
నువ్వు మాస్ అయితే నేను ఊర మాస్ అంటోంది ఓవియా (Oviya). ఎప్పుడూ ఏదో ఒక సంచలనంతో వార్తల్లో ఉండే ఈ బ్యూటీ ఇటీవల బీచ్‌కు వెళ్లింది. అక్కడ తన స్నేహితులు చేపలకు వల వేస్తున్నారని చూపించింది. అలాగే తను సిగరెట్ తాగుతూ ఆ వీడియోను కూడా షేర్ చేసింది. ఇది చూసిన కొందరు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరేమో నీ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే అని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియోను తర్వాత తొలగించినట్లు తెలుస్తోంది.
ఎవరీ ఒవియా?
కేరళలోని తిరుచూర్ ఓవియా సొంత గ్రామం. బీఏ పూర్తి చేసిన ఆమె 2007లో నటిగా ఎంట్రీ ఇచ్చింది. కంగారు అనే మలయాళ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఇది నా లవ్ స్టోరీ సినిమాతో తెలుగువారిని పలకరించింది. 90 ఎంఎల్ అనే వివాదాస్పద సినిమాతో సెన్సేషన్ అయింది. ఈ సినిమాలో ఓవియా మహిళలను తప్పుదోవ పట్టించేలా ఉందంటూ ఆమెపై కేసులు కూడా నమోదయ్యాయి.
తమిళ బిగ్‌బాస్ మొదటి సీజన్‌లో చనిపోవడానికి ప్రయత్నించడం అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆరవ్‌తో ప్రేమాయణం జరిపిన ఆమె తర్వాత అతడికి బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. గతేడాది ఆమె ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీకవగా.. చూసి ఆనందించండి అంటూ బోల్డ్‌గా స్పందించింది. ఈ కాంచన 3 బ్యూటీ ప్రస్తుతం సంభవం సినిమా చేస్తోంది.