Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Supreme Court to hear pleas against Waqf Amendment Act on Apr 16 Updates1
వక్ఫ్‌ పిటిషన్లపై ‘సుప్రీం’ కీలక విచారణ.. హైలైట్స్‌

సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లను(Waqf Petitions) సుప్రీంకోర్టులో ఇవాళ (ఏప్రిల్‌ 16న) విచారణ జరపనుంది. కేంద్రం కేవియెట్‌ పిటిషన్‌ వేయడంతో ఇరువైపులా వాదనలను చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌కుమార్, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. కొత్త చట్టంలోని పలు సెక్షన్లు రాజ్యాంగానికి విరుద్ధమని, జాతీయ సమగ్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు పలు సంస్థలు, ఎన్జీవోలు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లను ఉమ్మడిగా ఇవాళ మధ్యాహ్నాం సీజేఐ బెంచ్‌ విచారణ జరపనుంది. వక్ఫ్ సవరణ చట్టం(Waqf Amendment Law) రాజ్యాంగ విరుద్ధమని, ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా చట్టం రూపొందించారని, ఈ చట్టంతో ముస్లిం మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని, వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరులను చేర్చడం రాజ్యాంగ విరుద్ధమేనని వైఎస్సార్‌సీపీ సైతం తన పిటిషన్‌లో పేర్కొంది.👉ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, కాంగ్రెస్‌ ఎంపీ మహ్మద్‌ జావేద్‌(బిహార్‌)తో పాటు జేడీయూ, ఆప్‌, డీఎంకే, సీపీఐ, వైఎస్సార్‌షీపీ.. ఇలా ప్రధాన పార్టీలతో పాటు జమైత్‌ ఉలేమా హింద్‌, ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు కూడా పిటిషన్లు వేశాయి. వక్ఫ్‌సవరణ చట్టం బిల్లు నిబంధనలు ముస్లిం సమాజ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని, ముస్లింల హక్కులను హరించే కుట్రగా అభివర్ణిస్తున్నాయి. ; ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. 👉బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు చట్టానికి మద్ధతుగా సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశాయి. ఆ చట్టాన్ని సర్వోన్నత న్యాయస్థానం కొట్టేయబోదన్న ధీమాతో ఉంది.👉ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో మంగళవారం మరో పిటిషన్‌ దాఖలైంది. ఈ చట్టంలోని కొన్ని సెక్షన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సీనియర్‌ న్యాయవాది విష్ణు శంకర్‌ జైన్‌ వేసిన పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపడతామని వెల్లడించింది. అయితే అది ఇవాళ విచారించబోయే పిటిషన్లతోనా? లేదంటే ప్రత్యేకంగానా? అనేదానిపై ఈ మధ్యాహ్నాం స్పష్టత రానుంది.👉పిటిషన్లలో కొన్ని.. వక్ఫ్‌ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, దీనిని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. మరికొన్ని.. దీనిని అమలు చేయకుండా కేంద్రాన్ని ఆదేశించాలని కోరాయి. 👉పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా.. ఈ నెల మొదట్లో సుదీర్ఘ చర్చల అనంతరం ఇటు లోక్‌సభలో, అటు రాజ్యసభలో వక్ఫ్‌ బిల్లుకు ఆమోదం లభించింది. 👉అయితే.. చట్టసభల పరిధిని తాము దాటబోమని ఇంతకు ముందే సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయినప్పటికీ రాజ్యాంగానికి సంబంధించిన అంశాల్లో చివరి తీర్పు ఇచ్చే అధికారం మాత్రం ఉంటుందని తెలిపింది. ఈ క్రమంలో.. వక్ఫ్‌ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల్లో సమానత్వ హక్కు, మతాచారాలను అనుసరించేలాంటి హక్కులు ప్రభావితం అయ్యాయని పిటిషనర్లు వాదిస్తున్నారు. అందుకే సుప్రీం కోర్టు ఈ పిటిషన్లపై వాదనలు వినేందుకు సిద్ధమైంది. 👉ఈ సవరణలు వక్ఫ్ బోర్డుల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడానికి, వెనుకబడిన ముస్లింలను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని కేంద్రం అంటోంది. మత స్వేచ్ఛను హరిస్తాయనే విమర్శలను తప్పుబడుతోంది. ముస్లింలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయంటోంది. వక్ఫ్ బోర్డుల్లో అవినీతిని తగ్గించి, వ్యవస్థను పారదర్శకంగా చేయడానికే ఈ బిల్లును తెచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది.

