హిట్‌ 3 నచ్చకపోతే SSMB29 సినిమా చూడొద్దు.. నాని ఇరికించేశాడుగా! | Nani: If You Not Like Hit 3 Then Don't Watch SSMB29 | Sakshi
Sakshi News home page

హిట్‌ 3 నచ్చకపోతే ఆ సినిమా చూడొద్దన్న నాని.. అసలు సీక్రెట్‌ లీక్‌ చేసిన ఫైట్‌ మాస్టర్‌

Published Mon, Apr 28 2025 8:34 AM | Last Updated on Mon, Apr 28 2025 8:58 AM

Nani: If You Not Like Hit 3 Then Don't Watch SSMB29

నేచురల్‌ స్టార్‌ నాని (Nani) యాక్షన్‌ అవతార్‌లో కనిపించనున్నాడు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో నటించిన హిట్‌ 3: థర్డ్‌ కేస్‌ మూవీ (HIT: The Third Case) మే 1న విడుదల కానుంది. ఆదివారం (ఏప్రిల్‌ 27) ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అలాగే హిట్‌ 1 హీరో అడివి శేష్‌, హిట్‌ 2 హీరో విశ్వక్‌ సేన్‌ అతిథులుగా వచ్చారు.

ప్రేమగా హగ్‌ ఇచ్చారంటే..
ఈ వేదికపై నాని మాట్లాడుతూ.. నా ప్రతి సినిమా మార్నింగ్‌ షోకి ప్రసాద్‌ ఐమ్యాక్స్‌కి వెళతాను. వెళ్లే ముందే రాజమౌళిగారి ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా వస్తున్నారా? అని చెక్‌ చేసుకుని, థియేటర్లో వాళ్ల  రియాక్షన్  చూస్తుండేవాడిని. సినిమా అయిపోయాక వల్లీగారు, రమగారిని టాక్‌ అడిగేవాడిని. ప్రేమగా హగ్‌ ఇచ్చి వెళ్లిపోయారంటే నచ్చలేదని అర్థం. కారు ఎక్కిన వెంటనే నీకు మెసేజ్‌   చేస్తాం అన్నారంటే సినిమా బాగుందని అర్థం. అయితే ఈ మధ్య థియేటర్‌కి వెళ్లకపోవడంతో ఈ అలవాటుకు కాస్త బ్రేక్‌ పడింది.

సొంత సినిమాలా ప్రమోషన్స్‌..
ఈ మే 1న రాజమౌళి (SS Rajamouli) మార్నింగ్‌ షో చూడాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ఆ రోజు ఆయనకు ఏదైనా పనులుంటే తన పాస్‌పోర్ట్‌ లాగేసుకుంటాను. శ్రీనిధి శెట్టి గురించి చెప్పాలి. మేమిద్దరం ఇచ్చిన ఇంటర్వ్యూలకు సినిమాలో సగం లవ్‌స్టోరీనే ఉంటుందేమో అనుకుంటున్నారు. కానీ, అలాంటిదేం ఉండదు. ప్రమోషన్స్‌ కూడా ఒక్కటీ మిస్‌ అవకుండా తన సొంత సినిమాలా చేసింది. సినిమా సక్సెస్‌ ఈవెంట్‌లో ఇంకా ఎక్కువ మాట్లాడతాను.

హిట్‌ 3 నచ్చకపోతే..
కోర్ట్‌ సినిమా నచ్చకపోతే హిట్‌ 3 చూడొద్దని చెప్పాను. ఈసారి ఎవరిని తాకట్టుపెడదాం అని చూస్తున్నాను. హిట్‌ 3 మీ అంచనాలను అందుకోలేకపోతే వచ్చే ఏడాది రిలీజవుతున్న SSMB29 (సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు- రాజమౌళి కలయికలో వస్తున్న మూవీ)ని చూడొద్దు.. సరదాగా అంటున్నాను. ఆ సినిమాను తాకట్టు పెట్టినా ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే ఆ సినిమా ప్రపంచమంతా చూసి తీరాల్సిందే!  మే 1న ఆడియన్స్ కు ఒక అమేజింగ్‌ థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్ ను ఇస్తానని నేను ప్రామిస్‌ చేస్తున్నా అని నాని అన్నాడు. ఇక ఇదే స్టేజీపై ఫైట్‌ మాస్టర్‌ సతీశ్‌.. శ్రీనిధి శెట్టికి ఒక ఫైట్‌ సీన్‌ కూడా ఉందన్న విషయాన్ని లీక్‌ చేసేశాడు. దీంతో శ్రీనిధి షాకై నోరెళ్లబెట్టింది. వెంటనే అక్కడున్న సుమ.. కథంతా చెప్పేసేలా ఉన్నారని వారించింది. 

చదవండి: కోర్ట్‌ తర్వాత సారంగపాణి జాతకం నాకో వరం: ప్రియదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement