
– హరీష్ శంకర్
‘‘నాకు సినిమా కథ నచ్చితే భాష, చిన్న సినిమా.. పెద్ద సినిమా అనే తేడా చూడకుండా ప్రమోట్ చేయడానికి ముందుంటాను. ‘జింఖానా’ చిత్రం ట్రైలర్ నాకు చాలా నచ్చింది. ఈ సినిమాని అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పారు.
నస్లెన్, లుక్మాన్ అవరన్, గణపతి, సందీప్ ప్రదీప్ ముఖ్య తారలుగా ఖలీద్ రెహమాన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘అలప్పుజ జింఖానా’. ఖలీద్ రెహమాన్, జోబిన్ జార్జ్, సమీర్ కారత్, సుబీష్ కన్నంచెరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న మలయాళంలో విడుదలై, హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్‌పై సుబ్బారెడ్డి తెలుగులో ‘జింఖానా’ పేరుతో ఈ నెల 25న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ శంకర్ మాట్లాడుతూ–‘‘జింఖానా’ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న సుబ్బారెడ్డిగారికి అభినందనలు. నైజాంలో మైత్రీ మూవీస్ శశిగారు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి తిరుగుండదు’’ అన్నారు.
డైరెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా నేను చూశాను.. చాలా బాగుంది. స్పోర్ట్స్ కామెడీ నేపథ్యంలో చాలా బాగా తీశారు’’ అని చెప్పారు. ‘‘స్పోర్ట్స్ కామెడీ ఫిల్మ్
‘జింఖానా’. చాలా మంచి యాక్షన్ సీక్వెన్ ్సలు, పాటలుంటాయి’’ అని ఖలీద్ రెహమాన్ తెలిపారు. హీరో నస్లెన్ మాట్లాడుతూ–
‘‘నేను నటించిన ‘ప్రేమలు’ సినిమాకి తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన స΄ోర్ట్ మర్చి΄ోలేను. ‘జింఖానా’ని కూడా ఆదరించాలి’’ అన్నారు. ఈ వేడుకలో మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, డైరెక్టర్స్ సాగర్ కె. చంద్ర, సుజీత్, సందీప్, నటీనటులు బేబీ జీన్, లుక్మాన్ అవరన్, సందీప్ ప్రదీప్ మాట్లాడారు.