Chandrababu Govt Over Action On YS Jagan Tours2
వైఎస్ జగన్ పర్యటనలపై ప్రభుత్వ కుట్రలు

సాక్షి తాడేపల్లి: వైఎ‍స్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటనలపై కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. వైఎస్‌ జగన్‌ క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లకుండా ఆటంకాలు సృష్టిస్తోంది. ఇందులో భాగంగానే వైఎస్‌ జగన్‌కు హెలికాప్టర్లు ఇవ్వనీయకుండా చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలకు దిగారు.వివరాల ప్రకారం.. ఇటీవల వైఎస్‌ జగన్ రాప్తాడు నియోజకవర్గం పర్యటనలో ప్రభుత్వ వైఫల్యం బహిర్గతమైన విషయం తెలిసిందే. వైఎస్‌ జగన్‌ రాప్తాడులో హెలిప్యాడ్‌ వద్దకు చేరుకున్న వెంటనే.. ప్రజలందరూ హెలికాప్టర్‌ను చుట్టుముట్టారు. తమ అభిమాన నేతలను కలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో హెలికాప్టర్‌ విండ్‌ షీల్డ్‌ దెబ్బతిన్నది. దీంతో, వైఎస్‌ జగన్‌ను వదిలేసి హెలికాప్టర్‌ వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కూటమి సర్కార్‌ కొత్త కుట్రలకు తెరలేపింది. ఈ ఘటనపై విచారణ పేరుతో పైలట్‌లకు నోటీసులు జారీ చేసింది. దీంతో, వైఎస్‌ జగన్‌కి హెలికాఫ్టర్లను ఇవ్వనీయకుండా చేసేందుకే ప్రభుత్వ పెద్దల కుట్రలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది.మరోవైపు.. హెలికాప్టర్ ఘటనపై మరుసటి రోజే హోంమంత్రి అనిత డ్రామా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కొనసాగింపుగా హెలికాఫ్టర్ సంస్థలకు ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది. ఈ ఘటనపై ఇప్పటికే సంస్థలు డీజీసీఏకు నివేదిక అందించారు. అయితే, నివేదిక ఇచ్చినా పోలీసుల విచారణ పేరుతో పైలట్‌, కో-పైలట్‌ను ప్రభుత్వం వేధింపులకు గురిచేయడం గమనార్హం. నేడు విచారణకు హాజరుకానున్న పైలెట్, కో పైలెట్‌ వైఎస్‌ జగన్‌ ప్రయాణించిన హెలికాప్టర్‌ విండ్‌ షీల్డ్‌ దెబ్బతిన్న ఘటనలో విచారణకు హాజరుకావాలని హెలికాప్టర్‌ నిర్వహణ సంస్థ, పైలెట్, కో–పైలెట్‌లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో వారు బుధవారం విచారణకు హాజరుకానున్నారు. చెన్నేకొత్తపల్లిలోని రామగిరి పోలీసు సర్కిల్‌ కార్యాలయంలో ఈ విచారణ జరగనుంది. అక్కడ ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

China Issues 85000 Visas To Indian Friends3
భారత్‌తో చైనా దోస్తీ.. భారతీయులకు గుడ్‌న్యూస్‌

ఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలతో వలసదారులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఏరోజు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనన్న ఆందోళన నెలకొంది. ఇక.. ట్రంప్‌ నిర్ణయాలు భారతీయులపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో డ్రాగన్‌ దేశం చైనా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. భారత్‌తో సన్నిహిత సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. వీసాల విషయంలో భారతీయులకు భారీ ఆఫర్‌ ఇచ్చింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వీసా నిబంధనలను మరింత కష్టతరం చేశారు. ఈ నేపథ్యంలో భారతీయులను ఆకర్షించేందుకు చైనా ప్లాన్‌ చేసింది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ 9 వరకు చైనా రాయబార కార్యాలయం భారత పౌరులకు 85,000కిపైగా వీసాలను జారీ చేయడం విశేషం. ఇది రెండు దేశాల మధ్య ప్రజా సంబంధాలను బలపరిచే దిశలో కీలకమైన అడుగుగా చైనా ఎంబసీ పేర్కొంది. ఈ సందర్బంగా భారత్‌లో చైనా రాయబారి ఝూ ఫెహంగ్ స్పందిస్తూ..‘2025 ఏప్రిల్ 9 నాటికి భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం, కాన్సులేట్లు భారతీయ పౌరులకు 85,000 కంటే ఎక్కువ వీసాలను జారీ చేశాయి. మరింత మంది భారతీయ మిత్రులు మా దేశానికి వచ్చి.. సురక్షిత, ఉత్సాహభరితమైన, హృదయపూర్వక, స్నేహపూర్వకమైన చైనాను ఆస్వాదించండి’ అని ట్విట్టర్‌ వేదికగా చెప్పుకొచ్చారు.ఈ వీసాల పెరుగుదల ద్వారా సాంస్కృతిక, విద్యా, వ్యాపార, పర్యాటక మార్పిడులకు మద్దతు లభించనుంది. ముఖ్యంగా, వైద్య విద్య కోసం చైనాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఈ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, కోవిడ్ మహమ్మారి కారణంగా నిలిచిన ప్రయాణాలు ఇప్పుడు పునఃప్రారంభం కావడం విద్యార్థులకు ఊరట కలిగిస్తోంది. ఈ పరిణామం ద్వైపాక్షిక సంబంధాల్లో శాంతియుత మార్గాన్ని ప్రోత్సహించే మంచి సూచికగా భావించబడుతోంది.As of April 9, 2025, the Chinese Embassy and Consulates in India have issued more than 85,000 visas to Indian citizens traveling to China this year. Welcome more Indian friends to visit China, experience an open, safe, vibrant, sincere and friendly China. pic.twitter.com/4kkENM7nkK— Xu Feihong (@China_Amb_India) April 12, 2025ఇదిలా ఉండగా.. భారత పౌరులు, విద్యార్థులు కోసం చైనా ప్రభుత్వం అనేక సడలింపులు తీసుకొచ్చింది. ఇవి ఆ దేశానికి ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనున్నాయి. చైనా వీసా తక్కువ ధరకు లభించడంతో భారతీయులకూ ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. వీసా జారీకి తీసుకునే సమయం తగ్గించారు. ఇది వ్యాపార, విహార యాత్రకు వెళ్లేవారికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు భారత పౌరులు ముందుగా ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ తీసుకోకుండా నేరుగా వీసా సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. తక్కువ రోజులు పాటు చైనాలో ప్రయాణించే వారికి బయోమెట్రిక్ డేటా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది వీసా ప్రాసెసింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

