంద్ర హోంశాఖ కీలక సమీక్ష
భారత్ దాడులు.. పాక్ ప్రధాని రియాక్షన్ ఇదే..
IPL 2025: చెత్త ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రిషబ్ పంత్
మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!
త్వరలో నా డ్రీమ్ ప్రాజెక్ట్‌తో తిరిగొస్తా: కార్తీక్ సుబ్బరాజ్
మాక్‌డ్రిల్స్.. వెల్
బావ మా అక్క మరో పెళ్లి చేసుకుంటుంది..!
ఆపరేషన్ సిందూర్.. తొలిసారి స్పందించిన పాక్ ప్రధాని
డాడీ.. లే డాడీ..
పహల్గాం దాడికి తగిన నివాళి
ఆరుగురి ప్రయాణమే ఈ సినిమా
ట్రైలర్ చూశాక ఈర్ష్య కలిగింది
పాక్‌ను ఇంకెలా దెబ్బ కొట్టాలంటే...
వెండితెరపైకి అహల్యా బాయి హోల్కర్ జీవితం
బ్రిటన్ ఎఫ్టీఏతో వ్రస్త పరిశ్రమకు బూస్ట్..
సినిమా

'న్యూ బిగినింగ్స్'.. మళ్లీ జంటగా కనిపించిన సమంత
గతంలో హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. తర్వాత విడాకులు తీసుకుంది. ఇది జరిగి దాదాపు నాలుగేళ్లు గడిచిపోయాయి. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటోంది. కానీ గత కొన్నిరోజుల క్రితం సమంత పెళ్లి గురించి రూమర్స్ వినిపించాయి. ఇప్పుడదే దర్శకుడితో మళ్లీ కనిపించడం, ఆ ఫొటోలని పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.విడాకుల తర్వాత సమంత.. తాను మయాసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డాననే విషయాన్ని బయటపెట్టింది. మధ్యలో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమా చేసింది. ఇది తప్పితే మరో మూవీ చేయలేదు. మధ్యలో ఓ వెబ్ సిరీసులో నటించిందంతే.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం ఇంట్లో సీమంతం వేడుక) సరే అసలు విషయానికొస్తే.. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో రెండో సీజన్ లో సమంత నటించింది. ఈ సిరీస్ చేసిన దర్శకుల్లో ఒకరైన రాజ్ తో రీసెంట్ టైంలో సమంత ఎప్పటికప్పుడు కలిసి కనిపిస్తూనే ఉంది. కొన్నిరోజుల క్రితం ఇద్దరూ కలిసి తిరుపతి కూడా వెళ్లొచ్చారు. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు వినిపించాయి. సామ్ నుంచి రెస్పాన్స్ లేదు కాబట్టి ఇది రూమర్ గానే మిగిలిపోయింది.తాజాగా న్యూ బిగినింగ్స్ అని ఓ పోస్ పెట్టింది. ఇందులో తన త్రలాలా నిర్మాణ సంస్థ గురించి, తాను నిర్మించిన శుభం మూవీ గురించి కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులోనూ రాజ్ తో సమంత దిగిన కొన్ని ఫొటోలు కనిపించాయి. దీంతో బయట వినిపిస్తున్న రూమర్స్ ని ఏమైనా నిజం చేస్తారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'రెట్రో'ని దెబ్బ కొట్టిన చిన్న సినిమా.. ఓటీటీకి అప్పుడేనా?) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)

ఆమిర్‌ని కలిసిన అల్లు అర్జున్.. భారీ ప్రాజెక్ట్ కోసమేనా?
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan)తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) భేటీ అయ్యారు. ముంబైలోని ఆమిర్ నివాసానికి వెళ్లిన బన్నీ..ఆయనతో కాసేపు ముచ్చటించారు. ఇలా ఉన్నపళంగా ఆమిర్‌తో బన్నీ బేటీ కావడంపై రకరకాల పుకార్లు వెల్లువడుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతుందని, దాని కోసమే ఆమిర్‌ని కలిశాడని బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమిర్ తన తదుపరి చిత్రం సితారే జమీన్ పర్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన భారీ బడ్జెట్‌తో ‘మహా భారతం’ తీయాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో స్టార్ హీరోలు నటిస్తారని ఇటీవల ఆయన ప్రకటించారు. తాజాగా బన్నీ వెళ్లి కలవడంతో..‘మహా భారతం’కోసమే ఈ భేటీ జరిగిందనే ప్రచారం మొదలైంది. దీనిపై అధికారిక ప్రకటనలు ఏవీ రాకపోయినా, అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ ఇప్పుడు బన్నీ-ఆమిర్ భేటీనే హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బన్నీ అట్లీ సినిమాతో బీజీగా ఉన్నారు. ఇందులో ఆయన డ్యూయల్ రోల్ ప్లే చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే బన్నీ షూటింగ్లో పాల్గొంటారు. ఇందులో హాలీవుడ్ తరహాలో విజువల్స్ ఉండబోతున్నాయట. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారని, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్లను ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మూడో కథానాయికగా ‘లైగర్’ ఫేమ్ అనన్యా పాండేను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారని సమాచారం.

త్రిష బర్త్ డే సెలబ్రేషన్స్.. హాలీవుడ్ స్టైల్లో మీనాక్షి
హీరోయిన్ త్రిష పుట్టినరోజు సెలబ్రేషన్స్వింటేజ్ హాలీవుడ్ స్టైల్లో మీనాక్షి చౌదరిశుభం మూవీతో బిజీ.. సామ్ క్యూట్ పోస్ట్డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో శ్రద్ధా కపూర్అందాల అపరంజి బొమ్మలా ఐశ్వర్య లక్ష్మీబ్యాక్ పోజులతో కిక్కిస్తున్న కావ్య థాపర్చీరలో హెబ్బా పటేల్ స్వీట్ పోజులు View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Samyuktha Viola Viswanathan (@samyukthaviswanathan) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Sakshi Agarwal |Actress |Fitness & Lifestyle (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah)

'రెట్రో'ని దెబ్బ కొట్టిన చిన్న సినిమా.. ఓటీటీకి అప్పుడేనా?
కొన్నిసార్లు చిన్న సినిమానే కదా ఏమవుతుందిలే అనుకుంటాం. కానీ అదే భారీ దెబ్బ కొట్టొచ్చు. తమిళ ప్రేక్షకుల్ని ప్రస్తుతం ఎంటర్ టైన్ చేస్తున్న 'టూరిస్ట్ ఫ్యామిలీ'ని చూస్తే అదే అనిపిస్తుంది. ఎందుకంటే సూర్య 'రెట్రో'కి పోటీగా రిలీజ్ అనేసరికి చాలామంది.. బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుందా అనుకున్నారు. కానీ ఇప్పుడదే సూపర్ రెస్పాన్స్ సంపాదించుకుంది.చాలా తక్కువ బడ్జెట్, సింపుల్ కథతో తీసిన ఈ సినిమా మే 01న రిలీజైతే ఇప్పటివరకు రూ.20 కోట్ల కలెక్షన్స్ కూడా రాలేదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. పోటీలో ఉన్న రెట్రో కంటే దీన్ని చూసేందుకే ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) అసలు విషయానికొస్తే ఈ సినిమాని త్వరలో తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది కానీ అది జరిగే పనిలా అనిపించట్లేదు. ఎందుకంటే ఇది తమిళ ఫ్లేవర్ తో తెరకెక్కిన కథ. దీన్ని తెలుగులో ఆదరిస్తారా అంటే సందేహమే. అదే టైంలో ఓటీటీలో రావడానికి నాలుగు వారాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారట.ఈ లెక్కన చూసుకుంటే 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమా ఓటీటీలోకి మే 31న వచ్చే సూచనలు గట్టిగా ఉన్నాయి. తెలుగు వెర్షన్ కూడా అప్పుడే అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ మూవీలో సిమ్రాన్ తప్పితే మనకు తెలిసిన ముఖం లేదు.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం ఇంట్లో సీమంతం వేడుక)
న్యూస్ పాడ్‌కాస్ట్

పాకిస్తాన్ ఉగ్రవాద తండాలపై 'రక్త సిందూరం' 100 మందికి పైగా ముష్కరులు హతం..

పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..

దుష్ట పాకిస్తాన్ భరతం పట్టడానికి ముహూర్తం ఖరారు... ఈ వారాంతంలోపే భారీ ఆపరేషన్ జరిగే అవకాశం... బుధవారం రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్స్

యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందం... అత్యధిక ధరకు 400 మెగావాట్ల విద్యుత్ కొనడానికి అంగీకారం

అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

వణుకుతున్న పాకిస్తాన్. భారత్‌ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన: కేంద్రం కీలక నిర్ణయం

ఏపీలో అంతులేని అవినీతి, అంతా అరాచకమే: వైఎస్ జగన్

రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం
క్రీడలు

కోల్‌కతాకు చెన్నై ఝలక్
కోల్‌కతా: ఐపీఎల్ ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ కీలక పోరులో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ అవకాశాలపై దెబ్బ కొట్టింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై 2 వికెట్ల తేడాతో నైట్‌రైడర్స్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అజింక్య రహానే (33 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆండ్రీ రసెల్ (21 బంతుల్లో 38; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), మనీశ్ పాండే (28 బంతుల్లో 36 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించగా...నూర్ అహ్మద్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం చెన్నై 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 183 పరుగులు సాధించింది. డెవాల్డ్ బ్రెవిస్ (25 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా...శివమ్ దూబే (40 బంతుల్లో 45; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ఉర్విల్ పటేల్ (11 బంతుల్లో 31; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించారు. పవర్‌ప్లేలోపే సగం వికెట్లు కోల్పోయి 60/5 వద్ద నిలిచిన చెన్నై ఓటమి ఇక లాంఛనమే అనిపించింది. కానీ బ్రెవిస్, దూబే పోరాడంతో పాటు చివర్లో ధోని (17 నాటౌట్) పట్టుదలగా నిలబడటంతో గెలుపు సాధ్యమైంది. తాజా ఫలితంతో కోల్‌కతా ‘ప్లే ఆఫ్స్’కు వెళ్లడం దాదాపు అసాధ్యంగా మారింది. మిగిలిన 2 మ్యాచ్‌లలో గెలిచి గరిష్టంగా 15 పాయింట్లకు చేరినా ముందుకెళ్లడం కష్టమే. సాంకేతికంగా రేసులో ఉన్నా... ఈసారి కథ ముగిసినట్లే! ఐపీఎల్లో నేడుపంజాబ్ X ఢిల్లీవేదిక: ధర్మశాలరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

