
Lata Mangeshkar Latest Helath Update: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్‌డేట్ విడుదలైంది. ఇంకా ఐసీయూలోనే చికిత్స పొందుతున్న ఆమెకు వెంటిలేటర్ తొలగించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ఈనేపథ్యంలోనే వెంటిలేటర్ లేకుండా ఆమె ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు ఈ ఉదయం కాసేపు వెంటిలేటర్ తొలగించారు. ప్రస్తుతం లతా మంగేష్కర్ కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నట్లు ఆమె కుటుంబసభ్యులు వెల్లడించారు.
డాక్టర్ ప్రతీత్ సందానీ నేతృత్వంలోని వైద్యబృందం లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిని అనుక్షణం గమనిస్తోందని తెలిపారు. లతాజీ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈనెల 8న కరోనాతో లతా మంగేష్కర్ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
— Lata Mangeshkar (@mangeshkarlata) January 27, 2022