I Will Take Blame Played Wrong Shot We Batted Badly: Rahane On KKR Loss4
తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు: రహానే

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR)కు చేదు అనుభవం ఎదురైంది. ఐపీఎల్‌-2025 (IPL 2025)లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌ విధించిన 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. పటిష్ట పంజాబ్‌ బ్యాటర్లను తమ బౌలర్లు అద్బుత రీతిలో కట్టడి చేసినా.. బ్యాటర్ల వైఫల్యం, నిర్లక్ష్యం కారణంగా ఓటమిని చవిచూసింది.ఈ నేపథ్యంలో కేకేఆర్‌ కెప్టెన్‌ అజింక్య రహానే (Ajinkya Rahane) తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని.. తన తప్పు వల్లే గెలవాల్సిన మ్యాచ్‌ ఓడిపోయామని అంగీకరించాడు. బౌలర్లు ఎంతో కష్టపడినా.. చెత్త బ్యాటింగ్‌ వల్ల పంజాబ్‌ ముందు తలవంచాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.తప్పంతా నాదే.. ‘‘మైదానంలో ఏం జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఓటమి అన్నింటికంటే ఎక్కువగా బాధిస్తోంది. ఇందుకు పూర్తిగా నేనే బాధ్యుడిని. షాట్‌ ఎంపికలో పొరపాటు చేశాను. అయితే, అదృష్టవశాత్తూ బాల్‌ స్టంప్స్‌ను మిస్‌ అయింది. కానీ లెగ్‌ బిఫోర్‌ వికెట్‌ విషయంలో నాకు స్పష్టత లేదు.అతడు కూడా నాతో అదే అన్నాడుఅంపైర్‌ ఎల్బీడబ్ల్యూ (LBW) ఇచ్చిన తర్వాత మరో ఎండ్‌లో ఉన్న అంగ్‌క్రిష్‌తో చర్చించాను. అతడు కూడా అంపైర్స్‌ కాల్‌ నిజమవుతుందేమోనని చెప్పాడు. అందుకే ఆ సమయంలో నేను చాన్స్‌ తీసుకోవాలని అనుకోలేదు. నాకు కూడా పూర్తి స్పష్టత లేదు కాబట్టి రివ్యూకు వెళ్లలేదు.నిర్లక్ష్య ఆట తీరు వల్లే ఓటమిమా బ్యాటింగ్‌ విభాగం ఈ రోజు అత్యంత చెత్తగా ఆడింది. సమిష్టిగా విఫలమయ్యాం. బౌలర్లు ఎంతో కష్టపడి పటిష్ట బ్యాటింగ్‌ లైనప్‌ను 111 పరుగులకే ఆలౌట్‌ చేశారు. కానీ మేము మాత్రం వారి కష్టానికి ప్రతిఫలం లేకుండా చేశాం. మా నిర్లక్ష్య ఆట తీరే మా ఓటమికి కారణం.ఇప్పుడు నా మనసులో ఎన్నో భావాలు చెలరేగుతున్నాయి. సులువుగా ఛేదించగల లక్ష్యాన్ని కూడా మేము దాటలేకపోయాం. మా వాళ్లతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. ఇంకా సగం టోర్నీ మిగిలే ఉంది. ఏదేమైనా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి’’ అని అజింక్య రహానే పేర్కొన్నాడు.రివ్యూకు వెళ్లకుండా తప్పు చేశాడుకాగా కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిదవ ఓవర్‌ను పంజాబ్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ వేశాడు. అతడి బౌలింగ్‌లో నాలుగో బంతికి స్వీప్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన రహానే విఫలం కాగా.. బంతి ప్యాడ్‌ను తాకినట్లు కనిపించింది. దీంతో పంజాబ్‌ అప్పీలు చేయగా.. అంపైర్‌ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు.