
యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులోనూ అర్జున్‌కి మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక అర్జున్ కూతురు ఐశ్వర్యను ఇది వరకే తమిళ్, కన్నడలో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. కానీ టాలీవుడ్‌లో మాత్రం తన ఎంట్రీ ప్రకటనతోనే సినిమా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఐశ్వర్యకు సంబంధించి ఓ వార్త కోలీవుడ్‌లో విపరీతంగా ప్రచారం జరుగుతుంది.
(ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు.. వీడియో రిలీజ్ చేసిన నటి సురేఖావాణి)
అదేమిటంటే..ఐశ్వర్య అర్జున్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ అనే వార్త వైరల్ అవుతుంది. అబ్బాయి కూడా కోలీవుడ్‌లో ప్రముఖ హాస్య నటుడు అయినటువంటి తంబి రామయ్య కుమారుడు ఉమాపతి అని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా వారిద్దరూ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారని కూడా తెలుపుతున్నారు. దీంతో వీరి పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో వీరి పెళ్లి ఘనంగా జరగబోతోందని సమాచారం. కానీ ఈ పెళ్లి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వారి కుటుంబాల నుంచి రాలేదు. కానీ జరిగేది ఇదేనని బలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
(ఇదీ చదవండి: డెలివరీకి ముందు ఉపాసన ఏం చేసిందంటే.. వీడియో వైరల్!)
కోలీవుడ్‌లో 'అదగపాతుతు మగజనంగలే' అనే సినిమాతో 2017లో ఉమాపతి రామయ్య ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఆయన పలు టీవి షోలతో పాటు నాలుగు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం 'దేవ్‌దాస్' అనే సినిమాలో నటిస్తున్నాడు.
ఐశ్వర్య విషయానికొస్తే తెలుగులో హీరోయిన్‌గా లాంచ్ చేయాలని అర్జున్ చాలా కసరత్తు చేశాడు. అందుకు కోసం హీరోగా విష్వక్‌సేన్ పేరును కూడా ప్రకటించాడు. అయితే, ఈ మూవీ నుంచి విష్వక్ తప్పుకోవడంతో ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. కానీ స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని త్వరలో మరో హీరో పేరును ప్రకటిస్తామని ఆయన గతంలో తెలిపాడు.
Umapathy Ramaiah (Thambi Ramaiah Son) & Aishwarya Arjun (Arjun’s Daughter) to tie the knot soon! pic.twitter.com/r0dRY3i6js
— Christopher Kanagaraj (@Chrissuccess) June 25, 2023