అమితాబ్‌ సినిమా విడుదల మళ్లీ వాయిదా, కారణం ఇదే | Amitabh Bachchan Emraan Hashmi Starrer Chehre Postponed Due To Coronavirus | Sakshi
Sakshi News home page

అమితాబ్‌ సినిమా విడుదల మళ్లీ వాయిదా, కారణం ఇదే

Published Wed, Mar 31 2021 7:56 AM | Last Updated on Wed, Mar 31 2021 1:21 PM

Amitabh Bachchan Emraan Hashmi Starrer Chehre Postponed Due To Coronavirus - Sakshi

ఈ  చిత్రాన్ని మొదట 2020 జూలై 17న విడుదల చేయాలనుకున్నారు. కోవిడ్‌ కారణంగా విడుదల కాలేదు. మళ్లీ ఈ ఏడాది ఏప్రిల్‌ 9న విడుదల చేయాలనుకున్నప్పటికీ..

అమితాబ్‌ బచ్చన్, ఇమ్రాన్‌ హష్మీ ప్రధాన పాత్రల్లో రూమీ జాఫ్రీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చెహ్రే’. ఈ సినిమాలో క్రిమినల్‌ లాయర్‌గా అమితాబ్, క్రిమినల్‌గా ఇమ్రాన్‌  హష్మీ నటించారు. ఏప్రిల్‌ 9న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ‘‘కరోనా కేసులు పెరుగుతుండటం, సినిమాల ప్రదర్శనకు కొత్త గైడ్‌లైన్స్‌ రావడం వంటి అంశాల కారణంగా ముందుగా అనుకున్నట్లు మా సినిమాను ఏప్రిల్‌ 9న విడుదల చేయలేకపోతున్నాం.

మా సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఇందుకు ఆడియన్స్‌కు థ్యాంక్స్‌. త్వరలో మా సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘చెహ్రే’ చిత్రాన్ని మొదట 2020 జూలై 17న విడుదల చేయాలనుకున్నారు. కోవిడ్‌ కారణంగా విడుదల కాలేదు. మళ్లీ ఈ ఏడాది ఏప్రిల్‌ 9న విడుదల చేయాలనుకున్నప్పటికీ కోవిడ్‌ కారణంగా మరోసారి వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement