
సెక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్‌తో ఫేమ్ తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ కుబ్రా సైత్. ఇటీవలే విడుదలైన షాహిద్ కపూర్ మూవీ దేవాలో కీలక పాత్రలో కనిపించింది. పూజా హేగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ సినిమాలో కుబ్రా ఎస్సై పాత్రలో అభిమానులను ఆకట్టుకుంది. బెంగళూరుకు చెందిన ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అంతకుముందు హిందీలో పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లో నటించింది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ప్రముఖ కార్ల బ్రాండ్ అయిన మహీంద్రా ఈవీని సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ ఈవీ కారు ధర దాదాపు రూ.31 లక్షలకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై తాను పెట్రోల్ బంకుల్లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదని క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది కుబ్రా సైత్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బాలీవుడ్ భామకు అభినందనలు చెబుతున్నారు.