అయితే, రీప్లేలో మాత్రం ఇంపాక్ట్‌ అవుట్‌సైడ్‌ ఆఫ్‌గా తేలింది. ఒకవేళ రహానే గనుక రివ్యూకు వెళ్లి ఉంటే నాటౌట్‌గా ఉండేవాడు. అప్పుడు ఫలితం మరోలా ఉండేది. నిజానికి అప్పటికి కేకేఆర్‌కు ఇంకా రెండు రివ్యూలు మిగిలే ఉండటం గమనార్హం. ఇలా స్వీయ తప్పిదం కారణంగా జట్టు ఓడిపోవడాన్ని తట్టుకోలేక రహానే పైవిధంగా స్పందించాడు.ఐపీఎల్‌-2025: పంజాబ్‌ వర్సెస్‌ కేకేఆర్‌వేదిక: మహరాజ యదవీంద్ర సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం, ముల్లన్‌పూర్‌, చండీగడ్‌టాస్‌: పంజాబ్‌.. బ్యాటింగ్‌పంజాబ్‌ స్కోరు: 111 (15.3)కేకేఆర్‌ స్కోరు: 95 (15.1)ఫలితం: 16 పరుగుల తేడాతో కేకేఆర్‌పై పంజాబ్‌ గెలుపుప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: యజువేంద్ర చహల్‌ (4/28).చదవండి: IPL 2025:చ‌రిత్ర సృష్టించిన పంజాబ్.. ఐపీఎల్ హిస్ట‌రీలోనే తొలి జ‌ట్టుగా𝘈𝘴 𝘥𝘦𝘭𝘪𝘨𝘩𝘵𝘧𝘶𝘭 𝘢𝘴 𝘪𝘵 𝘤𝘢𝘯 𝘨𝘦𝘵 🤌Ajinkya Rahane & Angkrish Raghuvanshi ignite the #KKR chase with some beautiful sixes 💜Updates ▶️ https://t.co/sZtJIQoElZ#TATAIPL | #PBKSvKKR pic.twitter.com/YQxJJep9z3— IndianPremierLeague (@IPL) April 15, 2025The moment where Yuzvendra Chahal turned the game 🪄#TATAIPL | #PBKSvKKR | @PunjabKingsIPL pic.twitter.com/D2O5ImOSf4— IndianPremierLeague (@IPL) April 15, 2025

ED Officials Conduct Raids In Hyderabad5
హైదరాబాద్‌లో రెండు సంస్థలపై ఈడీ సోదాలు..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరోసారి ఈడీ అధికారుల సోదాలు తీవ్ర కలకలం సృష్టించాయి. సురానా ఇండస్ట్రీస్‌తో పాటు సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. సురానాకి అనుబంధంగా సాయి సూర్య డెవలపర్స్ పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో ఈడీ.. అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, జూబ్లీహిల్స్‌లో తనిఖీలు కొనసాగుతున్నాయి.వివరాల ప్రకారం.. సురానా గ్రూప్‌ చైర్మన్‌, ఎండీ నివాసాలు, సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ చైర్మన్, ఎండీల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని నాలుగు ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. చెన్నై చెందిన ఈడీ బృందాలు సోదాల్లో పాల్గొంది. సూరానా గ్రూప్స్‌.. చెన్నైలోని ప్రముఖ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టిన నేపథ్యంలో ఇప్పటికే సురానా గ్రూప్‌పై సీబీఐ కేసు నమోదైంది. ఇక​, తాజాగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయంలో ఈడీ సోదాలు జరుపుతున్నట్టు సమాచారం. ఈడీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Farmers Likely To Move High Court For Lands Captures Of Capital6
విస్తరణ డ్రామాపై అమరావతి రైతులు కోర్టుకు !