IPL 2025: బ్రెవిస్ విధ్వంసం.. కేకేఆర్‌పై సీఎస్కే విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 7) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌పై సీఎస్కే 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. నూర్ అహ్మద్ 4 వికెట్లు తీసి కేకేఆర్‌ను దెబ్బేశాడు. అన్షుల్ కంబోజ్, జడేజా తలో వికెట్ తీశారు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రహానే (48), మనీశ్ పాండే (36 నాటౌట్), రసెల్ (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కే 60 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ.. డెవాల్డ్ బ్రెవిస్ (52) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో తన జట్టును తిరిగి గెలుపు ట్రాక్‌లో పెట్టాడు. మధ్యలో దూబే (45) బాధ్యతాయుతంగా ఆడి సీఎస్కే విజయతీరాలవైపు మళ్లించాడు. ఆఖరి ఓవర్లో 8 పరుగులు అవసరమైన తరుణంలో అప్పటిదాకా కామ్‌గా ఉన్న ధోని (17 నాటౌట్) సిక్సర్ కొట్టి సీఎస్కేకు గెలుపుకు చేరువ చేశాడు. నాలుగో బంతికి కంబోజ్ బౌండరీ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. ఈ గెలుపు వల్ల సీఎస్కేకు ఒరిగేది ఏమీ లేనప్పటికీ కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బకొట్టింది. బ్రెవిస్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 30 పరుగులువైభవ్ అరోరా వేసిన 11వ ఓవర్లో డెవాల్డ్ బ్రెవిస్ శివాలెత్తిపోయాడు. 3 ఫోర్లు, 3 సిక్సర్లు సహా 30 పిండుకున్నాడు. ఈ ఒక్క ఓవర్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు ఓటమి ఖాయమనుకున్న సీఎస్కే ఒక్కసారిగా గెలుపు ట్రాక్‌లోకి వచ్చింది.బ్రెవిస్ 20 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు.

IPL 2025: పడిక్కల్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిని ప్రకటించిన ఆర్సీబీ
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతూ, ప్లే ఆఫ్స్ బెర్త్‌కు అతి సమీపంలో ఉంది. ఈ సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు ముందు మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో ఒక్క మ్యాచ్ గెలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌ల్లో లక్నో (మే 9), సన్‌రైజర్స్ (మే 13), కేకేఆర్‌లతో (మే 17) తలపడనుంది.కాగా, ఆర్సీబీకి సీఎస్కేతో ఆడిన గత మ్యాచ్‌లో ఓ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు వన్‌డౌన్ ఆటగాడు, ఇన్ఫామ్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్ గాయపడ్డాడు. తాజాగా ఆర్సీబీ యాజమాన్యం పడిక్కల్ స్థానాన్ని భర్తీ చేసింది. పడిక్కల్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిగా మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేసింది. మయాంక్‌ను ఆర్సీబీ కోటి రూపాయలకు దక్కించుకుంది. 34 ఏళ్ల మయాంక్‌కు ఐపీఎల్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2011 నుంచి అతను వివిధ ఫ్రాంచైజీల తరఫున 127 మ్యాచ్‌లు ఆడి 2661 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత సీజన్లో మయాంక్ సన్‌రైజర్స్‌లో ఉన్నాడు. ఈ సీజన్ మెగా వేలంలో మయాంక్‌ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. తమ తొలి టైటిల్ వేటను విజయవంతంగా సాగిస్తున్న ఆర్సీబీకి మున్ముందు ఆడబోయే కీలక మ్యాచ్‌ల్లో మయాంక్ ఏ మేరకు తోడ్పడతాడో చూడాలి. మయాంక్‌కు గతంలో (2011) ఆర్సీబీకి ఆడిన అనుభవం ఉంది. మయాంక్ స్వస్థలం బెంగళూరే కావడం అతనికి కలిసొచ్చే అంశం. మయాంక్ దేవ్ స్థానాన్ని భర్తీ చేయగలడో లేదో చూడాలి. దేవ్ ఈ సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడి 247 పరుగులు చేశాడు.హ్యారీ బ్రూక్‌కు ప్రత్యామ్నాయంగా అటల్లీగ్ ప్రారంభానికి ముందు వైదొలిగిన హ్యారీ బ్రూక్ స్థానాన్ని ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు సెదిఖుల్లా అటల్‌తో భర్తీ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి 13 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో కొనసాగుతుంది.

IPL 2025: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా
వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో సీఎస్కే తరఫున ఆల్‌టైమ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా అవతరించాడు. ఐపీఎల్ 2025లో భాగంగా కేకేఆర్‌తో ఇవాళ (మే 7) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో తన కోటా 4 ఓవర్లు వేసిన జడేజా కీలకమైన రహానే వికెట్ తీశాడు. సీఎస్కే తరఫున లీడింగ్ వికెట్ టేకర్‌గా అవతరించే క్రమంలో జడేజా డ్వేన్ బ్రావోను అధిగమించాడు. ఐపీఎల్లో జడేజా సీఎస్కే తరఫున 184 మ్యాచ్‌ల్లో 141 వికెట్లు సాధించగా.. బ్రావో 116 మ్యాచ్‌ల్లో 140 వికెట్లు తీశాడు.ఐపీఎల్లో సీఎస్కే తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..141* - రవీంద్ర జడేజా (184 మ్యాచ్‌లు)140 - డ్వేన్ బ్రావో (116 మ్యాచ్‌లు)95 - ఆర్ అశ్విన్ (104 మ్యాచ్‌లు)76 - దీపక్ చాహర్ (76 మ్యాచ్‌లు)76 - ఆల్బీ మోర్కెల్ (78 మ్యాచ్‌లు)60 - శార్దూల్ ఠాకూర్ (57 మ్యాచ్‌లు)58 - మోహిత్ శర్మ (48 మ్యాచ్‌లు)మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. నూర్ అహ్మద్ 4 వికెట్లు తీసి కేకేఆర్‌ను దెబ్బేశాడు. అన్షుల్ కంబోజ్, జడేజా తలో వికెట్ తీశారు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రహానే (48), మనీశ్ పాండే (36 నాటౌట్), రసెల్ (38) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. సునీల్ నరైన్ 26, గుర్భాజ్ 11, రఘువంశీ 1, రింకూ సింగ్ 9 పరుగులు చేసి ఔటయ్యారు.కాగా, ఈ సీజన్లో సీఎస్కే కథ ముగిసిన విషయం తెలిసిందే. ఆ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ సీజన్లో ఆడిన 11 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించింది.కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ఇంకా పోటీలో ఉంది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 11 పాయింట్లు సాధించింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఓ పాయింట్ వచ్చింది. కేకేఆర్ ఈ మ్యాచ్‌తో కలుపుకుని ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది.
బిజినెస్

ఐటీ ఉద్యోగం ఒక్కసారి పోతే.. ఇక అంతే..!
ప్రస్తత పరిస్థితిలో ఐటీ ఉద్యోగం తెచ్చుకోవడం ఎంత కష్టమో.. దాన్ని నిలబెట్టుకోవడమూ అంతే కష్టం. ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంపొందించుకుంటూ మంచి పనితీరు కనబర్చాలి. వెనకబడిన ఉద్యోగులను కంపెనీలు ఉపేక్షించడం లేదు. వెంటనే ఉద్వాసన పలుకుతున్నాయి. దీనికి సంబంధించే ప్రపంచ టెక్ దిగ్గజం కీలక నిర్ణయం తీసుకుంది.పనితీరు సమస్యలతో ఉద్యోగం కోల్పోయి కంపెనీని వీడిన ఉద్యోగులపై మైక్రోసాఫ్ట్ రెండేళ్ల నిషేధం విధానాన్ని ప్రవేశపెట్టింది. అంటే ఇలా జాబ్ పోగుట్టుకుంటే మళ్లీ రెండేళ్ల వరకూ ఆ ఛాయలకూ కూడా వెళ్లే అవకాశం ఉండదన్న మాట. అంతేకాదు.. ఈ ఉద్యోగాల కోతలను 'గుడ్ అట్రిషన్'గా పిలుస్తారు. అంటే కంపెనీని విడిచిపెట్టాలనుకునే ఉద్యోగులను సంతోషం.. దయచేయండి.. అని భావిస్తుందని బిజినెస్ ఇన్సైడర్ నివేదిక తెలిపింది.గత రెండు నెలలుగా మైక్రోసాఫ్ట్ తన సిబ్బంది పనితీరు నిర్వహణ ప్రక్రియను పునర్వ్యవస్థీకరిస్తోంది. పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగులపై కంపెనీ కఠినంగా వ్యవహరించింది. పనితీరు కనబరచని ఉద్యోగులను తొలగించే సంస్థ వ్యూహంలో భాగంగా ఈ రెండు కొత్త టూల్స్ ఉన్నాయి.ఈ ఏడాది పనితీరు తక్కువగా ఉన్న 2000 మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ తొలగించింది. పనితీరు సరిగా లేని ఉద్యోగులకు కంపెనీ సెవెరెన్స్ ప్యాకేజీ కూడా ఇవ్వలేదు. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం కంపెనీ 'గుడ్ అట్రిషన్' ప్రణాళిక ప్రతి సంవత్సరం నిర్ణీత శాతం ఉద్యోగులను తొలగించాలన్న కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది.బడా టెక్ కంపెనీల పనితీరు విధానాల్లో మార్పుబడా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల నిలుపుదల, పనితీరు విధానాల్లో విస్తృత మార్పు వచ్చింది. మెటా, అమెజాన్ వంటి కంపెనీలు కూడా తమ ప్రస్తుత, ఔట్ గోయింగ్ ఉద్యోగుల పనితీరుపై కఠిన విధానాలను ప్రవేశపెట్టాయి. గతంలో అమెజాన్ 'అన్ గ్రేటెడ్ అట్రిషన్'ను ప్రవేశపెట్టింది.దీని ప్రకారం మేనేజర్లు ప్రతి సంవత్సరం తమ బృందంలో కొంత మందిని తొలగించాల్సి ఉంటుంది. పనితీరు తక్కువగా ఉన్న తమ ఉద్యోగులపై కూడా మెటా వేటు వేస్తోంది. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం ఇక తిరిగి నియమించుకోకూడదనంటూ కొంతమంది మాజీ ఉద్యోగులను ఈ కంపెనీ జాబితా చేసిపెట్టుకుంది.

హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈఎంఐలు తగ్గుతాయ్...
దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో లోన్ కస్టమర్లు చెల్లించే నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) తగ్గనున్నాయి. ఈ మేరకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (ఎంసీఎల్ఆర్) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన రుణ కాలపరిమితిపై ఎంసీఎల్ఆర్ను 15 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) అంటే 0.15% తగ్గించింది.ఈ సవరణ తరువాత,హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ ఇప్పుడు రుణ కాలపరిమితిని బట్టి 9 శాతం నుంచి 9.20 శాతం వరకు ఉంటుంది. ఇది ఇంతకు ముందు 9.10 శాతం నుంచి 9.35 శాతం ఉండేది. సవరించిన రేట్లు మే 7 నుంచి అమల్లోకి వచ్చాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏప్రిల్‌లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో తరువాత హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా ఎంసీఎల్ఆర్లో మార్పులు చేసింది. 2025 ఫిబ్రవరి నుండి రెపోరేటు మొత్తం తగ్గింపు 50 బేసిస్ పాయింట్లకు చేరుకుంది. రెపో రేటు అనేది వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణంపై వసూలు చేసే వడ్డీ రేటు. ఇది తగ్గితే సాధారణంగా బ్యాంకింగ్ రంగంలో రుణ వ్యయాలు తగ్గుతాయి. ఫలితంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి బ్యాంకులు తక్కువ రుణ రేట్ల ద్వారా తక్కువ ఫండింగ్ ఖర్చుల ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేస్తున్నాయి.రుణగ్రహీతలకు ఏంటి ప్రయోజనం?ఎంసీఎల్ఆర్ అనేది ఒక నిర్దిష్ట రుణం కోసం ఒక ఆర్థిక సంస్థ వసూలు చేయాల్సిన కనీస వడ్డీ రేటు. ఇది రుణానికి వడ్డీ రేటు తక్కువ పరిమితిని నిర్ణయిస్తుంది. ప్రత్యేకంగా ఆర్బీఐ సవరిస్తే తప్ప ఇదే రేటును బ్యాంకులు అమలు చేస్తాయి. 2016లో ఆర్బీఐ ప్రవేశపెట్టిన ఎంసీఎల్ఆర్ను గృహ, వ్యక్తిగత, వాహన రుణాలతో సహా వివిధ ఫ్లోటింగ్ రేట్ రుణాలకు ఉపయోగిస్తారు. ఎంసీఎల్ఆర్ తగ్గడం వల్ల రుణం ఫిక్స్డ్ లేదా ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై ఆధారపడిన రుణ ఈఎంఐలు తగ్గుతాయి లేదా రుణ కాలపరిమితి తగ్గుతుంది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజా ఎంసీఎల్ఆర్ రేట్లుఓవర్నైట్: 9.00%1 నెల: 9.00%3 నెలలు: 9.05%6 నెలలు: 9.15%1 సంవత్సరం: 9.15%2 సంవత్సరాలు: 9.20%3 సంవత్సరాలు: 9.20%

పాక్‌కు యూకే షాక్.. వీసాలపై పరిమితులు!
లండన్: చదువు, ఉద్యోగం కోసం వెళ్లి శరణార్థి పేరిట అక్కడే శాశ్వతంగా తిష్ట వేస్తున్న పాకిస్తాన్ పౌరులకు యూకే షాకిచ్చింది. ఆసైలం (శాశ్వత నివాసం) దరఖాస్తుల సంఖ్య పెరుగుదల నేపథ్యంలో పాకిస్తానీ పౌరులకు యూకే వీసా నిబంధనలను కఠినం చేయనుంది. వీసా ఓవర్‌స్టేలు, ఆసైలం దరఖాస్తులపై కఠిన చర్యల్లో భాగంగా, యూకే ప్రభుత్వం పాకిస్తానీ పౌరులతో పాటు నైజీరియా, శ్రీలంక నుండి వచ్చే వారికి స్టడీ, వర్క్ వీసాలపై కఠినమైన పరిమితులను విధించనుందని టైమ్స్ వార్తా సంస్థ కథనం పేర్కొంది.యూకే శాశ్వత నివాసం కోసం వీసా హోల్డర్ల నుండి దరఖాస్తులు ఇటీల అసాధారణ స్థాయిలో పెరుగుతున్నాయి. ఇందులో పాకిస్తానీ పౌరులు అగ్రస్థానంలో ఉన్నారు. హోమ్ ఆఫీస్ డేటా ప్రకారం.. 2024లో మొత్తం 108,000 మంది ఆసైలం కోసం దరఖాస్తు చేసుకోగా వీరిలో అత్యధికంగా 10,542 మంది పాకిస్తానీ పౌరులే ఉన్నారు.వీరిలో 16,000 మంది స్టూడెంట్ వీసాలపై యూకేకి వచ్చారు. పాకిస్తానీ, నైజీరియన్, శ్రీలంక దేశీయులు వర్క్, స్టూడెంట్ లేదా విజిటర్ వీసాలపై వచ్చి ఆ తర్వాత ఆసైలం కోసం దరఖాస్తు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనిని అధికారులు "సిస్టమ్ దుర్వినియోగం"గా వర్ణించారు. ఈ నేపథ్యంలో వీసాలిచ్చే సమసయంలోనే కఠినంగా వ్యవహరించాలని యూకే ప్రభుత్వం భావిస్తోంది.కొత్త నిబంధనల్లో భాగంగా వీసా దరఖాస్తుదారులను వారి ఆసైలం దరఖాస్తు రిస్క్‌ను అంచనా వేయడానికి ప్రొఫైలింగ్ చేస్తారు. అధిక రిస్క్‌గా భావించిన వారి వీసా దరఖాస్తులను తిరస్కరిస్తారు. అంతేకాదు..వీసా హోల్డర్లు ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నట్లు నిరూపించుకోకపోతే, వారికి పన్ను చెల్లింపుదారుల నిధులతో నడిచే వసతి సౌకర్యాలను నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. యూకే ప్రభుత్వం 2024లోనూ కేర్ వర్కర్లు, స్టూడెంట్లకు డిపెండెంట్లను తీసుకురాకుండా కఠిన నిబంధనల విధించించింది. దీంతో అప్పటి నుంచి 2025 మార్చి నాటికి వీసా దరఖాస్తులు 37 శాతం తగ్గి 7,72,200కి తగ్గాయి.అయితే, ఈ ప్రతిపాదనలు వివాదాన్ని రేకెత్తించాయి. జాతీయత ఆధారంగా ప్రొఫైలింగ్ చేయడం వివక్ష దావాలకు దారితీయవచ్చని ఇమ్మిగ్రేషన్ లాయర్ అహ్మద్ ఖాన్, హెచ్చరించారు. "ఈ విధానాలు మూల కారణాలను పరిష్కరించకుండా మొత్తం సమాజాలను అన్యాయంగా లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉంది" అని ఆయన అన్నారు. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య తగ్గడం, శ్రామిక లోటుతో ఇప్పటికే సమస్యలు ఎదుర్కొంటున్న విశ్వవిద్యాలయాలు, వ్యాపారాలు కూడా ఆర్థిక ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేశాయి.

మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ఆర్థిక ఉత్పత్తులు
టైర్ 2, ఇతర పట్టణాల్లో చిన్నతరహా వ్యాపారాలు నిర్వహించే మహిళలు తమ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన ఆర్థిక ఉత్పత్తులను కోరుకుంటున్నట్టు ‘భారత్ ఉమెన్ యాస్పిరేషన్ ఇండెక్స్ (బీడబ్ల్యూఏఐ) 2025’ నివేదిక వెల్లడించింది. బిజినెస్ మేనేజన్మెంట్ ప్లాట్‌ఫామ్ ‘టైడ్’ దీన్ని విడుదల చేసింది.అంతేకాదు ఆయా పట్టణాల్లో చిన్నతరహా మహిళా పారిశ్రామికవేత్తల్లో మూడింట ఒక వంతు మంది రుణం పొందే విషయంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. తనఖా నిబంధనలు కఠినంగా ఉండడం, ఆర్థిక అక్షరాస్యత తగినంత లేకపోవడం వీరిని రుణ సదుపాయానికి దూరం చేస్తోందని, వీరికి తనఖా రహిత సూక్ష్మ రుణాలు సహా తదితర ప్రత్యామ్నాయ రుణ సదుపాయాలు అందించేందుకు సత్వర విధానపరమైన చర్యలు అవసరమని ఈ నివేదిక సూచించింది.‘‘టైర్ 2, 3, అంతకంటే చిన్న పట్టణాల్లో మహిళా పారిశ్రామికవేత్తలు డిజిటల్ అవగాహనతో వృద్ధి చెందాలన్న ఆకాంక్షలతో ఉన్నారు. కానీ, రుణ సదుపాయం, నెట్‌వర్క్‌లు, తదితర సంస్థాగత అంతరాలు వారిని వెనకడుగు వేసేలా చేస్తున్నాయి’’అని తెలిపింది. మహిళల అభిప్రాయాలు.. 1,300 మంది మహిళా వ్యాపారవేత్తల అభిప్రాయాలను బీడబ్ల్యూఏఐ సర్వే చేసింది. ఆరి్థక, వ్యాపార నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సి ఉందని 58% మంది చెప్పడం గమనార్హం. డిజిటల్ నైపుణ్యాలను పెంచుకోవాలన్న బలమైన ఆకాంక్ష 12 శాతం మందిలో కనిపించింది.28 శాతం మంది నిధుల విషయంలో తమ కుటుంబం నుంచి పురుష సభ్యుడి సహకారం అవసరమని చెప్పారు. వ్యవస్థాపకులుగా వారి ప్రయాణంలో ఇదొక పెద్ద అడ్డంకిగా నివేదిక పేర్కొంది.డిజిటల్ నైపుణ్యాల పెంపు, వారికి లభిస్తున్న వివిధ పథకాల సమాచారం అందించడం, నెట్వర్కింగ్ పెంపు ద్వారా మహిళా పారిశ్రామికవేత్తల లక్ష్యాలను సులభతరం చేయొచ్చని ఈ నివేదిక సూచించింది.
ఫ్యామిలీ

Met Gala 2025: స్టైలిష్ డిజైనర్‌వేర్‌లో ఇషా..ఏకంగా 20 వేల గంటలు..
ప్రతిష్టాత్మకమైన మెట్‌గాలా 2025 ఈవెంట్లో బాలీవుడ్ తారలంతా తమదైన ఫ్యాషన్ శైలిలో మెరిశారు. వారందరిలో ఈ ఇద్దరే ఈవెంట్ అటెన్షన్ మొత్తం తమవైపుకు తిప్పుకున్నారు. ఈ మెట్‌గాలా ఈవెంట్‌కే హైలెట్‌గా నిలిచాయి వాళ్లు ధరించిన డిజైనర్ వేర్లు. ఒకరు భారతీయ వారసత్వ సంప్రదాయన్ని ప్రపంచ వేదికపై చూపించగా.. మరొకరు భారతీయ హస్తకళకు ఆధునికతను జోడించి హైరేంజ్ ఫ్యాషన్‌తో అలరించారు. ఆ ప్రమఖులు ఎవరు..? ఆ ఈవెంట్ ప్రత్యేకతే ఏంటి తదితరాల గురించి చూద్దామా..!.మెట్ గాలా ఈవెంట్లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిన ప్రముఖులు ఇషా అంబానీ(Isha Ambani), గాయని దిల్జిత్ దోసాంజ్(Diljit Dosanjh)లు. ఇద్దరూ ఈవెంట్లో భారతీయ ఫ్యాషన్ కళ తమ భారతీయ సంప్రదాయ వారసత్వం, చేతికళలు గొప్పదనం తదితరాలే అర్థం పట్టేలా అట్రాక్టివ్ దుస్తుల్లో మెరిశారు. మొత్తం ఈవెంట్ వారి చుట్టూనే తిరుగుతుందేమో అనేంతగా ఉంది ఆ ఇరువురి లుక్. స్టైలిష్ డ్రెస్‌లో ఇషా..భారతీయ హస్తకళలకు పేరుగాంచిన ఫ్యాషన్ డిజైనర్ అనామిక ఖన్నా ఇషా డిజైనర్ వేర్ని రూపొందించారు. టాప్ గోల్డ్ దారంతో ఎంబ్రాయిడరీ చేసిన త్రీపీసెస్ కార్సెట్ ఇది. దానికి సరిపోయే బ్లాక్ కలర్ వెయిస్టెడ్ టైలర్డ్ ప్యాంటు విత్ తెల్లటి క్యాప్ లుక్‌లో అత్యంత స్టైలిష్ లుక్‌లో కనిపించింది ఇషా. అయితే డిజైనర్ అనామిక ఈ డ్రెస్‌కి అందమైన లుక్ ఇచ్చేందుకు దాదాపు 20 వేల గంటలు పైనే శ్రమించారట. ఒక పక్క చేతితో చేసిన బెనరస్ ఫ్యాబ్రిక్‌పై జర్దోజీ ఎంబ్రాయిడరీ, సున్నితమైన మోటిఫ్‌లు వంటి వాటితో సంప్రదాయ మేళవింపుతో కూడిన ఆధునిక ఫ్యాషన్ వేర్లా డిజైన్ చేశారామె. ప్రతి చిన్న కుట్టు మన సంప్రదాయ కళను సాంస్కృతికి అర్థం పట్టేలా శ్రద్ధ తీసుకుని మరీ డిజైన్ చేశారు. చూడటానికి బ్లాక్ డాండీ ఫ్యాషన్ లుక్లా అదిరిపోయింది. ఆ ఫ్యాషన్ వేర్కి తగ్గట్లు వింటేజ్ కార్టియర్ నెక్లెస్ ధరించారామె. నవానగర్ మహారాజుకు చెందిన ఈ నెక్లెస్ మొత్తం 480 క్యారెట్ల డైమెండ్ల తోపాటు షో-స్టాపింగ్ 80.73-క్యారెట్ కుషన్-కట్ డైమండ్ కూడా ఉంది. అలాగే చేతికి పక్షి ఉంగరాలు, నడుముకి వజ్రాలతో కూడిన ఆభరణం తదితరాలు ఆమె లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేశాయి. View this post on Instagram A post shared by Anaita Shroff Adajania (@anaitashroffadajania) రాయల్ లుక్‌లో దిల్జిత్ దోసాంజ్గాయకుడు దిల్జిత్ దోసాంజ్ మెట్ గాలా 2025 నీలిరంగు కార్పెట్‌పై రాయల్ పంజాబీ దుస్తుల్లో కనిపించారు. ఈ ప్రతిష్టాత్మకమైన వేదికపై సాంప్రదాయ సిక్కు వారసత్వాన్ని తెలియజేసేలా తలపాగా ధరించి వచ్చారు. సిక్కు రాయల్టీకి తగ్గ రాజదర్పంతో ఠీవీగా కనిపించారు దిల్జిత్ దోసాంజ్. భారతీయ రాజ వంశాలు ధరించే రత్నాలు, ముత్యాలు, పచ్చలు కూడిన ఆభరణాలు ధరించారు. సిక్కు శౌర్యం, గౌరవానికి ప్రతీక అయిన కత్తిని కూడా పట్టుకుని వచ్చారు. మెట్‌గాలాకి సంబంధించిన ఫ్యాషన్ వేర్ కాకపోయినా..గర్వంగా మా సంస్కృతే మా ఫ్యాషన్ అని చాటిచెప్పాడు. ఇదిలా ఉండగా, ఈ వేడుకలో ఇతర బాలీవుడ్ తారలు షారుఖ్ ఖాన్, కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా వంటి ప్రముఖులు కూడా తమదైన స్టైలిష్‌వేర్‌లో మెరిశారు. కాగా, ఈ ఏడాది న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో జరిగిన ఈ ఛారిటీ ఈవెంట్ థీమ్ "సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్". అయితే ఈ 20 ఏళ్లలో పురుషుల దుస్తుల లుక్స్ పైకూడా దృష్టిసారించడం ఇదే మొదటిసారి. View this post on Instagram A post shared by DILJIT DOSANJH (@diljitdosanjh) (చదవండి: 16 ఏళ్లకే బ్రెస్ట్ కేన్సర్ సర్జరీ..! జస్ట్ 15 రోజుల్లేనే మిస్ వరల్డ్ వేదికకు..)

