
హీరో నాని నుంచి కొత్త సినిమా రాబోతుంది. అదే 'హిట్ 3'. గతంలో వచ్చిన రెండు చిత్రాలకు కొనసాగింపుగా దీన్ని తీశారు. మే 1న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు గత కొన్నిరోజులుగా ప్రమోషన్స్ చేస్తున్న నాని.. తాజాగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. మిగతా వాటి సంగతేమో గానీ దర్శకుడికి ఓసారి క్లాస్ పీకిన సందర్భం గురించి బయటపెట్టాడు.
'శైలేష్ ఫస్ట్ షెడ్యూల్ లో మొహమాట పడేవాడు. అన్నింటికీ నన్ను మెంటార్ లా చూసి అన్నీ నన్ను అడిగేవాడు. నన్నేం అడగకు అని ఒక్కసారి గట్టిగా క్లాస్ పీకాను. నీకు మంచి సినిమా సెన్స్ ఉందని చెప్పా. అప్పటి నుంచి రెచ్చిపోయాడు' అని నాని చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన టాలీవుడ్ స్టార్ సింగర్)
నాని ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. దీనికి తోడు ఈ మూవీతో హిట్ కొడతానని పూర్తి నమ్మకంతో ఉన్నాడు. ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే నాని నమ్మకం నిజమయ్యేలా కనిపిస్తుంది.
హిట్ ఫ్రాంచైజీలో తొలి రెండు చిత్రాలు ఇన్వెస్టిగేషన్ తరహాలో తీస్తే ఇప్పుడు రాబోతున్న హిట్ 3 మాత్రం యాక్షన్, రక్తపాతం అనేలా తీశారు. ఇప్పటికే పిల్లలు, సున్నిత మసస్కులు తన సినిమా చూసేందుకు రావొద్దని నాని క్లారిటీ ఇచ్చేశాడు కూడా.
(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)