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి విషయంలో ఇప్పుడు సరికొత్త డ్రామాకు తెరలేపారు. ఇప్పుడు తీసుకున్న భూములన్నీ చాలడం లేదు.. అన్నిటికీ కేటాయించేయగా.. అన్నీ కట్టేయగా.. మహా అయితే రెండు వేల ఎకరాలు మాత్రమే మిగలబోతున్నాయి. ఇంత పెద్ద నగరం కట్టడానికి ఆ భూమి ఏమూలకూ చాలదు. ఇంకా 44 వేల ఎకరాలను సేకరించి మహా రాజధాని కడతాం అని.. చంద్రబాబునాయుడు ఈ కొత్త డ్రామాకు స్క్రిప్టు సిద్ధం చేశారు. కొత్తగా 44 వేల ఎకరాలు లాండ్ పూలింగ్ ద్వారా సేకరించడానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రకటనలు కూడా వస్తున్నాయి. అయితే.. ఆయన సొంత వర్గానికి చెందిన అమరావతి ప్రాంత రైతులే ఈ ఆలోచన మీద ఆగ్రహంతో నిప్పులు కక్కుతున్నారు. తా దూరను కంత లేదు.. మెడకో డోలు అన్నట్టుగా.. ఆల్రెడీ రాజధానిగా నోటిఫై చేసిన భూముల్లో ఏడాదిగా ఒక్క పని మొదలుపెట్టలేకపోయారు గానీ.. ఇప్పుడు ఇంకో 44 వేల ఎకరాలు అంటున్నారు. తమ వద్ద నుంచి సేకరించిన భూములలో తమకు హామీ ఇచ్చిన రాజధాని నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేదాకా, నగర విస్తరణ పేరిట కొత్త భూసేకరణ/ పూలింగ్ ప్రయత్నాలను నిలుపుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ.. అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. అమరావతి రాజధానిని ఇప్పుడు చంద్రబాబునాయుడే వంచించడానికి పూనుకున్నారు. అమరావతి ని రాజధానిగా పూర్తిగా అభివృద్ధి చేసి, ఆ ప్రాంతంలో.. భూములు ఇచ్చిన రైతులకు దామాషా ప్రకారంగా భూములకంటె విలువైన స్థలాలుగా మార్చి ఇస్తాం అని చంద్రబాబునాయుడు లాండ్ పూలింగ్ సందర్భంగా చాలా చాలా మాటలు చెప్పారు. ప్రజలందరూ కూడా దానిని నమ్మారు. నమ్మి ఇచ్చిన వారు కొందరైతే.. బెదిరించి ప్రలోభ పెట్టి బలవంతంగా మరికొందరితో కూడా భూములు లాక్కున్నారు. మొత్తానికి 54 వేల ఎకరాల వరకు సమీకరించారు. తొలి అయిదేళ్ల పాలనలో కేవలం డిజైన్ల పేరుతో వందల కోట్ల రూపాయలు తగలేసి.. బొమ్మ చూపించి మాయచేస్తూ వచ్చారు. ప్రజలు నమ్మకం లేక ఓడించిన తర్వాత.. జగన్ ప్రభుత్వం ఏర్పడింది. మంచి పాలనలో అధికారవికేంద్రీకరణ ఉండాలనే ఉద్దేశంతో జగన్ ఆలోచన చేసి, శాసన రాజధానిగా అమరావతిని ప్రకటించారు తప్ప.. దానిని వ్యతిరేకించలేదు. అయితే.. చంద్రబాబునాయుడు అమరావతి రైతులను రెచ్చగొట్టి వారితో హైకోర్టులో కేసులు వేయించి.. అసలు ఏ పనీ ముందుకు సాగకుండా అడ్డుపడ్డారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటిదాకా ఆ ప్రాంత క్లీనింగ్ పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టారు. నిర్మాణ పనులు ఇంకా మొదలు కూడా పెట్టలేదు. అప్పుడే మరో 44 వేల ఎకరాలు రాజధాని విస్తరణకు సేకరిస్తాం అంటూ మరో పాట అందుకోవడంపై అమరావతి రైతులు రగిలిపోతున్నారు. ముందు మాకు మాట ఇచ్చిన విధంగా ఈ 54 వేల ఎకరాల రాజధాని పూర్తిగా అభివృద్ధి చేసి.. మాకు కేటాయించిన స్థలాలు మాకు అప్పగించిన తర్వాతే.. మరో పూలింగ్ కు వెళ్లాలని వారు మొండికేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇష్టారాజ్యంగా తమను పక్కన పెట్టేసి, ఇంకో నగరం మాయతో తిరగకుండా అడ్డుకోవడానికి అమరావతి రైతులు తమ స్వబుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వారి డిమాండు సహేతుకమైనదే గనుక.. కోర్టులో అనుకూల తీర్పు వస్తుందని భావిస్తున్నారు. 44 వేల ఎకరాలంటూ చంద్రబాబు ఎంచుకున్న కొత్త డ్రామాకు ఆదిలోనే బ్రేకులు పడేప్రమాదం కనిపిస్తోంది. సొంత సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ.. తమ పట్ల చంద్రబాబు తలపెడుతున్న ద్రోహాన్ని జీర్ణించుకోలేక అమరావతి రైతులు కోర్టు గడప తొక్కడానికి సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది...ఎం. రాజేశ్వరి