కనుమరుగవుతున్న మామిడి వెరైటీలు ఇవే..!
ప్రపంచంలో మామిడిపండ్లకు చిరునామాగా సగర్వంగా నిలిచిన భారతదేశం, అనేకరకాల ప్రాదేశిక మామిడి పండ్లను కలిగి ఉంది. వీటిలో ప్రతీ మామిడి రకం తనదైన ప్రత్యేకమైన రుచి, సువాసన, సాంస్కృతిక నేపథ్యంతో ప్రసిద్ధి చెందింది. కానీ మార్కెట్ ఆధారిత వ్యవస్థ వల్ల వాణిజ్యపరంగా మొలకెత్తిన హైబ్రిడ్ రకాల ప్రభావంతో, ఈ విలువైన దేశీ మామిడి రకాలు క్రమంగా అదృశ్యం అవుతున్నాయి. ఇప్పటికే అన్ని చోట్లా లభించడం తగ్గిపోయిన ఈ మామిడి రకాలను ఈ వేసవి టూర్ల సందర్భంగా ఎక్కడైనా దొరికితే ఆస్వాదించడం మరచిపోవద్దు. 1. కరుప్పట్టి కాయ – తమిళనాడుతమిళనాడు దక్షిణ ప్రాంతాల్లో పుట్టిన ఈ కరుప్పట్టి కాయ ప్రత్యేకత ఏమిటంటే, ఇది చక్కెర పాకం (పామ్ జాగరీ)ను తలపించే రుచిని కలిగి ఉంటుంది. ఈ మామిడి పచ్చిగా తినడానికి కూడా బాగుంటుంది. అలాగే పచ్చళ్ల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. ఆకుపచ్చ రంగు ఫైబర్‌తో నిండిన గుజ్జుతో ఇది ప్రత్యేకంగా గుర్తింపు పొందింది.2. కన్నిమాంగా – కేరళకేరళలో కన్నిమాంగా అనే చిన్న మామిడికాయలు పచ్చడికి ప్రసిద్ధి. ‘కన్నిమాంగా‘ అంటే ‘కన్య మామిడి‘, అంటే పూర్తి పక్వతకు ముందు కోయబడే కాయలు. ఈ రకాన్ని పచ్చడి రూపంలో వాడితే, కేరళ వంటకాల మసాలా రుచులకు ఇది సరిపోతుంది. అధిక దిగుబడి కలిగిన వాణిజ్య రకాల సాగు పెరిగిన నేపథ్యంలో, ఈ మామిడి మొక్కలు చాలా వరకు కనుమరుగవుతున్నాయి. అయితే స్థానిక రైతులు గిరిజన సంఘాలు దీన్ని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.3. కల్భావి మావు – కర్ణాటకకర్ణాటక తీరప్రాంతాలలో పుట్టిన కల్భావి మావు మామిడి, గులాబీ వాసన తీపి రుచితో కొత్తగా ఉంటుందనే పేరు సంపాదించింది. ఇది గోల్డెన్ యెల్లో రంగులో మధ్య పరిమాణంలో ఉంటుంది. అదనపు తీపి కలిగి ఉండడంతో నేరుగా తినడానికి మాత్రమే కాకుండా స్వీట్స్ తయారీలో కూడా వాడేవారు. ఇటీవలి వరకూ మార్కెట్లలో విరివిగా లభించిన ఈ రకం, క్రమంగా తగ్గిపోతోంది. 4. బటాషా – పశ్చిమ బెంగాల్బెంగాల్కు చెందిన బటాషా మామిడి, బాగా తీయగా ఉంటుంది. ఇది చిన్న పరిమాణంలో ఉండి, రసం నిండిన గుజ్జుతో ఉంటుంది అయితే దీని మృదువైన తొక్క ఎక్కువ దూరాలకు తరలించలేనంత సున్నితంగా ఉండటంతో, ఈ మామిడి వాణిజ్యం పెద్దగా పుంజుకోలేదు. దాంతో దీని సాగు కూడా తగ్గిపోతోంది. ప్రస్తుతం ఇది కేవలం కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తోంది.5. అమ్మ చెట్టు – ఆంధ్రప్రదేశ్ఈ మామిడి రకాన్ని అందించే చెట్టుకు తెలుగులో ‘‘అమ్మ చెట్టు’’ అనే పేరు, మామిడికి కూడా అదే పేరు. పెద్దదైన పరిమాణం, ఫైబర్‌తో నిండిన గుజ్జుతో ఉన్న ఈ మామిడి చెట్లు గ్రామీణ జీవన విధానంలో భాగంగా ఉండేవి. అయితే, ఈ చెట్ల నిర్వహణ కష్టం కావడంతో, ఈ రకం సాగు తగ్గిపోయింది. ఇక ఇది కేవలం కథల్లో, జ్ఞాపకాలలో మాత్రమే మిగిలిపోనుంది. అధిక దిగుబడి, హైబ్రిడ్ రకాలపై దృష్టి పెరగడంతో దేశీ రకాల మామిడి ప్రాధాన్యత తగ్గిపోయింది. అలాగే టెంక లేని పండ్లను ఇష్టపడే ఆధునిక వినియోగదారుల అభిరుచి వల్ల, స్వాభావికంగా పెరిగే దేశీ రకాల విస్త్రుతికి అడ్డంకి ఏర్పడింది. మరోవైపు నగరీకరణ విస్తరణ వల్ల తోటలపై భౌగోళిక ఒత్తిడి పెరిగింది. యువతలో దేశీరకాల గురించి అవగాహన లేకపోవడం కూడా సాగును దెబ్బతీసింది.ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో... కారణాలేవైనా మనదైన మామిడి వెరైటీలను మనం కోల్పోతుండడం దురదృష్టకర పరిణామమేనని చెప్పాలి.(చదవండి: కల్తీ పుచ్చకాయను పసిగట్టొచ్చు ఇలా..!)

మంచి పుచ్చకాయను గుర్తించండి ఇలా!
వేసవిలో లభించే పుచ్చకాయలు అందరికీ ఇష్టం, అంతకంటే చల్లని నేస్తాల వంటివి అనొచ్చు. వాటి సహజమైన తీపి, అధిక నీటి శాతం వాటి రిఫ్రెషింగ్ రుచితో పాటు కలర్‌ఫుల్ రూపం కూడా సమ్మర్లో వాటిని తిరుగులేనివి పండుగా నిలబెట్టాయి. ఈ పుచ్చకాయల వల్ల ఆరోగ్య ప్రయోజనాలూ అనేకం...పుచ్చకాయ కేవలం అలసిపోయినప్పుడు రిఫ్రెష్ చేసే పండు మాత్రమే కాదు, అవసరమైన పోషకాలతో కూడా నిండి ఉంటుంది. దాదాపు 9092% నీటితో కూడిన పుచ్చకాయ, వేసవి వేడి సమయంలో హైడ్రేషన్ కోసం ఒక అద్భుతమైన ఎంపిక. ఒక 100 గ్రాముల పుచ్చకాయ ద్వారా దాదాపు 16 కేలరీలు లభిస్తాయి తక్కువ కేలరీల పండుగా, బరువును నియంత్రించుకునే వారికి పుచ్చకాయ అనుకూలంగా ఉంటుంది. దీనిలో సి, ఎ, బి6 విటమిన్లు అలాగే పొటాషియం మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. పొటాషియం మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడటం వలన ఈ పండు అధిక రక్తపోటు ఉన్నవారికి మరింత ప్రయోజనకరం. దీని విటమిన్ సి కంటెంట్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా కూడా పనిచేసి వివిధ వ్యాధులకు దారితీసే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. పుచ్చకాయ జీర్ణక్రియకు సహాయపడుతుంది, దానిలోని ఇనుము శాతం కారణంగా రక్తహీనత ఉన్నవారికి మంచిది. పండులోని ఎరుపు భాగాన్ని తరచుగా అత్యంత రుచికరంగా పరిగణిస్తారు, అయితే చర్మం దగ్గర ఉన్న లేత ఆకుపచ్చ రంగులో ఉండే భాగం సైతం ఎక్కువ పోషక ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్యపరంగా పుచ్చకాయ వల్ల ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ, దానిని కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. వేసవి నెలల్లో, రోడ్డు పక్కన ఎర్రగా, కోసిన పుచ్చకాయ రూపం ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే, మార్కెట్లో చాలా కల్తీ పుచ్చకాయలు ఉన్నాయి, మరి తాజా, ఆరోగ్యకరమైన పుచ్చకాయను కొనుగోలు చేస్తున్నారని తెలుసుకోవడం ఎలా? నాణ్యత లేని పండ్ల ద్వారా మోసపోకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ఉండడం ఎలా? ఇప్పుడు చూద్దాం..కల్తీ పుచ్చకాయ అంటే హానికరమైన రసాయనాలు, రంగులు లేదా ఆర్టిషియల్ రిపైనింగ్ ఏజెంట్లను ఉపయోగించి దాని రూపాన్ని లేదా బరువును పెంచడానికి తారుమారు చేసిన పండు. సాధారణ కల్తీ పద్ధతుల్లో దాని గుజ్జును ఎర్రగా కనిపించేలా చేయడానికి ఆర్టిషియల్ కలర్‌ను ఇంజెక్ట్ చేయడం, బరువు పెంచడానికి నీటిని జోడించడం లేదా తాజాదనాన్ని కాపాడటానికి రసాయనాలను ఉపయోగించడం వంటివి చేస్తున్నారు. ఈ పద్ధతులు మన ఆరోగ్యానికి హానికరం, కాబట్టి విశ్వసనీయ విక్రేతల నుంచి మాత్రమే పుచ్చకాయలను కొనుగోలు చేయడం సహజ పక్వత సంకేతాలను తనిఖీ చేయడం ముఖ్యంమంచి పుచ్చకాయను ఎలా గుర్తించాలి? పుచ్చకాయను కొనుగోలు చేసేటప్పుడు, రంగు ముఖ్యం. నిస్తేజమైన చర్మం ఉన్న దాని కంటే శక్తివంతమైన, తగిన రంగు కలిగిన పుచ్చకాయ మంచి ఎంపిక. పక్వానికి ముఖ్య సూచిక దానిని తట్టినప్పుడు వచ్చే శబ్దం బోలుగా ఉండే, తేలికపాటి శబ్దం పండు నీటితో నిండి ఉందని మంచిదని సూచిస్తుంది. అదనంగా, ఏవైనా మచ్చలు లేదా గాయాలు ఉన్నాయా అని పుచ్చకాయను తనిఖీ చేయాలి, ఎందుకంటే ఇవి నష్టం లేదా చెడిపోవడాన్ని సూచిస్తాయి. పుచ్చకాయ అడుగున పసుపు మచ్చల కోసం ఉండాలి. అలా మచ్చలు ఉంటే ఈ పుచ్చకాయను సరైన సమయంలో సహజంగా పండించారని అర్ధం. అయితే, లేత లేదా తెల్లటి మచ్చలు ఉంటే పండు పూర్తిగా పక్వానికి రాకముందే కోసినట్లు అర్ధం View this post on Instagram A post shared by Adithya Nataraj 🇮🇳 (@learnwithadithya) (చదవండి: World Asthma Day: శ్వాసకు ఊపిరి పోద్దాం..! ఆస్తమాను అదుపులో ఉంచుదాం..!)

జపాన్‌లో శాకాహారమా..? సలాడ్లతో సరిపెట్టుకోవాల్సిన పనిలేదు..
అందమైన దేశంలో ఒకటిగా పేరుగాంచింది జపాన్. అక్కడ నగరాలన్నీ ప్రకృతి రమణీయతతో ఆహ్లాదభరితంగా ఉంటాయి. తప్పక పర్యటించాల్సిన దేశమే అయినా..పర్యాటకులకు ఇబ్బంది కలిగించేది ఆహారం. అందులోనూ శాకాహారులే అయితే మరింత సమస్య. అక్కడ ఏది ఆర్డర్ చేసిన అందులో తప్పనిసరిగా ఏదో ఒక నాన్‌వెజ్ ఉంటుంది. తినాలంటేనే భయం భయంగా ఉంటుంది. అందుకే అక్కడ పర్యటించే టూరిస్ట్‌లు స్టోర్స్‌లో దొరికే సలాడ్లు వంటి ఇతర పదార్థాలపై ఆధారపడతారు. ఇక అలా ఇబ్బంది పడాల్సిన పనిలేదు అంటూ జపాన్‌లో కూడా శాకాహారం దొరుకుతుందని చెబుతోంది బాలీవుడ్ నటి బర్ఖాసింగ్. ఇంతకీ జపాన్‌లో ఎక్కడ శాకాహారం లభిస్తుందంటే..జపాన్‌లో ఒసాకా, క్యోటో, టోక్యో అంతట మనకు శాకాహార భోజనం లభిస్తుందట. ఇక్కడ అందించే వంటకాల్లో చేపలు లేదా మాంసాన్ని జోడించకుండా టమోటా ఆధారిత రెసిపీలు ఎక్కువగా దొరుకుతాయట. అక్కడ పూర్తి శాఖాహారం తోకూడిన వేగన్ మెనూ పర్యాటకుల్ని ఆకర్షిస్తుందట. అందువల్ల ఎలాంటి సంకోచంల లేకుండా నచ్చిన వంటకాలన్నీ ఆస్వాదించొచ్చు అని చెబుతున్నారు నటి బర్ఖాసింగ్. చాక్లెట్ గ్యో ఐస్ క్రీం, సోబా నూడుల్స్ వంటి టేస్టీ టేస్టీ వంటకాల రుచి చూడొచ్చట. ఇక కోకో ఇచిబన్యా రెస్టారెంట్ కూరగాయలతో చేసిన కర్రీలకు ఫేమస్ అట. అక్కడ మనకు తెలియని కొంగొత్త కూరగాయల రుచులు మైమరిపిస్తాయని చెబుతోంది బర్ఖాసింగ్. అలాగే అక్కడ ఉండే చిన్న చిన్న స్టాల్స్ మెత్తటి చీజ్‌కేక్, కస్టర్డ్ నిండిన పాన్కేక్లకు పేరుగాంచినవని చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, బాలీవుడ్ నటి, మోడల్ బర్ఖాసింగ్ పలు సినిమాలు, టీవీ షోల్లో నటించింది. అంతేగాదు వైవిధ్యభరితమైన నటనకు ప్రసిద్ధిగాంచిన నటి బర్ఖాసింగ్. View this post on Instagram A post shared by Barkha Singh (@barkhasingh0308) (చదవండి: 16 ఏళ్లకే బ్రెస్ట్ కేన్సర్ సర్జరీ..! జస్ట్ 15 రోజుల్లేనే మిస్ వరల్డ్ వేదికకు..)
ఫొటోలు


హైదరాబాద్‌లో ఉత్కంఠభరితంగా ‘ఆపరేషన్ అభ్యాస్’ మాక్ డ్రిల్ (ఫొటోలు)


భార్యకు సీమంతం చేసిన హీరో కిరణ్ అబ్బవరం (ఫొటోలు)


Miss World 2025: సుందరీమణులకు స్వాగతం


తిరుమలలో వైభవంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు (ఫొటోలు)


భారత్ తడాఖా.. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ విలవిల (ఫొటోలు)


మిస్ వరల్డ్ పోటీల విలేకరుల సమావేశంలో నందినీ గుప్తా, సోనూసూద్ (ఫొటోలు)


ఘనంగా తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)


మెట్‌గాలా 2025 ఈవెంట్లో మెరిసిన ఇషా అంబానీ (ఫోటోలు)


'శుభం' కోసం తెగ కష్టపడుతున్న సమంత (ఫొటోలు)


భాగ్యశ్రీ బోర్సే బర్త్ డే స్పెషల్.. కిక్ ఇచ్చే ఫోటోలు చూశారా..?
అంతర్జాతీయం

4 డ్రోన్లు వచ్చాయి.. నేలమట్టం చేశాయి: పాక్ ప్రత్యక్ష సాక్షి
పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. దాయాది దేశంలోని ఉగ్ర తండాలను నేలమట్టం చేసింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్ర మూకల ఆట కట్టించింది. ఇండియా దెబ్బకు పాకిస్థాన్‌తో పాటు పీఓకేలో 9 ఉగ్రవాద శిబిరాలు నామరూపాల్లేకుండా పోయాయి. 80 మందికి పైగా ముష్కరులు మట్టికరిచారు. ఆపరేషన్ సిందూర్‌ను యావత్ భారత్ ముక్త కంఠంతో ప్రస్తుతిస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు సరైన గుణపాఠం చెప్పారంటూ ఇండియన్ ఆర్మీని కీరిస్తున్నారు.కేవలం 25 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా ముగించింది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్‌లోని మురిడ్కేలో ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం జరిపిన దాడిని చూసిన ఒక స్థానికుడు 'ఆపరేషన్ సిందూర్' గురించి రాయిటర్స్ వార్తా సంస్థకు వివరించాడు. తాను నాలుగు డ్రోన్లను చూశానని వెల్లడించాడు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పెద్ద పేలుడు శబ్దం వినబడటంతో తాము నిద్ర నుంచి మేలుకున్నామని, అప్పుడే డ్రోన్ దాడులను (Drone Attack) ప్రత్యక్షంగా చూశామని చెప్పాడు."రాత్రి 12:45 గంటల ప్రాంతంలో మేము నిద్రపోతుండగా ముందుగా ఒక డ్రోన్ వచ్చింది. ఆ తర్వాత మరో మూడు డ్రోన్లు వచ్చాయి. అవి మసీదులపై దాడి చేశాయి. ప్రతిదీ ధ్వంసమైంది" అని మురిడ్కేకు చెందిన స్థానికుడు ఒకరు రాయిటర్స్‌తో అన్నారు. కాగా, భారత భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్తాన్లో 4, పీఓకేలో 9 ఉగ్రవాద శిబిరాలను ఇండియన్ ఆర్మీ (Indian Army) ధ్వంసం చేసింది.తగిన సమాధానం ఇస్తాం: పాక్ఆపరేషన్ సిందూర్‌ను "నిర్లక్ష్యమైన యుద్ధ చర్య"గా పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అభివర్ణించారు. "తగిన సమాధానం" ఇవ్వడానికి తమ దేశానికి పూర్తి హక్కు ఉందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి), అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ భారీగా కాల్పులు జరిపింది. దీనికి భారత భద్రతా దళాలు దీటుగా జవాబిచ్చాయి. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కశ్మీర్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. సరిహద్దు వెంబడి ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను కోరారు.చదవండి: ఎవరీ కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్?

కుబేరుల కోసం భూగర్భ నగరి
వాషింగ్టన్: అత్యంత సంపన్నులు, ఉన్నతాధికారుల కోసం అమెరికా ఏకంగా భూగర్భ నగరమే నిర్మించిందట! ఆ దేశా మాజీ ఉన్నతాధికారి కేథరిన్ ఆస్టిన్ ఫిట్స్ ఈ మేరకు వెల్లడించారు. అంతేకాదు, అందుకు ఏకంగా 21 లక్షల కోట్ల డాలర్ల మేరకు ప్రజల సొమ్మును వెచ్చించిందని ఆరోపించారు. జార్జ్ హెచ్.డబ్లు్య.బుష్ అధ్యక్షునిగా ఉండగా కేథరిన్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అసిస్టెంట్ సెక్రటరీగా పని చేశారు. తాను చెబుతున్నది పచ్చి నిజమని ఆమె చెప్పుకొచ్చారు. ‘‘21 లక్షల కోట్ల డాలర్లు లెక్కాపత్రం లేకుండా మాయమయ్యాయి. ఎక్కడికి పోయాయని ఏళ్ల తరబడి పరిశోధించా. వాటిని 170 భూగర్భ స్థావరాలతో కూడిన భారీ నెట్వర్క్ నిర్మాణానికి వెచ్చించినట్టు చివరికి కనిపెట్టా. వాటి మధ్య అత్యాధునిక రవాణా తదితర సదుపాయాలు కూడా ఉన్నాయి. 1998 నుంచి 2015 వరకు రక్షణ, గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖల్లో అత్యంత భారీ మొత్తాలను అనధికారికంగా ఖర్చు చేసినట్లు మిషిగన్ స్టేట్ వర్సిటీ ఆర్థికవేత్త మార్క్ స్కిడ్మోర్ అధ్యయనంలో కూడా వెల్లడైంది’’అని చెప్పుకొచ్చారు. కేథరిన్ చెబుతున్న బంకర్లలో కొన్ని సముద్రం అడుగున కూడా ఉన్నట్లు సమాచారం. ‘‘అమెరికాలో భూగర్భంలోనూ, సముద్రం అడుగునా ఈ స్థావరాలున్నాయి’’అని చెప్పారు. దాని పరిమాణం, పరిధి, యాక్సెస్ ప్రోటోకాల్స్ తదితర వివరాలేవీ ఆమె బయటపెట్టలేదు. విపత్తుల వేళ ఆ బంకర్లలోకి ప్రవేశమున్న ఉన్నత వ్యక్తుల పేర్లను కూడా ప్రస్తావించలేదు.

Operation Sindoor: శాంతించండి.. ‘ఆపరేషన్ సిందూర్’పై.. భారత్‌కు చైనా రిక్వెస్ట్
బీజింగ్: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ మంగళవారం అర్ధరాత్రి ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో దాడికి దిగింది. ఈ ఊహించని పరిణామంపై చైనా స్పందించింది. ఆపరేషన్ సిందూర్‌తో భారత్-పాక్‌ల మద్య కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల వేళ చైనా ఇరు దేశాలకు శాంతి సందేశం పంపించింది. దాయాది దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది.భారత్-పాక్ దాయాది దేశాలు. ఆ రెండు కూడా మాకు (చైనా)పొరుగు దేశాలు. అయినప్పటికీ చైనా అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది’ అని అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఇరు దేశాలు శాంతి, స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలను తీసుకోకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు.

భారత్ దాడులు.. పాక్ ప్రధాని రియాక్షన్ ఇదే..
ఇస్లామాబాద్: పహల్గాం దాడి ఘటనకు పాకిస్తాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరిట.. పాక్‌లోని కొట్లీ, మురిడ్కే, బహవల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో దాడులు జరిపింది. ఇక, భారత్ దాడులపై పాక్ ప్రధాని షహబాబ్ షరీఫ్ స్పందించారు. ఈ చర్యలకు పాకిస్తాన్ కచ్చితంగా బదులు తీర్చుకుంటుంది అని చెప్పుకొచ్చారు.భారత్ దాడులను పాక్ సైన్యం ధ్రువీకరించింది. భారత్ దాడులపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘పాక్ శత్రువు భారత్.. మా దేశంలోని ఐదు ప్రాంతాల్లో దాడులు జరిపింది. ఈ చర్యలకు పాకిస్తాన్ కచ్చితంగా బదులు తీర్చుకుంటుంది. ఈ సమయంలో పాక్ సైన్యం వెంట దేశమంతా నిలబడి ఉంది. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్ ఆర్మీకి తెలుసు. ప్రత్యర్థి దుష్ట ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనీయం’ తెలిపారు. అలాగే, ఈ దాడులను ఆయన యుద్ధ చర్యలు అని పేర్కొన్నారు.మరోవైపు పాక్ ప్రధాని ప్రకటన తర్వాత సరిహద్దులో పాక్ ఆర్మీ రెచ్చిపోయింది. పూంఛ్, రాజౌరి సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించింది. దీంతో భారత్ సైతం కాల్పులు మొదలుపెట్టింది. ఎల్వోసీ వెంట ఇరు దేశాల సైనికుల కాల్పులతో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో మురిడ్కే టెర్రరిస్టు గ్రూప్ లష్కరే తొయిబాకు హెడ్ క్వార్టర్స్‌గా ఉంది. ఇక పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవల్పూర్లో మసూద్ అజార్ నేతృత్వంలోని జైష్ -ఎ- మహ్మద్ స్థావరం ఉంది.పాక్ డీజీ ఐఎస్పీఆర్ లెప్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ స్పందించారు. ఈ దాడులు జరిగినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ముగ్గురు చనిపోయారని, 12 మందికి గాయాలైనట్టు పాక్ ఆర్మీ పేర్కొంది. సమయం చూసుకొని బదులుగా స్పందిస్తామని పేర్కొన్నారు. భారత్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని అన్నారు. పాక్ అప్రమత్తం.. భారత్ దాడుల అనంతరం పాక్ డిఫెన్స్ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. లాహోర్, సియాల్కోట్ ఎయిర్‌పోర్ట్‌లను 48 గంటల పాటు మూసివేసింది. దేశంలో పరిస్థితులను గమనిస్తున్నట్టు అధికారులు చెప్పుకొచ్చారు.
జాతీయం

‘ప్రధాని మోదీ చేతుల్లో భారత్ సురక్షితంగా ఉంది’
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన దాడిని స్వాగతించారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్. ఉగ్రవాదాన్ని ఎప్పుడూ ప్రోత్సహించకూడదని, అది మానవాళి మనుగడకు అత్యంత ప్రమాదమన్నారు రవిశంకర్. ఆపరేషన్ సిందూర్ పై రవిశంకర్ మాట్లాడుతూ.. ‘ మనం నాగరిక సమాజంలో ఉన్నాం. మానవాళిని నాశనం చేసే ఉగ్రవాదులు దాడులు కానీ మిలిటెంట్ల దాడులను కానీ ఎంతమాత్రం ఉపేక్షించకూడదుఉగ్రవాదం అనేది ఓ ఆటవిక చర్య. భారత్ కేవలం పాక్‌లోని ఉగ్రస్థాపరాలను లక్ష్యంగా చేసుకునే దాడులు చేసింది. ఇది హర్షించదగ్గ విషయం. భారత్ చేసిన దాడులపై ఏ ఒక్కరు మాట్లాడాలన్నా మాట్లాడటానికి ఏమీ లేదు. ఎందుకంటే భారత్ కేవలం ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేసింది.ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదాన్ని సహించబోమని పదే పదే చెబుతూ ఉన్నారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించలేదని చాలాసార్లు చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు చేయాల్సి వచ్చింది. ఇది కచ్చితంగా తెలివైన నిర్ణయమే. ప్రస్తుతం భారత్ నరేంద్ర మోదీ చేతుల్లో సురక్షితంగా ఉంది. ఆయన తీసుకునే నిర్ణయాలతో భారత్ కు మేలే జరుగుతుంది. ఆయనకు మరింత ఆత్మస్థైర్యం కలగానికి ప్రార్దిద్దాం అని రవిశంకర్ అన్నారు.

ఉగ్రవాద శిబిరాలపై దాడులు సరైనవే: ఖర్గే
ఢిల్లీ: సైనికులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. భారత్ చేపట్టిన దాడుల నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ కమిటీ బుధవారం అత్యవసరంగా సమావేశం నిర్వహించింది.‘‘పీవోకే నుంచి ఉగ్రవాదులు పనిచేస్తున్నారనేది స్పష్టమైంది. ఉగ్రవాద శిబిరాలపై దాడులు సరైనవే. దేశ రక్షణ విషయంలో మనమంతా కలిసి ఉండాలి. సైనికులు తీసుకునే ప్రతి నిర్ణయానికీ మద్దతిస్తాం’’ అని ఖర్గే పేర్కొన్నారు.పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్' పేరుతో సాహసోపేత నిర్ణయం తీసుకున్న భారత సైనిక దళాలను చూసి తాము గర్విస్తున్నామని ఖర్గే అన్నారు.కాగా, జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉన్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మూడు రోజుల ముందే తెలుసునంటూ నిన్న(మంగళవారం) మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పర్యాటకులపై దాడి జరగబోతున్నట్లు మోదీకి ఇంటెలిజెన్స్ రిపోర్టు అందిందని.. అందుకే ఆయన జమ్మూకశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారన్నారు. నిఘా వైఫల్యం వల్లే పహల్గాంలో ఉగ్రదాడి జరిగినట్లు అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, మోదీ సైతం స్వయంగా ఒప్పుకున్నారంటూ ఖర్గే వ్యాఖ్యానించారు.

ఢిల్లీలో కరెంట్ కట్.. ఎప్పటినుంచి ఎప్పటి వరకు అంటే..?
ఢిల్లీ: సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్‌లో భాగంగా నగరంలో ఇవాళ రాత్రి 8 నుంచి 8.15 గంటల మధ్య విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ప్రజలంతా సహకరించాలని న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ విజ్ఞప్తి చేసింది. అయితే, ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, రాష్ట్రపతి భవన్, పీఎంవో, మెట్రో స్టేషన్లు, ఇతర ముఖ్య ప్రదేశాలకు ఇది వర్తించదని ఎన్డీఎంసీ వెల్లడించింది.పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అనూహ్య పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు, యుద్ధ సన్నద్ధతను పూర్తిస్థాయిలో చాటేందుకు.. ఈ అంశంపై అవగాహన కల్పించాలని కేంద్రహోం శాఖ నిర్ణయించింది. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ జరిగాయి. దేశవ్యాప్తంగా అణు విద్యుత్కేంద్రాలు, రిఫైనరీలు, కీలక కేంద్ర ప్రభుత్వ సంస్థలున్న, రక్షణపరంగా సున్నితమైన ప్రాంతాలను సీడీడీలుగా 2010లో కేంద్రం నోటిఫై చేసింది.వీటిలో చాలావరకు రాజస్తాన్, పంజాబ్, జమ్మూ కశ్మీర్, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో నెలకొని ఉన్నాయి. సున్నితత్వాన్ని బట్టి వాటిని మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ఢిల్లీ, చెన్నై వంటి నగరాలు అత్యంత సున్నితమైన కేటగిరీ 1లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం డ్రిల్స్‌కు వేదికయ్యాయి. వాటిని సున్నితమైనవిగా పేర్కొంటూ కేటగిరీ 2లో చేర్చారు.దేశవ్యాప్తంగా మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ (సీడీడీ) పరిధిలో ఎంపిక చేసిన 259 చోట్ల మాక్ డ్రిల్స్ జరిగాయి. వీటిలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రోలు కూడా ఉన్నాయి. 100కు పైగా సీడీడీలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించి ‘ఎ’ కేటగిరీలో చేర్చారు. వాటి పరిధిలో సూరత్, వడోదర, కాక్రపార్ (గుజరాత్), కోట (రాజస్తాన్), బులంద్‌షహర్ (యూపీ), చెన్నై, కల్పకం (తమిళనాడు), తాల్చెర్ (ఒడిశా), ముంబై, ఉరన్, తారాపూర్ (మహారాష్ట్ర), ఢిల్లీ ఉన్నాయి.

