
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ ఆవైటేడ్ చిత్రం పుష్ప-2 ది రూల్. ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా బన్నీ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కావాల్సి ఉండగా.. మరోసారి వాయిదా పడింది. అయితే కొంత షూటింగ్ పెండింగ్‌లో ఉండడ, వీఎఫ్‌ఎక్స్ వర్క్ కారణాంగానే పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 6న విడుదల చేస్తామని కొత్త తేదీని కూడా ప్రకటించారు.
ఇదిలా ఉంటే టాలీవుడ్‌లో తాజాగా ఊహించని టాక్ నడుస్తోంది. పుష్ప-2 మిగిలిన షూటింగ్ షెడ్యూల్ విషయంలో బన్నీ, సుకుమార్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు చర్చ జరుగుతోంది. తాజాగా బన్నీ విదేశీ టూర్‌కు వెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. అంతేకాకుండా బన్నీ తన గడ్డాన్ని ట్రిమ్ చేసుకున్నట్లుగా విమానంలో వెళ్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్విటర్‌లో పంచుకున్నారు. కాగా..2020 నుంచి ఇప్పటివరకు తన గడ్డాన్ని అలాగే మెయింటెన్ చేస్తూ వస్తున్నారు. దీంతో పుష్ప-2 మరోసారి వాయిదా పడనుందా? అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. ఇటీవలే డైరెక్టర్ సుకుమార్ సైతం యూఎస్ వెకేషన్ నుంచి ఇంటికి తిరిగొచ్చారు. తాజాగా అల్లు అర్జున్ మరోసారి హాలీడే ట్రిప్‌కు వెళ్లడంతో మళ్లీ వాయిదా పడుతుందేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వార్తలపై బన్నీ టీం స్పందించింది. ఎలాంటి ఆందోళన వద్దని ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇచ్చింది. చిత్ర బృందం నుంచి అప్‌డేట్‌లు రాకపోవడం.. సుకుమార్, అల్లు అర్జున్ మధ్య విభేదాలు అంటూ వస్తున్న రూమర్స్‌పై వివరణ ఇచ్చింది.
క్లారిటీ ఇచ్చిన టీమ్..
పుష్ప-2 విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని అల్లు అర్జున్ టీమ్ వెల్లడించింది. ఆ వీడియో ఇటీవలే తీశారని.. గడ్డం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. ఆయనకు ఇప్పటికే పొడవాటి జుట్టు, గడ్డం ఉన్నాయని తెలిపారు. గడ్డాన్ని కొద్దిగా మాత్రమే ట్రిమ్ చేసుకున్నారని వివరణ ఇచ్చారు. డిసెంబర్ 6న పుష్ప-2 విడుదల విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. మరోసారి వాయిదా వేసే ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు. కాగా.. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Beard Ravataniki 1 Month, Balance Shoot 1 Month+
Post Production, Promotions....😔
Haha Malli Postpone Haa 💔😭 @alluarjun#Pushpa2TheRule @PushpaMoviepic.twitter.com/n3ubZDrDxb— CD ™ (@CoolDude__18) July 16, 2024
Ee beard tho manage cheyalera??? https://t.co/jekutiqf1C pic.twitter.com/30bkzEqnL4
— Tony (@tonygaaaadu) July 16, 2024