Students Visa Cancel In University of Massachusetts7
అమెరికాలో కొత్త టెన్షన్‌.. వారి వీసా రద్దు

వాషింగ్టన్‌: దేశ వ్యతిరేక భావజాలం నింపుకున్న వాళ్లకు అమెరికాలో నిలువనీడ లేదని ఇప్పటికే చాటిన ట్రంప్‌ సర్కార్‌ పలు విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల వీసాల రద్దు పర్వాన్ని కొనసాగిస్తోంది. శాస్త్రసాంకేతిక పరిశోధనా విద్యలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ది మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) విశ్వవిద్యాలయం పైనా ఈ వీసాల రద్దు ప్రభావం పడింది.ఇప్పటికే పలు వర్సిటీల్లో విద్యార్థులతోపాటు పరిశోధకులు, బోధనా, బోధనేతర సిబ్బందిపైనా వీసాల రద్దు వేటువేసిన రిపబ్లికన్‌ ప్రభుత్వం కనీసం ఎందుకు వీసా రద్దు చేస్తున్నారో చెప్పకపోవడం దారుణమని ఎంఐటీ వర్సిటీ పేర్కొంది. తమ వర్సిటీలో 9 మంది విదేశీ విద్యార్థుల వీసాలను కారణం చూపకుండానే రద్దుచేశామని వర్సిటీ తాజాగా వెల్లడించింది. అమెరికాలో సీబీఎస్‌ మీడియాసంస్థ సమాచారం మేరకు ఇప్పటిదాకా అక్కడి 88 కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో దాదాపు 530 మంది విద్యార్థులు, సిబ్బంది, పరిశోధకుల వీసాలను ట్రంప్‌ ప్రభుత్వం ఆకస్మికంగా రద్దుచేసింది. తమ వర్సిటీలో విదేశీ విద్యార్థుల వీసాల రద్దుపై ఎంఐటీ వర్సిటీ అధ్యక్షురాలు సలీ కార్న్‌బ్లూత్‌ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.వర్సిటీ వర్గాలకు ఈ మేరకు సోమవారం ఆమె ఒక లేఖ రాశారు. ‘‘ఏప్రిల్‌ 4వ తేదీ తర్వాత హఠాత్తుగా విద్యార్థుల చదువులను కాలరాస్తూ తీసుకున్న ఈ విధానాలు ఏమాత్రం ఆమోదనీయం కాదు. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వలేదు. వీసాల రద్దుకు కారణం చెప్ప లేదు. అత్యంత ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులను ఆకర్షించగల వర్సిటీ సామర్థ్యాన్ని ఈ నిర్ణయాలు దెబ్బతీస్తాయి. వర్సిటీ కార్యకలాపాలూ కుంటుపడతాయి. అప్పుడు అంతర్జాతీయంగా వర్సిటీల్లో శాస్త్రసాంకేతిక పరిశోధనలకు సంబంధించి మా వర్సిటీలో ప్రపంచ అగ్రగామిగా కొనసాగడం కష్టసాధ్యమవుతుంది. నూతన పరిశోధనలు, ఆవిష్కరణలతో దేశాన్ని మరింత సుసంపన్నం చేసే క్రతువు కుంటువుడుతుంది’’ అని ఆమె అన్నారు.పరిశోధనా వ్యయాలకు పరిమితిపైనా వర్సిటీల ఆగ్రహం అధునాతన అధ్యయనాలకు సంబంధించిన పరోక్ష పరిశోధనా వ్యయాలను పరిమితం చేసుకోవాలని ప్రభుత్వ ఇంధన శాఖ ప్రకటించడంపై వర్సిటీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. పరోక్ష పరిశోధనా ఖర్చులు ఎంత పెరిగినాసరే ప్రభుత్వం మాత్రం 15 శాతం మాత్రమే రీయింబర్స్‌ చేస్తుందని పేర్కొనడాన్ని వర్సిటీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. విద్యాసంస్థలకు నిధులు తగ్గిస్తే ఆయా విభాగాల సిబ్బందికి జీతభత్యాల చెల్లింపు దాదాపు ఆగిపోతుందని వర్సిటీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎనర్జీ(డీఓఈ)పై బోస్టన్‌ ఫెడరల్‌ కోర్టులో ప్రిన్స్‌టన్, కాల్‌టెక్, ఇల్లినాయీ, ఎంఐటీ వర్సిటీలు కోర్టులో దావా వేశాయి.

Hyderabad seen strong demand for office spaces8
హైదరాబాద్‌లో ఆఫీసు స్థలాల అద్దెలు ఇలా..

దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గతేడాది(2024) ఆఫీసుల స్థలాల అద్దెలు 4–8% పెరిగినట్లు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ వెస్టియన్‌ ఓ నివేదికలో తెలిపింది. కొత్త వ్యాపారాలు, కంపెనీల విస్తరణ కారణంగా కార్యాలయాల స్థలాలకు గణనీయమైన డిమాండ్‌ నెలకొందని పేర్కొంది. ‘భారత్‌లో అధిక జనాభా, భారీ కన్జూమర్‌ బేస్, వేగవంతమైన పట్టణీకరణతో పాటు టెక్నాలజీ, ఫైనాన్స్‌ రంగాల్లో తక్కువ ధరలకు నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి లభిస్తుంది. అందుకే అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఆఫీసు స్పేస్‌ కోసం భారత్‌ వైపు దృష్టి సారిస్తున్నాయి’ అని వెస్టియన్‌ సీఈవో శ్రీనివాస్‌ రావు తెలిపారు.నెలవారీగా కార్యాలయ అద్దెల్లో న్యూఢిల్లీ 8.2 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. చెన్నై 7.7%, ముంబై 6.7% బెంగళూరు 4.7%, పూణే 4.5%, హైదరాబాద్‌ 4.4%, కోల్‌కత్తా 3.8 శాతం వృద్ధితో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.నగరాల వారీగా చూస్తే ముంబైలో చదరపు అడుగు నెలవారీ సగటు అద్దె 1.6 డాలర్లుగా ఉంది. బెంగళూరులో 1.1 డాలరు, పూణేలో 1 డాలరు, న్యూఢిల్లీలో 0.9 డాలరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో 0.8 డాలరు, పూణేలో 0.6 డాలరుగా ఉంది.అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమంగా... అంతర్జాతీయంగా ఎనిమిది పెద్ద ఓవర్సీస్‌ మార్కెట్లలో ఆఫీసు అద్దె వృద్ధి మిశ్రమంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. గతేడాది(2024) న్యూయార్క్‌లో సగటు ఆఫీసు అద్దె 1.3% క్షీణించింది. అక్కడ నెలకు చదరపు అడుగుకు అద్దె 7.5 డాలర్లుగా ఉంది. షాంఘైలో 6.8%, హాంగ్‌కాంగ్‌లో 6%, సియాటిల్‌లో 1.9% క్షీణత నమోదైంది. చదరపు అడుగు నెలవారీ సగటు అద్దెలు వరుసగా 2.8 డాలర్లు, 5.9 డాలర్లు, 4.7 డాలర్లుగా ఉన్నాయి. ఇదీ చదవండి: ‘ఉన్నతాధికారులతో బేరసారాలు’.. వదలని పోలీసులు..అయితే లండన్‌లో సగటు ఆఫీసు అద్దెలు 8.6% పెరిగాయి. అక్కడ నెలకు చదరపు అడుగు అద్దె 8.6 డాలర్లుగా ఉంది. మియామీలో 7.3% బోస్టన్‌లో 1.2%, సింగపూర్‌ 0.5 శాతం పెరిగాయి. చదరపు అడుగు నెలవారీ సగటు అద్దెలు వరుసగా 5.1 డాలర్లు, 5.5 డాలర్లు, 7 డాలర్లుగా ఉన్నాయి.

Priya Prakash Varrier Got Famous With Good Bad Ugly Movie9
ఫేట్ మార్చిన సినిమా.. ఇన్నాళ్లకు మళ్లీ గుర్తింపు

మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్‌ వారియర్ గుర్తుందా? అప్పట్లో కన్నుగీటిన వీడియోతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈమె.. తర్వాత పలు సినిమాల్లో నటించింది. కాకపోతే పెద్దగా గుర్తింపు రాలేదు. తాజాగా ఓ సినిమాలో నటించి హిట్ కొట్టింది. దీంతో ఈమె ఎక్కడ లేని గుర్తింపు వస్తోంది.(ఇదీ చదవండి: 'పుష్ప 2'కి నా మ్యూజిక్ పెట్టుకోలేదు.. ‍అయినా బాధ లేదు) 2018లో నటిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రియా వారియర్.. 2019లో రిలీజైన 'ఒరు అడార్ లవ్' హీరోయిన్ అయింది. కన్నుగీటి ఫేమస్ అయింది ఈ మూవీతోనే. కాకపోతే పెద్దగా ఆకట్టుకోలేదు. తర్వాత తెలుగులో చెక్‌, ఇష్క్‌ నాట్‌ ఏలవ్‌ స్టోరీ లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. దాదాపు ఏడెనిమిది ఏళ్లనుంచి ఇండస్ట్రీలో ఉండటమైతే ఉంది గానీ పేరు రాలేదు. కానీ రీసెంట్ గా రిలీజైన 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో ఈమె విలన్ గా చేసిన అర్జున్‌ దాస్‌ ప్రియురాలిగా నటించింది. ఇతడితో కలిసి సుల్తానా పాటకు డాన్స్‌ చేసింది. ఇది గతంలో సిమ్రాన్‌ చేసిన పాటకు మళ్లీ అలానే స్టెప్పులేసి ప్రియా వారియర్ ఫేమస్ అయింది. ఒకరకంగా చెప్పాలంటే మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది. మరి దీన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: 57 ఏళ్ల వయసులో మళ్లీ తండ్రి కాబోతున్న నటుడు?)

