
Kaikala Satyanarayana Funeral Live Updates:
►కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిశాయి. హిందూ సాంప్రదాయ పద్దతిలో తంతు ముగించారు.
►కైకాల సత్యన్నారాయణకు అంతిమ సంస్కారాలు నిర్వహించిన పెద్ద కుమారుడు లక్ష్మి నారాయణ
►చివరిచూపు కోసం తండోపతండాలుగా వచ్చిన కైకాల అభిమానులు..
► మహా ప్రస్థానంలో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు
► కైకాల భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు
► కైకాల సత్యనారాయణ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ప్రభుత్వ లాంఛనాలతో మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ మృతితో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల శుక్రవారం తెల్లవారుజామున ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. అయితే నేడు(శనివారం)ఉదయం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
అభిమానుల సందర్శనార్థం భౌతికకాయన్ని 10.40కి ఫిలిం చాంబర్‌కు తరలించనున్నారు. అటు నుంచి 11.30గంటలకు మహాప్రస్థానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు జరగనున్నాయి.