అతుల్ జైన్‌తో మంత్రి ఉత్తమ్ భేటీ
ఢిల్లీః కేంద్ర జల సంఘం(సీడబ్యూసీ) చైర్మన్ అతుల్ జైన్‌తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మేడిగడ్డ, సమ్మక్క, సారక్క, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులపై చర్చించారు.మేడిగడ్డ డ్యామ్ కూలిపోవడంపై ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించారు. అదే సమయంలో సమ్మక్క, సారక్క, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల అంశాన్ని సైతం భేటీలో ప్రస్తావించారు. కృష్ణానది పై పలు చోట్ల టెలిమెట్రి పరికరాలు ఏర్పాటు అంశాన్ని కూడా చర్చించారు.అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ. ‘మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీ లను పునరుద్ధరించాలా లేదా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మేడిగడ్డ డిజైన్ ,. ఆపరేషన్ లోపాలు ఉన్నాయని ఎన్ డి ఎస్ ఏ నివేదిక స్పష్టం చేసింది. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రాజెక్ట్ పునరుద్ధరణ ఎలా చేయాలని మార్గాలు అన్వేషిస్తున్నాం. డీపీఆర్ లో చూపెట్టిన స్థలం వేరు. ఒక ప్రాంతంలో కడతామని మరో ప్రాంతంలో మేడిగడ్డ కట్టారు. మేడిగడ్డ , సుందిళ్ల బ్యారేజ్ ల విషయంలో సిడబ్ల్యుసి సంప్రదింపులతో ముందుకు వెళ్లాలని ఎన్డీఎస్సీ సూచించింది.పాడైపోయిన మేడిగడ్డ , సుందిళ్ల బ్యారేజ్ లను ఎలా ముందుకెళ్లాలనిపై చర్చించా. తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు కడతాం. సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు 44 టిఎంసిల నీటి కేటాయింపులు వేగంగా జరపాలని కోరా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 90 టీఎంసీలు కోరుతున్నాం. వాటిలో తక్షణమే 45 టీఎంసీలు కేటాయించాలని విజ్ఞప్తి చేశాను. అక్రమ నీటి తరలింపుకు చెక్ పెట్టేందుకు టెలిమెట్రీ పెట్టాలని కోరాం. పోలవరం బ్యాక్ వాటర్ తో ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. దానికి రిటెన్షన్ వాల్ ను నిర్మించాలని అడిగాం’ అని ఉత్తమ్ తెలిపారు.
ఎన్ఆర్ఐ

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్‌కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్‌షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్‌తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.

డల్లాస్‌లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్‌లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
క్రైమ్

నూడుల్స్ తిని భర్త మృతి.. భార్యపై అనుమానం..!
జూలూరుపాడు: పూడ్చి పెట్టిన యువకుడి మృతదేహాన్ని పోలీసులు వెలికి తీసిన ఘటన మంగళవారం జూలూరుపాడులో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. జూలూరుపాడు ఎస్సీకాలనీకి చెందిన కత్తి రాములు, నాగమణి దంపతుల కుమారుడు కత్తి అరవింద్ (26) ఇటీవల మృతి చెందగా.. మృతిపై అనుమానాలున్నాయని తండ్రి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.తహసీల్దార్ స్వాతిబిందు సమక్షంలో జేసీబీ సాయంతో సమాధి తొలగించి పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీశారు. ఫోరెన్సిక్ నిపుణులు రమణమూర్తి ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవి, సీఐ ఇంద్రసేనారెడ్డి వివరాలు వెల్లడించారు. ఐదు నెలల కిందట అరవింద్‌కు ఏన్కూర్‌కు చెందిన సింధుతో వివాహమైంది. గత నెల 1వ తేదీన పుట్టింటికి వెళ్లిన సింధు అత్తగారింటికి వచ్చింది. ఏప్రిల్ 2న ఫ్రైడ్ రైస్, నూడుల్స్ తిన్న అరవింద్ విరేచనాలు, వాంతలు కావడంతో ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించారు. 7వ తేదీన అరవింద్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కొత్తగూడెం ఆస్పత్రికి తరలించగా.. ఐదు రోజుల అనంతరం ఖమ్మం ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ 16న మృతి చెందాడు. కాగా, ఈ నెల 4న మృతుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని వెలికితీసి, తహసీల్దార్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించామని సీఐ పేర్కొన్నారు. ఎస్ఐ రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఐ సీహెచ్ ఆదినారాయణ, పంచాయతీ సెక్రటరీలు హరిబాబు, లక్ష్మణ్, పోలీసులు పాల్గొన్నారు.

ప్రియుడితో వెళ్లిపోయిన పెళ్లి కూతురు
నారాయణపేట రూరల్: మూడు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. కాబోయే వధువు ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో పరువు పోయిందన్న మనస్తాపంతో పెళ్లి కొడుకు తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలంగాణలోని నారాయణపేటలో చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన కాంజి గోవిందరావు కుమారుడు అభిషేకు జ్ఞాని విజయ్‌కుమార్ కూతురు శ్వేతతో పెళ్లి కుదిరింది. నాలుగు నెలల క్రితం ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని సైతం ఘనంగా నిర్వహించారు.ఈ నెల 9వ తేదీన పెళ్లి ముహూర్తం నిశ్చయించి పెళ్లిపత్రికలు కూడా పంచారు. కాగా.. ఆదివారం ఉదయం పెళ్లి కూతురు శ్వేత తన ప్రియుడు వెంకటేశ్‌తో వెళ్లిపోయింది. దీంతో పెళ్లి ఆగిపోయింది. అయితే మంగళవారం తన కుమారుడిని పెళ్లి కొడుకుని చేయాల్సి ఉండగా ఇలా పెళ్లి ఆగిపోవడం భరించలేక.. మనస్తాపంతో తండ్రి గోవిందరావు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురి ప్రేమ వ్యవహారం తెలిసినా విజయ్‌కుమార్ దాచిపెట్టి.. పెళ్లికి సిద్ధమై పరువు తీశారని, అందుకే గోవిందరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడని వరుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన తమ్ముడి చావుకు కారణమైన వారిపై చర్య తీసుకోవాలని మృతుడి సోదరుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.చదవండి: కన్నీటి నిశ్చితార్థం.. తల్లిదండ్రులు, ముగ్గురు పిల్లలు దుర్మరణం

రాత్రి 9:30 తరువాత అన్నీ బంద్
దొడ్డబళ్లాపురం/బనశంకరి: మంగళూరులో గత గురువారం రాత్రి హిందూ కార్యకర్త సుహాస్‌శెట్టి హత్య తరువాత నివురుగప్పిన నిప్పులా మారింది. ప్రజల్లో భయం నెలకొంది. ఇంతలో మరో హిందూ కార్యకర్త భరత్ కుమ్దేల్ను సోమవారం రాత్రి 9–30కి హత్య చేస్తామని కొందరు గుర్తుతెలియని దుండగులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో పోలీసులు సోమవారం రాత్రి నుంచి అన్ని వ్యాపార, వ్యవహారాలను రోజూ రాత్రి 9:30కి బంద్ చేయాలని ఆదేశించారు. రేవు సిటీలో పరిస్థితులు చక్కబడే వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. హెడ్‌కానిస్టేబుల్ హస్తం సుహాస్‌శెట్టి హత్యలో రోజూ కొత్త సంగతులు బయటపడుతున్నాయి. రషీద్ అనే హెడ్‌కానిస్టేబుల్ హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుహాస్‌శెట్టి బజ్పేలో ఇంట్లో ఉండగా రషీద్ కావాలనే ఠాణాకు పిలిపించి వేధించేవాడని ఆరోపణలున్నాయి. వాహనంలో ఎలాంటి ఆయుధాలు ఉండరాదు, నీ జతలో స్నేహితులు ఉండరాదని హెచ్చరించాడని సుహాస్‌శెట్టి తల్లి ఆరోపించారు.

కూతురి హత్యకు ప్రతీకారం
మండ్య(కర్ణాటక): గతేడాది జనవరిలో.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఓ యువతి.. ఆకస్మికంగా హత్యకు గురైంది. అప్పటినుంచి కేసు నడుస్తోంది. ఇంతలో ఆ కేసులో నిందితుని తండ్రి ప్రతీకార హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన పౌరుషాల గడ్డ అయిన మండ్య జిల్లా పాండవపుర తాలూకా మాణిక్యనహళ్లిలో మంగళవారం జరిగింది. ఏం జరిగింది? వివరాలు.. నరసింహే గౌడ (55) అనే రైతు కత్తిపోట్లతో చనిపోయాడు. వెంటనే వెంకటేశ్, మంజునాథ్ అనే ఇద్దరిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. వెంకటేష్ కూతురు దీపికతో నరసింహేగౌడ కొడుకు నితీష్ కుమార్ చనువుగా ఉండేవాడు. దీపిక కు అదివరకే పెళ్లయి కొడుకు ఉన్నాడు. ఇద్దరూ రీల్స్ కూడా చేసేవారు. గతేడాది జనవరిలో మేలుకోటె కొండ అంచున దీపిక హత్యకు గురైంది. నితీష్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసు నడుస్తోంది. అప్పటినుంచి ఇరుకుటుంబాల మధ్య వైరం కొనసాగుతోంది. నరసింహేగౌడ తన కూతురి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. ఓ టీ హోటల్ వద్ద అతన్ని కత్తితో పొడిచి చంపారు. తన కూతురి హత్యకు ప్రతీకారంగా వెంకటేష్ ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానాలున్నాయి. గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటైంది.
వీడియోలు


9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం: ఆర్మీ


YSRCPలో చేరిన APNGO అసోసియేషన్ లీడర్స్


పహల్గాం దాడి అనంతరం ఉగ్ర పాకిస్థాన్ కు ప్రధాని మోదీ వార్నింగ్


Rajnath Singh: ప్రధాని మోదీ నేతృత్వంలో శత్రువులకు సరైన సమాధానం చెప్పాం


Operation Sindoor: భారత్ క్షిపణి దాడుల్లో ధ్వంసమైన ఉగ్రశిబిర శిథిలాలు


యుద్ధానికి సిద్ధం.. విశాఖలో మాక్ డ్రిల్


ఉగ్ర గుట్టు విప్పారు ఎవరీ సోఫియా, వ్యోమికా?


YSRCP పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో YS జగన్ భేటీ


YS Jagan: ఆపరేషన్ సిందూర్ అనివార్యమైన చర్య


హైదరాబాద్ లో 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్