Ashok Nagar police station Police Sub Inspector Annapurna In Hubbali10
హాట్సాప్‌ అన్నపూర్ణ ..! రియల్‌ ‘లేడి సింగం’

పోలీసుశాఖలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది’ అంటుంది ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌–2025. ‘ఎందుకు ఇలా?’ అనేదానిపై ఎందరో ప్రముఖులు తమ అభిపప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో మహిళలు తప్పనిసరిగా ఎందుకు ఉండాలి’ అనే కోణంలో కొందరు విలువైన విశ్లేషణ చేశారు. అన్నపూర్ణలాంటి ధైర్యసాహసాలు మూర్తీభవించిన పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ల గురించి చదివినప్పుడు వారి విశ్లేషణ నూటికి నూరుపాళ్లు సరిౖయెనదే అనిపిస్తుంది. కర్నాటకలోని హుబ్లీ నగరంలో గత ఆదివారం ఐదేళ్ల బాలికను అపహరించి, అత్యాచార యత్నం చేసి, చంపేసిన సంఘటన రాష్ట్రాన్ని అట్టుడికించింది. ఈ దుర్మార్గానికి ఒడిగట్టింది బిహార్‌కు చెందిన రితేష్‌ కుమార్‌. ఇతడు వలసకూలీ. సీసీ టీవీల కెమెరా ఫుటేజీ సహాయంతో రితేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం తీసుకువెళుతున్న సమయంలో రితేష్‌ పోలీసులపై రాళ్ల దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అశోక్‌నగర్‌ పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అన్నపూర్ణ పారిపోవద్దు’ అని రితేష్‌ను హెచ్చరిస్తూ గాలిలో కాల్పులు (వార్నింగ్‌ షాట్‌) జరిపింది. రితేష్‌ ఆమె హెచ్చరికను ఖాతరు చేయలేదు. రాళ్ల దాడీ ఆపలేదు. దీంతో గత్యంతర లేని పరిస్థితులలో అన్నపూర్ణ రితేష్‌పై కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ సంఘటనలో అన్నపూర్ణతోపాటు ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. అన్నపూర్ణ ధైర్యసాహసాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ‘లేడి సింగం’ అనే విశేషణాన్ని ఆమె పేరుకు ముందు జోడిస్తున్నారు. తాజా విషయానికి వస్తే... కర్నాటక మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ అన్నపూర్ణను అభినందించారు. ‘హేయమైన నేరాలకు పాల్పడిన నిందితులను ఉరి తీయాలి. న్యాయం త్వరితగతిన జరగాలి. పోలిస్‌ ఇన్‌స్పెక్టర్‌ అన్నపూర్ణ చర్య రాష్ట్రవ్యాప్తంగా ఇతర అధికారులకు స్ఫూర్తిగా నిలవాలి. అన్నపూర్ణను అత్యున్నత రాష్ట్ర పురస్కారంతో సత్కరించాలని ముఖ్యమంత్రి, హోంమంత్రులకు సిఫారసు చేస్తాం’ అన్నారు హెబ్బాళ్కర్‌. బెల్గాం జిల్లాలోని గుజనట్టి గ్రామానికి చెందిన అన్నపూర్ణ ధార్వార్డ్‌ అగ్రికల్చరల్‌ యూనివర్శిటీలో ఎంఎస్‌సీ చేసింది. 2018లో పోలిస్‌శాఖలో చేరింది. ‘రాష్ట్రంలో ఇంతకు ముందు ఏ మహిళా పోలీస్‌ అధికారి చేయని సాహసాన్ని అన్నపూర్ణ చేసింది. హాట్సాప్‌’ అంటూ సోషల్‌ మీడియాలో అన్నపూర్ణపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు.(చదవండి: 'ఇది తప్పనిసరి' .. విడాకులపై స్పందించిన మెలిండా గేట్స్‌..! ఆ ఏజ్‌లోనే విడిపోవడానికి కారణం..)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement