
సీన్ 1: కోర్ట్ సినిమా నచ్చకపోతే నా హిట్ 3 సినిమా చూడకండి అన్నాడు నాని (Nani). ఆ నమ్మకంతోనే సినిమా రిలీజ్‌కు రెండురోజుల ముందే మీడియాకు ప్రీమియర్ వేసి తన కాన్ఫిడెన్స్ బయటపెట్టుకున్నాడు. నాని నమ్మకమే నిజమవుతూ కోర్ట్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. మార్చి 14న ఈ మూవీ రిలీజ్ కానుంది.
సీన్ 2: దిల్‌రూబా సినిమా (Dilruba Movie)లో హీరో కిరణ్ అబ్బవరం ఫైట్స్ నచ్చకపోతే నెక్స్ట్ ప్రెస్‌మీట్‌లో నన్ను చితక్కొట్టండి. అతడి ఫైట్స్ మీకు నచ్చలేదంటే నేను నిర్మాతగా మళ్లీ సినిమా తీయను అన్నాడు చిత్రనిర్మాత రవి. మార్చి 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంది.
సీన్ 3: రాబిన్‌హుడ్ సినిమా (Robinhood Movie) చూశాక మన ఇంట్లో కూడా ఓ రాబిన్‌హుడ్ ఉంటే బాగుండనిపిస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకు మేం నలుగురం మాత్రమే గుర్తుంటాం. సినిమా లేదంటే నేను నా పేరుమార్చేసుకుంటాను అన్నాడు నటుడు రాజేంద్రప్రసాద్. ఈ మూవీ మార్చి 28న విడుదలవుతోంది.
కిరణ్ రియాక్షన్ ఇదే!
అందరూ ఇలా తెగించి మాట్లాడటానికి ప్రధాన కారణం.. జనాల్ని థియేటర్‌కు రప్పించడమే! ఓటీటీలకే రుచి మరిగిన ఆడియన్స్‌ను థియేటర్‌వైపు చూసేలా చేసేందుకే ఇలాంటి ప్రమోషన్ స్టంట్స్.. దీని గురించి హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాపై ఉన్న నమ్మకాన్ని బలంగా వ్యక్తపరిస్తేనే జనాలు థియేటర్‌కు వస్తారని అలా చేసుండొచ్చు.
నా ఫైట్ సీన్లు బాగోకపోతే తనను కొట్టమని నిర్మాత అన్నారు. మీరెవరూ ఆయన్ని కొట్టొద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను సరిగా చేయకపోతే దొరికిపోతాను. ఫైట్స్ బాగానే చేశాను.. ఆయన్ను మీరు కొట్టరనే ఫీలింగ్‌లో ఉన్నాను. ఈ మూవీలో యాక్షన్ సీన్స్‌కే ఎక్కువ కష్టపడ్డాను అని చెప్పుకొచ్చాడు.
చదవండి: తలకు గాయంతో ఆస్పత్రిపాలైన భాగ్యశ్రీ.. 13 కుట్లు వేసిన డాక్టర్స్